న్యూడిల్లీ : ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. నేడు కీలకమైన గ్రాట్యుటీ చెల్లింపు(సవరణ) బిల్లుకు పార్లమెంట్ ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లును గత వారమే లోకసభ ఆమోదించగా.. నేడు రాజ్యసభలోనూ ఆమోదించారు. విపక్షాల నిరసనల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా రాజ్యసభ సజావుగా సాగకపోవడంతో, ఈ బిల్లు ఆమోదం పెండింగ్‌లో పడుతూ వచ్చింది. నేడు దీనికి ఆమోదయోగ్యం లభించింది. నేడు కూడా రాజ్యసభలో నిరసనల వాతావరణం నెలకొన్నప్పటికీ నిరసనల మధ్యే ఈ బిల్లును కార్మిక మంత్రి సంతోష్ కుమార్ మూజువాణి ఓటు ద్వారా ఆమోదింప జేశారు. రాష్ట్రపతి ఆమోదం త్వరాత ఈ బిల్లు చట్టరూపం దాల్చనుంది.
ఈ బిల్లు ద్వారా ఉద్యోగులకు పన్ను రహిత గ్రాట్యుటీ ప్రస్తుతమున్న రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెరుగుతుంది. అంతేకాక అమల్లో ఉన్న 12 వారాల ప్రసూతి సెలవులకు బదులుగా.. ఎప్పటికప్పుడు కార్య నిర్వాహక ఉత్తర్వు జారీ చేయడం ద్వారా వీటిని పెంచుకునే హక్కును ప్రభుత్వానికి కల్పించనుంది. 7వ వేతన సంఘ అమలు అనంతరం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యుటీ మొత్తం రూ.20 లక్షలకు పెరిగిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment