set up
-
రాష్ట్రంలో సన్ ఫార్మా ప్లాంట్
సాక్షి, అమరావతి: ఫార్మాస్యూటికల్స్ రంగంలోని పెద్ద కంపెనీల్లో ఒకటైన సన్ ఫార్మా రాష్ట్రంలో తయారీ ప్లాంట్‌ను నెలకొల్పనుంది. ఇంటిగ్రేటెడ్ ఎండ్ టూ ఎండ్ ప్లాంట్‌గా దీన్ని తీసుకొస్తామని, ఎగుమతులు లక్ష్యంగా ఉత్పత్తులు ఉంటాయని కంపెనీ ఎండీ దిలీప్ సంఘ్వీ వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో మంగళవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో సంఘ్వీ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఫార్మాస్యూటికల్ రంగం ప్రగతి, సన్ ఫార్మా తయారీ యూనిట్‌ను నెలకొల్పడంపై ఇరువురి మధ్య చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయి. పారిశ్రామిక ప్రగతి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం జగన్ వారికి వివరించారు. అవకాశాలను వినియోగించుకోవాలని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. సమగ్రాభివృద్ధి ధ్యేయంగా తీసుకుంటున్న చర్యలనూ ముఖ్యమంత్రి జగన్ వివరించారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అత్యంత పారదర్శక విధానాలు అందుబాటులో ఉన్నాయని, నైపుణ్యాభివృద్ధిని పెంచడం ద్వారా నాణ్యమైన మానవ వనరులను అందుబాటులోకి తీసుకురావడానికి తీసుకుంటున్న చర్యలనూ సీఎం తెలిపారు. అనంతరం సమావేశం వివరాలను దిలీప్ షాంఘ్వీ వెల్లడించారు. ఆ వివరాలు.. రాష్ట్ర సమగ్రాభివృద్ధే సీఎం విధానం ముఖ్యమంత్రిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, ఎదుర్కొంటున్న సవాళ్ల మీద ఆయనకున్న అవగాహనకు నేను ముగ్థుడినయ్యాను. రాష్ట్ర సమగ్రాభివృద్ధి అన్నది ముఖ్యమంత్రి విధానంగా స్పష్టమవుతోంది. పర్యావరణహిత విధానాలపై సీఎం ప్రత్యేక దృష్టితో ఉన్నారు. సాంకేతికతను బాగా వినియోగించుకుని అత్యంత సమర్థత ఉన్న మానవ వనరులను తయారుచేయడం ద్వారా ప్రజల ఆదాయాలను గణనీయంగా పెంచాలనే లక్ష్యంతో ఆయనున్నారు. పారిశ్రామికాభివృద్ధి ద్వారా కొత్త ఉద్యోగాల కల్పన దిశగా ముఖ్యమంత్రి ముందడుగు వేస్తున్నారు. మా కంపెనీ తరఫున మేం కూడా దీనిపై గట్టి ప్రయత్నం చేస్తామని చెప్పాం. సన్ ఫార్మా తరఫున ఒక పరిశ్రమను నెలకొల్పుతామని.. తద్వారా మా తయారీ సామర్థ్యాన్ని పెంచుకుంటామని చెప్పాం. కొత్త పరిశ్రమను విజయవంతంగా ఏర్పాటుచేయడానికి అధికారులతో మా సంప్రదింపులు కొనసాగుతాయి. పరిశ్రమలకు చక్కటి సహకారం, మద్దతును సీఎం ఇస్తామన్నారు. ఔషధ రంగంలో మా ఆలోచనలను ఆయనతో పంచుకున్నాం. ఇంటిగ్రేటెడ్ తయారీ యూనిట్‌పై మాట్లాడుకున్నాం. ఇక్కడ నుంచి ఔషధాలను ఎగుమతి చేయాలన్నది మా లక్ష్యాల్లో భాగం. ఈ సమావేశంలో కంపెనీ ప్రతినిధులు విజయ్ పరేఖ్, సౌరభ్ బోరా, విద్యాసాగర్ కూడా పాల్గొన్నారు. -
అంబానీ సంచలన నిర్ణయం
సాక్షి, ముంబై : ఆసియా అపరకుబేరుడు, ప్రపంచంలోనే నాలుగో అత్యంత సంపన్నుడు ముకేశ్ అంబానీ (63) మరో కీలక నిర్ణయంపై అడుగులు వేస్తున్నారు. వ్యాపార విస్తరణలో ఎదురు లేకుండా దూసుకుపోతున్న అంబానీ తన ముగ్గురు సంతానానికి వ్యాపార సామ్రాజ్య వారసత్వ బాధ్యతలను సమానంగా పంచేందుకు రంగంలోకి దిగిపోయారు. ఇందులో భాగంగానే త్వరలోనే ఫ్యామిలీ కౌన్సిల్ ఏర్పాటు చేస్తున్నారంటూ బిజినెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 80 బిలియన్ డాలర్లకు పైగా విలువ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) పగ్గాలు చేపట్టాలని భావిస్తున్న ఆకాష్, ఇషా , అనంత్ సహా కుటుంబ సభ్యులందరికీ సమాన ప్రాతినిధ్యం కల్పించేలా చర్యలు చేపడుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ప్రణాళికలో భాగంగా ఈ కౌన్సిల్లో కుటుంబంలోని పెద్దలు, ముగ్గురు పిల్లలు, సలహాదారులు, సలహాదారులుగా వ్యవహరించే బయటి వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. కుటుంబం లేదా వ్యాపారాలకు సంబంధించిన కీలక నిర్ణయాల్లో ఈ కౌన్సిల్ ముఖ్య పాత్ర పోషించనుంది. వచ్చే ఏడాది చివరి నాటికి వారసత్వ ప్రణాళిక ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కౌన్సిల్ ఏర్పాటు ఉద్దేశం 1973లో రియలన్స్ ను స్థాపించిన ధీరూబాయ్ అంబానీ మరణానంతరం ఇద్దరు సోదరుల (ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ) మధ్య విబేధాల కారణంగా కంపెనీ చీలిపోయింది. తండ్రి ఆశయాలకు విరుద్దంగా రెండు ముక్కలు కావడం, తదనంతర పరిణామల నేపథ్యంలోనే ముందు జాగ్రత్తగా అంబానీ ఈ నిర్ణయానికి వచ్చినట్టు విశ్లేషకుల అంచనా. తద్వారా విస్తారమైన రిలయన్స్ సంక్షోభంలో పడకుండా కాపాడటంతోపాటు, తండ్రిగా, కుటుంబ పెద్దగా, విజయవంతమైన వ్యాపారవేత్తగా వారసుల విభేదాలకు సంబంధించి హిస్టరీ రిపీట్ కాకూడదనే ప్రధాన ఆశయంతో అడుగులు వేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ ఊహాగానాలపై రిలయన్స్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. కాగా ముకేశ్, నీతా అంబానీ దంపతుల సంతానం ముగ్గురూ ఉన్నత విద్యను అభ్యసించినవారే. వ్యాపారం రంగంలోకి అడుగుపెట్టి తమ ప్రతిభను చాటుకుంటున్నవారే. ఈ క్రమంలోనే 2014 అక్టోబర్‌లో ఇషా, అనంత్ అంబానీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లో డైరెక్టర్లుగా చేరారు. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లో కూడా వారు డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. వారసుల్లో చిన్నవాడు అనంత్ ఇటీవల మార్చిలో జియో ఫ్లాట్ ఫాంలో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వగా, రిలయన్స్ జియో ఫౌండేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో డైరెక్టర్‌గా ఇషా అంబానీ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. -
నిర్మల్ ఈఎస్ఐని వేగవంతం చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: నిర్మల్‌కు కేటాయించిన ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్‌ను రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కోరారు. బుధవారం కేంద్ర మంత్రిని ఢిల్లీలో కలసిన ఇంద్రకరణ్‌రెడ్డి ఈ మేరకు వినతిపత్రాన్ని ఇచ్చారు. అలాగే నిర్మల్‌లోని ఏరియా ఆస్పత్రిలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఆయన కేంద్ర మంత్రికి అందజేశారు. ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటుకు రాష్ట్రం అన్ని వసతులు కల్పించిన నేపథ్యంలో తదుపరి చర్యలను వేగవంతం చేయాల్సిందిగా ఆయన కోరారు. అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌ను కలిసి కందులను కొనుగోలు చేయాలని కోరారు. కేంద్రం ఇదివరకే కొంత మేరకు పంట కొనుగోలు చేసినా, రాష్ట్రంలో భారీ స్థాయిలో పంట సాగుచేసినందువల్ల మిగిలిపోయిన పంటను కూడా కొనుగోలు చేయాలని ఆయన కోరారు. -
ప్రజాభిప్రాయంతోనే జిల్లాలు ఏర్పాటు చేయాలి
న్యూశాయంపేట : ప్రజాభిప్రాయ సేకరణతోనే కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని ఫోరం ఫర్ బెటర్ జిల్లా అధ్యక్షుడు పుల్లూరు సుధాకర్ ప్రభుత్వాన్ని కోరారు. హన్మకొండలోని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడారు. జిల్లా లు, మండలాల ఏర్పాటుపై ప్రజల్లో విస్తృత చర్చ జరిగిన తర్వాతే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. ప్రజల ఆందోళలను పరిగణనలోకి తీసుకోని జిల్లాల ఏర్పాటు చేయాలన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం ఉద్భవించే రాజ్యాంగ సమస్యలపై ప్రభుత్వానికి స్పష్టత కనిపించడం లేదన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ శాస్త్రీయంగా, చట్టబద్ధంగా, ప్రజాభిప్రాయానికి అ నుగుణంగా చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారు. ఫోరం నాయకులు దివాక ర్, ఎ.ప్రభాకర్‌రెడ్డి, పాపిరెడ్డి, యాదగిరి, వీరభద్రుడు, ప్రభాకర్ పాల్గొన్నారు. -
’ఆ డేంజర్ ఫ్యాక్టరీ మాకు వద్దు’
-
పసుపు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి
-
తెలుగు రాష్ట్రాలలో ఎన్టిపీసి రెండు ప్లాంట్లు
-
ఒత్తిడిని చిత్తు చేయండిలా
ఒత్తిడి.. స్ట్రెస్.. ఆందోళన.. మనిషి జీవితంలో సహజం. పాఠశాల విద్యార్థి మొదలుకుని.. గృహిణులు, కళాశాల విద్యార్థులు, ఉద్యోగస్థులు, వ్యాపార రంగంలో ఉన్నవారు ఇలా ప్రతి ఒక్కరూ.. ఏదో ఒక విధంగా ఒత్తిడికి గురవుతున్నారు. దీనివల్ల అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావడం లేదు. అంతేకాకుండా అనారోగ్యం బారినా పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒత్తిడికి కారణాలు.. నివారణ మార్గాలు మీ కోసం.. మానవుడు.. నిద్రలేవడం నుంచి నిద్రపోయే వరకూ ఏదో ఒక మానసిక సంఘర్షణతో సతమతమవుతూ అందమైన జీవితాన్ని అంధకారంగా మార్చుకుంటున్నాడు. జీవితంలో కావాల్సిన అవసరాలకు అనుగుణంగా చక్కని ప్రణాళిక లోపించినప్పుడు మనిషి ఒత్తిడికి గురవుతాడు. దీంతో శారీరక, మానసిక రుగ్మతలకు లోనవడంతోపాటు, సామాజికంగా, ఆర్థికంగా బలహీనుడవుతాడు. ఒత్తిడిని.. విజయానికి నాందిగా మార్చుకుంటే మనిషి ఒత్తిడిని జయించడమే కాకుండా విజయతీరాలకు చేరుకుంటాడు. ముఖ్యంగా ప్రాథమిక దశలోనే ఒత్తిడికి గల కారణాలపై దృష్టి పెట్టాలి. ఆ తర్వాత ఒత్తిడికి కారణమయ్యే ప్రతి ఒక్క అంశాన్ని నిర్మూలించాలి. అయితే చాలామంది ఒత్తిడి నుంచి బయటపడడానికి మార్గాలను అన్వేషించరు. ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి సిగరెట్, మద్యపానం, మాదక ద్రవ్యాల అలవాట్లతో పెడదారులను ఎంచుకుంటారు. దీనివల్ల ఒత్తిడి నుంచి తప్పించుకోలేకపోవడంతోపాటు ఆరోగ్యం తీవ్ర దుష్ర్పభావాలకు లోనవుతుంది. కుటుంబంపై కూడా దీని ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఎవరికీ మనశ్శాంతి అనేది లేకుండా పోతుంది. కాబట్టి ఒత్తిడికి కారణాలు, వాటిని జయించడానికి ఎంచుకోవాల్సిన మార్గాలు ఒకసారి పరిశీలిద్దాం. అందరికీ పని ఒత్తిడి! ఒక గృహిణి తన రోజువారీ వంట చేయడం నుంచి పిల్లల సంరక్షణ, ఆరోగ్యం, బట్టలు ఉతకడం, కూరగాయలు తరుక్కోవడం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఏదో ఒక విషయమై ఒత్తిడికి గురవుతుంటుంది. పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు వారి హాజరు, పరీక్షలు, అసైన్మెంట్స్, ప్రాజెక్ట్ వర్క్ వంటి విషయాల్లో ఒత్తిడికి లోనవుతారు. అలాగే ఆఫీసుకు సరైన సమయంలో వెళతామో, లేదో అని ఉద్యోగులపై ఒత్తిడి ఉంటుంది. ఆఫీసుకు వెళ్లిన తర్వాత అప్పగించిన పనిని సకాలంలో పూర్తిచేయడం, సహోద్యోగులతో సమన్వయం వంటి విషయాల్లోనూ ఒత్తిడి సహజం. వ్యాపారం చేసే వారిలో ఈ సమస్య ఇంకా ఎక్కువ ఉంటుంది. వ్యాపార విషయాల్లో వ్యక్తి 24 గంటలూ (ఒక్క నిద్రపోయేటప్పుడు మినహా) ఆలోచిస్తూ ఉంటాడని ‘కాలిఫోర్నియా యూనివర్సిటీ’ చేసిన అధ్యయనంలో తేలింది. కాబట్టి ఒక గృహిణి, ఒక విద్యార్థి, ఒక ఉద్యోగస్థుడు, ఒక వ్యాపారి.. ఇలా ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో ప్రతిరోజూ, ఏదో ఒక స్థితిలో ఒత్తిడికి లోనవుతూనే ఉంటారు. ఒత్తిడిని ఇలా ఎదుర్కోండి: ఒత్తిడిని జయించడంలో భాగంగా ప్రతి ఒక్కరూ కొన్ని పద్ధతులను పాటించాలి. దీని ద్వారా ఒత్తిడిని సులువుగా ఎదుర్కోవచ్చు. కాలం అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఈ రోజు రేపు రాదు. ఓ కవి చెప్పినట్లుగా పెరుగుతుంది వయసు అని అనుకుంటారు కానీ తరుగుతుంది ఆయువు అని తెలుసుకోరు. కాలానికి ఎవరైతే విలువనిస్తారో వారు కాలానుగుణంగా ఎదుగుతారు. సమయపాలన ప్రాధాన్యతా క్రమం, పనిపై అకుంఠిత దీక్ష, వ్యాయామం, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక ప్రణాళిక; పిల్లలతో, పెద్దలతో ప్రేమతో నిజాయతీగా వ్యవహరించడం, డైరీ రాయడం, రోడ్ మ్యాప్ రూపొందించుకోవడం వంటి వాటి ద్వారా ఒత్తిడి మీ దరి చేరదు. దీనివల్ల మీరు ఎంతో ఆర్యోగంగా, ఉత్సాహంగా ఉంటారు. సమయపాలన: ప్రపంచం మొత్తానికీ అందుబాటులో ఉన్న సమయం 24 గంటలే. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఒత్తిడిని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఒక పాఠశాలలో, కళాశాలలో చదివే విద్యార్థికి వారి టైమ్‌టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. విద్యార్థి ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు పాఠశాల/కళాశాలలో బోధించిన అంశాలను అధ్యయనం, లోతైన విశ్లేషణ చేయడం ద్వారా విద్యార్థికి ఆత్మస్థైర్యం, ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. టైమ్ టేబుల్లో ప్రతిరోజూ ప్రాధాన్యతా క్రమానికి పెద్దపీట వేయండి. రోజూ భోజనం, నిద్రతోపాటు స్టడీకి చక్కని ప్రణాళిక రూపొందించుకోండి. ప్రయోజనం లేని పనులకు ప్రాధాన్యత ఇవ్వకండి, ప్రాధాన్యతాక్రమం: విద్యార్థులు.. తమకు ఏ సబ్జెక్టుల్లో అసాధారణమైన పట్టు ఉందో, వేటిలో బలహీనంగా ఉన్నారో తెలుసుకోవాలి. దీని ఆధారంగా ప్రాధాన్యతాక్రమాన్ని రూపొందించుకోవాలి. సాధారణంగా ఒక వ్యక్తి తన పనులను ఒకచోట రాసుకొని వాటిలో ఏది అతి ముఖ్యం, ముఖ్యం, చివరి ప్రాముఖ్యత.. ఇలా ప్రాధాన్యతల వారీగా పూర్తి చేసుకోవాలి. ఒక ఉదాహరణను పరిశీలిద్దాం. అద్దె కట్టడం - సరుకులు తీసుకోవడం - దుస్తులు కొనడం - రైల్వే రిజర్వేషన్ చేయించడం - ఇవి ఆ రోజుకు పనులుగా రాసుకుంటే... 1. రైల్వే రిజర్వేషన్ చేయించడం (ఒకవేళ మనం తొందరగా చేయకపోతే వెయిటింగ్ లిస్ట్ పెరిగిపోవచ్చు) 2. కరెంట్ బిల్ కట్టడం (కట్టకపోతే పెనాల్టీ పడొచ్చు) 3. సరుకులు తీసుకురావడం, 4. దుస్తులు కొనడం. ఈ ప్రాధాన్యతల్లో చిట్టచివరిది దుస్తులు కొనడం అంత ప్రాధాన్యమైన విషయం కాదు. ఎందుకంటే మొదటి రెండు అంశాలు సమయానికి ముడిపడి ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజూ ఒక పుస్తకంలో మనం చేయాల్సిన పనులను, వాటి ప్రాధాన్యతలను రాసుకోవాలి. ప్రాధాన్యతలో భాగం రోజువారీ, నెలవారీ, ఆరునెలల వారీగా టాస్క్‌లను రాసుకోవడం వల్ల పనులన్నీ సజావుగా సాగిపోతాయి. -
చిట్ ఫండ్ మోసాలపై ఫోరం
ముంబై: చిట్‌ఫండ్ మోసా లపై నియంత్రణ సంస్థలు దృష్టి సారిం చాయి. ఈ పథకాలపై ప్రభుత్వ విభాగాలు సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు, తీసుకోవాల్సిన చర్యలపై సమన్వయానికి ప్రత్యేక ఫోరం ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. బుధవారం జరిగిన ఆర్థిక స్థిరత్వ, అభివృద్ధి మండలి (ఎఫ్ఎస్డీసీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపిం ది.ఆర్బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సారధ్యంలో జరిగిన సమావేశంలో సెబీ, ఐఆర్డీఏ, పీఎఫ్ఆర్డీఏ చీఫ్‌లు పాల్గొన్నారు. కొత్తగా ఆర్బీఐ గవర్నర్ పగ్గాలను చేపట్టబోతున్న రాజన్ కూడా హాజరయ్యారు.