Gratuity
-
ఉద్యోగంలోంచి తీసేస్తే..గ్రాట్యుటీ వస్తుందా? రాదా? ఏం చేయాలి?
నేను ఒక చిన్న కంపెనీలో ఆరేళ్లుగా సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేస్తున్నాను. ఒక నెల నోటీసు ఇచ్చి నిన్ను ఫైర్ చేస్తున్నాం, వెళ్ళిపొమ్మన్నారు. నేను గ్రాట్యుటీ పొందడానికి అర్హుడినా? – శ్రీకాంత్, విశాఖపట్నంపీ.ఎఫ్., గ్రాట్యుటీ, ఈ.ఎస్.ఐ. వంటివి సాంఘిక సంక్షేమ పథకాలు. వాటిద్వారా లభించే ఆర్థిక ప్రయోజనాలను ఎవరూ కాదనలేరు. అలా చేస్తే చట్టం అంగీకరించదు. గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం 1972 ప్రకారం, ఐదు సంవత్సరాలు ఒకే సంస్థలో పనిచేసిన ప్రతి ఒక్క ఉద్యోగికీ గ్రాట్యుటీ లభిస్తుంది. కొన్ని హై కోర్టులు ఇచ్చిన తీర్పులలో 4 సంవత్సరాల 7 నెలలు పూర్తి అయినా ఐదేళ్ళగా పరిగణించి గ్రాట్యుటీ ఇవ్వాలి అని పేర్కొనటం జరిగింది. ఒక సంవత్సరం వ్యవధిలో కనీసం 10 మంది పనిచేసిన సంస్థ లేదా షాపులకి కూడా గ్రాట్యుటీ చట్టం వర్తిస్తుంది. యాజమాన్యం మిమ్మల్ని ఉద్యోగంలో నుంచి తీసేసి, గ్రాట్యుటీ ఇవ్వను పొమ్మంటే, మీరు లేబర్ కమిషనర్ దగ్గర దరఖాస్తు చేసుకోవచ్చు. సదరు అధికారి మీ దరఖాస్తును పరిశీలించి, యాజమాన్య పక్షం వాదనలు కూడా విని తీర్పుని ఇస్తారు. సాధారణంగా పోస్టల్ డిపార్ట్మెంట్లోని పోస్ట్మాన్లకు వారి పదవీ విరమణ సమయంలో కొద్దిమొత్తం డబ్బులు ఇస్తారు. ఒక ΄ోస్ట్మాన్ వేసిన కేసులో వీరికి కూడా గ్రాట్యుటీ వర్తించాలి అని పూణేలోని లేబర్ కమిషనర్ ఆదేశించారు. గ్రాట్యుటీకి సంబంధించి ఒక కాలిక్యులేషన్ ఉంటుంది. అది 15 గీ బేసిక్ + డీఏగీ పనిచేసిన సంవత్సరాలు / 26. ఉదాహరణకి మీ బేసిక్ + డీ.ఏ నెలకి 50 వేలు, 10 సంవత్సరాలు పనిచేశారు అనుకోండి, అప్పుడు 15 గీ 50,000 గీ 10/26 = 2,88,461/– గ్రాట్యుటీ వస్తుంది.అలాగే, కనీసం 20 మంది పనిచేస్తున్న సంస్థ లేదా షాపులకి కూడా ్ర΄ావిడెంట్ ఫండ్ (పీ.ఎఫ్.) చట్టం వర్తిస్తుంది. ఒకవేళ మీ యాజమాన్యం పీ.ఎఫ్. మీ అకౌంట్లలోకి జమ చేయని పక్షంలో, పీ.ఎఫ్. కమిషనర్ ముందు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలా చేస్తే, పూర్వబకాయిలు సైతం కట్టించి మీకు ఇప్పిస్తారు. పీ.ఎఫ్. అలాగే గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలకి సగటు ఉద్యోగి లేబర్ పరిధిలోకి రానవసరం లేదు. అలాగే, కొన్ని సందర్భాలలో సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగస్తులకు సైతం లేబర్ చట్టాలు వర్తిస్తాయి. ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న కొంతమంది ఉద్యోగులను తొలగించినప్పుడు, హైదరాబాద్ లోని లేబర్ కోర్టు సదరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా లేబర్ చట్టం పరిధిలోకి వస్తారు అని తీర్పు ఇస్తూ, తొలగించిన ఉద్యోగులను తిరిగి విధులలోకి తీసుకోవాలి లేదా వారు కోల్పోయిన సమయానికి సరైన పరిహారం ఇవ్వాల్సిందే అని తీర్పునిచ్చింది. అయితే అందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు లేబర్ చట్టం కిందకి రాకపోవచ్చు. ఒకసారి లాయర్ సలహా పొందండి. – శ్రీకాంత్ చింతలహైకోర్టు న్యాయవాది -
బ్యాంకు వారికి.. ఆ హక్కు లేదు!
ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్ – గ్రాట్యుటీని బ్యాంకు వారు లోన్ బకాయిల రీత్యా జమ కట్టుకోవచ్చా?ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తున్న మాధవరావు (పేరు మార్చాము) అనే ఒక వ్యక్తి కోవిడ్ సమయంలో సేవలు నిర్వహిస్తూ కన్నుమూశారు. ఆయన మరణానంతరం తన వారసులకు –భార్యకు రావలసిన కుటుంబ పెన్షన్, గ్రాట్యుటీ వంటి అంతిమ ఆర్థిక ప్రయోజనాలు (టెర్మినల్ బెనిఫిట్స్) భార్య అకౌంట్లోకి వచ్చాయి. అయితే, అలా అకౌంట్ లోకి వచ్చిన వెంటనే సదరు బ్యాంకు అధికారులు పెన్షన్ మొత్తాన్ని మాధవ రావు బతికుండగా తీసుకున్న లోన్ బకాయి కింద జమ కట్టుకున్నారు. ఇదెక్కడి అన్యాయం అని ప్రశ్నించిన సదరు ఉద్యోగి భార్యను ‘ఇది మా హక్కు‘ మీ ఆయన మా బ్యాంకులో లోను తీసుకోవడమే కాక, తన టెర్మినల్ బెనిఫిట్స్ నుంచి కూడా రికవరీ చేసుకోవచ్చు అని మాకు రాసి ఇచ్చారు. అంతేకాక మీ భర్త పని చేసిన డిపార్ట్మెంట్ వారికి, మా బ్యాంకుకు మధ్య ఒక ఒప్పందం కూడా ఉంది. అందువలన మేము ఆ మొత్తాన్ని లోను కింద జమ కట్టుకున్నాము‘ అని చెప్పి ఆవిడని వెళ్ళిపొమ్మన్నారు. అప్పుడు ఇద్దరు మైనర్ పిల్లల తల్లి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది.వాదోపవాదాలు విన్న తర్వాత, పలు హైకోర్టులు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఆధారం చేసుకుని, మరీ ముఖ్యంగా సి.పి.సి లోని సెక్షన్ 60 (1) నిబంధనల ప్రకారం ‘‘టర్మినల్ బెనిఫిట్స్ లోనుంచి వచ్చిన నిధులను, ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్ (పీ.ఎఫ్) వంటి సామాజిక సంక్షేమ పథకాల ద్వారా సంక్రమించిన నిధులను ఏ బ్యాంకు అయినా, కోర్టు అయినా అలా తీసుకోవడానికి, అటాచ్మెంట్ చేయడానికి వీలు లేదు’’ అని తీర్పునిస్తూ ‘‘ఆ మహిళ అకౌంట్లో నుంచి లోను బకాయి పేరుతో బ్యాంకు వారు తీసేసుకున్న డబ్బులు మొత్తం తిరిగి ఆ మహిళకు చెల్లించవలసిందే’’ అని ఆదేశించింది. అప్పటికీ కూడా బ్యాంకు వారు తిరిగి చెల్లించక΄ోవడంతో గౌరవ హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు కూడా వేయాల్సి వచ్చింది. మొత్తానికి సదరు మహిళకి ఆ డబ్బులు మొత్తం బ్యాంకు వారు తిరిగి చెల్లించారు. బ్యాంకు వారికి లోన్ రికవరీ చేసే అధికారం వున్నప్పటికీ, చట్ట పరిధిలో ఉండి మాత్రమే రికవరీ చేయాల్సి వుంటుంది. లోన్ తీసుకునే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే... బ్యాంకు లోన్ తీసుకున్నెప్పుడు ‘లోన్ ఇన్సూరెన్స్’ అనే పథకాన్ని ఎంచుకోవాలి. అంటే, రుణ బకాయీలు ఉండగా లోన్ తీసుకున్న వ్యక్తి మరణించినా, ఏదైనా శాశ్వత వైకల్యం వంటివి కలిగి ఉపాధి కోల్పోయిన సమయాలలో వారు, వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడకుండా ఉండచ్చు. ఇన్సూరెన్స్ కంపెనీ వారు మీ బదులు లోన్ కడతారు. మీ కుటుంబ భవిష్యత్తు బాగుంటుంది. కొన్ని లోన్ఖాతాలకి లోన్ ఇన్సూరెన్స్ తప్పనిసరి అయినప్పటికీ, బ్యాంకు వారు కూడా లోన్ ఇన్సూరెన్స్ గురించి అందరికీ చెప్పి, ఖచ్చితంగా ఇన్సూరెన్స్ తీసుకునేలా చేస్తే మంచిది.– శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వకేట్ -
గ్రాట్యుటీ.. ఎవరికొస్తుంది.. ఎంతొస్తుంది?
ప్రైవేటు రంగంలో ప్రతి ఒక్కరికీ ఉద్యోగ భద్రత ఉంటుందని చెప్పలేం. అదే సమయంలో ఉద్యోగి తన వ్యక్తిగత, వృత్తిపరమైన అవసరాల దృష్ట్యా ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారిపోవడం సహజంగా చూస్తుంటాం. కారణాలు ఏవైనా కానీ ఉద్యోగం వీడితే వచ్చే ప్రయోజనాల గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి. ఉద్యోగం నుంచి వైదొలగినప్పుడు వచ్చే ప్రయోజనాల్లో గ్రాట్యుటీ కీలకమైనది. ఉద్యోగి పనిచేసిన కాలంపై ఇది ఆధారపడి ఉంటుంది. గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం 1972 ఇందుకు ప్రామాణికం. చట్టంలోని నిబంధనలపై అవగాహన కల్పించే కథనమే ఇది.గ్రాట్యుటీ అంటే..? ఉద్యోగి సేవలను గుర్తిస్తూ సంస్థ అందించే ఆర్థిక ప్రయోజనమే గ్యాట్యుటీ. ఎన్నో ఏళ్లుగా సంస్థ అభ్యున్నతి కోసం సేవలు అందించే ఉద్యోగుల పట్ల చూపించే కృతజ్ఞత. ఇది వేతనంలో భాగం కాదు. ప్రతి ఒక్కరూ దీనికి అర్హులే. కానీ, ఇందుకు అర్హత సాధించాలంటే గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం, 1972లో నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగి సేవలు ఉండాలి. కనీసం ఐదేళ్ల సర్వీస్ (పని చేసిన కాలం) పూర్తి చేసుకున్న వారికే దీన్ని పొందే అర్హత లభిస్తుంది. ఎన్నో రంగాలకు ఈ చట్టం అమలవుతోంది. ప్రభుత్వ విభాగాలు, డిఫెన్స్, స్థానిక సంస్థల ఉద్యోగులు, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు దీని పరిధిలోకి వస్తారు. ఎన్నేళ్లు పనిచేయాలి?గడిచిన ఏడాది కాలం పాటు కనీసం 10 మంది ఉద్యోగులు కలిగిన సంస్థలకు గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం వర్తిస్తుంది. ఆయా సంస్థలు తమ ఉద్యోగులకు నిబంధనలకు అనుగుణంగా గ్రాట్యుటీని అందించాల్సి ఉంటుంది. మైనింగ్ విధుల్లో ఉన్న ఉద్యోగులకు కనీసం 190 పని దినాలు, నాన్ మైనింగ్ విధుల్లోని వారికి 240 పనిదినాలు ఏడాది కింద పరిగణిస్తారు. కనీసం ఐదేళ్ల పాటు అంతరాయం లేకుండా సేవలు అందించిన ఉద్యోగులు అందరూ గ్రాట్యుటీకి అర్హులు. సమ్మెలు, లాకౌట్లు, ప్రమాదాలు, సెలవులు, తాత్కాలిక తొలగింపు వల్ల గైర్హాజరుకు మినహాయింపులు ఉంటాయి. ఐదేళ్ల సర్వీస్ పూర్తి కాకముందే సంస్థ తొలగించిన సందర్భంలోనూ ఉద్యోగికి గ్రాట్యుటీ చెల్లించాల్సిందే. వారంలో ఆరు పనిదినాలు అమలు చేసే కంపెనీల్లో 4 ఏళ్ల 240 రోజులు పనిచేసినా గ్రాట్యుటీకి అర్హత లభిస్తుంది. వారంలో ఐదు రోజుల పనిదినాలున్న కంపెనీల్లోని వారు 4 ఏళ్ల 190 రోజులు పనిచేస్తే అర్హులు. కొన్ని రంగాల్లోని వారికి ఈ కనీస పదవీ కాలం భిన్నంగా ఉంటుంది. న్యూస్ పేపర్ ఎంప్లాయీస్ అండ్ మిస్లేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ కింద పనిచేసే వర్కింగ్ జరల్నిస్టులకు పదేళ్ల సర్వీస్ ఉంటేనే గ్రాట్యుటీకి అర్హత లభిస్తుంది. ఉద్యోగి మరణించినా లేదా వైకల్యం కారణంగా విధుల నుంచి తొలగించినప్పుడు పనిచేసిన కాలంతో సంబంధం లేకుండా గ్రాట్యుటీ చెల్లించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. గ్రాట్యుటీ అనేది కేవలం పదవీ విరమణ వయసుకు వచ్చినప్పుడే కాకుండా.. స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నప్పుడు, ఉద్యోగి తప్పిదం లేకుండా తొలగించినప్పుడు, రాజీనామా చేసినప్పుడు ఇవ్వాల్సి ఉంటుందని లెక్స్లెవర్ సర్వీసెస్ డైరెక్టర్ హర్షిత అగర్వాల్ శర్మ తెలిపారు.పరిమితి గ్రాట్యుటీ గరిష్ట పరిమితి రూ.20 లక్షలు. నిబంధనల ప్రకారం సంస్థలు గరిష్టంగా ఇంతకు మించి ఇవ్వక్కర్లేదు. రూ.20లక్షలు మించితే అది ఎక్స్‌గ్రేషియా కిందకు వస్తుంది. ఎక్స్‌గ్రేషియా ఎంత ఇవ్వాలన్నది సంస్థల అభీష్టమే. ఇంత మేర ఇవ్వాలని నిబంధనలు చెప్పడం లేదు. గ్రాట్యుటీ లెక్కింపు చివరి నెల వేతనంలో మూల వేతనం, డీఏ ఎంతో తెలుసుకోవాలి. ఇలా ఒక ఏడాదికి 15 రోజుల వేతనం గ్రాట్యుటీ కింద వస్తుంది. మొత్తం పనిచేసిన సంవత్సరాలు ఇంటూ 15 రోజులు ఇంటూ చివరిగా అందుకున్న మూల వేతనం, డీఏ డివైడ్ 26(నెలలో పనిచేసిన రోజులు) సూత్రం అమలవుతుంది. ఆరు నెలలు దాటిన కాలాన్ని పూర్తి ఏడాదిగా పరిగణిస్తారు. ఉదాహరణకు ఎక్స్ అనే వ్యక్తి 12 సంవత్సరాల పాటు ఒక కంపెనీలో పనిచేసినట్టు అనుకుందాం. చివరిగా అందుకున్న మూల వేతనం, డీఏ కలిపి రూ.75,000. దీంతో ఎక్స్‌కు వచ్చే మొత్తం గ్రాట్యుటీ రూ.5,19,230. గ్రాట్యుటీ చట్టం పరిధిలోకి రాని వారికి ఇచ్చే గ్రాట్యుటీ ఫార్ములా కొంత భిన్నం. ఏడాదిలో 15 రోజులు ఇంటూ చివరి నెలలో మూల వేతనం, డీఏ ఇంటూ పనిచేసిన సంవత్సరాలు డివైడ్ 30(నెలలో పనిచేసిన రోజులు). పూర్తి ఏడాది పాటు పనిచేసిన కాలాన్నే వీరికి ఏడాది కింద పరిగణిస్తారు. దీని ప్రకారం ఎక్స్ అనే వ్యక్తి ఒక సంస్థలో 12 ఏళ్లు పనిచేసి, చివరి నెలలో మూలవేతనం, డీఏ కింద రూ.75,000 తీసుకున్నారని అనుకుంటే.. వచ్చే గ్రాట్యుటీ రూ.4,50,000. ఆలస్యం అయితే విధుల నుంచి వైదొలగిన 30 రోజుల్లోపు గ్రాట్యుటీ చెల్లించాలి. ఇంతకుమించి జాప్యం చేస్తే ఆ మొత్తంపై వడ్డీ కూడా చెల్లించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఉద్యోగికి గ్రాట్యుటీ ప్రయోజనం అన్నది పనిచేసిన కాలం ఆధారంగానే అర్హత ఉండాలి కానీ, రిటైర్మెంట్ వయసు ఆధారం కాకూడదని ఇటీవలే అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. ‘‘60 ఏళ్లకు రిటైర్మెంట్ తీసుకుంటేనే గ్రాట్యుటీ, లేకపోతే అర్హత లేదన్నది సరైనది కాదు. ఒక ఉద్యోగి ఎన్ని సంవత్సరాల పాటు పనిచేశాడన్న దాని ఆధారంగా గ్రాట్యుటీ హక్కు లభిస్తుంది’’అని అలహాబాద్ సింగిల్ జడ్జి ధర్మాసనం ఓ కేసులో భాగంగా తీర్పు జారీ చేసింది.పన్ను బాధ్యత గ్రాట్యుటీపై పన్ను విషయంలో ప్రభుత్వ లేదా ప్రైవేటు రంగ ఉద్యోగులకు నిబంధనల్లో వ్యత్యాసం ఉంది. ప్రభుత్వ ఉద్యోగి ఎవరికైనా (కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థల) సరే గ్రాట్యుటీ ఎంత అందుకున్నా పన్ను లేదు. ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న వారికి రూ.20 లక్షలు లేదా, చివరి 15 రోజుల వేతనాన్ని పనిచేసిన సంతవ్సరాలతో హెచ్చించినప్పుడు వచ్చే మొత్తం, వాస్తవంగా అందుకున్న గ్రాట్యుటీ.. వీటిల్లో ఏది తక్కువ అయితే ఆ మొత్తానికి పన్ను మినహాయింపు ఉంటుంది. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 10(10) కిందకు గ్రాట్యుటీ వస్తుంది. గతంలో రూ.10 లక్షల వరకు గ్రాట్యుటీపై పన్ను ఉండేది కాదు. ఈ పరిమితిని మోదీ సర్కారు రూ.20 లక్షలకు పెంచింది.ఇవి తెలుసుకోవాలి.. » పనిచేసిన కాలం ఆరు నెలలు దాటి ఒక్క రోజు ఉన్నా దాన్ని పూర్తి సంవత్సరం కింద గ్రాట్యుటీ చెల్లింపులకు పరిగణనలోకి తీసుకుంటారు. » ఉద్యోగి దుష్ప్రవర్తన కారణంగా సంస్థ తొలగించినప్పుడు గ్రాట్యుటీ ఇవ్వక్కర్లేదు. » ఉద్యోగి మరణించిన సందర్భాల్లో నామినీ లేదా వారసులకు గ్రాట్యుటీ చెల్లిస్తారు. » సంస్థలు దివాలా తీసినప్పటికీ గ్రాట్యుటీ చెల్లించాల్సిన బాధ్యత వాటిపై ఉంటుంది. » నోటీస్ పీరియడ్ కూడా గ్రాట్యుటీ లెక్కింపు పరిధిలోకి వస్తుంది. » మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకుంటే గ్రాట్యుటీకి అర్హత కల్పించాలన్న డిమాండ్ కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉంది. -
ఆర్టీసీలో గ్రాట్యుటీ గల్లంతు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ చరిత్రలో తొలిసారి గ్రాట్యుటీకి గండిపడింది. పదవీవిరమణ పొందిన ఉద్యోగుల హక్కుగా పొందే ఈ గ్రాట్యుటీని ఆర్థిక ఇబ్బందులను కారణంగా చూపి నిలిపేసింది. గతంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినా గ్రాట్యుటీని మాత్రం ఆపలేదు. గత జనవరి నుంచి వీటి చెల్లింపుల్లో ప్రతిష్టంభన నెలకొంది. డిసెంబర్లో పదవీ విరమణ పొందినవారికి కాస్తా ఆలస్యంగా చెల్లించారు. జనవరి నుంచి రిటైర్ అవుతున్నవారికి చెల్లించే విషయంలో ఆర్టీసీ వెనకాముందు ఆడుతోంది. పదవీవిరమణ పొందిన ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీలను వెంటనే చెల్లించాల్సి ఉంటుంది. వారు రిటైర్ అయ్యే సమయానికల్లా సెటిల్మెంట్లను సిద్ధం చేస్తారు. కానీ, ఇప్పుడు మొదటిసారి గతి తప్పింది. ఒక్కో ఉద్యోగికి వారి బేసిక్ ఆధారంగా రూ.8 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు గ్రాట్యుటీ అందుతుంది. ఆర్టీసీలో ప్రస్తుతం పింఛన్ విధానం లేనందున గ్రాట్యుటీ పెద్ద ఊరట, దాన్ని భవిష్యత్తు ఆసరాకు వీలుగా డిపాజిట్ చేసుకునేవాళ్లు, ఇంటి ప్రధాన అవసరాలకు వాడేవారు ఎక్కువగా ఉంటారు. అలాంటిది ఇప్పుడు గ్రాట్యుటీ నిలిచిపోవటం, ఎప్పుడు విడుదలవుతుందో తెలియని అయోమయం నెలకొనటంతో రిటైర్ అవుతున్న ఉద్యోగులలో తీవ్ర ఆవేదన నెలకొంది. తక్కువ వేతనాలుండే శ్రామిక్, డ్రైవర్, కండక్టర్ కుటుంబాల్లో ఇప్పుడు గందరగోళం నెలకొంది. చివరి నెల వేతనం కూడా గల్లంతేనా.. ఆర్టీసీలో తొలి నుంచి రిటైర్ అయ్యేచివరి నెలవేతనం ఆలస్యంగా చెల్లిస్తూ వచ్చే పద్ధతి ఉంది. వారు జాయిన్ అయినప్పుడు నెల మధ్యలోనో, చివరలోనో విధుల్లో చేరినప్పుడు ఆ నెల మొత్తానికి అడ్వాన్సుగా పూర్తి మొత్తం చెల్లిస్తున్నారు. రిటైర్ అయ్యే చివరి నెల వేతనం నుంచి నాటి అడ్వాన్స్ మొత్తాన్ని సర్దుబాటు చేస్తారు. ఈ లెక్కలు చూసేందుకు సమయం పట్టనున్నందున ఓ నెల ఆలస్యంగా చివరి వేతనం చెల్లించేవారు. ఇప్పుడు గ్రాట్యుటీతోపాటు ఆ నెల వేతనం చెల్లింపునకు కూడా ఆటంకం ఏర్పడింది. వెరసి ఇటు గ్రాట్యుటీ రాక, చివరి వేతనం అందక ఉద్యోగులు తీవ్ర నిరాశతో ఇళ్లకు వెళ్తున్నారు. రిటైర్మెంట్ ఫంక్షన్‌రోజు కుటుంబసభ్యులను పిలిపించి సన్మానం చేసి సెటిల్మెంట్ల తాలూకు డబ్బు అందజేసి పంపించేరోజులు పోయి, ఖాళీ చేతులతో పంపటం ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆవేదనకు కారణమవుతోంది. ఆర్ఈఎంఎస్ సిబ్బందిలో అవగాహన లేక.. ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో వైద్యం ఉచితంగా అందుతోంది. రిటైర్ అవగానే ఆ వెసులుబాటు నిలిచిపోతుంది. అప్పుడు సిబ్బంది హోదా ఆధారంగా రూ.20 వేల నుంచి రూ.35 వేల వరకు నిర్ధారిత మొత్తాన్ని వసూలు చేసుకుని ‘రిటైర్డ్ ఎంప్లాయీస్ మెడికల్ బెనిఫిట్ స్కీం(ఆర్ఈఎంఎస్)’లో సభ్యత్వం కలి్పస్తారు. అప్పుడు వారికి తార్నాక ఆసుపత్రి ద్వారా మెరుగైన చికిత్సకు వేరే ప్రైవేటు ఆసుపత్రికి రిఫర్ చేస్తే రూ.4 లక్షల వరకు బిల్లు కవర్ అవుతుంది. ఆర్ఈఎంఎస్ సభ్యత్వం కోసం ఉద్యోగులు చెల్లించాల్సిన మొత్తాన్ని గ్రాట్యుటీ నుంచి మినహాయిస్తూ వస్తున్నారు. ఇప్పుడు గ్రాట్యుటీ నిలిచిపోవటంతో కొన్ని డిపోల్లో సంబంధిత సెక్షన్ ఉద్యోగులు ఆర్ఈఎంఎస్ సభ్యత్వం కోసం ఏర్పాట్లు చేయటం లేదు. కొన్నిచోట్ల మాత్రం, నిర్ధారిత మొత్తాన్ని తగ్గించి గ్రాట్యుటీ సెటిల్మెంట్ కోసం ఉన్నతాధికారులకు ఫైల్ పంపుతున్నారు. దీంతో కొన్ని డిపోల్లో రిటైర్ అయినవారికి ఆర్‌ఈఎంస్ సభ్యత్వం లభించటం లేదు. ఏప్రిల్‌లో శుభకార్యాలు లేకపోవటంతో బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్య కూడా తగ్గించి ఫలితంగా రోజువారీ టికెట్ ఆదాయం రూ.14.50 కోట్లు రావాల్సి ఉండగా, రూ.12 కోట్ల వద్దే ఆగిపోతోంది. ఇలాంటి తరుణంలో ఈ నెల తాలూకు జీతాల చెల్లింపు ఎలా అన్న విషయంలో ఆర్టీసీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జీతాలకే దిక్కులేని తరుణంలో గ్రాట్యుటీ సెటిల్మెంట్ కష్టంగా మారింది. -
‘నేను తీసుకున్న ఇంటి రుణాన్ని ఇలా చెల్లించవచ్చా’?
గ్రాట్యుటీతో గృహ రుణం తీర్చేయడం సరైనదేనా? నాకు గృహ రుణం ఉంది. మరో 5 ఏళ్లకు ఇది పూర్తవుతుంది. గ్రాట్యుటీ రూపంలో పెద్ద మొత్తంలో రానుంది. ఈ గ్రాట్యుటీతో గృహ రుణాన్ని తీర్చివేయాలా లేక ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవాలా? –క్రిష్ రుణాలలో గృహరుణం ఒక్క దానిని కొనసాగించుకోవచ్చు. అధిక వడ్డీ రేటు ఉండే ఇతర రుణాలకు దూరంగా ఉండాలి. ఒకవేళ ఇతర రుణాలు తీసుకుని ఉంటే, అప్పుడు వాటిని ముందుగా తీర్చేయడాన్ని పరిశీలించొచ్చు. గృహ రుణం కొనసాగించడం వల్ల నష్టం లేదనడానికి పలు కారణాలు ఉన్నాయి. ఒకటి అద్దె రూపంలో కొంత ఆదా చేస్తుంటారు. రుణంపై వడ్డీ చెల్లింపులకు పన్ను ప్రయోజనం ఉంది. పైగా చాలా తక్కువ రేటుకు వచ్చే రుణం ఇది. గృహ రుణం రేటుతో పోలిస్తే పెట్టుబడులపై దీర్ఘకాలంలో అధిక రాబడి వస్తుంది. కనుక గృహ రుణం లాభదాయకమే. భవిష్యత్తులో వచ్చే ఆదాయం గురించి ఆందోళన చెందుతుంటే లేదా గృహ రుణం చెల్లించడం ద్వారా ప్రశాంతంగా ఉంటానని అనుకుంటే గ్రాట్యుటీ ద్వారా వచ్చే మొత్తంతో ఆ పనిచేయవచ్చు. అలా కాకుండా గృహ రుణాన్ని భారంగా భావించకపోతే, భవిష్యత్తు ఆదాయంపై నమ్మకం ఉంటే గృహ రుణాన్ని కొనసాగించుకోవచ్చు. అంతర్గతంగా ఎంతో విలువ దాగి ఉన్న స్టాక్స్‌ను గుర్తించడం ఎలా?– కపిల్ వాస్తవ విలువ కంటే తక్కువలో ట్రేడ్ అవుతున్న (అండర్ వ్యాల్యూడ్) స్టాక్‌ను గుర్తించం అన్నది ఆర్ట్, సైన్స్‌తో కూడుకున్నది. డిస్కౌంటింగ్ సూత్రాన్ని ఇక్కడ అమలు చేసి చూడాల్సి ఉంటుంది. అంటే వచ్చే ఐదు, పదేళ్ల కాలంలో కంపెనీ ఆదాయాలు ఏ మేరకు వృద్ధి చెందుతాయో చూడాలి. అలాగే, యాజమాన్యం ఎంత ఉత్తమమైనది? అన్నది కూడా చూడాలి. కంపెనీ నుంచి నిధులను మింగేస్తారా? విశ్వసనీయత కలిగిన వారేనా? అలాగే, ఆ కంపెనీ పనిచేస్తున్న రంగంలో మంచి వృద్ధికి అవకాశం ఉందా? భవిష్యత్తు ఉన్నదేనా? అవకాశాలను అనుకూలంగా మార్చుకోగలదా? వీటిని విశ్లేషించుకోవాలి. అలాగే, మీకు మంచిగా కనిపించిన కంపెనీల గురించి ఎన్నో ప్రతికూల వ్యాఖ్యానాలు వినిపిస్తుంటాయి. వాటన్నింటినీ తట్టుకుని పెట్టుబడులను కొనసాగించే బలం కూడా కావాలి. చదవండి👉 ధర ఎంతైనా తగ్గేదేలే..హైదరాబాద్‌లో మాకు ఆ ఏరియా ఇళ్లే కావాలి! -
అంగన్వాడీలు గ్రాట్యుటీకి అర్హులే: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: అంగన్వాడీ కేంద్రాల వర్కర్లు, సిబ్బంది గ్రాట్యుటీకి అర్హులేనని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. ‘‘అంగన్వాడీ కేంద్రాలు చట్టబద్ధమైన విధులు నిర్వహిస్తూ ప్రభుత్వంలో భాగంగా మారాయి. గ్రాట్యుటీ చట్టం–1972 వాటికీ వర్తిస్తుంది’’ అని జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ అభయ్ ఎస్ ఒకాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. చిన్నారులు, గర్భిణులు, పాలిచ్చే తల్లుల సంక్షేమం వంటి ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాల్లో భాగస్వాములయ్యే అంగన్వాడీ సిబ్బందిని పార్ట్‌టైం వర్కర్లుగా భావించలేమని పేర్కొంది. క్లిక్: వీసీల నియామకం రాష్ట్ర హక్కే: తమిళనాడు -
ఈ సారు ఎంత మంచోడో.. కూడబెట్టిన 40 లక్షలు ఇచ్చేశాడు
ప్రపంచంలో బాధలను ఎవరూ తగ్గించలేరు, కానీ మనం చేయగలిగినంత మంచి చేయాలి.. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడి నోటి నుంచి వెలువడిన ఆణిముత్యం లాంటి మాట ఇది. మాటే కాదు.. ఆయన మనసూ స్వచ్ఛమే. విజయ్ కుమార్ చాన్సోరియా.. మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలోని ఖాందియాలో ప్రభుత్వ టీచర్‌గా పని చేశారు. 39 సంవత్సరాల సర్వీస్ తర్వాత ఈ మధ్యే ఆయన సర్వీస్ నుంచి దిగిపోయారు. సోమవారం ఆయన ఉద్యోగ విరమణ సన్మానం జరిగింది. ఆ సన్మాన కార్యక్రమంలో పీఎఫ్, సేవింగ్స్ ద్వారా వచ్చిన 40 లక్షల రూపాయల్ని పేద విద్యార్థులకు ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారాయన. భార్యతో విజయ్ కుమార్ సార్ ఉపాధ్యాయుడిగా వేలాదిమందిని తీర్చిదిద్దినప్పటికీ అది నాకు సంతృప్తినివ్వలేదు. వారి కోసం ఇంకేదో చేయాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా అని చెప్పారాయన. రిక్షా తొక్కి, పాలు అమ్మి చదువుకున్నా. నాలాగే ఎంతో మంది ఇప్పటికీ కష్టపడుతున్నారు. చదువంటే ఆసక్తి ఉన్న పేద విద్యార్థులకు నాలాంటి కష్టం రాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నా అని ప్రకటించగానే.. అంతా చప్పట్లతో ఆయన్ని స్వాగతించారు. అంతమాత్రాన ఆయనకు భార్యాపిల్లలు లేరనుకోవడం పొరపాటే. అక్కడ చప్పట్లు కొట్టిన వాళ్లలో ఆయన భార్యా, కూతురూ ఉన్నారు కూడా. విజయ్ కుమార్ భార్య బాగానే చదువుకుంది. ఆయన కూతురికి ఆల్రెడీ పెళ్లైంది. ఇద్దరు కొడుకులూ ఉద్యోగాలు చేస్తూ మంచిగానే సెటిల్ అయ్యారు. వాళ్ల అనుమతితోనే తాను ఇన్నాళ్లుగా దాచుకున్న పీఎఫ్, గ్రాట్యుటీ నిధులను పేద విద్యార్థులకు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు విజయ్ కుమార్ చాన్సోరియా. చదవండి: కారడవిలో అడవి బిడ్డల భవిష్యత్తు కోసం 14కి.మీ. నడక! -
ఉద్యోగులకు తీపికబురు
సాక్షి, న్యూఢిల్లీ : సంఘటిత రంగంలోని లక్షలాది ఉద్యోగులు, కార్మికులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించనుంది. గ్రాట్యుటీ కోరేందుకు అర్హమైన ఉద్యోగుల సర్వీసును ప్రస్తుతమున్న ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించే ప్రతిపాదనను ఈ ఏడాది చివరి నాటికి ప్రభుత్వం ఆమోదించే అవకాశం ఉంది. కాంట్రాక్టు ఉద్యోగులకు సైతం దీన్ని వర్తింపచేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గ్రాట్యుటీ చెల్లింపు చట్టం 1972లో ఇందుకు అనుగుణమైన సవరణలు చేపట్టాలనే ప్రతిపాదన ప్రభుత్వం ముందుకొచ్చింది. గ్రాట్యుటీ గడువును కుదిస్తే ఏర్పడే పర్యవసానాలపై పరిశ్రమ సంస్థల నుంచి కార్మిక మంత్రిత్వ శాఖ ఫీడ్‌బ్యాక్‌ను కోరినట్టు సమాచారం. పరిశ్రమ ప్రతినిధులు, నిపుణులతో సంప్రదింపులు జరిపిన మీదట ఈ ప్రతిపాదనను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ముందుంచుతారు. ఇక ప్రస్తుతం కాంట్రాక్టు కార్మికులకు గ్రాట్యుటీ కోరే అవకాశం లేకపోవగడంతో ఇక వారికీ దీన్ని వర్తింపచేసేందుకు ప్రభుత్వం అనుమతిస్తుందని భావిస్తున్నారు. గ్రాట్యుటీ చట్టం ప్రకారం పది మంది అంతకు మించి ఉద్యోగులున్న ఏ సంస్థ అయినా ఐదేళ్లకు మించి సంస్థలో పనిచేస్తే వారు పదవీవిరమణ లేదా వైదొలిగే సమయంలో వారు పనిచేసిన సంవత్సరాల ప్రాతిపదికన గ్రాట్యుటీ చెల్లించాల్సి ఉంటుంది. కాగా గ్రాట్యుటీ కోరే సర్వీసు అర్హతను ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించాలనే ప్రతిపాదన ముందుకొచ్చిన క్రమంలో కాలపరిమితిని మూడేళ్ల కన్నా మరింత తగ్గించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
గ్రాట్యుటీకి ఓకే
సాక్షి, హైదరాబాద్ : కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్)లో ఉన్న ఉద్యోగులకు శుభవార్త. సీపీఎస్‌లో ఉన్న ఉద్యోగులకు గ్రాట్యుటీ వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్మెంట్ గ్రాట్యుటీ, డెత్ గ్రాట్యుటీని వర్తింపజేసింది. 2004 సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారందరికీ గ్రాట్యుటీ ప్రయోజనాలు కల్పిస్తూ రాష్ట్ర ఆర్థిక ముఖ్య కార్యదర్శి ఎన్.శివశంకర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2004 సెప్టెంబర్ నుంచి ఈ గ్రాట్యుటీ చెల్లింపులు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. రాష్ట్రంలో మొత్తం 1.26 లక్షల మంది ఉద్యోగులు సీపీఎస్ పరిధిలో ఉన్నారు. వీరిలో ఇప్పటికే 998 మంది పదవీ విరమణ పొందగా, 263 మంది ఉద్యోగులు మరణించారు. తాజా ఉత్తర్వుల ప్రకారం ఈ కుటుంబాలన్నీ రిటైర్మెంట్ గ్రాట్యుటీ, డెత్ గ్రాట్యుటీ ప్రయోజనాలు పొందనున్నాయి. పాత పెన్షన్ విధానంలో ఉన్న ఉద్యోగులకు ప్రస్తుతం గ్రాట్యుటీ చెల్లింపు అమల్లో ఉంది. ప్రస్తుతం పదవీ విరమణ చేసినప్పుడు లేదా చనిపోయిన సందర్భంలో గరిష్టంగా రూ.12 లక్షలకు మించకుండా గ్రాట్యుటీ చెల్లిస్తోంది. అయితే సీపీఎస్‌లో ఉన్న ఉద్యోగులకు మాత్రం ఇప్పటివరకు గ్రాట్యుటీ లేకపోవడంతో ఆందోళన వ్యక్తమైంది. సీపీఎస్ రద్దు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సీపీఎస్ ఉద్యోగులకు ఈ గ్రాట్యుటీ ప్రయోజనాలను విస్తరించడంతో కొంతమేరకు ఊరట లభించనుంది. గత ఏడాది ఆగస్టులోనే సీపీఎస్‌లో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గ్రాట్యుటీని వర్తింపజేసింది. అన్ని రాష్ట్రాలు అక్కడి పరిస్థితులకు అనుగుణంగా గ్రాట్యుటీ చెల్లించే అవకాశాలను పరిశీలించాలని సూచించింది. కేంద్రం సూచన మేరకు ఇప్పటికే ఏపీ, హర్యానాతో పాటు పలు రాష్ట్రాలు సీపీఎస్‌లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యుటీని వర్తింపజేశాయి. రాష్ట్రంలోనూ గ్రాట్యుటీ చెల్లిస్తామని ఇటీవలే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఉత్తర్వులు వెలువడ్డాయి. -
20 లక్షల గ్రాట్యుటీకి పన్ను నో
న్యూఢిల్లీ: ఉద్యోగుల గ్రాట్యుటీపై రూ. 20 లక్షల వరకూ పన్ను మినహాయింపునిచ్చే గ్రాట్యుటీ బిల్లు(సవరణ)ను పార్లమెంటు ఆమోదించింది. ఈ బిల్లును కేంద్ర కార్మిక మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్ గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టగా ఎలాంటి చర్చా లేకుండా మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. మార్చి 15నే ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి సంతకం అనంతరం బిల్లులోని సవరణలు అధికారికంగా అమల్లోకి వస్తాయి. కేంద్ర ఉద్యోగులకు ఏడో వేతనసంఘం సిఫార్సుల అమలు నేపథ్యంలో.. పన్ను భారం లేని గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచడంతో తాజా మార్పులు అవసరమయ్యాయి. కేంద్ర సివిల్ సర్వీస్ నిబంధనలు(1972) వర్తించని ప్రైవేటు రంగంలోని సిబ్బందికి ఈ సవరణ లతో ప్రయోజనం చేకూరనుంది. చివరి నెల జీతంలోని మూల వేతనాన్ని పరిగణనలోకి తీసుకుని సంస్థలో పనిచేసిన కాలం ఆధారంగా వారి గ్రాట్యుటీని లెక్కిస్తారు. బిల్లులోని ముఖ్యాంశాలు ఉద్యోగుల గ్రాట్యుటీపై గరిష్ట పన్ను పరిమితిని రూ.10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచడానికి బిల్లు ప్రభుత్వానికి అవకాశం కల్పిస్తుంది. ఇకపై గ్రాట్యుటీ పరిమితిలో అధికారిక ఉత్తర్వుల ద్వారానే కేంద్రం మార్పులు చేర్పులు చేయవచ్చు. ఎన్ని ప్రసూతి సెలవుల్ని సర్వీసులో భాగంగా పరిగణించాలన్న అధికారం కూడా ప్రభుత్వానికి లభిస్తుంది. ప్రసూతి సెలవుల కాలాన్ని కూడా అధికారిక ఉత్తర్వుల ద్వారానే కేంద్రం నిర్ణయిస్తుంది. ప్రసూతి సెలవు చట్టాన్ని గతేడాది సవరించి గరిష్ట సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పెంచారు. దీంతో గ్రాట్యుటీ చెల్లింపు చట్టంలో ప్రసూతి సెలవులపైనా సవరణలు చేశారు. -
గ్రాట్యుటీపై గుడ్‌న్యూస్
న్యూడిల్లీ : ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. నేడు కీలకమైన గ్రాట్యుటీ చెల్లింపు(సవరణ) బిల్లుకు పార్లమెంట్ ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లును గత వారమే లోకసభ ఆమోదించగా.. నేడు రాజ్యసభలోనూ ఆమోదించారు. విపక్షాల నిరసనల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా రాజ్యసభ సజావుగా సాగకపోవడంతో, ఈ బిల్లు ఆమోదం పెండింగ్‌లో పడుతూ వచ్చింది. నేడు దీనికి ఆమోదయోగ్యం లభించింది. నేడు కూడా రాజ్యసభలో నిరసనల వాతావరణం నెలకొన్నప్పటికీ నిరసనల మధ్యే ఈ బిల్లును కార్మిక మంత్రి సంతోష్ కుమార్ మూజువాణి ఓటు ద్వారా ఆమోదింప జేశారు. రాష్ట్రపతి ఆమోదం త్వరాత ఈ బిల్లు చట్టరూపం దాల్చనుంది. ఈ బిల్లు ద్వారా ఉద్యోగులకు పన్ను రహిత గ్రాట్యుటీ ప్రస్తుతమున్న రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెరుగుతుంది. అంతేకాక అమల్లో ఉన్న 12 వారాల ప్రసూతి సెలవులకు బదులుగా.. ఎప్పటికప్పుడు కార్య నిర్వాహక ఉత్తర్వు జారీ చేయడం ద్వారా వీటిని పెంచుకునే హక్కును ప్రభుత్వానికి కల్పించనుంది. 7వ వేతన సంఘ అమలు అనంతరం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యుటీ మొత్తం రూ.20 లక్షలకు పెరిగిన సంగతి తెలిసిందే. -
ఉద్యోగి గ్రాట్యుటీ చెల్లిస్తారు ఇలా..
నిడమర్రు: అటు ప్రభుత్వ ఉద్యోగులకు, ఇటు ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు గ్రాట్యుటీ అందుకుంటారు. దీన్ని ఎలా లెక్కించి ఇస్తారు.. అలాగే గ్రాట్యుటీపై చెల్లించాల్సిన పన్నుపై కూడా అవగాహన ఉండాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. గ్రాట్యుటీపై పన్ను మినహాయింపు పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతూ కేంద్ర క్యాబినెట్ ఇటీవల నిర్ణయం తీసుకుంది. పార్లమెంటులో ఆమోదం పొందాక ఇది అమల్లోకి వస్తుంది. ఒకే సంస్థలో ఎన్నో ఏళ్లుగా పనిచేసేవారికి ఈ నిర్ణయం పెద్ద ఊరటను కలిగించనుంది. ఉద్యోగంలో చేరే సంస్థ హామీ ఇచ్చిన విధంగా మొత్తం జీతం చేతికందదు. ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీలాంటి కోతలుంటాయి. ఈ నేపథ్యంలో గ్రాట్యుటీని ఎలా లెక్కిస్తారు. ఎప్పుడు ఇస్తారు, పన్ను లెక్కింపు ఎలా అన్న విషయాలను తెలుసుకుందాం. గ్రాట్యుటీ అంటే.. ఒక సంస్థలో 10 కంటే ఎక్కువ మంది పనిచేసేటట్టయితే ఆ సంస్థ పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ చట్టం–1972 ప్రకారం ఉద్యోగులకు కొంత సొమ్ము నగదు రూపంలో ఇచ్చే ప్రయోజనాన్నే గ్రాట్యుటీ అంటారు. ఐదేళ్ల పాటు పనిచేసి ఉండాలి గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం ప్రకారం ఐదేళ్లపాటు ఒకే సంస్థలో ఉద్యోగం చేసి ఉండాలి. పనిచేసిన ప్రతి సంవత్సరానికి 15 రోజుల వేతనానికి సమానమైన సొమ్మును ఇవ్వాలి. వేతనం అంటే ఇక్కడ బేసిక్ శాలరీ, డీఏ కలుపుకోవాలి. పూర్తి సంవత్సరంగా లెక్కింపు గడచిన సంవత్సరం ఉద్యోగి 6 నెలల కంటే ఎక్కువగా పనిచేస్తే.. గ్రాట్యుటీ చెల్లింపుల కోసం పూర్తి సంవత్సరం పనిచేసినట్టుగా లెక్కిస్తారు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఏడేళ్ల 6 నెలలు పనిచేశాడనుకుందాం. ఆ వ్యక్తికి 8 ఏళ్లకు సమానమైన గ్రాట్యుటీని చెల్లిస్తారు. 15 రోజుల వేతనం గ్రాట్యుటీ చెల్లింపులను లెక్కించేందుకు, ఒక నెలలో పనిదినాలను 26 రోజులుగా చూస్తారు. కాబట్టి 15 రోజులకు సమానమైన వేతనాన్ని.. నెల వేతనం (ఇంటూ) 15/26గా లెక్కిస్తారు. ఇలా వచ్చిన సంఖ్యను ఎన్నేళ్ల సర్వీసు ఉంటే అన్నేళ్లకు లెక్కవేసి గ్రాట్యుటీని చెల్లిస్తారు. పదవీ విరమణ చేసేటప్పుడూ ఇదే లెక్కను అనుసరించి గ్రాట్యుటీ ప్రభుత్వ/సంస్థ చెల్లింపు చేస్తుంది. సర్వీసులో ఉండగా గతించినట్టయితే.. ఒకవేళ ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణిస్తే.. ఐదేళ్ల కనీస పరిమితి వర్తించదు. గ్రాట్యుటీ ప్రయోజనాన్ని నామినీ లేదా చట్టబద్ధ వారసులకు అందజేస్తారు. ఉద్యోగి చివర పనిచేసిన రోజు మొదలుకుని 30 రోజుల్లోపు గ్రాట్యుటీ చెల్లింపులన్నీ జరిగిపోవాలని చట్టం చెబుతోంది. అలా చేయని పక్షంలో అదనంగా వడ్డీ చెల్లించాలని చట్టంలోని నిబంధనలు చెబుతున్నాయి. సంస్థలు ఎలా చెల్లిస్తాయి..? సంస్థలు గ్రాట్యుటీని తమ సొంత నిధుల నుంచి లేదా సామూహిక గ్రాట్యుటీ పథకం ద్వారా చెల్లిస్తుంటాయి. గ్రాట్యుటీ కోసం కేటాయించిన నిధులను ఏదైనా బీమా సంస్థ వద్ద ఉంచుతారు. బీమా సంస్థలు గ్రాట్యుటీ నిధిని పెట్టుబడిగా పెట్టి వాటిపై రాబడులు వచ్చేలా చూసుకుంటాయి. మార్కెట్ రిస్క్ తగ్గించుకునేందుకు సాధారణంగా ఈ నిధులను డెట్ లేదా స్థిర ఆదాయాన్నిచ్చే పథకాల్లోనే పెట్టుబడి పెడతారు. గ్రాట్యుటీపై పన్ను వర్తింపు.. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. గ్రాట్యుటీని ‘ఇన్కమ్ ఫారం శాలరీ’ విభాగంలోకి చేర్చారు. ఇన్‌కం ట్యాక్స్ యాక్ట్, 1961 ప్రకారం సెక్షన్ 10(10) కింద గ్రాట్యుటీ ద్వారా అందే సొమ్ముపై పన్ను ప్రయోజనాలు ఉంటాయి. ఈ సందర్భాల్లో పూర్తి మినహాయింపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, స్థానిక ప్రభుత్వ పరిపాలనలోని ఉద్యోగులకు గ్రాట్యుటీపై పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది. ఆదే విధంగా గ్రాట్యుటీ సొమ్మును పదవీ విరమణ తర్వాత అందుకున్నా లేదా సర్వీసులో ఉండగా ఉద్యోగి మరణించినట్టయితే పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది. ప్రస్తుతం రూ.10 లక్షల దాకా అందుకునే గ్రాట్యుటీ సొమ్ముపై పన్ను మినహాయింపు ఉంది. ఇతర ఆదాయ వనరుల విభాగంలోకి.. ఉద్యోగి మరణించినప్పుడు నామినీకి లేదా చట్టబద్ధ వారసులకు అందించే గ్రాట్యుటీపై పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే నామినీగా ఆ ప్రయోజనాన్ని అందుకునేవారు మాత్రం ఆదాయపు పన్ను చట్టం ఇతర ఆదాయ వనరుల విభాగం కిందకి వస్తుంది. -
గ్రాట్యుటీ పన్ను మినహాయింపు రూ. 20 లక్షలు!
న్యూఢిల్లీ: రూ.20 లక్షల వరకు గ్రాట్యుటీపై పన్ను మినహాయింపు ఇచ్చే గ్రాట్యుటీ చెల్లింపు సవరణ బిల్లు–2017ను వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే పార్లమెంట్ ఆమోదించే అవకాశాలున్నాయి. దీని ప్రకారం.. 5 ఏళ్లు అంతకంటే ఎక్కువ కాలం ఒక సంస్థలో పనిచేసి రిటైరయ్యే లేదా వైదొలిగే వారు పొందే గ్రాట్యుటీపై రూ.20లక్షల వరకు పన్ను ఉండదు. ప్రస్తుతం రూ.10 లక్షల వరకు గ్రాట్యుటీపై మాత్రమే పన్ను మినహాయింపు ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతోపాటు పది అంతకంటే ఎక్కువ మంది పనిచేసే ఫ్యాక్టరీలు, గనులు, చమురు క్షేత్రాలు, ప్లాంటేషన్లు, నౌకాశ్రయాలు, రైల్వే కంపెనీలు, దుకాణాలు తదితర వ్యవస్థీకృత రంగ సంస్థలకు ఇది వర్తిస్తుంది. ఈ బిల్లు శీతాకాల సమావేశాల్లో లోక్‌సభ ఆమోదం కూడా పొందింది. మహిళలకు మాతృత్వ సెలవులను పొడిగించే మెటర్నిటీ బెనిఫిట్ సవరణ బిల్లు–2017ను ఈ సమావేశాల్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సమావేశాల్లోనే వేతన కోడ్ బిల్లు బడ్జెట్ సమావేశాల్లో వేతన కోడ్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. దీని ప్రకారం కనీస వేతన పరిమితి అమల్లోకి వస్తుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం అంతకంటే తక్కువ వేతనం నిర్ణయించకూడదు. -
వర్షాకాల సమావేశాల్లో గ్రాట్యుటీ బిల్లు
న్యూఢిల్లీ: పన్ను రహిత గ్రాట్యుటీ మొత్తాన్ని రెట్టింపు చేసి రూ.20 లక్షలకు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లును ఈ నెల 17 నుంచి మొదలయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశముందని కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ‘ఇది మా ఎజెండా. బిల్లు ఆమోదం కోసం త్వరలో కేబినెట్ ముందుకు వెళ్తుంది’ అని చెప్పారు. గ్రాట్యుటీ చెల్లింపు చట్టాన్ని సవరించే ఈ బిల్లు ఆదాయంలో పెరుగుదలను బట్టి ఆర్డినెన్స్ ద్వారా పన్నురహిత గ్రాట్యుటీ పరిమితిని పెంచేందుకు కూడా ప్రభుత్వానికి వీలు కల్పిస్తుంది. బిల్లు చట్టంగా మారాక సంఘటిత రంగంలోని కార్మికులు రూ. 20 లక్షల పన్ను రహిత గ్రాట్యుటీకి అర్హులవుతారు. -
రిటైర్డ్ ఉద్యోగులకు శుభవార్త
గ్రాట్యుటీ వ్యత్యాసబకాయిల విడుదల ► రూ. 4 లక్షల వ్యత్యాసం చెల్లించేలా ఉత్తర్వులు జారీ ► 2014 జూన్ 2 నుంచి 2015 ఫిబ్రవరి 28 మధ్య రిటైరైన వారికి వర్తింపు సాక్షి, హైదరాబాద్: రిటైరైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యుటీ వ్యత్యాస బకాయిలను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పదో పీఆర్సీ సిఫారసుల ప్రకారం రిటైరైన ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యుటీని ప్రభుత్వం రూ. 8 లక్షల నుంచి రూ. 12 లక్షలకు పెంచింది. సవరించిన గ్రాట్యుటీ 2014 జూన్ 2 నుంచే అమల్లోకి తెచ్చింది. 2015 మార్చి 1 నుంచి సవరించిన గ్రాట్యుటీని ప్రభుత్వం నగదు రూపంలో చెల్లించింది. అయితే ఈ తొమ్మిది నెలల వ్యవధిలో రిటైరైన ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ. 4 లక్షల చొప్పున గ్రాట్యుటీ వ్యత్యాస బకాయిలను రెండేళ్లుగా పెండింగ్‌లో పెట్టింది. ఈ నేపథ్యంలో వ్యత్యాస బకాయిల చెల్లింపులకు రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు జీవో నం.79 జారీ చేశారు. 2014 జూన్ నుంచి 2015 ఫిబ్రవరి 28 మధ్య రిటైరైన ఉద్యోగులకు ఈ బకాయిలు చెల్లించనున్నట్లు సర్కారు ఉత్తర్వుల్లో పొందుపరిచింది. తెలంగాణ స్టేట్ ఆడిట్ అకౌంటెంట్ జనరల్ అండ్ డైరెక్టర్ ఆమోదం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని ట్రెజరీల అధికారులు, పెన్షన్ పేమెంట్ అధికారులు ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆ తొమ్మిది నెలల వ్యవధిలో రిటైరై, వ్యత్యాస బకాయిలు అందుకోకుండానే మరణించిన పెన్షనర్లు ఎవరైనా ఉంటే నిబంధనల ప్రకారం వారి వారసులకు ఈ బకాయిలను అందించాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులతోపాటు యూనివర్సిటీ, ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల టీచర్లకు ఇది వర్తిస్తుందని తెలిపింది. దాదాపు రూ.190 కోట్ల గ్రాట్యుటీ వ్యత్యాస బకాయిలను చెల్లించాల్సి ఉన్నట్లుగా ఆర్థిక శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. -
ఆమె కొబ్బరికాయ కథ ఎంటో తెలుసా?
ప్రస్తుతం దక్షిణాదిలో క్రేజీ యువ కథానాయకిగా రాణిస్తున్న నటి కీర్తీసురేశ్. ఇటు తమిళంలోనూ, అటు తెలుగులోనూ వరస విజయాలను అందుకుంటున్న ఈ కేరళా కుట్టి తన పారితోషికాన్ని పెంచుకుంటూ పోతున్నారు. ఎంతగా అంటే రూ.కోటికి పైనే డిమాండ్ చేస్తున్నారట. ఒక తెలుగు చిత్రంలో నిర్మాత కొడుకు సరసన నటించడానికి అంత పారితోషికాన్ని అందుకున్నారన్న విషయం మీడియాలో హల్చల్ చేస్తోంది. కోటి రూపాయల పారితోషికం స్థాయికి ఎదిగిన తన కూతురిని చూసి ఒకప్పటి నటి మేనక తెగ సంతోషపడిపోతున్నారట. అయితే ఇప్పుడు అంతగా కూతురి ఎదుగుదల చూసి ముచ్చట పడిపోతున్న ఈ మేనక ప్రారంభంలో కూతురి సినీ రంగప్రవేశాన్ని తీవ్రంగా వ్యతిరేకించారట. అయితే ఎలాగైనా నటినవ్వాలనుకున్న కీర్తీసురేశ్ తన ఆశ నెరవేర్చాలని దేవుడికి మొక్కుకున్నారట. అందుకు ఆయనకి ఏమి సమర్పించాలన్న ఆలోచనలో భాగంగా రోజూ ఒక కొబ్బరికాయ కొట్టి మొక్కు చెల్లించుకున్నారట. ఈ విషయాన్ని ఇటీవలే కీర్తీ బయట పెట్టారు. అంతే కాదు తనేగనుక వేరొకరికి పుట్టి ఉంటే నటినవడానికి వెంటనే ఒప్పుకునేవారని, సినీ కుటుంబం అయినా అమ్మానాన్నలు తన కోరికను అర్థం చేసుకోవడం లేదని తన సోదరితో చెప్పుకుని కంటతడి పెట్టారట. ఈ విషయం ఆమె తండ్రికి తెలియడంతో ఇంకా తన కూతురి ఆసక్తికి అడ్డుకట్ట వేయడం మంచిది కాదన్న నిర్ణయానికి వచ్చి కీర్తీసురేశ్ సినీరంగ ప్రవేశానికి పచ్చజెండా ఊపారట. తన నట జీవితం ప్రారంభాన్ని నటి కీర్తీసురేశ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ బ్యూటీ సూర్యకు జంటగా తానాసేర్న్‌ద కూటం చిత్రంలో నటిస్తున్నారు. -
ప్రైవేటు ఉద్యోగులకు తీపి కబురు
న్యూఢిల్లీ: ప్రయివేటు ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. పదవీవిరమణ పొందిన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ పై భారీ పన్ను మినహాయింపును ఇవ్వనుంది. ఇక మీదట ప్రయివేటు ఉద్యోగస్తుల పన్నురహిత గ్రాట్యుయిటీ ఉపసంహరణ పరిమితిని రెట్టింపు చేసింది. తాజానిర్ణయం ప్రకారం త్వరలోనే రూ. 20లక్షల గ్రాట్యుటీ ఉపసంహరణపై పన్నును రద్దు చేయనుంది. ఈ మేరకు గ్రాట్యుటీ చట్టాన్ని సవరించడానికి సంసిద్ధతను వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులతో సమానంగా ఈ పరిమితిని రూ. 20లక్షలకు పెంచింది. కార్మిక మంత్రిత్వ శాఖ, కార్మిక సంఘాలు, యజమాను సంస్థలు మధ్య జరిగిన ఒక త్రైపాక్షిక సమావేశంలో ఈ అంశంపై ఏకాభిప్రాయాన్ని సాధించారు. ఈ మేరకు పేమెంట్ ఆఫ్ గ్రాట్యుయిటీ యాక్ట్ సవరణ బిల్లును పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ద్వితీయార్థంలో ప్రవేశపెట్టేందుకు నిర్ణయించారు. అయితే అయిదు సంవత్సరాల కనీస సర్వీసు , కనీసం 10మంది ఉద్యోగుల నిబంధనను కూడా తొలగించాలని ఉద్యోగ సంఘాలుడిమాండ్ చేశాయి. ప్రస్తుతం అయిదేళ్ళ ఉపాధి తరువాత పన్ను రహిత గ్రాట్యుయిటీ పరిమితి 10లక్షల వరకు మాత్రమే. సాధారణంగా కనీసం అయిదు సం.రాల సర్వీసు న్న ఉద్యోగ విరమణ సమయానికి ఉద్యోగి వేతనం ఆధారంగా దీన్ని నిర్ణయిస్తారు. జీతం, సర్వీసు సంవత్సరాలతో గుణించి లెక్కకడతారు. ఉదాహరణకు ఒక వ్యక్తి తన సేవ చివరలో రూ .20 లక్షల గ్రాట్యుటీ ఉపసంహరించుకోవాలంటే ..10 సంవత్సరాల అనుభవంతో .. అతని లేదా ఆమె ఒక నెల జీతం( మూలవేతనంలో + డీఏ) రూ 3.5 లక్షల కంటే ఎక్కువ వుండాలి. ఈ నేపథ్యంలోనే ఈ చర్య ప్రభుత్వ పన్ను వసూళ్లపై పెద్దగా ప్రభావం చూపదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే రూ .20 లక్షల పారితోషికం అందుకునేంత అధిక జీతాలున్న వ్యక్తులు చాలా పరిమితమని పేర్కొన్నారు. అలాగే భారతదేశం లో 10 లక్షల ఆదాయాన్ని ప్రకటించిన వారు మాత్రమే 24 లక్షల మందికాగా, రూ. 50 లక్షల కు పైన ఆదాయాన్ని ప్రకటించిన వారు 1.72 లక్షల మంది మాత్రమే. కాగా 7వ వేతన సంఘం సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పన్నురహిత గ్రాట్యుటీ ఉపసంహరణ ను 20 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. 1997 లో, గ్రాట్యుటీ పన్ను ఉపశమనం 2.5 లక్షల నుంచి రూ 3.5 లక్షల రూపాయల కి పెంచారు. ఆ తరువాత 2010 లో ఈ పరిమితిని రూ .10 లక్షలుగా నిర్ణయించారు. -
ప్రముఖ హీరోలు పారితోషికాలు తగ్గించుకోవాలి
తమిళసినిమా: ప్రముఖ హీరోలు పారితోషికం తగ్గించుకోవాలని యువ నటుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్ అంటున్నారు. మొదట్లో కమలహాసన్, సూర్య వంటి ప్రముఖ కథానాయకులతో చిత్రాలు నిర్మించిన ఈయన ఆ తరువాత తనే హీరోగా మారి సొంతంగా చిత్రాలు తీసుకుంటున్నారు. తాజాగా గెత్తు చిత్రంతో సంక్రాంతికి తెరపైకి రానుంది. ఇప్పటి వరకూ ప్రేమ,హాస్యం ప్రధాన ఇతి వృత్తాలుగా చిత్రాలు చేస్తూ వచ్చిన ఉదయనిధి స్టాలిన్ ఈ గెత్తు చిత్రం ద్వారా తొలిసారిగా యాక్షన్ హీరో అవతారం ఎత్తారు. ఈ సందర్భంగా ఆయనతో చిన్న భేటీ.. ప్ర: ఇప్పటి వరకూ ప్రేమను, విరోదాన్ని నమ్ముకున్న మీరు ఇప్పుడు యాక్షన్ చిత్రాలపై దృష్టి పెట్టారు. ఇక ఇలానే కంటిన్యూ అవుతారా? జ: నాకు నచ్చిన కథా చిత్రాలు చేస్తున్నాను అంతే. ఇక గెత్తు చిత్రం విషయానికి వస్తే నన్భేండా చిత్రం చేస్తున్న సమయంలో దర్శకుడు ఏఆర్.మురుగదాస్, తిరుకుమరన్ నాకీ చిత్ర కథ చెప్పారు. కథ నచ్చడంతో వెంటనే చేద్దాం అన్నాను. ప్ర: అంత కీలకంగా ఉండే ఆ పాత్ర గురించి? జ: అన్యాయాన్ని సహించని పాత్ర సత్యరాజ్ది. ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడికి వెళ్లి దాన్ని అడ్డుకుంటారు. అలాంటి ఆయన ఒక సమస్యలో చిక్కుకుంటారు. దాని నుంచి ఎలా బయట పడ్డారన్నదే చిత్రం. చిత్రంలోని ఒక ఛేజింగ్ సన్నివేశాన్ని దర్శకుడు ఎనిమిది రోజులు చిత్రీకరించారు. గెత్తు చిత్రం పూర్తిగా చూసి ఏఆర్.మురుగదాస్ బాగుందని చెప్పడంతో మేమూ విజయంపై నమ్మకంతో ఉన్నాం. ప్ర: ఇక చిన్న చిత్రాలు నిర్మించరా ? జ: నేను చేసిన కొన్ని చిన్న చిత్రాలు ప్రేక్షకాదరణ పొందలేదు. వాటికి వినోదపు పన్ను రాయతీలు అందకపోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. భారీ చిత్రాలు చేద్దామంటే పెద్ద హీరోలు నటించడానికి ముందుకు రాని పరిస్థితి. హీరోగా నాకంటూ ఒక మార్కెట్ ఉంది. అం దుకే నేనే కథానాయకుడిగా నటిస్తూ సొంతంగా చిత్రాలు నిర్మించుకుంటున్నాను. ఇంకో విషయం ఏమిటంటే చిత్ర పరిశ్రమ నష్టాల్లోనే నడుస్తోంది.పరిశ్రమ మనుగడ కోసం అయినా ప్రముఖ హీరోలు, సాంకేతిక నిపుణులు తమ పారితోషికాలను తగ్గించుకోవాలి. ప్ర:తదుపరి హింది చిత్ర రీమేక్‌కు సిద్ధం అవడానికి కారణం? జ: గెత్తు చిత్రం తరువాత అహ్మద్ దర్శకత్వంలో ఇదయం మురళి చిత్రం చేయాల్సింది. అది పూర్తిగా విదేశాలలో షూటింగ్ నిర్వహించాలి.బడ్జెట్ ఎక్కువ అవుతోంది.అందుకే చిన్న బడ్జెట్లో కథ ఉంటే చెప్పమని దర్శకుడిని అడిగాను.అప్పుడాయన ఒక హిందీ చిత్రం సీడీ ఇచ్చి చూడమన్నారు.ఆ చిత్రం నచ్చడంతో చేయడానికి సిద్ధమయ్యాం. ప్ర:నిర్మాతల మండలి వంటి సంఘాలపై ఆసక్తి చూపడం లేదే? జ: నిజం చెప్పాలంటే నిర్మాతల మండలి తనకు ఎలాంటి సాయం చేయలేదు. నా చిత్రాల వినోదపు పన్ను కోసం పోరాడుతున్న నాకు ఎలాంటి ప్రోత్సాహం అందించలేదు. వారి సాయం నేను కోరనూలేదు. ఈ విషయంలో నేను కోర్టు ద్వారానే పోరాడుతున్నాను. ప్ర: ఎలాంటి పాత్రలు చేయాలని కోరుకుంటున్నారు? జ: విభిన్న పాత్రలో నటించాలన్నదే నా కోరిక. ప్రతి నాయకుడి చాయలున్న పాత్రలోనూ నటించాలని ఆశిస్తున్నాను. -
పీఆర్సీకి సర్కారు కొర్రీలు
సర్వీసు వెయిటేజీ పాతదే.. అదనపు పెన్షన్ యథాతథం * పీఆర్సీ ఫైళ్లకు సీఎం ఆమోదం * గ్రాట్యుటీ రూ.12 లక్షలకు పెంపు * డెత్ రిలీఫ్ అలవెన్స్ రూ.20 వేలు * అర్ధ వేతన సెలవులకు నగదు సదుపాయం విస్తరణ * నేడో రేపో ఉత్తర్వులు వెలువడే అవకాశం సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల సర్వీసు వెయిటేజీ, అదనపు పెన్షన్ చెల్లింపులపై పదో పీఆర్సీ చేసిన సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. రిటైరైన ఉద్యోగులకు గ్రాట్యుటీ పెంపు, డెత్ రిలీఫ్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్, అర్ధ వేతన సెలవులను నగదుగా మార్చుకునేందుకు అవకాశమివ్వడం తదితర సిఫార్సులకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు దాదాపు రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్న పలు ఫైళ్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపారు. సంబంధిత ఉత్తర్వులు ఒకటి రెండు రోజుల్లో జారీ కానున్నట్లు ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించారు. నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పూర్తి పెన్షన్ పొందేందుకు రిటైర్మెంట్ నాటికి 33 ఏళ్ల సర్వీసు పూర్తయి ఉండాలి. కానీ అభ్యర్థుల వయో పరిమితి పెంపు, నోటిఫికేషన్ల జారీలో జాప్యం కారణంగా ప్రభుత్వం గతంలో ఐదేళ్ల సర్వీసు వెయిటేజీ ఇచ్చింది. దాంతో 28 ఏళ్ల సర్వీసు ఉన్న వారికీ పెన్షన్ సదుపాయం ఉంది. అయితే కేంద్ర ఉద్యోగులకు 20 ఏళ్ల సర్వీసు ఉన్నా పెన్షన్ ఇస్తున్న నేపథ్యంలో సర్వీసు వెయిటేజీని ఎనిమిదేళ్లకు పెంచాలని పదో పీఆర్సీ సిఫార్సు చేయగా.. దానిని ప్రభుత్వం తోసిపుచ్చింది. దీంతో 30 ఏళ్ల వయసు నిండిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారందరూ పెన్షన్ సదుపాయం ఉండదు. ఇక పెన్షనర్లకు వయసు పెరిగేకొద్దీ అదనంగా పెన్షన్ చెల్లించే (అడిషనల్ క్వాంటమ్ పెన్షన్) అంశానికి సర్కారు నో చెప్పింది. ప్రస్తుతం 75 ఏళ్లు నిండిన రిటైర్డ్ ఉద్యోగులకు 15 శాతం అదనపు పెన్షన్ ఇచ్చే విధానముంది. వయసు పెరిగే కొద్దీ ఐదేళ్లకోసారి ఐదు శాతం చొప్పున పెరుగుతుంది. ఈ అదనపు పెన్షన్‌ను 70 ఏళ్ల నుంచే అందించాలని పదో పీఆర్సీ సూచించినా.. హేతుబద్ధత లేదంటూ ఆర్థిక శాఖ పేర్కొనడంతో సీఎం ఆ ఫైలును వెనక్కి పంపారు. ఇక మహిళా ఉద్యోగులకు రెండేళ్ల పాటు ఇచ్చే చైల్డ్ కేర్ లీవ్ సిఫార్సుపై ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొన్నింటికీ మోక్షం రిటైరయ్యే ఉద్యోగులకు చెల్లిస్తున్న రూ.8లక్షల గ్రాట్యుటీని రూ.12లక్షలకు పెంచేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రిటైర్డ్ ఉద్యోగులు మరణిస్తే అందించే అంత్యక్రియల ఖర్చు (డెత్ రిలీఫ్ అలవెన్స్)ను పీఆర్సీ సిఫార్సు మేరకు రూ.10 వేల నుంచి రూ.20వేలకు పెంచింది. అయితే వారి కుటుంబీకులు మరణించినప్పుడు కూడా ఈ అలవెన్స్ ఇవ్వాలన్న సూచనను తోసిపుచ్చింది. ఇక పదవీ విరమణ చేసిన వారికి 300 రోజులకు మించకుండా అర్ధవేతన సెలవులను (హెచ్పీఎల్) నగదుగా మార్చుకునే అవకాశాన్ని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు వర్తింపజేసేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. పెన్షనర్లకు వైద్య ఖర్చుల కింద చెల్లిస్తున్న సొమ్మును రూ.350కు పెంచేందుకు ఆమోదం తెలిపింది. కాగా యూనివర్సిటీలకు పదో పీఆర్సీని వర్తింపజేసేందుకు సీఎం కేసీఆర్ ఆమోదించడంపై ఎన్జీవోస్ స్టాఫ్ అసోసియేషన్, టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్, ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఉస్మానియా వర్సిటీలో సంబరాలు జరుపుకొన్నారు. స్వీట్లు పంచుకొని కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బకాయిలపై తేల్చండి.. పీఆర్సీ బకాయిలను నగదు రూపం లో చెల్లించే అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పీఆర్టీయూ-టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకట్‌రెడ్డి, సరోత్తంరెడ్డి కోరారు. గ్రాట్యుటీ రూ.12లక్షలకు పెంపు, డీఏ మంజూరు తదితర అంశాలపై నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. బకాయిల కోసం ఉద్యోగులంతా ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. -
జీతాలు ఆలస్యం
30 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు కష్టాలు మొదటి వారంలో బిల్లులు స్వీకరించే అవకాశం సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల జీతాలు ఆలస్యం కానున్నాయి. ప్రతి నెలా ఠంచనుగా ఒకటో తేదీకిచ్చే జీతాలు ఖజానా అధికారుల కారణంగా జాప్యమవుతున్నాయి. అధికారిక కారణాలు తెలియలేదుగానీ.. జీతాల బిల్లులేవీ తీసుకోవద్దన్న మౌఖిక ఆదేశాలు రాష్ట్ర ఖజానా అధికారుల నుంచి అందాయి. అక్కడి నుంచి ఉప ఖజానా కార్యాలయాలకు ఇప్పటికే చేరాయి. దీంతో ఏప్రిల్ ఒకటో తేదీకి జీతాలొచ్చే పరిస్థితులు దాదాపు లేనట్టే! ప్రతి నెలా 25వ తేదీలోగా ఖజానా/ఉప ఖజానా కార్యాలయాలకు జీతా లు, ఇతరత్రా బిల్లులు సమర్పించాలి. 23 వరకు బిల్లులు తీసుకున్నా.. సోమవారం నుంచి బిల్లులపై నియంత్రణపెట్టారు. ఏటా ఆర్థిక సంవత్సరం చివర్లో ఖజానా శాఖ ఆంక్షలు తప్పనిసరి. కానీ అవి బకాయిలు, ఇతరత్రా చెల్లింపులకు మాత్ర మే పరిమితం. ఈసారి ఏకంగా జీతా ల బిల్లులే నిలిపేయాల్సిందిగా ఆదేశించారు. వీటితోపాటు ఉద్యోగుల సరెండర్ లీవు బిల్లులు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, పదవీ విరమణకు సంబంధిం చిన ఇతర బిల్లులు, గ్రాట్యుటీ బిల్లు లు, పంచాయితీల నిర్వహణకు సం బంధించిన బిల్లులు, పంచాయతీ సిబ్బంది జీతాలు ఆర్థికపరమైన అం శాలతో ఇప్పటికే అనుమతించలేదు. ఇప్పటికే తీసుకున్న బిల్లులకు కూడా జీతాలు పెట్టొద్దన్న ఆదేశాలున్నట్టు తెలిసింది. 010 పద్దు కిందకు వచ్చేవారితోపాటు సుమారు 30 వేల మంది ఉద్యోగులకు తిప్పలు తప్పేలా లేవు. ‘మధ్యాహ్న’ బిల్లులకూ బ్రేక్! మధ్యాహ్న భోజన బిల్లులకూ గత రెండు మాసాలుగా బ్రేక్ పెట్టారు. ఈ నెలాఖరులోగా బిల్లులు చెల్లించకపోతే అవి ఫ్రీజ్ అయ్యే పరిస్థితులున్నాయి. దీంతో మధ్యాహ్న భోజన కుకింగ్ వ్యయం, కుక్ కమ్ హెల్పర్ల జీతాల్లో మరింత జాప్యం నెలకొనే ప్రమాదముంది. ఒకసారి మధ్యాహ్న భోజన నిధులు ఫ్రీజ్ అయితే వాటిని మళ్లీ జిల్లాకు రప్పించడానికి నానా యాతనలు పడాలని అధికారులు చెప్తున్నారు. -
గ్రాట్యుటీ, పెన్షన్లు భిక్ష కాదు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఒక ఉద్యోగి తన సుదీర్ఘ, అవిరామ, విశ్వాస, నిష్కళంక సేవలతో సంపాదించుకున్న సహజమైన ఆస్తే గ్రాట్యుటీ, పెన్షన్ అని, అవేమీ దయాదాక్షిణ్యాలపై వేసే భిక్ష కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. క్రిమినల్ లేదా శాఖాపరమైన చర్యలు పెండింగ్‌లో ఉన్నాయనే కారణంతో ఎవరైనా ప్రభుత్వోద్యోగి నుంచి వాటిని దూరం చేయడం సరికాదని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 300ఎ అధికరణలో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధంగా ఆ ఆస్తిహక్కును నిరాకరించరాదని న్యాయమూర్తులు జస్టిస్ కె.ఎస్.రాధాకృష్ణన్, ఎ.కె.సిక్రిలతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది. క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయనే కారణంతో రాంచీకి చెందిన జితేంద్ర కుమార్ శ్రీవాస్తవ అనే రిటైర్డ్ ఉద్యోగికి పదవీవిరమణ తదనంతర ప్రయోజనాలన్నింటినీ జార్ఖండ్ ప్రభుత్వం 2002లో నిలిపేసింది. పెన్షన్‌తో పాటు గ్రాట్యుటీ, ఆర్జిత సెలవుల మొత్తం చెల్లించలేదు. దీన్ని సవాల్ చేస్తూ జితేంద్రకుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు... ఆయనకు పదవీవిరమణ తదుపరి లభించాల్సిన అన్ని ప్రయోజనాలను పరిష్కరించాలని ఆదేశిస్తూ 2007లో తీర్పు ఇచ్చింది. దీనిపై జార్ఖండ్ ప్రభుత్వం దాఖలుచేసిన అప్పీల్ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పిచ్చింది.