chai pe charcha
-
BJP: కాఫీ విత్ యూత్
సాక్షి, న్యూఢిల్లీ: యువ ఓటర్లను ఆకర్షించేందుకు ‘చాయ్ పే చర్చ’ను కాస్తా ‘కాఫీ విత్ యూత్’గా మార్చింది బీజేపీ. వీలైతే కప్పు కాఫీ అంటూ పార్టీ యువ మోర్చా నేతలు కొత్త ఓటర్లను అడుగుతున్నారు. ముంబైలో చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించడంతో వీటిని దేశవ్యాప్తంగా చేపడుతున్నారు. యువ ఓటర్ల నాడి తెలుసుకుని, వారిని బీజేపీ వైపు మళ్లించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బూత్ స్థాయి నుంచి... ముంబైలో ఇటీవల పలుచోట్ల దాదాపు 300 మంది యువ ఓటర్లతో బీజేపీ యువ మోర్చా నేతలు ‘కాఫీ పే చర్చ’ నిర్వహించారు. పదేళ్ల్లలో బీజేపీ చేసిన అభివృద్ధి కార్యక్రమాల్ని వారికి వివరించారు. దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో ఈ చర్చలను విస్తరిస్తున్నారు. ప్రతి భేటీలో కనీసం 150 నుంచి 200 మంది యువ ఓటర్లుండేలా ప్లాన్ చేస్తున్నారు. ‘కాఫీ పే చర్చ’లో బూత్ స్థాయి కార్యకర్త మొదలు యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుని దాకా పాల్గొంటారు. ప్రతి కార్యకర్త తమ పరిధిలోని కనీసం 10 మంది కొత్త, యువ ఓటర్లను ఈ చర్చకు తీసుకొస్తున్నారు. రెస్టారెంట్లు, పార్కులు, ఆట స్థలాలు, ఖాళీ ప్రదేశాల్లో వినూత్నంగా దీన్ని నిర్వహిస్తున్నారు. మోదీ పేర్కొన్న ‘విజన్ 2047’ లక్ష్యంతో చర్చ సాగుతోంది. ‘రాబోయే ఐదేళ్లలో దేశంలో యువత పాత్ర ఎలా ఉండాలి? ప్రభుత్వం ఏం చేస్తే యువతకు దగ్గరవుతుంది? అన్ని రంగాల్లోనూ ప్రపంచంలో భారత్ అగ్ర స్థానానికి చేరాలంటే ఏం చేయాలి? అవినీతి నిర్మూలన, ఆర్థికాభివృద్ధి, పేదరికం లేని ఇళ్లు’ తదితర అంశాలపై రెండు నుంచి మూడు గంటల పాటు కార్యక్రమం జరుగుతోంది. యువ ఓటర్ల సలహాలను పార్టీ అధిష్టానానికి పంపుతున్నారు. -
డిజిటల్ టెక్నాలజీకి పెద్దపీట
న్యూఢిల్లీ: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై తనకెంతో ఆసక్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. టెక్నాలజీలో తాను నిపుణుడిని కాకపోయినా దానిపై చిన్నపిల్లలకు ఉండే ఉత్సుకత తనకు కూడా ఉందని తెలిపారు. అదేసమయంలో టెక్నాలజీకి తాను బానిస కాలేదని వివరించారు. ప్రధాని మోదీ మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తో ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో శుక్రవారం ‘చాయ్ పే చర్చ’ నిర్వహించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతోపాటు విద్య, వైద్యం, వ్యవసాయం, వాతావరణ మార్పులు, మహిళా సాధికారత, కృత్రిమ మేధ వంటి కీలక అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఆయా రంగాల్లో భారత్ సాధిస్తున్న పురోగతిని బిల్‌గేట్స్‌కు తెలియజేశారు. ఇండియాలో వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో నూతన సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. బిల్‌గేట్స్‌తో మోదీ ఇంకా ఏం చెప్పారంటే... కృత్రిమ మేధ.. మంత్రదండం కాదు ‘‘నేడు డిజిటిల్ ప్రజా మౌలిక సదుపాయాల అవసరం చాలా ఉంది. డిజిటల్ టెక్నాలజీపై ప్రజలకు అవగాహన పెంచాలి. కృత్రిమ మేధ(ఏఐ) వంటి శక్తివంతమైన సాంకేతికత దురి్వనియోగమయ్యే ప్రమాదం పొంచి ఉంది. నైపుణ్యం లేని వ్యక్తుల చేతుల్లో ఇలాంటి టెక్నాలజీ పడితే దుష్పరిణామాలు తప్పవు. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలి. నియమ నిబంధనలు అమలు చేయాలి. ఏఐతో సృష్టించే కంటెంట్‌లో వాటర్‌మార్క్‌ను జోడించాలి. ఏఐతో సృష్టించే డీప్‌ఫేక్‌ల విషయంలో అప్రమత్తత అవసరం. ఏఐని అన్నీ సాధించిపెట్టే మంత్ర దండంగా చూడొద్దు. అంటే కృత్రి మేధ విలువను తగ్గించడం నా ఉద్దేశం కాదు. గత ఏడా ది జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సులో ఏఐని నేను ఉపయోగించుకున్నా. పలు కార్యక్రమా ల్లో నా ప్రసంగాలను వేర్వేరు భాషల్లో ప్రసా రం చేయడానికి ఈ టెక్నాలజీ తోడ్పడింది. భూగోళాన్ని కాపాడుకోవాలి వాతావరణ మార్పులు ప్రపంచవ్యాప్తంగా పెను సవాళ్లు విసురుతున్నాయి. భూగోళాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. విద్యుత్ లేదా ఉక్కు వినియోగాన్ని అభివృద్ధికి కొలమానంగా చూపుతున్నారు. ఈ ధోరణి కచ్చితంగా మారాలి. విద్యుత్, ఉక్కు విచ్చలవిడి ఉత్పత్తి వల్ల పర్యావరణానికి చేటు తప్పదన్న సంగతి మర్చిపోవద్దు. ఇకపై గ్రీన్ జీడీపీ, గ్రీన్ ఎంప్లాయ్మెంట్ వంటి పరిభాషను ఉపయోగించాలి. వస్తువుల పునఃశుద్ధి, పునరి్వనియోగం ఇండియాలో చాలా సహజం. ఇప్పుడు నేను ధరించిన జాకెట్ రీసైకిల్ చేసిన ఉత్పత్తే. టెక్నాలజీ అంటే కేవలం సేవలను విస్తరించడానికే కాదు, సామాన్య ప్రజల జీవితాలను మరింత సులభతరం చేయాలని నేను నమ్ముతున్నా. తృణధాన్యాల సాగుకు ప్రాధాన్యం గత ఏడాది ఇండియాలో జీ20 సదస్సు నిర్వహించిన తర్వాత వాతావరణ మార్పులపై యుద్ధంలో వేగం పెరిగింది. వాతావరణ మార్పులను ఎదుర్కోవాలంటే మన జీవన శైలిని పర్యావరణ హితంగా మార్చుకోవాలి. ప్రకృతి, పర్యావరణహితమైన నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలి. విద్యుత్‌ను వృథా చేస్తే, నీటిని విచ్చలవిడిగా ఉపయోగిస్తే అనుకున్న లక్ష్యం సాధించలేం. తక్కువ నీరు అవసరమయ్యే తృణధాన్యాల సాగును పెంచడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. తృణధాన్యాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాం. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పెద్ద ముప్పుగా మారింది. త్వరలో కొలువుదీరే మా నూతన ప్రభుత్వ హయాంలో మహిళలకు.. ముఖ్యంగా బాలికలకు సరై్వకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తాం. సాంకేతిక ప్రజాస్వామీకరణ పునరుద్పాతక ఇంధన రంగంలో మేము శరవేగంగా దూసుకెళ్తున్నాం. గ్రీన్ హైడ్రోజన్ తయారీలో మరింత అభివృద్ధి సాధించడానికి కృషి చేస్తున్నాం. ‘సాంకేతిక ప్రజాస్వామీకరణ’ మా విధానం. డిజిటల్ విప్లవంలో గుత్తాధిపత్యానికి అడ్డుకట్ట వేశాం. ఈ రంగంలో అందరికీ సమాన అవకాశాలు కలి్పస్తున్నాం. డిజిటల్ విప్లవానికి సామాన్య ప్రజలే నాయకత్వం వహించాలన్నది మా ఆకాంక్ష. ఆ దిశగా ‘డ్రోన్ దీదీ’ పథకాన్ని ప్రవేశపెట్టాం. నమో యాప్‌లో సెల్ఫీ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఇండియా చూపుతున్న చొరవను, వేగాన్ని బిల్‌గేట్స్ ప్రశంసించారు. ఈ విషయంలో ఇతర దేశాలకు మార్గదర్శిగా మారిందని కొనియాడారు. కృత్రిమ మేధను తాను ఉపయోగించుకుంటున్న తీరును గేట్స్‌కు మోదీ తెలియజేశారు. తన సెల్‌ఫోన్‌ను గేట్స్‌కు ఇచ్చి, అందులోని ‘నమో’ యాప్ ద్వారా సెల్ఫీ తీయాలని కోరారు. అందులోని టెక్నాలజీతో పాత ఫొటోలూ కనిపిస్తాయని అన్నారు. గతంలో తామిద్దరం దిగిన ఫొటోలను గేట్స్‌కు చూపించారు. -
‘చైనా పే చర్చ’ ఎప్పుడు ?
న్యూఢిల్లీ: ఛాయ్ పే చర్చా అంటూ ప్రతీసారి మాట్లాడే ప్రధాని మోదీ.. కీలకమైన చైనా అంశంపై ‘చైనా పే చర్చ’ ఎప్పుడు నిర్వహిస్తారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిలదీశారు. ‘అరుణాచల్‌లో వాస్తవాధీన రేఖ వెంట చైనా సైనికుల చొరబాటు యత్నంతో దేశ ప్రజల్లో నెలకొన్న భయాలను తొలగించి వారిలో విశ్వాసం పాదుకొల్పేలా ఎప్పుడు మాట్లాడతారు ? అని ప్రధాని మోదీకి ఖర్గే సూటి ప్రశ్నవేశారు. ‘ దేశ ప్రధాన భూభాగంతో ఈశాన్య రాష్ట్రాలను కలిపే సింహద్వారం ‘సిలిగురి కారిడార్’ భద్రతకు మరింత ముప్పు వాటిల్లేలా చైనా డోక్లామ్‌లో శాశ్వత నిర్మాణాలు పూర్తిచేసినట్లు వార్తలొచ్చాయి. డోక్లామ్ నుంచి జంపేరీ రిట్జ్ వరకు నిర్మాణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది దేశ భద్రతను మరింత ప్రమాదంలోకి నెట్టేయడమే. ఇలాంటి కీలక తరుణంలో ‘చైనా పే చర్చ’ ఎప్పుడు నిర్వహిస్తారు?’ అని ఖర్గే శనివారం ట్వీట్‌చేశారు. కాగా, ప్రధాని వీటికి సమాధానాలు చెప్పాల్సిందేనంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ పలు ప్రశ్నలు ట్వీట్‌చేశారు. 1. తూర్పు లద్దాఖ్‌లో 2020 జూన్ 20న భారత భూభాగంలోకి చైనా చొరబడలేదని ఎందుకు చెప్పారు ? 2. 2020 మే నెల ముందువరకు అక్కడి వేలాది కి.మీ.ల విస్తీర్ణంలో పహారా కాసే మన సేనలను ఆ తర్వాత చైనా సైన్యం అడ్డుకుంటే మీరేం చేశారు ? 3. కేబినెట్ ఆమోదించిన ‘పర్వతప్రాంత మెరుపు దాడి దళం’ కార్యరూపం ఎందుకు దాల్చలేదు? -
Tea: చాయ్ గరీబుకు విందురా భాయ్
జీవితంలో చాయ్ (టీ) ఓ భాగమైపోయింది. నిద్ర లేవగానే ఓ కప్పు చాయ్ కడుపులో పడితే గాని ఏ పని చేయలేం. ఇంట్లో ఉన్నా, ఆఫీసుకు వెళ్లినా ఓ కప్పు చాయ్ కావాల్సిందే. దోస్తులు కలిసినా.. అతిథి వచ్చినా తేనీటి విందు తప్పనిసరి. భారత ప్రధాని మోదీ నిర్వహించే కార్యక్రమానికి ‘చాయ్ పే చర్చ’ అనే పేరు పేట్టారంటే టీ ఎంతలా మనలో స్థానం సంపాదించిందో అర్థం చేసుకోవచ్చు. జనంలో అత్యంత ఆదరణ ఉండడంతో టీని జాతీయ పానీయంగా గుర్తించారు. అయితే ఇక్కడ చాయ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈ రోజు ‘ఇంటర్నేషనల్ టీ డే’ కాబట్టి. సాక్షి, హైదరాబాద్: నాలుగో శతాబ్దంలో ఓ చైనా వైద్యుడికి కొంత సుస్తిగా ఉండగా, వైద్య పరీక్షల్లో భాగంగా కొన్ని ఆకులను తీసుకొని ఎండబెట్టాడు. వేడి నీటిలో వాటిని నానబెట్టగా వచ్చిన డికాషన్‌ను తాగాడు. దీంతో అతడు ఎంతో ఉత్తేజాన్ని పొందాడు. ► 15వ శతాబ్దంలో నాగరిక ప్రపంచంలో టీ తాగడం ప్రారంభమైంది. 17వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ నల్లమందుకు బదులుగా టీని చైనా నుంచి దిగుమతి చేసుకునేది. 1823లో బ్రిటన్‌కు చెందిన బ్రూస్ సోదరులు అస్సాంలో దేశీయంగా తేయాకును కనిపెట్టిట్టారు. అప్పటి నుంచి భారతదేశంలో టీ ఉత్పాదన ప్రారంభమైంది. ► 1860 నాటికి భారతదేశంలోని టీ ప్లాంటేషన్ బాగా అభివృద్ధి చెందినప్పుడు ఇక్కడ టీ ఉత్పత్తి సుమారు 10లక్షల కేజీలు ఉండేది. నేడు పశ్చిమబెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ టీని అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలుగా ప్రసిద్ధి చెందాయి. చదవండి: తల్లి వద్దు.. ప్రియుడే కావాలి.. -
ఆ చాయ్‌తో జర భద్రం..!
సాక్షి, న్యూఢిల్లీ: చాయ్ పే చర్చా..! మోదీ వచ్చాక ఈ పదం తరచూ వినబడుతోంది. పోతూ పోతూ బ్రిటీష్ వారు మనకు వారసత్వంగా ఇచ్చి వెళ్లిన తేనీటి విందు సంప్రదాయం ఇప్పుడు ఖండాంతరాలకూ పాకింది. విదేశీ పర్యటనల్లో మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్కడి దేశాధ్యక్షులతో చాయ్ పే చర్చా.. కార్యక్రమాలు జరుపుతూ పలు కీలక ఒప్పందాలు కూడా చేసుకున్నారు. అయితే, ఇప్పటి వరకు మనకు తెలిసిన టీ మాత్రమే కాకుండా పుణెలో కొత్త రకం చాయ్ అందుబాటులోకి వచ్చింది. సంప్రదాయ తేనీటికి అలవాటు పడిన వారు దీని విషయంలో కాస్త అలర్ట్‌గా ఉండాల్సిందే..! లేదంటే మట్టి పాత్రల్లో మాంచి వేడి మీద ఉండే ఈ టీతో నాలుక చుర్రుమంటుంది. ఎందుకంటే ఇది అల్లాటప్పా టీ కాదు..! ‘తందూరి చాయ్’. పుణెలోని ‘చాయ్ లా’రెస్టారెంట్ ఈ సరికొత్త చాయ్‌తో తేనీటీ ప్రియులకు కొత్త అనుభూతిని అందిస్తోంది. పొగలుగక్కే ఈ సువాసనల టీ కోసం జనం ఎగబడుతున్నారు. తందూరి చాయ్ ఇలా మొదలైంది.. ‘చాయ్ లా’ రెస్టారెంట్ నిర్వాహకులు ప్రమోద్ బంకర్, అమోల్ రాజ్డియో మాట్లాడుతూ.. ‘ పాలను మా అమ్మమ్మ లోతైన నిప్పల కుండలో పెట్టి మరిగించేది. దాన్నుంచే ఈ తందూరి చాయ్ ఐడియా వచ్చింద’ని తెలిపారు. ‘ముందుగా చిన్న చిన్న మట్టి పాత్రలను లోతైన నిప్పుల కొలిమిలో పెడతాం. అప్పటికే సగం తయారైన చాయ్‌ని ఆ పాత్రల్లో పోస్తాం. అంతే..! చుట్టూ వేడి తగలడంతో పొగలు కక్కే సువాసనల తందూరి చాయ్ రెడీ. తందూరిపై ట్విటర్లో స్పందనలు.. ఇది సంప్రదాయ టీ కన్నా రుచిగా ఉంటుందా? అన్న ప్రశ్నకు ప్రమోద్ స్పందిస్తూ.. ఇప్పటికే అనూహ్య స్పందన వచ్చిందన్నారు. రాజస్థాన్‌కు చెందిన ఓ ఎంపీ ఈ చాయ్‌కి ముగ్ధుడయ్యారని ఆయన తెలిపారు. ‘టీ అంటే నాకు చాలా ఇష్టం. తందూరి చాయ్ కోసమే ఇంత దూరం వస్తున్నా’నంటూ ఒక తేనీటి ప్రియుడు తన ట్వీట్లో ఆనందం వ్యక్తం చేశారు.‘ చాయ్‌కి నేను విరాభిమానిని. కానీ, తందూరి చాయ్.. మరీ అంత రుచిగా ఏం లేదు. సంప్రదాయ తేనీటికే నా ఓటు అని మరొకరు పేర్కొన్నారు.‘ఈ కొత్త చాయ్ విధానం మనదే అని త్వరగా పేటెంట్ హక్కులు తీసుకోండి లేదంటే పశ్చిమ దేశీయులు. ఇది స్మోక్ టీ. మేమే కనుగొన్నాం అంటార’ని.. మరొకరు సరదా వ్యాఖ్యలు చేశారు. -
చైనాలో ‘చాయ్ పే చర్చా’..!
వుహాన్, చైనా : భారత్, చైనాల మధ్య సుహృద్భావ సంబంధాలను నెలకొల్పేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య జరుగుతున్న రెండు రోజుల అనధికార భేటీల్లో భాగంగా శనివారం ఉదయం ఇరు దేశాధినేతలు ‘చాయ్ పే చర్చా’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇద్దరూ టీ తాగుతూ తూర్పు సరస్సు తీరంలోని ప్రకృతి అందాల్ని ఆస్వాదించారు. తీరం వెంబడి పక్క పక్కనే నడుచుకుంటూ ఇరుదేశాల మధ్య మెరుగుపడాల్సిన సంబంధాలపై మాట్లాడుకున్నారు. ప్రధానంగా భారత్, చైనాల మధ్య సంబంధాల బలోపేతం, ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలు నెలకొల్పడం వంటివి ఈ సందర్భంగా చర్చకు వచ్చాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ఎంఈఏ ట్విటర్ ఖాతాలో వెల్లడించారు. మోదీ, జిన్‌పింగ్‌ల ఫోటోలను ట్వీట్‌కు జోడించారు. షీ జిన్‌పింగ్‌తో రెండు రోజుల ఈ అనధికార చర్చలు చరిత్రాత్మకం అంటూ మోదీ పేర్కొన్నారని రవీష్ తెలిపారు. రెండు దేశాల మధ్య బలమైన దీర్ఘకాలిక సత్సంబంధాలు ఏర్పడాలంటే.. ‘కామన్ థింకింగ్, కామన్ రిలేషన్స్, కామన్ కో-ఆపరేషన్, కామన్ ఆస్పిరేషన్, కామన్ డ్రీమ్స్’ అనే అయిదు కీలకాంశాలు అవసరమని మోదీ పేర్కొన్నారని రవీష్ ట్వీట్లో వివరించారు. Taking India-China relations on a forward-looking path, charting the future direction of the relationship! PM @narendramodi and Chinese President Xi take a walk together along the East Lake in Wuhan today morning. pic.twitter.com/KzBSbgR4dB — Raveesh Kumar (@MEAIndia) April 28, 2018 -
శ్రీలంకలోనూ చాయ్ మంత్రం.. మోదీ తంత్రం
శ్రీలంకలో ఉన్న తమిళులను ప్రసన్నం చేసుకోడానికి ప్రధాని నరేంద్రమోదీ తనకు బాగా అలవాటైన 'చాయ్' మంత్రాన్ని పఠించారు. అటు లంక తమిళులకు, ఇటు తనకు కూడా బాగా అలవాటైన టీ గురించి చెప్పి అక్కడి వారి మనసులు దోచుకున్నారు. రెండు రోజుల శ్రీలంక పర్యటనలో భాగంగా మోదీ అక్కడున్న తమిళులను కలిశారు. తనకు కూడా టీతో ప్రత్యేక అనుబంధం ఉన్న విషయం చాలామందికి తెలిసే ఉంటుందని ఆయన అన్నారు. 2014 ఎన్నికల ప్రచారంలో తాను సాగించిన 'చాయ్‌పే చర్చా' కార్యక్రమాన్ని ఆయన గుర్తు చేశారు. తొలినాళ్లలో తాను రైల్వే స్టేషన్లో చాయ్ అమ్ముకున్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. చాయ్‌పే చర్చా అనేది కేవలం ఒక నినాదం మాత్రమే కాదని, అది ఆత్మగౌరవానికి ప్రతీక అని మోదీ శ్రీలంకలో చెప్పారు. ప్రపంచం అంతటికి సిలోన్ చాయ్ అంటే ఏంటో బాగా తెలుసని, అది ఇక్కడి సారవంతమైన భూముల నుంచే వస్తుందని, ప్రపంచంలోనే శ్రీలంక మూడో అతిపెద్ద టీ ఎగుమతిదారుగా ఉందంటే, అది అక్కడి తమిళులు కష్టపడటం వల్లేనని మోదీ చెప్పడంతో ఒక్కసారిగా సమావేశ ప్రాంగణం చప్పట్లతో మార్మోగింది. తమిళ కథానాయకుడు, రాజకీయ దురంధరుడు ఎంజీ రామచంద్రన్‌తో పాటు తమిళ మూలాలున్న శ్రీలంక స్పిన్ మాస్టర్ ముత్తయ్య మురళీధరన్ గురించి కూడా మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించడంతో అక్కడకు హాజరైన వారు కేరింతలు కొట్టారు. -
మూతపడిన 'చాయ్ పే చర్చా' టీ స్టాల్
ప్రధానమంత్రి అభ్యర్థిగా రెండేళ్ల క్రితం నరేంద్రమోదీ నిర్వహించిన పాపులర్ క్యాంపెయిన్ చాయ్ పే చర్చా అన్నీ వార్తపత్రికల్లో బ్యానర్‌గా నిలిచింది. ఈ క్యాంపెయిన్‌తో పాటు మోదీ మొదటిసారి ఎక్కడైతే చాయ్ పే చర్చను ప్రారంభించారో ఆ టీ స్టాల్కూ ఫుల్ డిమాండ్ పెరిగింది. అయితే ప్రస్తుతం ఆ స్నాక్ అవుట్‌లెట్‌ను మున్సిపల్ అధికారులు మూసేశారట. ఎల్లప్పుడూ రద్దీగా ఉండే సర్ఖేజ్-గాంధీనగర్ హైవేపై ఈ టీ స్టాల్ ఉండటంతో పాటు, సరియైన భవన వాడక అనుమతులు లేకపోవడంతో దీన్ని సీజ్ చేసినట్టు మున్సిపల్ అధికారులు వెల్లడించారు. ఈ ఇస్కోన్ గాంతియా టీ స్టాల్‌తో పాటు మొత్తం ఎనిమిది స్నాక్ అవుట్లెట్లు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఈ దుకాణాలకు సరియైన పార్కింగ్ స్థలం లేకపోవడంతో పాటు హైవే అంతా కస్టమర్లతో గందరగోళంగా మారుతోంది. దీనిపై అహ్మదాబాద్ మున్సిపల్ అథారిటీలు వివిధ నోటీసులు పంపినప్పటికీ ఈ అవుట్లెట్లు పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటుచేయలేదు. నోటీసులు పంపినా స్పందించని అవుట్లెట్లపై సీరియస్ అయిన మున్సిపల్ అధికారులు వీటిని సీజ్ చేశారు. చట్టాలను అతిక్రమించి ఈ అవుట్లెట్లను రన్ చేస్తున్నారని, అవసరమైన భవన వాడక అనుమతులు లేవని మున్సిపల్ అథారిటీలు పేర్కొన్నారు. ఈ స్నాక్ అవుట్లెట్లోనే ప్రధాని అభ్యర్థిగా మోదీ మొదటిసారి చాయ్ పే చర్చా కార్యక్రమాన్ని ప్రారంభించారు. చాయ్ పే చర్చ అనంతరం ఆ టీ స్టాల్‌కు భారీగా డిమాండ్ పెరిగింది. కస్టమర్లు కుప్పలు తెప్పలుగా విచ్చేస్తున్నారు. దీంతో హైవేపై గందరగోళ వాతావరణం నెలకొంది. -
ఆ మంత్రులు చాయ్ పే చర్చలో పాల్గొన్నాలి
న్యూఢిల్లీ: జంతు వధపై ఇద్ధరు కేంద్ర మంత్రుల మధ్య తలెత్తిన వివాదంపై బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి స్పందించారు. ఇరువురు చాయ్ పే చర్చా కార్యక్రమంలో పాల్గొని సమస్యకు పరిష్కారం కనుగొనాలని సలహా ఇచ్చారు. అంతే కాని బహిరంగంగా విమర్శలు చేసుకోవడం వల్ల ఉపయోగం లేదని తెలిపారు. పర్యావరణం పరిరక్షణపై మేనక చాలా కాలంగా కృషి చేస్తున్నారని ఆమె లేవనెత్తిన అంశాలకు మంత్రి బహిరంగంగా కాకుండా ఫోన్ లో సమాధానం చెబితే బాగుండేదని స్వామి అభిప్రాయపడ్డారు. అడవిపందులు, కోతులు, నీలి ఎద్దులు, నెమళ్ల వధకు కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్ర్రాల్లో అనుమతించిన విషయం తెలిసిందే. -
జీఎస్టీ బిల్లుపై ముందడుగు
సోనియా, మన్మోహన్‌లతో ప్రధాని మోదీ భేటీ బిల్లుపై ప్రతిష్టంభన తొలగించేందుకు విపక్ష నేతలతో చర్చలు కాంగ్రెస్ డిమాండ్లు రెండింటికి ప్రభుత్వం అంగీకారం? 18% గరిష్ట పరిమితికి ఓకే.. అంతర్రాష్ట్ర రవాణాపై అదనపు పన్ను లేదు! పార్టీలో అంతర్గతంగా చర్చించి చెప్తామన్న కాంగ్రెస్ అధినాయకత్వం ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్న అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు న్యూఢిల్లీ: వస్తువులు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లుపై ప్రభుత్వం - ప్రతిపక్షాల మధ్య ప్రతిష్టంభన ప్రధానమంత్రి నరేంద్రమోదీ చొరవతో తొలగిపోతున్న సంకేతాలు వెలువడ్డాయి. ప్రధాని శుక్రవారం రాత్రి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌లతో సమావేశమై జీఎస్టీ బిల్లుపై చర్చించారు. మోదీ ఆహ్వానంతో ప్రధాని నివాసానికి చేరుకున్న సోనియా, మన్మోహన్లు ఆయనతో దాదాపు 45 నిమిషాల పాటు ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు కూడా ఈ సమావేశంలో ఉన్నారు. ఈ సందర్భంగా జీఎస్టీ బిల్లుపై ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం తమ తమ వైఖరులను విశదీకరించాయి. బిల్లు విషయంలో కాంగ్రెస్ లేవనెత్తిన మూడు అభ్యంతరాలపై ప్రభుత్వం తన స్పందన తెలియజేసింది. దేశవ్యాప్తంగా ఏకీకృత పన్ను విధానానికి ఉద్దేశించిన జీఎస్టీ గరిష్ట పరిమితి 18 శాతమే ఉండాలని.. రాష్ట్రాల మధ్య రవాణా అయ్యే వస్తువులపై అదనంగా ఒక శాతం పన్ను వద్దని, రాష్ట్రాలు తమ రెవిన్యూ నష్టాన్ని పూడ్చుకోవడానికి ఐదేళ్లపాటు వాటికి వంద శాతం పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుండడం తెలిసిందే. ఇందులో జీఎస్టీని గరిష్టంగా 18 శాతానికే పరిమితం చేయటానికి, రాష్ట్రాల మధ్య రవాణా అయ్యే వస్తువులపై ఒక శాతం అదనపు పన్ను ప్రతిపాదనను ఉపసంహరించుకోవటానికి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసినట్లు.. మోదీ, సోనియా, మన్మోహన్‌ల భేటీ అనంతరం టీవీ చానళ్లలో వార్తలు వెలువడ్డాయి. అయితే.. జీఎస్టీ అమలుతో ఆదాయం నష్టపోతున్న రాష్ట్రాలకు ఐదేళ్ల పాటు నూరు శాతం పరిహారం అంశంతో పాటు.. రాష్ట్రాల మధ్య ఆదాయ పంపిణీలో వివాదాలను పరిష్కరించటానికి రాజ్యాంగ హోదాతో స్వతంత్య్ర వ్యవస్థను నెలకొల్పాలన్న కాంగ్రెస్ మరో డిమాండ్ పైనా ప్రభుత్వం తన వైఖరిని వివరించినట్లు సమాచారం. ఆయా అంశాలపై పార్టీలో అంతర్గతంగా చర్చించుకుని స్పందిస్తామని కాంగ్రెస్ నాయకత్వం తెలియజేసింది. మొత్తం మీద కాంగ్రెస్ డిమాండ్లలో కొన్నిటికి ప్రభుత్వం ఓకే చెప్పటంతో పార్లమెంటు సీతాకాల సమావేశాల్లో కీలకమైన జీఎస్టీ బిల్లు ఆమోదానికి ముందడుగు పడినట్లేనని పరిశీలకులు భావిస్తున్నారు. మోదీ తొలిసారి నేరుగా: ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక చొరవ తీసుకుని ప్రధాన విపక్షాన్ని నేరుగా సంప్రదించడం ఇదే తొలిసారి. ప్రస్తుత సమావేశాలు సజావుగా సాగేందుకు సహకారం కోసం ఆయన ఈ భేటీ జరిపారు. రేస్‌కోర్స్ రోడ్డులోని తన నివాసంలో తేనీటి విందుకు సోనియా, మన్మోహన్‌లను ఆహ్వనించిన ఆయన వారితో పార్లమెంట్లో పెండింగులో ఉన్న అంశాలు.. గత రెండు సమావేశాల నుంచి పెద్ద సంఖ్యలో పేరుకుపోయిన బిల్లులపై చర్చించారు. భేటీ అనంతరం వివరాలను జైట్లీ మీడియాకు తెలిపారు. ‘బిల్లు చరిత్ర, నేపథ్యం, విపక్ష అభ్యంతరాలపై ప్రభుత్వ స్పందనను వారికి వివరించాం. కాంగ్రెస్ నేతలు ఇక అంతర్గతంగా చర్చిస్తారు. తర్వాత ప్రభుత్వం వారిని సంప్రదిస్తుంది. మేం కూడా వారి వాదనను పరిగణనలోకి తీసుకున్నాం’ అని తెలిపారు. పెండింగులో ఉన్న కొన్ని బిల్లుపై ముందుకు సాగేందుకు వెంకయ్యనాయుడు లోక్‌సభ, రాజ్యసభల్లో కాంగ్రెస్ నేతలను సంప్రదిస్తారని వెల్లడించారు. జీఎస్టీ బిల్లు రాజ్యసభలో పెండింగులో ఉండడం, ప్రభుత్వానికి ఆ సభలో మెజారిటీ లేకపోవడం తెలిసిందే. పన్నుపై పరిమితి ఉండాలి: రాహుల్ జీఎస్టీ విషయంలో బీజేపీకి సహకరించేందుకు తమ పార్టీ సిద్ధమని, అయితే ఆ పన్నుపై పరిమితి ఉండాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. పేదప్రజలపై పన్ను భారం పడొద్దన్నది తమ అభిమతమని శుక్రవారం పార్లమెంట్ వెలుపల విలేకరులతో పేర్కొన్నారు. ప్రధాని మోదీ.. ప్రజల ఒత్తిడితోనే జీఎస్టీపై చర్చకు సోనియా, మన్మోహన్ సింగ్‌లను ఆహ్వానించారని, అలా కాకుండా సహజంగానే విపక్షాన్ని సంప్రదించాలని పేర్కొన్నారు. -
సోనియాతో మోదీ 'చాయ్ పె చర్చా'..
న్యూఢిల్లీ: ఎన్డీఏ ప్రవేశపెట్టిన పలు కీలక బిల్లులు 'ఆమోదం' గట్టెక్కకుండా 'పెండింగ్'లోనే మగ్గిపోతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ముందడుగు వేశారు. ప్రస్తుత సమావేశాల్లో ప్రధానాంశమైన వస్తు సేవల పన్ను (జీఎస్ టీ) బిల్లు సహా ఇతర కీలక బిల్లుల ఆమోదానికి ప్రధాన విపక్ష పార్టీతో చర్చలకు సిద్ధమయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోయినా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లను శుక్రవారం తేనీటి విందుకు ఆహ్వానించారు. నేటి పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడిన అనంతరం ఈ 'చాయ్ పె చర్చా' ప్రారంభమవుతుందని, ఇరు పక్షాల మధ్య వివిధ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. అంతకుముందు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. తాము కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నట్లు చెప్పారు. కాంగ్రెస్ తోపాటు విపక్షాలన్నింటితో మాట్లాడుతూనే ఉన్నామని, ఈ సమావేశాల్లోనే జీఎస్టీ బిల్లుకు ఆమోదం లభిస్తుందనే నమ్మకముందన్నారు. రాజ్యాంగం అమలుపై జరుగుతున్న ప్రత్యేక చర్చలో భాగంగా నేడు లోక్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడతారని, మరో మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభనుద్దేశించి ప్రసంగిస్తారని చెప్పారు. -
‘అణు’మార్గం సుగమం
అమెరికా అధ్యక్షుడికి అపూర్వ స్వాగతం అణు ఒప్పందంపై ప్రతిష్టంభనకు తెరదించిన మోదీ, ఒబామా భారత్-అమెరికా అణు ఒప్పందంపై ఆరేళ్ల ప్రతిష్టంభనకు తెర ఒబామా, మోదీ చర్చల్లో పరిష్కారం అణు వాణిజ్య సహకారం అమలుకు నిర్ణయం సరికొత్త శిఖరాలకు రక్షణ సహకారం.. రక్షణ రంగంలో 4 ప్రాజెక్టుల్లో సంయుక్త అభివృద్ధి, ఉత్పత్తికి ఒప్పందాలు ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా సామర్థ్యాల బలోపేతానికి ద్వైపాక్షిక సహకారం హైదరాబాద్ హౌస్‌లో ఇరువురి సుదీర్ఘ చర్చల్లో నిర్మాణాత్మక ఫలితాలు, నిర్ణయాలు భారత్ ఆరేళ్లుగా ఎదురుచూస్తున్న ‘అణు’ ఒప్పందం అమలు దిశగా ముందడుగు పడింది.. దీనిపై నెలకొన్న ప్రతిష్టంభనకు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా జరిపిన చర్చలు తెరదించాయి. ఈ అంశంలో అమెరికా అభ్యంతరాలపై భారత్ భరోసా కల్పించింది. ఈ చర్చల్లో అణు ఒప్పందంతో పాటు రక్షణ సహకారం మరింత పెంపు, అంతర్జాతీయ ఎగుమతుల కూటముల్లో భారత్‌కు పూర్తిస్థాయి సభ్యత్వం, ఉగ్రవాదంపై పోరు, వివిధ రంగాల్లో భాగస్వామ్యం తదితర అంశాలపై ముందడుగు వేయాలని నిర్ణయించారు. ఇక భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చిన ఒబామా దంపతులకు కనీవినీ ఎరుగని రీతిలో ఘన స్వాగతం లభించింది. ప్రధాని మోదీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఒబామా దంపతులకు స్వాగతం పలకగా.. రాష్ట్రపతి భవన్లో దేశంలోనే అత్యుత్తమమైన ‘21 గన్ శాల్యూట్’, సైనిక వందనం’తోనూ గౌరవించారు. హైదరాబాద్ హౌస్‌లోని లాన్లో కూర్చున్నప్పుడు ఒబామాకు మోదీ స్వయంగా ‘చాయ్’ కలిపి ఇచ్చారు. తనకు అపూర్వ ఆతిథ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ.. భారతీయ సంప్రదాయంలో రెండు చేతులనూ జోడించి ‘నమస్తే’ చెప్పారు. న్యూఢిల్లీ: భారత్-అమెరికాల మధ్య పౌర అణు సహకారంపై ఒప్పందం కుదిరిన ఆరేళ్ల తర్వాత.. ఆ ఒప్పందం అమలు దిశగా ముందడుగు పడింది. అణు ఒప్పందంపై నెలకొన్న ప్రతిష్టంభనకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, భారత ప్రధాని నరేంద్ర మోదీలు ఆదివారం ఢిల్లీలో జరిపిన చర్చలు తెరదించాయి. ఇద్దరు అగ్రనేతల మధ్య హైదరాబాద్ హౌస్‌లో మూడు గంటల పాటు కొనసాగిన చర్చల్లో.. అణు ఒప్పందం అమలుకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు.. ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడంపైనా ఒప్పందాలు ఖరారు చేసుకున్నారు. అణు ఒప్పందం అమలుపై గణనీయ ఫలితం సాధించామని ఒబామా అభివర్ణించినప్పటికీ, దీని విధివిధానాలు ఏంటనేది వెంటనే తెలియరాలేదు. హైదరాబాద్‌హౌస్‌లో ఒబామా, మోదీలు ముఖాముఖిగా, ఇరు దేశాల ఉన్నతస్థాయి ప్రతినిధి బృందాలతో కలసి, ఇరువురూ తోటలో విహరిస్తూ చర్చలు జరిపారు. తర్వాత సంయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటించారు. అణు వాణిజ్య సహకారం దిశగా ముందడుగు.. ‘‘భారత గణతంత్ర దినోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొంటున్న తొలి అమెరికా అధ్యక్షుడు, భారత్‌లో రెండోసారి పర్యటించిన తొలి అమెరికా అధ్యక్షుడు ఒబామాయే అన్న వాస్తవం. రెండు దేశాల మధ్య బలపడుతున్న సంబంధాలకు సూచికలు. కొద్ది నెలలుగా ఈ సంబంధంలో కొత్త ఉద్విగ్నత, విశ్వాసాలు నాకు కనిపించాయి. మా సంబంధాల్లో నూతనోత్తేజం కనిపించింది. గత సెప్టెంబర్‌లో ఇందుకు నేపథ్యాన్ని నెలకొల్పినందుకు మీ నాయకత్వానికికృతజ్ఞతలు చెప్తున్నా. కొత్త రూపం తీసుకున్న మన సంబంధాల్లో పౌర అణు ఒప్పందం కేంద్ర బిందువు. ఇది కొత్త విశ్వాసాన్ని రుజువుచేసింది. ఇది కొత్త ఆర్థిక అవకాశాలనూ సృష్టించింది. స్వచ్ఛ ఇంధనశక్తి కోసం మన అవకాశాలను విస్తరించింది. 4 నెలలుగా దీనిని ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో మేం కృషి చేశాం. ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేసిన ఆరేళ్ల తర్వాత మా చట్టానికి, మా అంతర్జాతీయ న్యాయ బాధ్యతలకు, సాంకేతికంగా, వాణిజ్యపరంగా ఆచరణ సాధ్యతలకు అనుగుణంగా వాణిజ్య సహకారం దిశగా ముందడుగు వేస్తుండటం నాకు సంతోషాన్నిస్తోంది’ అని మోదీ పేర్కొన్నారు. అవరోధాలకు నేడు పరిష్కారం సాధించాం.. ఒబామా మాట్లాడుతూ.. ‘మా పౌర అణు సహకారంపై ముందుకెళ్లకుండా నిరోధిస్తున్న రెండు అంశాలకు ఈ రోజు మేం పరిష్కారం సాధించాం. దానిని పూర్తిస్థాయిలో అమలు చేయటానికి మేం కట్టుబడి ఉన్నాం’ అని పేర్కొన్నారు. ‘ఇది చాలా ముఖ్యమైన ముందడుగు. మన సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి మేం ఉమ్మడిగా ఎలా కృషి చేయగలమనేది ఇది చాటుతోంది’ అని అన్నారు. నాలుగు అంతర్జాతీయ ఎగుమతుల కూటముల్లో భారత్‌కు త్వరగా పూర్తిస్థాయి సభ్యత్వం కల్పించేలా మద్దతిచ్చేందుకు అమెరికా కృషి చేస్తుందని కూడా ఒబామా హామీ ఇచ్చినట్లు మోదీ తెలిపారు. ‘రెండు దేశాల మధ్య పెరుగుతున్న రక్షణ సహకారాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లాలనీ నిర్ణయించాం.ఆధునిక రక్షణ ప్రాజెక్టులను ఉమ్మడిగా అభివృద్ధి చేయాలని, ఉత్పత్తి చేయాలని అంగీకారానికి వచ్చాం. దేశీయ రక్షణ పరిశ్రమ స్థాయి పెరగటానికి, భారత్‌లో తయారీ రంగ విస్తరణకు ఇవి దోహదపడతాయి’ అని మోదీ అన్నారు. ఉగ్రవాద సంస్థల మధ్య తేడా చూపరాదు.. ప్రస్తుత సవాళ్లు అలాగే ఉన్నప్పటికీ ఉగ్రవాదమనేది ముఖ్యమైన ప్రపంచ ముప్పుగానే ఉందని, అది సరికొత్త రూపం తీసుకుంటోందని మోదీ పేర్కొన్నారు. ‘ఉగ్రవాదంపై పోరాటం చేయడానికి సమగ్ర అంతర్జాతీయ వ్యూహం, విధానం అవసరమని అగీకారానికి వచ్చాం. ఉగ్రవాద సంస్థల మధ్య ఎలాంటి భేదమూ చూపరాదు. ఉగ్రవాదులకు భద్రమైన ఆవాసాలుగా ఉన్న ప్రాంతాలను నిర్మూలించేందుకు, వారిని చట్టం ముందు నిలిపేందుకు ప్రతి దేశమూ తన బాధ్యతను నిర్వర్తించాలి’ అని చెప్పారు. ఉగ్రవాద వ్యతిరేక సామర్థ్యాలను, సాంకేతికతను మరింతగా మెరుగుపరచుకోవడానికి రెండు దేశాలూ ద్వైపాక్షిక భద్రతా సహకారాన్ని బలోపేతం చేస్తాయన్నారు. ముంబైపై 26/11 ఉగ్రవాద దాడుల సూత్రధారులను చట్టం ముందు నిలబెట్టాలని పాకిస్తాన్‌కు అమెరికా, భారత్‌లు స్పష్టం చేశాయి. ప్రాంతీయ సహకారం గురించి ప్రస్తావిస్తూ.. రెండు దేశాల భవిష్యత్తుకు, ప్రపంచ భవిష్యత్తుకు కీలకమైన ఆసియా పసిఫిక్, హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి, సుస్థిరత, సుసంపన్నతలను పెంపొందించేందుకు సహకారాన్ని బలోపేతం చేయాలన్న తమ నిబద్ధతను ఇరు దేశాలూ పునరుత్తేజితం చేశాయన్నారు. అఫ్ఘానిస్థాన్ నుంచి అమెరికా బలగాలను పూర్తిగా ఉపసంహరించిన తర్వాత అఫ్ఘాన్ పరిణామక్రమంలో దోహదపడేందుకు కృషి చేయటంపై కూడా ఒబామా, తాను చర్చించామని మోదీ చెప్పారు. అఫ్ఘాన్ ప్రజలకు తమ రెండు దేశాలూ విశ్వసనీయమైన భాగస్వాములుగా ఉంటాయని ఒబామా పేర్కొన్నారు. ‘ఇరు దేశాల పురోభివృద్ధికి, ప్రపంచ వ్యాప్తంగా శాంతి, సుస్థిరత, సుసంపన్నత ముందుకెళ్లడానికి భారత్ - అమెరికాల భాగస్వామ్యం విజయవంతం కావడం ముఖ్యం. విజ్ఞానశాస్త్రం, సాంకేతికత, నవీన ఆవిష్కరణ, వ్యవసాయం తదితరాల్లో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం కొనసాగిస్తాం’ అని మోదీ చెప్పారు. ఇరు దేశాల మధ్య హాట్ లైన్లు నెలకొల్పుతాం ‘మన విస్తృత ప్రాంతంలో అభివృద్ధి, అనుసంధానాన్ని పెంపొందించేందుకు కలిసి కృషిచేయాల్సిన బాధ్యతను చేపట్టినపుడే వ్యూహాత్మక భాగస్వామ్యం పరిపూర్ణమవుతుంది. దీనిని ప్రాధాన్యంగా గుర్తించి ఈ లక్ష్య సాధనకు కృషిచేయాలని ఒబామా నేనూ అంగీకరించాం. మా సంబంధం ఈ రోజు కొత్త స్థాయికి చేరింది. ఈ శతాబ్దపు అవకాశాలను, సవాళ్లను ప్రతిఫలించేలా మా స్నేహానికి, సహకారానికి విస్తృత ప్రణాళికను రచించాం. భారత్ - అమెరికాలు చాలా తరచుగా శిఖరాగ్ర సదస్సులు నిర్వహించాలని అంగీకారినికి వచ్చాం. అమెరికా, భారత్‌ల జాతీయ భద్రతా సలహాదారుల మధ్య హాట్లైన్లను కడా నెలకొల్పుతాం. ఈ ఏడాది ఆరంభంలో మేం సరికొత్త ప్రయాణం మొదలు పెడతాం’ అని చెప్పారు. ‘అణు’మానాలు తొలగినట్లే.. అణు బాధ్యతకు ‘సమీకరణ నిధి’ పరిష్కారం భారతదేశపు ‘అణు బాధ్యత చట్టం’లోని.. అణు విద్యుత్ ప్లాంట్లలో అణు ప్రమాదాలేవైనా జరిగినట్లయితే సంబంధిత అణు సరఫరాదారులే నేరుగా బాధ్యత వహించాలన్న నిబంధనపై అమెరికాకు చెందిన అణు రియాక్టర్ల తయారీ సంస్థలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేస్తుండడం తెలిసిందే. ఆ చట్టం ప్రకారం.. ఏదైనా అణు ప్రమాదం సంభవిస్తే ప్రభావితులకు పరిహారం చెల్లించేందుకు రియాక్టర్ నిర్వహణ సంస్థ రూ. 1,500 కోట్లు పక్కన పెట్టాలి. అయితే.. సరఫరాదారుల నుంచి నిధుల హక్కును నిర్వహణదారు కోరవచ్చు. ఈ నిబంధన వల్ల భారత అణు రంగంలో పెట్టుబడులు పెట్టడం కష్టమవుతోందని విదేశీ అణు సరఫరాదారులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో అణు రియాక్టర్లకు బీమా కల్పించే అంశమూ పీటముడిగా మారింది. అలాగే.. భారత్‌కు సరఫరా చేసే అణు ఇంధనాలను వాటికి సంబంధించిన అణు రియాక్టర్లకు చేరుతున్నాయో లేదో తాను స్వయంగా పర్యవేక్షించి, పరిశీలిస్తానని అమెరికా పట్టుపడుతోందని, ఇందుకు భారత్ వ్యతిరేకిస్తోందని, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) భద్రతా ప్రమాణాల మేరకే పనిచేస్తామని చెప్తోందని సమాచారం. పౌర అణు ఒప్పందం అరేళ్లుగా అమలుకాకపోవటానికి ఈ రెండు కీలక అంశాలే కారణం కాగా.. వీటిపై తాజాగా ఎలాంటి పరిష్కారాలు కనుగొన్నారన్నది తెలియరాలేదు. అయితే.. అణు ప్రమాదం జరిగిన పక్షంలో అందుకు సంబంధిత సరఫరాదారులే బాధ్యత వహించాలన్న నిబంధన విషయంలో అమెరికాకు భరోసా ఇచ్చేందుకు భారత్ ఒక ప్రతిపాదన చేస్తోంది. అణు ప్రమాదం జరిగినా అమెరికా అణు రియాక్టర్ల సంస్థలపై భారం పడకుండా భద్రత కల్పించేందుకు తాము ఒక సమీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్తోంది. రియాక్టర్లకు బీమా కల్పించేందుకు విదేశీ సంస్థలను అనుమతించటానికి సుముఖంగా లేని భారత్.. అందుకోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీని కోరింది. అయితే.. ఆ సంస్థ వద్ద ఇందుకు అవసరమైనంత ఆర్థిక సామర్థ్యం లేదు. దీంతో.. పలు కంపెనీలు తమ నిధులను ఒక చోటకు సమీకరించి రియాక్టర్లకు బీమా కల్పించేలా.. అణు బీమా సమీకరణ నిధిని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు నాలుగు ప్రభుత్వ బీమా సంస్థలు రూ. 750 కోట్లను సమీకరించాయి. ఇది అవసరమైన మొత్తంలో కేవలం సగం మాత్రమే కావటంతో..ఏదైనా ప్రమాదం జరిగిన పక్షంలో మిగతా మొత్తాన్ని ప్రభుత్వమే కేటాయిస్తుంది. కాగా, అణు ప్రమాదాలకు బాధ్యత, అణు పదార్థాల జాడ తెలుసుకోవడానికి సంబంధించి అమెరికాకు ఉన్న అభ్యంతరాలు.. ఒబామా - మోదీ సమావేశంలో కుదిరిన అవగాహనతో పరిష్కారమయ్యాయని ఆ దేశ ఉప జాతీయ భద్రతా సలహాదారు బెన్ రోడ్స్ వాషింగ్టన్లో అన్నారు. మరోవైపు. ప్రతిష్టంభనను బద్దలుకొట్టామని, అణు బాధ్యత నిబంధన, అణు ఇంధనం జాడ తెలుసుకోవటంపై అమెరికాకు భరోసాలు ఇచ్చామని భారత ప్రభుత్వం తెలిపింది. ‘మీతో ఎక్కువ వ్యాపారం చేయాలనుకుంటున్నాం’ ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం(బిట్)పై చర్చలను పునఃప్రారంభించాలని భారత్, అమెరికాలు నిర్ణయించాయి. రెండు దేశాల్లోనూ పరస్పర పెట్టుబడులకు భద్రత కల్పించేందుకు ఉద్దేశించిన ఈ ఒప్పందంపై 2008 నుంచి చర్చలు జరుగుతున్నాయి. భారత్, అమెరికాల వాణిజ్యం గత కొన్నేళ్లలో 60 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 100 బిలియన్ డాలర్లకు చేరుకుందని ఒబామా చెప్పారు. ‘మరింత ఎక్కువగా వ్యాపారం చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ వ్యాపారం చేయడం మరింత సులభం చేస్తూ ప్రధాని అమలు చేస్తున్న సంస్కరణలను స్వాగతిస్తున్నాం. మరింత ఎక్కువ మంది భారతీయులను బ్యాంకు ఖాతాలతో సాధికారం చేయాలని, భారతీయులకు పరిశుభ్రమైన నీరు, గాలి అందించాలని మోదీ చేస్తున్న కృషిని నాకు వివరించారు. ఈ కృషిలో భాగస్వాములం కావాలని కోరుకుంటున్నాం’ అని పేర్కొన్నారు. కాగా, అమెరికాలో పనిచేస్తున్న భారతీయ వృత్తి నిపుణులకు ముఖ్యమైన సామాజిక భద్రత ఒప్పందంపై చర్చలను కూడా పునఃప్రారంభిస్తామని మోదీ చెప్పారు. రక్షణ ఒప్పందం పొడిగింపు భారత్-అమెరికాల మధ్య ఈ ఏడాదితో ముగియనున్న 2005 నాటి రక్షణ చట్ర ఒప్పందం (డిఫెన్స్ ఫ్రేమ్‌వర్క్ అగ్రిమెంట్)ను మరో పదేళ్లు కొనసాగించేలా తాజాగా ఒప్పందం ఖరారైంది. ఉన్నతస్థాయి రక్షణ సామగ్రిని సంయుక్తంగా ఉత్పత్తి చేయటానికి ఇది తోడ్పాటునిస్తుంది. ఇందులో భాగంగా ఖరారుచేసిన డిఫెన్స్ టెక్నాలజీ అండ్ ట్రేడ్ ఇనీషియేటివ్ కింద.. కొత్త తరం రావెన్ మిని యూఏవీలు, సి-130 సైనిక రవాణా విమానానికి ప్రత్యేక కిట్లు, మొబైల్ ఎలక్ట్రిక్ హైబ్రీడ్ పవర్ సోర్స్, యూనిఫాం ఇంటిగ్రేటెడ్ ప్రొటెక్షన్ ఇంక్రిమెంట్ 2 అనే ప్రాజెక్టులను అభివృద్ధి చేయటం, ఉత్పత్తి చేయటం చేపట్టాలని నిర్ణయించినట్లు భారత్ తెలిపింది. ‘క్లీన్ ఎనర్జీ’కి మద్దతు స్వచ్ఛ ఇంధనశక్తి (క్లీన్ ఎనర్జీ) కోసం, వాతావరణ మార్పు అంశాలపై పోరాటంలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందిస్తామని భారత్, అమెరికాలు ప్రకటించాయి. వచ్చే వేసవి కాలంలో భారత్‌లో క్షేత్రస్థాయి పెట్టుబడి అధికారిని నియమించటం ద్వారా స్వచ్ఛ ఇంధనశక్తికి నిధులను వేగవంతం చేయడానికి అమెరికా అంగీకరించింది. ఈ రంగంలోకి ప్రయివేటు పెట్టుబడులను రప్పించేలా మద్దతివ్వడానికి ఒక బృందాన్నీ నియమిస్తామని పేర్కొంది. వాతావరణ మార్పు అంశంపై చర్చల్లో భారత్ వాణి చాలా ముఖ్యమైనదని ఒబామా పేర్కొన్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించే విషయంలో అమెరికా - చైనాల మధ్య కుదిరిన ఒప్పందం తరహా ఒప్పందం కుదుర్చుకునేలా భారత్‌పై ఒత్తిడి ఉందా? అని విలేకర్లు మోదీని ప్రశ్నించగా.. ‘ ఏ ఒత్తిడి అనేది భారత్‌పై ప్రభావం చూపదు. అయితే.. భవిష్యత్ తరానికి మనం ఎలాంటి వాతావరణం అందిస్తామనేదానిపై ఒత్తిడి ఉంది. వాతావరణ మార్పు అనేదే ఒత్తిడి. భూతాపోన్నతి అనేదే ఒత్తిడి’ అని అన్నారు. -
చాయ్ పే చర్చా బాగా జరిగింది: ఒబామా
-
చాయ్ పే చర్చా బాగా జరిగింది: ఒబామా
మాడిసన్ స్క్వేర్ ప్రసంగం అద్భుతం బాలీవుడ్ స్టార్లకు వచ్చినట్లు జనం వచ్చారు మోదీపై అమెరికా అధ్యక్షుడి ప్రశంసల జల్లు అన్ని రంగాల్లో సహకారం ఉంటుందని భరోసా భద్రతామండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి మద్దతు న్యూఢిల్లీ: నమస్తే.. మేరా ప్యారా భాయీ నమస్కార్ అంటూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీకి, తనకు మధ్య 'చాయ్‌పే చర్చా' బాగా జరిగిందని, ఇలాంటివి వైట్‌హౌస్‌లో కూడా మరిన్ని జరగాలని ఒబామా అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ''భారతదేశంతో బంధం మరింత దృఢపరుచుకోవడం నా హయాంలో జరుగుతున్నందుకు సంతోషం. ఒకే పదవీ కాలంలో రెండుసార్లు వచ్చిన మొదటి అధ్యక్షుడిని నేనే. రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. రెండు దేశాల మధ్య వాణిజ్యం పెరిగింది. అణు విస్తరణ విషయంలో కూడా రెండు దేశాల మధ్య బంధం బలోపేతమైంది. గత నెలలో వాషింగ్టన్ వచ్చినప్పుడు, అక్కడ న్యూయార్క్ మాడిసన్ స్క్వేర్‌లో మీ ప్రసంగానికి బాలీవుడ్ స్టార్‌కు వచ్చినట్లుగా జనం రావడం చూసి ఆశ్చర్యపోయాం. 'చాయ్ పే చర్చా' బాగా జరిగింది. ఇలాంటివి వైట్ హౌస్‌లో కూడా జరగాలి. ఇప్పటికే రెండు దేశాల మధ్య 100 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోంది. ఇది మరింత పెరగాలని ఆశిస్తున్నాం. ఇండియాతో మరింత హైటెక్ సహకారం ఉంటుంది. స్వచ్ఛమైన ఇంధనం విషయంలో కూడా మా సహకారం ఉంటుంది. రెండు దేశాల సంయుక్త ప్రాజెక్టులు మరిన్ని ప్రారంభం అవుతాయి. వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుని హైడ్రో ఫ్లోరో కార్బన్లను తగ్గించాలని నిర్ణయించుకున్నాం. మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తున్నాం. మరో పదేళ్ల పాటు కూడా ఇలాగే సహకారం కొనసాగాలని భావిస్తున్నాం. రక్షణ రంగంలోను, అణు రంగంలోను కూడా సహకారం ఉంటుంది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుందని భారతీయులకు మరోసారి చెబుతున్నాను'' అన్నారు. అనుకున్న సమయం కంటే దాదాపు 20 నిమిషాలు ఆలస్యంగా సంయుక్త విలేకరుల సమావేశం ప్రారంభమైంది. అంతకుముందు ఇరు పక్షాల మధ్య సుదీర్ఘంగా చర్చోపచర్చలు సాగాయి. సంయుక్త ప్రకటనను ఇరుదేశాల ఉన్నతాధికారులు సిద్ధం చేయగా, దానికి ఇటు ప్రధాని నరేంద్రమోదీ, అటు బరాక్ ఒబామా ఇద్దరూ కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ, అధ్యక్షుడు ఒబామా ఎప్పుడొస్తారా అని చాలాసేపు బయట ఇరు దేశాల మంత్రులు, జాతీయ.. అంతర్జాతీయ మీడియా ఆసక్తిగా ఎదురు చూడటం కనిపించింది. ఈలోపు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ తదితరులు అమెరికా బృందంతో మాటా మంతీ సాగించారు. -
చాయ్‌వాలాX పాన్వాలా
దేశాన్ని ఓ ఊపు ఊపిన ‘ఒ ఖయికె పాన్ బనారస్వాలా’.. పాట గుర్తుందా? హిందీ బ్లాక్‌బస్టర్ సినిమా డాన్‌లోని ఆ ట్యూన్ వినగానే.. పాన్ వేసుకుని అమితాబ్ బచ్చన్ వేసిన స్టెప్స్ గుర్తొస్తాయి కదా! ఆ పాట ఇప్పుడు వారణాసి వీధుల్లో మార్మోగుతోంది. కారణమేంటంటారా?.. చదవండి. వారణాసి నుంచి పోటీ చేస్తున్న బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ.. తాను చిన్నప్పుడు రైల్వే స్టేషన్లో టీలు అమ్మానంటూ ప్రచారం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. దాంతో, నా ఇలాఖాలో మోడీ హవా ఏంటి? అనుకున్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్.. వారణాసిలో మోడీకి దీటైన వ్యక్తిని ఎస్పీ అభ్యర్థిగా బరిలో నిలిపాడు. చాయ్‌వాలాకు పోటీగా పాన్‌వాలాను రంగంలోకి దింపాడు. దాంతో ‘మోడీ చాయ్‌వాలా అయితే, నేను పాన్వాలా’ అంటూ ‘పాన్ బనారస్వాలా’ పాట సపోర్ట్‌తో ఆ అభ్యర్థి కైలాశ్ చౌరాసియా జోరుగా ప్రచారం చేస్తున్నారు. తరతరాలుగా తమ వాళ్లు వక్కలు అమ్మేవాళ్లని, తాను కూడా చాలా ఏళ్లు పాన్లు అమ్మానని చెబుతున్నారు. అలా అని ఈ చౌరాసియాది మామూలు స్థాయేం కాదు. ఇప్పటికే ఆయన అఖిలేశ్ మంత్రివర్గంలో సీనియర్ మంత్రి. చౌరాసియా వర్గీయులు వారణాసిలో అధిక సంఖ్యలో ఉండటం ఆయనకు కలిసొచ్చే మరో అంశం. వారిలో చాలామంది ఇప్పటికీ వక్కలమ్మే బిజినెస్‌లోనే ఉన్నారు. మోడీలా ప్రచారం కోసం కోట్లు ఖర్చుపెట్టి ‘చాయ్ పే చర్చ’ లాంటి కార్యక్రమాలు చేపట్టనని, నియోజకవర్గంలోని పాన్వాలాలందరినీ వ్యక్తిగతంగా కలిసి మద్దతు కోరుతానని చౌరాసియా చెబుతున్నారు. అమెరికాలోనూ ‘చాయ్ పే చర్చ’ మోడీకి మద్దతుగా అమెరికాలోనూ బీజేపీ అభిమానులు భారీ ఎత్తున ‘చాయ్ పే చర్చ’ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ (ఓఎఫ్‌బీజేపీ) అమెరికాలో పలుచోట్ల ఇప్పటికే వందల సంఖ్యలో ‘చాయ్ పే చర్చ’ కార్యక్రమాలు నిర్వహించింది. ఓఎఫ్‌బీజేపీ అమెరికా శాఖ అధ్యక్షుడు చంద్రకాంత్ పటేల్ అమెరికా నలుమూలలా పర్యటిస్తూ, ఎన్ఆర్ఐలను కలుసుకుంటూ, బీజేపీని గెలిపించాలంటూ ప్రచారం చేస్తున్నారు. -
ప్రధాని అయితే మీరేం చేస్తారు..?
మొయినాబాద్: ’రైతులు పండించిన పంటలు నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజీలు లేవు. మార్కెట్‌కు తెస్తే.. గిట్టుబాటు ధర ఉండదు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్నాం. తెలంగాణలో కరెంటు కూడా సరిగా ఉండదు. మీరు ప్రధానమంత్రి అయితే రైతుల కోసం ఏం చేస్తారు..’ అని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని శ్రీరాంనగర్ రైతు బల్వంత్‌రెడ్డి ప్రశ్నలు అడిగారు. చాయ్‌పే చర్చా పేరుతో సీఏజీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీతో రైతులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి మాట్లాడే లైవ్ టెలికాస్ట్ కార్యక్రమాన్ని శ్రీరాంనగర్‌లో గురువారం రాత్రి నిర్వహించారు. రైతు బల్వంత్‌రెడ్డి రైతుల సమస్యలు మోడీకి వివరించారు. దీంతో ఆయన సమాధానం చెబుతూ.. గ్రానైట్, ఇతర వ్యాపార వస్తువులు ఇతర ప్రాంతాలకు రవాణా చేసేందుకు ఎన్ని రోజుల సమయం పట్టినా అవి చెడిపోవని, అదే రైతు పండించిన టమాటాలు మాత్రం ఇతర ప్రాంతాలకు ట్రక్కుల్లో రవాణా చేస్తే నిల్వ ఉండవన్నారు. రైళ్లలో కోల్డు స్టోరేజీలు ఏర్పాటు చేసి వాటిని రవాణా చేసే సదుపాయం ప్రభుత్వం కల్పించాలని కోరారు. దీంతో.. మోడీ మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వస్తే ఫుడ్ కార్పొరేషన్‌ను మూడు విభాగాలుగా చేస్తామన్నారు. స్వామినాథన్ కమిషన్‌ను అమలు చేస్తామని చెప్పారు. రైతు ఆత్మహత్యలను నివారించేందుకు కృషి చేస్తామనడంతో రైతులంతా సంతోషం వ్యక్తం చేశారు. -
రాష్ట్రంలో 108 కేంద్రాల్లో ‘చర్చ’
సాక్షి, హైదరాబాద్/వరంగల్/గుంటూరు/తిరుపతి: బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ బుధవారం సాయంత్రం నిర్వహించిన ‘చాయ్ పే చర్చ’ రాష్ట్రవ్యాప్తంగా 108 కేంద్రాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సాగింది. బీజేపీతో సంబంధం లేకుండా సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్(కాజ్) అనే సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. కార్యక్రమం ప్రశాంతంగా జరిగిందని నిర్వాహకులు అశ్విన్, అనీష్, కిరణ్, సాయికిరణ్ తెలిపారు. హైదరాబాద్ ఉస్మానియా వర్సిటీ ఎన్సీసీ గేట్ వద్ద వినోద్ అనే యువకుడు చాయ్ బండి నిర్వహిస్తున్నాడు. ఇక్కడా వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయగా.. మోడీ లైన్లోకి రాకపోవడం వినోద్‌తోపాటు కార్యక్రమానికి హాజరైన పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు, మోడీ అభిమానులు నిరాశకు గురయ్యారు. చివరిలో అందరినుద్దేశించి మాట్లాడిన మోడీ.. భవిష్యత్తులో ప్రతిఒక్కరితో మాట్లాడే ప్రయత్నం చేస్తానని చెప్పారు. గుంటూరు పట్టాభిపురం స్వామి థియేటర్ దగ్గరలోని యువ టీస్టాల్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో.. కేంద్రం నుంచి వచ్చే నిధులు రాష్ట్రంలోని ప్రజలకు చేరట్లేదని, దళారుల చేతిలోనే కరిగిపోతున్నాయని వైవీఎస్ శశాంక్ అనే యువకుడు చెప్పాడు. వరంగల్ జిల్లా కేంద్రంలోని ఇద్దరు చాయ్ వాలాలతోనూ మోడీ మాట్లాడారు. తూర్పుకోటలో సంగ సతీష్, ఎస్బీహెచ్ ఎదురుగా ఉన్న దేవాంశ్ స్వీట్ హౌస్ యజమాని హుక్చంద్కు ఈ అవకాశం చిక్కింది. కాగా తిరుపతి రాములవారి గుడి వీధిలోని కోదండరామా టీ స్టాల్ యజమాని మునిరత్నంరెడ్డి.. మాట్లాడుతూ ‘‘ముస్లింలకు మీ పార్టీ వ్యతిరేకం కదా’’ అని ప్రశ్నించారు. మోడీ జవాబిస్తూ ముస్లింలకు తాము వ్యతిరేకం కాదని, గుజరాత్లో అన్నివర్గాలను కలుపుకుని పోతున్నామని చెప్పారు. -
ఏపీలో 19 పట్టణాల్లో ‘చాయ్ పే చర్చా’!
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఈ నెల 12 నుంచి నిర్వహించ తలపెట్టిన ‘చాయ్ పే చర్చ’ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌లోని 19 పట్టణాల్లో, 108 కేంద్రాల్లో జరగనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ, వైజాగ్, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయవాడ, అమలాపురం, గుంటూరు, కడప, తిరుపతి, అనంతపురం, హిందూపురంలలో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం వివరాలను బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ మంగళవారమిక్కడ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దేశవ్యాప్తంగా 10 లేదా 12 రౌండ్లలో.. ఒక్కో రౌండ్లో వెయ్యి కేంద్రాల్లో చాయ్ పే చర్చ కార్యక్రమం ఉంటుందని ఆమె తెలిపారు. ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ సహా పార్టీ నేతలను ప్రశ్నలు అడగవచ్చని, సలహాలు ఇవ్వవచ్చని చెప్పారు. డీటీహెచ్, శాటిలైట్, ఇంటర్నెట్, మొబైల్, సోషల్‌మీడియా ద్వారా కూడా కార్యక్రమం నిర్వహిస్తామని, 2 కోట్ల మందిని చాయ్ పే చర్చలో భాగస్వాములుగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.