ఉద్యోగులకు శుభవార్త.. మారిన ఈపీఎఫ్​ఓ రూల్స్​..అవేంటో తెలుసా? | Epfo New Rule That Will Come Into Effect From April 1 | Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు శుభవార్త.. మారిన ఈపీఎఫ్​ఓ రూల్స్​..అవేంటో తెలుసా?

Published Mon, Apr 1 2024 3:00 PM | Last Updated on Mon, Apr 1 2024 3:53 PM

Epfo New Rule That Will Come Into Effect From April 1 - Sakshi

ఏప్రిల్‌ 1 నుంచి 2024-25 కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్‌ అభివృద్ధి నినాదంతో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు.అయితే ఆ బడ్జెట్‌ ప్రవేశ పెట్టే సమయంలో పలు ఆర్ధిక పరమైన అంశాల్లో చేసిన మార్పులు ప్రకటించారు. ఆ మార్పులు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. 

సేవింగ్‌ స్కీమ్స్‌ (ఎన్‌పీఎస్‌ అండ్‌ ఈపీఎఫ్‌ఓ), ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌, ఫాస్టాగ్‌లు ఇలా మీ ఆర్థిక స్థితిని ప్రభావితం చేసే పలు అంశాలు ఉన్నాయి. కాబట్టి వాటి గురించి ముందే తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని ఆర్ధిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  

కొత్త ఈపీఎఫ్‌ రూల్స్‌ 
ఏప్రిల్‌ 1 నుంచి ఈపీఎఫ్‌ఓలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ రూల్స్‌తో  ఉద్యోగులు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారే సమయంలో ఈపీఎఫ్‌ఓ ట్రాన్స్‌ఫర్‌ వంటి విషయాల్లో మరింత సులభతరం అయ్యింది. ఈపీఎఫ్‌ఓ అకౌంట్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయాలంటే ఉద్యోగులు  స్వయంగా డాక్యుమెంట్లు అందజేయడం, సంతకాలు చేసే పనిలేకుండా మ్యాన్యువల్‌గా ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. అయితే ఈ బదిలీపై పూర్తి సమాచారం ఈపీఎఫ్‌ఓ నుంచి రావాల్సి ఉంది. ఉద్యోగం మారినపుడు అకౌంట్ బ్యాలెన్స్ మాత్రమే ట్రాన్స్‌ఫర్ చేస్తారా? లేక సదరు అకౌంట్ వడ్డీ కూడా జమ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.
   
ఎన్‌పీఎస్‌: టూ ఫ్యాక్టర్‌ అథంటికేషన్‌ 
ఏప్రిల్ 1, 2024 నుండి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ(pfrda) ప్రభుత్వ రంగ సంస్థ పదవి విరమణ అనంతరం లబ్ధిదారులు  నెలవారి పెన్షన్‌ను అందించేందుకు సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ (cra) పేరుతో వెబ్‌ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే, రోజురోజుకి పెరిగిపోతున్న టెక్నాలజీ వినియోగంతో సైబర్‌ నేరాల నుంచి రక్షణ పొందేలా పెన్షన్‌ దారులకోసం పీఎఫ్‌ఆర్‌డీఏ ఆథార్‌ నెంబర్‌తో టూ ఫ్యాక్టర్‌ అథంటికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది.  

 లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ 
మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశ పెట్టే సమయంలో నిర్మలా సీతారామన్‌ చేసిన ప్రకటనల్లో లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ పన్ను మినహాయింపు అంశం తెరపైకి వచ్చింది. 2022 వరకు లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ పన్ను మినహాయింపు రూ.3 లక్షలకు ఉండేది. ఇప్పుడు దానిని రూ.25లక్షలకు పెంచుతున్నట్లు ప్రతిపాదించారు. పదవీ విరమణ చెందుతున్న ప్రభుత్వేతర సంస్థల్లోని ఉద్యోగుల లీవ్ ఎన్ క్యాష్ మెంట్‌పై పన్ను మినహాయింపును రూ.25 లక్షలకు పెంచడంతో వేతన జీవులకు ఏడాదికి రూ.20 వేల వరకు లబ్ధి చేకూరనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement