ఈపీఎఫ్‌ అకౌంట్‍లో తప్పులున్నాయా? ఇలా సులభంగా మార్చుకోండి.. | How to Make Correction in Name, KYC and Other Details | Sakshi
Sakshi News home page

EPFO: ఈపీఎఫ్‌ అకౌంట్‍లో మిస్టేక్స్‌.. ఈజీగా ఆన్‌లైన్‌లోనే మార్చుకోవచ్చు!

Published Thu, Jun 6 2024 2:11 PM | Last Updated on Thu, Jun 6 2024 2:57 PM

How to Make Correction in Name, KYC and Other Details

సాధారణంగా ఉద్యోగం చేసేవారికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్​ (EPF) అకౌంట్ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ అకౌంట్ వివరాల్లో ఏవైనా తప్పులు ఉండే అవకాశం ఉంటుంది. గతంలో ఉద్యోగులు తమ జాయింట్ డిక్లరేషన్ ఫారంను నింపి, దానిని ఈపీఎఫ్ఓ కార్యాలయంలో ఇచ్చేవారు. ఇప్పుడు ఏవైనా మార్పులు చేసుకోవాలనుంటే.. ఫిజికల్ ఫారమ్‌తో పనిలేకుండా.. ఆన్‌లైన్‌లో మార్చుకోవచ్చు. ఈ కథనంలో ఈపీఎఫ్ చందాదారులు ఆన్​లైన్​లో తమకు చెందిన 11 వ్యక్తిగత వివరాలను ఎలా మార్చుకోవాలో వివరంగా తెలుసుకుందాం.

ఆన్​లైన్​లో మార్చుకోగలిన 11 వ్యక్తిగత వివరాలు

  • పేరు

  • జెండర్

  • పుట్టిన తేదీ

  • తండ్రి / తల్లి పేరు

  • రిలేషన్​షిప్

  • వైవాహిక స్థితి

  • జాయినింగ్ డేట్

  • రీజన్ ఫర్ క్విట్టింగ్ 

  • డేట్ ఆఫ్ క్విట్టింగ్

  • నేషనాలిటీ

  • ఆధార్

ఆన్​లైన్​లో ఎలా మార్చుకోవాలంటే?
👉ఉద్యోగి ముందుగా ఈపీఎఫ్ఓ అధికారికి వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి
👉హోమ్ పేజీలో మొదట కనిపించే 'సర్వీస్' ట్యాబ్ మీద క్లిక్ చేసిన తరువాత 'ఫర్ ఎంప్లాయిస్' అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.
👉ఆ తరువాత సర్వీస్ సెక్షన్ కింద కనిపించే 'మెంబర్ యూఏఎన్ / ఆన్‌లైన్ సర్వీస్' ఆప్షన్స్ మీద క్లిక్ చేయాలి.
👉ఆలా క్లిక్ చేయగానే మీకు ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
👉కొత్త పేజీలో కుడివైపు కనిపించే బాక్సులలో 'యూఏఎన్, పాస్​వర్డ్‌, క్యాప్చా' వంటి వివరాలు ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. 
👉ఇవన్నీ పూర్తి చేసిన తరువాత అసలైన ఈపీఎఫ్ఓ అకౌంట్ పేజీ ఓపెన్ అవుతుంది.
👉ఈపీఎఫ్ఓ అకౌంట్ పేజీ ఓపెన్ అయినా తరువాత స్క్రీన్ మీద కనిపించే.. 'మేనేజ్' ఆప్షన్ ఎంచుకోవాలి. ఇక్కడ జాయింట్ డిక్లరేషన్ ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మీ మెంబర్ ఐడీ ఎంటర్ చేసిన తరువాత.. ఏదైతే అప్డేట్ చేయాలనుకుంటున్నారో.. వాటిని ఎంటర్ చేసుకోవాలి.
👉అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ అప్​లోడ్‌ చేసిన తరువాత సబ్మిట్ చేయాలి.
👉అన్ని సరిగ్గా అప్​లోడ్‌ చేసి సబ్మిట్ చేసిన తరువాత రిక్వెస్ట్ యాక్సెప్ట్ అవుతుంది. ఆ తరువాత వివరాలు మీకు అందుతాయి.

ఎంప్లాయర్ చేయాల్సింది..
👉ఎంప్లాయ్ వివరాలను అందుకున్న తరువాత ఎంప్లాయర్.. ఈపీఎఫ్ఓ అధికారికి వెబ్‌సైట్‌లో ఎంప్లాయర్ ఐడీతో ఎంటర్ అవ్వాలి. 
👉మెంబర్ ట్యాబ్‌ మీద క్లిక్ చేసి.. జాయింట్ డిక్లరేషన్ చేంజ్ రిక్వెస్ట్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.
👉ఉద్యోగి అభ్యర్థను చెక్ చేసిన తరువాత ఎంప్లాయర్ అంగీకరించవచ్చు, తిరస్కరించవచ్చు.
👉ఎంప్లాయర్ ఉద్యోగి రిక్వెస్ట్ అంగీకరిస్తే.. అది ఈపీఎఫ్ఓకు చేరుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement