న్యూఢిల్లీ: నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీకి చెందిన ముగ్గురు సభ్యులకు కేంద్రం ఉద్వాసన పలికింది. ఇక్కడి తీన్‌మూర్తి ఎస్టేట్‌లో భారత ప్రధాన మంత్రులందరి స్మృత్యర్థం మ్యూజియం నిర్మించాలన్న ప్రతిపాదనను వ్యతిరేకించిన ఆర్థికవేత్త నితిన్ దేశాయ్, ప్రొఫెసర్ ఉదయన్ మిశ్రా, మాజీ ప్రభుత్వ ఉద్యోగి బీపీ సింగ్‌లను తొలగిస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. వీరి స్థానంలో టీవీ జర్నలిస్ట్ అర్ణబ్ గోస్వామి, మాజీ విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్, బీజేపీ ఎంపీ వినయ్ సహస్రబుద్ధేతో పాటు ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ చైర్మన్ రామ్‌బహదూర్ రాయ్‌ను నియమించింది.
Comments
Please login to add a commentAdd a comment