new members
-
కొత్తగా 20.58 లక్షల మందికి ఈఎస్ఐ
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) నిర్వహించే ఈఎస్ఐ పరిధిలోకి సెప్టెంబర్‌లో కొత్తగా 20.58 లక్షల మంది చేరారు. 2023 సెప్టెంబర్‌లో కొత్త సభ్యుల నమోదు 18.88 లక్షలుగా ఉంది. అంటే 9 శాతం మందికి అదనంగా ఉపాధి లభించినట్టు తెలుస్తోంది. ఈ వివరాలను కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది.230 కొత్త సంస్థలు ఈఎస్ఐ పథకం పరిధిలో సెప్టెంబర్‌లో కొత్తగా 230 సంస్థలు నమోదు చేసుకున్నాయి. ఇక 20.58 లక్షల కొత్త సభ్యుల్లో 49 శాతం మేర 25 ఏళ్లలోపు వయసువారే ఉన్నారు. మహిళా సభ్యులు 3.91 లక్షల మంది కాగా, అలాగే 64 మంది ట్రాన్స్జెండర్లు కూడా కొత్తగా చేరారు. -
EPFO: 18.53 లక్షల మందికి కొత్తగా పీఎఫ్
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థలో (ఈపీఎఫ్‌వో) ఆగస్టులో నికరంగా 18.53 లక్షల మంది కొత్త సభ్యులు జతయ్యారు. గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఇది 9.07 శాతం అధికం. ఉద్యోగావకాశాలు, ఉద్యోగులకు లభించే ప్రయోజనాలపై అవగాహన పెరుగుతుండటం, ఈపీఎఫ్‌వో ప్రచార కార్యక్రమాలు మొదలైనవి ఇందుకు దోహదపడినట్లు కార్మిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.కొత్తగా చేరిన వారిలో 18–25 ఏళ్ల వయస్సు వారి వాటా గణనీయంగా ఉన్నట్లు పేర్కొంది. ఉద్యోగాల్లో తొలిసారి చేరేవారు, యువత సంఖ్య పెరుగుతుండటాన్ని ఇది సూచిస్తోందని వివరించింది. దాదాపు 13.54 లక్షల మంది ఉద్యోగాలు మారి, తిరిగి ఈపీఎఫ్‌లో చేరినట్లు పేర్కొంది.రాష్ట్రాలవారీగా చూస్తే నికరంగా కొత్తగా చేరిన సభ్యుల సంఖ్యను బట్టి మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. కర్ణాటక, తమిళనాడు, హర్యానా, ఢిల్లీ, గుజరాత్, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి చేరిన వారి సంఖ్య తలో అయిదు శాతం పైగా ఉంది. -
ఈపీఎఫ్‌వో కిందకు 20 లక్షల కొత్త సభ్యులు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పరిధిలోకి జూలై నెలలో 19.94 లక్షల మంది కొత్తగా చేరారు. ఈ వివరాలను కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ విడుదల చేశారు. ఈపీఎఫ్‌వో నిర్వహించే సామాజిక భద్రతా పథకం కింద జూలైలో 10.52 లక్షల మంది మొదటిసారి నమోదు చేసుకున్నట్టు తెలిపారు. → 8.77 లక్షల మంది సభ్యుల వయసు 18–25 ఏళ్ల మధ్య ఉంది. అంటే వీరంతా మొదటిసారి సంఘటిత రంగంలో ఉపాధి పొందినట్టు తెలుస్తోంది. → జూలైలో కొత్తగా చేరిన వారిలో 4.41 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఈపీఎఫ్‌వో నెలవారీ పేరోల్ గణాంకాలు విడుదల చేయడం మొదలైన తర్వాత ఒక నెలలో మహిళా సభ్యుల గరిష్ట చేరిక ఇదే. ఇందులో 3.05 లక్షలు మొదటిసారి చేరిన వారు కావడం గమనార్హం. → 14.65 లక్షల మంది ఒక సంస్థలో మానేసి, మరో సంస్థలో చేరారు. → జూలైలో ఈపీఎఫ్‌వో కిందకు చేరిన వారిలో 59 శాతం మేర మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల నుంచే ఉన్నారు. → తయారీ, కంప్యూటర్ సేవలు, నిర్మాణ రంగం, ఇంజనీరింగ్, బ్యాంకింగ్, ప్రైవేటు ఎలక్ట్రానిక్ మీడియా రంగాల నుంచి ఎక్కువ మంది చేరారు. -
ఈపీఎఫ్‌వోలో కొత్తగా 17 లక్షల మంది
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ సెపె్టంబర్ నెలలో 17.21 లక్షల మంది కొత్త సభ్యులను చేర్చుకుంది. ఆగస్ట్‌లో కొత్త సభ్యులతో పోలిస్తే నికరంగా 21,745 మంది పెరిగినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ నెల పేరోల్ గణాంకాలను కేంద్ర కారి్మక శాఖ సోమవారం విడుదల చేసింది. క్రితం ఏడాది సెపె్టంబర్ నెలలో కొత్త సభ్యుల గణాంకాలతో పోల్చి చూసినా కానీ, 38,262 మంది నికరంగా పెరిగారు. సెప్టెంబర్ నెలలో 8.92 లక్షల మంది తమ పేర్లను మెదటిసారి ఈపీఎఫ్‌వో కింద నమోదు చేసుకున్నారు. సుమారు 11.93 లక్షల మంది సభ్యులు ఒక సంస్థలో మానేసి, మరో సంస్థలో చేరారు. వీరు తమ ఈపీఎఫ్ ఖాతాను పాత సంస్థ నుంచి కొత్త సంస్థకు బదిలీ చేసుకున్నారు. కొత్త సభ్యుల్లో 59 శాతం మంది వయసు 18–25 ఏళ్లలోపు ఉంది. అంటే కొత్త సభ్యుల్లో అధిక శాతం మంది ఉద్యోగ మార్కెట్లోకి కొత్తగా ప్రవేశించిన వారని తెలుస్తోంది. ఇక ఈపీఎఫ్‌వో నుంచి వైదొలిగిన సభ్యుల సంఖ్య సెపె్టంబర్లో 3.64 లక్షలుగా ఉంది. ఆగస్ట్ నెలతో పోల్చి చూసినప్పుడు 12.17 శాతం తగ్గింది. 2023 జూన్ నుంచి నెలవారీగా సభ్యుల వైదొలగడం తగ్గుతూ వస్తోంది. 35 శాతం మహిళలు కొత్తగా చేరిన 8.92 లక్షల మంది సభ్యుల్లో మహిళలు 3.30 లక్షలుగా ఉన్నారు. ఇందులో 2.26 లక్షల మంది మహిళలు మొదటి సారి ఈపీఎఫ్‌వో కిందకు వచ్చిన వారు కావడం గమనార్హం. సెపె్టంబర్లో అత్యధికంగా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, హర్యానా రాష్ట్రాల నుంచి కొత్త సభ్యులు నమోదయ్యారు. ఈ రాష్ట్రాల నుంచి 57.42 శాతం మంది సభ్యులుగా ఉన్నారు. నికర సభ్యుల చేరికలో మహారాష్ట్ర వాటాయే 20.42 శాతంగా ఉంది. చక్కెర పరిశ్రమలు, కొరియర్ సేవలు, ఐరన్ అండ్ స్టీల్, ఆస్పత్రులు, ట్రావెల్ ఏజెన్సీల్లో ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. 2018 ఏప్రిల్ నుంచి ప్రతి నెలా ఈపీఎఫ్‌వో గణాంకాలను విడుదల చేస్తుండడం గమనార్హం. -
ఈపీఎఫ్‌వో కిందకు 16.99 లక్షల మంది
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నిర్వహించే సామాజిక భద్రత పథకం కిందకు ఆగస్ట్ మాసంలో 16.99 లక్షల మంది కొత్త సభ్యులు నికరంగా వచ్చి చేరారు. కేంద్ర కారి్మక శాఖ ఆగస్ట్ నెల ఈపీఎఫ్‌వో పేరోల్ గణాంకాలను విడుదల చేసింది. ఆగస్ట్‌లో 3,210 సంస్థలు మొదటి సారి ఈపీఎఫ్‌వోలో రిజిస్టర్ చేసుకున్నాయి. సుమారు 11.88 లక్షల మంది సభ్యులు ఒక సంస్థలో మానేసి, మరో సంస్థలో చేరడం ద్వారా ఈపీఎఫ్‌లో కిందకు మళ్లీ వచ్చి చేరారు. కొత్త సభ్యుల్లో 18–25 ఏళ్ల వయసువారు 58.36 శాతంగా ఉన్నారు. మొదటిసారి ఉద్యోగంలో చేరిన వారే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. మొదటిసారి చేరిన చేరిన మహిళలు 2.44 లక్షల మంది ఉన్నారు. నికరంగా చేరిన మహిళా సభ్యుల సంఖ్య 3.43 లక్షలుగా ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, హర్యానా, గుజరాత్ నుంచి నికర సభ్యుల చేరిక అధికంగా ఉంది. ఈ రాష్ట్రాల నుంచి 9.96 లక్షల మంది ఆగస్ట్‌లో ఈపీఎఫ్‌వో కిందకు వచ్చారు. వ్యాపార దుకాణాలు, భవన నిర్మాణం, ఇంజనీరింగ్ కాంట్రాక్టు సేవలు, టెక్స్‌టైల్స్‌లో ఎక్కువ మందికి ఉపాధి లభించింది. 39.87 మంది సభ్యులు నైపుణ్య సేవలకు సంబంధించి ఉన్నారు. -
ఈపీఎఫ్‌వోలో 18.75 లక్షల మంది కొత్త సభ్యులు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థలో జూలై నెలలో అత్యధికంగా 18.75 లక్షల మంది సభ్యులుగా చేరారు. 2018 ఏప్రిల్ నుంచి ఈపీఎఫ్‌వో నెలవారీ పేరోల్ గణాంకాలను విడుదల చేస్తుండగా, ఒక నెలలో ఈ స్థాయిలో సభ్యుల చేరిక ఇదే మొదటిసారి. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర కారి్మక శాఖ బుధవారం విడుదల చేసింది. కొత్త సభ్యుల్లో 10.27 లక్షల మంది మొదటిసారి ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచి్చనవారు కాగా, మిగిలిన వారు ఒక చోట ఉద్యోగం మానివేసి.. మరో సంస్థ తరఫున తాజాగా నమోదు చేసుకున్నారు. కొత్త సభ్యుల్లో 18–25 ఏళ్ల వయసువారే 58 శాతానికి పైగా ఉన్నారు. వీరంతా మొదటిసారి సంఘటిత రంగంలో ఉపాధి పొందినట్టు తెలుస్తోంది. ఇక జూలైలో ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చిన వారిలో 3.86 లక్షల మంది మహిళలు ఉన్నారు. వీరిలో నికరంగా 2.75 లక్షల మంది మొదటిసారి పేర్లు నమోదు చేసుకున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, హర్యానా రాష్ట్రాల నుంచి నికర సభ్యుల చేరిక అధికంగా నమోదైంది. ఈ రాష్ట్రాలే 58.78 శాతం వాటా ఆక్రమిస్తున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల నుంచి జూలైలో 11.02 లక్షల మంది ఈపీఎఫ్‌వోలో చేరారు. ఈఎస్ఐ కిందకు 19.88 లక్షల మంది ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) నిర్వహించే సామాజిక భద్రతా పథకం ఈఎస్ఐ కిందకు జూలై నెలలో 19.88 లక్షల మంది సభ్యులు వచ్చి చేరారు. కొత్తగా 28,870 సంస్థలు ఈఎస్ఐసీ కింద నమోదు చేసుకున్నాయి. కొత్త సభ్యుల్లో 25 ఏళ్లలోపు వారు 9.54 లక్షలుగా ఉన్నారు. మహిళా సభ్యులు 3.82 లక్షలుగా ఉన్నట్టు పేరోల్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే, 52 మంది ట్రాన్స్జెండర్లు కూడా ఈఎస్ఐ కింద నమోదు చేసుకున్నారు. -
గుడ్‌న్యూస్:11 నెలల గరిష్టానికి ఈపీఎఫ్‌వో సభ్యులు
తాజా అధికారిక ఉద్యోగాల కల్పన జూన్‌లో వరుసగా మూడవ నెలలోనూ పెరుగుదలను నమోదు చేసింది. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తాజా డేటా ప్రకారం జూన్ 2023లో 17.89 లక్షల కొత్త సభ్యులను చేర్చుకుంది. కార్మిక మంత్రిత్వ శాఖ ఆదివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 2022 తర్వాత అత్యధికమని డేటా తెలిపింది. మొత్తం చెల్లింపులు 11 నెలల గరిష్టమని పేర్కొంది. 3,491 సంస్థలు తమ ఉద్యోగులకు ఈ నెలలో తొలి ఈసీఆర్ని చెల్లించడం ద్వారా సామాజిక భద్రతా కవరేజీని అందించాయని పేర్కొంది.మే నెలతో పోలిస్తే జూన్ నెలలో సభ్యుల సంఖ్య 9.71 శాతం పెరిగింది. జూన్‌లో 10.14 లక్షల మంది కొత్త సభ్యులు ఈపీఎఫ్‌వోలో చేరారు.సుమారు 12.65 లక్షల మంది సభ్యులు నిష్క్రమించినా మళ్లీ చేరినట్లు పేరోల్ డేటా సూచిస్తుంది. (వరుసగా నాలుగో వారం క్షీణించిన బంగారం ధర..కానీ!) జూన్‌లో చేరిన మొత్తం సభ్యులలో 18 -25 సంవత్సరాల వయస్సు గలవారు, 57.87 శాతంగా ఉన్నారు. అలాగే 10.14 లక్షల మంది కొత్త సభ్యులలో, సుమారు 2.81 లక్షల మంది మహిళా సభ్యులు,తొలిసారిగా ఈపీఎఫ్‌లో చేరారు. వర్క్‌ఫోర్స్‌లో చేరిన మహిళా సభ్యుల శాతం గత 11 నెలలతో పోలిస్తేఇదే అత్యధికం. -
పీఎఫ్ఆర్డీఏ చైర్మన్‌గా దీపక్ మొహంతీ
న్యూఢిల్లీ: పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) చైర్మన్‌గా దీపక్ మొహంతీను ప్రభుత్వం నియమించింది. జనవరిలో పదవీకాలం ముగిసిన సుప్రతిమ్ బంద్యోపాధ్యాయ స్థానంలో ఆయన నియామకం జరిగింది. ప్రస్తుతం పీఎఫ్ఆర్డీఏ సభ్యునిగా ఆయన పనిచేస్తున్నారు. మొహంతీ ఆగస్టు 2020లో మూడేళ్ల కాలానికి లేదా 62 ఏళ్ల వయస్సు వచ్చే వరకు పీఎఫ్ఆర్డీఏ మెంబర్‌గా (ఎకనామిక్) గతంలో నియమితులయ్యారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేసిన అపార అనుభవం కూడా ఆయనకు ఉంది. తాజా నియామకానికి సంబంధించి వెలువడిన ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, ఇళ్లు, కారు సౌకర్యం లేకుండా మొహంతీ నెలకు రూ.4.50 లక్షల కన్సాలిడేటెడ్ వేతనం పొందుతారు. పదవి బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి 65 ఏళ్లు వచ్చే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ బాధ్యతల్లో ఆయన పనిచేస్తారు. మెంబర్‌గా...మమతా శంకర్ మొహంతీ తాజా నియామకం నేపథ్యంలో ఆయన స్థానంలో పీఎఫ్ఆర్డీఏ మెంబర్‌గా (ఎకనామిక్) మమతా శంకర్ నియమితులయ్యారు. ఇండియన్ ఎకనమిక్ సర్వీస్ (1993)లో ఉన్న ఆమె ప్రస్తుతం ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖలో సీనియర్ ఎకనమిక్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నారు. మూడేళ్ల కాలానికి లేదా 62 ఏళ్ల వయస్సు వచ్చే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు (ఏది ముందుగా అయితే) ఆమె ఈ బాధ్యతల్లో కొనసాగుతారని ప్రత్యేక నోటిఫికేషన్ పేర్కొంది. పెన్షన్ నిధులు ఇలా... నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) అలాగే అటల్ పెన్షన్ యోజన కింద నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తుల (ఏయూఎం) విలువ 2023 మార్చి 4వ తేదీ నాటికి రూ. 8.81 లక్షల కోట్లు. దేశంలోని పెన్షన్ పరిశ్రమను ప్రోత్సహించడం, నియంత్రించడం, అభివృద్ధి చేయడం లక్ష్యంగా 2003లో పీఎఫ్ఆర్డీఏ ఏర్పాటయ్యింది. దీనిని మొదట్లో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా నిర్దేశించడం జరిగింది. అయితే తదుపరి స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు, ఎన్‌ఆర్‌ఐలుసహా అన్ని భారత పౌరులు అందరికీ అథారిటీ సేవలను విస్తరించడం జరిగింది. వ్యవస్థీకృతంగా పెన్షన్ నిధుల ప్రోత్సాహం, అభివృద్ధి, నియంత్రణ వంటి కీలక కార్యకలపాలాను అథారిటీ నిర్వహిస్తుంది. ప్రజల వృద్ధాప్య ఆదాయ అవసరాలను, వనరులను స్థిర ప్రాతిపదికన అందించడంలో ఎన్పీఎస్ కీలక పాత్ర పోషిస్తోంది. -
EPFO: డిసెంబర్లో కార్యాలయాల కళకళ..!
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)లో డిసెంబర్ 2022లో 14.93 లక్షల మంది కొత్త సభ్యత్వం నమోదయ్యింది. 2021 ఇదే నెలతో పోల్చితే ఇది 2 శాతం (32,635 మంది) అధికమని కార్మిక మంత్రిత్వశాఖ 2022 డిసెంబర్‌కు సంబంధించి విడుదల చేసిన (తొలి) గణాంకాలు పేర్కొన్నాయి. గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► ఈపీఎఫ్ఓలో చేరిన 14.93 లక్షల మందిలో దాదాపు 8.02 లక్షల మంది కొత్త ఉద్యోగులు. వీరు మొదటిసారి సామాజిక భద్రతా వ్యవస్థ– ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చారు. అంటే మొదటిసారి వ్యవస్థాగతమైన ఉపాధిని వీరు పొందారన్నమాట. ► కొత్తగా చేరిన 8.02 లక్షల మందిలో 18 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్కులు 2.39 లక్షల మంది. 22–25 సంవత్సరాల మధ్య వారు 2.08 లక్షల మంది. 18 నుంచి 25 సంవ త్సరాల మధ్య వయస్సు కలవారు మొత్తం సంఖ్యలో (8.02 లక్షల మంది) 55.64% మంది. ► సమీక్షా నెల్లో 3.84 లక్షల మంది ఈపీఎఫ్ఓ నుంచి బయటకు వెళ్లగా, 10.74 లక్షల మంది బయ టకు వెళ్లి మళ్లీ కొత్త ఉద్యోగాల్లో చేరారు. తద్వా రా తిరిగి ఈపీఎఫ్ఓలో సభ్యత్వం పొందారు. ఈఎస్ఐసీలోనూ భారీ పెరుగుదల కాగా, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ)లో కూడా 2022 డిసెంబర్లో కొత్త ఉద్యోగులు 18.03 లక్షల మంది చేరాయి. 2021 డిసంబర్‌తో పోల్చితే ఈ సంఖ్య 14.52 లక్షలు పెరగడం గమనార్హం. ఈఎస్ఐసీ కింద డిసెంబర్ 2022లో 27,700 కొత్త సంస్థలు రిజిస్టరయ్యాయి. కొత్తగా చేరిన 18.03 లక్షల మంది ఉద్యోగుల్లో 25 సంవత్సరాలపైబడినవారు 8.30 లక్షల మంది. దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈఎస్ఐ స్కీమ్‌లో చేరినవారిలో 80 మంది ట్రాన్స్జెండర్లు. సభ్యులకు బహుళ ప్రయోజనాలు... ఉద్యోగి రికార్డుల నవీకరణ నిరంతర ప్రక్రియ. ఈ ప్రాతిపదికన పేరోల్ డేటాను తాత్కాలికమైనదిగా పరిగణించాలి. మునుపటి డేటా ప్రతి నెలా మారుతుంది. ఏప్రిల్ 2018 నుండి (సెప్టెంబర్ 2017 తరువాత కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటూ) పేరోల్ డేటా విడుదలవుతోంది. ఈపీఎఫ్ఓ తన సభ్యులకు సభ్యులకు ఈపీఎఫ్, ఎంపీ చట్టం, 1952 చట్టం కింద లభించే పలు ప్రయోజనాలను అందించడానికి బాధ్యత వహించే సామాజిక భద్రతా సంస్థ. ఇది సభ్యులకు వారి పదవీ విరమణపై భవిష్య నిధి, పెన్షన్ ప్రయోజనాలు అలాగే సభ్యుడు అకాల మరణం సంభవించినప్పుడు వారి కుటుంబాలకు కుటుంబ పెన్షన్, బీమా ప్రయోజనాలను అందిస్తుంది. ఈపీఎఫ్ఓ దాదాపు 6 కోట్ల మందికి పైగా చందాదారులతో రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులను కలిగి ఉంది. పటిష్టమైన స్థాయిలో రూ.300 కోట్లకు పైగా మిగులునూ నిర్వహిస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) డిపాజిట్లపై 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.1 శాతం వడ్డీ రేటు చెల్లించడానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. గడచిన నాలుగు దశాబ్దాల కాలంలో (1977–78లో ఈపీఎఫ్ 8 శాతం) కనిష్ట వడ్డీరేటు ఇది. డెట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి పొందిన వడ్డీ అలాగే ఈక్విటీ పెట్టుబడుల నుంచి వచ్చిన ఆదాయ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈపీఎఫ్ఓ అత్యున్నత స్థాయి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) వడ్డీరేటును నిర్ణయిస్తుంది. 2015–16లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ఈపీఎఫ్ఓ ప్రారంభించింది. ఈక్విటీల్లో తన మొత్తం నిధుల్లో 5 శాతంతో ప్రారంభమైన ఈపీఎఫ్ఓ పెట్టుబడులు, ప్రస్తుతం 15 శాతానికి చేరాయి. -
ఈపీఎఫ్‌వో కిందకు కొత్తగా 16.82 లక్షల మంది
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పరిధిలోకి సెప్టెంబర్ నెలలో కొత్తగా 16.82 లక్షల మంది సభ్యులుగా చేరారు. ఇందుకు సంబంధించి గణాంకాలను కేంద్ర కార్మిక శాఖ విడుదల చేసింది. క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే కొత్త సభ్యుల్లో 9 శాతానికి పైనే వృద్ధి నమోదైంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ అండ్ మిస్లేనియస్ చట్టం కింద కొత్తగా 2,861 సంస్థలు నమోదయ్యాయి. సెప్టెంబర్‌లో 16.82 లక్షల మంది కొత్త సభ్యుల్లో 9.34 లక్షల మంది మొదటిసారి ఈపీఎఫ్‌వో కిందకు వచ్చారు. అంటే వీరికి కొత్తగా ఉపాధి లభించింది. మిగిలిన సభ్యులు ఒక సంస్థలో మానేసి, మరో సంస్థలో చేరిన వారు కావడం గమనార్హం. ఇక కొత్త సభ్యుల్లో 18–21 ఏళ్ల వయసు నుంచి 2.94 లక్షల మంది, 21–25 ఏళ్ల వయసు నుంచి 2.54 లక్షల మంది ఉన్నారు. 25 ఏళ్ల వయసులోపు వారే 58.75 శాతంగా ఉన్నారు. ఈపీఎఫ్ కవరేజీ నుంచి వైదొలిగే సభ్యుల సంఖ్య గడిచిన మూడు నెలల్లో క్రమంగా తగ్గుతూ వస్తోంది. నెలవారీగా చూస్తే సెప్టెంబర్‌లో ఇలా ఈపీఎఫ్‌వో నుంచి వెళ్లిపోయిన వారు 9.65 శాతం తక్కువగా ఉన్నారు. సెప్టెంబర్ నెలలో చేరిన మహిళలు 3.50 లక్షల మంది (26.36 వాతం)గా ఉన్నారు. వార్షికంగా చూస్తే 7 శాతం వృద్ధి నమోదైంది. మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఆంధప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది చేరారు. -
ఈపీఎఫ్‌వోలోకి 18.36 లక్షల కొత్త సభ్యులు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నిర్వహించే సామాజిక భద్రతా పథకంలోకి జూన్ నెలలో కొత్తగా 18.36 లక్షల మంది సభ్యులు చేరారు. అంతక్రితం ఏడాది జూన్ నెలలో కొత్త సభ్యులు 12.83 లక్షలతో పోలిస్తే మంచి వృద్ధి నమోదైంది. ఇందుకు సంబంధించి పేరోల్ గణాంకాలను కార్మిక శాఖ విడుదల చేసింది. ఈ ఏడాది మేనెలలో కొత్త సభ్యుల చేరికతో పోల్చి చూసినా జూన్‌లో 9.21 శాతం వృద్ధి కనిపిస్తోంది. (వడ్డీల భారం, చేతులెత్తేసిన మరో స్టార్టప్) ఇక జూన్‌లో నికర కొత్త సభ్యులు 18.36 లక్షల మందిలో 10.54 లక్షల మంది ఈపీఎఫ్ అండ్ ఎంపీ యాక్ట్, 1952 కింద మొదటసారి చేరిన వారు కావడం గమనించాలి. 7.82 లక్షల మంది సభ్యులు ఒక సంస్థలో మానేసి, మరో సంస్థలో చేరడం వల్ల కొత్త సభ్యుల్లో భాగంగా ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచీ ప్రతి నెలా కొత్త సభ్యుల్లో వృద్ధి కనిపిస్తోంది. 22–25 వయసు నుంచి 4.72 లక్షల మంది కొత్తగా చేరిన వారున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, హర్యానా, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల నుంచే 12.61 లక్షల మంది కొత్తగా చేరారు. మొత్తం కొత్త సభ్యుల్లో మహిళలు 4.06 లక్షల మంది ఉన్నారు. ఈపీఎఫ్‌వో మొత్తం సభ్యుల్లో మహిళల శాతం మే చివరికి 20.37 శాతంగా ఉంటే, జూన్ చివరికి 22.09 శాతానికి తగ్గింది. (Electric Scooters: కేవలం వేలం వెర్రేనా? సర్వేలో షాకింగ్ విషయాలు) -
ఈఎస్ఐసీ కిందకు 13.37 లక్షల మంది
న్యూఢిల్లీ: కార్మికరాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) నిర్వహించే సామాజిక భద్రతా పథకం కిందకు సెప్టెంబర్ నెలలో కొత్తగా 13.37 లక్షల మంది చేరారు. అంతక్రితం నెల ఆగస్ట్‌లో కొత్త సభ్యుల సంఖ్య 13.42 లక్షలుగా ఉండడం గమనార్హం. వ్యవస్థీకృత రంగంలో కొత్తగా ఉపాధి పొందిన వారి డేటాను ఈ రూపంలో తెలుసుకోవచ్చు. జాతీయ గణాంకా ల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో ఈఎస్ఐసీ కిందకు 10.76 లక్షల మంది నికరంగా చేరగా, మేలో 8.90 లక్షల మంది, జూన్‌లో 10.65 లక్షల మంది, జూలైలో 13.40 లక్షల మంది, ఆగస్ట్‌లో 13.42 లక్షల మంది చొప్పున నికరంగా చేరారు. కరోనా లాక్డౌన్లు సడలిపోవడంతో జూన్, జూలై, ఆగస్ట్ నెలల్లో ఎక్కువ మంది చేరినట్టు తెలుస్తోంది. 2020–21లో ఈఎస్ఐసీ కిందకు కొత్తగా 1.15 కోట్ల మంది సభ్యులు కాగా, అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2019–20లో కొత్తగా చేరిన వారి సంఖ్య 1.51 కోట్లుగా ఉంది. 2018–19లో 1.49 కోట్లు, 2017–18లో 83.85 లక్షల చొప్పున ఈఎస్ఐసీకి సభ్యులు జతయ్యారు. -
ఉపాధి అవకాశాలపై ఈపీఎఫ్ఓ నివేదిక
న్యూఢిల్లీ: దేశంలోని వివిధ రంగాలు కల్పిస్తున్న ఉపాధి అవకాశాలపై 2019-20 సంవత్సరానికి ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) నివేదిక విడుదల చేసింది. కాగా 50 శాతం ఉపాధి అవకాశాలను ఆతిథ్య రంగం, ఆర్థిక సంస్థలు కల్పించినట్లు పేర్కొంది. (2019-20) ఆర్థిక సంవత్సరానికి సంఘటిత రంగం 28.6శాతం ఉపాధి అవకాశాలు అధికంగా కల్పించినట్లు తెలిపింది. కాగా, అధిక సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభించేందుకు ప్రభుత్వ కీలక సంస్కరణలు, జీఎస్టీ అంశాలు తోడ్పడ్డాయని అభిప్రాయపడింది. అయితే ఎక్కువ శాతం ఉద్యోగులు సంఘటిత రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నారని.. తక్కువ సంఖ్యలో అసంఘటిక రంగానికి ఉద్యోగులు మొగ్గు చూపుతున్నట్లు ఈపీఎఫ్ఓ అధికారి సునీల్ బర్తవాల్ పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణల వల్ల వివిధ రంగాలలో ఉపాధి అవకాశాలు పెరిగినట్లు పేర్కొంది. నూతన సభ్యుల నమోదు గణాంకాలను ఈపీఎఫ్‌వో సంస్థ 2018 ఏప్రిల్ నుంచి ప్రతి సంవత్సరం విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. (చదవండి: పెన్షనర్లకు ఈపీఎఫ్‌వో వెసులుబాటు) -
ఫిబ్రవరిలో తగ్గిన ఉపాధి: ఈపీఎఫ్‌వో
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉపాధి రేటు తగ్గింది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) వద్ద నూతన సభ్యుల నమోదు 10.34 లక్షలుగా నమోదైంది. కానీ, ఈ ఏడాది జనవరిలో నమోదైన నూతన సభ్యులు 10.71 లక్షల మందితో పోలిస్తే ఫిబ్రవరిలో తగ్గినట్టు తెలుస్తోంది. అయితే, 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు చూస్తే.. నికరంగా 76.53 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ నమోదు రేటు 61.12 లక్షలతో పోలిస్తే మెరుగైనట్టు తెలుస్తోంది. నూతన సభ్యుల నమోదు గణాంకాలను ఈపీఎఫ్‌వో సంస్థ 2018 ఏప్రిల్ నుంచి ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ వస్తోంది. -
లోక్‌సభలో తొలి అడుగులు
ప్రపంచంలోనే భారీ ఎన్నికలుగా నమోదైన 2019 లోక్‌సభ ఎన్నికల్లో అనేక రికార్డులు నమోదయ్యాయి. రాజకీయ ఉద్దండులైన ఎంతోమంది సీనియర్లను ఈ ఎన్నికల్లో మట్టికరిపించి ఓ సరికొత్త తరం పార్లమెంట్లో అడుగు పెట్టింది. ఈసారి ఏకంగా 300 మంది కొత్తవారు చట్టసభకు ఎన్నికవ్వడం ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓ ప్రత్యేకత. అందులో తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన వారిలో బీజేపీ రాజకీయ వ్యూహకర్తగా పేరొందిన అమిత్ షా మొదలుకుని క్రికెటర్ గౌతమ్ గంభీర్, తేజస్వీ సూర్య, జర్నలిస్టు ఇంతియాజ్, దళిత ప్రతినిధి రమ్యా హరిదాస్తోపాటుగా గాయకులు, సినీరంగ ప్రముఖులు వంటి వారెందరో ఉన్నారు. అమిత్ షా (బీజేపీ– గుజరాత్) బీజేపీ అధ్యక్షుడు, నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్డీయే) చైర్పర్సన్, అమిత్‌షా లోక్‌సభలోకి తొలిసారిగా అడుగుపెడుతున్నారు. చిన్నప్పటి నుంచీ ఆరెస్సెస్‌లో చురుకైన కార్యకర్తగా ఉన్న అమిత్‌షా గుజరాతీ వ్యాపారవేత్త కుమారుడు. 1986లో బీజేపీలో చేరి 33 ఏళ్ళ వయస్సులో 1997లో తొలిసారిగా గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రెండు దశాబ్దాల పాటు ఎమ్మెల్యేగా, హోంమంత్రిగా పనిచేసిన అనుభవం ఆయన్ను గత ఐదేళ్ళుగా భారత రాజకీయాల్లో ప్రముఖ పాత్రపోషించేలా చేసింది. 1990 నుంచి ప్రధాని మోదీ తలలో నాలుకలా ఉంటూ, గుజరాత్‌లోనూ, దేశవ్యాప్తంగానూ బీజేపీని బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. జోతిమణి (కాంగ్రెస్– తమిళనాడు) తమిళనాడులో కాంగ్రెస్ తరఫున ఎన్నికైన ఏకైక మహిళా అభ్యర్థి జోతిమణి. కరూర్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికై తొలిసారి లోక్‌సభలో అడుగుపెడుతున్నారు. 22 ఏళ్ళకే రాజకీయాల్లోకి వచ్చిన జోతిమణి, మాజీ డిప్యూటీ స్పీకర్, నాలుగుసార్లు ఎంపీ అయిన ఎం.తంబిదురైని 4 లక్షలకుపైగా ఓట్ల తేడాతో ఓడించారు. ఇంతియాజ్ జలీల్ (ఎంఐఎం–ఔరంగాబాద్) ఎంఐఎం నుంచి లోక్‌సభలోకి ప్రవేశిస్తున్న పాత్రికేయుడు ఇంతియాజ్‌కి లోక్‌సభ సభ్యుడిగా ఇది తొలి అనుభవం. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌నుంచి తొలుత ఈయన అభ్యర్థిత్వం తిరస్కరణకు గురైనా ప్రకాష్ అంబేడ్కర్ వంచిత్ బహుజన్ అఘాదీ పొత్తులో అదృష్టవశాత్తూ ఇంతియాజ్‌కి ఈ సీటు దక్కింది. శివసేన సీనియర్ నాయకుడు చంద్రకాంత్ ఖయిరేని అతితక్కువ ఓట్ల మెజారిటీతో ఓడించారు. పదిహేనేళ్ళ అనంతరం మహారాష్ట్ర నుంచి ఓ ముస్లిం లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిమీ చక్రవర్తి (తృణమూల్– పశ్చిమబెంగాల్) చిత్రపరిశ్రమనుంచి వచ్చి ఈ ఎన్నికల్లో రాణించిన వారిలో పశ్చిమబెంగాల్‌కి చెందిన మిమీ చక్రవర్తి, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి పోటీ చేసిన సన్నీడియోల్ ప్రముఖులు. ప్రముఖ సినీతార మిమీ చక్రవర్తి పశ్చిమబెంగాల్లోని జాదవ్‌పూర్ నుంచి లోక్‌సభకు తొలిసారిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి అనుపమ్ హజ్రాని దాదాపు మూడు లక్షల ఓట్ల మెజారిటీతో ఓడించి ఘన విజయం సాధించారు మిమీ చక్రవర్తి. బీజేపీ అభ్యర్థిగా గురుదాస్పూర్నుంచి పోటీ చేసిన సన్నీడియోల్ కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జాఖడ్‌పై 82,459 ఓట్ల మెజారిటీతో గెలుపొంది తొలిసారిగా లోక్‌సభలోకి అడుగిడుతున్నారు. గౌతమ్ గంభీర్ (బీజేపీ–తూర్పు ఢిల్లీ) రాజకీయవేత్తగా మారిన సుపరిచిత క్రికెట్ క్రీడాకారుడు గౌతమ్ గంభీర్ కూడా తొలిసారి లోక్‌సభలో అడుగుపెడుతున్నారు. తూర్పు ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన గౌతమ్ గంభీర్ ఆప్ అభ్యర్థి అతిషీ మర్లేనాపై గెలుపొందారు. హన్స్‌రాజ్ హన్స్ (బీజేపీ– నార్త్‌వెస్ట్ ఢిల్లీ ) నార్త్‌వెస్ట్ ఢిల్లీనుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన ప్రముఖ పంజాబీ సూఫీ గాయకుడు హన్స్‌రాజ్ హన్స్ కూడా మొదటిసారిగా లోక్‌సభలో అడుగుపెడుతున్నారు. మాజీ ఎంపీ ఉదిత్‌రాజ్ స్థానంలో చివరి క్షణంలో హన్స్‌రాజ్ హన్స్‌ని బీజేపీ అభ్యర్థిగా ఎంపిక చేసింది. తొలినుంచి రాజకీయాల్లో ఆసక్తి కలిగిన హన్స్‌రాజ్‌హన్స్ పంజాబ్‌లోని జలంధర్ నుంచి శిరోమణి అకాలీదళ్ పార్టీతరఫున 2009 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2014లో ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. 2016లో బీజేపీలో చేరారు. ప్రజ్ఞాఠాకూర్ (బీజేపీ–భోపాల్) మాలెగావ్ బాంబు పేలుళ్ళ కేసులో నిందితురాలు, సొంతపార్టీ బీజేపీలోనూ, బయటా విమర్శలనెదుర్కొంటున్న ప్రజ్ఞాఠాకూర్ సైతం తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. భోపాల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన ప్రజ్ఞాఠాకూర్ కాంగ్రెస్ దిగ్గజం దిగ్విజయ్‌సింగ్‌ను మట్టికరిపించారు. రవిశంకర్ ప్రసాద్ (బీజేపీ–బిహార్) బిహార్‌లోని పాట్నా సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన రవిశంకర్ ప్రసాద్ సమీప ప్రత్యర్థి, బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హాను 2.84 లక్షల ఓట్ల మెజార్టీతో ఓడించి తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టబోతున్నారు. స్మృతీ ఇరానీ (బీజేపీ–అమేథీ) గాంధీ కుటుంబాన్ని చిరకాలంగా ఆదరిస్తోన్న యూపీలోని అమేథీ నియోజకర్గం నుంచి బీజేపీ తరఫున పోటీచేసిన మాజీ మంత్రి స్మృతీ ఇరానీ ఏకంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై 55,120 ఓట్ల మెజార్టీతో గెలుపొంది తొలిసారి లోక్‌సభలో అడుగుపెడుతున్నారు. రమ్యా హరిదాస్ (కాంగ్రెస్– కేరళ) కేరళలోని అలత్తూర్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున రమ్యాహరిదాస్ పోటీచేసి గెలుపొందారు. ఈ స్థానానికి ఓ దళిత మహిళ రమ్యాహరిదాస్ పేరు వినిపించగానే అంతా ముక్కున వేలేసుకున్నారు. హేమాహేమీలను వదిలేసి రాజకీయ అక్షరాభ్యాసం చేస్తోన్న పంచాయతీ స్థాయి నాయకురాలు రమ్యని ఎంచుకోవడం కాంగ్రెస్ సీనియర్లకు ససేమిరా మింగుడుపడలేదు. ఎన్ని విమర్శలెదురైనా, ఎంతమంది అగౌరవ పరిచినా మొక్కవోని దీక్షతో పోరాడి ఈ ఎన్నికల్లో గెలుపొందారు. రెండుసార్లు ఎంపీగా ఉన్న సీపీఎం నాయకుడు పీకే బిజూని ఓడించి తొలిసారి లోక్‌సభలోకి అడుపెడుతున్నారు రమ్యాహరిదాస్. మహువా మోయిత్రా (తృణమూల్ – పశ్చిమ బెంగాల్) పశ్చిమబెంగాల్లో బీజేపీ «సునామీకి తట్టుకొని నిలబడిన తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి మహువా మోయిత్రా తొలిసారిగా లోక్‌సభలోకి ప్రవేశించబోతున్నారు. కోల్‌కతాలో పుట్టిపెరిగి, అమెరికాలో చదువుకున్న మోయిత్రా 2008లో కాంగ్రెస్‌లో చేరి, ఆ తర్వాత తృణమూల్‌కి మారారు. 2016లో నదియా జిల్లాలోని కరీంపూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈసారి అదే జిల్లాలోని కృష్ణానగర్ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఫుట్‌బాల్ క్రీడాకారుడు కల్యాణ్ చౌబేపై 65,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తేజస్వీ సూర్య (బీజేపీ– కర్ణాటక) దక్షిణ బెంగళూరు నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎన్నికైన తేజస్వీ సూర్య అత్యంత పిన్నవయస్కుడైన ఎంపీగా తొలిసారి లోక్‌సభలోకి అడుగుపెట్టబోతున్నారు. న్యాయవాద వృత్తిలో ఉన్న తేజస్వీ సూర్య ఏబీవీపీ నాయకుడిగా, ఆరెస్సెస్‌లో క్రియాశీలక కార్యకర్తగా ఉంటూ బీజేపీ యువమోర్చా నాయకుడిగా ఎదిగారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ‘‘మీరు మోదీతో ఉంటే దేశం పక్షాన ఉన్నట్టు, లేదంటే దేశానికి వ్యతిరేకంగా ఉన్నట్టు’’అంటూ తేజస్వీ చేసిన వీడియో వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. -
ఆ మ్యూజియం వద్దన్నందుకు ఉద్వాసన
న్యూఢిల్లీ: నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీకి చెందిన ముగ్గురు సభ్యులకు కేంద్రం ఉద్వాసన పలికింది. ఇక్కడి తీన్‌మూర్తి ఎస్టేట్‌లో భారత ప్రధాన మంత్రులందరి స్మృత్యర్థం మ్యూజియం నిర్మించాలన్న ప్రతిపాదనను వ్యతిరేకించిన ఆర్థికవేత్త నితిన్ దేశాయ్, ప్రొఫెసర్ ఉదయన్ మిశ్రా, మాజీ ప్రభుత్వ ఉద్యోగి బీపీ సింగ్‌లను తొలగిస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. వీరి స్థానంలో టీవీ జర్నలిస్ట్ అర్ణబ్ గోస్వామి, మాజీ విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్, బీజేపీ ఎంపీ వినయ్ సహస్రబుద్ధేతో పాటు ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ చైర్మన్ రామ్‌బహదూర్ రాయ్‌ను నియమించింది. -
చిన్నపరిశ్రమల సంఘం అధ్యక్షుడిగా పార్థసారథి
విజయవాడ(ఆటోనగర్) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల సంఘం అధ్యక్షుడిగా టి.పార్థసారథి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్(చిన్న తరహా పరిశ్రమల సంఘం) 53వ సర్వసభ్య సమావేశం ఆటోనగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ భవనంలో సోమవారం నిర్వహించారు. ఉపాధ్యక్షుడుగా టి.వినోద్‌బాబు, ప్రధాన కార్యదర్శిగా ఎన్.రామకృష్ణ, కోశాధికారిగా అన్నే శివనాగేశ్వరరావు ఎన్నికయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆటోనగర్ ఐలా చైర్మన్ సుంకర దుర్గాప్రసాద్, జేఆర్టీ టాటా ఎస్టేట్స్ ఐలా చైర్మన్ రమేష్ పాల్గొన్నారు. -
టీఎస్పీఎస్సీకి కొత్త సభ్యులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను పటిష్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నాలుగేళ్లలో లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో కమిషన్‌కు మరి కొందరు సభ్యులను నియమించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా నలుగురి పేర్లతో కూడిన జాబితాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గవర్నర్‌కు పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వారిలో ప్రొఫెసర్లు, సీనియర్ అధికారులు, రాజకీయ నాయకుల పేర్లున్నట్లు తెలిసింది. గవర్నర్ ఆమోదం తర్వాత కొత్త సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఆ వెంటనే వారు బాధ్యతలు స్వీకరించనున్నారు. టీఎస్ పీఎస్సీలో ప్రస్తుతం చైర్మన్ ఘంటా చక్రపాణితో పాటు మరో ముగ్గురు సభ్యులున్నారు. టీఎస్పీఎస్సీ నిబంధనల ప్రకారం గరిష్టంగా 10 మంది సభ్యులను నియమించుకునే అవకాశమున్నందున ఏడుగురు సభ్యులను నియమించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.