న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ఒకే దశలో ఫిబ్రవరి 5న ఓటింగ్ జరగనుంది. ఈ నేపధ్యంలో అన్ని పార్టీలు ముమ్మర ప్రచారానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ సహా అన్ని పార్టీల నేతలు ప్రచారపర్వంలో మునిగితేలుతున్నారు. ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తన హవా చాటనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన సీఎం యోగి షెడ్యూల్‌ను కూడా బీజేపీ వర్గాలు కూడా వెల్లడించాయి. సీఎం యోగి పాల్గొనబోయే సమావేశాలకు సంబంధించిన సన్నాహాలు మొదలయ్యాయి.
సీఎం యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీలో 14 బహిరంగ సభలలో ప్రసంగిస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. జనవరి 23న మూడు సమావేశాలు, జనవరి 28న నాలుగు సమావేశాలు, జనవరి 30న నాలుగు సమావేశాలు, ఫిబ్రవరి ఒకటిన మూడు సమావేశాల్లో సీఎం యోగి పాల్గొననున్నారు.
యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీలోని తూర్పు, ఈశాన్య ఢిల్లీ ప్రాంతాలలో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. బీజేపీ అభ్యర్థులు అజయ్ మహాబల్, పవన్ శర్మ, ఆశిష్ సూద్, రవీంద్ర సింగ్, ఉమాంగ్ బజాజ్, ప్రద్యుమాన్ రాజ్‌పుత్ (ద్వారక), కర్తార్ సింగ్ తన్వర్, గజేంద్ర యాదవ్ (మెహ్రౌలి), బజరంగ్ శుక్లా, సంజయ్ గోయెల్, మోహన్ సింగ్ బిష్ట్, కైలాష్ గెహ్లాట్ మొదలైనవారు పోటీచేస్తున్న ప్రాంతాల్లో జరిగే బహిరంగ సభల్లో యోగి పాల్గొననున్నారు.
ఇది కూడా చదవండి: బీహార్ బాలికకు ప్రధాని మోదీని ప్రశ్నించే ఛాన్స్!
Comments
Please login to add a commentAdd a comment