How To Upload Profile Picture In Epfo UAN Portal In Telugu - Sakshi
Sakshi News home page

Upload Profile Pic In EPFO: ఈపీఎఫ్‌ఓలో ఫోటో ఎలా అప్‌లోడ్‌ చేయాలో తెలుసా? లేదంటే డబ్బులు రావు!

Published Mon, May 23 2022 4:51 PM | Last Updated on Mon, May 23 2022 6:39 PM

How To Upload Profile Picture In Epfo - Sakshi

ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు ముఖ్య గమనిక. ఈపీఎఫ్‌ఓ నుంచి డబ్బులు డ్రా చేయాలని అనుకుంటున్నారా? అయితే మీరు తప్పని సరిగా ఈ- నామినేషన్‌ను ఫిల్‌ చేయాల్సి ఉంటుంది. ఈ నామినేషన్‌ ఫిల్‌ చేయకపోతే డబ్బులు డ్రా చేయలేం. కాబట్టి ఖాతాదారులు ఈ-నామినేషన్‌ ఫైల్‌ చేయాలని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. 

అయితే ఈ-నామినేషన్‌ ఫైలింగ్‌ చేస్తున్నా..కంప్లీట్‌ కావడం లేదంటే మీరు మీ అకౌంట్‌ ఫ్రొఫైల్‌ను అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. ఫ్రొఫైల్‌ అప్‌డేట్‌ చేయకపోతే ఈ- నామినేషన్‌ పూర్తి చేయలేమనే విషయాల్ని తప్పని సరిగా గుర్తుంచుకోవాలి. 

ప్రొఫెల్‌ పిక్చర్‌ ఎలా యాడ్‌ చేయాలంటే!

ఈ - నామినేషన్‌ ఫైలింగ్‌కు ముందు అకౌంట్‌ ప్రొఫైల్‌ పిక్చర్‌ అప్‌డేట్‌ కోసం కొన్ని పద్దతుల్ని పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

స్టెప్‌1: ముందుగా యూఏఎన్‌ మెంబర్‌ ఐడీతో ఈపీఎఫ్‌ఓ అఫీషియల్‌ పోర్టల్‌లో లాగిన్‌ అవ్వాల్సి ఉంటుంది


సెప్ట్‌2: ఆ తర్వాత మెన్యూ సెక్షన్‌లో క్లిక్‌ చేస్తే ప్రొఫైల్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. 

స్టెప్‌3: ప్రొఫైల్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేసి వ్యక్తిగత వివరాల్ని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. మీకు లెప్ట్‌ సైడ్‌లో ప్రొఫైల్‌ ఫోటో ఆప్షన్‌ కనిపిస్తుంది. క్లిక్ చేసి ఫోటోను ఛేంజ్‌ చేయడం లేదంటే, అప్‌లోడ్‌ చేయాలి. 

స్టెప్‌4:ప్రొఫైల్‌ ఇమేజ్‌ మీద క్లిక్‌ చేసి ఈపీఎఫ్‌ఓలో మీ ఫోటో అప్‌లోడ్‌ చేయాలి.

 

స్టెప్‌5: ఫోటో అప్‌లోడ్‌ అవ్వాలంటే మీ పాస్‌ పోర్ట్‌ ఫోటో సైజ్‌ 3.5సెంటీమీటర్లు* 4.5 సెంటీమీటర్లు ఉండేలా చూసుకోవాలి.  

స్టెప్‌6: మన రెండు చెవులు కనిపించేలా ఫోటో విజబుల్‌ 80శాతం ఉండేలా చూసుకోవాలి. 

స్టెప్‌7: ఆ ఫోటో ఇమేజ్‌ జేపీఈజీ,జేపీజీ,పీఎన్‌జీ ఫార్మాట్‌లో సేవ్‌ చేయాలి. 

స్టెప్‌8: ఆ తర్వాత అప్‌లోడ్‌ యువర్‌ ఫోటో మీద క్లిక్‌ చేసి ఓకే అనే ఆప్షన్‌ పై ట్యాప్‌ చేయాలి. 

దీంతో మీ ఫోటో అప్‌లోడ్‌ అవుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement