ప్రైవేటు ఉద్యోగులకు తీపి కబురు
ప్రైవేటు ఉద్యోగులకు తీపి కబురు
Published Sat, Feb 25 2017 6:11 PM | Last Updated on Tue, Sep 5 2017 4:35 AM
న్యూఢిల్లీ: ప్రయివేటు ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. పదవీవిరమణ పొందిన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ పై భారీ పన్ను మినహాయింపును ఇవ్వనుంది. ఇక మీదట ప్రయివేటు ఉద్యోగస్తుల పన్నురహిత గ్రాట్యుయిటీ ఉపసంహరణ పరిమితిని రెట్టింపు చేసింది. తాజానిర్ణయం ప్రకారం త్వరలోనే రూ. 20లక్షల గ్రాట్యుటీ ఉపసంహరణపై పన్నును రద్దు చేయనుంది. ఈ మేరకు గ్రాట్యుటీ చట్టాన్ని సవరించడానికి సంసిద్ధతను వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులతో సమానంగా ఈ పరిమితిని రూ. 20లక్షలకు పెంచింది.
కార్మిక మంత్రిత్వ శాఖ, కార్మిక సంఘాలు, యజమాను సంస్థలు మధ్య జరిగిన ఒక త్రైపాక్షిక సమావేశంలో ఈ అంశంపై ఏకాభిప్రాయాన్ని సాధించారు. ఈ మేరకు పేమెంట్ ఆఫ్ గ్రాట్యుయిటీ యాక్ట్ సవరణ బిల్లును పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ద్వితీయార్థంలో ప్రవేశపెట్టేందుకు నిర్ణయించారు. అయితే అయిదు సంవత్సరాల కనీస సర్వీసు , కనీసం 10మంది ఉద్యోగుల నిబంధనను కూడా తొలగించాలని ఉద్యోగ సంఘాలుడిమాండ్ చేశాయి. ప్రస్తుతం అయిదేళ్ళ ఉపాధి తరువాత పన్ను రహిత గ్రాట్యుయిటీ పరిమితి 10లక్షల వరకు మాత్రమే.
సాధారణంగా కనీసం అయిదు సం.రాల సర్వీసు న్న ఉద్యోగ విరమణ సమయానికి ఉద్యోగి వేతనం ఆధారంగా దీన్ని నిర్ణయిస్తారు. జీతం, సర్వీసు సంవత్సరాలతో గుణించి లెక్కకడతారు. ఉదాహరణకు ఒక వ్యక్తి తన సేవ చివరలో రూ .20 లక్షల గ్రాట్యుటీ ఉపసంహరించుకోవాలంటే ..10 సంవత్సరాల అనుభవంతో .. అతని లేదా ఆమె ఒక నెల జీతం( మూలవేతనంలో + డీఏ) రూ 3.5 లక్షల కంటే ఎక్కువ వుండాలి.
ఈ నేపథ్యంలోనే ఈ చర్య ప్రభుత్వ పన్ను వసూళ్లపై పెద్దగా ప్రభావం చూపదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే రూ .20 లక్షల పారితోషికం అందుకునేంత అధిక జీతాలున్న వ్యక్తులు చాలా పరిమితమని పేర్కొన్నారు. అలాగే భారతదేశం లో 10 లక్షల ఆదాయాన్ని ప్రకటించిన వారు మాత్రమే 24 లక్షల మందికాగా, రూ. 50 లక్షల కు పైన ఆదాయాన్ని ప్రకటించిన వారు 1.72 లక్షల మంది మాత్రమే.
కాగా 7వ వేతన సంఘం సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పన్నురహిత గ్రాట్యుటీ ఉపసంహరణ ను 20 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. 1997 లో, గ్రాట్యుటీ పన్ను ఉపశమనం 2.5 లక్షల నుంచి రూ 3.5 లక్షల రూపాయల కి పెంచారు. ఆ తరువాత 2010 లో ఈ పరిమితిని రూ .10 లక్షలుగా నిర్ణయించారు.
Advertisement