Javadekar
-
రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి ఏడాది ఇచ్చే దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని 2020 సంవత్సరానికిగాను సూపర్ స్టార్ రజనీకాంత్‌ని వరించింది. రజనీకాంత్‌కు 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందించనున్నట్లు తాజాగా కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి సంవత్సరం ఈ పురస్కారంతో గౌరవిస్తారు. భారతీయ సినిమాకు పితామహుడుగా భావించబడే దాదాసాహెబ్ ఫాల్కే జన్మ శతి సందర్భంగా 1963లో ఈ పురస్కారం ఏర్పాటు చేయబడింది. ఒక సంవత్సరానికి సంబంధించిన పురస్కారం మరుసటి ఏడాది చివర్లో ఇచ్చే జాతీయ సినిమా అవార్డులతో పాటు ఇస్తారు. తాజాగా ఈ అవార్డ్ ను రజని కాంత్ అందుకోవడం విశేషం. అయితే తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారీ ఫాలోయింగ్ ఉన్న రజనీకాంత్‌కు కేంద్రం అవార్డు ప్రకటించడం ఎలక్షన్ స్టంట్ అని విపక్షాలు నేతలు విమర్శిస్తున్నారు. రజని కాంత్ పార్టీ పెట్టి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నందుకు గిఫ్ట్‌గా ఈ అవార్డు ఇచ్చారని ఆరోపిస్తున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు: రజనీకాంత్ ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్నందుకు గాను ఆయనకు పలువును సినీ రాజయకీ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రజనీకి శుభాకాంక్షలు తెలిపారు. -
కేటీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: నగర అభివృద్ధిపై కేటీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఫిలింనగర్లో బీజేపీ కార్యాలయాన్ని కేంద్ర మంత్రి జవదేకర్ ఆదివారం ప్రారంభించారు. కిషన్‌రెడ్డి, డీకే అరుణ, చింతల రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం విఫలమయ్యిందని ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోందని, టీఆర్ఎస్కు ఓటు వేస్తే ఎంఐఎంకు వేసినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. (చదవండి: ‘ఓట్ల కోసం ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు’) పేదల కష్టాలను పట్టించుకోవడంలేదు: డీకే అరుణ కేసీఆర్, కేటీఆర్‌లు హైదరాబాద్‌ను వరదల నగరంగా మార్చారని డీకే అరుణ ధ్వజమెత్తారు. వరద బాధితులను సీఎం కేసీఆర్ పరామర్శించకపోవడం దారుణమన్నారు. ప్రగతిభవన్ బాగుంటే సరిపోతుందా? అని ప్రశ్నించారు.పేదల కష్టాలను సీఎం పట్టించుకోవడంలేదని ఆమె విమర్శలు గుప్పించారు. (చదవండి: ‘వరద సాయాన్ని వారే మింగేశారు..!’) -
జవదేకర్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి గంటా
-
ప్రకాష్ జవదేకర్‌ను కలిసిన ఎంపీ కవిత బృందం
ఢిల్లీ: టీఆర్ఎస్ ఎంపీ కవిత నేతృత్వంలో మధ్యాహ్న భోజన పథక కార్మికులు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్‌ను శుక్రవారం కలిశారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు నెలకు వెయ్యి రూపాయలే ఇస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వీరి వేతనాలను రూ.1000 నుంచి రూ.10,500కు పెంచాలని ప్రకాష్ జవదేకర్‌ను కవిత కోరారు. కేంద్ర కార్మిక చట్టాలను అనుసరించి ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కూడా వారికి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కవితతోపాటూ పలువురు టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రమంత్రిని కలిసినవారిలో ఉన్నారు. -
కేజీబీవీల సంఖ్య పెంచాలి
సాక్షి, న్యూఢిల్లీ: బాలికా విద్యపై ఏర్పాటైన సబ్ కమిటీ (కేబ్స్) ఇచ్చిన నివేదిక ఆధారంగా కస్తూర్బా గాంధీ బాలికల కళాశాలల్లో (కేజీబీవీ) ఇంటర్ వరకు విద్యనందించే విషయంలో పాఠశాలల అప్‌గ్రేడేష్‌ను కొన్నింటికే పరిమితం చేయడం సరికాదని, వీటి సంఖ్యను పెంచాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 475 కేజీబీవీలు ఉంటే 94 స్కూళ్లలోనే ఇంటర్ విద్యనందించేందకు కేంద్రం అనుమతించిందని, తరగతి గదికి 20 మంది విద్యార్థులనే పరిమితం చేయడం సరికాదని ఆయన వివరించారు. పలు అంశాలపై కడియం మంగళవారం ఢిల్లీలో ఎంపీలు వినోద్‌కుమార్, సీతారాం నాయక్, బండ ప్రకాశ్‌లతో కలసి కేంద్ర మంత్రికి నివేదిక అందజేశారు. అందులో ప్రముఖంగా ఇంటర్ వరకు విద్యాబోధనకు కేజీబీవీల సంఖ్యను పెంచడం, గ్రూపుల వారిగా తరగతికి 40 మంది విద్యార్థులకు అవకాశం కల్పించాలని కోరారు. పాఠశాలల అప్‌గ్రేడేషన్‌పై ప్రధానంగా దృష్టి సారించాలని, ఇంటర్ వరకు విద్యాబోధనకు ప్రతి పాఠశాలకు 15 మంది టీచర్ల అవసరం ఉంటుందని, కేంద్రం 9 మందినే నియమిస్తామనడం సరికాదన్నారు. అందులో కూడా క్వాలిఫైడ్ టీచర్ల నియమించి, రూ.40 వేల వేతనాలు చెలించాలని కోరారు. ప్రతి పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం రూ.7.5 కోట్లు విడుదల చేయాలని, ప్రస్తుతం నిర్ణయించిన వరంగల్ జిల్లా మాము నూరు ప్రభుత్వ పశు వైద్య కళాశాలలో ఈ ఏడాది నుంచి అడ్మిషన్లను ప్రారంభించేందుకు జాతీయ పశువైద్య మండలి అనుమతులిచ్చిన నేపథ్యంలో.. అడ్మిషన్లపై కడియం వెటర్నరీ కౌన్సిల్ డైరెక్టర్ కరుణ్ శ్రీధర్‌తో సమావేశమై చర్చించారు. -
బాలికల విద్యపై ఢిల్లీలో సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరుల మంత్రి జవదేకర్ అధ్యక్షతన సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో 65వ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సమావేశం ప్రారంభమైంది. ఈ సదస్సు రెండు రోజులపాటు జరగనుంది. ఈ భేటీలో నాలుగు సబ్‌కమిటీలు ప్రజెంటేషన్ ఇవ్వనున్నాయి. తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పాల్గొన్నారు. బాలికల విద్యా నిష్పత్తిపై కడియం కమిటీ ప్రజెంటేషన్ ఇచ్చింది. 'స్టేటస్ ఆఫ్ గర్ల్స్ ఎడ్యుకేషన్ ఇన్ భారత్' కమిటీకి చైర్మన్‌గా కడియం శ్రీహరి ఉన్నారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ దేశంలో బాలికల డ్రాప్ అవుట్‌కు గల కారణాలపై అధ్యయనం చేసినట్లు చెప్పారు. విద్యతో పాటు బాలికలు ఎదుగే క్రమంలో ఆరోగ్యంపై దృష్టిసారించాలని అన్నారు. బాలికలు, వారి తల్లిదండ్రులు రెసిడెన్షియల్ స్కూళ్ల వైపే మొగ్గుచూపుతున్నారని మంత్రి పేర్కొన్నారు. గురుకుల పాఠశాలలు ఏర్పాటే తమ ప్రజెంటేషన్‌లో ప్రధాన అంశమని, రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటులో తెలంగాణ రాష్ట్రమే ఉదాహరణ అని కడియం వ్యాఖ్యానించారు. -
తెలంగాణలో త్వరలోనే గిరిజన వర్శిటీ!
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట ప్రకారం తెలంగాణలో ఏర్పాటు కావాల్సిన గిరిజన వర్శిటీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. బుధవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. గిరిజన వర్శిటీ ఏర్పాటుకు భూమి సమస్య తీరడంతో వర్శిటీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు. త్వరలో ఈ బిల్లు కేంద్ర క్యాబినెట్ ముందుకు వచ్చేలా చూడాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కోరినట్టు ఆయన తెలిపారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం రూసా కింద ఖర్చు పెట్టిన రూ. 49.47 కోట్ల నిధులను త్వరలోనే విడుదల చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. త్వరలో గిరిజన, సెంట్రల్ వర్సిటీల బిల్లు! ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట ప్రకారం ఏపీలో గిరిజన, సెంట్రల్ వర్శిటీల ఏర్పాటుపై వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ సూత్రప్రాయంగా అంగీకకరించారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ విషయమై కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు సంబంధిత కేంద్ర మంత్రి జవదేకర్ తో చర్చించారు. గిరిజన, సెంట్రల్ వర్శిటీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దీనిపై స్పందించిన జవదేకర్ సంబంధిత అధికారులను పిలిపించి మాట్లాడారు. వర్శిటీల ఏర్పాటు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టేందుకు కృషి చేస్తామని జవదేకర్ హామీ ఇచ్చినట్టు వెంకయ్య తెలిపారు. -
ఇకపై స్కూల్ బస్సుల్లో సీసీటీవీ, జీపీఎస్
న్యూఢిల్లీ: ఇకపై స్కూలు బస్సుల్లో సీసీటీవీల ఏర్పాటు, జీపీఎస్‌తో అనుసంధానం చేయాలని, వేగనియంత్రణ కలిగి ఉండాలని సీబీఎస్ఈ మార్గదర్శకాలను జారీచేసింది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న స్కూలు బస్సు ప్రమాద సంఘటన నేపథ్యంలో కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి జవదేకర్ ఈ మేరకు ఆదేశాలిచ్చారు. సీసీటీవీలను ఏర్పాటు చేసుకోవాలని జీపీఎస్ తప్పనిసరిగా ఉండాలని సీబీఎస్ఈ పేర్కొంది. ఇక బస్సు సిబ్బంది వ్యవహార శైలిని పరిశీలించేందుకు ప్రతీ బస్సుకు కనీసం ఒక విద్యార్థి తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండేలా చూడాలంది. బస్సుల్లో అలారం, సైరన్ ల వంటి ఏర్పాటు ఉండాలని, ఒక మొబైల్ ఫోను అందుబాటులో ఉంచాలంది. -
మంత్రివర్గంలో నూతన మార్పులు షరామామూలే
గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాక ఒకటిన్నర దశాబ్దం పాటు నరేంద్రమోదీ పాటిస్తూవచ్చిన విధానం కొనసాగింపే ప్రస్తుత మంత్రివర్గ మార్పులోనూ కనిపించింది. తనకు వ్యక్తిగతంగా ఆసక్తి ఉన్న కొన్ని నిర్దిష్టమైన పోర్ట్‌ఫోలియోలను మోదీ ఎంచుకుంటారు. సీనియర్ నేతకు కాకుండా ఒక జూనియర్ మంత్రికే వాటి బాధ్యతను అప్పగిస్తారు. ఇతడు నేరుగా మోదీకి లేదా ఆయన కింద పనిచేసే కొద్దిమంది ఉన్నతాధికారుల బృందానికి నివేదిస్తుంటారు. పాలసీలో తాను చేయాలని భావించిన మార్పులకు ఎలాంటి ప్రతిఘటనా ఎదురు కాకూడదన్నది మోదీ భావన. మంత్రుల పనితీరు ప్రాతిపదికన వారికి రేటింగ్ ఇవ్వవలసిందిగా వార్తా చానళ్లు తరచుగా నన్ను అడుగుతుంటాయి. చాలామంది మంత్రుల విజయాలతో కూడిన ఒక పేరా లేదా అంతకంటే ఎక్కువ సమాచారాన్ని చానళ్లు పంపుతుంటాయి. ఒక్కో మంత్రికీ వాటి ఆధారంగా ఒక్కొక్కరు తమ స్కోరును ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమం ప్రసారమైనప్పుడు, ఇతరులు ఏ ర్యాంకులు ఇచ్చిందీ నేను చూడగలను. కేంద్ర మంత్రి వర్గంలో నలుగురు మంత్రులు నిలకడగా అత్యున్నత ర్యాంకులు పొందుతున్నారు. వారు పీయూష్ గోయెల్ (విద్యుత్, బొగ్గు, నూతన శాశ్వత ఇంధన వనరులు), నిర్మలా సీతారామన్ (వాణిజ్యం, పరిశ్రమలు), ధర్మేంద్ర ప్రధాన్ (పెట్రోలియం, సహజవాయువు), ప్రకాశ్ జవదేకర్ (పర్యావ రణం). వీరికి సంబంధించి అసాధారణమైన విషయం ఏమిటంటే, వీరందరూ సహాయ మంత్రులే. అంటే వీరు జూనియర్ మంత్రులు. కేబినెట్ ర్యాంకు లేదు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే తన మంత్రివర్గాన్ని విస్తరించినప్పుడు ఈ వాస్తవం మారలేదు. చాలామంది మంత్రులను తీసుకున్నారు. అయితే ఒకే ఒక్కరికి సహాయ మంత్రి నుంచి కేబినెట్ మంత్రిగా పదోన్నతి కలిగించారు. ఆయనే ప్రకాశ్ జవదేకర్. ప్రమోషన్ ఇచ్చారు కాని పోర్ట్‌ఫోలియో మారింది. విద్యాశాఖ మంత్రి అయ్యారు. పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు శాఖల నూతన మంత్రి అనిల్ మాధవ్ దేవ్. జవదేకర్లాగే ఈయనా కేబినెట్ మంత్రి కాదు. సహాయ మంత్రి మాత్రమే. గుజరాత్ సీఎం అయ్యాక మోదీ పాటించిన దాని కొనసాగింపే ప్రస్తుత మంత్రి వర్గ మార్పులోనూ కనిపించింది. తనకు వ్యక్తిగతంగా ఆసక్తి ఉన్న కొన్ని నిర్దిష్టమైన పోర్ట్‌ఫోలియోలను మోదీ ఎంచుకుంటారు. వాటిని సీనియర్ నేతకు అసలు అప్పగించరు. ఒక జూనియర్ మంత్రికి ఆ బాధ్యతను అప్పగిస్తారు. ఇతడు నేరుగా మోదీకి లేదా ఆయన కింద పనిచేసే కొద్దిమంది ఉన్నతాధికారుల బృందానికి నివేదిస్తుంటారు. మొదటిసా రిగా నేను గుజరాత్లో దీన్ని గమనించాను. అప్పట్లో మోదీ ప్రధానంగా ఇద్దరు మంత్రులతోటే వ్యవహరించేవారు. వారెవరంటే సౌరభ్ పటేల్, అమిత్ షా. మోదీ సీఎంగా ఉన్న పన్నెండేళ్ల కాలంలో సౌరభ్ పటేల్ పరిశ్రమలు, గనులు, ఖనిజాలు, పెట్రోకెమికల్స్, రేవులు, ఇంధన శాఖల మంత్రిగా పనిచేశారు. భారత్‌లోనే అత్యంత పారిశ్రామిక ప్రాంతమైన గుజరాత్ రాష్ట్రంలో ప్రత్యేకించి ఇవి చాలా కీలక మంత్రిత్వ శాఖలు. పటేల్ పోర్ట్‌ఫోలియోలు టాటా, ఎస్సార్, అదాని, అంబానీ, టొరెంట్ అనే అయిదు ప్రముఖ కంపెనీల వ్యాపార ప్రయోజనాలతో వ్యవహరిస్తుండేవి. మోదీ లక్ష్యం.. మహాభారతంలో ఐదుగురు భర్తలను సంతో షపెట్టే ద్రౌపది వ్యవహారంతో సరిపోలి ఉండేదని గుజరాత్ మీడియా హాస్యా స్ఫోరకంగా అప్పట్లో ప్రస్తావించేది. సౌరభ్ నిర్వహిస్తున్న పోర్ట్‌ఫోలియోలు ముఖ్యమైనవే అయితే (స్పష్టంగానే అవి కీలకమైనవి) ఆయనకు కేబినెట్ ర్యాంక్ ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే.. నా అభిప్రాయంలో ఈ మంత్రిత్వ శాఖలలో జరిగే కీలక నిర్ణయ ప్రక్రియపై సంపూర్ణ నియంత్రణను అట్టిపెట్టుకోవాలని మోదీ భావించి ఉండవచ్చు. నాడు గుజరాత్లో మంత్రులందరూ ముఖ్యమంత్రికి నేరుగా నివేదించినట్లే నేడు ఢిల్లీలో ప్రధానికి కేంద్ర మంత్రిమండలి నేరుగా నివేదిస్తుండటం నిజమే కావచ్చు. కేబినెట్ ర్యాంక్‌ను నిలిపివుంచడం అంటే.. కీలకమైన నిర్ణయాలను మంత్రివర్గం ఆమోదించడానికి ముందు సంబంధిత మంత్రి మోదీ కార్యాల యాన్ని తప్పక సంప్రదించవలసి ఉంటుందని అర్థం. అలాగే గుజరాత్ కేబినెట్లో ఏళ్ల తరబడి హోంమంత్రిగా అంకితభావంతో పనిచేసినప్పటికీ అమిత్‌షాకు ఎన్నడూ మోదీ కేబినెట్ ర్యాంక్ ఇచ్చిన పాపాన పోలేదు. మంత్రిగా నియమితుడైన నాటి నుంచి కుంభకోణం ఆరోపణలతో తప్పనిసరై పదవిలోంచి దిగిపోయేంత వరకు షా సహాయమంత్రి గానే ఉంటూ వచ్చారు. షా పోలీసు శాఖకు అధిపతి కాబట్టి అక్కడ జరుగుతున్న వాటిపై ఒక కన్నేసి ఉంచాలని మోదీ భావించారని ఊహించడం కష్టసాధ్యమేమీ కాదు. మోదీ ప్రధాని అయ్యాక, పైన పేర్కొన్న కీలక మంత్రిత్వ శాఖలన్నింట్లోనూ సహాయ మంత్రులను నియమించడం ద్వారా వాటిపై అదేవిధమైన నియంత్ర ణను తనవద్దే అట్టిపెట్టుకుంటారని నేను ముందే ఊహించాను. కేంద్రంలోనూ హోం శాఖను కూడా మోదీ తన అదుపులోనే ఉంచుకుంటారని నేను భావించడం తప్పే. ఆ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కేబినెట్ ర్యాంకు ఇచ్చారు. ఏమైనప్పటికీ, ఈ విషయం గురించి నేను ప్రస్తావించినప్పుడు ఒక సీనియర్ ఉన్నతాధికారి మాట్లాడుతూ కేంద్రంలో హోంశాఖ విభిన్నంగా ఉంటుందని సూచించారు. ఇక్కడ పోలీసులపై హోంమంత్రి నియంత్రణ ఉండదు. ఎందుకంటే పోలీసు శాఖ రాష్ట్ర పరిధిలోని అంశం కాబట్టి ఢిల్లీలో దానికి ప్రాధాన్యత తక్కువే. పర్యావరణ మంత్రిత్వ శాఖ ముఖ్యమైనదే. ఎందుకంటే క్రియాశీలకంగా పనిచేసే మంత్రి ప్రాజెక్టులను నిరోధించగలరు. ఇలాంటి శాఖలపై నిర్వహణాత్మక అదుపు తనకే ఉండాలని మోదీ విశ్వసిస్తారు. విధానాలలో తాను చేయాలని భావించిన అన్ని మార్పులకు ఎలాంటి ప్రతిఘటనా ఎదురు కాకూడదన్నది మోదీ భావన. అందుకే ఈ కీలక శాఖలకు చెందిన మంత్రులు ఎంత ప్రతిభావంతులైన ప్పటికీ వీరిలో ఎవరికీ కేబినెట్ ర్యాంక్ లభించదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మోదీ నిష్ర్కమించిన తర్వాతే గుజరాత్లో సౌరభ్ పటేల్‌కి కేబినెట్ ర్యాంక్ ఇచ్చారు. ఇదివరకే నేను ప్రస్తావించిన పోర్ట్ట్ఫోలియోలకు చెందిన మంత్రు లకు అంతిమంగా ఇలాగే కేబినెట్ ర్యాంక్ ఇవ్వవచ్చు. అయితే ప్రస్తుతానికి మాత్రం పాలనలో గుజరాత్ నమూనాను నరేంద్ర మోదీ కేంద్రంలో కొంతమేరకయినా అనుసరిస్తూ వస్తున్నారన్న విషయం నాకు స్పష్టంగా కనిపిస్తోంది. వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com - ఆకార్ పటేల్ -
అభివృద్ధి, సుపరిపాలనే లక్ష్యం
ఓర్పు, నేర్పుల కలయికే తాజా కూర్పు: వెంకయ్య - సమాచార శాఖ బాధ్యతలు స్వీకరించిన మంత్రి - కొత్త, మారిన శాఖల మంత్రులు కూడా బాధ్యతల స్వీకరణ - ప్రజలకు ప్రభుత్వాన్ని చేరువ చేయటమే లక్ష్యమని ప్రకటన సాక్షి, న్యూఢిల్లీ : అభివృద్ధి, సుపరిపాలనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ లక్ష్యమని.. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. సమాచార, ప్రసార మంత్రిగా బుధవారం బాధ్యతలు స్వీకరించిన వెంకయ్య.. కేంద్ర కేబినెట్లో జరిగిన మార్పుచేర్పులు అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నాయన్నారు. దేశాభివృద్ధిలో ప్రజాసమాచార వ్యవస్థ అతి ముఖ్యమైందని పేర్కొన్నారు. ‘ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచి సుపరిపాలనతో అభివృద్ధికి పెద్ద పీట వేసి, అందరినీ పురోగతిలో భాగస్వాములను చేసేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడిప్పుడే సత్ఫలితాలిస్తున్నాయి’ అని అన్నారు. మంత్రివర్గంలో చేసిన మార్పులు చేర్పులు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. అనుభవం, నేర్పు, ఓర్పుతో కలిపి ప్రధాని కూర్పు చేశారన్నారు. ఈ మార్పులకు ప్రతిపక్షాల్లోని కొందరు నేతలు కూడా సానుకూలంగా స్పందించారన్నారు. వెంకయ్య నాయుడు సమాచార మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, సమాచార శాఖ సహాయ మంత్రి రాజవర్ధన్ సింగ్ రాథోడ్, ఆ శాఖ కార్యదర్శి అజయ్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.కొత్తగా మంత్రివర్గంలో చేరిన వారితోపాటు శాఖలు మారిన పలువురు మంత్రులు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మానవ వనరుల అభివృద్ధఙ శాఖ నుంచి చేనేత, జౌళి శాఖకు మారిన స్మృతి ఇరానీ కొత్త బాధ్యతలు తీసుకున్నారు. న్యాయ వ్యవస్థకు ప్రభుత్వానికి మధ్య దూరాన్ని తగ్గించి చర్చలతో జడ్జీల నియామకంలో ఇరు వర్గాలకు ఆమోదయోగ్య నిర్ణయం వెలవడేలా ప్రయత్నిస్తానని కొత్త న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల బాధ్యతలు తీసుకున్న అనంత్ కుమార్ కీలకమైన బిల్లులను ఆమోదింపచేయటం తన ప్రధాన్యమ్నారు. విదేశాంగ సహాయ మంత్రిగా ఎంజే అక్బర్, పర్యావరణ, అటవీ మంత్రిగా అనిల్ దవే, రైల్వే శాఖ సహాయ మంత్రిగా రాజెన్ గొహైన్, ఆర్థిక సహాయ మంత్రులుగా సంతోశ్ గంగ్వార్, అర్జున్‌రామ్ మేఘ్వాల్ బాధ్యతలు స్వీకరించారు. రైతులకు చేరువై.. వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషిచేస్తానని.. వ్యవసాయ సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఎస్ అహ్లువాలియా తెలిపారు. మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆర్పీఐ పార్టీ అధినేత రాందాస్ అఠావలే సామాజిక న్యాయం, సాధికారత మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. దళితుల అభ్యున్నతే ప్రధాన లక్ష్యమన్నారు. కేబినెట్ హోదాకు పదోన్నతి పొంది మానవ వనరుల శాఖ బెర్త్ దక్కించుకున్న ప్రకాశ్ జవదేకర్ గురువారం బాధ్యతల చేపడతారు. కుచ్‌తో లోగ్ కహేంగే: స్మృతి చేనేత, జౌళి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మాజీ మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ.. ప్రధాని మోదీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానన్నారు. శాఖ మార్పునకు అమిత్‌షానే కారణమా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘వ్యక్తులు కాదు పార్టీ సంయుక్తంగా నిర్ణయం తీసుకుంది’ అని తెలిపారు. యూపీ ఎన్నికల్లో కీలక బాధ్యతలు అప్పగించేందుకే శాఖ మార్చారన్న ఊహాగానాలకు హిందీ సినిమా పాట ‘కుచ్‌తో లోగ్ కహేంగే.. లోగోంకా కామ్ హై కహనా’(జనాలేమైనా అంటారు.. ఏదోటి అనటమే వారి పని) అని సమాధానమిచ్చారు. నకిలీ ట్విటర్‌పై అనుప్రియ ఫిర్యాదు ఒక వర్గం వారిని లక్ష్యంగా చేసుకొని తన పేరుతో నకిలీ ట్విటర్ ఖాతా తెరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్య పార్టీల అంశం కాదు: జవదేకర్ విద్యా రంగం వివిధ పార్టీలు చేసే రాజకీయం కాదని.. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ‘విద్య జీవితంలో మార్పును, ఓ విలువను తీసుకొస్తుంది. ప్రస్తుతం విద్యారంగంలో నెలకొన్న ఆందోళనలు, నిరసనలకు చర్చల ద్వారా పరిష్కరించవచ్చని నేను నమ్ముతున్నాను. నేను కూడా ఇలాంటి ఆందోళనలు, విద్యార్థి రాజకీయాల నుంచే వచ్చాను. ఇకపై ఆందోళనలు అవసరం లేదు’ అని జవదేకర్ తెలిపారు. నూతన విద్యావిధానం రూపకల్పనలో అందరి అభిప్రాయాలను తీసుకుంటామని జవదేకర్ తెలిపారు. -
ఆ మంత్రులు చాయ్ పే చర్చలో పాల్గొన్నాలి
న్యూఢిల్లీ: జంతు వధపై ఇద్ధరు కేంద్ర మంత్రుల మధ్య తలెత్తిన వివాదంపై బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి స్పందించారు. ఇరువురు చాయ్ పే చర్చా కార్యక్రమంలో పాల్గొని సమస్యకు పరిష్కారం కనుగొనాలని సలహా ఇచ్చారు. అంతే కాని బహిరంగంగా విమర్శలు చేసుకోవడం వల్ల ఉపయోగం లేదని తెలిపారు. పర్యావరణం పరిరక్షణపై మేనక చాలా కాలంగా కృషి చేస్తున్నారని ఆమె లేవనెత్తిన అంశాలకు మంత్రి బహిరంగంగా కాకుండా ఫోన్ లో సమాధానం చెబితే బాగుండేదని స్వామి అభిప్రాయపడ్డారు. అడవిపందులు, కోతులు, నీలి ఎద్దులు, నెమళ్ల వధకు కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్ర్రాల్లో అనుమతించిన విషయం తెలిసిందే. -
మేనకాగాంధీ వర్సెస్ జవదేకర్
జంతు వధపై కేంద్ర మంత్రుల మధ్య రచ్చ * పర్యావరణ, అటవీ శాఖ నిర్ణయాన్ని తప్పుబట్టిన మేనక * రాష్ట్రాల విజ్ఞప్తి మేరకే చంపామన్న జవదేకర్ న్యూఢిల్లీ: జంతు వధ ఇద్దరు కేంద్ర మంత్రుల మధ్య వివాదానికి కారణమైంది. అరుదైన జంతువులను చంపే విషయంలో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో సాగింది. ఇటీవల బిహార్‌లో 200 అరుదైన బ్లూబుల్స్ (నీల్గాయ్)ను కాల్చి చంపిన నేపథ్యంలో ఈ అంశంపై జంతువుల హక్కుల ఉద్యమకర్త అయిన మేనక తీవ్రంగా స్పందించారు. దీనిని అతిపెద్ద ఊచకోతగా అభివర్ణించిన ఆమె.. కేంద్ర పర్యావరణ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసి జంతువులను చంపేందుకు ఒక జాబితా తయారు చేస్తే తాము అందుకు అనుమతిస్తామని కోరిందని ఆరోపించారు. జంతువులను చంపాలనే పర్యావరణ శాఖ ఆరాటం ఏమిటో అర్థం కావడం లేదని మండిపడ్డారు. ఇది సిగ్గు పడాల్సిన విషయమని ఆమె చెప్పారు. బిహార్‌లో నీల్గాయ్లు, పశ్చిమబెంగాల్లో ఏనుగులు, హిమాచల్ ప్రదేశ్‌లో కోతులు, గోవాలో నెమళ్లు, చంద్రపూర్‌లో అడవి పం దుల సంహారానికి కేంద్రం అనుమతిచ్చిం దని ఆరోపించారు. అయితే పర్యావరణ శాఖ నిర్ణయాన్ని ఆ శాఖ మంత్రి జవదేకర్ సమర్థించుకున్నారు. పంటలు, ఆస్తుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకే జంతు సంహారానికి అనుమతి ఇచ్చామని, దీనిని నిర్ధిష్ట ప్రాంతాలకు, నిర్ధిష్ట కాల వ్యవధికే పరిమితం చేశామని చెప్పారు. రైతుల పొలాలు ధ్వంసమవుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదన పంపితే అప్పుడే తాము అనుమతి ఇస్తామని చెప్పారు. మంత్రుల మధ్య మాటల యుద్ధంపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి.మోదీ ప్రభుత్వంలో టీమ్ వర్క్ అనేదే లేదని ఎద్దేవా చేశాయి. వివిధ శాఖల మధ్య వివాదాలు ఇదే తొలిసారి కాదని, టీమ్ వర్క్ లేకపోవడంతో పనులు నిలిచిపోతున్నాయని జేడీయూ, ఎన్సీపీ విమర్శించాయి. -
కేంద్ర మంత్రిపై మరో మంత్రి ఫైర్
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి వర్గంలోని ఇద్దరు మంత్రుల మధ్య విభేధాలు తలెత్తాయి. కొన్ని రాష్ట్ర్రాల్లో జంతువులను వధించడానికి కేంద్ర ప్రర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అనుమతి ఇవ్వడాన్ని కేంద్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ తప్పు పడుతూ ఆయనకు లేఖ రాశారు.నీలి ఎద్దు (నిల్గాయి),అడవి పంది ని వధించడానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు జారీ చేయడాన్ని ఆమె తప్పు పట్టారు. ప్రకాశ్ జవదేకర్ ఏరాష్ట్ర ప్రజలు ఏజంతువు కావాలంటే వాటిని వధించడానికి అనుమతులు ఇస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బెంగాల్లో ఏనుగులను, హిమాచల్ ప్రదేశ్ లో కోతులను, గోవాలో నెమళ్లను, చంద్రాపూర్ లో 53 అడవి పందులను చంపడానికి ఇప్పటివరకు అనుమతులు ఇచ్చారని ఆమె తెలిపారు. ఈ విధంగా క్రూరంగా చంపడానికి అనుమతులు ఇవ్వడం ఎంత వరకు సమంజసమని మేనక ప్రశ్నించారు. 2015 లో పంటలను నాశనం చేసే జంతువులను కూడా కీటకాలు గానే భావించాలనే మెమరాండాన్ని పర్యావరణ శాఖ జారీ చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. దీనిపై స్పందించిన ప్రకాశ్ జవదేకర్ రైతుల పంటలు నాశనం చేస్తున్న జంతువులపై చర్యలు తీసుకోవడానికి అనుమతి ఇవ్వమని రాష్ట్ర్ర ప్రభుత్వాలు కోరాయని అందుకే కొన్ని రాష్ట్రాల్లో చట్టం ప్రకారం వాటి సంహరణకు అనుమతి ఇచ్చామని తెలిపారు. గతంలో ఉత్తరాఖండ్ లో పోలీసు గుర్రం శక్తి మాన్ పై బీజేపీ ఎమ్మెల్యే దాడి చేయగా అది మృతి చెందిన విషయంలో కూడా మేనక తీవ్రంగా స్పందించారు. -
దేవుడే దిక్కు!
కమలాలయంలో యాగాది పూజలు మళ్లీ జవదేకర్ రాక రంగంలోకి అమిత్ షా సాక్షి, చెన్నై : పొత్తు ప్రయత్నాలన్నీ బెడిసి కొడుతూ రావడంతో, ఇక భారాన్ని దేవుడి మీద వేసి తమ ఎన్నికల పనులకు శ్రీకారం చుట్టే పనిలో కమలనాథులు నిమగ్నమయ్యారు. ఇక, దేవుడే దిక్కు అన్నట్టుగా కమలాలయంలో మంగళవారం వేకువజామున యాగాలు, ప్రత్యేక పూజలతో ఎన్నికల వ్యవహారాల పర్యవేక్షణకు ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించాలన్న కమలనాథుల ప్రయత్నాలు బెడిసి కొడు తూ వస్తున్న విషయం తెలిసిం దే. తమ నేతృత్వంలో కూటమి ఏర్పాటుకు కసరత్తులు జరిగి నా, దోస్తీకి సిద్ధపడి ముం దుకు వచ్చే వాళ్లు కరువయ్యా రు. ఇక, తమను ఎవరైనా అక్కున చేర్చుకుంటారా..? అన్న ఎదురు చూపుల్లో పడ్డా మిశ్రమ స్పందనే. చివరకు అమ్మే ది క్కు అన్నట్టుగా వ్యా ఖ్యలు సంధించినా, అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత వైపు నుంచి స్పందన శూన్యం. దీంతో రాష్ట్రంలో ఎన్నికల పర్యవేక్షణకు కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్ పొత్తు మంతనాల్లో పడ్డారు. రెండు రోజులు చెన్నైలో తిష్ట వేసి కుస్తీలు పట్టినా, ప్రయోజనం లేనట్టే. గంపెడు ఆశతో వచ్చి ఒట్టి చేత్తో ఆయన ఢిల్లీకి వెను దిరగాల్సి వచ్చింది. తాము చేస్తున్న ప్రయత్నాలన్నీ బెడిసి కొడుతూ రావడంతో ఇక భారాన్ని దేవుడి మీద వేసి తమ ఎన్నికల పనులకు శ్రీకారం చుట్టే పనిలో రాష్ట్రంలోని కమలనాథులు నిమగ్నమయ్యారు. ఇందు కోసం యాగాలు, ప్రత్యేక పూజలతో దేవుడి ఆశీస్సులతో పాటుగా ఓటర్ల ప్రసన్నం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. యాగాది పూజలు : టీ నగర్‌లోని కమలాలయంలో ఆవరణలో ఉదయం నాలుగున్నర గంటల నుంచి ప్రత్యేక పూజలు జరిగాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ జరిగిన ఈ పూజల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్, నాయకులు మోహన్ రాజులు, ఇలగణేషన్, పాల్గొన్నారు. అక్కడి అమ్మవారి విగ్రహం వద్ద పూజల అనంతరం ఎన్నికల వ్యవహారాల పర్యవేక్షణ, కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ప్రత్యేక కార్యాలయాన్ని ప్రారంభించారు. మీడియాతో తమిళి సై మాట్లాడుతూ తమకు దేవుడి మీద నమ్మకం ఎక్కువ అని, అందుకే విజయాలు వరించాలని కాంక్షిస్తూ దేవుడికి పూజల్ని నిర్వహంచామన్నారు. దేవుడ్ని స్మరించుకుంటూ సాగిన పూజల అనంతరం ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించామన్నారు. తాము చేస్తున్న ప్రయత్నాలకు విజయం చేకూరుతుందన్న నమ్మకం ఉందని, పరిస్థితులు అనుకూలంగా మారుతాయని వ్యాఖ్యానించారు. బీజేపీ మీద, ప్రధాని నరేంద్ర మోదీ మీద ప్రజలకు నమ్మకం పెరిగిందని, అదే నమ్మకంతో ఇక్కడి పార్టీల తమ వెంట నడుస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రకాష్ జవదేకర్ బుధ లేదా గురువారం మరో మారు చెన్నైకు రానున్నారని పేర్కొన్నారు. ఆయన రాకతో పరిస్థితులు మారుతాయని, తదుపరి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగనున్నారని, ఈ దృష్ట్యా రాష్ర్ట రాజకీయాల్లో పొత్తుల వ్యవహారంలో తమకు అనుకూల వాతావరణం ఏర్పడడం ఖాయం అని వ్యాఖ్యానించారు. -
అమరావతి నిర్మాణానికి పూర్తి సహకారం
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి అన్నివిధాల సహకరిస్తామని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఆయన శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ అమరావతిపై ఉన్న న్యాయపరమైన వివాదాలపై చట్టప్రకారం నడుచుకుంటామన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ప్రకాశ్ జవదేకర్‌తో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం జవదేకర్ మాట్లాడుతూ అమరావతి నిర్మాణంలో ఎక్కువ శాతం అడవులు పోతున్నందున పరిహారంగా మరింత ఎక్కువ విస్తీర్ణంలో అడవులను పెంచుతామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారన్నారు. -
అన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి!
సైన్స్ కాంగ్రెస్‌లో కేంద్ర మంత్రి జవదేకర్ మన ప్రాచీన సైన్స్ సిద్ధాంతాలు తర్క సహితం ముంబై: భారత శాస్త్రవేత్తలంతా ప్రాచీన సంస్కృత విజ్ఞాన శాస్త్రాలను మదించాలని.. ఆ శాస్త్రాల్లోని సాంకేతిక నిధిని మానవాళి అభివృద్ధికి ఉపయోగించాలని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. భారతీయ ప్రాచీన సైన్స్ సిద్ధాంతాలు శతాబ్దాల అనుభవ సారం, తర్కం ఆధారంగా రూపుదిద్దుకున్నాయని అన్నారు. శాస్త్రీయ అంశాల్లో వందల ఏళ్ల పరిశీలనలు, అనుభవాలను అత్యంత సూక్ష్మస్థాయిలో అవగాహన చేసుకున్నాకే మన పూర్వీకులు ఆయా సిద్ధాంతాలను రూపొందించారన్నారు. శాస్త్రీయ పరికరాలు, యంత్రాలు పెద్దగా అందుబాటులో లేకున్నా.. సూక్ష్మస్థాయిలో పరిశీలనలు, అనుభవాలు, తర్కం ఆధారంగానే భారతీయ విజ్ఞానం ఆవిర్భవించిందని, ఆ విజ్ఞానాన్ని తప్పనిసరిగా గుర్తించాలన్నారు. ముంబై యూనివర్సిటీలో ‘102వ భారత సైన్స్ కాంగ్రెస్’లో రెండోరోజైన ఆదివారం ‘సంస్కృతం ద్వారా ప్రాచీన భారతీయ విజ్ఞానం’ అంశంపై జరిగిన గోష్టిలో మంత్రి ప్రసంగించారు. ‘మన సంస్కృతం, పురాతన సైన్స్ ఆధారంగా జర్మన్లు, ఇతరులు కొత్త ఆవిష్కరణలు చేసినప్పుడు మనం మాత్రం ఎందుకు చేయలేం?’ అని ప్రశ్నించారు. జర్మన్లు శ్రద్ధతో సంస్కృతాన్ని ఉపయోగించుకుని కొత్త ఆవిష్కరణలు చేశారని, భారత్‌కు నేడు సృజనాత్మక ఆవిష్కరణలు చేసే సంస్కృతి చాలా అవసరమన్నారు. వేదకాలంలోనే జంబో విమానాలు! భారత్‌లో పురాతన కాలంలోనే విమాన సాంకేతికత అందుబాటులో ఉండేదని పైలట్ శిక్షణ కేంద్రం రిటైర్డ్ ప్రిన్సిపల్, కెప్టెన్ ఆనంద్ జె బోదస్ వెల్లడించారు. రుగ్వేదాన్ని పేర్కొంటూ ఆయన ప్రాచీన విమానయానానికి సంబంధించిన ఆధారాలను వివరించారు. సదస్సులో ఆదివారం ‘వేదాల్లో ప్రాచీన విమానయాన సాంకేతికత’ అంశంపై ఆనంద్ ప్రసంగించారు. ఆయనేమన్నారంటే.. ‘ఒక దేశం నుంచి మరో దేశానికే కాదు.. ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి సైతం వెళ్లగల విమానాల గురించి భరద్వాజ మహర్షి 7 వేల ఏళ్ల క్రితమే మాట్లాడారు. భారత్‌లో ప్రాచీన విమానయానానికి సంబంధించి 97 పుస్తకాల్లో ఆధారాలున్నాయి. అప్పటి విమానాల్లో 40 చిన్న ఇంజిన్లు ఉండేవి. ‘రూపర్కన్ రహస్య’ రాడార్ ద్వారా విమానం ఆకారం పరిశీలకుడికి కనిపించేది’ అని చెప్పారు. భారత ప్రాచీన సైన్స్‌పై చర్చించేందుకు ఐఎస్సీ వందేళ్లు ఎందుకు తీసుకుందని సదస్సులో ప్రసంగించిన పరమ్ సూపర్ కంప్యూటర్స్ రూపకర్తవిజయ్ భట్కర్ ప్రశ్నించారు. ఇది ప్రతి సదస్సులోనూ భాగం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాగా, సదస్సులో భాగంగా చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్‌ను మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రారంభించారు. మానవజాతికి వివిధ వ్యాధుల చికిత్సకు జెనెటిక్ ఇంజనీరింగ్ పరిష్కారం వంటి పలు అంశాలపై విద్యార్థులతో మాట్లాడారు. -
కృష్ణమ్మ కాంతులు
* మెగా పవర్ ప్రాజెక్టుల కేంద్రంగా కృష్ణానది పరీవాహక ప్రాంతం * నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో విద్యుదుత్పత్తి కేంద్రాలు * ఏరియల్ సర్వేలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం * కృష్ణా తీరంలో 7,800 ఎకరాల అటవీ భూములు గుర్తింపు * 7,600 మె.వా. ప్లాంట్ల ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన చర్యలు * రూ. 55 వేల కోట్ల పెట్టుబడులు.. 30 వేల మందికి ఉపాధి * కేంద్ర పర్యావరణ మంత్రి జవదేకర్‌కు ఫోన్లో సమాచారం * ప్రతిపాదనలిస్తే వారంలో అనుమతులిస్తామని మంత్రి హామీ సాక్షి, హైదరాబాద్, నల్లగొండ: భారీ స్థాయిలో విద్యుదుత్పత్తికి తెలంగాణ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. రాష్ర్టం ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యను వీలైనంత త్వరగా అధిగమించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులోభాగంగా నల్లగొండ జిల్లాలోని కృష్ణానది పరీవాహక ప్రాంతాన్ని మెగా పవర్ ప్రాజెక్టుల కేంద్రంగా మార్చాలని భావిస్తోంది. జిల్లాలోని దామరచర్ల మండలంలో ఎన్టీపీసీ, జెన్కో ఆధ్వర్యంలో భారీ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఇక్కడ అందుబాటులో ఉన్న విస్తారమైన అటవీ భూములను ఉపయోగించుకుని దాదాపు రూ. 55 వేల కోట్ల పెట్టుబడులతో 7,600 మెగావాట్ల సామర్థ్యం మేరకు విద్యుదు త్పత్తి కేంద్రాలను నిర్మించాలని ఆయన భావిస్తున్నారు. కృష్ణా తీరంలోని దాదాపు 7,800 ఎకరాలను ఇందుకనువైనవిగా గుర్తించారు. విద్యుత్ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, విద్యాశాఖ మంత్రి జగదీ్‌శ్‌రెడ్డి, ఉన్నతాధికారులతో కలసి దామరచర్ల మండలంలోని రక్షిత అటవీ ప్రాంతంలో మంగళవారం ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు. మెగాపవర్ ప్రాజెక్టులు స్థాపించేందుకు ఈ స్థలం అనుకూలమైనదిగా నిర్ణయించారు. అక్కడే జిల్లా అధికారులతో గంట పాటు సమావేశమై సీఎం సమీక్ష జరిపారు. సాయంత్రం హైదరాబాద్ తిరిగి వచ్చిన వెంటనే ఉన్నతాధికారులతో మరోసారి భేటీ అయ్యారు. యుద్ధప్రాతిపదికన భూ సర్వే చేసి 10 రోజుల్లో ప్రతిపాదనలు పంపాలని జిల్లా అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదిక(డీపీఆర్)ను తయారు చేయాలని జెన్కో అధికారులనూ ఆదేశించారు. వచ్చే నెల తొలివారంలోనే ఢిల్లీ వెళ్లి ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతులు తెస్తానని, ఇందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని కోరారు. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే రాష్ర్ట విద్యుత్ అవసరాలు తీరడంతోపాటు దక్షిణ తెలంగాణ విద్యుత్ హబ్‌గా నల్లగొండ జిల్లా రూపుదిద్దుకోనుంది. సానుకూలంగా స్పందించిన కేంద్రం సీఎం నిర్ణయం మేరకు దామరచర్ల మండలం వీర్లపాలెం, దిలావర్పూర్ ప్రాంతాల్లో జెన్కో అధ్వర్యంలో 5,200 మెగావాట్లు, ఎన్టీపీసీ అధ్వర్యంలో 2,400 మెగావాట్ల ప్రాజెక్టులు రానున్నాయి. అటు కృష్ణానదికి, ఇటు రైల్వే ట్రాక్‌కు సమీపంలో ఉన్న అటవీ భూములు ఇందుకనుకూలంగా ఉన్నాయని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. రిజర్వ్ ఫారెస్టు భూమి కావడంతో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో సీఎం అప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడారు. అటవీ భూమిని వినియోగించుకున్న మేర భూమిని మరోచోట అటవీ శాఖకు కేటాయిస్తామని చెప్పారు. దీనికి కేంద్రమంత్రి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందిన వారంలోనే అనుమతులిప్పిస్తామన్నారు. దీంతో జనవరి మొదటి వారంలో తానే స్వయంగా ప్రతిపాదనలను ఢిల్లీకి తీసుకెళ్లాలని సీఎం నిర్ణయించారు. ఇందుకోసం అన్ని నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఒకే ప్రాంతంలో 7600 మెగావాట్ల విద్యుత్ కేంద్రాలను నెలకొల్పడం వల్ల నల్లగొండ జిల్లాకు ఎంతో మేలు జరుగుతుందని కేసీఆర్ అన్నారు. ఆ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని, భారీ పెట్టుబడుల వల్ల 20 నుంచి 30 వేల మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. లక్ష్యం మేరకు ప్రాజెక్టుల నిర్మాణం రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఎన్టీపీసీ అధ్వర్యంలో తెలంగాణలో 4,000 మెగావాట్ల ప్లాంట్ ను కేంద్రం నిర్మించాలి. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా రామగుండంలో 1,600 మెగావాట్ల ఉత్పత్తికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మిగిలిన 2,400 మెగావాట్ల ప్లాంట్ కోసం దామరచర్ల మండలంలోనే ఎన్టీపీసీకి స్థలం కేటాయించాలని సీఎం నిర్ణయించారు. టీ జెన్కో ఆధ్వర్యంలో 6,000 మెగావాట్ల విద్యుదుత్పత్తికి రాష్ర్టం ఇప్పటికే నిర్ణయించింది. అందులో 1,080 మెగావాట్ల ప్లాంట్ ను (270 మెగావాట్ల సామర్థ్యంతో 4 యూని ట్లు) ఖమ్మం జిల్లా మణుగూరు సమీపంలో బీహెచ్ఈఎల్ నిర్మిస్తోంది. ఈ పనులు రెండేళ్లలో పూర్తవుతాయి. మరో 5,200 మెగావాట్ల విద్యుత్ కేంద్రాలను జెన్కో ద్వారా నల్లగొండలోనే నెలకొల్పాలని కేసీఆర్ ఆదేశించారు. సీఎం సమీక్షలో సీఎస్ రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, నల్లగొండ జిల్లా కలెక్టర్ చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు. -
ఎవరు ఎవరికి మద్దతిస్తారో..?!
-
ప్రజలు మాపై విశ్వాసముంచారు!
-
''హామీలను 100 రోజుల్లోనే సాధించాం''
-
జవదేకర్‌ను అడ్డుకున్న బీజేపీ శ్రేణులు
-
టీడీపీతో పొత్తు తప్పదు.. సర్డుకుపోండి
టీడీపీతో దోస్తీపై బీజేపీ రాష్ట్ర నేతలకు జవదేకర్ స్పష్టీకరణ జైట్లీ దూతగా వచ్చి.. ఇరు ప్రాంత నేతలతో భేటీ తెలంగాణలో కనీసం 8 లోక్‌సభ సీట్లకు పట్టుబట్టాలని స్థానిక నేతల యోచన సాక్షి, హైదరాబాద్: బీజేపీ, తెలుగుదేశం పొత్తుపై ఉత్కంఠ వీడుతోంది. రెండు పార్టీల మధ్య పొత్తు దాదాపు ఖాయమైంది. ఇక అధికారిక ప్రకటనే మిగిలి ఉంది. పొత్తు బాధ్యతను నెత్తికెత్తుకున్న పార్టీ నేత అరుణ్‌జైట్లీ దూతగా వచ్చిన ప్రకాశ్ జవదేకర్.. జాతీయ నాయకత్వం మనసులోని మాటను పార్టీ రాష్ట్ర నేతలకు వివరించారు. పొత్తు అనివార్యమని, సర్దుకుపోవాలని సూచించారు. 19న ఢిల్లీలో జరిగే పార్లమెంటరీ బోర్డు సమావేశం పొత్తుల వ్యవహారాన్ని ఖరారు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర నేతల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు జవదేకర్ హుటాహుటిన ఆదివారం హైదరాబాద్ వచ్చారు. పార్టీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నేతలతో విడివిడిగా భేటీ అయ్యారు. పొత్తుపై తుది నిర్ణయాన్ని ప్రకటించబోయే ముందు పార్టీ రాష్ట్ర నేతల్ని సంప్రదించమని పార్లమెంటరీ బోర్డు ఆదేశించిందని, అందుకే వచ్చానని చెబుతూనే.. జాతీయ అవసరాల దృష్ట్యా చంద్రబాబుతో పొత్తు అవసరమని కేంద్ర నాయకత్వం భావిస్తోందని ఆయన చెప్పినట్టు తెలిసింది. ఒక రాష్ట్రంలో పొత్తుకు టీడీపీ అంగీకరించడం లేదని, ఉంటే రెండు రాష్ట్రాల్లో ఉండాలి.. లేకుంటే అవసరం లేదని చంద్రబాబు చెబుతున్నట్టు వివరించారు. దీంతో తెలంగాణ నేతలు కొందరు తొలుత ఆవేదన వ్యక్తం చేసినా.. జాతీయ పార్టీ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. ఎనిమిదికి పట్టుబట్టాలని నిర్ణయం: బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిటీ ఆదివారం మరోసారి భేటీ అయింది. పొత్తుతో నిమిత్తం లేకుండా కసరత్తు ప్రారంభించిన నేతలు జవదేకర్‌తో భేటీ అనంతరం కనీసం 8 లోక్‌సభ సీట్లకైనా పట్టుబట్టాలనుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పరిస్థితి మారినందున తమదే పైచేయి కావాలని బీజేపీ కోరుకుంటున్నప్పటికీ, టీడీపీ అందుకు సిద్ధంగా లేదు. పొత్తులో భాగంగా 2004లో బీజేపీ.. హైదరాబాద్, సికింద్రాబాద్, మెదక్, కరీంనగర్, నల్లగొండలో పోటీ చేసి అన్ని చోట్లా ఓటమి పాలైంది. ఇప్పుడు తెలంగాణ తెచ్చింది తామేనన్న నినాదంతో ముందుకు వెళ్లాలనుకుంటోంది. ప్రస్తుతం గుర్తించిన తొలి కేటగిరీ సీట్లు- సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మహబూబ్‌నగర్, నిజమాబాద్, భువనగిరి, కరీంనగర్, హైదరాబాద్‌తోపాటు మెదక్ లేదా జహీరాబాద్, మహబూబాబాద్ లేదా ఏదైనా ఒక ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాన్ని కోరాలనుకుంటున్నట్టు తెలిసింది. అయితే మల్కాజ్గిరి సీటుపై టీడీపీ పట్టుబట్టే అవకాశం ఉంది. ఈ సీటు నుంచే చంద్రబాబు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఉన్న సీమాంధ్రులు తెలుగుదేశం పార్టీకైతేనే ఓట్లు వేస్తారని వాదిస్తుండగా, బీజేపీ తోసిపుచ్చుతోంది. ఈ సీటు తనకే కచ్చితంగా వస్తుందని భావిస్తున్న ఇంద్రసేనారెడ్డి.. ఇప్పటికే ప్రచారం కూడా చేపట్టారు. నియోజకవర్గంలో బలంగా ఉన్న ఓ సామాజిక వర్గం ఓట్లు తమకు తప్ప వేరే వారికి పడవని వివరించడానికి బీజేపీ అన్ని గణాంకాలతో సిద్ధమైంది. ఈ వారంలో తేల్చేస్తాం తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందా, ఉండదా అన్న ప్రశ్నకు ప్రకాశ్ జవదేకర్ సూటిగా సమాధానమివ్వలేదు. ఈ విషయాన్ని ఈ వారంలో తేల్చేస్తామని విలేకరులకు వివరించారు. ప్రస్తుతం మాట్లాడుతున్నామని, తర్వాత చెబుతామని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కనుమరుగవుతుందని, 300కి పైగా సీట్లు బీజేపీకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ మరిన్ని సీట్లు సాధించగలమన్నారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలిసిపోయినందున ఓటమి నెపాన్ని ప్రధాని మన్మోహన్పై మోపి సోనియాను, రాహుల్‌ను కాపాడే ప్రయత్నం మొదలైందని.. కాంగ్రెస్ నేత పీసీ చాకో ప్రధానిపై చేసిన ప్రకటనే ఇందుకు నిదర్శనమని జవదేకర్ విమర్శించారు.