సీతారామ’ వేగం పెంచండి
► అధికారులకు హరీశ్ ఆదేశం
► ప్రాజెక్టు పనులు మందకొడిగా సాగుతుండటంపై అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. భూసేకరణ, అటవీ, పర్యావరణ అనుమతులు, పంప్ హౌస్‌లు, కాలువలు సహా ఇతర పనుల పురోగతిని ఆర్ అండ్ బీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలసి హరీశ్‌రావు మంగళవారం హైదరాబాద్‌లో సమీక్షించారు. 6 లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో తల పెట్టిన సీతారామ ప్రాజెక్టు పనులు మంద కొడిగా సాగుతుండటంపై మంత్రులు ఈ సందర్భంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
మొత్తం 5 పంప్‌హౌస్‌లలో ఒక పంప్‌హౌస్ పనులు జరిగాయని, మరో పంప్‌హౌస్ పనులు మొదలవను న్నాయని అధికారు లు తెలపగా మిగతా 3 పంప్‌హౌస్‌ల పనులనూ వెంటనే చేపట్టాలని, వాటి పురోగతిని ఎప్పటి లోగా పూర్తి చేయనున్నారో కార్యాచరణ ప్రణాళికను రూపొందించి తనకు 15 రోజుల్లో తెలియజేయాలని ఆదేశించారు. అటవీ భూముల సేకరణకు డీజీపీఎస్ సర్వేను 10 రోజుల్లో పూర్తిచేయాలని, భూసేకరణ నష్ట పరిహారాన్ని వెంటనే చెల్లిం చాలని ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జోషీని హరీశ్‌రావు సూచించారు. ప్రాజెక్టుకు అటవీ, పర్యావరణ అనుమతులను వెంటనే సాధిం చేందుకు అటవీ, రెవెన్యూ శాఖలతో సమన్వ యం చేసుకోవాలని అటవీ, పర్యావరణ అనుమతుల సలహాదారు సుధాకర్‌ను మంత్రి ఆదేశించారు. సమావేశంలో కొత్తగూ డెం జిల్లా కలెక్టర్ రాజీవ్ హనుమంతు, జాయింట్ కలెక్టర్ రామకిషన్, ఈఎన్‌సీలు మురళీధర్, నాగేందర్‌రావు, ఖమ్మం సీఈ సుధాకర్ పాల్గొన్నారు.
డిసెంబర్‌కు సిద్ధమవ్వాలి...
ఉదయ సముద్రం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితు ల్లోనూ డిసెంబర్‌కల్లా పూర్తి చేయాలని మంత్రిఆదేశించారు. పనుల్లో వేగం పెంచితేనే గడువులోగా ప్రాజెక్టు పూర్తవుతుందని, 50 వేల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు, 60 చెరువులను నింపేందుకు వీలవుతుందని ఈ ప్రాజెక్టుపై సమీక్షలో పేర్కొన్నారు. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పెండ్లి పాకల రిజర్వాయర్ల భూసేకరణ, నిర్మాణ పనుల పురోగతినీ మంత్రి సమీక్షించారు. వాటి పెండింగ్ భూసేకరణను త్వరగా పూర్తి చేయాలన్నారు. అవసరమైన మేరకే భూ సేకరణ జరపాలన్నారు.
సెప్టెంబర్ నుంచే పెసర కొనండి: హరీశ్
సాక్షి, హైదరాబాద్: అక్టోబర్ 1కి బదులుగా సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచే రాష్ట్రంలో పెసర కొనుగోళ్లు జరపాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్‌కు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు మంగళవారం లేఖ రాశారు. ఖరీఫ్‌కు సంబంధించి కేంద్రం పెసర కొనుగోళ్లు అక్టోబర్ 1న ప్రారంభిస్తుందని, అయితే తెలంగాణలో ఆగస్టు రెండో వారం నుంచే పెసర చేతికి వస్తుందని, కాబట్టి సెప్టెంబర్ 1న కొనుగోళ్లు ప్రారంభించాల న్నారు. కొత్త ఎంఎస్‌పీ ప్రకారమే కొనుగోళ్లు చేయాలన్నారు. ఈసారి 2.22 లక్షల ఎకరాల్లో పెసర సాగు చేశారని, దాదాపు లక్ష మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతుందని పేర్కొన్నారు. అందువల్ల కేంద్రం రాష్ట్ర పెసర రైతులను ఆదుకోవాల న్నారు. మరోవైపు పెసర సేకరణకు నోడల్ ఏజెన్సీగా తెలంగాణ మార్క్‌ఫెడ్‌ను నియమిస్తూ వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి ఉత్తర్వులు జారీ చేశారు.