జంతు వధపై ఇద్ధరు కేంద్ర మంత్రుల మధ్య తలెత్తిన వివాదంపై బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి స్పందించారు.
న్యూఢిల్లీ: జంతు వధపై ఇద్ధరు కేంద్ర మంత్రుల మధ్య తలెత్తిన వివాదంపై బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి స్పందించారు. ఇరువురు చాయ్ పే చర్చా కార్యక్రమంలో పాల్గొని సమస్యకు పరిష్కారం కనుగొనాలని సలహా ఇచ్చారు. అంతే కాని బహిరంగంగా విమర్శలు చేసుకోవడం వల్ల ఉపయోగం లేదని తెలిపారు. పర్యావరణం పరిరక్షణపై మేనక చాలా కాలంగా కృషి చేస్తున్నారని ఆమె లేవనెత్తిన అంశాలకు మంత్రి బహిరంగంగా కాకుండా ఫోన్ లో సమాధానం చెబితే బాగుండేదని స్వామి అభిప్రాయపడ్డారు. అడవిపందులు, కోతులు, నీలి ఎద్దులు, నెమళ్ల వధకు కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్ర్రాల్లో అనుమతించిన విషయం తెలిసిందే.