జీవితంలో చాయ్ (టీ) ఓ భాగమైపోయింది. నిద్ర లేవగానే ఓ కప్పు చాయ్ కడుపులో పడితే గాని ఏ పని చేయలేం. ఇంట్లో ఉన్నా, ఆఫీసుకు వెళ్లినా ఓ కప్పు చాయ్ కావాల్సిందే. దోస్తులు కలిసినా.. అతిథి వచ్చినా తేనీటి విందు తప్పనిసరి. భారత ప్రధాని మోదీ నిర్వహించే కార్యక్రమానికి ‘చాయ్ పే చర్చ’ అనే పేరు పేట్టారంటే టీ ఎంతలా మనలో స్థానం సంపాదించిందో అర్థం చేసుకోవచ్చు. జనంలో అత్యంత ఆదరణ ఉండడంతో టీని జాతీయ పానీయంగా గుర్తించారు. అయితే ఇక్కడ చాయ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈ రోజు ‘ఇంటర్‌నేషనల్ టీ డే’ కాబట్టి.
సాక్షి, హైదరాబాద్: నాలుగో శతాబ్దంలో ఓ చైనా వైద్యుడికి కొంత సుస్తిగా ఉండగా, వైద్య పరీక్షల్లో భాగంగా కొన్ని ఆకులను తీసుకొని ఎండబెట్టాడు. వేడి నీటిలో వాటిని నానబెట్టగా వచ్చిన డికాషన్‌ను తాగాడు. దీంతో అతడు ఎంతో ఉత్తేజాన్ని పొందాడు.
► 15వ శతాబ్దంలో నాగరిక ప్రపంచంలో టీ తాగడం ప్రారంభమైంది. 17వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ నల్లమందుకు బదులుగా టీని చైనా నుంచి దిగుమతి చేసుకునేది. 1823లో బ్రిటన్‌కు చెందిన బ్రూస్ సోదరులు అస్సాంలో దేశీయంగా తేయాకును కనిపెట్టిట్టారు. అప్పటి నుంచి భారతదేశంలో టీ ఉత్పాదన ప్రారంభమైంది.
► 1860 నాటికి భారతదేశంలోని టీ ప్లాంటేషన్ బాగా అభివృద్ధి చెందినప్పుడు ఇక్కడ టీ ఉత్పత్తి సుమారు 10లక్షల కేజీలు ఉండేది. నేడు పశ్చిమబెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ టీని అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలుగా ప్రసిద్ధి చెందాయి.
చదవండి: తల్లి వద్దు.. ప్రియుడే కావాలి..
Comments
Please login to add a commentAdd a comment