కేటీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే: కిషన్‌రెడ్డి | Central Minister Kishan Reddy Comments On KCR | Sakshi
Sakshi News home page

ప్రగతిభవన్ బాగుంటే సరిపోతుందా? 

Published Sun, Nov 22 2020 7:17 PM | Last Updated on Sun, Nov 22 2020 7:23 PM

Central Minister Kishan Reddy Comments On KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగర అభివృద్ధిపై కేటీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఫిలింనగర్‌లో బీజేపీ కార్యాలయాన్ని కేంద్ర మంత్రి జవదేకర్ ఆదివారం ప్రారంభించారు. కిషన్‌రెడ్డి, డీకే అరుణ, చింతల రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం విఫలమయ్యిందని ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోందని, టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే ఎంఐఎంకు వేసినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. (చదవండి: ‘ఓట్ల కోసం ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు’)

పేదల కష్టాలను పట్టించుకోవడంలేదు: డీకే అరుణ
కేసీఆర్‌, కేటీఆర్‌లు హైదరాబాద్‌ను వరదల నగరంగా మార్చారని డీకే అరుణ ధ్వజమెత్తారు. వరద బాధితులను సీఎం కేసీఆర్ పరామర్శించకపోవడం దారుణమన్నారు. ప్రగతిభవన్ బాగుంటే సరిపోతుందా? అని ప్రశ్నించారు.పేదల కష్టాలను సీఎం పట్టించుకోవడంలేదని ఆమె విమర్శలు గుప్పించారు. (చదవండి: ‘వరద సాయాన్ని వారే మింగేశారు..!’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement