న్యూఢిల్లీ: అంగన్‌వాడీ కేంద్రాల వర్కర్లు, సిబ్బంది గ్రాట్యుటీకి అర్హులేనని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. ‘‘అంగన్‌వాడీ కేంద్రాలు చట్టబద్ధమైన విధులు నిర్వహిస్తూ ప్రభుత్వంలో భాగంగా మారాయి.
గ్రాట్యుటీ చట్టం–1972 వాటికీ వర్తిస్తుంది’’ అని జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ అభయ్ ఎస్ ఒకాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. చిన్నారులు, గర్భిణులు, పాలిచ్చే తల్లుల సంక్షేమం వంటి ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాల్లో భాగస్వాములయ్యే అంగన్‌వాడీ సిబ్బందిని పార్ట్‌టైం వర్కర్లుగా భావించలేమని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment