సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో కీలకమైన బీసీ ఓటర్ల గణన ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది. ఈ నెల 18న మొదలైన ఈ ప్రక్రియ జూన్ 3 వరకు జరిగే అవకాశముంది. అనంతరం గ్రామపంచాయతీల రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. బీసీ ఓటర్ల గణాంకాల ఆధారంగా అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. బీసీ ఓటర్ల గణన, రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియలు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.
గ్రామపంచాయతీల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేసిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. అనంతరం ప్రభుత్వం ఈ జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేస్తుంది. రిజర్వేషన్ల జాబితా అందిన తర్వాత ఎన్నికల సంఘం గ్రామపంచాయతీల ఎన్నికల పోలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేస్తుంది. ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని రకాలుగా సిద్ధమైంది.
నమూనా షెడ్యూల్‌ను నిర్ణయించి ఈ మేరకు ఇతర శాఖలను సిద్ధం చేస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం రూపొందించిన నమూనా షెడ్యూల్ ఒకటి సోమవారం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేసింది. ఇది కేవలం నమూనా కోసం తయారు చేసింది మాత్రమేనని.. అసలైన షెడ్యూల్ ఖరారు కాలేదని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment