EPFO subscribers
-
ఉద్యోగులకు శుభవార్త.. మారిన ఈపీఎఫ్ఓ రూల్స్..అవేంటో తెలుసా?
ఏప్రిల్ 1 నుంచి 2024-25 కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ అభివృద్ధి నినాదంతో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు.అయితే ఆ బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో పలు ఆర్ధిక పరమైన అంశాల్లో చేసిన మార్పులు ప్రకటించారు. ఆ మార్పులు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. సేవింగ్ స్కీమ్స్ (ఎన్పీఎస్ అండ్ ఈపీఎఫ్ఓ), ఇన్ కమ్ ట్యాక్స్, ఫాస్టాగ్‌లు ఇలా మీ ఆర్థిక స్థితిని ప్రభావితం చేసే పలు అంశాలు ఉన్నాయి. కాబట్టి వాటి గురించి ముందే తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని ఆర్ధిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఈపీఎఫ్ రూల్స్ ఏప్రిల్ 1 నుంచి ఈపీఎఫ్ఓలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ రూల్స్‌తో ఉద్యోగులు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారే సమయంలో ఈపీఎఫ్ఓ ట్రాన్స్ఫర్ వంటి విషయాల్లో మరింత సులభతరం అయ్యింది. ఈపీఎఫ్ఓ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఉద్యోగులు స్వయంగా డాక్యుమెంట్లు అందజేయడం, సంతకాలు చేసే పనిలేకుండా మ్యాన్యువల్‌గా ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే ఈ బదిలీపై పూర్తి సమాచారం ఈపీఎఫ్ఓ నుంచి రావాల్సి ఉంది. ఉద్యోగం మారినపుడు అకౌంట్ బ్యాలెన్స్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తారా? లేక సదరు అకౌంట్ వడ్డీ కూడా జమ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఎన్పీఎస్: టూ ఫ్యాక్టర్ అథంటికేషన్ ఏప్రిల్ 1, 2024 నుండి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ(pfrda) ప్రభుత్వ రంగ సంస్థ పదవి విరమణ అనంతరం లబ్ధిదారులు నెలవారి పెన్షన్‌ను అందించేందుకు సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ (cra) పేరుతో వెబ్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే, రోజురోజుకి పెరిగిపోతున్న టెక్నాలజీ వినియోగంతో సైబర్ నేరాల నుంచి రక్షణ పొందేలా పెన్షన్ దారులకోసం పీఎఫ్ఆర్డీఏ ఆథార్ నెంబర్‌తో టూ ఫ్యాక్టర్ అథంటికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనల్లో లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ పన్ను మినహాయింపు అంశం తెరపైకి వచ్చింది. 2022 వరకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ పన్ను మినహాయింపు రూ.3 లక్షలకు ఉండేది. ఇప్పుడు దానిని రూ.25లక్షలకు పెంచుతున్నట్లు ప్రతిపాదించారు. పదవీ విరమణ చెందుతున్న ప్రభుత్వేతర సంస్థల్లోని ఉద్యోగుల లీవ్ ఎన్ క్యాష్ మెంట్‌పై పన్ను మినహాయింపును రూ.25 లక్షలకు పెంచడంతో వేతన జీవులకు ఏడాదికి రూ.20 వేల వరకు లబ్ధి చేకూరనుంది. -
EPFO Update: భారీగా పెరిగిన ఉద్యోగులు
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో సభ్యులు భారీగా పెరిగారు. 2023 నవంబర్‌లో నికరంగా 13.95 లక్షల మంది సభ్యులను చేర్చుకున్నట్లు ఈపీఎఫ్‌వో తాజాగా విడుదల చేసిన తాత్కాలిక పేరోల్ డేటా ద్వారా వెల్లడించింది. ఇది మునుపటి ఏడాదిఇదే కాలంలో చేరికల కంటే ఎక్కువని తెలుస్తోంది. 7.36 లక్షల మంది కొత్తవారు 2023 నవంబర్‌లో దాదాపు 7.36 లక్షల మంది కొత్త సభ్యులు నమోదు చేసుకున్నారని ఈపీఎఫ్‌వో డేటా సూచిస్తోంది. కొత్తగా చేరిన సభ్యులలో 18-25 సంవత్సరాల వయస్సు గలవారు 57.30 శాతం మంది ఉన్నారు. అంటే పెద్ద సంఖ్యలో శ్రామిక శక్తి సంఘటిత రంగంలో ప్రవేశించింది. సుమారు 10.67 లక్షల మంది సభ్యులు నిష్క్రమించినా మళ్లీ ఈపీఎఫ్‌వోలో చేరినట్లు పేరోల్ డేటా ప్రతిబింబిస్తోంది. 1.94 లక్షల మంది మహిళలు జెండర్‌వారీగా పేరోల్ డేటాను పరిశీలిస్తే 2023 నవంబర్‌లో చేరిన మొత్తం 7.36 లక్షల మంది కొత్త సభ్యులలో దాదాపు 1.94 లక్షల మంది మహిళలు ఉన్నారు. అలాగే ఆ నెలలో నికరంగా మహిళా సభ్యుల చేరిక దాదాపు 2.80 లక్షలకు చేరుకుంది. నికర చందాదారుల చేరికలో నికర మహిళా సభ్యుల శాతం 20.05 శాతంగా ఉంది. ఇది 2023 సెప్టెంబరు కంటే అధికం. సంఘటిత రంగ శ్రామిక శక్తిలో మహిళా ఉద్యోగుల భాగస్వామ్యాన్ని ఇది తెలియజేస్తోంది. -
ఈపీఎఫ్ఓ పెన్షన్.. టెన్షన్
సాక్షి, హైదరాబాద్: అధిక పెన్షన్(హయ్యర్ పెన్షన్) పథకం దరఖాస్తులకు సాంకేతిక చిక్కులు వీడడం లేదు. ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) షరతులకు అనుగుణంగా అన్నిరకాల వివరాలను తీసుకుని ఆన్లైన్లో అధిక పెన్షన్ దరఖాస్తు సమర్పించినప్పటికీ మెజార్టీ అర్జీదారులకు సంబంధిత దరఖాస్తు స్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఆన్లైన్లో అన్ని వివరాలతో సమర్పించిన దరఖాస్తు ఎవరికి చేరిందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. దీంతో అర్జీదారులు అటు కంపెనీ యాజమాన్యం వద్దకు, ఇటు రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్(ఆర్పీఎఫ్సీ) కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అయినాసరే ఈ సమస్యకు యాజమాన్యం వద్ద, ఆర్పీఎఫ్సీ వద్ద సమాధానం దొరకడం లేదని అంటున్నారు. నాలుగు స్థాయిల్లో ఫైలు... భవిష్యనిధి చందాదారుల్లో అధిక పెన్షన్‌కు అర్హత ఉన్న వారంతా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. పూర్తి వివరాలతో ఆన్లైన్ దరఖాస్తును పూరించి సరైన ఆధారాలను జతచేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన దరఖాస్తు వెంటనే కంపెనీ యూజర్ ఐడీ ఖాతాకు చేరుతుంది. అలా చేరిన దరఖాస్తును యాజమాన్యం పరిశీలించి అర్హతలను నిర్ధారించుకున్న తర్వాత ఆమోదిస్తుంది. ఇలా ఉద్యోగి, కంపెనీ ఉమ్మడి ఆప్షన్ తర్వాత ఆ దరఖాస్తు సంబంధిత రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ లాగిన్‌కు చేరుతుంది. అక్కడ మరోమారు పరిశీలించిన అధికారులు ఈ దరఖాస్తును ఆమోదించిన తర్వాత సెంట్రల్ సర్వర్‌కు ఫార్వర్డ్ చేస్తారు. ఇలా నాలుగు దశల్లో దరఖాస్తు ముందుకు కదులుతుంది. అయితే ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో నెలకొన్న సాంకేతిక సమస్యలతో దరఖాస్తు దశ పూర్తిగా మారింది. ఆ దరఖాస్తు నేరుగా సెంట్రల్ సర్వర్‌కు చేరుతోంది. దీంతో కంపెనీ యాజమాన్యం, ఆర్పీఎఫ్సీ పరిధిలోకి రాకపోవడంతో వాటి పరిశీలన సందిగ్ధంలో పడుతోంది. గడువు దాటితే అనర్హతే... పీఎఫ్ చందాదారులు, పెన్షనర్లకు అధికపెన్షన్ అవకాశం ఇదే చివరిసారి. వచ్చే నెల 3వ తేదీ వరకు ఆన్లైన్లో ఉమ్మడి ఆప్షన్ ఇవ్వడం తప్పనిసరి. ఆ తర్వాత ఉమ్మడి ఆప్షన్ ఇవ్వడానికి అవకాశం ఉండదు. భవిష్యత్తులో ఇక ఇలాంటి వెసులుబాటు ఉండదని ఇప్పటికే ఈపీఎఫ్ఓ తేల్చిచెప్పింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఇప్పటికే 1.62లక్షల మంది అధిక పెన్షన్‌కు దరఖాస్తులు సమర్పించారు. మరో నెలరోజుల పాటు గడువు ఉండడంతో ఈ దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ దరఖాస్తులు సమర్పించిన వారిని ఇప్పుడు సాంకేతిక సమస్య తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది. ఇప్పటికే సమర్పించిన దరఖాస్తులు నేరుగా సెంట్రల్ సర్వర్‌కు చేరడంతో అవి తిరిగి యాజమాన్యం, ఆర్పీఎఫ్సీకి చేరేదెలా అనే సందేహం నెలకొంది. మరోవైపు వచ్చే నెల 3వ తేదీలోగా ఉమ్మడి ఆప్షన్ పూర్తవుతుందా? లేదా? అనే ఆందోళన నెలకొంది. -
ఈపీఎఫ్‌వో సభ్యులకు ఈ పాస్‌బుక్
న్యూఢిల్లీ: ఈపీఎఫ్‌వో చందాదారులకు ఈ–పాస్‌బుక్ సదుపాయాన్ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రారంభించారు. దీంతో సభ్యులు తమ ఖాతా వివరాలను మరింత గ్రాఫికల్‌గా చూసుకోవచ్చని ఈపీఎఫ్‌వో ప్రకటించింది. ఈపీఎఫ్‌వోకు సంబంధించి 63 ప్రాంతీయ కార్యాలయాల్లో (100కు పైగా ఉద్యోగులు ఉన్న) క్రెచే సదుపాయాలను సైతం మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రారంభించారు. ఉద్యోగులు తమ పిల్లలను ఇక్కడ విడిచి విధులు నిర్వహించుకోవచ్చు. పిల్లల సంరక్షణ బాధ్యతను అక్కడి సిబ్బంది చూసుకుంటారు. -
EPFO update: 6 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త!
ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త. త్వరలో ఈపీఎఫ్ మంథ్లీ పెన్షన్ లబ్ధిదారులు తీసుకునే నెలవారీ పెన్షన్ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇది కేంద్రం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఎంప్లాయి పెన్షన్ స్కీమ్-1995 (ఈపీఎస్) కమిటీ కేంద్ర కార్మిక శాఖకు లేఖ రాసింది. పీఎఫ్ లబ్ధిదారులకు నెలనెలా ఇచ్చే పెన్షన్ రూ.1000 నుంచి రూ.7,500కు పెంచాలని డిమాండ్ చేసింది. ఆ లేఖపై 15రోజుల్లో వివరణ ఇవ్వాలని తెలిపింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌కు రాసిన లేఖలో పీఎఫ్ లబ్ధి దారులకు ప్రస్తుతం చెల్లించే నెలవారీ పెన్షన్ సరిపోవడం లేదని, అనారోగ్యం వస్తే చికిత్స చేయించుకునేందుకు డబ్బులు లేక కొన్ని సార్లు ప్రాణాల్ని పణంగా పెడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి భూపేందర్ యాదవ్‌కు రాసిన లేఖలో15 రోజుల్లోగా తమ డిమాండ్లపై కేంద్రం సానుకూల ప్రకటన చేయాలని నేషనల్ ఎజిటేషన్ కమిటీ కోరింది. లేదంటే రైళ్లు, రోడ్లు నిర్భందిస్తామని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించింది. సుప్రీం కోర్ట్ తీర్పు దీంతో పాటు సుప్రీం కోర్ట్ అక్టోబర్ 4, 2016, నవంబర్ 4,2022లలో ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా వాస్తవ జీతంపై పెన్షన్ చెల్లించాలని కూడా కోరింది. బేసిక్ శాలరీ రూ.15వేల మించిపోయిన ఉద్యోగులు ఈ ఎంప్లాయి పెన్షన్‌స్కీమ్ (ఈపీఎస్)కు అనర్హులు. తాజాగా బేసిక్ శాలరీ రూ.15వేలు, అంతకన్నా ఎక్కువ ఉన్నా ఈపీఎస్-95 స్కీమ్‌కు కంట్రిబ్యూట్ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఆదేశించింది. 6 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త? ఎంప్లాయి పెన్షన్ స్కీమ్ 1995 లేదా ఈపీఎఫ్ -95ని రిటైర్మెంట్ ఫండ్ బాడీ నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఇందులో 6కోట్లకు పైగా ఖాతాదారులున్నారు. వారిలో 75 లక్షల మంది ప్రతి నెల పెన్షన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈపీఎస్ కమిటీ రాసిన లేఖపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తే 6 కోట్ల ఖాతా దారులకు, పెన్షన్ దారులకు లబ్ధి చేకూరనుంది. చదవండి👉 అలెర్ట్: ఈపీఎఫ్ అకౌంట్లో మీ వడ్డీ డబ్బులు కనిపించడం లేదా? -
ఈపీఎఫ్ఓలో ఫోటో ఎలా అప్లోడ్ చేయాలో తెలుసా? లేదంటే డబ్బులు రావు!
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ముఖ్య గమనిక. ఈపీఎఫ్ఓ నుంచి డబ్బులు డ్రా చేయాలని అనుకుంటున్నారా? అయితే మీరు తప్పని సరిగా ఈ- నామినేషన్‌ను ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ నామినేషన్ ఫిల్ చేయకపోతే డబ్బులు డ్రా చేయలేం. కాబట్టి ఖాతాదారులు ఈ-నామినేషన్ ఫైల్ చేయాలని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ-నామినేషన్ ఫైలింగ్ చేస్తున్నా..కంప్లీట్ కావడం లేదంటే మీరు మీ అకౌంట్ ఫ్రొఫైల్‌ను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రొఫైల్ అప్డేట్ చేయకపోతే ఈ- నామినేషన్ పూర్తి చేయలేమనే విషయాల్ని తప్పని సరిగా గుర్తుంచుకోవాలి. ప్రొఫెల్ పిక్చర్ ఎలా యాడ్ చేయాలంటే! ఈ - నామినేషన్ ఫైలింగ్‌కు ముందు అకౌంట్ ప్రొఫైల్ పిక్చర్ అప్డేట్ కోసం కొన్ని పద్దతుల్ని పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్టెప్1: ముందుగా యూఏఎన్ మెంబర్ ఐడీతో ఈపీఎఫ్ఓ అఫీషియల్ పోర్టల్‌లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సెప్ట్2: ఆ తర్వాత మెన్యూ సెక్షన్లో క్లిక్ చేస్తే ప్రొఫైల్ ఆప్షన్ కనిపిస్తుంది. స్టెప్3: ప్రొఫైల్ ఆప్షన్‌పై క్లిక్ చేసి వ్యక్తిగత వివరాల్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు లెప్ట్ సైడ్‌లో ప్రొఫైల్ ఫోటో ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేసి ఫోటోను ఛేంజ్ చేయడం లేదంటే, అప్లోడ్ చేయాలి. స్టెప్4:ప్రొఫైల్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఈపీఎఫ్ఓలో మీ ఫోటో అప్లోడ్ చేయాలి. స్టెప్5: ఫోటో అప్లోడ్ అవ్వాలంటే మీ పాస్ పోర్ట్ ఫోటో సైజ్ 3.5సెంటీమీటర్లు* 4.5 సెంటీమీటర్లు ఉండేలా చూసుకోవాలి. స్టెప్6: మన రెండు చెవులు కనిపించేలా ఫోటో విజబుల్ 80శాతం ఉండేలా చూసుకోవాలి. స్టెప్7: ఆ ఫోటో ఇమేజ్ జేపీఈజీ,జేపీజీ,పీఎన్జీ ఫార్మాట్లో సేవ్ చేయాలి. స్టెప్8: ఆ తర్వాత అప్లోడ్ యువర్ ఫోటో మీద క్లిక్ చేసి ఓకే అనే ఆప్షన్ పై ట్యాప్ చేయాలి. దీంతో మీ ఫోటో అప్లోడ్ అవుతుంది. -
ఈపీఎఫ్ చందాదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్!
మీరు ప్రభుత్వ/ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా? అయితే మీకు ఒక ముఖ్య గమనిక. వచ్చే నెల ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి. కొత్తగా అమలులోకి రానున్న పీఎఫ్ నిబంధనల ప్రకారం.. రూ. 2.5 లక్షలకు పైన ఈపీఎఫ్ ఖాతాలో జమ అయ్యే పీఎఫ్ మొత్తంపై ట్యాక్స్ పడనుంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) కూడా ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం 2021-22 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్ధిక మంత్రి ఈ విషయాన్ని తెలియజేశారు. 2021 ఆగస్ట్ 31న సీబీడీటీ జారీ చేసిన నిబంధనల ప్రకారం.. ప్రావిడెంట్ ఫండ్‌లో రూ. 2.5 లక్షల వరకు ఇన్వెస్ట్‌మెంట్‌పై వచ్చే వడ్డీ ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండదు. అయితే ఈ లిమిట్ దాటితే మాత్రం పన్ను పడుతుంది. అంటే రూ.2.5 లక్షలకు మించి ఇన్వెస్ట్ చేస్తే వచ్చే వడ్డీ ఆదాయంపై ట్యాక్స్ చెల్లించుకోవాల్సి ఉంటుంది. యజమానులు పీఎఫ్ కంట్రిబ్యూట్ చేయనప్పుడు ఈ పరిమితి సంవత్సరానికి రూ.5 లక్షలుగా ఉంటుంది. రూ.2.5 లక్షలకు పైగా ఇన్వెస్ట్మెంట్ కలిగిన వారు పీఎఫ్ ఖాతాను రెండు విభాగాలుగా మార్చుకోవాల్సి వస్తుంది. అంటే రూ.2.5 లక్షల వరకు ఒక అకౌంట్లో, మిగతా డబ్బులు మరో అకౌంట్లో డిపాజిట్ చేసుకోవాల్సి రావొచ్చు. అప్పుడు ఈ అదనపు అకౌంట్‌పై ట్యాక్స్ పడుతుంది. కొత్త పీఎఫ్ నిబంధనలు: ప్రస్తుతం ఉన్న పీఎఫ్ ఖాతాలను పన్ను పరిధిలోకి వచ్చే కంట్రిబ్యూషన్ అకౌంట్లు, నాన్ ట్యాక్సబుల్ కంట్రిబ్యూషన్ అకౌంట్లుగా విభజించనున్నారు. ప్రావిడెంట్ ఫండ్ వార్షిక కంట్రిబ్యూషన్ రూ.2.5 లక్షలు దాటితే అప్పుడు రెండు ప్రత్యేకమైన అకౌంట్లను క్రియేట్ చేసుకోవాలి. ఒక అకౌంట్లో రూ.2.5 లక్షలు డిపాజిట్ చేస్తారు. ఈ లిమిట్‌కు మించిన డబ్బులు మరో అకౌంట్లో డిపాజిట్ చేయాలి. దీని వల్ల పన్ను లెక్కింపు సులభతరం అవుతుంది. కొత్త పీఎఫ్ నిబంధనలు వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1, 2022 నుంచి అమల్లోకి వస్తాయి. ఏడాదికి రూ.2.5 లక్షలకు మించిన ఉద్యోగుల కంట్రిబ్యూషన్ పీఎఫ్ ఆదాయంపై కొత్త పన్ను విధించేందుకు ఐటీ నిబంధనలకు కొత్త సెక్షన్ 9డీని తీసుకొచ్చింది. (చదవండి: ఓలా, ఒకినావా ఈవీ స్కూటర్ అగ్నిప్రమాదంపై కేంద్రం కీలక నిర్ణయం..!) -
22 కోట్ల ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్‌న్యూస్..!
22.55 కోట్ల మంది ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ అదిరిపోయే శుభవార్త చెప్పింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 8.50 శాతం వడ్డీని పీఎఫ్ ఖాతాలో జమ చేసినట్లు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) తెలిపింది. ఈ మేరకు ఈపీఎఫ్ఓ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొంది. ఈపీఎఫ్ఓ ప్రస్తుతం పీఎఫ్ పెట్టుబడులపై 8.5 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. ఈపీఎఫ్ఓ 2020-21 సంవత్సరానికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సభ్యుల ఖాతాలకు వడ్డీ రేటును అక్టోబర్ 30వ తేదీన ఇచ్చిన సర్క్యులర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్ల కంటే ఎక్కువ విత్ డ్రా ఉన్నందున 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటును రిటైర్ మెంట్ ఫండ్ రెగ్యులేటరీ బాడీ మార్చకుండా ఉంచింది. దేశంలో కరోనావైరస్ వ్యాప్తి తర్వాత ఈపీఎఫ్ఓ మార్చిలో 2019-20 సంవత్సరానికి వడ్డీ రేటును ఏడు సంవత్సరాల కనిష్టస్థాయికి(8.5 శాతం) తగ్గించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీరేటు 8.65 శాతంగా ఉంది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.55 శాతం కాగా, 2016-17 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ ఖాతాదారులకు ఇచ్చిన ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.65 శాతంగా ఉంది. 22.55 crore accounts have been credited with an interest of 8.50% for the FY 2020-21. @LabourMinistry @esichq @PIB_India @byadavbjp @Rameswar_Teli — EPFO (@socialepfo) December 6, 2021 ఆన్లైన్లో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి ఇలా.. ఈపీఎఫ్ పోర్టల్ https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login లింకు మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఖాతా ఓపెన్ చేయడానికి మీ యుఎఎన్ నెంబర్, పాస్ వర్డ్ నమోదు చేయండి. సైన్ ఇన్ చేసిన తర్వాత మీరు మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ ఖాతాదారులు ఒక్క మెస్సేజ్ ద్వారా ఖాతాదారులకు పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. మీ మొబైల్ ద్వారా EPFOHO UAN ENG అని టైప్ చేసి 7738299899కు మీ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి మెస్సేజ్ చేయాలి. పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్, చివరి ఇన్స్టాల్ మెంట్ వివరాలు అందుతాయి. ఈపీఎఫ్ ఖాతాలో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ నుంచి 011-22901406 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. -
అలర్ట్: పీఎఫ్ఓ రూల్స్ మారాయ్, ఈపీఎఫ్ అకౌంట్‌తో రూ.7లక్షల వరకు బెన్ఫిట్స్..!
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఖాతాదారులు ఎలాంటి ప్రీమియం చెల్లించకుండా రూ.7లక్షల వరకు ప్రయోజనం పొందే అవకాశాల్ని కల్పిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ (EDLI) స్కీమ్ లో భాగంగా 1976 సంవత్సారానికి చెందిన ప్రతి ఒక్క ప్రావిడెంట్ ఫండ్ లబ్ధి దారులకు రూ.7 లక్షల వరకు ప్రయోజనం చేకూర్చనున్నట్లు ఈపీఎఫ్ఓ అధికారికంగా ట్వీట్ చేసింది. ఈ ప్రయోజనం కేవలం బీమాకే కాకుండా ఇతర ప్రయోజనాలకు వర్తిస్తాయని ట్వీట్లో పేర్కొంది. బీమా ప్రయోజనాలు ఈపీఎఫ్ ఖాతాదారుడు మరణిస్తే , ఆ ఖాతాదారుడి చట్టపరమైన వారసుడు లేదా నామినీకి రూ. 7 లక్షల వరకు ప్రయోజనాలు చెల్లించబడతాయి. ప్రయోజనాలపై పరిమితి ఏప్రిల్ 2021 నుండి రూ.6 లక్షల నుండి రూ.7 లక్షలకు పెంచబడింది. Salient Features of Employees' Deposit Linked Insurance (EDLI) Scheme, 1976.#EPFO #SocialSecurity #PF #Employees #ईपीएफओ #पीएफ #Services @byadavbjp @Rameswar_Teli @PMOIndia @DDNewslive @airnewsalerts @PIBHindi @PIB_India @MIB_India @mygovindia @PTI_News pic.twitter.com/eV3WCspEp0 — EPFO (@socialepfo) October 17, 2021 కనీస హామీ ప్రయోజనాలు ఈడీఎల్ఐ పథకం 1976 కింద కనీస హామీ ప్రయోజనం కింద ఉద్యోగి మరణించిన తరువాత సంవత్సరం పాటు రూ. 2.5 లక్షలు చెల్లింపు ఉంటుంది. 7 లక్షల వరకు ఉచిత ప్రయోజనాలు ఇక బీమా పథకం ప్రయోజనాలను పొందేందుకు ఉద్యోగులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఈపీఎఫ్, పీఎఫ్ ఖతాదారులకు ఇది ఉచితంగా అందిస్తుంది. ఈ బీమా పథకానికి సంబంధించిన ప్రీమియం యజమాని ద్వారా చెల్లించబడుతుంది. నెలవారీ వేతనంలో 0.50 శాతం రూ. 15,000 పరిమితితో ఉంటుంది. పీఎఫ్ ఖాతాదారు/ఈపీఎఫ్ ఈపీఎఫ్ఓ సభ్యులు ఈ పథకం కింద ప్రయోజనం పొందేందుకు అప్లయ్ చేయాల్సిన అవసరం లేదు. సభ్యులు ఈపీఎఫ్ సభ్యులు లేదా చందాదారులు అయిన తర్వాత ఈడీఎల్ఐ స్కీమ్ ప్రయోజనాలకు అర్హులు. డైరెక్ట్ బ్యాంక్ బదిలీ ఈడీఎల్ఐ పథకం ప్రయోజనాలు నేరుగా నామినీ లేదా ఉద్యోగి యొక్క చట్టపరమైన వారసుని బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడతాయి. ఈపీఎఫ్ ఖాతాదారులు మరణించిన సందర్భంలో ప్రయోజనాలు నేరుగా ఈ బ్యాంక్ ఖాతాకు జమ చేయబడతాయి. అయితే, స్కీమ్ నామినీ లేదా చట్టపరమైన వారసుడు యొక్క ప్రయోజనాల క్లెయిమ్‌లను పొందడానికి ఫారమ్ 51F నింపి, ఈపీఎఫ్ఓకి సమర్పించాల్సి ఉంటుంది. చదవండి: డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్ ఇవే! -
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు కేంద్రం శుభవార్త
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఈపీఎఫ్ఓ అకౌంట్‌ను ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా ఉద్యోగి ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారినప్పుడు ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్‌ను మార్చుకోవాలి. ఈ పద్దతి ఉద్యోగులకు తలకు మించిన భారంగా ఉండేది. అకౌంట్‌ను ట్రాన్స్ఫర్ చేయించుకోవడంతో పాటు డబ్బుల్ని విత్ డ్రాల్ చేసుకోవడం మరింత కష్టతరంగా మారింది. ఇప్పుడు ఆ సమస్యను పరిష్కరిస్తూ కేంద్రం ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) కొత్త మార్గదర్శకాల్నిఅందుబాటులోకి తెచ్చింది. ఆ ప్రొసీజర్ ఫాలో అయితే చాలు సులభంగా ఉద్యోగులు ఈపీఎఫ్ అకౌంట్‌ను మార్చుకోవచ్చు. Know how to transfer EPF online जानिए कैसे करें ईपीएफ ऑनलाइन ट्रांसफर#EPFO #SocialSecurity #HumHainNa pic.twitter.com/x22NiLgMgc — EPFO (@socialepfo) September 5, 2021 అంతకంటే ముందు మీ ఈపీఎఫ్ఓ అకౌంట్‌ను ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మార్చుకునేందుకు ముందు ఈ రూల్స్‌ను పాటించాల్సి ఉంటుంది. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ యాక్టివ్‌గా ఉండాలి. అకౌంట్ హోల్డర్ మునుపటి లేదా ప్రస్తుత సంస్థ EPFOలో డిజిటల్ రిజిస్టర్డ్ సంతకాలు కలిగి ఉండాలి. ఇది కాకుండా బ్యాంక్ కేవైసీ సరిగ్గా ఉందో? లేదో? చెక్ చేసుకోవాలి. ఆ తర్వాతనే అకౌంట్‌ను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అకౌంట్‌ను ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి • ఉద్యోగులు ముందుగా https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ వెబ్ సైట్‌ను ఓపెన్ చేయాలి. • ఓపెన్ చేసి యూఏఎన్(Universal Account Number),పాస్‌వర్డ్‌ను టైప్ చేసి ఎంటర్ బటన్ ను క్లిక్ చేయాలి. • క్లిక్ చేసిన వెంటనే మనకు ఆన్ లైన్ సర్వీస్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌ను క్లిక్ చేసి'వన్ మెంబర్ - వన్ ఈపీఎఫ్ అకౌంట్‌పై క్లిక్ చేసి ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెట్టుకోవాలి • రిక్వెస్ట్ తర్వాత గెట్ డీటెయిల్స్ ఆప్షన్ పై ట్యాప్ చేయాలి. • గెట్ డీటెయిల్స్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు పాత సంస్థ ఈపీఎఫ్ఓ వివరాలు డిస్ ప్లే అవుతాయి. • ఆ తర్వాత ట్రాన్స్ ఫర్ చేసుకునేందుకు ధృవీకరణ ఫారం కోసం మునుపటి సంస్థ లేదా ప్రస్తుత సంస్థ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. • అనంతరం యూఏఎన్ రిజిస్ట్రర్డ్ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. • మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.అలా క్లిక్ చేస్తే చాలు మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ వెరిఫికేషన్ వెళుతుంది. అనంతరం ట్రాన్స్ఫర్ అవుతుంది. చదవండి: హ్యాకర్స్ రూట్ మార్చారు, స్కూల్ పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు -
కరోనా సంక్షోభంలోనూ సానుకూల పురోగతి
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ)లో నికర కొత్త సభ్యత్వ సంఖ్య ఫిబ్రవరిలో దాదాపు 20 శాతం పెరిగి(2020 ఫిబ్రవరిలో కొత్త సభ్యత్వంతో పోల్చితే) 12.5 లక్షలకు చేరింది. కరోనా మహమ్మారి ప్రభావిత అంశాల నేపథ్యంలోనూ సంఘటిత రంగంలో ఉపాధి అవకాశాల సాసుకూల తీరుకు ఇది అద్దం పడుతోంది. కార్మిక మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన పేరోల్స్ లెక్కలు ఈ విషయాన్ని తెలిపాయి. డేటా ప్రకారం, 2021 జనవరితో పోల్చితే ఫిబ్రవరి 2021లో నికర సబ్స్కైబర్ల సంఖ్య 3.52 శాతం పెరిగింది. ఫిబ్రవరి 2021 వరకూ ముగిసిన 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓలో మొత్తం నికర కొత్త సభ్యత్వం మొత్తం 69.58 లక్షలుగా ఉంది. 2018-19లో మొత్తం కొత్త సబ్స్కైబర్ల సంఖ్య 61.12 లక్షలు కాగా, 2018-20లో ఈ సంఖ్య 18.58 లక్షలుగా ఉంది. సంఘటిత, పాక్షిక సంఘటిత రంగాలకు సంబంధించి కార్మికులకు సంబంధించిన సామాజిక భద్రతా భవిష్యత్ నిధులను ఈపీఎఫ్ఓ నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ అరు కోట్లకుపైగా క్రియాశీల సభ్యత్వం కలిగి ఉంది. 2018 ఏప్రిల్ నుంచి కొత్త సబ్‌ఫైబర్ల పేరోల్ డేటాను ఈపీఎఫ్ఓ విడుదల చేస్తోంది. వడ్డీరేటు ఇలా... ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వార్షిక వడ్డీరేటును గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో (2019-20, 2020-21) 8.5 శాతంగా ఉంది. భవిష్యత్తులోనూ అత్యధిక స్థాయిలో రిటర్బ్స్ అందించడానికి తగిన వ్యూహాలను ఈపీఎఫ్ఓ అవలంభిస్తోంది. ఈ దశలో పటిష్టమైన స్థాయిలో రూ.300 కోట్ల మిగులునూ ఈపీఎఫ్ఓ కలిగి ఉంది. 2015-16లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ఈపీఎఫ్ఓ ప్రారంభంచింది. ఈక్విటీ అసెట్స్‌లో తన మొత్తం నిధుల్లో 5 శాతంతో ప్రారంభమైన ఈపీఎఫ్ఓ పెట్టుబడులు, ఫ్రస్తుతం 15 శాతానికి చేరాయి. 2018-19లో ఈపీఎఫ్ఓ చందాదారులకు లభించిన వడ్డీ 8.65 శాతంగా ఉంది. 2019-20కి సంబంధించి వడ్డీరేటును 8.5 శాతానికి తగ్గించింది. కాగా మహమ్మారి కరోనా ప్రభావం, భారీ ఉపసంహరణల నేపథ్యంలో వడ్డీరేటు మరింత తగ్గుతుందన్న అంచనాలకు భిన్నంగా ట్రస్టీల బోర్డ్ 2020-21లోనూ 8.5 శాతంగా వడ్డీరేటు నిర్ణయించింది. డెట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి పొందిన వడ్డీ అలాగే. ఈక్విటీ పెట్టుబడుల నుంచి వచ్చిన ఆదాయ. అంశాలను పరిగణనలోకి. తీసుకుని రిటైర్మెండ్ ఫండ్ వ్యవహారాలను నిర్వహించే- ఈపీఎఫ్ ఓ అత్యున్నత నిర్ణయక విభాగం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) 8.5 శాతం వడ్డీరేటునే కొనసాగించాలని ఇటీవలే నిర్ణయించింది. చదవండి: యూఏఎన్ నంబర్ లేకుండానే పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండిలా? -
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్!
న్యూఢిల్లీ: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త తెలిపింది కేంద్రం. ఉద్యోగులకు పెద్ద ఉపశమనం కలిగించే విధంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో చాలా మంది ఉద్యోగులు కంపెనీ మారే సందర్భంలో ప్రావిడెంట్ ఫండ్ ఖాతాను కొత్త సంస్థకు బదిలీచేయడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కొత్త సంస్థకు పీఎఫ్ డబ్బులు బదిలీ చేయాలంటే తప్పని సరిగా పాత కంపెనీలో చివరి తేదీని నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ కంపెనీలు కావాలనే ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా ఈపీఎఫ్ఓ ఖాతాదారులు కంపెనీ మారినప్పుడు వారే స్వయంగా పాత కంపెనీలో పని చేసిన చివరి తేదీని ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో అప్డేట్ చేసుకునే అవకాశం అందుబాటులోకి తీసుకొచ్చింది. పాత కంపెనీలో జాబ్ మానేసి వెళ్లిపోయిన రెండు నెలల తర్వాతే ఎగ్జిట్ డేట్ వివరాలు ఆప్డేట్ చేసుకోవడం సాధ్యం అవుతుంది. ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో అప్డేట్ చేసుకునే విధానం: దశ 1: ఉద్యోగులు ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో తమ యూఏఎన్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. దశ 2: ‘మేనేజ్’ ఆప్షన్లో కనిపించే ‘మార్క్ ఎగ్జిట్’ మీద క్లిక్ చేయాలి. దశ 3: మీ పాత పిఎఫ్ ఖాతాను ఎంచుకోవాలి. దశ 4: గతంలో పనిచేసిన కంపెనీలో ఉద్యోగం మానేయడానిక గల కారణాన్ని, చివరిగా పని చేసిన తేదీని నమోదు చేయాలి. దశ 5: ‘రిక్వెస్ట్ ఓటీపీ’ మీద క్లిక్ చేస్తే ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని చెక్ బాక్స్‌లో అప్డేట్ చేయాలి. దశ 6: ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే క్లోజింగ్ డేట్ ప్రక్రియ పూర్తవుతుంది. చదవండి: ఆధార్ యూజర్లకు ముఖ్య గమనిక! త్వరలో ఇండియాలోకి క్రిప్టోకరెన్సీ -
ఈపీఎఫ్ వడ్డీరేటు 8.65 శాతం
న్యూఢిల్లీ : ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్) చందాదారులందరికీ శుభవార్త. 2018– 19 ఆర్థిక సంవత్సరానికిగాను ఈపీఎఫ్ చందాదారులకు చెల్లించాల్సిన వడ్డీని 8.65 శాతం చొప్పున ఈ పండగ సీజన్‌కు ముందే చెల్లించనున్నట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం జాతీయ భద్రతా అవార్డుల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2017–18 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ ఖాతాల్లోని మొత్తాలపై 8.55 శాతం వడ్డీ చెల్లించారు. 2018–19 సంవత్సరానికి ఈ వడ్డీరేటును 8.65 శాతానికి పెంచాలని ఈపీఎఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. కాగా ఈపీఎఫ్ చందాదారులకు చెల్లించే వడ్డీని 8.65 శాతానికి పెంచనున్నామని గంగ్వార్ కొద్ది రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఆ డేటాతో మోదీ సర్కార్‌కు ఊరట..
సాక్షి, న్యూఢిల్లీ : ఉపాధి కల్పనలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ఘోరంగా విఫలమైందని విపక్షాలు చేస్తున్న ముప్పేట దాడి నుంచి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలమైన గణాంకాలు అందివచ్చాయి. సార్వత్రిక ఎన్నికల ముంగిట్లో మోదీ సర్కార్‌కు ఊరట ఇచ్చేలా ఉద్యోగ గణాంకాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది జనవరిలో ఏకంగా 9 లక్షల కొత్త ఉద్యోగాలు పలు రంగాల్లో సమకూరాయని ఈపీఎఫ్ఓ పేరోల్ డేటా తెలిపింది. జనవరిలో లభించిన కొలువులు గత ఏడాది అదే నెలతో పోలిస్తే 131 శాతం అధికం కావడం గమనార్హం. అంతకుముందు ఏడాది ఇదే నెలలో కొత్తగా 3.87 లక్షల మంది ఉద్యోగ భవిష్యనిధి చందాదారులుగా చేరినట్టు ఈ గణాంకాలు వెల్లడించాయి. ఇక 2017 సెప్టెంబర్‌లో 2,75,609 నికర ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. సెప్టెంబర్ 2017 నుంచి ఈ ఏడాది జనవరి వరకూ 76.48 లక్షల మంది చందాదారులు ఈపీఎఫ్ఓలో చేరినట్టు గణాంకాలు పేర్కొన్నాయి. గత 17 నెలల్లో సంఘటిత రంగంలో ఈ ఉద్యోగాలు సమకూరినట్టు ఈ డేటా ద్వారా వెల్లడవుతోంది. మరోవైపు ఈ ఏడాది జనవరిలో ఏకంగా 9 లక్షల మంది ఉద్యోగులు 17 నెలల గరిష్ట స్ధాయిలో ఈపీఎఫ్ఓ చందాదారులుగా నమోదవడం గమనార్హం. -
పీఎఫ్ ట్రాన్స్ఫర్ : ఉద్యోగులకు శుభవార్త
సాక్షి, న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ బదిలీ విషయలోఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు శుభవార్త. ఇకపై మీరు ఉద్యోగం మారిన ప్రతీసారీ ఈపీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేందుకు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఉద్యోగం మారిన వెంటనే.. ఆటోమెటిక్‌గా ట్రాన్స్ఫర్ అయ్యే సదుపాయం త్వరలోనే అందుబాటులోకి రానుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ తాజా సదుపాయం అమలులోకి రానుంది. పైలట్ ప్రాతిపదికన ఈపీఎఫ్ ట్రాన్స్ఫర్ ఆటోమేషన్‌ను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. ఈపీఎఫ్‌వోను డిజిటల్ సంస్థగా మార్చే క్రమంలో ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నారు. కొత్త సంస్థలో చేరిన తర్వాత ఈపీఎఫ్ ప్రక్రియ మొదలుకాగానే యూఏఎన్ నెంబర్ ఆధారంగా పాత ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్, వడ్డీ ఆటోమెటిక్గాబదిలీ అవుతాయి. దీని వల్ల గత సంస్థలో పనిచేసిన పదవీకాలంలో పొందిన ప్రయోజనాలన్నీ కొనసాగుతాయని కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ తాజా వెల్లడించింది. వచ్చే ఏడాదిలో ఎప్పుడైనా మొత్తం ఖాతాదారులందరికీ ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవాలని భావిస్తున్నట్లు సీనియర్ కార్మిక శాఖ అధికారి ఒకరు చెప్పారు. -
తగ్గనున్న ఈపీఎఫ్.. పెరగనున్న వేతనాలు
న్యూఢిల్లీ : టేక్-హోమ్ శాలరీ చాలా తక్కువగా వస్తోందని బాధపడుతున్నారా? అయితే ఇక ఆ దిగులును ప్రభుత్వం కాస్త తగ్గించబోతుంది. ఉద్యోగుల టేక్-హోమ్ శాలరీని పెంచాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. దీని కోసం ఉద్యోగుల వేతనాల్లోంచి తీసుకునే సామాజిక భద్రత సహకారం(సోషల్ సెక్యురిటీ కాంట్రిబ్యూషన్)ను తగ్గించేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తోంది. దేశంలో ఉన్న ఉద్యోగులందరికీ ఒకే విధమైన సామాజిక భద్రత సహకారం ఉండేలా కార్మిక మంత్రిత్వ శాఖ కమిటీ పనిచేస్తుందని.. ప్రస్తుతమున్న సీలింగ్ 24 శాతాన్ని, 2 శాతం తగ్గించాలని ప్రభుత్వం ప్రతిపాదనలను తయారు చేస్తుందని ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగుల సహకారం కింద వారి బేసిక్ వేతనం నుంచి 12 శాతాన్ని ఈపీఎఫ్‌కి అందిస్తున్నారు. అంతేకాక ఆర్గనైజేషన్స్ కూడా ఉద్యోగుల బేసిక్ వేతనం నుంచి 3.67 శాతాన్ని తమ సహకారం కింద ఈపీఎఫ్‌లో క్రెడిట్ చేస్తున్నాయి. ఈపీఎస్ లేదా ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ కింద 8.33 శాతం మైనస్ అవుతుంది. ఇవన్నీ కలిపి మొత్తంగా 24 శాతం ఉద్యోగుల బేసిక్ వేతనం నుంచి కట్ అవుతుంది. తాజాగా ఉద్యోగుల ఈపీఎఫ్ సహకారాన్ని 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం చూస్తోంది. దీంతో ఉద్యోగుల టేక్-హోమ్ శాలరీ పెరగబోతుంది. ప్రస్తుతం 20 మంది కంటే తక్కువ ఉద్యోగులున్న సంస్థలకు కేవలం 10 శాతం మాత్రమే ఈపీఎఫ్ సహకారం ఉంది. ఇదే విధానాన్ని అన్ని ఆర్గనైజేషన్లకు అమలు చేయాలని ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు రూపొందిస్తోంది. దీంతో 10 కోట్ల మంది ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్లకు లబ్ది చేకూరనుంది. ఒక్కసారి కార్మిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ ఈ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఆ మంత్రిత్వ శాఖ వాటాదారులతో సంప్రదింపులు జరుపుతుంది. ప్రస్తుతం సామాజిక భద్రత స్కీమ్ కింద 10 కోట్ల మంది ఉద్యోగులున్నారు. వీరిని 5 రెట్లు అంటే 50 కోట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సామాజిక భద్రత సహకారం తగ్గితే, ఇటు ఉద్యోగులు, అటు ఆర్గనైజేషన్లకు రెండింటికీ ప్రయోజనం చేకూరనుందని ప్రభుత్వ అధికారులు చెప్పారు. -
ఈపీఎఫ్ఓ సభ్యులకు 50వేల రూపాయలు
న్యూఢిల్లీ : రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్ఓ తన సబ్స్క్రైబర్లకు లోయల్టి కమ్ లైఫ్ బెనిఫిట్ ను ప్రకటించింది. దీని కింద రిటైర్మెంట్ సమయంలో 50వేల రూపాయల వరకు అందించనున్నట్టు తెలిపింది. అయితే ఈ స్కీమ్ లో 20 ఏళ్లపాటు ఫండ్ ను కంట్రిబ్యూట్ చేసి ఉండాల్సి ఉంటుంది. దివ్యాంగులైతే 20 కంటే తక్కువ ఏళ్లు ఫండ్ కంట్రిబ్యూట్ చేసినప్పటికీ 50 వేల రూపాయల బెనిఫిట్ ను అందించాలని ఈపీఎఫ్ఓ బోర్డు నిర్ణయించింది. చనిపోయిన సబ్స్క్రైబర్లకు కనీసం రూ.2.5 లక్షల మొత్తాన్ని ఇవ్వాలని ఈపీఎఫ్ఓ అత్యున్నత నిర్ణయ విభాగం, ట్రస్టీల కేంద్ర బోర్డు నిర్ణయించినట్టు తెలిసింది. ప్రభుత్వ ఆమోదం అనంతరం ఈ ప్రయోజనాలను తమ సభ్యులకు అందుబాటులో ఉంచనుంది. ఈ ప్రతిపాదన ప్రకారం 20 ఏళ్ల పాటు స్కీమ్ లో కంట్రిబ్యూట్ చేసిన పదవి విరమణ చేసే సభ్యులందరికీ ఈ లోయల్టి-కమ్-బెనిఫిట్స్ ను అందుబాటులో ఉంచుతామని సీనియర్ అధికారులు చెప్పారు. బేసిక్ వేతనం 5వేల రూపాయల వరకు ఉన్నవారికి 30వేల రూపాయల బెనిఫిట్ ను, 5001-10000 రూపాయల వేతనం ఉన్న వారికి 40వేల రూపాయల బెనిఫిట్ ను ఈపీఎఫ్ఓ అందించనుంది. 10వేల కంటే ఎక్కువ వేతనం ఉన్నవారు 50వేల రూపాయల బెనిఫిట్ కు అర్హులని ఈపీఎఫ్ఓ ప్రకటించింది. -
పీఎఫ్ చందాదారులకు చౌక ధరల్లో గృహాలు!
మెగా హౌసింగ్ స్కీమ్‌పై కేంద్రం కసరత్తు న్యూఢిల్లీ: పీఎఫ్ చందాదారులకు చౌకధరల్లో ఇళ్లు అందించే మెగా హౌసింగ్ స్కీమ్‌ను కార్మిక మంత్రిత్వ శాఖ సిద్ధం చేస్తోంది. ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ)లోని 5 కోట్ల మంది చందాదారులకు అందుబాటు ధరల్లో గృహాలను అందించడం కోసం ఈ స్కీమ్‌ను రూపొందిస్తున్నారని సమాచారం. 2022 నాటికి అందరికీ ఇళ్లు అనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా కార్మిక శాఖ ఈ ప్రయత్నాలు చేస్తోంది. ఈపీఎఫ్ఓ తన చందాదారుల కోసం అందుబాటు ధరల్లో గృహాలను నిర్మించాలని, ఈపీఎఫ్ఓ నిధులను ఇందుకోసం వినియోగించాలని ఇటీవలనే ప్రధాని కార్యాలయం ఈపీఎఫ్ఓను కోరింది. ఈపీఎఫ్ఓ నిధుల్లో 15 శాతాన్ని అందుబాటు ధరల్లో గృహా రుణాల కోసం కేటాయిస్తే, రూ.70,000 కోట్ల రుణాలను, 3.5 లక్షల అదనపు చౌక-ధర గృహాలను అందించవచ్చని అంచనా. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ రూ.6.5 లక్షల కోట్ల నిధులను నిర్వహిస్తోంది. ప్రతీ ఏటా ఉపాంత డిపాజిట్లు రూ.70,000 కోట్ల మేర పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఈపీఎఫ్ఓలో నెలకు రూ.15,000 మూల వేతనం కంటే త క్కువగా ఆర్జించేవారి సంఖ్య 70% ఉంది. ఈ మెగా హౌసింగ్ స్కీమ్ కోసం ఆర్ధిక సంస్థలు తక్కువ వడ్డీరేట్లకే రుణాలిచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్కీమ్ ఎలా ఉండొచ్చు.. ఈ స్కీమ్ కోసం ప్రభుత్వ రంగ బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఎన్బీసీసీ వంటి ప్రభుత్వ నిర్మాణ రంగ కంపెనీలు, డీడీఏ, పుడా, హుడా వంటి సంస్థలతో కలసి పనిచేయాలని కార్మిక శాఖ యోచిస్తోంది. తక్కువ ఆదాయ వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని కార్మిక శాఖ ఈ స్కీమ్‌ను రూపొందిస్తోంది. ఇంటి ధరలో కొంత మొత్తాన్ని చెల్లించడానికి పీఎఫ్ డిపాజిట్లను విత్‌డ్రా చేసుకోవడానికి చందాదారులను అనుమతించవచ్చు. తక్కువ ఆదాయ వర్గాలకు సబ్సిడీలను కూడా అందించే అవకాశాలున్నాయి. సదరు స్కీమ్ కోసం ఈపీఎఫ్ఓ చందాదారులను-తక్కువ ఆదాయం, మధ్య ఆదాయం, అధిక ఆదాయం... ఇలా మూడు కేటగిరీలుగా వర్గీకరిస్తారు. ఇళ్లు, ఇతర ప్రోత్సాహాకాలను ఈ ఆదాయాలను బట్టి అందిస్తారు. సభ్యులు తమ పీఎఫ్ అకౌంట్ల ద్వారానే గృహ రుణాల ఈఎంఐల ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.