సాక్షి, కాకినాడ(తూర్పు గోదావరి): చంద్రబాబు హయాంలో ఈఎస్‌ఐ స్కాంలో రూ.300 కోట్ల అవినీతి జరిగిందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. మాజీ కార్మిక మంత్రులు అచ్చెం నాయుడు, పితాని సత్యనారాయణ హయాంలోనే ఈ అవినీతి జరిగిందని పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంలో ఎన్ని శాఖలుంటే అన్ని శాఖలను టీడీపీ దోచుకుందని విమర్శించారు. దీంతో నేడు చంద్రబాబు కూడా ముద్దాయి అయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. ఇక బాబుతోపాటు అప్పటి కార్మికశాఖ మంత్రులిద్దరూ కూడా జైలుకు వెళ్లే పరిస్థితి దగ్గర్లోనే ఉందని పేర్కొన్నారు.
కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. అందులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణం తలపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈఎస్ఐ ఆసుపత్రులు సమర్ధవంతగా పనిచేస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్‌లోని ఈఎస్ఐ హాస్పిటల్ మంచి సేవలు అందిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. ఏపీలో ఈఎస్ఐ ఆసుపత్రులు కూడా అదే విధంగా సేవలు అందించాలని కోరారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సహాయసహకారాలు అందిస్తామని తెలిపారు.(ఆ మాజీ మంత్రులను వదిలిపెట్టం)
Comments
Please login to add a commentAdd a comment