న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ సెపె్టంబర్ నెలలో 17.21 లక్షల మంది కొత్త సభ్యులను చేర్చుకుంది. ఆగస్ట్‌లో కొత్త సభ్యులతో పోలిస్తే నికరంగా 21,745 మంది పెరిగినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ నెల పేరోల్ గణాంకాలను కేంద్ర కారి్మక శాఖ సోమవారం విడుదల చేసింది. క్రితం ఏడాది సెపె్టంబర్ నెలలో కొత్త సభ్యుల గణాంకాలతో పోల్చి చూసినా కానీ, 38,262 మంది నికరంగా పెరిగారు. సెప్టెంబర్ నెలలో 8.92 లక్షల మంది తమ పేర్లను మెదటిసారి ఈపీఎఫ్‌వో కింద నమోదు చేసుకున్నారు.
సుమారు 11.93 లక్షల మంది సభ్యులు ఒక సంస్థలో మానేసి, మరో సంస్థలో చేరారు. వీరు తమ ఈపీఎఫ్ ఖాతాను పాత సంస్థ నుంచి కొత్త సంస్థకు బదిలీ చేసుకున్నారు. కొత్త సభ్యుల్లో 59 శాతం మంది వయసు 18–25 ఏళ్లలోపు ఉంది. అంటే కొత్త సభ్యుల్లో అధిక శాతం మంది ఉద్యోగ మార్కెట్లోకి కొత్తగా ప్రవేశించిన వారని తెలుస్తోంది. ఇక ఈపీఎఫ్‌వో నుంచి వైదొలిగిన సభ్యుల సంఖ్య సెపె్టంబర్‌లో 3.64 లక్షలుగా ఉంది. ఆగస్ట్ నెలతో పోల్చి చూసినప్పుడు 12.17 శాతం తగ్గింది. 2023 జూన్ నుంచి నెలవారీగా సభ్యుల వైదొలగడం తగ్గుతూ వస్తోంది.
35 శాతం మహిళలు
కొత్తగా చేరిన 8.92 లక్షల మంది సభ్యుల్లో మహిళలు 3.30 లక్షలుగా ఉన్నారు. ఇందులో 2.26 లక్షల మంది మహిళలు మొదటి సారి ఈపీఎఫ్‌వో కిందకు వచ్చిన వారు కావడం గమనార్హం. సెపె్టంబర్‌లో అత్యధికంగా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, హర్యానా రాష్ట్రాల నుంచి కొత్త సభ్యులు నమోదయ్యారు. ఈ రాష్ట్రాల నుంచి 57.42 శాతం మంది సభ్యులుగా ఉన్నారు. నికర సభ్యుల చేరికలో మహారాష్ట్ర వాటాయే 20.42 శాతంగా ఉంది. చక్కెర పరిశ్రమలు, కొరియర్ సేవలు, ఐరన్ అండ్ స్టీల్, ఆస్పత్రులు, ట్రావెల్ ఏజెన్సీల్లో ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. 2018 ఏప్రిల్ నుంచి ప్రతి నెలా ఈపీఎఫ్‌వో గణాంకాలను విడుదల చేస్తుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment