
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉపాధి రేటు తగ్గింది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) వద్ద నూతన సభ్యుల నమోదు 10.34 లక్షలుగా నమోదైంది. కానీ, ఈ ఏడాది జనవరిలో నమోదైన నూతన సభ్యులు 10.71 లక్షల మందితో పోలిస్తే ఫిబ్రవరిలో తగ్గినట్టు తెలుస్తోంది. అయితే, 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు చూస్తే.. నికరంగా 76.53 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ నమోదు రేటు 61.12 లక్షలతో పోలిస్తే మెరుగైనట్టు తెలుస్తోంది. నూతన సభ్యుల నమోదు గణాంకాలను ఈపీఎఫ్‌వో సంస్థ 2018 ఏప్రిల్ నుంచి ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ వస్తోంది.