Exception
-
ఉద్యోగంలోంచి తీసేస్తే..గ్రాట్యుటీ వస్తుందా? రాదా? ఏం చేయాలి?
నేను ఒక చిన్న కంపెనీలో ఆరేళ్లుగా సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేస్తున్నాను. ఒక నెల నోటీసు ఇచ్చి నిన్ను ఫైర్ చేస్తున్నాం, వెళ్ళిపొమ్మన్నారు. నేను గ్రాట్యుటీ పొందడానికి అర్హుడినా? – శ్రీకాంత్, విశాఖపట్నంపీ.ఎఫ్., గ్రాట్యుటీ, ఈ.ఎస్.ఐ. వంటివి సాంఘిక సంక్షేమ పథకాలు. వాటిద్వారా లభించే ఆర్థిక ప్రయోజనాలను ఎవరూ కాదనలేరు. అలా చేస్తే చట్టం అంగీకరించదు. గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం 1972 ప్రకారం, ఐదు సంవత్సరాలు ఒకే సంస్థలో పనిచేసిన ప్రతి ఒక్క ఉద్యోగికీ గ్రాట్యుటీ లభిస్తుంది. కొన్ని హై కోర్టులు ఇచ్చిన తీర్పులలో 4 సంవత్సరాల 7 నెలలు పూర్తి అయినా ఐదేళ్ళగా పరిగణించి గ్రాట్యుటీ ఇవ్వాలి అని పేర్కొనటం జరిగింది. ఒక సంవత్సరం వ్యవధిలో కనీసం 10 మంది పనిచేసిన సంస్థ లేదా షాపులకి కూడా గ్రాట్యుటీ చట్టం వర్తిస్తుంది. యాజమాన్యం మిమ్మల్ని ఉద్యోగంలో నుంచి తీసేసి, గ్రాట్యుటీ ఇవ్వను పొమ్మంటే, మీరు లేబర్ కమిషనర్ దగ్గర దరఖాస్తు చేసుకోవచ్చు. సదరు అధికారి మీ దరఖాస్తును పరిశీలించి, యాజమాన్య పక్షం వాదనలు కూడా విని తీర్పుని ఇస్తారు. సాధారణంగా పోస్టల్ డిపార్ట్మెంట్లోని పోస్ట్మాన్లకు వారి పదవీ విరమణ సమయంలో కొద్దిమొత్తం డబ్బులు ఇస్తారు. ఒక ΄ోస్ట్మాన్ వేసిన కేసులో వీరికి కూడా గ్రాట్యుటీ వర్తించాలి అని పూణేలోని లేబర్ కమిషనర్ ఆదేశించారు. గ్రాట్యుటీకి సంబంధించి ఒక కాలిక్యులేషన్ ఉంటుంది. అది 15 గీ బేసిక్ + డీఏగీ పనిచేసిన సంవత్సరాలు / 26. ఉదాహరణకి మీ బేసిక్ + డీ.ఏ నెలకి 50 వేలు, 10 సంవత్సరాలు పనిచేశారు అనుకోండి, అప్పుడు 15 గీ 50,000 గీ 10/26 = 2,88,461/– గ్రాట్యుటీ వస్తుంది.అలాగే, కనీసం 20 మంది పనిచేస్తున్న సంస్థ లేదా షాపులకి కూడా ్ర΄ావిడెంట్ ఫండ్ (పీ.ఎఫ్.) చట్టం వర్తిస్తుంది. ఒకవేళ మీ యాజమాన్యం పీ.ఎఫ్. మీ అకౌంట్లలోకి జమ చేయని పక్షంలో, పీ.ఎఫ్. కమిషనర్ ముందు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలా చేస్తే, పూర్వబకాయిలు సైతం కట్టించి మీకు ఇప్పిస్తారు. పీ.ఎఫ్. అలాగే గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలకి సగటు ఉద్యోగి లేబర్ పరిధిలోకి రానవసరం లేదు. అలాగే, కొన్ని సందర్భాలలో సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగస్తులకు సైతం లేబర్ చట్టాలు వర్తిస్తాయి. ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న కొంతమంది ఉద్యోగులను తొలగించినప్పుడు, హైదరాబాద్ లోని లేబర్ కోర్టు సదరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా లేబర్ చట్టం పరిధిలోకి వస్తారు అని తీర్పు ఇస్తూ, తొలగించిన ఉద్యోగులను తిరిగి విధులలోకి తీసుకోవాలి లేదా వారు కోల్పోయిన సమయానికి సరైన పరిహారం ఇవ్వాల్సిందే అని తీర్పునిచ్చింది. అయితే అందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు లేబర్ చట్టం కిందకి రాకపోవచ్చు. ఒకసారి లాయర్ సలహా పొందండి. – శ్రీకాంత్ చింతలహైకోర్టు న్యాయవాది -
ఏపీ: టీచర్లు ఇక విద్యా బోధనకు మాత్రమే!
సాక్షి, విజయవాడ: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు.. ఉపాధ్యాయులు అకడమిక్ ఆచివమెంట్ లెవెల్ పెంచేందుకు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా శాఖ పరిధి కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బోధనేతర బాధ్యతలను ఇవ్వకూడదని మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయులను బోధనేతర విధుల నుంచి తప్పిస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇకపై ఉపాధ్యాయులు కేవలం విద్యా బోధనకు మాత్రమే పరిమితం కానున్నారు. మంగళవారం వర్చువల్‌గా భేటీ అయిన ఏపీ కేబినెట్ సమావేశం పాఠశాల విద్యా శాఖకు సంబంధించిన ఈ కీలక నిర్ణయానికి ఆమోద ముద్ర వేసింది. కేబినెట్ ఆమోదం లభించిన వెంటనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను పాఠశాల విద్యా శాఖ వెలువరించింది. విద్యా శాఖ కార్యదర్శి రాజశేఖర్ పేరిట నోటిఫికేషన్ జారీ అయ్యింది. అనేక సందర్భాల్లో బోధనేతర బాధ్యతలు భారం తగ్గించాలని కోరుతూ వస్తున్నారు ఉపాధ్యాయులు. అంతేకాదు.. ఉపాధ్యాయులు బోధనేతర విధులకు నిషిద్ధమని విద్యా హక్కు చట్టం చెబుతున్న విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించింది. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే టీచర్లను బోధనేతర కార్యకలాపాలకు వినియోగిస్తామని ఆ నోటిఫికేషన్ లో ప్రభుత్వం వెల్లడించింది. ఇతర ప్రభుత్వ ఉద్యోగులంతా విధులకు నియమించగా ఇంకా అవసరం ఉన్నప్పుడు మాత్రమే బోధనేతర విధులను అప్పగించాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. -
హెచ్ 1బీ వీసాదారులకు ఊరట
వాషింగ్టన్ : హెచ్1 బీ వీసా హోల్డర్లకు అమెరికా ప్రభుత్వం ఊరట నిచ్చింది. హెచ్ 1బీ వీసా నిషేధంపై కొన్ని షరతులతో కూడిన మినహాయింపులను తాజాగా ప్రకటించింది. వీసా నిషేధాన్ని ప్రకటించడానికి ముందున్న ఉద్యోగాలకు తిరిగి వెళ్లే హెచ్1 బీ, ఎల్ 1 వీసాదారులకు అనుమతినిస్తున్నట్టు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ ఆమోదం తెలిపింది. వీసాదారులు ఇదివరకు పని చేసిన ఉద్యోగాల్లోనే పని చేయడానికి తిరిగి వస్తే వారికి అనుమతి లభిస్తుందని అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. విదేశాలలో చిక్కుకున్న హెచ్ 1బీ వీసాదారులు అమెరికాలో ఉద్యోగాలకు తిరిగి వస్తే వీసాలు పొందటానికి అవకాశం కల్పిస్తున్నట్టు ఇమ్మిగ్రేషన్ అటార్నీ గ్రెగ్ సిస్కిండ్ ట్వీట్ చేశారు. అయితే అది వీసా నిషేధానికి ముందు జరిగినదై ఉండాలన్న షరతు విధించినట్టు తెలిపారు. ప్రాధమిక వీసాదారులతో పాటు డిపెండెంట్లు (జీవిత భాగస్వాములు, పిల్లలు) కూడా అనుమతినిస్తున్నట్టు యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ స్టేట్ అడ్వైజరీ తెలిపింది. గతంలో దేశంలో ఏ కంపెనీకి పని చేశారో.. ఏ స్థాయిలో ఉన్నారో..వారు దేశంలోకి రావచ్చునని పేర్కొది. అలాగే సాంకేతిక నిపుణులు, సీనియర్ స్థాయి మేనేజర్లు ఇలా తమ స్థాయికి తగిన జాబ్స్ చేసినవారికి కూడా మళ్ళీ ఆహ్వానం పలుకుతున్నామని ట్రంప్ ప్రభుత్వం వివరించింది. కరోనా మహమ్మారి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ట్రంప్ ఈ చర్య తీసుకున్నట్టు సమాచారం. BREAKING - Govt will now allow H-1Bs stuck abroad due to the visa bans to get visas if they are returning to jobs they have held in the US before departing. pic.twitter.com/sQcog9Y4ex — (((Greg Siskind))) (@gsiskind) August 12, 2020 -
25 శాతం ప్రేక్షకులకు ఓకే
మెల్బోర్న్: ప్రపంచ దేశాల్లో ఒక్కొక్కటిగా క్రీడా సంబంధిత కార్యకలాపాలకు కరోనా నిబంధనల నుంచి మినహాయింపులు లభిస్తున్నాయి. తాజాగా 25 శాతం ప్రేక్షకుల్ని మైదానాల్లో అనుమతించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం సిద్ధమైంది. ఆసీస్ ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్ శుక్రవారం ఈ మేరకు ప్రకటన చేశారు. జాతీయ మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చేనెల నుంచి 40,000 సీటింగ్ సామర్థ్యం ఉన్న క్రీడా మైదానాల్లోకి 10,000 మంది ప్రేక్షకుల్ని అనుమతిస్తాం అని పేర్కొన్నారు. ‘మ్యాచ్‌లు, పండుగలు, కచేరీలకు ప్రేక్షకులు వెళ్లవచ్చు. కానీ ఆతిథ్య వేదిక విశాలంగా ఉండాలి. సీట్ల మధ్య తగిన దూరం ఏర్పాటు చేయాలి. ఈవెంట్‌కు హాజరయ్యే అభిమానులకు టిక్కెట్లను కేటాయించాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ స్టేడియం సామర్థ్యాన్ని బట్టి 25 శాతం ప్రేక్షకుల్ని మాత్రమే ఆహ్వానించాలి. ఆరోగ్య అధికారుల సహాయంతో వేదికల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలను రూపొందిస్తున్నాం’ అని ఆయన వివరించారు. -
మాస్క్ లేకుంటే జరిమానా రూ. 1,000
కరోనా వైరస్ నిర్మూలనకు రాష్ట్రంలో అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను మే 7 నుంచి 29 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, దీనిని ఉల్లంఘించిన ప్రతిసారీ రూ.1000 జరిమా నా విధిస్తారని స్పష్టంచేశారు. వీటికి రాష్ట్రమంతటా అనుమతి... నిత్యావసర వస్తువులైన ఆహార పదార్థాల క్రయ విక్రయాలు, ఉత్పత్తి, రవాణా, వ్యవసాయానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు వంటి వస్తువుల విక్రయాలు, వ్యవసాయ కార్యకలాపాలు, అంతర్రాష్ట్ర, రాష్ట్రం అంతర్భాగంలో వస్తువుల రవాణా, ఆస్పత్రులు, క్లినిక్స్, మందుల దుకాణాలు, వైద్య పరీక్షల కేంద్రాల నిర్వహణ, ఉపాధి హామీ పనులు, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, బీమా సంస్థలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, టెలికం, ఇంటర్నెట్, పోస్టల్ సేవలు, ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, అత్యవసర వస్తువుల సప్లై చైన్ కొనసాగింపు, పెట్రోల్ పంపులు, ఎల్పీజీ– వీటి నిల్వలు, రవాణా సంబంధిత కార్యకలాపాలు రాష్ట్రమంతా కొనసాగుతాయి. ♦ గ్రామీణ ప్రాంతాలు, ఆరెంజ్, గ్రీన్ జోన్ల పరిధిలో అన్ని నిర్మాణ పనులకు అనుమతి. జీహెచ్ఎంసీతో సహా ఇతర రెడ్‌జోన్ ప్రాంతాల్లో వర్క్ సైట్ల వద్ద కార్మికుల లభ్యత ఉంటేనే పనులకు అనుమతి ♦ గ్రామీణ ప్రాంతాలు, ఆరెంజ్, గ్రీన జోన్ల పరిధిలో అన్ని రకాల పరిశ్రమలకు అనుమతి. స్టోన్ క్రషర్స్, ఇటుకల బట్టీలు, చేనేత, రిపేర్ పనులు, బీడీల తయారీ, ఇసుక ఇతరత్రా మైనింగ్, సిరామిక్ టైల్స్, రూఫ్ టైల్స్, సిమెంట్ పరిశ్రమలు, జిన్నింగ్ మిల్స్, ఐరన్, స్టీల్ పరిశ్రమలు, ప్లాస్టిక్, శానిటరీ పైపులు, పేపర్ పరిశ్రమలు, కాటన్ పరుపులు, ప్లాస్టిక్, రబ్బర్ పరిశ్రమలు, నిర్మాణ పనులకు అనుమతి. ♦ గ్రీన్, ఆరెంజ్ జోన్ల పరిధిలో అన్ని రకాల వస్తువుల ఈ–కామర్స్‌కు అనుమతి. జీహెచ్ఎంసీలో నిత్యావసర వస్తువుల ఈ–కామర్స్‌కు మాత్రమే అనుమతి. ♦ గ్రామీణ ప్రాంతాలతో పాటు గ్రీన్, ఆరెంజ్ జోన్ల పరిధిలో మాల్స్ మినహా అన్ని రకాల షాపులకు అనుమతి. రెడ్ జోన్లలో మినహాయించి మిగిలిన అన్ని పురపాలికల్లో ఒక రోజు విడిచి ఒక రోజు దుకాణాలను తెరవాలి. ఒకే రోజు పక్క పక్క షాపులు తెరవరాదు. రెడ్‌జోన్ పరిధిలోని జీహెచ్ఎంసీతో పాటు ఇతర పురపాలికల్లో నిత్యావసర వస్తువుల షాపులతో పాటు కేవలం నిర్మాణ సామాగ్రి, హార్డ్‌వేర్, వ్యవసాయ పరికరాలు/యంత్రాలకు అనుమతి. ♦ రెడ్ జోన్ పట్టణ ప్రాంతాల్లోని సెజ్‌లు, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్లు, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, ఇండస్ట్రియల్ టౌన్‌షిప్పులు, ఔషధాలు, వైద్య పరికరాలు, వైద్య, ఔషధ సంబంధ ముడిసరుకులు తదితర నిత్యావసర, అత్యవసర వస్తువుల ఉత్పత్తి యూ నిట్లు, నిరంతరం నడవాల్సిన పరిశ్రమలు, ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తి, ప్యాక్డ్ వస్తువుల తయారీకి అనుమతి. ♦ జీహెచ్ఎంసీతో సహా ఇతర రెడ్‌జోన్ పరిధిలోని ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు, ఇతర ప్రైవేటు కార్యాలయాలు 33 శాతం ఉద్యోగులతో పనిచేయాలి. మిగిలిన వారు ఇంటి నుంచే పని చేయాలి. గ్రీన్, ఆరెంజ్ జోన్ల పరిధిలో పూర్తి ఉద్యోగుల సామర్థ్యంతో పనిచేసేందుకు అనుమతి. ♦ గ్రీన్, ఆరెంజ్ జోన్లలోని ప్రభుత్వ కార్యాలయాలు పూర్తి ఉద్యోగుల సామర్థ్యంతో పని చేయవచ్చు. అయితే, రెడ్జోన్ల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు 100 శాతం మంది డిప్యూటీ సెక్రటరీ, ఆపై స్థాయి అధికారులతో పని చేయాలి. అవసరాన్ని బట్టి మిగిలిన సిబ్బందిలో 33 శాతం మంది విధులకు హాజరు కావచ్చు. రక్షణ, భద్రత, వైద్య, కుటుంబ సంక్షేమ, పోలీసు, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్సులు, రిజిస్ట్రేషన్ స్టాంపులు, రెవెన్యూ, జైళ్లు, హోంగార్డులు, సివిల్ డిఫెన్స్, అగ్నిమాపక, విపత్తుల నిర్వహణ, ఎన్ఐసీ, కస్టమ్స్, ఎఫ్‌సీఐ, ఎన్సీసీ, ఎన్‌వైకే, మునిసిపల్, పంచాయతీరాజ్ శాఖలు ఎలాంటి ఆంక్షలు లేకుండా పనిచేయవచ్చు. అత్యవసర సేవలు కొనసాగాలి. ఆ మేరకు సిబ్బందిని వినియోగించుకోవాలి. ♦ రెడ్ జోన్ల పరిధిలో రెస్టారెంట్లు, బార్బర్ షాపులు, స్పా, సెలూన్స్‌కు అనుమతి లేదు. ట్యాక్సీలు, క్యాబ్, ఆటోరిక్షాలకు సైతం అనుమతి లేదు. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతి. ఆరెంజ్ జోన్లలో మాత్రమే కేవలం ఇద్దరు ప్రయాణికులతో ట్యాక్సీలకు అనుమతి. జోన్లతో సంబంధం లేకుండా వీటిపై నిషేధం.. ♦ దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలు ♦ రైలు ప్రయాణాలు (చిక్కుకుపోయిన వ్యక్తుల కోసం ఏర్పాటు చేసే ప్రత్యేక రైళ్లకు మినహాయింపు) ♦ అంతర్రాష్ట్ర బస్సులతో ప్రజారవాణా. ఇతర రాష్ట్రాల నుంచి వ్యక్తుల రాకపోకలు (ప్రత్యేకంగా అనుమతి పొందినవారికి మినహాయింపు) ♦ అంతర్ జిల్లాతో పాటు జిల్లా లోపల బస్సు సేవలు ♦ మెట్రో రైళ్లు ♦ పాఠశాలలు, కళాశాలలు, విద్యా/శిక్షణ సంస్థలు ♦ హోటళ్లు, లాడ్జీల వంటి ఆతిథ్య సేవలు (వైద్య, పోలీసు, ప్రభుత్వ ఉద్యోగులు, చిక్కుకుపోయిన వ్యక్తులకు బస కల్పించే వాటికి మినహాయింపు) ♦ బార్లు, పబ్బులు, సినిమా హాళ్లు, థియేటర్లు, షాపింగ్ మాల్స్, జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్, స్పోర్ట్స్ కాంప్లెక్సులు, అమ్యూజ్మెంట్, జూ పార్కులు, మ్యూజియంలు, ఆడిటోరియంలు ♦ సామూహికంగా నిర్వహించే అన్ని రకాల సామాజిక, రాజకీయ, క్రీడల, వినోద, విద్య, సాంస్కృతిక కార్యకలాపాలు ♦ అన్ని ప్రార్థన స్థలాలు, మతపరమైన స్థలాలు ♦ అన్ని సామూహిక మతపర కార్యక్రమాలు ♦ రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు ఎలాంటి జన సంచారానికి అనుమతి లేదు. అత్యవసర వైద్య సేవలకు మినహాయింపు. ఆస్పత్రులు, మందుల దుకాణాలు మినహా ఇతర దుకాణాలు/వ్యాపార సంస్థలను సాయంత్రం 6 తర్వాత మూసేయాలి. -
హెల్త్‌కేర్ సేవలకు జీఎస్టీ లేదు
న్యూఢిల్లీ: ఆస్పత్రుల్లోని రోగులకు వైద్యుల సూచనల మేరకు అందజేసే ఆహారంపై జీఎస్టీ లేదని ప్రభుత్వం తెలిపింది. అనారోగ్యం, గాయం, గర్భం, వంటి కారణాలతో ఆస్పత్రిలో చేరిన వారు చేయించుకునే పరీక్షలు, చికిత్స, వైద్యం వంటివి జీఎస్టీ చట్టం ప్రకారం హెల్త్‌కేర్ సేవల పరిధిలోకి వస్తాయని, వీటిపై పన్ను ఉండదంది. దీంతోపాటు ఆస్పత్రులకు రోగులు చెల్లించే మొత్తం (వైద్యుల ఫీజు సహా)నకు కూడా జీఎస్టీ మినహాయింపు వర్తిస్తుందని తెలిపింది. అయితే, ఆస్పత్రిలో అడ్మిట్ కాని రోగులు, వారి సంబంధీకులకిచ్చే ఆహారంపై జీఎస్టీ ఉంటుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. -
చిన్న సంస్థలకు రాయితీలున్నాయ్..
ఎంఎస్ఎంఈలకు పలు ప్రోత్సాహకాలు పన్నులు, ఖాతాల విషయంలో మినహాయింపులు మన దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలదే (ఎంఎస్ఎంఈ) కీలక పాత్ర. ఎగుమతుల్లో 45 శాతం వాటా వీటిదే. స్థూల దేశీయోత్పత్తిలో 10 శాతం వస్తున్నది వీటి నుంచే. దేశవ్యాప్తంగా 5 కోట్లకు పైగా ఉన్న ఎంఎస్ఎంఈలు అనేక కోట్ల మందికి ఉపాధినిస్తున్నాయనటంలో అతిశయోక్తి లేదు. వ్యవసాయరంగం తర్వాత రెండో అతిపెద్ద రంగం ఇదే. ఈ రంగానికి కేంద్రం అనేక రాయితీలిస్తోంది. ప్రత్యేక చట్టాన్ని కూడా తెచ్చింది. ఈ నేపథ్యంలో ఏ సంస్థలను ఎంఎస్ఎంఈలుగా పరిగణిస్తారు? పన్నులకు సంబంధించి అవి పాటించాల్సిన పద్ధతులేంటి? వాటికి ఎలాంటి రాయితీలు లభిస్తాయి? ఇవన్నీ చట్టంలో వివరంగా పొందుపర్చారు. వాటి వివరణే ఇది... ఒక సంస్థను సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థగా గుర్తించాలంటే ఏఏ అర్హతలుండాలన్నది ఎంఎస్ఎంఈడీ చట్టంలో నిర్వచించారు. తయారీ రంగానికి, సేవా రంగానికి ఈ నిర్వచనాలు వేరువేరుగా ఉన్నాయి. వీటి వివరాలను పట్టికలో ఇవ్వడం జరిగింది. స్టార్టప్‌లు, ఎస్ఎస్ఐ, ఎస్ఎంఈ ఇలా ఏ పేరుతో పిలుచుకున్నా ఇవన్నీ వీటి పరిధిలోకే వస్తాయి. ఎక్సైజ్ డ్యూటీ రాయితీలు గడిచిన ఆర్థిక సంవత్సరంలో టర్నోవరు రూ.4 కోట్లకు మించకుండా ఉంటే, ఈ సంవత్సరం టర్నోవరు నుండి మొదటి రూ.1.5 కోట్ల మీద ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు లభిస్తుంది.నెలవారీ చెల్లింపులు, రిటర్నులు చేయాల్సిన పనిలేదు. మూడు నెలలకు ఒకసారి చెల్లింపులు, రిటర్నులు చేయొచ్చు. దీనివల్ల తయారీ దారులు పాటించాల్సిన నిబంధనలకయ్యే ఖర్చు బాగా తగ్గుతుంది. నగదు ప్రవాహాన్ని మెరుగుపర్చుకోవడానికి అదే సంవత్సరంలో చెల్లించిన ఎక్సైజ్ పన్నును పూర్తి క్రెడిట్‌గా తీసుకోవచ్చు. అదే ఏడాదిలో టర్నోవర్ రూ.90 లక్షలు దాటని సంస్థలు ఎక్సైజ్ రిజిస్ట్రేషన్ కూడా తీసుకోనవసరం లేదు. అదే సేవా రంగంలో అయితే టర్నోవర్ రూ.9 లక్షలు దాటకపోతే సర్వీస్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ తీసుకోనవసరం లేదు. వ్యాట్‌లో ప్రోత్సాహకాలు దేశంలో అనేక రాష్ట్రాలు ఎస్ఎంఈ రంగాలకు పలు మినహాయింపులు, రాయితీలు అందిస్తున్నాయి. రూ.10 లక్షలలోపు టర్నోవర్ కలిగిన సంస్థలను చాలా రాష్ట్రాలు వ్యాట్ రిజిస్ట్రేషన్ నుంచి మినహాయించాయి. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ‘కాంపోజిషన్ స్కీము’ను ప్రవేశపెట్టాయి. దీని ప్రకారం ఒక లిమిట్ దాటని ఎస్ఎంఈ సంస్థలు వ్యాట్ కట్టేటప్పుడు ‘కన్సిషనల్ రేటు’ను వినియోగించుకోవచ్చు. అంటే వ్యాట్ శాతం కన్నా తక్కువ శాతం పన్ను చెల్లించవచ్చన్నమాట. ఫైనాన్షియల్ బేసిక్స్.. పిల్లలకు ఆరోగ్య బీమా ఎప్పుడు తీసుకోవాలి? పరిస్థితులు ఎప్పుడెలా ఉంటాయో తెలియదు. అందుకే ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది. పిల్లలు కూడా ఈ కోవలోకే వస్తారు. వారికి కూడా ఆరోగ్య బీమా తీసుకోవాలి. వీరికి పుట్టిన 90 రోజుల తర్వాత ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం ఉత్తమం. అప్పుడు వారికి భవిష్యత్తులో ఎలాంటి అనారోగ్య పరిస్థితులు ఎదురైనా, వాటికయ్యే ఆరోగ్య ఖర్చులకు పాలసీ వర్తిస్తుంది. ప్రస్తుతం వివిధ బీమా కంపెనీలు పిల్లల కోసం ప్రత్యేకంగా పలు రకాల హెల్త్ పాలసీలు అందిస్తున్నాయి. వీటిలో మన అవసరాలకు అనువైన పాలసీని ఎంచుకోవాలి. అలాగే ఒక బీమా కంపెనీ ఆరోగ్య బీమా పాలసీలను మరొక బీమా కంపెనీ పాలసీతో పోల్చి చూసుకోండి. సర్వీసులు, ప్రీమియం వంటి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోండి. పాలసీకి సంబంధించిన అన్ని వివరాలను సమగ్రంగా తెలుసుకోండి. అవసరమైతే ఆయా విషయాలపై ఈ రంగంలో నిపుణుల సలహాలను తీసుకోవాలి. తద్వారా ఈ అంశంపై ఒక అవగాహనకు రావడానికి అవకాశం లభిస్తుంది. మొన్నటి బడ్జెట్ సానుకూలం... ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 44 ఏడీ ప్రకారం చిన్న వర్తకులు చేసే వ్యాపారంపై లాభాన్ని ఊహించుకుని పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వీరు ఎటువంటి అకౌంటింగ్ బుక్స్ నిర్వహించాల్సిన పనిలేదు. తాజా బడ్జెట్లో ఈ పరిమితిని రెట్టింపు చేశారు. గతంలో కోటి రూపాయల లోపు టర్నోవర్ ఉన్న వారు వాస్తవ లాభాల మార్జిన్‌తో సంబంధం లేకుండా ఆదాయంపై 8% లాభాన్ని చూపించుకునేవారు. ఇప్పుడు ఈ పరిమితిని 2 కోట్లకు పెంచారు. అంటే ఇక నుంచి రెండు కోట్ల లోపు టర్నోవర్ ఉన్న వారు 8 శాతం లాభాన్ని చూపించి ఆ మేరకు పన్నులు చెల్లిస్తే సరిపోతుంది. ఈ నిర్ణయం వల్ల సుమారు 33 లక్షల ఎంఎస్ఎంఈలు అకౌంటింగ్ బుక్స్, ఆడిటర్ల విషయంలో మినహాయింపు పొందారు. పన్ను మినహాయింపు బ్రాకెట్లో ఉంటూ రాయితీలు పొందుతున్న ఎస్ఎంఈలు వారి ఉత్పత్తిని పెంచడానికి సంకోచిస్తున్నాయి. టర్నోవర్ రూ. 5 కోట్లు దాటని సంస్థలకు (2015, మార్చి నాటికి) కార్పొరేట్ ఆదాయ పన్నుని 29 శాతానికి తగ్గించింది. అయితే విధిగా సెస్, సర్ చార్జీ కట్టాల్సి ఉంటుంది. స్టార్టప్‌లకు మొదటి మూడేళ్లు 100 శాతం పన్ను మినహాయింపు ఉంటుందని తాజా బడ్జెట్లో ప్రతిపాదించారు. ( ఏప్రిల్ 2016 నుంచి మార్చి 2019 వరకు ). ఇప్పుడు అన్‌లిస్టెడ్ కంపెనీల విషయంలో (అంటే స్టార్టప్ మరియు ప్రైవేటు సంస్థల విషయంలో) లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్ హోల్డింగ్ కాలాన్ని మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించారు. కహానీ... గోల్డ్ లైవ్.. మనం బాగా విలువనిచ్చే లోహం బంగారం. దాని ధర ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఒకసారి పెరుగుతుంది. మరొకసారి తగ్గుతుంది. ఒక్క క్లిక్‌తో ఎప్పటికప్పుడు అంతర్జాతీయంగా స్పాట్లో బంగారం ధరను తెలుసుకోవాలంటే మీరు ‘గోల్డ్ లైవ్’ యాప్‌ను ఉపయోగించి చూడండి. ఈ యాప్‌లో అంతర్జాతీయ దిగ్గజ ఇండెక్స్‌లను, క్రూడ్, ఫారెక్స్ వివరాలను తెలుసుకోవచ్చు. దీన్ని గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రత్యేకతలు బంగారం ధర లైవ్‌లో చూడొచ్చు. ప్రతి 10 నిమిషాలకు బంగారం ధర అప్డేట్ అవుతూ ఉంటుంది. బంగారం సహా వెండి, ప్లాటినం, కాపర్, నికెల్, అల్యూమినియం, జింక్, లెడ్, యురేనియం వంటి తదితర లోహాల ధరల్ని కూడా తెలుసుకోవచ్చు. ఆయిల్ ధరను కూడా పొందొచ్చు. అంతర్జాతీయ దిగ్గజ ఇండెక్స్‌లు, గోల్డ్ సూచీలు ఏ స్థాయిలో ఉన్నాయో చూడొచ్చు. మైనింగ్ స్టాక్స్ ఎలా కదులుతున్నాయో తెలుసుకోవచ్చు. ఆయిల్ ధర, సూచీలు, బంగారం విలువకు సంబంధించి అలర్ట్స్‌ను సెట్ చూసుకోవచ్చు. బంగారం, ఇతర లోహాల విలువను వివిధ కరెన్సీల్లోనూ, పరిమాణాన్ని గ్రాము, కేజీ, ఔన్స్లోనూ చూడొచ్చు. పలు దేశాల కరెన్సీలకు చెందిన ఎక్స్చేంజ్ రేట్లను పోల్చి చూసుకోవచ్చు. బంగారం, ఇతర లోహాలు, క్రూడ్ ధరలకు సంబంధించిన టెక్నికల్ చార్ట్స్‌ను చూడొచ్చు. మార్కెట్ వార్తలను చదవొచ్చు. -
ఇంటర్ విద్యార్థులకు ఊరట
పది నిముషాల వరకు ఓకే మినహాయింపునిచ్చిన ఇంటర్ బోర్డు సెక్రటరీ విశాఖపట్నం : తొలి రోజు ఒక్క నిముషం ఎఫెక్ట్‌తో పరీక్ష రాయలేకపోయిన ఇంటర్ విద్యార్థుల ఆవేదనను ఇంటర్మీడియట్ బోర్డు అర్థం చేసుకుంది. పది నిముషాలపాటు మినహాయింపునిస్తూ బోర్డు సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఇంటర్మీడియట్ తొలి ఏడాది విద్యార్థులు గగ్గోలు పెట్టిన విషయం పత్రికల్లో ప్రముఖంగా రావడంతో ఇంటర్మీడియట్ బోర్డు స్థానిక అధికారులు బోర్డు సెక్రటరీ ఎం.వి.సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లారు. కనీసం పావుగంటైనా అనుమతించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే అభ్యర్థన రావడంతో గురువారం నుంచి పది నిముషాలపాటు మినహాయింపునిచ్చారు. దీంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. రెండో రోజు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం తెలుగు, హిందీ, సంస్కృతం పరీక్షలకు జిల్లాలో 49,655 మంది హాజరు కావాల్సి ఉండగా 48,422 మంది పరీక్ష రాశారు. 1233 మంది గైర్హాజరయ్యారు. వీరిలో జనరల్ కేటగిరి పరిధిలో 46,020 మందికి 45,040మంది, ఓకేషనల్ కేటగిరిలో 3635 మందికి 3382మంది హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 110 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షల్లో రెండోరోజు ఎక్కడా ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు. స్టేట్ అబ్జర్వర్ బి.దివాకర్, ఆర్జేడీ రూఫస్ కుమార్ పరీక్షలను పర్యవేక్షించారు.