
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) నిర్వహించే ఈఎస్‌ఐ పరిధిలోకి సెప్టెంబర్‌లో కొత్తగా 20.58 లక్షల మంది చేరారు. 2023 సెప్టెంబర్‌లో కొత్త సభ్యుల నమోదు 18.88 లక్షలుగా ఉంది. అంటే 9 శాతం మందికి అదనంగా ఉపాధి లభించినట్టు తెలుస్తోంది. ఈ వివరాలను కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది.
230 కొత్త సంస్థలు
ఈఎస్‌ఐ పథకం పరిధిలో సెప్టెంబర్‌లో కొత్తగా 230 సంస్థలు నమోదు చేసుకున్నాయి. ఇక 20.58 లక్షల కొత్త సభ్యుల్లో 49 శాతం మేర 25 ఏళ్లలోపు వయసువారే ఉన్నారు. మహిళా సభ్యులు 3.91 లక్షల మంది కాగా, అలాగే 64 మంది ట్రాన్స్‌జెండర్లు కూడా కొత్తగా చేరారు.
Comments
Please login to add a commentAdd a comment