న్యూఢిల్లీ: పన్ను రహిత గ్రాట్యుటీ మొత్తాన్ని రెట్టింపు చేసి రూ.20 లక్షలకు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లును ఈ నెల 17 నుంచి మొదలయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశముందని కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ‘ఇది మా ఎజెండా. బిల్లు ఆమోదం కోసం త్వరలో కేబినెట్ ముందుకు వెళ్తుంది’ అని చెప్పారు.
గ్రాట్యుటీ చెల్లింపు చట్టాన్ని సవరించే ఈ బిల్లు ఆదాయంలో పెరుగుదలను బట్టి ఆర్డినెన్స్ ద్వారా పన్నురహిత గ్రాట్యుటీ పరిమితిని పెంచేందుకు కూడా ప్రభుత్వానికి వీలు కల్పిస్తుంది. బిల్లు చట్టంగా మారాక సంఘటిత రంగంలోని కార్మికులు రూ. 20 లక్షల పన్ను రహిత గ్రాట్యుటీకి అర్హులవుతారు.
వర్షాకాల సమావేశాల్లో గ్రాట్యుటీ బిల్లు
Published Mon, Jul 10 2017 9:46 AM | Last Updated on Tue, Sep 5 2017 3:42 PM
Advertisement