CBSE guidelines
-
స్కూళ్లలో ఇక సీసీ టీవీలు, సెక్యూరిటీ చెక్స్
సాక్షి,న్యూఢిల్లీః గుర్గావ్ స్కూల్లో ఏడేళ్ల విద్యార్థి దారుణ హత్య నేపథ్యంలో చిన్నారుల భద్రత కోసం సీబీఎస్ఈ తన పరిధిలోని స్కూళ్లకు తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం స్కూల్స్ అన్నింటిలో సీసీ టీవీలు ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థుల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. విద్యార్థుల భద్రతపై పూర్తి బాధ్యత స్కూలు అధికారులదేనని స్పష్టం చేసింది. స్కూళ్లలో ఎలాంటి వేధింపులు, శారీరక, మానసిక హింస లేని స్వేచ్ఛాయుత వాతావరణంలో చదువుకోవడం విద్యార్థుల ప్రాథమిక హక్కని ఈ మార్గదర్శకాల్లో సీబీఎస్ఈ పేర్కొంది. నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి రెండు నెలలలోగా సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలలన్నీ ఈ ప్రమాణాలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. -
ఇకపై స్కూల్ బస్సుల్లో సీసీటీవీ, జీపీఎస్
న్యూఢిల్లీ: ఇకపై స్కూలు బస్సుల్లో సీసీటీవీల ఏర్పాటు, జీపీఎస్‌తో అనుసంధానం చేయాలని, వేగనియంత్రణ కలిగి ఉండాలని సీబీఎస్ఈ మార్గదర్శకాలను జారీచేసింది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న స్కూలు బస్సు ప్రమాద సంఘటన నేపథ్యంలో కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి జవదేకర్ ఈ మేరకు ఆదేశాలిచ్చారు. సీసీటీవీలను ఏర్పాటు చేసుకోవాలని జీపీఎస్ తప్పనిసరిగా ఉండాలని సీబీఎస్ఈ పేర్కొంది. ఇక బస్సు సిబ్బంది వ్యవహార శైలిని పరిశీలించేందుకు ప్రతీ బస్సుకు కనీసం ఒక విద్యార్థి తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండేలా చూడాలంది. బస్సుల్లో అలారం, సైరన్ ల వంటి ఏర్పాటు ఉండాలని, ఒక మొబైల్ ఫోను అందుబాటులో ఉంచాలంది.