కుటుంబ పాలన లెక్క చెప్పండి | Amit Shah seeks account of performance from Rahul Gandhi | Sakshi
Sakshi News home page

కుటుంబ పాలన లెక్క చెప్పండి

Published Sun, Sep 17 2017 2:59 AM | Last Updated on Tue, Sep 19 2017 4:39 PM

కుటుంబ పాలన లెక్క చెప్పండి

కుటుంబ పాలన లెక్క చెప్పండి

రాహుల్‌కు అమిత్‌షా సూటి ప్రశ్న

రాంచీ:  నెహ్రూ–గాంధీ కుటుంబ పాలనా పనితీరుకు సంబంధించిన లెక్క చెప్పాలని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా ప్రశ్నించారు. ‘రాహుల్‌ అమెరికాలో చాలా మాట్లాడుతున్నారు. మరి దేశంలో 50 ఏళ్లకు పైగా సాగిన వారి కుటుంబ పాలన లెక్కలను ఆయన ముందుగా చెప్పాలి’ అని అమిత్‌ అన్నారు.

జార్ఖండ్‌లో అవినీతి రహిత పాలన అందిస్తున్న సీఎం రఘువర్‌ దాస్‌ను షా అభినందించారు. అలాగే, దేశాన్ని తన సరిహద్దుల్లోపు అభివృద్ధిచేసుకునే సార్వభౌమాధికార హక్కు భారత్‌కు ఉందని షా అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో జపాన్‌ పెట్టుబడుల ప్రతిపాదనల పట్ల చైనా అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని తప్పుపట్టారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement