ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో సభ్యులు భారీగా పెరిగారు. 2023 నవంబర్‌లో నికరంగా 13.95 లక్షల మంది సభ్యులను చేర్చుకున్నట్లు ఈపీఎఫ్‌వో తాజాగా విడుదల చేసిన తాత్కాలిక పేరోల్ డేటా ద్వారా వెల్లడించింది. ఇది మునుపటి ఏడాదిఇదే కాలంలో చేరికల కంటే ఎక్కువని తెలుస్తోంది.
7.36 లక్షల మంది కొత్తవారు
2023 నవంబర్‌లో దాదాపు 7.36 లక్షల మంది కొత్త సభ్యులు నమోదు చేసుకున్నారని ఈపీఎఫ్‌వో డేటా సూచిస్తోంది. కొత్తగా చేరిన సభ్యులలో 18-25 సంవత్సరాల వయస్సు గలవారు 57.30 శాతం మంది ఉన్నారు. అంటే పెద్ద సంఖ్యలో శ్రామిక శక్తి సంఘటిత రంగంలో ప్రవేశించింది. సుమారు 10.67 లక్షల మంది సభ్యులు నిష్క్రమించినా మళ్లీ ఈపీఎఫ్‌వోలో చేరినట్లు పేరోల్ డేటా ప్రతిబింబిస్తోంది.
1.94 లక్షల మంది మహిళలు
జెండర్‌వారీగా పేరోల్ డేటాను పరిశీలిస్తే 2023 నవంబర్‌లో చేరిన మొత్తం 7.36 లక్షల మంది కొత్త సభ్యులలో దాదాపు 1.94 లక్షల మంది మహిళలు ఉన్నారు. అలాగే ఆ నెలలో నికరంగా మహిళా సభ్యుల చేరిక దాదాపు 2.80 లక్షలకు చేరుకుంది. నికర చందాదారుల చేరికలో నికర మహిళా సభ్యుల శాతం 20.05 శాతంగా ఉంది. ఇది 2023 సెప్టెంబరు కంటే అధికం. సంఘటిత రంగ శ్రామిక శక్తిలో మహిళా ఉద్యోగుల భాగస్వామ్యాన్ని ఇది తెలియజేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment