లీగల్
నేను ఒక చిన్న కంపెనీలో ఆరేళ్లుగా సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగం చేస్తున్నాను. ఒక నెల నోటీసు ఇచ్చి నిన్ను ఫైర్ చేస్తున్నాం, వెళ్ళిపొమ్మన్నారు. నేను గ్రాట్యుటీ పొందడానికి అర్హుడినా? – శ్రీకాంత్, విశాఖపట్నం
పీ.ఎఫ్., గ్రాట్యుటీ, ఈ.ఎస్.ఐ. వంటివి సాంఘిక సంక్షేమ పథకాలు. వాటిద్వారా లభించే ఆర్థిక ప్రయోజనాలను ఎవరూ కాదనలేరు. అలా చేస్తే చట్టం అంగీకరించదు. గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం 1972 ప్రకారం, ఐదు సంవత్సరాలు ఒకే సంస్థలో పనిచేసిన ప్రతి ఒక్క ఉద్యోగికీ గ్రాట్యుటీ లభిస్తుంది. కొన్ని హై కోర్టులు ఇచ్చిన తీర్పులలో 4 సంవత్సరాల 7 నెలలు పూర్తి అయినా ఐదేళ్ళగా పరిగణించి గ్రాట్యుటీ ఇవ్వాలి అని పేర్కొనటం జరిగింది. ఒక సంవత్సరం వ్యవధిలో కనీసం 10 మంది పనిచేసిన సంస్థ లేదా షాపులకి కూడా గ్రాట్యుటీ చట్టం వర్తిస్తుంది. యాజమాన్యం మిమ్మల్ని ఉద్యోగంలో నుంచి తీసేసి, గ్రాట్యుటీ ఇవ్వను పొమ్మంటే, మీరు లేబర్ కమిషనర్ దగ్గర దరఖాస్తు చేసుకోవచ్చు.
సదరు అధికారి మీ దరఖాస్తును పరిశీలించి, యాజమాన్య పక్షం వాదనలు కూడా విని తీర్పుని ఇస్తారు. సాధారణంగా పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లోని పోస్ట్‌మాన్‌లకు వారి పదవీ విరమణ సమయంలో కొద్దిమొత్తం డబ్బులు ఇస్తారు. ఒక ΄ోస్ట్‌మాన్ వేసిన కేసులో వీరికి కూడా గ్రాట్యుటీ వర్తించాలి అని పూణేలోని లేబర్ కమిషనర్ ఆదేశించారు. గ్రాట్యుటీకి సంబంధించి ఒక కాలిక్యులేషన్ ఉంటుంది. అది 15 గీ బేసిక్ + డీఏగీ పనిచేసిన సంవత్సరాలు / 26. ఉదాహరణకి మీ బేసిక్ + డీ.ఏ నెలకి 50 వేలు, 10 సంవత్సరాలు పనిచేశారు అనుకోండి, అప్పుడు 15 గీ 50,000 గీ 10/26 = 2,88,461/– గ్రాట్యుటీ వస్తుంది.
అలాగే, కనీసం 20 మంది పనిచేస్తున్న సంస్థ లేదా షాపులకి కూడా ్ర΄ావిడెంట్ ఫండ్ (పీ.ఎఫ్.) చట్టం వర్తిస్తుంది. ఒకవేళ మీ యాజమాన్యం పీ.ఎఫ్. మీ అకౌంట్లలోకి జమ చేయని పక్షంలో, పీ.ఎఫ్. కమిషనర్ ముందు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలా చేస్తే, పూర్వబకాయిలు సైతం కట్టించి మీకు ఇప్పిస్తారు. పీ.ఎఫ్. అలాగే గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలకి సగటు ఉద్యోగి లేబర్ పరిధిలోకి రానవసరం లేదు. అలాగే, కొన్ని సందర్భాలలో సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగస్తులకు సైతం లేబర్ చట్టాలు వర్తిస్తాయి.
ఒక పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న కొంతమంది ఉద్యోగులను తొలగించినప్పుడు, హైదరాబాద్ లోని లేబర్ కోర్టు సదరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కూడా లేబర్ చట్టం పరిధిలోకి వస్తారు అని తీర్పు ఇస్తూ, తొలగించిన ఉద్యోగులను తిరిగి విధులలోకి తీసుకోవాలి లేదా వారు కోల్పోయిన సమయానికి సరైన పరిహారం ఇవ్వాల్సిందే అని తీర్పునిచ్చింది. అయితే అందరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు లేబర్ చట్టం కిందకి రాకపోవచ్చు. ఒకసారి లాయర్ సలహా పొందండి.
– శ్రీకాంత్ చింతలహైకోర్టు న్యాయవాది
Comments
Please login to add a commentAdd a comment