మూతపడిన 'చాయ్ పే చర్చా' టీ స్టాల్
ప్రధానమంత్రి అభ్యర్థిగా రెండేళ్ల క్రితం నరేంద్రమోదీ నిర్వహించిన పాపులర్ క్యాంపెయిన్ చాయ్ పే చర్చా అన్నీ వార్తపత్రికల్లో బ్యానర్గా నిలిచింది. ఈ క్యాంపెయిన్తో పాటు మోదీ మొదటిసారి ఎక్కడైతే చాయ్ పే చర్చను ప్రారంభించారో ఆ టీ స్టాల్కూ ఫుల్ డిమాండ్ పెరిగింది. అయితే ప్రస్తుతం ఆ స్నాక్ అవుట్లెట్ను మున్సిపల్ అధికారులు మూసేశారట. ఎల్లప్పుడూ రద్దీగా ఉండే సర్ఖేజ్-గాంధీనగర్ హైవేపై ఈ టీ స్టాల్ ఉండటంతో పాటు, సరియైన భవన వాడక అనుమతులు లేకపోవడంతో దీన్ని సీజ్ చేసినట్టు మున్సిపల్ అధికారులు వెల్లడించారు.
ఈ ఇస్కోన్ గాంతియా టీ స్టాల్తో పాటు మొత్తం ఎనిమిది స్నాక్ అవుట్లెట్లు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఈ దుకాణాలకు సరియైన పార్కింగ్ స్థలం లేకపోవడంతో పాటు హైవే అంతా కస్టమర్లతో గందరగోళంగా మారుతోంది. దీనిపై అహ్మదాబాద్ మున్సిపల్ అథారిటీలు వివిధ నోటీసులు పంపినప్పటికీ ఈ అవుట్లెట్లు పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటుచేయలేదు. నోటీసులు పంపినా స్పందించని అవుట్లెట్లపై సీరియస్ అయిన మున్సిపల్ అధికారులు వీటిని సీజ్ చేశారు. చట్టాలను అతిక్రమించి ఈ అవుట్లెట్లను రన్ చేస్తున్నారని, అవసరమైన భవన వాడక అనుమతులు లేవని మున్సిపల్ అథారిటీలు పేర్కొన్నారు.
ఈ స్నాక్ అవుట్లెట్లోనే ప్రధాని అభ్యర్థిగా మోదీ మొదటిసారి చాయ్ పే చర్చా కార్యక్రమాన్ని ప్రారంభించారు. చాయ్ పే చర్చ అనంతరం ఆ టీ స్టాల్కు భారీగా డిమాండ్ పెరిగింది. కస్టమర్లు కుప్పలు తెప్పలుగా విచ్చేస్తున్నారు. దీంతో హైవేపై గందరగోళ వాతావరణం నెలకొంది.