SANTOSH KUMAR GANGWAR
-
ఏపీలో మరో 7 ఈఎస్ఐ ఆస్పత్రులు
సాక్షి, న్యూఢిల్లీ: గుంటూరు, విజయనగరం, కాకినాడ, పెనుగొండ, విశాఖ, శ్రీసిటీ నెల్లూరు, అచ్యుతాపురంలలో ఈఎస్ఐ నూతన ఆస్పత్రులకు సూత్రప్రాయ అనుమతిచ్చినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ రాజ్యసభలో తెలిపారు. మార్చి 2023లోగా రూ.73.68 కోట్లతో విజయనగరంలో 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. బుధవారం వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, టీడీపీ ఎంపీ కె.రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. గృహ రుణాల వడ్డీపై రాయితీ చెల్లింపు పథకం (సీఎల్ఎస్ఎస్)ను ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగించినట్లు కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ హర్దీప్సింగ్ పురి తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన(అర్బన్) కింద అర్హులైన మధ్యతరగతి ప్రజల గృహ రుణాలపై వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో చెల్లిస్తుందని విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. కర్నూలు–విజయవాడ, విజయవాడ–కర్నూలు విమాన సరీ్వసులు ఇంకా ప్రారంభం కాలేదని వైఎస్సార్సీపీ ఎంపీ పరిమళ్ నత్వానీ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రకాశం బ్యారేజీ–హైదరాబాద్, విజయవాడ–నాగార్జున సాగర్ మధ్య సీ–ప్లేన్ సర్వీసులు ఇంకా ప్రారంభం కాలేదన్నారు. గత 19 నెలల్లో ఏపీలోని హిందూ దేవాలయాలపై 140కి పైగా దాడులు, దేవతా విగ్రహాలను కూల్చివేసి, అపవిత్రం చేయడం వంటి ఘటనలు జరిగాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభ జీరో అవర్‌లో ప్రస్తావించారు. చేనేత రంగాన్ని ఆదుకోవాలి ఏపీ సహా దేశవ్యాప్తంగా చేనేత రంగాన్ని ఆదుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మౌలిక సదుపాయాల రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వైఎస్సార్సీపీ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. చెన్నై–బెంగళూరు–మైసూరు హైస్పీడ్ రైలుపై వైఎస్సార్సీపీ ఎంపీ రెడ్డప్ప అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ బదులిచ్చారు. అనంతపురం నుంచి ఢిల్లీలోని ఆదర్శనగర్ వరకూ కిసాన్ రైలు సేవలు అందిస్తున్నట్లు వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. వైఎస్సార్సీపీ ఎంపీలు కోటగిరి శ్రీధర్, ఎన్.రెడ్డెప్ప, బి.సత్యవతి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు సంబంధిత కేంద్రమంత్రులు సమాధానమిచ్చారు. పుణేలోని సీ–డాక్లో జాతీయ కృత్రిమ మేథస్సు సూపర్ కంప్యూటర్ ‘పరం సిద్ధి’ ఏర్పాటుకు రూ.72.25 కోట్లు ఖర్చు చేసినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ తలారి రంగయ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకరప్రసాద్ బదులిచ్చారు. -
జస్టిస్ చంద్రయ్యకు ‘నెల్సన్ మండేలా అవార్డ్’
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ హెచ్చార్సీ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య ప్రతిష్టాత్మక ‘నెల్సన్ మండేలా అవార్డ్’అందుకున్నారు. జాతీయ సహకార వారోత్సవాల ముగింపు సందర్భంగా ఢిల్లీ నేషనల్ కో–ఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆడిటోరియంలో గురువారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ఈ అవార్డును ఆయనకు అందించారు. పేదలు, మహిళలు, దివ్యాంగులు, చిన్న పిల్లల హక్కుల పరిరక్షణకు మానవ హక్కుల కమిషన్ చైర్మన్ హోదాలో జస్టిస్ చంద్రయ్య చేస్తున్న కృషికి గుర్తింపుగా ఎన్‌సీయూఐ, ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సొసైటీ లిమిటెడ్ ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశాయి. -
‘బాబు కూడా ముద్దాయి అయ్యే పరిస్థితి’
సాక్షి, కాకినాడ(తూర్పు గోదావరి): చంద్రబాబు హయాంలో ఈఎస్ఐ స్కాంలో రూ.300 కోట్ల అవినీతి జరిగిందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. మాజీ కార్మిక మంత్రులు అచ్చెం నాయుడు, పితాని సత్యనారాయణ హయాంలోనే ఈ అవినీతి జరిగిందని పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంలో ఎన్ని శాఖలుంటే అన్ని శాఖలను టీడీపీ దోచుకుందని విమర్శించారు. దీంతో నేడు చంద్రబాబు కూడా ముద్దాయి అయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. ఇక బాబుతోపాటు అప్పటి కార్మికశాఖ మంత్రులిద్దరూ కూడా జైలుకు వెళ్లే పరిస్థితి దగ్గర్లోనే ఉందని పేర్కొన్నారు. కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. అందులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం తలపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈఎస్ఐ ఆసుపత్రులు సమర్ధవంతగా పనిచేస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్‌లోని ఈఎస్ఐ హాస్పిటల్ మంచి సేవలు అందిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. ఏపీలో ఈఎస్ఐ ఆసుపత్రులు కూడా అదే విధంగా సేవలు అందించాలని కోరారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సహాయసహకారాలు అందిస్తామని తెలిపారు.(ఆ మాజీ మంత్రులను వదిలిపెట్టం) -
కొలువులు క్షేమం..
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఉపాధి అవకాశాలు తగ్గాయనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ చెప్పారు. నోట్ల రద్దుతో ఉద్యోగాలు కనుమరుగయ్యాయనే వాదనను తోసిపుచ్చుతూ సోమవారం లోక్‌సభలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఉపాధి అవకాశాలను పెంచేందుకు ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రశ్నోత్తరాల సమయంలో తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు కళ్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ నోట్ల రద్దుతో తన నియోజకవర్గంలో వేలాది కార్మికులు ఉపాధి కోల్పోయారని, ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు చేపట్టిందో తెలపాలని అడగ్గా మంత్రి బదులిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. మెరుగైన ఉపాధి అవకాశాల కోసం దేశంలోని ఏ ప్రాంతానికైనా వలస వెళ్లే హక్కు ప్రతి పౌరుడికీ ఉందని మంత్రి పేర్కొన్నారు. వలసల కారణంగా ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం అంతరాష్ట్ర వలస కార్మిక చట్టం, 1979ను సమర్ధంగా అమలు చేస్తోందని చెప్పారు. -
పీఎఫ్ బకాయిలు చెల్లించేలా జోక్యం చేసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: టీఎస్ఆర్టీసీ కార్మికులకు పీఎఫ్ బకాయిలు చెల్లించేలా జోక్యం చేసుకోవాల్సిందిగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్‌ను రాష్ట్ర బీజేపీ కోరింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, సోయం బాపూరావు శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలసి వినతిపత్రం సమర్పించారు. కార్మికులకు రూ. 760 కోట్ల మేర పీఎఫ్ బకాయిలు చెల్లించాల్సి ఉందని వివరించారు. డిమాండ్ల సాధన కోసం కార్మికులు గత నెలన్నర రోజులుగా సమ్మె చేస్తున్నారని, ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకొని కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. 2019 ఏడాదికిగానూ కార్మికులకు రూ. 80 కోట్ల బకాయిలు చెల్లించాలని ఈపీఎఫ్‌వో డిమాండ్ నోటీసులు ఇచ్చిందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర మంత్రికి బీజేపీ ఎంపీలు వివరించారు. -
వరంగల్‌లో ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
దేశంలోని ప్రతి జిల్లాలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నాం.. వరంగల్‌లో ఈఎస్ఐ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్ అన్నారు. సంపర్క్ అభియాన్, జనజాగరణ కార్యక్రమాల్లో భాగంగా వరంగల్‌లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆయన సోమవారం ఇక్కడికి వచ్చారు. సాక్షి, న్యూశాయంపేట: దేశంలోని ప్రతి జిల్లాలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నాం.. వరంగల్‌లో ఈఎస్ఐ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్ అన్నారు. బీజేపీ దేశవ్యాప్తంగా చేపట్టిన సంపర్క్ అభియాన్, జనజాగరణ కార్యక్రమాల్లో భాగంగా వరంగల్‌లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆయన సోమవారం ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా హన్మకొండ రాంనగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సంపర్క్ అభియాన్, జనజాగరణ సభలో కేంద్ర మంత్రి మాట్లాడారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఈఎస్ఐ మందుల కొనుగోలు కుంభకోణం తమ దృష్టికి వచ్చిందని పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్య తీసుకుంటామని తెలిపారు. కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలో వచ్చిన వందరోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజామోదం లభించిందని చెప్పారు. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని ఇందులో వేరే దేశం జోక్యాన్ని సహించేది లేదన్నారు. కశ్మీర్‌తో పాటు, దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ రాబోయే రోజుల్లో అధికారంలో వస్తుందని, రాష్ట్రంలో నాలుగు ఎంపీ సీట్లు గెలచుకోవడం ఇందుకు నిదర్శనమన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషిచేయాలని, కలిసికట్టుగా పనిచేసి టీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు ఈఎస్ఐ మందుల కొనుగోలు కుంభకోణంపై సీబీఐ చేత దర్యాప్తు చేయాలని కోరుతూ పార్టీ రాష్ట్ర ప్రతినిధి బృందం కేంద్రమంత్రికి మెమోరండం సమర్పించింది. సంపర్క్ అభియాన్ భాగంగా కాకతీయ మాజీ వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ వంగాల గోపాల్‌రెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి, ప్రముఖ కవి రచయిత ప్రొఫెసర్ రామాచంద్రమౌళిలను కలుసుకున్నారు. సభలో రాష్ట్ర నాయకులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, మార్తినేని ధర్మారావు, మాజీ ఎంపీ జంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొండేటి శ్రీధర్, వన్నాల శ్రీరాములు, మాజీ మేయర్ టి.రాజేశ్వర్‌రావు, పార్టీ అర్బన్, రూరల్‌జిల్లాల అధ్యక్షులు రావు పద్మ, ఎడ్ల అశోక్‌రెడ్డి, నాయకులు డాక్టర్ విజయలక్ష్మి, రావుల కిషన్, మల్లాది తిరుపతిరెడ్డి, బన్న ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. భారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలి చారిత్రాత్మకమైన వరంగల్ జిల్లాలో ఉన్న నిరుద్యోగుల కోసం భారీ పరిశ్రమను ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలను కల్పించాలని చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి కేంద్ర మంత్రిని కోరారు. గతంలో ఉన్న ఆజంజాహి మిల్లు మూత పడడంతో వేలాది మందికి ఉపాధి లేకుండా పోయిందన్నారు. ఆసియాలోనే పెద్ద మార్కెట్ ఉన్న వరంగల్‌లో స్పైసెస్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని, ఉన్న స్పైసెస్ బోర్డును తరలించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్ర మంత్రికి వినతి పత్రాన్ని సమర్పించి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు సాధుల దామోదర్, తోట నర్సింహరావు, కొత్త కిషోర్‌కుమార్, సారయ్య, గౌరిశెట్టి శ్రీనివాస్, రాజు, దేశబత్తుల రమేష్, పోతుకుమారస్వామి, బిజెపీ నాయకులు రావు పద్మారెడ్డి, ఎడ్ల అశోక్‌రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ధర్మారావు, వన్నాల శ్రీరాములు, వంగాల సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోదీ పాలనకు మద్దతుగా నిలవాలి వరంగల్: దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రధాని మోదీ పాలనకు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్ అన్నారు. వరంగల్‌లోని చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో సోమవారం వ్యాపారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ భద్రత కోసం ప్రధాని మోదీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని అర్టికల్ 371ను రద్దు చేసి కాశ్మీర్ ప్రజలకు నిర్బంధం నుంచి విముక్తి కల్పించారని పేర్కొన్నారు. ప్రధాని తీసుకున్న నిర్ణయాలపై ప్రజల మనోభావాలను తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా సంపర్క్ అభియాన్, జనజాగరణ్ కార్యక్రమాలు నిర్విహిస్తున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా వరంగల్ పట్టణంలో మేధావులను, కవులను, వ్యాపార, వాణిజ్య వర్గాలను కలుసుకున్నామని చెప్పారు. -
‘ఈఎస్ఐ’ కుంభకోణంపై దర్యాప్తు
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఈఎస్ఐ మందుల కుంభకోణంపై దర్యాప్తు చేస్తామని కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తెలిపారు. ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర ప్రతినిధి బృందం సోమవారం కేంద్రమంత్రికి వినతిపత్రం సమర్పించింది. కుంభకోణం తమ దృష్టికి వచ్చిందని, వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. దేశంలోని ప్రతి జిల్లాలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని, వరంగల్‌లో ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. తెలంగాణలో బీజేపీ పాగా వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వరంగల్ రూరల్ జిల్లా హన్మకొండలో ఏర్పాటు చేసిన ‘జనజాగరణ సభ’లో ఆయన మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దుకు దేశవ్యాప్తంగా ప్రజామోదం లభించిందన్నారు. కశ్మీర్‌తో పాటు దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. -
ఈపీఎఫ్ వడ్డీరేటు 8.65 శాతం
న్యూఢిల్లీ : ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్) చందాదారులందరికీ శుభవార్త. 2018– 19 ఆర్థిక సంవత్సరానికిగాను ఈపీఎఫ్ చందాదారులకు చెల్లించాల్సిన వడ్డీని 8.65 శాతం చొప్పున ఈ పండగ సీజన్‌కు ముందే చెల్లించనున్నట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం జాతీయ భద్రతా అవార్డుల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2017–18 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ ఖాతాల్లోని మొత్తాలపై 8.55 శాతం వడ్డీ చెల్లించారు. 2018–19 సంవత్సరానికి ఈ వడ్డీరేటును 8.65 శాతానికి పెంచాలని ఈపీఎఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. కాగా ఈపీఎఫ్ చందాదారులకు చెల్లించే వడ్డీని 8.65 శాతానికి పెంచనున్నామని గంగ్వార్ కొద్ది రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఉత్తరాది వారిలో నైపుణ్యం లేదు
లక్నో: దేశంలో తగిన ఉపాధి అవకాశాలు ఉన్నాయని.. వాటికి కావాల్సిన నైపుణ్యాలు ఉత్తరాది ప్రజల్లో ఉండటం లేదని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర భారతదేశాన్ని సందర్శించే రిక్రూటర్లు ఇదే విషయంపై తనకు ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. రాయ్‌బరేలీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇటీవలి కాలంలో నిరుద్యోగం గురించి వార్తలు వస్తున్నాయి. వీటిని విశ్లేషణ చేశాను. దేశంలో ఉద్యోగాలకు కొరత లేదు. కానీ కావాల్సిన అర్హులే ఉండటం లేదు. ఇదే విషయంపై పలువురు రిక్రూటర్లు నాకు ఫిర్యాదు చేశారు’అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. ఆర్థిక మందగమనం వల్ల జాబుల సంఖ్య తగ్గిపోతుందనే విషయం నుంచి తప్పించుకునేందుకే కేంద్రం ఇలాంటి ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఆరోపించారు. కేంద్ర మంత్రి నిరుద్యోగంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమని బీఎస్పీ అధినేత్రి మాయావతి వ్యాఖ్యానించారు. -
జిల్లాకో ఈఎస్ఐ ఆస్పత్రి
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాకు ఒక ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ పేర్కొన్నారు. ఇప్పటికే 400 జిల్లాల్లో ఈఎస్ఐ ఆస్పత్రులను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. వచ్చే నాలుగేళ్లలో అన్ని జిల్లాల్లో ఈఎస్ఐ ఆస్పత్రులను తెరిచి కార్మిక కుటుంబాలకు అత్యాధునిక వైద్య సేవలందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సనత్‌నగర్‌లోని ఈఎస్ఐ ఆస్పత్రిలో నూతనంగా నిర్మించతలపెట్టిన ఓపీడీ భవనానికి బుధవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిలతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఈఎస్ఐ ఆస్పత్రిని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సనత్‌నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిని ఆదర్శ ఆస్పత్రిగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కొత్తగా నిర్మించనున్న ఓపీడీ భవనాన్ని ఏడాదిలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రూ.124 కోట్లతో నిర్మిస్తున్న ఈ బ్లాకులో అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉంటాయని పేర్కొన్నారు. కారి్మకుల సంఖ్య తక్కువ ఉన్న చోట్ల ఈఎస్ఐ లబ్ధిదారులు కాని వారికి కూడా సేవలు అందించనున్నట్లు వివరించారు. దేశంలోని 40 కోట్ల మంది అసంఘటిత రంగ కారి్మకులకు నెలవారీగా రూ.3,000 పింఛను అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ప్రకటించాలి సనత్‌నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ప్రకటించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. వైద్య సేవల రంగంలో కేంద్ర ప్రభుత్వం పలు విప్లవాత్మక చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈఎస్ఐకి సంబంధించిన పెండింగ్ అంశాలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈఎస్ఐ ఆసుపత్రుల పనితీరు రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల కంటే మెరుగ్గా ఉందని కితాబిచ్చారు. రాష్ట్రంలో 18 లక్షల మంది కార్మికులు ఈఎస్ఐ పరిధిలో ఉన్నారని రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి తెలిపారు. -
వేతన కోడ్‌కు రాజ్యసభ ఆమోదం
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా వివిధ సంస్థల్లో పనిచేసే ప్రతి కార్మికుడికీ కనీస వేతనం అందించేందుకు వీలు కల్పించే వేతనాల కోడ్ –2019 బిల్లును రాజ్యసభ ఆమోదించింది. వేతనాలు, బోనస్‌లకు సంబం ధించిన వివిధ నిబంధనలు, సమస్యలకు పరిష్కారం చూపుతూ ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది. ఇది చట్ట రూపం దాల్చితే దేశ వ్యాప్తంగా ఉన్న 50 కోట్ల మంది కార్మికులకు లాభం కలుగుతుందని కార్మిక మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ సభలో తెలిపారు. సభలో ఈ బిల్లుకు అనుకూలంగా 85 మంది, వ్యతిరేకంగా 8 మంది ఓటేశారు. కనీస వేతనాల చట్టం, వేతన చెల్లింపు చట్టం, బోనస్ చెల్లింపు చట్టం, సమాన ప్రతిఫలం చట్టం స్థానంలో ఇది అమల్లోకి రానుంది. ఈ బిల్లుకు లోక్‌సభ స్టాండింగ్ కమిటీ ప్రతిపాదిం చిన 24 సవరణల్లో 17 సవరణలను ప్రభుత్వం ఆమోదించిందని మంత్రి గంగ్వార్ తెలిపారు. అయితే, కనీస జీవన పరిస్థితుల ఆధారంగా కనీస వేతనాలను నిర్ణయించే అధికారాన్ని రాష్ట్రాల నుంచి తీసుకోబోమన్నారు. కార్మిక సంఘాలు, యజమానులు, రాష్ట్ర ప్రభుత్వం ప్రాతినిధ్యం వహించే త్రిసభ్య కమిటీలే కనీస వేతనాలను నిర్ణయిస్తాయన్నారు. అదేవిధంగా, వేతనాల విషయంలో స్త్రీ, పురుష, ట్రాన్స్‌జెండర్లంటూ వివక్ష ఉండబోదన్నారు. వేతన పరిమితితో పనిలేకుండా అన్ని రంగాల కార్మికులకూ కనీస వేతనం సకాలంలో అందేలా నిబంధనలు పొందుపరిచామన్నారు. ప్రస్తుతం ఉన్న వేర్వేరు కార్మిక చట్టాలు వేతనానికి 12 రకాలైన నిర్వచనాలిచ్చాయని, దీంతో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. తాజా బిల్లుతో ఇటువంటి సమస్యలుండవన్నారు. జూలై 30వ తేదీన ఈ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందింది. -
2022లోపు ప్రతి పేదోడికి పక్కా ఇల్లు
సుభాష్‌నగర్ (నిజామాబాద్‌అర్బన్): దేశంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి 2022 లోపు పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని లక్ష్యం పెట్టుకున్నామని కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ సహాయమంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్ పేర్కొన్నారు. శుక్రవారం నిజామాబాద్‌లో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ప్రతి ఒక్కరికీ ఇల్లు నిర్మించుకునేందుకు కేంద్రం నిధులు మంజూరు చేస్తుందన్నారు. బీడీ కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టామని చెప్పారు. పీఎఫ్ ఖాతాదారులు తమ డబ్బులను అవసరమైనప్పుడు వాడుకునేలా చట్టబద్ధం చేశామని తెలిపారు. కార్మిక చట్టాల నిబంధనలను సరళతరం చేశామని, కార్మికులకు ఉపయోగపడేలా చట్టాల్లో అనేక మార్పులు తెచ్చామని స్పష్టం చేశారు. కేంద్రం కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని సక్రమంగా వినియోగించుకోవడంలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే తలమానికంగా ఉండాలన్న ఆకాంక్షతోనే ప్రధాని మోదీ అభివృద్ధికి అన్నివిధాలుగా సహకరిస్తున్నారని తెలిపారు. -
30 రోజుల్లో ముప్పావు వంతు వెనక్కి తీసుకోవచ్చు!
న్యూఢిల్లీ: ఉద్యోగం పోయిన నెల తర్వాత పీఎఫ్ మొత్తంలో 75 శాతం వరకూ వెనక్కి తీసుకునే వెసులుబాటును రిటైర్మెంట్ నిధి, ఈపీఎఫ్ఓ(ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్) కల్పిస్తోంది. మిగిలిన మొత్తాన్ని ఈపీఎఫ్ఓ వద్దే అట్టిపెట్టుకోవచ్చని కార్మిక శాఖ మంత్రి సంతోశ్ కుమార్ గంగ్వార్ పేర్కొన్నారు. ఉద్యోగం పోయిన 2 నెలల తర్వాత మిగిలిన 25 శాతాన్ని తీసుకోవచ్చని, ఫైనల్ సెటిల్మెంట్ కూడా చేసుకోవచ్చని వివరించారు. ఈ మేరకు ఎంప్లాయీ ప్రావిడెండ్ ఫండ్ స్కీమ్, 1952లో మార్పులు, చేర్పులు చేయాలని నిర్ణయించామని ఈపీఎఫ్ఓ, ట్రస్టీల కేంద్ర బోర్డ్‌కు చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్న సంతోష్ వివరించారు. ప్రస్తుతానికి... ఉద్యోగం పోయిన రెండు నెలల తర్వాతనే ఈపీఎఫ్ఓ సభ్యుడు తన పీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఫైనల్ సెటిల్మెంట్ కూడా అప్పుడే చేసుకోవచ్చు. మరోవైపు ఐదు ఫండ్ మేనేజర్ల కాలపరిమితిని ఈ ఏడాది డిసెంబర్ 31 వరకూ పొడిగించామని గంగ్వార్ తెలిపారు. పోర్ట్‌ఫోలియో మేనేజర్ల ఎంపికకు కన్సల్టెంట్ నియామక ప్రతిపాదన కూడా ఆమోదం పొందిందన్నారు. ఈ ఏడాది మే కల్లా ఈటీఎఫ్ పెట్టుబడులు రూ.47,431 కోట్లకు చేరాయని, త్వరలోనే ఈ పెట్టుబడులు రూ.లక్ష కోట్లకు చేరతాయని చెప్పారు. ఈ ఏడాది మేతో ముగిసిన సంవత్సరానికి 16% రాబడి వచ్చిందని వివరించారు. -
20 లక్షల గ్రాట్యుటీకి పన్ను నో
న్యూఢిల్లీ: ఉద్యోగుల గ్రాట్యుటీపై రూ. 20 లక్షల వరకూ పన్ను మినహాయింపునిచ్చే గ్రాట్యుటీ బిల్లు(సవరణ)ను పార్లమెంటు ఆమోదించింది. ఈ బిల్లును కేంద్ర కార్మిక మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్ గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టగా ఎలాంటి చర్చా లేకుండా మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. మార్చి 15నే ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి సంతకం అనంతరం బిల్లులోని సవరణలు అధికారికంగా అమల్లోకి వస్తాయి. కేంద్ర ఉద్యోగులకు ఏడో వేతనసంఘం సిఫార్సుల అమలు నేపథ్యంలో.. పన్ను భారం లేని గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచడంతో తాజా మార్పులు అవసరమయ్యాయి. కేంద్ర సివిల్ సర్వీస్ నిబంధనలు(1972) వర్తించని ప్రైవేటు రంగంలోని సిబ్బందికి ఈ సవరణ లతో ప్రయోజనం చేకూరనుంది. చివరి నెల జీతంలోని మూల వేతనాన్ని పరిగణనలోకి తీసుకుని సంస్థలో పనిచేసిన కాలం ఆధారంగా వారి గ్రాట్యుటీని లెక్కిస్తారు. బిల్లులోని ముఖ్యాంశాలు ఉద్యోగుల గ్రాట్యుటీపై గరిష్ట పన్ను పరిమితిని రూ.10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచడానికి బిల్లు ప్రభుత్వానికి అవకాశం కల్పిస్తుంది. ఇకపై గ్రాట్యుటీ పరిమితిలో అధికారిక ఉత్తర్వుల ద్వారానే కేంద్రం మార్పులు చేర్పులు చేయవచ్చు. ఎన్ని ప్రసూతి సెలవుల్ని సర్వీసులో భాగంగా పరిగణించాలన్న అధికారం కూడా ప్రభుత్వానికి లభిస్తుంది. ప్రసూతి సెలవుల కాలాన్ని కూడా అధికారిక ఉత్తర్వుల ద్వారానే కేంద్రం నిర్ణయిస్తుంది. ప్రసూతి సెలవు చట్టాన్ని గతేడాది సవరించి గరిష్ట సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పెంచారు. దీంతో గ్రాట్యుటీ చెల్లింపు చట్టంలో ప్రసూతి సెలవులపైనా సవరణలు చేశారు. -
గ్రాట్యుటీపై గుడ్‌న్యూస్
న్యూడిల్లీ : ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. నేడు కీలకమైన గ్రాట్యుటీ చెల్లింపు(సవరణ) బిల్లుకు పార్లమెంట్ ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లును గత వారమే లోకసభ ఆమోదించగా.. నేడు రాజ్యసభలోనూ ఆమోదించారు. విపక్షాల నిరసనల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా రాజ్యసభ సజావుగా సాగకపోవడంతో, ఈ బిల్లు ఆమోదం పెండింగ్‌లో పడుతూ వచ్చింది. నేడు దీనికి ఆమోదయోగ్యం లభించింది. నేడు కూడా రాజ్యసభలో నిరసనల వాతావరణం నెలకొన్నప్పటికీ నిరసనల మధ్యే ఈ బిల్లును కార్మిక మంత్రి సంతోష్ కుమార్ మూజువాణి ఓటు ద్వారా ఆమోదింప జేశారు. రాష్ట్రపతి ఆమోదం త్వరాత ఈ బిల్లు చట్టరూపం దాల్చనుంది. ఈ బిల్లు ద్వారా ఉద్యోగులకు పన్ను రహిత గ్రాట్యుటీ ప్రస్తుతమున్న రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెరుగుతుంది. అంతేకాక అమల్లో ఉన్న 12 వారాల ప్రసూతి సెలవులకు బదులుగా.. ఎప్పటికప్పుడు కార్య నిర్వాహక ఉత్తర్వు జారీ చేయడం ద్వారా వీటిని పెంచుకునే హక్కును ప్రభుత్వానికి కల్పించనుంది. 7వ వేతన సంఘ అమలు అనంతరం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యుటీ మొత్తం రూ.20 లక్షలకు పెరిగిన సంగతి తెలిసిందే. -
నిర్మల్ ఈఎస్ఐని వేగవంతం చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: నిర్మల్‌కు కేటాయించిన ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్‌ను రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కోరారు. బుధవారం కేంద్ర మంత్రిని ఢిల్లీలో కలసిన ఇంద్రకరణ్‌రెడ్డి ఈ మేరకు వినతిపత్రాన్ని ఇచ్చారు. అలాగే నిర్మల్‌లోని ఏరియా ఆస్పత్రిలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఆయన కేంద్ర మంత్రికి అందజేశారు. ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటుకు రాష్ట్రం అన్ని వసతులు కల్పించిన నేపథ్యంలో తదుపరి చర్యలను వేగవంతం చేయాల్సిందిగా ఆయన కోరారు. అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌ను కలిసి కందులను కొనుగోలు చేయాలని కోరారు. కేంద్రం ఇదివరకే కొంత మేరకు పంట కొనుగోలు చేసినా, రాష్ట్రంలో భారీ స్థాయిలో పంట సాగుచేసినందువల్ల మిగిలిపోయిన పంటను కూడా కొనుగోలు చేయాలని ఆయన కోరారు. -
నల్లధనంపై తెల్లమొహం..!!
♦ అసలు ఉందా లేక తెల్లగా మారిందా? ♦ రద్దయిన రూ.1,000 నోట్లలో 99 శాతం వెనక్కి ♦ వెనక్కి రాని నోట్ల విలువ కేవలం రూ. 8,925 కోట్లే. ♦ రూ.500 నోట్లపై బయటకు రాని పూర్తి గణాంకాలు ♦ ఆర్బీఐ తాజా నివేదికతో బయటపడిన వాస్తవాలు... న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రూపంలో భారీగా నల్లధనం పోగుపడిందన్న అంచనాలతో, అవినీతిపరుల వెన్ను విరిచేందుకు నరేంద్ర మోదీ సర్కారు చేపట్టిన డీమోనిటైజేషన్ అస్త్రం సత్ఫలితాలను ఇచ్చిందా..? అన్న ప్రశ్నకు అవును అనే సమాధానం మాత్రం వినిపించడం లేదు. ఎందుకంటే ఆర్బీఐ తాజాగా వెల్లడించిన గణాంకాలు మరోలా ఉన్నాయి మరి. గతేడాది నవంబర్ 8న రూ.500, రూ.1,000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్బీఐ నివేదిక ప్రకారం అప్పటికి మార్కెట్లో చలామణిలో ఉన్న రూ.1,000 నోట్ల విలువ రూ.6.86 లక్షల కోట్లు. కేంద్ర మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్ స్వయంగా ఈ ఏడాది ఫిబ్రవరి 3న లోక్‌సభకు ఈ విషయాన్ని వెల్లడించారు. మరి డీమోనిటైజేషన్ కార్యక్రమం ముగిసిపోయిన ఈ ఏడాది మార్చి నాటికి కేవలం రూ.8,925 కోట్ల విలువ చేసే రూ.1,000 నోట్లు మాత్రమే వెనక్కిరాలేదని ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. దీని ప్రకారం చూస్తే మొత్తం రూ.1,000 నోట్లలో 99 శాతానికిపైగా తిరిగి వెనక్కి వచ్చాయి. కేవలం ఓ పావు శాతం లోపు నోట్లు మాత్రమే బ్యాంకింగ్ వ్యవస్థలోకి రాకుండా ఆగిపోయాయనేది స్పష్టమైంది. రూ.500 నోట్లపై అయోమయం! ఇక రూ.500 నోట్ల విలువ గురించి ఈ విధంగా లెక్కించేందుకు అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే పెద్ద నోట్లను రద్దు చేసిన వెంటనే వ్యవస్థలోకి కొత్త రూ.500 నోట్లను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇక ఆర్బీఐ పాత, కొత్త రూ.500 నోట్లకు సంబంధించి వేర్వేరు గణాంకాలను ప్రకటించలేదు. దీంతో రూ.500 నోట్ల చలామణి విషయమై అస్పష్టత నెలకొంది. కేంద్రం రద్దు చేసిన పెద్ద నోట్ల విలువ రూ.15.4 లక్షల కోట్లు కాగా, వీటిలో సగానికి పైగా రూ.500 నోట్లే. రద్దయిన రూ.500 నోట్లలో వాస్తవానికి ఎన్ని వెనక్కి వచ్చాయన్నది తెలియాలంటే ఆర్బీఐ స్పష్టమైన గణాంకాలు వెల్లడిస్తేనే సాధ్యం. వెనక్కిరాని 500 నోట్ల విలువ రూ.7,075 కోట్లుగా లెక్కతేలుతోంది. నల్లధనం ఎంత పట్టారు? రూ.500 నోట్లపై స్పష్టమైన గణాంకాలు బయటకు రానప్పటికీ వ్యవస్థలో ఉన్న నల్లధనాన్ని కేంద్రం ఏ మేరకు ఏరి పారేసిందో రూ.1,000 నోట్ల గణాంకాలను బట్టి అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రూ.1,000 నోట్లలో దాదాపు 99.5% వెనక్కి వచ్చినట్టుగానే రద్దయిన రూ.500 నోట్లు కూడా అదే స్థాయిలో వ్యవస్థలోకి వచ్చినట్లు తాజా నివేదిక చెబుతోంది. అప్పుడు ఆర్థిక వ్యవస్థకు వెలుపల చలామణి అవుతున్న నల్లధనాన్ని కేంద్రం తుడిచేసింది ఏముందున్న ప్రశ్న తలెత్తక మానదు. అసలు నల్లధనం పెద్దగా లేకపోయి ఉండొచ్చు. లేదా అవినీతిపరులు నేరుగా లేదా బినామీల ద్వారా బ్యాంకుల నుంచి, ఇతర మార్గాల్లో (రాజకీయ విరాళాలు, కొనుగోళ్లు) తమ నల్లధనాన్ని తెల్లగా మార్చేసుకుని అయినా ఉండొచ్చు. ఒకవేళ ఇలా చేస్తే వీరికి పన్ను అధికారుల నుంచి తాఖీదులు అందుతాయి. భారీ పనిభారంతో సతమతం అవుతున్న ఐటీ శాఖ.. నిందితులను పట్టుకునేందుకు ఎన్నేళ్లయినా పట్టొచ్చు. అప్పటికీ జరిమానాలతో బయటపడే మార్గాలు ఉండనే ఉన్నాయి. ఆర్బీఐ అందుకే వెల్లడించడం లేదా? ఆర్బీఐ డీమోనిటైజేషన్ నివేదిక ప్రకారం చూస్తే... కేంద్రం కొండను తవ్వి పట్టిన నల్లధనం ఏ మేరకు ఉందో స్పష్టంగా తెలిసిపోతుంది. భారీగా నల్లధనం వ్యవస్థలో ఉందని... నకిలీ నోట్లు కూడా భారీస్థాయిలో ఇతర దేశాల నుంచి వస్తున్నాయంటూ ఊదరగొట్టిన మోదీ సర్కారు.. ఆర్బీఐ వద్దనున్న గణాంకాలను కావాలనే ఇన్నాళ్లూ తొక్కిపెట్టిందన్నది తాజా నివేదికతో బట్టబయలైంది. డీమోనిటైజేషన్ జరిగిన తొమ్మిది నెలలకుగాని ఈ గణాంకాలను ఆర్బీఐ వెల్లడించకపోవడానికి ఇదే ప్రధాన కారణంగా కనబడుతోంది. నిజానికి డీమోనిటైజేషన్ తర్వాత ప్రతీ బ్యాంకు శాఖ ఎంత మేర నల్లధనం స్వీకరించిందీ కోర్ బ్యాంకింగ్ వ్యవస్థలో గణాంకాలతో సహా నమోదు చేశాయి. అలాగే, నకిలీ నోట్లను గుర్తించే పరికరాలతో స్కాన్ చేయడం కూడా ఎప్పుడో పూర్తయింది. దీంతో ఎంత మేర వెనక్కి వచ్చిందన్న దానిపై ఆర్బీఐ, ప్రభుత్వం వద్ద అంచనాలు చాన్నాళ్ల క్రితమే ఉన్నాయన్నది సుస్పష్టం. అయినా వెనక్కి వచ్చిన నోట్లు అసలా, నకిలీయా లెక్కింపు పూర్తి కాలేదంటూ ఆర్బీఐ ఇన్నాళ్లూ కాలయాపన చేయడం ఆశ్చర్యాన్ని కలిగించేదే. ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ అయితే వచ్చే ఏడాది మార్చి నాటికి కూడా రద్దయిన నోట్ల లెక్కింపు పూర్తి కాదని ఇటీవలే ఒక సందర్భంలో అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. మరి ఆర్బీఐ నోట్ల లెక్కింపు పూర్తి కాకుండానే... ప్రధాని మోదీ స్వాతంత్య్రదినోత్సవ ప్రసంగంలో రూ.3 లక్షల కోట్ల మేర నల్లధనం వ్యవస్థలోకి రా లేదని ఎలా చెప్పారో ఆయనకే తెలియాలి మరి. నోట్ల రద్దుతో మిగిలిందేంటి..? కేంద్రంలోని మోదీ సర్కారు పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల నల్లధనం తుడిచిపెట్టుకుపోయిందో, లేదోగానీ... పన్ను చెల్లింపుదారుల సంఖ్య మాత్రం పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికితోడు రూ. 2 లక్షలకు మించి నగదు లావాదేవీలను రద్దు చేయడంతో పన్ను ఎగవేతలకు చెక్ పడుతుందంటున్నారు. కానీ, అసలు డీమోనిటైజేషన్ కార్యక్రమానికి కీలకమైన నల్లధనం ఏరివేత ప్రయోజనం మాత్రం సిద్ధించినట్టు కనిపించడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. -
మరోసారి కరెన్సీ రద్దుపై కేంద్రమంత్రి వివరణ!
రూ. 2వేల నోట్లు రద్దు చేస్తారని ప్రచారం తాజాగా స్పందించిన కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి గంగ్వర్ న్యూఢిల్లీ: కొత్తగా ప్రవేశపెట్టిన రూ. 2వేల నోట్లను త్వరలోనే రద్దు చేయబోతున్నారని సాగుతున్న ప్రచారంపై కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి సంతోష్‌కుమార్ గంగ్వర్ స్పందించారు. రూ. 2వేల నోట్లను రద్దు చేస్తున్న సమాచారమేదీ లేదని ఆయన వివరణ ఇచ్చారు. త్వరలోనే రూ. 200 నోట్లు చెలామణిలోకి రానున్నట్టు వెల్లడించారు. 'రూ. రెండువేల నోట్లను రద్దు చేసే వార్తలేవీ లేవు' అని గంగ్వర్ 'ఐఏఎన్ఎస్' వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. 'రూ. 2వేల నోట్ల ముద్రణను తగ్గించడం అనేది వేరే అంశం. కానీ, దీనిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ధ్రువీకరించాల్సి ఉంది. రూ. 2వేల నోట్లపై ఆర్బీఐ స్పష్టత ఇస్తుంది' అని ఆయన తెలిపారు. రూ. 2వేల నోట్ల ముద్రణను నిలిపివేసినట్టు ఇప్పటికే కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రూ. 2వేల నోట్లను రద్దు చేయబోతున్నారంటూ ప్రతిపక్షాలు ఈ నెల 26న పార్లమెంటులో లేవనెత్తిన సంగతి తెలిసిందే. అయినా, ఈ అంశంపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పందించకపోవడంతో ప్రతిపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. -
'బ్లాక్ మనీ ఎంతుందో మాకూ తెలియదు'
న్యూఢిల్లీ : బ్లాక్ మనీపై సర్జికల్ స్ట్రయిక్ ప్రకటిస్తూ ప్రభుత్వం హఠాత్తుగా పెద్ద నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. కానీ రూ.500, రూ.1000 రద్దు అనంతరం ఎంత మొత్తంలో బ్లాక్ మనీ డిపాజిట్ కాకుండా బయటనే ఆగిపోయిందో తెలియదని ప్రభుత్వం ప్రకటించింది. నోట్ల రద్దు కాలంలో బ్యాంకుల్లో డిపాజిట్ కాని బ్లాక్ మనీ మొత్తం ఎంతన్నది అధికారిక అంచనాలు ఏమీ లేవని ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ శుక్రవారం పార్లమెంట్ తెలిపారు. లోక్ సభకు రాతపూర్వక సమాధానంగా ఈ విషయాన్ని చెప్పారు. 2016 నవంబర్ 8 నుంచి 2016 డిసెంబర్ 30 మధ్యలో కాలంలో 23.87 లక్షల అకౌంట్లలో 5 లక్షల కోట్ల కంటే ఎక్కువ మొత్తంలో డిపాజిట్ అయినట్టు వెల్లడించారు. పాత, కొత్త కరెన్సీ నోట్ల డిపాజిట్ల వివరాలను వేరువేరుగా పొందపర్చలేదని పేర్కొన్నారు. అకౌంట్ బుక్స్ కరెక్ట్ చేయాలని ఏ బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీచేయలేదని మంత్రి చెప్పారు. 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం బ్యాంకులు తమ బ్యాలెన్స్ షీట్లను, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లను ప్రీపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. నోట్ల సప్లై విషయంలో ఏ బ్యాంకుకు తమ అసమర్థత చూపలేదని, నగదు ఇవ్వమని ఏ రోజు చెప్పన్నట్టు కూడా ఆర్బీఐ తెలిపినట్టు సంతోష్ కుమార్ గంగ్వార్ చెప్పారు. -
కేసులు పెరగడానికి ప్రధాన కారణమిదే!
న్యూఢిల్లీ: విశాఖపట్నంలోని రుణాల రికవరీ ట్రిబ్యునల్ వద్ద కేసుల జాబితా పెరగడానికి ప్రధాన కారణం బ్యాంకులు, ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూషన్స్ విపరీతంగా ఫిర్యాదులు దాఖలు చేయడమేనని ఆర్థికశాఖ సహాయమంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తెలిపారు. స్థూల నిరర్థక ఆస్తులు భారీగా పెరగడంతోనే బ్యాంకులు ఈ ఫిర్యాదులను దాఖలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. డీఆర్టీలో పేరుకుపోతున్న పెండింగ్ కేసులను వేగవంతంగా పరిష్కరించడానికి సెక్యురిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్సియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యురిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002లో ప్రభుత్వం సవరణలు చేపట్టిందన్నారు. రుణాల రికవరీకి సంబంధించి 2016 నవంబర్ 5న సెమినార్ నిర్వమించామని, ఆ సెమినార్లో అప్పీలెట్ ట్రిబ్యునల్స్, ప్రిసైడింగ్ ఆఫీసర్లు పాల్గొన్నట్టు ఆయన చెప్పారు. రికవరీ చట్టాల్లో సవరణలు, ఆర్థికంగా దివాలా కోడ్ 2016 వంటివాటిపై చర్చించామని పేర్కొన్నారు. విశాఖపట్నం డీఆర్టీలో ఏడాది ఏడాదికి కేసులు పెరగడంపై వైస్సార్సీపీ నేత విజయసాయి రెడ్డి మంగళవారం జరిగిన రాజ్యసభలో పలు ప్రశ్నలు సంధించారు. ఒకవేళ అదే నిజమైతే కేసులను సత్వరంగా పరిష్కరించడానికి డీఆర్టీ, మంత్రిత్వశాఖ తీసుకునే చర్యలపై ప్రశ్నించారు. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. -
మరింత ప్రమాదకర స్థాయికి మొండిబకాయిలు!
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగం బ్యాంకుల్లో మొండిబకాయిలు మరింత ప్రమాదకర స్థాయికి పెరిగినట్టు తెలిసింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికి బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు(ఎన్పీఏ)లు సుమారు రూ.80,000 కోట్లకు పెరిగినట్టు వెల్లడైంది. దీంతో సెప్టెంబర్ 30తో పబ్లిక్ రంగ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు రూ.6,30,323 కోట్లకు చేరాయి. జూన్ వరకు ఈ ఎన్పీఏలు రూ.5,50,346 కోట్లగా ఉన్నాయి. ఎన్పీఏలు అధికంగా పెరుగుతున్న ఇన్ఫ్రాక్ట్చర్, పవర్, రోడ్డు, టెక్స్టైల్, స్టీల్ వంటి వాటిలో రంగాల వారీగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు ఆర్థికశాఖ సహాయమంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ నేడు రాజ్యసభలో లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. మొండిబకాయిల కోసం ఆర్థిక దివాలా కోడ్(ఐబీసీ)-2016ను తీసుకొచ్చామని, దాంతోపాటు పలు చట్టాలకు సవరణలు తీసుకొస్తున్నట్టు చెప్పారు. అంతేకాక ఆర్బీఐ కూడా తగిన చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. కార్పొరేట్ రుణ పునర్నిర్మాణం, జాయింట్ లీడర్స్ ఫోరమ్ ఏర్పాటు, వ్యూహాత్మక రుణ పునర్నిర్మాణ పథకం, వంటి వాటిని ఎన్పీఏల నుంచి బయటపడేందుకు ఆర్బీఐ వాడుతుందని తెలిపారు. ఐరన్ అండ్ స్టీల్ రంగంలో ఇచ్చిన 2.80 లక్షల కోట్ల రుణాల్లో రూ.1.24 లక్షల కోట్లు మొండిబకాయిలుగా మారినట్టు గంగ్వార్ చెప్పారు. కార్పొరేట్‌కు సంబంధించిన ఏ రుణాన్ని కూడా ప్రభుత్వం మాఫీ చేయలేదని గంగ్వార్ వెల్లడించారు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు రుణాలను రైటాఫ్ చేస్తాయని, కానీ బ్రాంచు స్థాయిలో వాటి రికవరీ ఉంటుందని పునరుద్ఘాటించారు. -
బ్యాంకుల్లో రూ.8 లక్షల కోట్ల డిపాజిట్లు
వ్యవస్థలోకి రూ.3 లక్షల కోట్ల కొత్త నోట్లు : కేంద్రం న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో రూ.8 లక్షల కోట్ల డిపాజిట్లు నమోదయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోశ్ కుమార్ గంగ్వార్ తెలిపారు. వ్యవస్థలో రూ.500, రూ.1,000 నోట్ల రూపంలో మొత్తం రూ.14.5 కోట్లు చెలామణిలో ఉన్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు రూ.3 లక్షల కోట్ల విలువ మేర కొత్త నోట్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. దీంతో రద్దరుున నోట్లు, కొత్త నోట్ల మధ్య అంతరం ఉందన్నారు. ప్రతి రోజూ రూ.25వేల కోట్ల విలువ మేర కొత్త నోట్లను బ్యాంకుల ద్వారా వ్యవస్థలోకి తీసుకొస్తున్నామని చెప్పారు. ఈ మేరకు మంత్రి శనివారం ఇక్కడ ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేయడం వల్ల ప్రజలకు అసౌకర్యం ఏర్పడిందని, దేశవ్యాప్తంగా తక్కువ విలువ కలిగిన నోట్ల కొరత నెలకొందన్నారు. ప్రజలు రూ.2,000 వేల నోటుకు చిల్లర పొందలేని పరిస్థితి ఉందని అంగీకరించారు. రూ.500 నోట్లను మరింత సంఖ్యలో విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కొన్ని వారాల్లో సమస్య పరిష్కారం అవుతుందని గంగ్వార్ చెప్పారు. రూ.1,000 నోటును ఏ రూపంలో విడుదల చేయాలన్నది భవిష్యత్తులో నిర్ణరుుస్తామన్నారు. నల్ల ధనం నియంత్రణ దిశగా పెద్ద నోట్ల రద్దు తొలి నిర్ణయమని... ఈ విషయంలో భవిష్యత్తులో మరిన్ని కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. కష్టాలు నల్లధనం కలిగిన వారికే గానీ సామాన్యులు ఆందోళన చెందక్కర్లేదన్నారు. -
రూ.39 లక్షల విత్‌డ్రాయల్స్ మోసాలు
• 73 మంది ఎస్బీఐ కస్టమర్ల ఫిర్యాదు • రాజ్యసభకు వెల్లడించిన • ఆర్థిక శాఖ సహాయ మంత్రి న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6 లక్షల కార్డులను స్తంభింపజేసిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ పేర్కొన్నారు. ఈ ఏడాది నవంబర్ 4 వరకూ, తమ ఖాతాల నుంచి మోసపూరితంగా సొమ్ములు విత్‌డ్రా అయ్యాయని 73 మంది ఎస్బీఐ ఖాతాదారులు ఫిర్యాదు చేశారని రాజ్యసభకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో సంతోశ్ కుమార్ వెల్లడించారు. ఈ మోసపూరిత విత్‌డ్రాయల్స్ విలువ రూ.39 లక్షలని పేర్కొన్నారు. తమ డెబిట్ కార్డులు సురక్షితమేనని ఎస్బీఐ తెలిపిందని ఆయన వివరించారు. డేటా మోసాల కారణంగా లక్షలాది డెబిట్/ క్రెడిట్ కార్డులు ప్రభావితమయ్యాయని, ఖాతాదారులు తమ పిన్నంబర్లను మార్చుకోవాలని ఎస్బీఐతో సహా పలు బ్యాంకులు ఖాతాదారులకు ఆర్బీఐ సూచించిన విషయం తెలిసిందే. ఈ కార్డులకు సంబంధించిన డేటా మోసాల విషయమై ఆర్బీఐ దర్యాప్తు చేస్తోందని సంతోశ్ కుమార్ పేర్కొన్నారు. -
టాప్ 10 కార్పొరేట్ గ్రూప్‌ల రుణం 5.73 లక్షల కోట్లు!
రాజ్యసభలో కేంద్రం ప్రకటన... న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలకు ఈ ఏడాది మార్చి నాటికి టాప్ 10 కార్పొరేట్ గ్రూపులు చెల్లించాల్సిన రుణ మొత్తం రూ.5.73 లక్షల కోట్లు. ఆర్థికశాఖ సహాయమంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ రాజ్యసభలో మంగళవారం ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలిపారు. రూ.5 కోట్లకుపైగా రుణం ఉన్న కంపెనీల సమాచారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సమీకరించిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అయితే కొన్ని నిర్దిష్ట పరిస్థితులు మినహా రుణ సమాచారాన్ని వెల్లడించడానికి ఆర్బీఐ నిబంధనలు అంగీకరించడం లేదనీ వెల్లడించారు. ఎన్పీఏలకు మందగమనమూ కారణమే... మొండిబకాయిల సమస్య పెరగడానికి ఆర్థిక వ్యవస్థ మందగమన పరిస్థితులు కూడా కారణమని తెలిపారు. ఎన్పీఏలు అధికంగా ఉన్న మౌలిక, ఉక్కు, జౌళి వంటి రంగాలకు పునరుత్తేజానికి నిర్దిష్ట చర్యలు తీసుకోవడం ద్వారా సమస్య పరిష్కారంలో కొంత ముందడుగు వేయాలని ప్రభుత్వం వ్యూహ రచన చేస్తోందని తెలిపారు. అలాగే బ్యాంకింగ్ సత్వర రుణ వసూలు ప్రక్రియకు కొత్తగా ఆరు డెట్ రికవరీ ట్రిబ్యునళ్ల ఏర్పాటుకూ ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందన్నారు. చెల్లింపుల్లో రుణ గ్రహీత విఫలమైతే.. గ్యారెంటార్ మీదా చర్యలకు ఉపక్రమించాలని ప్రభుత్వం బ్యాంకర్లకు సూచించినట్లు తెలిపారు. రూ.59,547 కోట్ల రుణాల రద్దు... మరో ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ, రాజీసహా ప్రభుత్వ రంగ బ్యాంకులు 2015-16లో రూ.59,547 కోట్ల రుణాలను పద్దుల నుంచి తొలగించినట్లు (మాఫీ) పేర్కొన్నారు. ప్రైవేటు రంగం విషయంలో ఈ మొత్తం రూ.12,017 కోట్లుగా తెలిపారు. విదేశీ బ్యాంకుల విషయంలో ఈ పరిమాణం రూ.1,057 కోట్లు. ప్రముఖ అకౌంట్ హోల్డర్ల రైటాఫ్ వివరాలు అందలేదని ఆర్బీఐ తెలిపిందని మంత్రి వెల్లడించారు. కేవీఐసీ... బలహీన రుణ రికవరీ వ్యవస్థ: కాగ్ ఇదిలావుండగా, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) రుణ రికవరీ వ్యవస్థ, ప్రక్రియ అత్యంత బలహీనంగా ఉందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) పార్లమెంటుకు సమర్చించిన ఒక నివేదికలో తెలిపింది. రాబట్టుకోవాల్సిన మొత్తం రూ.551.46 కోట్లని సైతం వెల్లడించింది.