న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థలో (ఈపీఎఫ్‌వో) ఆగస్టులో నికరంగా 18.53 లక్షల మంది కొత్త సభ్యులు జతయ్యారు. గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఇది 9.07 శాతం అధికం. ఉద్యోగావకాశాలు, ఉద్యోగులకు లభించే ప్రయోజనాలపై అవగాహన పెరుగుతుండటం, ఈపీఎఫ్‌వో ప్రచార కార్యక్రమాలు మొదలైనవి ఇందుకు దోహదపడినట్లు కార్మిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
కొత్తగా చేరిన వారిలో 18–25 ఏళ్ల వయస్సు వారి వాటా గణనీయంగా ఉన్నట్లు పేర్కొంది. ఉద్యోగాల్లో తొలిసారి చేరేవారు, యువత సంఖ్య పెరుగుతుండటాన్ని ఇది సూచిస్తోందని వివరించింది. దాదాపు 13.54 లక్షల మంది ఉద్యోగాలు మారి, తిరిగి ఈపీఎఫ్‌లో చేరినట్లు పేర్కొంది.
రాష్ట్రాలవారీగా చూస్తే నికరంగా కొత్తగా చేరిన సభ్యుల సంఖ్యను బట్టి మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. కర్ణాటక, తమిళనాడు, హర్యానా, ఢిల్లీ, గుజరాత్, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి చేరిన వారి సంఖ్య తలో అయిదు శాతం పైగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment