సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను పటిష్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నాలుగేళ్లలో లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో కమిషన్‌కు మరి కొందరు సభ్యులను నియమించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా నలుగురి పేర్లతో కూడిన జాబితాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గవర్నర్‌కు పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వారిలో ప్రొఫెసర్లు, సీనియర్ అధికారులు, రాజకీయ నాయకుల పేర్లున్నట్లు తెలిసింది.
గవర్నర్ ఆమోదం తర్వాత కొత్త సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఆ వెంటనే వారు బాధ్యతలు స్వీకరించనున్నారు. టీఎస్ పీఎస్‌సీలో ప్రస్తుతం చైర్మన్ ఘంటా చక్రపాణితో పాటు మరో ముగ్గురు సభ్యులున్నారు. టీఎస్‌పీఎస్‌సీ నిబంధనల ప్రకారం గరిష్టంగా 10 మంది సభ్యులను నియమించుకునే అవకాశమున్నందున ఏడుగురు సభ్యులను నియమించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
టీఎస్‌పీఎస్సీకి కొత్త సభ్యులు!
Published Sat, Oct 10 2015 2:21 AM | Last Updated on Sun, Sep 3 2017 10:41 AM
Advertisement