
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ నేత దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి కలిశారు. అలయ్ బలయ్ కార్యక్రమానికి రావాల్సిందిగా సీఎంను ఆహ్వానించారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసంలో అలయ్ బలయ్ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను సీఎంకు బండారు విజయలక్ష్మి అందజేశారు.
కాxe హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఈనెల 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహణ జరగనుంది. దసరా పండుగ సందర్భంగా తెలంగాణ సంస్కృతి సాంప్రాదాయాలు ప్రతిభింబించేలా.. సమాజంలో ఆత్మీయత, అనుబంధాలకు ప్రతీకగా బండారు దత్తాత్రేయ, ఆయన కుటుంబసభ్యులు ప్రతి ఏటా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో కులమతాలకు, పార్టీలకు అతీతంగా పలువురు ప్రముఖులు, అధికారులను ఆహ్వానించి, అందరినీ ఒకే వేదిక పైకి తీసుకొచ్చి అలయ్ బలయ్ జరుపుకుంటారు.
ఈ నెల 13 న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగే అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారి కుమార్తె @vjbandarubjp గారు ముఖ్యమంత్రి @revanth_anumula గారిని ఆహ్వానించారు. వారు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి గారిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.… pic.twitter.com/DO4OGSZFIR
— Telangana CMO (@TelanganaCMO) October 10, 2024