సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట ప్రకారం తెలంగాణలో ఏర్పాటు కావాల్సిన గిరిజన వర్శిటీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. బుధవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. గిరిజన వర్శిటీ ఏర్పాటుకు భూమి సమస్య తీరడంతో వర్శిటీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు.
త్వరలో ఈ బిల్లు కేంద్ర క్యాబినెట్ ముందుకు వచ్చేలా చూడాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కోరినట్టు ఆయన తెలిపారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం రూసా కింద ఖర్చు పెట్టిన రూ. 49.47 కోట్ల నిధులను త్వరలోనే విడుదల చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
త్వరలో గిరిజన, సెంట్రల్ వర్సిటీల బిల్లు!
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట ప్రకారం ఏపీలో గిరిజన, సెంట్రల్ వర్శిటీల ఏర్పాటుపై వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ సూత్రప్రాయంగా అంగీకకరించారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ విషయమై కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు సంబంధిత కేంద్ర మంత్రి జవదేకర్ తో చర్చించారు.
గిరిజన, సెంట్రల్ వర్శిటీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దీనిపై స్పందించిన జవదేకర్ సంబంధిత అధికారులను పిలిపించి మాట్లాడారు. వర్శిటీల ఏర్పాటు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టేందుకు కృషి చేస్తామని జవదేకర్ హామీ ఇచ్చినట్టు వెంకయ్య తెలిపారు.