ఈపీఎఫ్‌ వడ్డీరేటు 8.65 శాతం | Provident Fund Subscribers To Get 8.65 Interest Rate | Sakshi
Sakshi News home page

ఈపీఎఫ్‌ వడ్డీరేటు 8.65 శాతం 

Published Wed, Sep 18 2019 4:57 AM | Last Updated on Wed, Sep 18 2019 4:57 AM

Provident Fund Subscribers To Get 8.65 Interest Rate - Sakshi

న్యూఢిల్లీ : ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్‌) చందాదారులందరికీ శుభవార్త. 2018– 19 ఆర్థిక సంవత్సరానికిగాను ఈపీఎఫ్‌ చందాదారులకు చెల్లించాల్సిన వడ్డీని 8.65 శాతం చొప్పున ఈ పండగ సీజన్‌కు ముందే చెల్లించనున్నట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ తెలిపారు. ఈ మేరకు మంగళవారం జాతీయ భద్రతా అవార్డుల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2017–18 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌ ఖాతాల్లోని మొత్తాలపై 8.55 శాతం వడ్డీ చెల్లించారు. 2018–19 సంవత్సరానికి ఈ వడ్డీరేటును 8.65 శాతానికి పెంచాలని ఈపీఎఫ్‌ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. కాగా ఈపీఎఫ్‌ చందాదారులకు చెల్లించే వడ్డీని 8.65 శాతానికి పెంచనున్నామని గంగ్వార్‌ కొద్ది రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement