ఆమె కొబ్బరికాయ కథ ఎంటో తెలుసా? | keerthi suresh mother happy to daughter success | Sakshi
Sakshi News home page

ఆమె కొబ్బరికాయ కథ ఎంటో తెలుసా?

Published Sat, Mar 18 2017 2:30 AM | Last Updated on Tue, Sep 5 2017 6:21 AM

ఆమె కొబ్బరికాయ కథ ఎంటో తెలుసా?

ఆమె కొబ్బరికాయ కథ ఎంటో తెలుసా?

ప్రస్తుతం దక్షిణాదిలో క్రేజీ యువ కథానాయకిగా రాణిస్తున్న నటి కీర్తీసురేశ్‌. ఇటు తమిళంలోనూ, అటు తెలుగులోనూ వరస విజయాలను అందుకుంటున్న ఈ కేరళా కుట్టి తన పారితోషికాన్ని పెంచుకుంటూ పోతున్నారు. ఎంతగా అంటే రూ.కోటికి పైనే డిమాండ్‌ చేస్తున్నారట. ఒక తెలుగు చిత్రంలో నిర్మాత కొడుకు సరసన నటించడానికి అంత పారితోషికాన్ని అందుకున్నారన్న విషయం మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. కోటి రూపాయల పారితోషికం స్థాయికి ఎదిగిన తన కూతురిని చూసి ఒకప్పటి నటి మేనక తెగ సంతోషపడిపోతున్నారట. అయితే ఇప్పుడు అంతగా కూతురి ఎదుగుదల చూసి ముచ్చట పడిపోతున్న ఈ మేనక ప్రారంభంలో కూతురి సినీ రంగప్రవేశాన్ని తీవ్రంగా వ్యతిరేకించారట.

అయితే ఎలాగైనా నటినవ్వాలనుకున్న కీర్తీసురేశ్‌ తన ఆశ నెరవేర్చాలని దేవుడికి మొక్కుకున్నారట. అందుకు ఆయనకి ఏమి సమర్పించాలన్న ఆలోచనలో భాగంగా రోజూ ఒక కొబ్బరికాయ కొట్టి మొక్కు చెల్లించుకున్నారట. ఈ విషయాన్ని ఇటీవలే కీర్తీ బయట పెట్టారు. అంతే కాదు తనేగనుక వేరొకరికి పుట్టి ఉంటే నటినవడానికి వెంటనే ఒప్పుకునేవారని, సినీ కుటుంబం అయినా అమ్మానాన్నలు తన కోరికను అర్థం చేసుకోవడం లేదని తన సోదరితో చెప్పుకుని కంటతడి పెట్టారట. ఈ విషయం ఆమె తండ్రికి తెలియడంతో ఇంకా తన కూతురి ఆసక్తికి అడ్డుకట్ట వేయడం మంచిది కాదన్న నిర్ణయానికి వచ్చి కీర్తీసురేశ్‌ సినీరంగ ప్రవేశానికి పచ్చజెండా ఊపారట. తన నట జీవితం ప్రారంభాన్ని నటి కీర్తీసురేశ్‌ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ బ్యూటీ సూర్యకు జంటగా తానాసేర్న్‌ద కూటం చిత్రంలో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement