EPFO oniline
-
నెలరోజుల్లో 13.41 లక్షల మందికి ఉపాధి
సంఘటిత రంగంలో అక్టోబర్‌లో 13.41 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO)లో ఈ మేరకు కొత్తగా పేర్లను నమోదు చేసుకున్నారు. కేంద్ర కార్మిక శాఖ అక్టోబర్ నెలకు సంబంధించి గణాంకాలను విడుదల చేసింది. ఈ నివేదిక ఆధారంగా చూస్తే.. ఈపీఎఫ్‌వోలో అక్టోబర్‌లో చేరిన నికర కొత్త సభ్యులు 7.50 లక్షలుగా ఉన్నారు. అంటే మిగిలిన వారు ఒక సంస్థలో మానేసి, మరో సంస్థలో ఉపాధి అవకాశాలు పొందిన వారు. ఉపాధి అవకాశాల వృద్ధిని, ఉద్యోగుల ప్రయోజనాలపై పెరుగుతున్న అవగాహనను ఈ గణాంకాలు తెలియజేస్తున్నట్టు కార్మిక శాఖ తెలిపింది.ఇదీ చదవండి: ఆర్థిక దార్శనికుడు.. మన్మోహనుడుఅక్టోబర్లో కొత్త సభ్యుల్లో 58 శాతం 18–25 ఏళ్ల వయసులోని వారే. అంటే సంఘటిత రంగంలో వీరు కొత్తగా ఉపాధి అవకాశాలు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది.కొత్త సభ్యుల్లో 2.09 లక్షల మంది మహిళా సభ్యులు కావడం గమనార్హం. క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 2 శాతం పెరిగింది.కొత్త సభ్యుల్లో 61 శాతం మంది ఐదు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఉన్నారు. మహారాష్ట్ర నుంచి 22 శాతం మంది చేరగా, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, హర్యానా, తెలంగాణ(Telangana), గుజరాత్ నుంచి (విడిగా) 5 శాతానికి పైగా సభ్యుల చేరిక ఉంది.రోడ్డు మోటారు రవాణా, ఎల్రక్టానిక్ మీడియా కంపెనీలు, బ్యాంక్‌లు (జాతీయ బ్యాంక్‌లు కాకుండా) అక్టోబర్‌లో ఎక్కువ మందికి ఉపాధి కల్పించాయి. -
ఈపీఎఫ్ అకౌంట్లో తప్పులున్నాయా? ఇలా సులభంగా మార్చుకోండి..
సాధారణంగా ఉద్యోగం చేసేవారికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అకౌంట్ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ అకౌంట్ వివరాల్లో ఏవైనా తప్పులు ఉండే అవకాశం ఉంటుంది. గతంలో ఉద్యోగులు తమ జాయింట్ డిక్లరేషన్ ఫారంను నింపి, దానిని ఈపీఎఫ్ఓ కార్యాలయంలో ఇచ్చేవారు. ఇప్పుడు ఏవైనా మార్పులు చేసుకోవాలనుంటే.. ఫిజికల్ ఫారమ్‌తో పనిలేకుండా.. ఆన్లైన్లో మార్చుకోవచ్చు. ఈ కథనంలో ఈపీఎఫ్ చందాదారులు ఆన్లైన్లో తమకు చెందిన 11 వ్యక్తిగత వివరాలను ఎలా మార్చుకోవాలో వివరంగా తెలుసుకుందాం.ఆన్లైన్లో మార్చుకోగలిన 11 వ్యక్తిగత వివరాలుపేరుజెండర్పుట్టిన తేదీతండ్రి / తల్లి పేరురిలేషన్షిప్వైవాహిక స్థితిజాయినింగ్ డేట్రీజన్ ఫర్ క్విట్టింగ్ డేట్ ఆఫ్ క్విట్టింగ్నేషనాలిటీఆధార్ఆన్లైన్లో ఎలా మార్చుకోవాలంటే?👉ఉద్యోగి ముందుగా ఈపీఎఫ్ఓ అధికారికి వెబ్సైట్ ఓపెన్ చేయాలి👉హోమ్ పేజీలో మొదట కనిపించే 'సర్వీస్' ట్యాబ్ మీద క్లిక్ చేసిన తరువాత 'ఫర్ ఎంప్లాయిస్' అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.👉ఆ తరువాత సర్వీస్ సెక్షన్ కింద కనిపించే 'మెంబర్ యూఏఎన్ / ఆన్లైన్ సర్వీస్' ఆప్షన్స్ మీద క్లిక్ చేయాలి.👉ఆలా క్లిక్ చేయగానే మీకు ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.👉కొత్త పేజీలో కుడివైపు కనిపించే బాక్సులలో 'యూఏఎన్, పాస్వర్డ్, క్యాప్చా' వంటి వివరాలు ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. 👉ఇవన్నీ పూర్తి చేసిన తరువాత అసలైన ఈపీఎఫ్ఓ అకౌంట్ పేజీ ఓపెన్ అవుతుంది.👉ఈపీఎఫ్ఓ అకౌంట్ పేజీ ఓపెన్ అయినా తరువాత స్క్రీన్ మీద కనిపించే.. 'మేనేజ్' ఆప్షన్ ఎంచుకోవాలి. ఇక్కడ జాయింట్ డిక్లరేషన్ ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మీ మెంబర్ ఐడీ ఎంటర్ చేసిన తరువాత.. ఏదైతే అప్డేట్ చేయాలనుకుంటున్నారో.. వాటిని ఎంటర్ చేసుకోవాలి.👉అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తరువాత సబ్మిట్ చేయాలి.👉అన్ని సరిగ్గా అప్లోడ్ చేసి సబ్మిట్ చేసిన తరువాత రిక్వెస్ట్ యాక్సెప్ట్ అవుతుంది. ఆ తరువాత వివరాలు మీకు అందుతాయి.ఎంప్లాయర్ చేయాల్సింది..👉ఎంప్లాయ్ వివరాలను అందుకున్న తరువాత ఎంప్లాయర్.. ఈపీఎఫ్ఓ అధికారికి వెబ్సైట్లో ఎంప్లాయర్ ఐడీతో ఎంటర్ అవ్వాలి. 👉మెంబర్ ట్యాబ్ మీద క్లిక్ చేసి.. జాయింట్ డిక్లరేషన్ చేంజ్ రిక్వెస్ట్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.👉ఉద్యోగి అభ్యర్థను చెక్ చేసిన తరువాత ఎంప్లాయర్ అంగీకరించవచ్చు, తిరస్కరించవచ్చు.👉ఎంప్లాయర్ ఉద్యోగి రిక్వెస్ట్ అంగీకరిస్తే.. అది ఈపీఎఫ్ఓకు చేరుతుంది. -
EPFO update: 6 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త!
ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త. త్వరలో ఈపీఎఫ్ మంథ్లీ పెన్షన్ లబ్ధిదారులు తీసుకునే నెలవారీ పెన్షన్ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇది కేంద్రం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఎంప్లాయి పెన్షన్ స్కీమ్-1995 (ఈపీఎస్) కమిటీ కేంద్ర కార్మిక శాఖకు లేఖ రాసింది. పీఎఫ్ లబ్ధిదారులకు నెలనెలా ఇచ్చే పెన్షన్ రూ.1000 నుంచి రూ.7,500కు పెంచాలని డిమాండ్ చేసింది. ఆ లేఖపై 15రోజుల్లో వివరణ ఇవ్వాలని తెలిపింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌కు రాసిన లేఖలో పీఎఫ్ లబ్ధి దారులకు ప్రస్తుతం చెల్లించే నెలవారీ పెన్షన్ సరిపోవడం లేదని, అనారోగ్యం వస్తే చికిత్స చేయించుకునేందుకు డబ్బులు లేక కొన్ని సార్లు ప్రాణాల్ని పణంగా పెడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి భూపేందర్ యాదవ్‌కు రాసిన లేఖలో15 రోజుల్లోగా తమ డిమాండ్లపై కేంద్రం సానుకూల ప్రకటన చేయాలని నేషనల్ ఎజిటేషన్ కమిటీ కోరింది. లేదంటే రైళ్లు, రోడ్లు నిర్భందిస్తామని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించింది. సుప్రీం కోర్ట్ తీర్పు దీంతో పాటు సుప్రీం కోర్ట్ అక్టోబర్ 4, 2016, నవంబర్ 4,2022లలో ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా వాస్తవ జీతంపై పెన్షన్ చెల్లించాలని కూడా కోరింది. బేసిక్ శాలరీ రూ.15వేల మించిపోయిన ఉద్యోగులు ఈ ఎంప్లాయి పెన్షన్‌స్కీమ్ (ఈపీఎస్)కు అనర్హులు. తాజాగా బేసిక్ శాలరీ రూ.15వేలు, అంతకన్నా ఎక్కువ ఉన్నా ఈపీఎస్-95 స్కీమ్‌కు కంట్రిబ్యూట్ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఆదేశించింది. 6 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త? ఎంప్లాయి పెన్షన్ స్కీమ్ 1995 లేదా ఈపీఎఫ్ -95ని రిటైర్మెంట్ ఫండ్ బాడీ నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఇందులో 6కోట్లకు పైగా ఖాతాదారులున్నారు. వారిలో 75 లక్షల మంది ప్రతి నెల పెన్షన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈపీఎస్ కమిటీ రాసిన లేఖపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తే 6 కోట్ల ఖాతా దారులకు, పెన్షన్ దారులకు లబ్ధి చేకూరనుంది. చదవండి👉 అలెర్ట్: ఈపీఎఫ్ అకౌంట్లో మీ వడ్డీ డబ్బులు కనిపించడం లేదా? -
ఈపీఎఫ్ఓలో ఫోటో ఎలా అప్లోడ్ చేయాలో తెలుసా? లేదంటే డబ్బులు రావు!
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ముఖ్య గమనిక. ఈపీఎఫ్ఓ నుంచి డబ్బులు డ్రా చేయాలని అనుకుంటున్నారా? అయితే మీరు తప్పని సరిగా ఈ- నామినేషన్‌ను ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ నామినేషన్ ఫిల్ చేయకపోతే డబ్బులు డ్రా చేయలేం. కాబట్టి ఖాతాదారులు ఈ-నామినేషన్ ఫైల్ చేయాలని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ-నామినేషన్ ఫైలింగ్ చేస్తున్నా..కంప్లీట్ కావడం లేదంటే మీరు మీ అకౌంట్ ఫ్రొఫైల్‌ను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రొఫైల్ అప్డేట్ చేయకపోతే ఈ- నామినేషన్ పూర్తి చేయలేమనే విషయాల్ని తప్పని సరిగా గుర్తుంచుకోవాలి. ప్రొఫెల్ పిక్చర్ ఎలా యాడ్ చేయాలంటే! ఈ - నామినేషన్ ఫైలింగ్‌కు ముందు అకౌంట్ ప్రొఫైల్ పిక్చర్ అప్డేట్ కోసం కొన్ని పద్దతుల్ని పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్టెప్1: ముందుగా యూఏఎన్ మెంబర్ ఐడీతో ఈపీఎఫ్ఓ అఫీషియల్ పోర్టల్‌లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సెప్ట్2: ఆ తర్వాత మెన్యూ సెక్షన్లో క్లిక్ చేస్తే ప్రొఫైల్ ఆప్షన్ కనిపిస్తుంది. స్టెప్3: ప్రొఫైల్ ఆప్షన్‌పై క్లిక్ చేసి వ్యక్తిగత వివరాల్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు లెప్ట్ సైడ్‌లో ప్రొఫైల్ ఫోటో ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేసి ఫోటోను ఛేంజ్ చేయడం లేదంటే, అప్లోడ్ చేయాలి. స్టెప్4:ప్రొఫైల్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఈపీఎఫ్ఓలో మీ ఫోటో అప్లోడ్ చేయాలి. స్టెప్5: ఫోటో అప్లోడ్ అవ్వాలంటే మీ పాస్ పోర్ట్ ఫోటో సైజ్ 3.5సెంటీమీటర్లు* 4.5 సెంటీమీటర్లు ఉండేలా చూసుకోవాలి. స్టెప్6: మన రెండు చెవులు కనిపించేలా ఫోటో విజబుల్ 80శాతం ఉండేలా చూసుకోవాలి. స్టెప్7: ఆ ఫోటో ఇమేజ్ జేపీఈజీ,జేపీజీ,పీఎన్జీ ఫార్మాట్లో సేవ్ చేయాలి. స్టెప్8: ఆ తర్వాత అప్లోడ్ యువర్ ఫోటో మీద క్లిక్ చేసి ఓకే అనే ఆప్షన్ పై ట్యాప్ చేయాలి. దీంతో మీ ఫోటో అప్లోడ్ అవుతుంది. -
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు కేంద్రం శుభవార్త
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఈపీఎఫ్ఓ అకౌంట్‌ను ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా ఉద్యోగి ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారినప్పుడు ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్‌ను మార్చుకోవాలి. ఈ పద్దతి ఉద్యోగులకు తలకు మించిన భారంగా ఉండేది. అకౌంట్‌ను ట్రాన్స్ఫర్ చేయించుకోవడంతో పాటు డబ్బుల్ని విత్ డ్రాల్ చేసుకోవడం మరింత కష్టతరంగా మారింది. ఇప్పుడు ఆ సమస్యను పరిష్కరిస్తూ కేంద్రం ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) కొత్త మార్గదర్శకాల్నిఅందుబాటులోకి తెచ్చింది. ఆ ప్రొసీజర్ ఫాలో అయితే చాలు సులభంగా ఉద్యోగులు ఈపీఎఫ్ అకౌంట్‌ను మార్చుకోవచ్చు. Know how to transfer EPF online जानिए कैसे करें ईपीएफ ऑनलाइन ट्रांसफर#EPFO #SocialSecurity #HumHainNa pic.twitter.com/x22NiLgMgc — EPFO (@socialepfo) September 5, 2021 అంతకంటే ముందు మీ ఈపీఎఫ్ఓ అకౌంట్‌ను ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మార్చుకునేందుకు ముందు ఈ రూల్స్‌ను పాటించాల్సి ఉంటుంది. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ యాక్టివ్‌గా ఉండాలి. అకౌంట్ హోల్డర్ మునుపటి లేదా ప్రస్తుత సంస్థ EPFOలో డిజిటల్ రిజిస్టర్డ్ సంతకాలు కలిగి ఉండాలి. ఇది కాకుండా బ్యాంక్ కేవైసీ సరిగ్గా ఉందో? లేదో? చెక్ చేసుకోవాలి. ఆ తర్వాతనే అకౌంట్‌ను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అకౌంట్‌ను ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి • ఉద్యోగులు ముందుగా https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ వెబ్ సైట్‌ను ఓపెన్ చేయాలి. • ఓపెన్ చేసి యూఏఎన్(Universal Account Number),పాస్‌వర్డ్‌ను టైప్ చేసి ఎంటర్ బటన్ ను క్లిక్ చేయాలి. • క్లిక్ చేసిన వెంటనే మనకు ఆన్ లైన్ సర్వీస్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌ను క్లిక్ చేసి'వన్ మెంబర్ - వన్ ఈపీఎఫ్ అకౌంట్‌పై క్లిక్ చేసి ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెట్టుకోవాలి • రిక్వెస్ట్ తర్వాత గెట్ డీటెయిల్స్ ఆప్షన్ పై ట్యాప్ చేయాలి. • గెట్ డీటెయిల్స్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు పాత సంస్థ ఈపీఎఫ్ఓ వివరాలు డిస్ ప్లే అవుతాయి. • ఆ తర్వాత ట్రాన్స్ ఫర్ చేసుకునేందుకు ధృవీకరణ ఫారం కోసం మునుపటి సంస్థ లేదా ప్రస్తుత సంస్థ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. • అనంతరం యూఏఎన్ రిజిస్ట్రర్డ్ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. • మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.అలా క్లిక్ చేస్తే చాలు మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ వెరిఫికేషన్ వెళుతుంది. అనంతరం ట్రాన్స్ఫర్ అవుతుంది. చదవండి: హ్యాకర్స్ రూట్ మార్చారు, స్కూల్ పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు -
గుడ్ న్యూస్ : మూడు రోజుల్లోనే పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ ఖాతా నుంచి డబ్బును విత్ డ్రా చేసుకునే వారికి కేవలం మూడు రోజుల్లోనే వారి ఖాతాలో జమ అయ్యే విధంగా ఈపీఎఫ్ క్లెయిమ్ లో మార్పులు చేసింది. ప్రస్తుతం కరోనా పరిస్థితులలో నేపథ్యంలో పీఎఫ్ విత్ డ్రా చేసుకునేందుకు అనుమతించేలా గతేడాది మాదిరిగా కేంద్రం కొన్ని మార్పులు చేసింది. కరోనా మహమ్మారి సమయంలో ప్రజలు ఎదుర్కోంటున్న ఇబ్బందుల నేపథ్యంలో ఈపీఎఫ్ఓ ఈ సదుపాయాన్ని అందిస్తోంది. ఇంతకముందు పీఎఫ్ క్లెయిమ్ చేసుకున్న 15 నుంచి 30 రోజుల్లో ఖాతాలో జమ అయ్యేవి. ఆన్ లైన్ లో పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆన్లైన్ పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా చేయాలంటే కచ్చితంగా ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతాతో లింక్ చేసిన యాక్టివ్ గా ఉన్న క్రియాశీల యూఏఎన్ అవసరం. అలాగే, పీఎఫ్ మీ ఆధార్, యుఏఎన్ ఖాతాకు జత చేసిన మొబైల్ నంబర్ పనిచేయాలి. ఆన్లైన్లో పీఎఫ్ అమౌంట్ ఎలా విత్ డ్రా చేయాలి? ముందుగా యూఏఎన్ UAN, పాస్ వర్డ్ నంబర్ ఉపయోగించి ఈపీఎఫ్ఓ ఖాతాకు లాగిన్ అవ్వాలి. 'ఆన్లైన్ సర్వీసెస్' టాబ్‌కు వెళ్లి 'క్లెయిమ్ (ఫారం -31, 19, 10సీ) ఆప్షన్ క్లిక్ చేయాలి. మీ పీఎఫ్/ ఈపీఎఫ్ ఖాతా వివరాలు కంప్యూటర్ మానిటర్లో కనిపిస్తాయి. మీ బ్యాంక్ ఖాతా నంబర్ చివరి నాలుగు అంకెలను నమోదు చేసి, 'వేరిఫై' బటన్ మీద క్లిక్ చేయాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత 'ప్రొసీడ్ క్లెయిమ్ ఆన్లైన్' బటన్ ని ప్రెస్ చేయాలి. "పీఎఫ్ అడ్వాన్స్ (ఫారం 31)" ఎంచుకోండి, పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా ఎందుకు చేస్తున్నారో తెలియజేయాలి. తర్వాత మీకు కావాల్సిన అమౌంట్ ఎంటర్ చేసి.. అడ్రస్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు మీ బ్యాంక్ ఖాతా వివరాలను నింపి, బ్యాంక్ ఖాతా చెక్కును అప్లోడ్ చేయండి. 'సెండ్ ఓటీపీ' ఆప్షన్ పై క్లిక్ చేయండి. స్వీకరించిన ఓటీపీని సమర్పించిన తర్వాత ఆన్లైన్లో మీ పీఎఫ్ దావా నమోదు అవుతుంది. మీ పీఎఫ్ అమౌంట్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయడానికంటే ముందు మీ యజమాని విత్ డ్రా పర్మిషన్ అవసరమని ఈపీఎఫ్ఓ సభ్యుడు గమనించాలి. మీ యజమాని ఒకే చేసిన తర్వాత మీరు ఇచ్చిన బ్యాంక్ ఖాతాలోకి నగదు బదిలీ చేస్తారు. అత్యవసర పరిస్థితులలో ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెస్ ను సెలక్ట్ చేసుకోవాలి. దీంతో మూడు రోజుల్లో డబ్బు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇందుకోసం దరఖాస్తు చేయడానికి అన్ని కేవైసీ పత్రాలను కలిగి ఉండాలి. చదవండి: ఈపీఎఫ్: కరోనాతో చనిపోతే క్లెయిమ్ ఎలా చేసుకోవాలి? -
నేటి నుంచి ఈపీఎఫ్‌వో ఆన్లైన్ సేవలు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) తమ చందాదారుల సౌకర్యార్థం శుక్రవారం నుంచి ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తెస్తోంది. ఈ కొత్త విధానం ద్వారా చందాదారులు ఇకపై తమ ఖాతాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో తెలుసుకొనేందుకు వీలవుతుంది. ‘ఇప్పటివరకు వారి ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని ఏడాదికి ఒకసారి మాత్రమే సవరించేవాళ్లం. ఇకపై ఆన్లైన్లో ఎప్పటికప్పుడు ఖాతాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని తెలుసుకోవచ్చు’ అని ఈపీఎఫ్‌వో సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ జలాన్ తెలిపారు.