Family rule
-
Madhya Pradesh Election 2023: బరిలో డిగ్గీ సొంత సైన్యం!
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయాలపై తన పట్టును మాజీ రాజ కుటుంబీకుడు దిగ్విజయ్ సింగ్ మరోసారి నిరూపించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుమారుడు, తమ్ముడు, అల్లుళ్లు... ఇలా ఏకంగా నలుగురికి టికెట్లు దక్కడం విశేషం! దీన్ని కాంగ్రెస్ వ్యక్తి పూజకు, కుటుంబ పాలనకు మరో నిదర్శనంగా ఎప్పట్లాగే బీజేపీ ఎద్దేవా చేస్తుండగా సమర్థులకే అవకాశాలిస్తున్నామంటూ కాంగ్రెస్ సమర్థించుకుంటోంది... న్యూఢిల్లీ: విపక్ష ‘ఇండియా’ కూటమిలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు చిచ్చు పెట్టే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తమను పట్టించుకోకుండా ఏకపక్షంగా 144 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేయడం పట్ల సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయిలో కలిసి పని చేసే పరిస్థితి లేనప్పుడు రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో చేతులు కలిపే అంశాన్ని పునఃపరిశీలించాల్సి ఉంటుందని ఆయన తేల్చిచెప్పారు. తమతో వారి (కాంగ్రెస్) ప్రవర్తన లాగే వారితో తమ ప్రవర్తన ఉంటుందని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలను మోసగిస్తోందని విమర్శించారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పోటీ చేస్తున్న స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. 18 స్థానాల్లో ఈ రెండు పార్టీలు పరస్పరం బలంగా పోటీ పడుతున్నాయి. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి అధికార బీజేపీ లాభపడుతుందని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల నాయకులు ఆందోళన చెందుతున్నారు. మధ్యప్రదేశ్‌లో తమకు తగిన బలం ఉందని, గతంలో రెండో స్థానంలో నిలిచామని అఖిలేష్ యాదవ్ గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా ఆరు స్థానాలు ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని, చివరకు మొండిచెయ్యి చూపిందని ఆరోపించారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ ఇటీవల విడు దల చేసిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయా లపై తన పట్టును మా జీ రాజ కుటుంబీకుడు దిగ్వి జయ్సింగ్ మరో సారి నిరూపించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుమారుడు, తమ్ముడు, అల్లుళ్లు... ఇలా ఏకంగా నలుగురికి టికెట్లు దక్కడం విశేషం! దీన్ని కాంగ్రెస్ వ్యక్తి పూజకు, కుటుంబ పాలనకు మరో నిదర్శనంగా ఎప్పట్లాగే బీజేపీ ఎద్దేవా చేస్తుండగా సమర్థులకే అవకాశాలిస్తున్నామంటూ కాంగ్రెస్ సమర్థించుకుంటోంది...తొలి జాబితా చాలా కారణాలతో వార్తల్లో నిలిచింది. అయితే అందరినీ ఆకర్షించింది మాత్రం పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కుటుంబంలో ఏకంగా నలుగురికి టికెట్లు దక్కడం! వివాదాస్పదుడైన సోదరుడు లక్ష్మణ్‌సింగ్‌తో పాటు కుమారుడు జైవర్ధన్, అల్లుడు ప్రియవ్రత్, అదే వరుసయ్యే అజయ్‌సింగ్ రాహుల్ పేర్లకు జాబితాలో చోటు దక్కింది. అజయ్‌సింగ్ రాహుల్ 68 ఏళ్లు. దిగ్విజయ్‌కి వరసకు కోడలి భర్త. రక్త సంబంధీకుడు కాకున్నా డిగ్గీకి అత్యంత విశ్వాసపాత్రుడు. ఐదుసార్లు ఎమ్మెల్యే. వింధ్య ప్రాంతంలో గట్టి పట్టున్న నాయకుడు. ముఖ్యంగా సిద్ధి జిల్లాపై పలు దశాబ్దాలుగా రాజకీయ పెత్తనం ఆయన కుటుంబానిదే. ‘మధ్యప్రదేశ్ ప్రజలకు కాంగ్రెస్ ఇవ్వగలిగింది కేవలం కుటుంబ పాలన మాత్రమేనని దిగ్విజయ్ ఉదంతం మరోసారి నిరూపించింది. ఇది కాంగ్రెస్ రక్తంలోనే ఉంది. నా కుమారుడు ఆకాశ్ తనకు టికెటివ్వొద్దని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు స్వయంగా విజ్ఞప్తి చేశారు. ఇవీ మా పార్టీ పాటించే విలువలు!’ – బీజేపీ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్‌లో పార్టీ సీనియర్ నేత. లక్ష్మణ్‌సింగ్ 68 ఏళ్లు. దిగ్విజయ్ తమ్ముడు. మూడుసార్లు ఎమ్మెల్యేగా చేశారు. 1990లో రాజకీయాల్లోకి వచ్చారు. వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. సొంత పార్టీనీ వదలకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు! 2004లో బీజేపీలో చేరి రాజ్‌గఢ్ నుంచి అసెంబ్లీకి గెలిచారు. 2010లో నాటి బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీని విమర్శించి బహిష్కారానికి గురయ్యారు. 2018లో రాష్ట్ర రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి కాంగ్రెస్ నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా నెగ్గారు. ప్రియవ్రత్‌సింగ్ 45 ఏళ్లు. దిగ్విజయ్ మేనల్లుడు. కిల్చీపూర్ సంస్థాన వారసుడు. ఆ స్థానం నుంచే 2003లో అసెంబ్లీకి వెళ్లారు. అభివృద్ధి పనులతో ఆకట్టుకుని 2008లో మళ్లీ నెగ్గారు. 2013లో ఓడినా 2018లో మంచి మెజారిటీతో గెలిచారు. కమల్‌నాథ్ మంత్రివర్గంలో ఇంధన శాఖ దక్కించుకున్నారు. జైవర్ధన్‌సింగ్ 37 ఏళ్లు. దిగ్విజయ్ కుమారుడు. గ్వాలియర్– చంబల్ ప్రాంతంలో సింధియాల కంచుకోట లను చేజిక్కించుకోవడంపై ఈసారి దృష్టి సారించారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారి కేంద్ర మంత్రి పదవి పొందిన జ్యోతిరాదిత్య సింధియా అనుయాయుల్లో పలువురిని ఇటీవల కాంగ్రెస్ గూటికి చేర్చారు. డూన్ స్కూల్లో చదివిన ఆయన కొలంబియా వర్సిటీలో మాస్టర్స్ చేశారు. 2013లో రాజకీయాల్లో అడుగు పెట్టారు. తమ మాజీ సంస్థానమైన రాఘవ్‌గఢ్ అసెంబ్లీ స్థానం నుంచి 59 వేల పైచిలుకు మెజారిటీతో నెగ్గారు. 2018లో దాన్ని 64 వేలకు పెంచుకోవడమే గాక కమల్ నాథ్ మంత్రివర్గంలో చోటు కూడా దక్కించు కున్నారు. -
Karnataka assembly elections 2023: అవును, శివుని కంఠంలో సర్పాన్నే!
కోలారు: కాంగ్రెస్, జేడీ(ఎస్) కుటుంబ పాలనే కర్ణాటకలో రాజకీయ అస్థిరతకు కారణమంటూ ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. అవి అవినీతిని పెంచి పోషించాయని, అస్థిరతను అవకాశంగా తీసుకుని రాష్ట్రాన్ని ఏటీఎంలా మార్చాయని మండిపడ్డారు. లూటీపైనే తప్ప అభివృద్ధిపై దృష్టి పెట్టలేదన్నారు. ‘కాంగ్రెస్, జేడీ(ఎస్) నేతలు కర్ణాటకలో ప్రత్యర్థులుగా నటిస్తారు. ఢిల్లీలో మాత్రం కలిసే ఉంటారు. పార్లమెంటులో పరస్పరం సహాయం చేసుకుంటారు’’ అన్నారు. మోదీ ఆదివారం రామనగర జిల్లాలో జేడీ(ఎస్) కంచుకోట అయిన చెన్నపట్నలో బహిరంగసభలో ప్రసంగించారు. ‘‘జేడీ(ఎస్)కు పడే ప్రతి ఓటూ కాంగ్రెస్‌కు లబ్ధి చేకూర్చి రాష్ట్రాన్ని అస్థిరపరుస్తుంది. ఇక కాంగ్రెస్‌ది 85 శాతం కమిషన్ సర్కారు. ద్రోహానికి మరోపేరు. 2008లో తప్పుడు రుణమాఫీ తెచ్చింది. కాంగ్రెస్ నేతల సంబంధీకుల, అవినీతిపరుల రుణాలే మాఫీ అయ్యాయి. ఇదీ కాంగ్రెస్ ట్రాక్ రికార్డు’’ అంటూ దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనను విషసర్పంతో పోల్చినందుకు తనకేమీ బాధ లేదని మోదీ అన్నారు. ‘‘పాము శివుని మెడలో హారం. అవును. నేను ప్రజల మెడలో పామునే. వారిని రక్షిస్తూ ఉంటా’’ అన్నారు. -
తెలంగాణ ప్రజలు విముక్తిని కోరుకుంటున్నారు: తరుణ్ చుగ్
సాక్షి, న్యూఢిల్లీ: కేసీఆర్ కుటుంబ పాలన, అహంకారం, అవినీతి, దోపిడీతో తెలంగాణ ప్రజలు చాలా బాధపడుతున్నారని, కేసీఆర్ పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్ అన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ చరిత్రలో కలిసిపోతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తెలంగాణలో అధికార సాధనే లక్ష్యంగా బీజేపీ పోరాడుతోందని, చాలావేగంగా దూసుకుపోవడమే కాకుండా క్షేత్రస్థాయిలో పార్టీ బలం రోజురోజుకూ పెరుగుతోందని అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎనిమిదేళ్లుగా కేసీఆర్ కుటుంబపాలనతో ప్రజలు కేవలం బాధపడటమే కాకుండా తీవ్రంగా ద్వేషిస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్గా టీఆర్ఎస్ మారినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదని పేర్కొన్నారు. చదవండి: మరో గుడ్‌న్యూస్.. త్వరలోనే జేఎల్ఎం పోస్టుల భర్తీ -
లంకలో నిరసనలకు తెర
కొలంబో: శ్రీలంకలో చరిత్రలోనే అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభానికి కారకులైన రాజపక్స కుటుంబ పాలనపై ఆగ్రహంతో వెల్లువెత్తిన దేశవ్యాప్త నిరసనలు ఎట్టకేలకు సద్దుమణిగాయి. రాజధానితో పాటు పలుచోట్ల ఏర్పాటైన నిరసన శిబిరాలను ఆందోళనకారులు మంగళవారం నాటికి పూర్తిగా ఖాళీ చేసి వెళ్లిపోయారు. దాంతో 123 రోజుల ఆందోళనలకు తాత్కాలికంగా తెర పడ్డట్టయింది. మరోవైపు, నిరసనకారుల ప్రధాన డిమాండ్లలో ఒకటైన అధ్యక్షుని అధికారాలకు కత్తెర వేసే రాజ్యాంగ సవరణ బిల్లును ప్రభుత్వం బుధశారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఇది ఆమోదం పొందితే స్వతంత్ర ఎన్నికల సంఘం సభ్యులు, అవినీతి విచారణ అధికారులు, పోలీస్ తదితర ఉన్నతోద్యోగుల నియామకాధికారం అధ్యక్షుడి నుంచి రాజ్యాంగ మండలికి దఖలు పడుతుంది. -
కుటుంబ పాలనలో తెలంగాణ బందీ: ప్రధాని మోదీ
సాక్షి, హైదరాబాద్:తెలంగాణ అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తామని, యువతతో కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్ కోసమే బీజేపీ పోరాటం చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ సాధిస్తున్న వరుస విజయాలు, సాగిస్తున్న పోరాటాలు చూస్తుంటే.. తెలంగాణలో పార్టీకి ప్రజల మద్దతు పెరిగిందని, బీజేపీని తప్పక గెలిపించాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోందని అన్నారు. దశాబ్దాల తరబడి సాగిన తెలంగాణ ఉద్యమంలో వేలాదిమంది అమరులయ్యారని, కానీ అమరుల ఆశయాలు తెలంగాణలో నెరవేరటం లేదని విమర్శించారు. ఒక కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయ్యిందని, నిరంకుశ తెలంగాణలో ఎవరి ఆశయాలు నెరవేరటం లేదని ధ్వజమెత్తారు. కేవలం ఒక కుటుంబం కోసమే తెలంగాణ ఏర్పాటు జరగలేదని వ్యాఖ్యానించారు. కుటుంబ పార్టీల పాలనను ఊడబెరికి, ఈ పాలనకు అంతం పలికే పోరాటాన్ని తెలంగాణ సోదర, సోదరీమణులు, ప్రజలు ముందుకు తీసుకెళతారని భావిస్తున్నానన్నారు. గురువారం ఐఎస్బీ వార్షికోత్సవంలో పాల్గొనడానికి వచ్చిన ప్రధాని మోదీ.. బేగంపేట విమానాశ్రయం వద్ద రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. తన ప్రసంగంలో ఎక్కడా సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం పేర్లు ఎత్తకుండానే కుటుంబ పాలన, కుటుంబ పార్టీలు అంటూ పదేపదే వ్యాఖ్యానించారు. పలు అంశాలపై మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. కుటుంబ పాలకులే దేశద్రోహులు.. కుటుంబ పాలన చేసేవారే దేశ ద్రోహులు. ఇలాంటి పాలన దేశ ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం. దేశంలో కుటుంబ పాలన ముగిసిన రాష్ట్రాల్లోనే అభివృద్ధి జరుగుతోంది. తెలంగాణ మాత్రం ఒక కుటుంబం చేతుల్లో దోపిడీకి గురవుతోంది. తెలంగాణలో కుటుంబ పాలన అంతా అవినీతి మయం. కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలగాలి. 2023లో విముక్తి కలుగుతుందనే నమ్మకం నాకుంది. తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. తెలంగాణ అభివృద్ధి కోసం ఎంతటి పోరాటమైనా చేస్తాం. ఇక్కడ సామ, దాన, భేద, దండోపాయాలు ఉపయోగించి తెలంగాణను తమ చెప్పు చేతల్లో ఉంచుకునే కుట్రకు కుటుంబ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఏమి చేసినా ప్రజల హృదయాల నుంచి మాపై ప్రేమాభిమానాలను, మా పేరును మీరు తుడిచి వేయలేరు. రాష్ట్రాన్ని సాంకేతికంగా అభివృద్ధి చేయాలి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాల సాధనను సంకల్పంగా తీసుకుని మనమంతా ముందుకు సాగాలి. తెలంగాణలో సంతుష్టీకరణ రాజకీయాలు సాగుతున్నాయి. దానికి భిన్నంగా ఈ రాష్ట్రాన్ని సాంకేతికంగా అభివృద్ధి చేయాల్సి ఉంది. తెలంగాణను పురోభివృద్ధి విషయంలో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. దేశ ప్రజల కలలు సాకారం అవుతున్నాయ్ భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పురోగమిస్తోంది. ఎనిమిదేళ్లలో వేల స్టార్టప్‌లను ప్రోత్సహించాం. ప్రపంచంలోనే మూడో స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా భారత్ ఉద్భవించింది. వంద యూనికార్న్ కంపెనీలు ఏర్పడ్డాయి. ఈ పురోగతిలో టెక్నాలజీ పాత్ర ముఖ్యమైనది. ఇందులో తెలంగాణ యువత, సాంకేతిక నిపుణుల నైపుణ్యం మరువలేనిది. కేంద్ర పథకాలతో దేశంలో కోట్లాది మంది ప్రజల కలలు సాకారం అవుతున్నాయి. బీజేపీ కార్యకర్తలు తగ్గేవాళ్లు కాదు..నెగ్గేవాళ్లు నేను శాస్త్ర, సాంకేతికతలను నమ్ముతాను, అంధ విశ్వాసాలను నమ్మను. 21వ శతాబ్దంలోనూ తెలంగాణలో అంధవిశ్వాసాలున్న వారున్నారు. వారితో తెలంగాణకు ప్రయోజనం కలగదు. వీరు తెలంగాణకు న్యాయం చేయలేరు. గుజరాత్ సీఎంగా ఉన్నపుడు కొన్ని ప్రాంతాలకు వెళితే పదవి పోతుందన్నారు. నేను ఢంకా భజాయించి మరీ పదేపదే ఆ ప్రదేశాలకు వెళ్లివచ్చాను. మేం పారిపోయే వాళ్లం కాదు.. పోరాడే వాళ్లం. బీజేపీ కార్యకర్తలు తగ్గే వాళ్లు కాదు, నెగ్గే వాళ్లు. తెలంగాణలో కొత్త చరిత్ర సృష్టించాలి ప్రధాని మొదట తెలుగులో మాట్లాడుతూ.. ‘పట్టుదలకు, ధృఢ సంకల్పానికి, పౌరుషానికి మారు పేరైన తెలంగాణ ప్రజలకు నమస్కారాలు..’ అంటూ సభికులకు అభివాదం చేశారు. ‘నేను ఎప్పుడు తెలంగాణకు వచ్చినా అపూర్వ స్వాగతం పలికారు. ఇప్పుడు కూడా ఇంత పెద్దెత్తున అపూర్వమైన రీతిలో స్వాగతించారు. ప్రజలు, కార్యకర్తలు చూపుతున్న ప్రేమ, ఆదరాభిమానాలకు, స్నేహానికి కృతజ్ఞతలు. 2013లో నేను ప్రధానిని కాదు. అయినా అప్పుడు హైదరాబాద్‌లో నా సభ జరిగితే దానికి టికెట్టు కొనుగోలు చేసి మరీ నా ప్రసంగం వినడానికి వచ్చారు. ఇదొక అద్భుతం. ఇది యావత్ దేశంలో పరివర్తనకు కారణమైంది. నా జీవితంలో అదొక టర్నింగ్ పాయింట్. దేశ ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగింది. ఈ విధంగా తెలంగాణకు, హైదరాబాద్‌కు తనదైన చరిత్ర ఉంది. ఇప్పుడు తెలంగాణలో కొత్త చరిత్ర సృష్టించాలి. బీజేపీని అధికారంలోకి తీసుకురావడం ద్వారా జెండా నాటాలి. గవర్నర్, తలసాని స్వాగతం విమానాశ్రయంలో మోదీకి గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, బీజేపీ అధ్య క్షుడు, ఎంపీ బండి సంజయ్, సీఎస్ సోమేశ్కు మార్, డీజీపీ మహేందర్‌రెడ్డి స్వాగతం పలికారు. సంజయ్ ఇంకా పోరాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పలుకరించిన మోదీ.. ‘పాదయాత్ర ఎలా సాగుతోంది? ఆరోగ్యం ఎలా ఉంది ?’ అంటూ ప్రశ్నిం చారు. ‘ఇంకా పోరాడు..’ అని అన్నారు. సభా వేదికపై మూడువరసల్లో బీజేపీ ముఖ్య నేతలంతా ఆసీనులయ్యారు. స్వాగత కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన మంత్రి తలసాని వీడ్కోలు సందర్భంగా కనబడలేదు. -
‘కల్వకుంట్ల’ పాలనకు కాలం చెల్లింది
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో ‘కల్వకుంట్ల’ కుటుంబ పాలనకు కాలం చెల్లిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మధుయాష్కీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళి చూస్తుంటే ప్రజా కూటమి విజయం ఖాయమని స్పష్టమవుతోందన్నారు. శనివారం గాంధీ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటమి భయంతోనే టీఆర్ఎస్ దాడులకు పాల్పడిందని ఆరోపించారు. పోలింగ్ రోజున రోహిత్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డిపై దాడి ఇందులో భాగమేనన్నారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళుతుండగా తనపై మెట్పల్లి వద్ద జరిగింది సాధారణ దాడి కాదని, తనను హతమార్చే కుట్ర అని ఆరోపించారు.పక్కా ప్రణాళిక ప్రకారం దాడి చేశారన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభంజనం వీస్తోందని, ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో నాలుగింటిలో కాంగ్రెస్ విజయం ఖాయ మని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో సైతం ప్రజలు ‘ప్రజాకూటమి’వైపు మొగ్గు చూపారన్నారు. తాము ఎగ్జిట్ పోల్ సర్వేలను విశ్వసించబోమని, గతంలో చాలా ఎన్నికల విషయంలో ఆ సర్వేలు తప్పని తేలిందని గుర్తు చేశారు. లగడపాటి సర్వేపై కేసీఆర్, కేటీఆర్‌లకు వణుకుపుడుతోందన్నారు. ఆయన సర్వే తమకు అనుకూలంగా వచ్చినప్పుడు టీఆర్ఎస్ నేతలు ఎగిరెగిరి గంతులేసి, వ్యతిరేకంగా వస్తే విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రగతి భవన్‌ను ఖాళీ చేయాల్సిందే: కుసుమ కుమార్ ఇక సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌ను ఖాళీ చేయాల్సిందేనని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జెట్టి కుసుమ కుమార్ అన్నారు. తెలంగాణలో ప్రజాకూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జాతీయ మీడియా తెలంగాణ ప్రజల నాడిని పసిగట్టడంలో విఫలమైందన్నారు. వంశీచంద్‌రెడ్డిని పరామర్శించిన ఉత్తమ్ హైదరాబాద్: ప్రత్యర్థుల దాడిలో గాయపడి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కల్వకుర్తి ప్రజాకూటమి అభ్యర్థి వంశీచంద్‌రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం పరామర్శించారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నిమ్స్ ఆస్పత్రిలో కల్వకుర్తి ప్రజాకూటమి అభ్యర్థి వంశీచంద్‌రెడ్డిని పరామర్శిస్తున్న ఉత్తమ్ -
కుటుంబ పాలన రక్షణ కోసం ఏకమవుతున్న ప్రతిపక్షాలు
-
వారు అబద్ధాల యంత్రాలు
న్యూఢిల్లీ: కుటుంబ పాలనను కాపాడుకునేందుకే దేశంలోని ప్రతిపక్షాలు బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భారత్ భవిష్యత్‌ను మార్చేందుకు బీజేపీ కృషి చేస్తోందని వెల్లడించారు. ప్రతిపక్ష కూటములను చూసి బెదిరిపోవద్దనీ, ప్రజలే వారిని తిరస్కరిస్తారని బీజేపీ కార్యకర్తలకు సూచించారు. దేశంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించకుండా, సైన్యాన్ని, దేశాన్ని అవమానించేవారిని ప్రజలు అసహ్యించుకుంటారని వ్యాఖ్యానించారు. ఐదు లోక్‌సభ నియోజకవర్గాల్లోని బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ శనివారం ప్రసంగించారు. ‘కాంగ్రెస్, కమ్యూనిస్టుల వంటి దేశద్రోహుల నుంచి భారత్‌కు కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?’ అని ఓ బీజేపీ కార్యకర్త అడిగిన ప్రశ్నకు మోదీ పైవిధంగా స్పందించారు. 250 కుటుంబాలకు భయం పట్టుకుంది.. వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్, వామపక్షాలు, స్థానిక పార్టీలు చేతులు కలుపుతున్న నేపథ్యంలో మోదీ మాట్లాడుతూ.. ‘బీజేపీ ప్రభుత్వం దేశ భవిష్యత్‌ను మార్చేందుకు పనిచేస్తుంటే, ప్రతిపక్షాలు మాత్రం తమ కుటుంబ పాలనపై ఆందోళన చెందుతున్నాయి. తమ వారసుల రాజకీయ భవిష్యత్ కోసం ప్రతిపక్షాలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతున్నాయి. ‘బీజేపీ మరో 5 నుంచి పదేళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉంటే మా పరిస్థితి ఏంటి?’ అని 200–250 రాజకీయ కుటుంబాలకు భయం పట్టుకుంది. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఈ కుటుంబాలు దేశ రాజకీయాలను తమ గుప్పెట్లో పెట్టుకున్నాయి. తమ రాజకీయ వారసుల కోసం ఏదో ఒకటి వదిలివెళ్లాలన్న ఆశతో ఈ కుటుంబాలన్నీ ఇప్పుడు ఏకం అవుతున్నాయి. కేంద్రం అమలు చేస్తున్న పథకాల సమాచారాన్ని కార్యకర్తలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతో పాటు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఇప్పటి ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, కీలక పథకాలను ప్రజలకు వివరించాలి’ అని సూచించారు. పన్ను విధానం, కంపెనీల ఏర్పాటులో తాము చేపట్టిన సంస్కరణల ఫలితంగా సులభతర వాణిజ్యవిధానంలో భారత్ ర్యాంకు 142 స్థానం నుంచి ఏకంగా 77వ స్థానానికి ఎగబాకిందన్నారు. కుట్రలను కార్యకర్తలు విచ్ఛిన్నం చేయాలి ఫ్రాన్స్ నుంచి 36 రఫేల్ ఫైటర్జెట్ల కొనుగోలు విషయంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చెబుతున్నవి అబద్ధాలని ప్రజలు సులభంగా తెలుసుకోవచ్చు. కొందరు ప్రతిపక్ష నేతలు అబద్ధపు యంత్రాల్లాగా ఉంటారు. వాళ్లు నోరు తెరవగానే ఏకే–47 తుపాకీలోని బుల్లెట్లలా అబద్ధాల వర్షం కురుస్తుంది. ప్రజలకు నిజాలు చెప్పి బీజేపీ కార్యకర్తలు ఈ కుట్రను విచ్ఛిన్నం చేయాలి. ప్రతిపక్షాలు నిర్వహించే కొన్ని సభలకు హాజరై నాకు వ్యతిరేకంగా నినాదాలు ఇస్తున్నవారిలో చాలామందికి అసలు ఆ సభ ఎందుకు జరుగుతోందో కూడా తెలియదు. రఫేల్ కొనుగోలులో బీజేపీ కార్యకర్తలు మథనపడాల్సిన అవసరం లేదు. ఓ 100 మంది ప్రజలతో మాట్లాడితే మీ ధైర్యం, నమ్మకం ద్విగుణీకృతం అవుతాయి’ అని మోదీ వెల్లడించారు. -
రాయ్‌బరేలీకి ‘వారసత్వం’ నుంచి విముక్తి
రాయ్‌బరేలీ: గాంధీ కుటుంబానికి పెట్టని కోటగా ఉన్న రాయ్‌బరేలీ నియోజకవర్గాన్ని కుటుంబపాలన రాజకీయాల నుంచి విముక్తి చేస్తామని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇక్కడ గాంధీ కుటుంబానికే ప్రజలు ఓట్లేసి గెలిపిస్తున్నా అభివృద్ధి జాడలు కానరావటం లేదన్నారు. శనివారం రాయ్‌బరేలీలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘వారసత్వ రాజకీయాల నుంచి రాయ్‌బరేలీకి విముక్తి కల్పించి, అభివృద్ది బాటన నడిపిస్తామని చెప్పటానికే నేను ఇక్కడికి వచ్చా. కాంగ్రెస్, ఆపార్టీ అగ్రనేతలు ఏళ్లుగా ఇక్కడ పరిపాలన సాగించినప్పటికీ కనీసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పలేక పోయారు. ఈ జిల్లాను, ఈ నియోజకవర్గాన్ని ఆదర్శంగా మారుస్తాం. యోగి ప్రభుత్వం వచ్చేదాకా రాష్ట్రంలో ‘గూండారాజ్యం’ ఉండగా ప్రస్తుతం శాంతి నెలకొంది. కాషాయ ఉగ్రవాదమంటూ మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు క్షమాపణలు చెప్పాలి’అని అమిత్ డిమాండ్ చేశారు. సభలో మీడియా ప్రతినిధులు కూర్చున్న చోట విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగటంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. -
రాష్ట్రంలో కుటుంబ పాలన
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: అమరుల త్యాగాలతో ఏర్పాటైన తెలంగాణలో కుటుంబ పాలన సాగిస్తున్న కేసీఆర్‌ను రాజకీయాల నుంచి తప్పిస్తేనే సాధించుకున్న రాష్ట్రానికి సార్థకత చేకూరుతుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా వ్యాఖ్యానించారు. అందుకోసం ‘కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో’ నినాదం తో ప్రతీ కార్యకర్త ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో బుధవారం రాత్రి పొద్దుపోయే వరకు నిర్వహించిన ‘జనగర్జన’ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసమే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని తెలిపారు. ఆ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానన్న కేసీఆర్ హామీ నెరవేరలేదని, కానీ, వారి ఇంట్లో అందరికీ పదవులు మాత్రం వచ్చాయని ఎద్దేవా చేశారు. దేశంలోనే తెలంగాణలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా పెరిగాయన్నారు. బుధవారం ఒక్క రోజే కరీంనగర్ జిల్లాలో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగుల ఆశలు అడియాశలయ్యాయన్నారు. దేశం లో మోదీ–అమిత్‌షాను ఢీకొనగలిగిన సత్తా ఉన్న నాయకుడు రాహుల్‌గాంధీ ఒక్కరేనన్నారు. అందుకు నిదర్శనం గుజరాత్ ఎన్నికల ఫలితాలేనని చెప్పారు. 22 ఏళ్లుగా రాష్ట్రంలో పార్టీ అధికారంలో లేకున్నా 80 స్థానాలు సాధించటం రాహుల్ గొప్పతనమేనని కుంతియా అన్నారు. అంతా గోబెల్స్ ప్రచారం: ఉత్తమ్ ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ చేస్తున్నది గోబెల్స్ ప్రచారం తప్ప మరేమీ లేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టులకు కాంగ్రెస్ నేతలు అడ్డుపడుతున్నారంటూ చెప్పుకోవడం తప్ప ఆయన చేసిందేమీ లేదన్నారు. దేశం లో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో దోపిడీ పాలన సాగుతోందన్నారు. విద్యుత్ విషయంలో ఆయన ప్రారంభించిన ప్రాజెక్టుల్లో ఒక్క యూనిటైనా ప్రారంభించారా? అని ప్రశ్నించారు. జైపూర్ వద్ద 12 వందల మెగావాట్ల ప్లాంట్, భూపాలపల్లిలో 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు కాంగ్రెస్ హయాంలోనివేనన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా మెరుగ్గా ఉండటానికి కారణం కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టుల వల్లే సాధ్యమైందన్నారు. గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు కల్పించకుండా లంబాడీలు, ఆదివాసీల మధ్య చిచ్చుపెట్టారని ఆరోపించారు. ఆత్మగౌరవ నినాదంతో ఏర్పడిన రాష్ట్రంలో ప్రస్తుతం అదే ఆశయం కోసం మరో దఫా ఉద్యమించాల్సిన అవసరం ఉందని పీసీసీ చీఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆత్మగౌరవం దొరగడీల్లో బందీగా మారిందన్నారు. రాష్ట్రానికి వస్తున్న రాబడిని సీఎం కేసీఆర్ తన సొంత కుటుంబ విలాసాలకు వాడు కుంటున్నారని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి విమర్శించారు. పాలమూరు నుంచే కేసీఆర్ పతనం ప్రారంభమవుతుందని.. అందుకు అనుగుణంగా వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుందని డీకే అరుణ వ్యాఖ్యానించారు. సభలో మండలి విపక్షనేత షబ్బీర్ అలీ, కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జి.చిన్నారెడ్డి, సంపత్‌కుమార్, వంశీకృష్ణ, నేతలు వీహెచ్, అనిల్‌కుమార్ యాదవ్, శ్రావణ్‌కుమార్, మల్లు రవి తదితరులు ప్రసంగించారు. -
కుటుంబ పాలన లెక్క చెప్పండి
రాహుల్‌కు అమిత్‌షా సూటి ప్రశ్న రాంచీ: నెహ్రూ–గాంధీ కుటుంబ పాలనా పనితీరుకు సంబంధించిన లెక్క చెప్పాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ప్రశ్నించారు. ‘రాహుల్ అమెరికాలో చాలా మాట్లాడుతున్నారు. మరి దేశంలో 50 ఏళ్లకు పైగా సాగిన వారి కుటుంబ పాలన లెక్కలను ఆయన ముందుగా చెప్పాలి’ అని అమిత్ అన్నారు. జార్ఖండ్‌లో అవినీతి రహిత పాలన అందిస్తున్న సీఎం రఘువర్ దాస్‌ను షా అభినందించారు. అలాగే, దేశాన్ని తన సరిహద్దుల్లోపు అభివృద్ధిచేసుకునే సార్వభౌమాధికార హక్కు భారత్‌కు ఉందని షా అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో జపాన్ పెట్టుబడుల ప్రతిపాదనల పట్ల చైనా అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని తప్పుపట్టారు. -
రాష్ట్రంలో కుటుంబపాలన
బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశానికి హాజరైన కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లో మోదీ సభకు జన సమీకరణపై చర్చ రాష్ట్రంలో టీఆర్ఎస్ అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తోంది. ప్రతిపక్షాలు లేకుండా చేస్తూ కేసీఆర్ కుటుంబ పాలన చేస్తున్నారు.. ప్రజావ్యతిరేక పాలనపై పోరాటానికి ఈ నెల 7న జరిగే మోదీ సభలో బీజేపీ శంఖారావం పూరిస్తాం. ఎంసెట్-2 లీకేజీతో విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతూ ప్రజల గొంతుకై సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలి. - బీజేపీ శాసనసభా పక్షనేత కిషన్‌రెడ్డి శంషాబాద్ రూరల్: టీఆర్ఎస్ పాలనతో రాష్ట్రంలో విద్యా రంగ వ్యవస్థ నిర్వీర్యం అయిందని బీజేపీ శాసనసభా పక్షనేత జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు. శంషాబాద్ మండలంలోని బహదూర్‌గూడ సమీపంలో ఉన్న ఓ ఫంక్షన్‌హాలులో మంగళవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కిషన్‌రెడ్డి పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. యూనివర్సిటీలకు వైస్ చాన్స్లర్ల నియామకం, ఎంసెట్-2 లీకేజీ వ్యవహారాలతో విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. గ్రామాల్లో ఇసుక, ల్యాండ్ మాఫియా రెచ్చిపోతోందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా రాజ్యాంగ విరుద్దంగా పాలన కొనసాగిస్తున్నారని, టీడీపీలో 15 మంది ఎమ్మెల్యేలుంటే ఇద్దరుముగ్గుర్ని వదిలి అందర్నీ చేర్చుకున్నారన్నారు. రెండు పడకల ఇళ్లు పథకం సచివాలయం దాటి రావడంలేదన్నారు. రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలనపై పోరాటం చేయడంతో పాటు టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతూ ప్రజల గొంతుకై సమస్యలపై పోరాటానికి సిద్ధమవుతామన్నారు. ఇందుకు ఈ నెల 7న జరిగే మోదీ సభను వేదికగా చేసుకుంటామని చెప్పారు. 2019లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాహుల్‌తో కాంగ్రెస్ ముక్తీ భారత్.. ఏఐసీసీ ఉపాధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ ముక్తీ భారత్‌గా ఉంటుందని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. దేశం, రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వంపై నమ్మకం పోయిందని, ఆ పార్టీకి భవిష్యత్తు లేదని జోస్యం చెప్పారు. హిమాచల్, ఉత్తరాంచల్, కర్ణాటకలో ఎప్పడు ఎన్నికలు జరిగినా బీజేపీ గెలుపు ఖాయమన్నారు. మోదీ నేతృత్వంలో భారత్ అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధిస్తుందన్నారు. మోదీ సభను విజయవంతం చేద్దాం.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రధాని హోదాలో మోదీ మొదటిసారిగా రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించే సభను విజయవంతం చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు. 2013లో మోదీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొదటి సభను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించామని, అదేస్థాయిలో ఇప్పుడు సభకు భారీగా జన సమీకరణ చేపట్టాలన్నారు. అన్ని వర్గాల వారిని సభకు తరలించాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ జాతీయ కార్యదర్శి కృష్ణదాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మోహన్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి ఎండల లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రేమ్‌రాజ్, అంజన్‌కుమార్, నాయకులు నందకిషోర్, ప్రశాంత్, మండల అధ్యక్షుడు వెంకటయ్య, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.