
ఇకపై స్కూల్ బస్సుల్లో సీసీటీవీ, జీపీఎస్
న్యూఢిల్లీ: ఇకపై స్కూలు బస్సుల్లో సీసీటీవీల ఏర్పాటు, జీపీఎస్‌తో అనుసంధానం చేయాలని, వేగనియంత్రణ కలిగి ఉండాలని సీబీఎస్‌ఈ మార్గదర్శకాలను జారీచేసింది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న స్కూలు బస్సు ప్రమాద సంఘటన నేపథ్యంలో కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి జవదేకర్ ఈ మేరకు ఆదేశాలిచ్చారు.
సీసీటీవీలను ఏర్పాటు చేసుకోవాలని జీపీఎస్ తప్పనిసరిగా ఉండాలని సీబీఎస్‌ఈ పేర్కొంది. ఇక బస్సు సిబ్బంది వ్యవహార శైలిని పరిశీలించేందుకు ప్రతీ బస్సుకు కనీసం ఒక విద్యార్థి తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండేలా చూడాలంది. బస్సుల్లో అలారం, సైరన్ ల వంటి ఏర్పాటు ఉండాలని, ఒక మొబైల్ ఫోను అందుబాటులో ఉంచాలంది.