స్కూళ్లలో సీసీ టీవీలు, సెక్యూరిటీ చెక్స్
Published Thu, Sep 14 2017 7:36 PM | Last Updated on Thu, Sep 27 2018 2:31 PM
సాక్షి,న్యూఢిల్లీః గుర్‌గావ్ స్కూల్‌లో ఏడేళ్ల విద్యార్థి దారుణ హత్య నేపథ్యంలో చిన్నారుల భద్రత కోసం సీబీఎస్‌ఈ తన పరిధిలోని స్కూళ్లకు తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం స్కూల్స్ అన్నింటిలో సీసీ టీవీలు ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థుల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. విద్యార్థుల భద్రతపై పూర్తి బాధ్యత స్కూలు అధికారులదేనని స్పష్టం చేసింది.
స్కూళ్లలో ఎలాంటి వేధింపులు, శారీరక, మానసిక హింస లేని స్వేచ్ఛాయుత వాతావరణంలో చదువుకోవడం విద్యార్థుల ప్రాథమిక హక‍్కని ఈ మార్గదర్శకాల్లో సీబీఎస్‌ఈ పేర్కొంది. నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి రెండు నెలలలోగా సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలలన్నీ ఈ ప్రమాణాలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది.
Advertisement
Advertisement