Maneka
-
ఆమె కొబ్బరికాయ కథ ఎంటో తెలుసా?
ప్రస్తుతం దక్షిణాదిలో క్రేజీ యువ కథానాయకిగా రాణిస్తున్న నటి కీర్తీసురేశ్. ఇటు తమిళంలోనూ, అటు తెలుగులోనూ వరస విజయాలను అందుకుంటున్న ఈ కేరళా కుట్టి తన పారితోషికాన్ని పెంచుకుంటూ పోతున్నారు. ఎంతగా అంటే రూ.కోటికి పైనే డిమాండ్ చేస్తున్నారట. ఒక తెలుగు చిత్రంలో నిర్మాత కొడుకు సరసన నటించడానికి అంత పారితోషికాన్ని అందుకున్నారన్న విషయం మీడియాలో హల్చల్ చేస్తోంది. కోటి రూపాయల పారితోషికం స్థాయికి ఎదిగిన తన కూతురిని చూసి ఒకప్పటి నటి మేనక తెగ సంతోషపడిపోతున్నారట. అయితే ఇప్పుడు అంతగా కూతురి ఎదుగుదల చూసి ముచ్చట పడిపోతున్న ఈ మేనక ప్రారంభంలో కూతురి సినీ రంగప్రవేశాన్ని తీవ్రంగా వ్యతిరేకించారట. అయితే ఎలాగైనా నటినవ్వాలనుకున్న కీర్తీసురేశ్ తన ఆశ నెరవేర్చాలని దేవుడికి మొక్కుకున్నారట. అందుకు ఆయనకి ఏమి సమర్పించాలన్న ఆలోచనలో భాగంగా రోజూ ఒక కొబ్బరికాయ కొట్టి మొక్కు చెల్లించుకున్నారట. ఈ విషయాన్ని ఇటీవలే కీర్తీ బయట పెట్టారు. అంతే కాదు తనేగనుక వేరొకరికి పుట్టి ఉంటే నటినవడానికి వెంటనే ఒప్పుకునేవారని, సినీ కుటుంబం అయినా అమ్మానాన్నలు తన కోరికను అర్థం చేసుకోవడం లేదని తన సోదరితో చెప్పుకుని కంటతడి పెట్టారట. ఈ విషయం ఆమె తండ్రికి తెలియడంతో ఇంకా తన కూతురి ఆసక్తికి అడ్డుకట్ట వేయడం మంచిది కాదన్న నిర్ణయానికి వచ్చి కీర్తీసురేశ్ సినీరంగ ప్రవేశానికి పచ్చజెండా ఊపారట. తన నట జీవితం ప్రారంభాన్ని నటి కీర్తీసురేశ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ బ్యూటీ సూర్యకు జంటగా తానాసేర్న్ద కూటం చిత్రంలో నటిస్తున్నారు. -
ఆ మంత్రులు చాయ్ పే చర్చలో పాల్గొన్నాలి
న్యూఢిల్లీ: జంతు వధపై ఇద్ధరు కేంద్ర మంత్రుల మధ్య తలెత్తిన వివాదంపై బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి స్పందించారు. ఇరువురు చాయ్ పే చర్చా కార్యక్రమంలో పాల్గొని సమస్యకు పరిష్కారం కనుగొనాలని సలహా ఇచ్చారు. అంతే కాని బహిరంగంగా విమర్శలు చేసుకోవడం వల్ల ఉపయోగం లేదని తెలిపారు. పర్యావరణం పరిరక్షణపై మేనక చాలా కాలంగా కృషి చేస్తున్నారని ఆమె లేవనెత్తిన అంశాలకు మంత్రి బహిరంగంగా కాకుండా ఫోన్ లో సమాధానం చెబితే బాగుండేదని స్వామి అభిప్రాయపడ్డారు. అడవిపందులు, కోతులు, నీలి ఎద్దులు, నెమళ్ల వధకు కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్ర్రాల్లో అనుమతించిన విషయం తెలిసిందే. -
మహిళా జర్నలిస్టులతో మనేకా గాంధీ భేటీ
మహిళా శిశు సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ఆ మంత్రిత్వ శాఖ.. దేశంలోని సుమారు 250 మంది మహిళా జర్నలిస్టులతో సమావేశమైంది. రెండేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలను వారికి వివరించడంతో పాటు అభివృద్ధికి చేపట్టాల్సిన సలహాలు సూచనలు ఇవ్వాలని ఆహ్వానించింది. ఉమెన్ జర్నలిస్ట్ వర్క్ షాప్ పేరిట న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మహిళా శిశు సంక్షేమశాఖ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళా జర్నలిస్టులతో అభివృద్ధిపై ముచ్చటించిన కేంద్ర మంత్రి మనేకా గాంధీ... జర్నలిస్టుల సలహాలను, సూచనలను కోరారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సహకారంతో మహిళా శిశు అభివృద్ధి శాఖ నిర్వహించిన కార్యక్రమానికి దేశంలోని సుమారు 30 రాష్ట్రాలు, మూడు వేర్వేరు మాధ్యమాల నుంచి 250 మంది దాకా మహిళా పాత్రికేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా శిశు సమస్యలు, పనిచేసే చోట మహిళల పరిస్థితి వంటి అనేక విషయాలపై చర్చించారు. కార్యక్రమంలో మనేకా గాంధీ... మహిళలు, పిల్లల సమస్యలపై వివరణాత్మక మెళకువలను అందించడంతోపాటు... జర్నలిస్టులు వెలుగులోకి తెచ్చిన సమస్యలపై స్పందించారు. వివిధ శాఖల ద్వారా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. మహిళలు, బాలల హక్కుల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై పాత్రికేయుల అభిప్రాయాలను కోరారు. ఈ సందర్భంలో జర్నలిస్టులు ఇప్పటికే దేశంలో ప్రబలంగా ఉన్న 'విచ్ హంట్', 'నట పరాటా' వంటి సమస్యలను వెలుగులోకి తేగా... ఇటువంటి తీవ్రమైన ఆచారాలను, వివక్షతను నిర్మూలించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే చివరి నిమిషంలో పేషెంట్లను ఆస్పత్రికి తీసుకొచ్చే పరిస్థితులు, రక్తమార్పిడి వల్ల హెచ్ఐవీ సోకిన సంఘటనలను మహిళా జర్నలిస్టులు మంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. ఈ సందర్భంగా సబల వంటి ప్రణాళికలతో డబ్ల్యూసీడీ మంత్రిత్వశాఖ సాధించిన విజయాలను మనేకా గాంధీ పాత్రికేయులకు వివరించారు. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా వారికి కావలసిన సహకారం అందించడం, డ్రాపవుట్స్ ను నిర్మూలించడం వారిలో మరింత అవగాహన పెంచడం అవసరమన్న ఆమె... మొదటిసారి అసోంలో హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితులకు షెల్టర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్... డబ్ల్యూసీడీ సాధించిన విజయాలను మహిళా జర్నలిస్టులకు వివరించారు. ఉజ్జ్వల్ యోజన, ధన్ వికాస్ వంటి వివిధ పథకాలను వివరిస్తూ... వాటిపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడం, వాటి వినియోగంపై జనంలో అవగాహన కల్పించడంలో జర్నలిస్టులు తగిన బాధ్యత తీసుకోవాలని కోరారు. ఎస్సీ ఎస్టీ మహిళల వ్యవస్థాపకతను ప్రోత్సహించేందుకు ప్రత్యేక పథకాలను ప్రారంభించినట్లు ఈ సందర్భంగా నిర్మలా తెలిపారు. -
కేంద్ర మంత్రిపై మరో మంత్రి ఫైర్
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి వర్గంలోని ఇద్దరు మంత్రుల మధ్య విభేధాలు తలెత్తాయి. కొన్ని రాష్ట్ర్రాల్లో జంతువులను వధించడానికి కేంద్ర ప్రర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అనుమతి ఇవ్వడాన్ని కేంద్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ తప్పు పడుతూ ఆయనకు లేఖ రాశారు.నీలి ఎద్దు (నిల్గాయి),అడవి పంది ని వధించడానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు జారీ చేయడాన్ని ఆమె తప్పు పట్టారు. ప్రకాశ్ జవదేకర్ ఏరాష్ట్ర ప్రజలు ఏజంతువు కావాలంటే వాటిని వధించడానికి అనుమతులు ఇస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బెంగాల్లో ఏనుగులను, హిమాచల్ ప్రదేశ్ లో కోతులను, గోవాలో నెమళ్లను, చంద్రాపూర్ లో 53 అడవి పందులను చంపడానికి ఇప్పటివరకు అనుమతులు ఇచ్చారని ఆమె తెలిపారు. ఈ విధంగా క్రూరంగా చంపడానికి అనుమతులు ఇవ్వడం ఎంత వరకు సమంజసమని మేనక ప్రశ్నించారు. 2015 లో పంటలను నాశనం చేసే జంతువులను కూడా కీటకాలు గానే భావించాలనే మెమరాండాన్ని పర్యావరణ శాఖ జారీ చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. దీనిపై స్పందించిన ప్రకాశ్ జవదేకర్ రైతుల పంటలు నాశనం చేస్తున్న జంతువులపై చర్యలు తీసుకోవడానికి అనుమతి ఇవ్వమని రాష్ట్ర్ర ప్రభుత్వాలు కోరాయని అందుకే కొన్ని రాష్ట్రాల్లో చట్టం ప్రకారం వాటి సంహరణకు అనుమతి ఇచ్చామని తెలిపారు. గతంలో ఉత్తరాఖండ్ లో పోలీసు గుర్రం శక్తి మాన్ పై బీజేపీ ఎమ్మెల్యే దాడి చేయగా అది మృతి చెందిన విషయంలో కూడా మేనక తీవ్రంగా స్పందించారు. -
లారీ- బైక్ ఢీ.. ఇద్దరి మృతి
వేగంగా వెళ్తున్న లారీ బైక్ను ఢీకొట్టింన ఘటనలో బైక్ పై ఉన్న భార్యా భర్తలు మృతిచెందగా.. ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం నట్టయ్యపాలెం క్రాస్ రోడ్డు వద్ద శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. పెందుర్తి మండలం సుజాత నగర్కు చెందిన దన్నిన రమణ(31) ఓ ప్రైవేట్ చిట్ఫండ్లో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఇతనికి భార్య మేనకతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో ఈ రోజు పడమట మండలంలోని జాజులవాని పాలెం గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తున్న వీరిని గాజువాక మండలం నట్టయ్యపాలెం సమీపంలో 5వ నంబరు జాతీయ రహదారి పై నుంచి వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్య మేనక(28) అక్కడికక్కడే మృతిచెందగా.. రమణ తీవ్రంగా గాయపడ్డాడు. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రమణ మృతి చెందగా.. ఇద్దరు చిన్నారులు కుందన(2) లత్విక్(6నెలలు) ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం చిన్నారి కుందన పుట్టిన రోజు కావడంతో.. అమ్మమ్మ ఆశిస్సుల కోసం వెళ్లి వస్తుండగా.. ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.