నెలరోజుల్లో 13.41 లక్షల మందికి ఉపాధి | In October 2024 EPFO saw a net addition of 13.4 million members | Sakshi
Sakshi News home page

నెలరోజుల్లో 13.41 లక్షల మందికి ఉపాధి

Dec 27 2024 12:02 PM | Updated on Dec 27 2024 12:51 PM

In October 2024 EPFO saw a net addition of 13.4 million members

సంఘటిత రంగంలో అక్టోబర్‌లో 13.41 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO)లో ఈ మేరకు కొత్తగా పేర్లను నమోదు చేసుకున్నారు. కేంద్ర కార్మిక శాఖ అక్టోబర్‌ నెలకు సంబంధించి గణాంకాలను విడుదల చేసింది. ఈ నివేదిక ఆధారంగా చూస్తే.. ఈపీఎఫ్‌వోలో అక్టోబర్‌లో చేరిన నికర కొత్త సభ్యులు 7.50 లక్షలుగా ఉన్నారు. అంటే మిగిలిన వారు ఒక సంస్థలో మానేసి, మరో సంస్థలో ఉపాధి అవకాశాలు పొందిన వారు. ఉపాధి అవకాశాల వృద్ధిని, ఉద్యోగుల ప్రయోజనాలపై పెరుగుతున్న అవగాహనను ఈ గణాంకాలు తెలియజేస్తున్నట్టు కార్మిక శాఖ తెలిపింది.

ఇదీ చదవండి: ఆర్థిక దార్శనికుడు.. మన్మోహనుడు

  • అక్టోబర్‌లో కొత్త సభ్యుల్లో 58 శాతం 18–25 ఏళ్ల వయసులోని వారే. అంటే సంఘటిత రంగంలో వీరు కొత్తగా ఉపాధి అవకాశాలు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది.

  • కొత్త సభ్యుల్లో 2.09 లక్షల మంది మహిళా సభ్యులు కావడం గమనార్హం. క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 2 శాతం పెరిగింది.

  • కొత్త సభ్యుల్లో 61 శాతం మంది ఐదు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఉన్నారు.  

  • మహారాష్ట్ర నుంచి 22 శాతం మంది చేరగా, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, హర్యానా, తెలంగాణ(Telangana), గుజరాత్‌ నుంచి (విడిగా) 5 శాతానికి పైగా సభ్యుల చేరిక ఉంది.

  • రోడ్డు మోటారు రవాణా, ఎల్రక్టానిక్‌ మీడియా కంపెనీలు, బ్యాంక్‌లు (జాతీయ బ్యాంక్‌లు కాకుండా) అక్టోబర్‌లో ఎక్కువ మందికి ఉపాధి కల్పించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement