calculation
-
ఉద్యోగంలోంచి తీసేస్తే..గ్రాట్యుటీ వస్తుందా? రాదా? ఏం చేయాలి?
నేను ఒక చిన్న కంపెనీలో ఆరేళ్లుగా సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేస్తున్నాను. ఒక నెల నోటీసు ఇచ్చి నిన్ను ఫైర్ చేస్తున్నాం, వెళ్ళిపొమ్మన్నారు. నేను గ్రాట్యుటీ పొందడానికి అర్హుడినా? – శ్రీకాంత్, విశాఖపట్నంపీ.ఎఫ్., గ్రాట్యుటీ, ఈ.ఎస్.ఐ. వంటివి సాంఘిక సంక్షేమ పథకాలు. వాటిద్వారా లభించే ఆర్థిక ప్రయోజనాలను ఎవరూ కాదనలేరు. అలా చేస్తే చట్టం అంగీకరించదు. గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం 1972 ప్రకారం, ఐదు సంవత్సరాలు ఒకే సంస్థలో పనిచేసిన ప్రతి ఒక్క ఉద్యోగికీ గ్రాట్యుటీ లభిస్తుంది. కొన్ని హై కోర్టులు ఇచ్చిన తీర్పులలో 4 సంవత్సరాల 7 నెలలు పూర్తి అయినా ఐదేళ్ళగా పరిగణించి గ్రాట్యుటీ ఇవ్వాలి అని పేర్కొనటం జరిగింది. ఒక సంవత్సరం వ్యవధిలో కనీసం 10 మంది పనిచేసిన సంస్థ లేదా షాపులకి కూడా గ్రాట్యుటీ చట్టం వర్తిస్తుంది. యాజమాన్యం మిమ్మల్ని ఉద్యోగంలో నుంచి తీసేసి, గ్రాట్యుటీ ఇవ్వను పొమ్మంటే, మీరు లేబర్ కమిషనర్ దగ్గర దరఖాస్తు చేసుకోవచ్చు. సదరు అధికారి మీ దరఖాస్తును పరిశీలించి, యాజమాన్య పక్షం వాదనలు కూడా విని తీర్పుని ఇస్తారు. సాధారణంగా పోస్టల్ డిపార్ట్మెంట్లోని పోస్ట్మాన్లకు వారి పదవీ విరమణ సమయంలో కొద్దిమొత్తం డబ్బులు ఇస్తారు. ఒక ΄ోస్ట్మాన్ వేసిన కేసులో వీరికి కూడా గ్రాట్యుటీ వర్తించాలి అని పూణేలోని లేబర్ కమిషనర్ ఆదేశించారు. గ్రాట్యుటీకి సంబంధించి ఒక కాలిక్యులేషన్ ఉంటుంది. అది 15 గీ బేసిక్ + డీఏగీ పనిచేసిన సంవత్సరాలు / 26. ఉదాహరణకి మీ బేసిక్ + డీ.ఏ నెలకి 50 వేలు, 10 సంవత్సరాలు పనిచేశారు అనుకోండి, అప్పుడు 15 గీ 50,000 గీ 10/26 = 2,88,461/– గ్రాట్యుటీ వస్తుంది.అలాగే, కనీసం 20 మంది పనిచేస్తున్న సంస్థ లేదా షాపులకి కూడా ్ర΄ావిడెంట్ ఫండ్ (పీ.ఎఫ్.) చట్టం వర్తిస్తుంది. ఒకవేళ మీ యాజమాన్యం పీ.ఎఫ్. మీ అకౌంట్లలోకి జమ చేయని పక్షంలో, పీ.ఎఫ్. కమిషనర్ ముందు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలా చేస్తే, పూర్వబకాయిలు సైతం కట్టించి మీకు ఇప్పిస్తారు. పీ.ఎఫ్. అలాగే గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలకి సగటు ఉద్యోగి లేబర్ పరిధిలోకి రానవసరం లేదు. అలాగే, కొన్ని సందర్భాలలో సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగస్తులకు సైతం లేబర్ చట్టాలు వర్తిస్తాయి. ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న కొంతమంది ఉద్యోగులను తొలగించినప్పుడు, హైదరాబాద్ లోని లేబర్ కోర్టు సదరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా లేబర్ చట్టం పరిధిలోకి వస్తారు అని తీర్పు ఇస్తూ, తొలగించిన ఉద్యోగులను తిరిగి విధులలోకి తీసుకోవాలి లేదా వారు కోల్పోయిన సమయానికి సరైన పరిహారం ఇవ్వాల్సిందే అని తీర్పునిచ్చింది. అయితే అందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు లేబర్ చట్టం కిందకి రాకపోవచ్చు. ఒకసారి లాయర్ సలహా పొందండి. – శ్రీకాంత్ చింతలహైకోర్టు న్యాయవాది -
బీసీల గణనతోనే.. బీసీ కోటా సాధ్యం!
స్థానిక సంస్థల్లో వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలును రాజ్యాంగంలోని లోపాలను చూపిస్తూ కోర్టులు అడ్డుకుంటున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో రాష్ట్రంలో సమగ్ర కులగణన చేసి, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 42 శాతం అమలు చేస్తామని హామీ ఇచ్చింది. స్థానిక సంస్థల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు సాధ్యం కానప్పుడు, 42 శాతం అమలు సాధ్యం కాదనే విషయం వారికి తెలియక కాదు. ఓట్ల కోసం ఆ విధంగా వాగ్దానం చేశారు.కేంద్ర ప్రభుత్వం 1993/ 94లో స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు కనీస భాగస్వామ్యం కల్పించాలనే ముఖ్యోద్దేశంతో 73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్ 243ని చేర్చి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ప్రవేశ పెట్టింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు వారి జనాభా దామాషా పద్ధతిలో, మహిళలకు ఒకటిలో మూడో వంతును, వెనుకబడిన పౌరులకు (బీసీలకు) మాత్రం నిర్దిష్టమైన కోటాను నిర్ధారించకుండా వీటిని ప్రవేశ పెట్టారు. స్థానిక సంస్థల్లో బీసీ కోటా అమలుపై సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం 2010లో కె.కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన కేసులో బీసీ కోటా అమలు ట్రిపుల్ ట్రస్ట్ ద్వారా మాత్రమే చేయాలని ఆదేశించింది.అందులో (1) బీసీ కోటా అమలుకు ప్రత్యేకంగా బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలి. (2) అట్టి బీసీ కమిషన్ ద్వారా బీసీ లెక్కలు తీయాలి. (3) మొత్తం నిలువు రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా, అందులో ఎస్సీ, ఎస్టీ వారికి జనాభా దామాషా పద్ధతిలో పోగా మిగిలిన కోటాను బీసీలకు అమలు చెయ్యాలని ప్రభుత్వాలను ఆదేశించింది. సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం 2022లో మరో సంచలనా త్మకమైన తీర్పును వెలువరిస్తూ సురేష్ మహజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసులో దేశంలోని అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రభుత్వాలను ఆదేశిస్తూ, స్థానిక సంస్థల ఎన్ని కలను ప్రతి ఐదు సంవత్సరాలకు తూచా తప్పకుండా నిర్వహించాలనీ, బీసీ గణాంకాలు లేనట్లయితే బీసీ రిజ ర్వేషన్లు లేకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనీ ఆదేశించింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 1994 నుండి బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో అమలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు 2010లో స్థానిక సంస్థల బీసీ కోటాపై తీర్పు వెలువరించిన తర్వాత మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిలో భాగంగా బీసీ కోటాను 34 నుండి 24 శాతానికి తగ్గించాలని 2013 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వన్ని ఆదేశించింది. ఆ తీర్పుపై నాటి కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్టే తీసు కొని యధావిధిగా బీసీ రిజర్వేష న్లను 34 శాతం అమలు చేసింది. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2019లో స్థానిక సంస్థల్లో బీసీ కోటాను 34 నుండి 24 శాతానికి తగ్గించి ఎన్నికలు నిర్వహించింది.ఇప్పుడున్న పరిస్థితుల్లో బీసీ లెక్కలు లేకుండా ఎన్నిక లకు వెళ్ళినట్లయితే 24 శాతం రిజర్వేషన్లు కూడా దక్కే అవ కాశం లేదు. ఎవరైనా ఎన్నికల ప్రకటనను సవాల్ చేసినట్ల యితే, బీసీ గణాంకాలు శాస్త్రీయబద్ధంగా లెక్కించనందున బీసీ రిజర్వేషన్లు లేకుండానే ఎన్నికలు నిర్వహించుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక బీసీ కమిషన్ ద్వారా సాధారణ పరిపా లన శాఖ సమన్వయంతో కులగణన చేసి, ఇచ్చిన హామీ ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ కులాలకు 42 శాతం రిజర్వే షన్లను అమలు చేయాలి.– కోడెపాక కుమార స్వామి, వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులు, మొబైల్: 94909 59625 -
గ్రాట్యుటీ.. ఎవరికొస్తుంది.. ఎంతొస్తుంది?
ప్రైవేటు రంగంలో ప్రతి ఒక్కరికీ ఉద్యోగ భద్రత ఉంటుందని చెప్పలేం. అదే సమయంలో ఉద్యోగి తన వ్యక్తిగత, వృత్తిపరమైన అవసరాల దృష్ట్యా ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారిపోవడం సహజంగా చూస్తుంటాం. కారణాలు ఏవైనా కానీ ఉద్యోగం వీడితే వచ్చే ప్రయోజనాల గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి. ఉద్యోగం నుంచి వైదొలగినప్పుడు వచ్చే ప్రయోజనాల్లో గ్రాట్యుటీ కీలకమైనది. ఉద్యోగి పనిచేసిన కాలంపై ఇది ఆధారపడి ఉంటుంది. గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం 1972 ఇందుకు ప్రామాణికం. చట్టంలోని నిబంధనలపై అవగాహన కల్పించే కథనమే ఇది.గ్రాట్యుటీ అంటే..? ఉద్యోగి సేవలను గుర్తిస్తూ సంస్థ అందించే ఆర్థిక ప్రయోజనమే గ్యాట్యుటీ. ఎన్నో ఏళ్లుగా సంస్థ అభ్యున్నతి కోసం సేవలు అందించే ఉద్యోగుల పట్ల చూపించే కృతజ్ఞత. ఇది వేతనంలో భాగం కాదు. ప్రతి ఒక్కరూ దీనికి అర్హులే. కానీ, ఇందుకు అర్హత సాధించాలంటే గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం, 1972లో నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగి సేవలు ఉండాలి. కనీసం ఐదేళ్ల సర్వీస్ (పని చేసిన కాలం) పూర్తి చేసుకున్న వారికే దీన్ని పొందే అర్హత లభిస్తుంది. ఎన్నో రంగాలకు ఈ చట్టం అమలవుతోంది. ప్రభుత్వ విభాగాలు, డిఫెన్స్, స్థానిక సంస్థల ఉద్యోగులు, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు దీని పరిధిలోకి వస్తారు. ఎన్నేళ్లు పనిచేయాలి?గడిచిన ఏడాది కాలం పాటు కనీసం 10 మంది ఉద్యోగులు కలిగిన సంస్థలకు గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం వర్తిస్తుంది. ఆయా సంస్థలు తమ ఉద్యోగులకు నిబంధనలకు అనుగుణంగా గ్రాట్యుటీని అందించాల్సి ఉంటుంది. మైనింగ్ విధుల్లో ఉన్న ఉద్యోగులకు కనీసం 190 పని దినాలు, నాన్ మైనింగ్ విధుల్లోని వారికి 240 పనిదినాలు ఏడాది కింద పరిగణిస్తారు. కనీసం ఐదేళ్ల పాటు అంతరాయం లేకుండా సేవలు అందించిన ఉద్యోగులు అందరూ గ్రాట్యుటీకి అర్హులు. సమ్మెలు, లాకౌట్లు, ప్రమాదాలు, సెలవులు, తాత్కాలిక తొలగింపు వల్ల గైర్హాజరుకు మినహాయింపులు ఉంటాయి. ఐదేళ్ల సర్వీస్ పూర్తి కాకముందే సంస్థ తొలగించిన సందర్భంలోనూ ఉద్యోగికి గ్రాట్యుటీ చెల్లించాల్సిందే. వారంలో ఆరు పనిదినాలు అమలు చేసే కంపెనీల్లో 4 ఏళ్ల 240 రోజులు పనిచేసినా గ్రాట్యుటీకి అర్హత లభిస్తుంది. వారంలో ఐదు రోజుల పనిదినాలున్న కంపెనీల్లోని వారు 4 ఏళ్ల 190 రోజులు పనిచేస్తే అర్హులు. కొన్ని రంగాల్లోని వారికి ఈ కనీస పదవీ కాలం భిన్నంగా ఉంటుంది. న్యూస్ పేపర్ ఎంప్లాయీస్ అండ్ మిస్లేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ కింద పనిచేసే వర్కింగ్ జరల్నిస్టులకు పదేళ్ల సర్వీస్ ఉంటేనే గ్రాట్యుటీకి అర్హత లభిస్తుంది. ఉద్యోగి మరణించినా లేదా వైకల్యం కారణంగా విధుల నుంచి తొలగించినప్పుడు పనిచేసిన కాలంతో సంబంధం లేకుండా గ్రాట్యుటీ చెల్లించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. గ్రాట్యుటీ అనేది కేవలం పదవీ విరమణ వయసుకు వచ్చినప్పుడే కాకుండా.. స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నప్పుడు, ఉద్యోగి తప్పిదం లేకుండా తొలగించినప్పుడు, రాజీనామా చేసినప్పుడు ఇవ్వాల్సి ఉంటుందని లెక్స్లెవర్ సర్వీసెస్ డైరెక్టర్ హర్షిత అగర్వాల్ శర్మ తెలిపారు.పరిమితి గ్రాట్యుటీ గరిష్ట పరిమితి రూ.20 లక్షలు. నిబంధనల ప్రకారం సంస్థలు గరిష్టంగా ఇంతకు మించి ఇవ్వక్కర్లేదు. రూ.20లక్షలు మించితే అది ఎక్స్‌గ్రేషియా కిందకు వస్తుంది. ఎక్స్‌గ్రేషియా ఎంత ఇవ్వాలన్నది సంస్థల అభీష్టమే. ఇంత మేర ఇవ్వాలని నిబంధనలు చెప్పడం లేదు. గ్రాట్యుటీ లెక్కింపు చివరి నెల వేతనంలో మూల వేతనం, డీఏ ఎంతో తెలుసుకోవాలి. ఇలా ఒక ఏడాదికి 15 రోజుల వేతనం గ్రాట్యుటీ కింద వస్తుంది. మొత్తం పనిచేసిన సంవత్సరాలు ఇంటూ 15 రోజులు ఇంటూ చివరిగా అందుకున్న మూల వేతనం, డీఏ డివైడ్ 26(నెలలో పనిచేసిన రోజులు) సూత్రం అమలవుతుంది. ఆరు నెలలు దాటిన కాలాన్ని పూర్తి ఏడాదిగా పరిగణిస్తారు. ఉదాహరణకు ఎక్స్ అనే వ్యక్తి 12 సంవత్సరాల పాటు ఒక కంపెనీలో పనిచేసినట్టు అనుకుందాం. చివరిగా అందుకున్న మూల వేతనం, డీఏ కలిపి రూ.75,000. దీంతో ఎక్స్‌కు వచ్చే మొత్తం గ్రాట్యుటీ రూ.5,19,230. గ్రాట్యుటీ చట్టం పరిధిలోకి రాని వారికి ఇచ్చే గ్రాట్యుటీ ఫార్ములా కొంత భిన్నం. ఏడాదిలో 15 రోజులు ఇంటూ చివరి నెలలో మూల వేతనం, డీఏ ఇంటూ పనిచేసిన సంవత్సరాలు డివైడ్ 30(నెలలో పనిచేసిన రోజులు). పూర్తి ఏడాది పాటు పనిచేసిన కాలాన్నే వీరికి ఏడాది కింద పరిగణిస్తారు. దీని ప్రకారం ఎక్స్ అనే వ్యక్తి ఒక సంస్థలో 12 ఏళ్లు పనిచేసి, చివరి నెలలో మూలవేతనం, డీఏ కింద రూ.75,000 తీసుకున్నారని అనుకుంటే.. వచ్చే గ్రాట్యుటీ రూ.4,50,000. ఆలస్యం అయితే విధుల నుంచి వైదొలగిన 30 రోజుల్లోపు గ్రాట్యుటీ చెల్లించాలి. ఇంతకుమించి జాప్యం చేస్తే ఆ మొత్తంపై వడ్డీ కూడా చెల్లించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఉద్యోగికి గ్రాట్యుటీ ప్రయోజనం అన్నది పనిచేసిన కాలం ఆధారంగానే అర్హత ఉండాలి కానీ, రిటైర్మెంట్ వయసు ఆధారం కాకూడదని ఇటీవలే అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. ‘‘60 ఏళ్లకు రిటైర్మెంట్ తీసుకుంటేనే గ్రాట్యుటీ, లేకపోతే అర్హత లేదన్నది సరైనది కాదు. ఒక ఉద్యోగి ఎన్ని సంవత్సరాల పాటు పనిచేశాడన్న దాని ఆధారంగా గ్రాట్యుటీ హక్కు లభిస్తుంది’’అని అలహాబాద్ సింగిల్ జడ్జి ధర్మాసనం ఓ కేసులో భాగంగా తీర్పు జారీ చేసింది.పన్ను బాధ్యత గ్రాట్యుటీపై పన్ను విషయంలో ప్రభుత్వ లేదా ప్రైవేటు రంగ ఉద్యోగులకు నిబంధనల్లో వ్యత్యాసం ఉంది. ప్రభుత్వ ఉద్యోగి ఎవరికైనా (కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థల) సరే గ్రాట్యుటీ ఎంత అందుకున్నా పన్ను లేదు. ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న వారికి రూ.20 లక్షలు లేదా, చివరి 15 రోజుల వేతనాన్ని పనిచేసిన సంతవ్సరాలతో హెచ్చించినప్పుడు వచ్చే మొత్తం, వాస్తవంగా అందుకున్న గ్రాట్యుటీ.. వీటిల్లో ఏది తక్కువ అయితే ఆ మొత్తానికి పన్ను మినహాయింపు ఉంటుంది. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 10(10) కిందకు గ్రాట్యుటీ వస్తుంది. గతంలో రూ.10 లక్షల వరకు గ్రాట్యుటీపై పన్ను ఉండేది కాదు. ఈ పరిమితిని మోదీ సర్కారు రూ.20 లక్షలకు పెంచింది.ఇవి తెలుసుకోవాలి.. » పనిచేసిన కాలం ఆరు నెలలు దాటి ఒక్క రోజు ఉన్నా దాన్ని పూర్తి సంవత్సరం కింద గ్రాట్యుటీ చెల్లింపులకు పరిగణనలోకి తీసుకుంటారు. » ఉద్యోగి దుష్ప్రవర్తన కారణంగా సంస్థ తొలగించినప్పుడు గ్రాట్యుటీ ఇవ్వక్కర్లేదు. » ఉద్యోగి మరణించిన సందర్భాల్లో నామినీ లేదా వారసులకు గ్రాట్యుటీ చెల్లిస్తారు. » సంస్థలు దివాలా తీసినప్పటికీ గ్రాట్యుటీ చెల్లించాల్సిన బాధ్యత వాటిపై ఉంటుంది. » నోటీస్ పీరియడ్ కూడా గ్రాట్యుటీ లెక్కింపు పరిధిలోకి వస్తుంది. » మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకుంటే గ్రాట్యుటీకి అర్హత కల్పించాలన్న డిమాండ్ కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉంది. -
లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఎలా లెక్కించాలో తెలుసా?
ముందుగా అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వారం దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్‌ని ఎలా లెక్కించాలో ఉదాహరణతో తెలుసుకుందాం. స్థిరాస్తులను రెండు రకాలుగా విభజించవచ్చు. 1) 2001 ఏప్రిల్ 1కి ముందు కొన్నవి 2) 2001 ఏప్రిల్ 1 తర్వాత కొన్నవి మొదటిగా 2001 ఏప్రిల్ 1కి ముందు కొన్నవాటికి 01–04–2001ని కటాఫ్ తేదీగా నిర్ధారించారు. ఈ తేదీకి ముందు కొన్న ఆస్తి విషయంలో మీరు కొన్న ధరని పరిగణించరు. ఆ స్థిరాస్తి విలువ 2001 ఏప్రిల్ 1న ఎంతో నిర్ధారించాలి. అయితే, ఇక్కడ ‘‘ఫెయిర్ మార్కెట్ విలువ’’ అన్న పదం వాడారు. దీని అర్ధం మీరు అమ్ముకునే విలువ కాదు. 2001 ఏప్రిల్ 1న డిపార్టుమెంటు వారు.. అంటే రాష్ట్ర ప్రభుత్వం వారు .. ఎంత విలువ మీద ‘‘స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు’’ వసూలు చేస్తారో అంత మొత్తాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఈ పాయింట్లో నిర్ధారించే విలువ.. కొన్న ధర. ఈ రెండింటిలో ఏది తక్కువగా ఉంటుందో అదే తీసుకుంటారు. ఉదాహరణకు, 11–01–1980న మీరొక ఇల్లు కొన్నారనుకుందాం. ఆ రోజున ఆ ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించారు. ధర రూ. 30,00,000. ఈ మొత్తం మీద స్టాంపు డ్యూటీ చెల్లించారు. ఆ ఇంటిని ఈ ఆర్థిక సంవత్సరంలో (2023–24) రెండు కోట్ల రూపాయలకు అమ్ముతున్నారనుకుందాం. 2001 ఏప్రిల్ 1న మీ ఇంటి మార్కెట్ విలువ .. అంటే మీరు అమ్ముకోగల విలువ రూ. 80,00,000 అనుకుందాం. కానీ, రాష్ట్ర ప్రభుత్వపు సబ్ రిజిస్ట్రార్ వారు రూ. 50,00,000కు ధృవీకరణ పత్రం ఇచ్చారు. కచ్చితంగా సర్టిఫికెట్ తీసుకోవాలి. ఎందుకంటే అందులో ఉన్న వేల్యుయేషన్నే పరిగణిస్తారు కాబట్టి రూ. 50,00,000 విలువనే తీసుకుంటారు. దీన్ని 2001 ఏప్రిల్ 1న 100గా పరిగణించి, ఇన్‌కం ట్యాక్స్ వారు జారీ చేసిన పట్టిక .. కాస్ట్ ఆఫ్ ఇండెక్స్. ఇఐఐ అంటారు. ఇది పెద్ద పట్టిక. స్థలాభావం వల్ల ఇక్కడ పొందుపర్చడంలేదు. వెబ్సైట్లోనూ,పుస్తకాల్లోనూ, గూగుల్లోనూ దొరుకుతుంది. 2023–24వ ఆర్థిక సంవత్సరానికి దీని విలువ 348. అంటే 2001 ఏప్రిల్ 1న వంద రూపాయలుగా ఉంటే ఇప్పుడు 348గా పరిగణిస్తారు. 2001 ఏప్రిల్ 1 నాటి ధృవీకరణ విలువను ఈ మేరకు పెంచుతారు. ఇలా చేయడాన్ని కాస్ట్ ఆఫ్ ఇండెక్సింగ్ అని అంటారు. దీని ప్రకారం మీరు కేవలం రూ. 30,00,000కు కొన్నప్పటికీ ఆనాటి రూ. 50,00,000ను పరిగణనలోకి తీసుకుంటే 50,00,000/100 x 348 = రూ. 1,74,00,000గా .. అంటే కోటి డెబ్భై నాలుగు లక్షలుగా పరిగణిస్తారు. ఇప్పుడు క్యాపిటల్ గెయిన్స్‌ని లెక్కించండి. అమ్మిన ధర 2 రూ. కోట్లలో ఇండెక్స్డ్ కాస్ట్ 1.7 రూ. కోట్లలో లాభం 0.26 రూ. కోట్లలో ఏతావాతా లాభం .. క్యాపిటల్ గెయిన్స్ కేవలం రూ. 26 లక్షలే. ఈ మొత్తమే పన్ను భారానికి గురి అవుతుంది. దీన్ని ట్యాక్స్ ప్లానింగ్ ద్వారా లేకుండా చేసుకోవచ్చు. లేదా పన్ను చెల్లించి మిగిలిన మొత్తాన్ని మీ ఇష్టం వచ్చిన విధంగా వాడుకోవచ్చు. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ-మెయిల్ పంపించగలరు. -
జూన్ 3 వరకు బీసీ ఓటర్ల గణన!
సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో కీలకమైన బీసీ ఓటర్ల గణన ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది. ఈ నెల 18న మొదలైన ఈ ప్రక్రియ జూన్ 3 వరకు జరిగే అవకాశముంది. అనంతరం గ్రామపంచాయతీల రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. బీసీ ఓటర్ల గణాంకాల ఆధారంగా అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. బీసీ ఓటర్ల గణన, రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియలు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. గ్రామపంచాయతీల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేసిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. అనంతరం ప్రభుత్వం ఈ జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేస్తుంది. రిజర్వేషన్ల జాబితా అందిన తర్వాత ఎన్నికల సంఘం గ్రామపంచాయతీల ఎన్నికల పోలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేస్తుంది. ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని రకాలుగా సిద్ధమైంది. నమూనా షెడ్యూల్‌ను నిర్ణయించి ఈ మేరకు ఇతర శాఖలను సిద్ధం చేస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం రూపొందించిన నమూనా షెడ్యూల్ ఒకటి సోమవారం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది. ఇది కేవలం నమూనా కోసం తయారు చేసింది మాత్రమేనని.. అసలైన షెడ్యూల్ ఖరారు కాలేదని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. -
ప్రతి పులికీ ఓ లెక్కుంది!
నల్లమల నుంచి ‘సాక్షి’ప్రత్యేక ప్రతినిధి అప్పుడే తెలతెలవారుతోంది.. దట్టమైన అడవి.. నింగిని తాకుతున్నాయా అన్నట్టుగా ఎల్తైన చెట్లు.. భానుడి లేలేత కిరణాలతో చిగురుటాకులపై మెరిసిపోతున్న మంచు బిందువులు.. ఆకాశంలో రివ్వురివ్వున పక్షులు.. ఎటు చూసినా ప్రకృతి సోయగాలు.. ఆహ్లాదకర వాతావరణం.. ఇంతలో గుండెలు అదిరిపడేట్టుగా.. ‘సార్.. పులి అడుగు జాడ. అడుగు ముందుకు వేయకండి..’ ఎఫ్ఆర్వో శ్రీదేవి హెచ్చరిక! వెంటనే ఆమె తన భుజాన ఉన్న కిట్‌బ్యాగ్‌ను తీశారు. మార్కర్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో పులి అడుగును సేకరించే పనిలో పడిపోయారు. అది సేకరించిన తర్వాత ఇంకా దట్టమైన అడవిలోకి బృందం ప్రయాణం సాగింది. పులుల గణన తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ‘సాక్షి’ మన్ననూర్ ఎఫ్ఆర్వో శ్రీదేవి టీంతో కలసి ఇటీవల నల్లమల అటవీప్రాంతంలో పర్యటించింది. ఈ ప్రయాణ విశేషాలు, పులుల పాదముద్రలను సేకరించే విధానంపై ఆసక్తికర అంశాలు.. పాద ముద్రలు సేకరిస్తారిలా.. మన్ననూర్ వెస్ట్ బీట్‌లోని ట్రయల్ పాత్‌పై బృందం ప్రయాణం సాగింది. ఉదయం 7 గంటలకల్లా అటవీ ప్రాంతంలోని గుండం చేరుకున్నాం. జంతువుల దాహార్తిని తీర్చుతున్న సహజమైన జల స్థావరం ఇది. దీని ఒడ్డునే పులి పాద ముద్రలు కనిపించాయి. స్పష్టంగా కనిపించే పాదాలను సేకరించేందుకు ఒక పద్ధతి, అస్పష్ట పాదముద్రలు సేకరించడానికి మరో పద్ధతి ఉంటుంది. నీటి చెమ్మ ఉండటంతో పులి అడుగు బలంగా పడింది. వెంటనే బృందంలో ఓ సభ్యుడు పరిసరాలను శుభ్రం చేశాడు. మరో సభ్యురాలు పచ్చి వెదురు కొమ్మను విరుచుకొచ్చి చుట్టలా మార్చి పాద ముద్రల చుట్టూ ఉంచింది. తర్వాత వెంట తెచ్చుకున్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పౌడర్‌ను చిన్న బకెట్లో నీళ్లతో కలిపి పాద ముద్రలపై పోశారు. 10 నిమిషాల తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పాదముద్రల అచ్చులతో గట్టిపడింది. దాన్ని తీసి భద్రపరిచారు. ఇలాంటి పాద ముద్రల నమూనాలు రిజర్వ్ ఫారెస్టు పరిధిలో 230 వరకు సేకరించినట్లు అధికారులు తెలిపారు. ఈ పాదముద్రల చిత్రాలను ఆన్లైన్లో వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు పంపుతామని, అక్కడి నిపుణులు వాటిని విశ్లేషించి అవి ఎన్ని పులుల పాదముద్రలో అంచనా వేస్తారని అమ్రాబాద్ రేంజర్ ప్రభాకర్ తెలిపారు. గుండం వద్ద చిరుత పులుల పాదముద్రలు కూడా చాలానే కన్పించాయి. వామికొండ వైపు వెళ్తుండగా దారి మధ్యలో.. మూషిక జింకలు కనిపించాయి. ఇవి ప్రస్తుతం అంతర్ధాన దశలో ఉన్నాయి. వామికొండ అటవీ ప్రాంతంలో కూడా పులి పాదముద్రలు కన్పించాయి. పులి దారి.. రహదారి! పులులు, చిరుత పులులు ఎలుగుబంటి తదితర జంతువుల పాదముద్రలను గుర్తించేందుకు ముందుగా... అవి ఎక్కువగా నడిచే అవకాశం ఉన్న ప్రాంతం మీదుగా ఒక దారిని రూపొందిస్తారు. ఈ దారినే ‘ట్రయల్ పాత్’అని పిలుస్తారు. ఇది 5 మీటర్ల వెడల్పుతో సుమారు 5 కి.మీ. పొడవు ఉంటుంది. పులిది ఎప్పుడూ రాజ మార్గమే. పొదలు, పుట్టల మాటున దాక్కొని నడవడం దానికి ఇష్టం ఉండదు. చదునుగా విస్తరించిన బాటపైనే నడుస్తుంది. ఈ ట్రయల్ పాత్‌పైనే చాలా అటవీ జంతువుల పాదముద్రలు, వాటి విసర్జితాలు(పెంటికలు) కనిపిస్తాయి. అధికారులు కేవలం పులి, చిరుత పాదముద్రలు, పెంటిక నమూనాలు మాత్రమే సేకరించారు. మిగిలిన జంతువుల గుర్తులను నమోదు చేసుకున్నారు. తెలంగాణ పరిధిలోకి వచ్చే రాజీవ్ రిజర్వ్ టైగర్ ఫారెస్టులో మొత్తం 642 ట్రయల్ పాత్‌లు ఏర్పాటు చేశారు. శాకాహార జంతువులకు ‘ట్రాన్సాక్ట్’ శాకాహార జంతువులను లెక్కించేందుకు మరో పద్ధతి ఉంటుంది. ఇందుకు ఏర్పాటు చేసే మార్గాన్ని ‘ట్రాన్సాక్ట్’అని పిలుస్తారు. 2 కి.మీ. పొడవు, 2 మీటర్ల వెడల్పుతో దీన్ని రూపొందించారు. ప్రతి బీట్‌కు ఒకటి చొప్పున నల్లమలలో మొత్తం 213 ట్రాన్సాక్ట్లు ఏర్పాటు చేశారు. ట్రాన్సాక్ట్కు ప్రతి 400 మీటర్లకు ఒక మార్కు చొప్పున విభజన చేశారు. ప్రతి మార్కు పరిధిలో సాధారణ మొక్కలు, ఔషధ మొక్కలు, చెట్లు, పొదలను లెక్క గట్టారు. -
కుటుంబ పాలన లెక్క చెప్పండి
రాహుల్‌కు అమిత్‌షా సూటి ప్రశ్న రాంచీ: నెహ్రూ–గాంధీ కుటుంబ పాలనా పనితీరుకు సంబంధించిన లెక్క చెప్పాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ప్రశ్నించారు. ‘రాహుల్ అమెరికాలో చాలా మాట్లాడుతున్నారు. మరి దేశంలో 50 ఏళ్లకు పైగా సాగిన వారి కుటుంబ పాలన లెక్కలను ఆయన ముందుగా చెప్పాలి’ అని అమిత్ అన్నారు. జార్ఖండ్‌లో అవినీతి రహిత పాలన అందిస్తున్న సీఎం రఘువర్ దాస్‌ను షా అభినందించారు. అలాగే, దేశాన్ని తన సరిహద్దుల్లోపు అభివృద్ధిచేసుకునే సార్వభౌమాధికార హక్కు భారత్‌కు ఉందని షా అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో జపాన్ పెట్టుబడుల ప్రతిపాదనల పట్ల చైనా అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని తప్పుపట్టారు.