new employees
-
కొత్తగా 18.86 లక్షల మందికి ఈఎస్ఐ.. ఆసక్తికర అంశం ఏంటంటే..
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ( ESIC ) కిందకు డిసెంబర్ నెలలో 18.86 లక్షల మంది కొత్త సభ్యులు చేరినట్టు కేంద్ర కార్మిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అదే నెలలో 23,347 సంస్థలు ఈఎస్ఐసీ కింద నమోదు చేసుకున్నాయి. ముఖ్యంగా యువతకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభింనట్లుగా తెలుస్తోంది. కొత్త సభ్యుల్లో 8.83 లక్షల మంది (47 శాతం) వయసు 25 ఏళ్లలోపే ఉన్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇక నికరంగా నమోదైన మహిళా సభ్యుల సంఖ్య 3.59 లక్షలుగా ఉంది. అలాగే, డిసెంబర్లో 47 ట్రాన్స్జెండర్లకు సైతం ఉద్యోగ అవకాశాలు లభించాయి. సమాజంలోని ప్రతివర్గానికీ ప్రయోజనాలు అందించేందుకు ఈఎస్ఐసీ కట్టుబడి ఉన్నట్టు కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. కార్మిక శాఖ తాత్కాలిక పేరోల్ డేటా ప్రకారం.. ఈఎస్ఐసీ కింద అధికారిక ఉద్యోగ కల్పన నవంబర్‌లో 1.59 మిలియన్ల కొత్త ఉద్యోగులతో పోలిస్తే, డిసెంబర్లో నెలవారీగా 18.2 శాతం పెరిగింది. ఏప్రిల్‌లో 17.8 లక్షల మంది, మేలో 20.2 లక్షల మంది, జూన్‌లో 20.2 లక్షల మంది, జూలైలో 19.8 లక్షలు, ఆగస్టులో 19.4 లక్షలు, సెప్టెంబర్‌లో 18.8 లక్షలు, అక్టోబర్‌లో 17.8 లక్షల మంది ఈఎస్ఐసీలో కొత్తగా చేరుతూ వచ్చారు. -
సంతకం చేయలేకపోయిన కొత్త ఉద్యోగి! ఎందుకో తెలిస్తే..
Ola Electric New Employee: భారతీయ దిగ్గజ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ సంస్థ 'ఓలా' మార్కెట్లో పొందుతున్న ప్రజాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్1, ఎస్1 ప్రో, ఎస్ 1 ఎయిర్ అనే మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లో మంచి అమ్మకాలను పొందింది. అయితే తాజాగా ఎస్1 స్కూటర్ ఉత్పత్తి నిలిపి వేసి ఆ స్థానంలో ఎస్1 ఎయిర్ ఉత్పత్తికి ప్రాధాన్యత కల్పితూ ప్రొడక్షన్ కూడా ప్రారంభించింది. కొత్త ఉద్యోగి.. ఓలా ఎస్1 ఎయిర్ లైమ్ గ్రీన్ స్కూటర్ మీద కంపెనీ ఉద్యోగులు సంతకాలు చేశారు. కానీ ఇటీవల ఉద్యోగిగా నియమితమైన 'బిజిలీ' (కుక్క) మాత్రం సంతకం చేయకుండా సీటుపై కూర్చుంది. దీనికి సంబంధించిన ఒక ఫోటో సంస్థ సీఈఓ తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే చాలా మంది కస్టమర్లు ఎస్1 ఎయిర్ స్కూటర్ కోసం బుకింగ్స్ చేసుకుంటున్నారు. డెలివరీలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. దీని ధర రూ. 85099 నుంచి రూ. 1.1 లక్షల మధ్య ఉండనుంది. డిజైన్ అండ్ ఫీచర్స్ అన్నీ కూడా దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే ఉంటుంది. ఈ స్కూటర్ ధర ఈ నెల 15 తరువాత రూ. 10వేలు వరకు పెరిగే అవకాశం ఉంది. ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ వేతనం ఎంతో తెలుసా? మరో ఐదేళ్లూ అదే జీతం! ఇక బిజిలీ విషయానికి వస్తే.. గత కొన్ని రోజులకు ముందు కంపెనీ సీఈఓ కుక్కకు ఉద్యోగం కల్పిస్తూ దానికి ఐడీ కార్డుని కూడా ప్రొవైడ్ చేశారు. దీనికి 440V అనే ఎంప్లాయ్ ఐడీ, బ్లడ్ గ్రూప్, అడ్రస్ వంటి వాటిని కూడా దాని కార్డులో మెన్షన్ చేశారు. ఇతర ఉద్యోగులకు మాదిరిగానే దీనికి సకల సదుపాయాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. The first S1 Air. Bijlee couldn’t sign so she sat on it! pic.twitter.com/7zwhpmjmI5 — Bhavish Aggarwal (@bhash) August 6, 2023 -
కుక్కకు జాబ్ ఇచ్చిన కంపెనీ సీఈఓ.. వైరల్ పోస్ట్!
ప్రైవేట్ సంస్థల్లో అయినా ప్రభుత్వ కార్యాలయాల్లో అయినా ఎక్కడైనా మనుషులే ఉద్యోగాలు చేస్తారన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఓలా సీఈఓ బెంగళూరు సమీపంలో ఉన్న కంపెనీ ఆఫీసులో కుక్కకి ఉద్యోగం ఇచ్చినట్లు, దానికి సంబంధించిన ఫోటోలను ట్విటర్ ద్వారా షేర్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, బిజ్లీ (Bijlee) అనే శునకాన్ని కంపెనీ ఉద్యోగిగా చేర్చుకున్నట్లు భవిష్ అగర్వాల్ అధికారికంగా వెల్లడించాడు. దీనికి 440V అనే ఎంప్లాయ్ ఐడీ, బ్లడ్ గ్రూప్, అడ్రస్ వంటి వాటిని కూడా దాని కార్డులో మెన్షన్ చేశారు. ఇతర ఉద్యోగులకు మాదిరిగానే దీనికి సకల సదుపాయాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ధనవంతుడవ్వాలనే తపన సరిపోదు.. ఈ టిప్స్ తప్పనిసరి! ఓలా సీఈఓ గతంలో కూడా కుక్కలకు సంబంధించిన పోస్టులను ట్విటర్ వేదికగా షేర్ చేశారు. అయితే ఈ సారి ఉద్యోగమిచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేసాడు. ఇది కోరమంగళ ఇండస్ట్రియల్ ఎస్టేట్, హోసూర్ రోడ్డు, బెంగళూరులో పనిచేయనుంది. ఈ పోస్ట్ చూసిన చాలామంది నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అతి తక్కువ సమయంలో ఈ కుక్క ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగిపోయింది. New colleague now officially! pic.twitter.com/dFtGMsOFVX — Bhavish Aggarwal (@bhash) July 30, 2023 -
బోనస్ ఇస్తాంలే కాస్త ఆగండి.. జాయినింగ్ ఆలస్యం చేస్తున్న యాక్సెంచర్
ఇటీవల 19,000 మంది ఉద్యోగుల తొలగింపును ప్రకటించిన యాక్సెంచర్ కొత్త ఉద్యోగుల జాయినింగ్‌ను కూడా ఒక సంవత్సరం వరకు ఆలస్యం చేస్తోంది. కంపెనీ కొత్త ఉద్యోగుల జాయినింగ్ తేదీని ఎప్పుటికప్పుడూ పొడిగిస్తూ వస్తున్న సంగతి తాజాగా వెలుగులోకి వచ్చింది. (Vodafone Idea 5G: వోడాఫోన్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఎట్టకేలకు ముగిసిన నిరీక్షణ!) తమకు ప్రస్తుతం కొత్త ఉద్యోగుల అవసరం లేనందునే యాక్సెంచర్ కొత్త ఉద్యోగుల జాయినింగ్ తేదీలను పొడిగిస్తూ వస్తున్నట్లు తెలిసింది. పరిస్థితి ఇలా ఉంటుందని ముందే తెలిస్తే తాము మరేదైనా కంపెనీలో చేరేవాళ్లమని, కానీ యాక్సెంచర్ జాయినింగ్‌ను నెలల తరబడి ఆలస్యం చేస్తూ వస్తోందని అభ్యర్థులు నిట్టూరుస్తున్నారు. తమ క్లయింట్ల అవసరాలకు తగ్గట్టుగా కొత్త ఉద్యోగుల జాయినింగ్ తేదీలను సర్దుబాటు చేస్తున్నట్లుగా యాక్సెంచర్ ప్రతినిధి రాచెల్ ఫ్రే ఈమెయిల్ ద్వారా తెలియజేశారు. ఇలా ఎంతమంది అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ జాప్యం ఇలాగే కొనసాగుతుందా అనే విషయాలపై స్పష్టత లేదు. (Akshata Murthy: బ్రిటన్ ప్రధాని సతీమణి చేతికి ఒక్క రోజులో రూ.68 కోట్లు..) యాక్సెంచర్ తనకు యూకేలో కన్సల్టింగ్ ఉద్యోగం ఇచ్చిందని, వచ్చే జూన్‌లో ఉద్యోగంలో చేరాల్సి ఉండగా జాయినింగ్ తేదీని అక్టోబరు నెలకు మార్చిందని ఇటీవల గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఓ అభ్యర్థి బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థకు తెలియజేసింది. జాయినింగ్ తేదీని మళ్లీ 2024 సంవత్సరం ప్రారంభానికి మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆమె ఆ ఉద్యోగం వదిలివేయాలని నిర్ణయించుకున్నారు. అయితే జాయినింగ్ ఆలస్యానికి యాక్సెంచర్ రిక్రూటర్ ఆ ఈమెయిల్లో క్షమాపణలు కోరారు. ఇలా జాయినింగ్ ఆలస్యం అయిన వారికి కంపెనీ అదనపు బోనస్ ఇవ్వనున్నట్లు తెలిసింది. యాక్సెంచర్‌లో జాయినింగ్ ఆలస్యం కావడం పట్ల విసుగు చెందిన కొందరు అభ్యర్థులు రెడ్డిట్ ఫోరమ్‌లలో కూడా తమ నిరాశను వ్యక్తం చేశారు. (Akshay Tritiya 2023: అక్షయ తృతీయ నాడు బంగారం కొంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి...) -
ఫిబ్రవరిలో పెరిగిన ఉపాధి కల్పన.. కొత్తగా 14.12 లక్షల మంది
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పరిధిలోకి 2022 ఫిబ్రవరిలో కొత్తగా 14.12 లక్షల మంది వచ్చి చేరారు. 2021 ఫిబ్రవరిలో కొత్త సభ్యులు 12.37 లక్షల మందితో పోలిస్తే 14 శాతం వృద్ధి కనిపించింది. ఈ మేరకు ప్రొవిజన్ పేరోల్ గణాంకాలను కేంద్ర కార్మిక శాఖ విడుదల చేసింది. ఈపీఎఫ్‌వో డేటాను గమనిస్తే.. పిబ్రవరిలో చేరిన నికర సభ్యుల్లో మహిళలు 3.10 లక్షలుగా ఉన్నారు. అంటే మొత్తం సభ్యుల్లో వీరు 22 శాతంగా ఉన్నారు. గత ఆర్థిక సంవత్సంలో 2021 ఏప్రిల్ నుంచి 2022 ఫిబ్రవరి వరకు మొత్తం నికర సభ్యుల నమోదు 1.11 కోట్లుగా ఉంది. అదే అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2020–21 మొత్తం మీద నికర సభ్యుల నమోదు 77.08 లక్షలుగానే ఉండడం గమనార్హం. 2019–20లో ఇది 78.58 లక్షలుగా ఉంది. జనవరితో పోలిస్తే స్వల్ప వృద్ధి నెలవారీగా చూస్తే 2022 జనవరితో పోలిస్తే నికర సభ్యుల నమోదు 31,826 మేర అధికంగా ఫిబ్రవరిలో కనిపించింది. వార్షికంగా క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు 2022 ఫిబ్రవరిలో 1,74,314 మంది అధికంగా చేరినట్టు తెలుస్తోంది. 2021 అక్టోబర్ నుంచి నికర సభ్యుల చేరిక క్రమం గా పెరుగుతూ వస్తున్నట్టు కార్మిక శాఖ తన ప్రకటనలో తెలిపింది. 2022 ఫిబ్రవరిలో నికరంగా చేరిన సభ్యులు 14.12 లక్షల మందిలో 8.41 లక్షల మం ది ‘ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్లేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్, 1952’ కింద చేరారు. అంటే ఈ మేరకు అదనపు ఉపాధి అవకాశాలు లభించిట్టు భావించొచ్చు. మిగిలిన 5.71 లక్షల మంది ఒక సంస్థలో ఉద్యోగం మానేసి, మరో సంస్థలో చేరిన వారే. వీరు తమ ఖాతాలను కొత్త సంస్థకు బదిలీ చేసుకున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, హర్యానా, ఢిల్లీ నుంచి చేరిన సభ్యులు ఎక్కువగా ఉన్నారు. ఈ ప్రాంతాల నుంచి నికరంగా చేరిన వారి సంఖ్య 9.52 లక్షలు. చదవండి: అలా చేస్తే దేశ ప్రయోజనాలకు విఘాతం -
5 నిమిషాల్లో ఈపీఎఫ్ నెంబర్ జనరేట్ చేయడం ఎలా..?
ఈపీఎఫ్ లేదా పీఎఫ్ సభ్యులు ఇప్పుడు ఆన్ లైన్ లో యూఏఎన్ ను జనరేట్ లేదా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ 12 అంకెల యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్)ను జారీ చేస్తుంది. యూఏఎన్ నెంబర్‌ను శాలరీ స్లిప్ మీద చూసుకోవచ్చు. ఒకవేళ మీ శాలరీ స్లిప్ మీద యూఏఎన్ నెంబర్ లేకపోతే ఉద్యోగులు ఈపీఎఫ్ పోర్టల్‌లో యూఏఎన్ నెంబర్ పొందవచ్చు. యూఏఎన్ నెంబర్ అనేది తొలిసారి ఉద్యోగంలో చేరిన వెంటనే ఆటోమేటిక్‌గా క్రియేట్ అయిపోతుంది. యుఎఎన్ జనరేట్ చేయడానికి ముందు మీ ఆధార్ మొబైల్ నెంబరుతో మొదట లింకు అవ్వాలి. ఎందుకంటే మీ ఆధార్ తో లింకు చేసిన మొబైల్ నెంబర్ కు ఒక సందేశం వస్తుంది. యుఏఎన్ జనరేట్ లేదా యాక్టివేట్ చేసేటప్పుడు మీరు ఆధార్ కార్డు నెంబరును దగ్గర ఉంచుకోవాలి. మీరు ఎన్ని ఉద్యోగాలు మారినా కూడా యూఏఎన్ నెంబర్ మాత్రం ఎప్పుడు ఒక్కటే ఉంటుంది. #ईपीएफ सदस्य इन आसान स्टेप्स का पालन करके डायरेक्ट यूएएन जेनरेट कर सकते हैं। अधिक जानकारी के लिए लिंक पर क्लिक करें: https://t.co/vMcykaXRgS#EPFO #ईपीएफओ@byadavbjp @Rameswar_Teli @PMOIndia @PIB_India @MIB_India @DDNewslive @airnewsalerts @mygovindia @PTI_News @_DigitalIndia — EPFO (@socialepfo) July 20, 2021 యూఏఎన్ నెంబర్ జనరేట్ చేయు విధానం: మొదట మీరు యూనివర్సల్ అకౌంట్ నెంబర్ పోర్టల్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత Important Links విభాగంలో ఉన్న Direct UAN Allotment by Employees ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. మీరు ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబరు, క్యాప్చాను నమోదు చేసి జనరేట్ ఓటీపీపై క్లిక్ చేయాలి. ఏదైనా ప్రయివేట్ కంపెనీ, ఎస్టాబ్లిష్ మెంట్ లేదా ఆర్గనైజేషన్ లో మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే 'అవును' మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు "ఎంప్లాయిమెంట్ కేటగిరీ" ఎస్టాబ్లిష్ మెంట్ పీఎఫ్ కోడ్ నెంబరు, చేరిన తేదీ, ఐడీని ఎంచుకోవాలి. మళ్లీ ఆధార్ నెంబరు చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత వచ్చిన ఓటీపీని నమోదు చేయాల్సి ఉంటుంది. చివరగా వ్యక్తిగత వివరాలు, కెవైసీ వివరాలతో కూడిన ఒక పేజీ ఓపెన్ అవుతుంది. అన్ని వివరాలు సరిగ్గానే ఉన్నాయా? లేదా అని చెక్ చేసుకొని రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. యూనివర్సల్ అకౌంట్ నెంబర్ మీ మొబైల్ నెంబర్‌కు మెసేజ్ వస్తుంది. -
కొత్త ఉద్యోగులకు శిక్షణ ప్రారంభించిన ఆర్టీసీ ఎండీ
సాక్షి, హైదరాబాద్ : దాదాపు రెండు నెలల వరకు తెలంగాణలో సాగిన ఆర్టీసీ సమ్మెలో మరణించిన కార్మికుల కుటుంబాలకు ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగాలు కల్పించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక ఉద్యోగ కల్పన పథకం కింద 38 మందికి ఉద్యోగాలు కల్పించారు. ఇందులో 16 మంది జూనియర్ అసిస్టెంట్, 12 మంది కండక్టర్లు, 8 మంది సెక్యూరిటీ కానిస్టేబుళ్లు, ఇద్దరు శ్రామికులుగా ఉన్నారు. వీరికి శిక్షణా తరగతులను ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ బుధవారం ప్రారంభించారు. జూనియర్ అసిస్టెంట్‌కు 13 వారాలు, కండక్టర్లకు 3 వారాలు, సెక్యూరిటీ కానిస్టేబుల్స్‌కి 8 వారాలు, శ్రామికులకు 2 వారాల శిక్షణను ఇస్తున్నారు. -
కొత్త ఉద్యోగులకు ఈపీఎఫ్ ఊరట
దేశంలో ఉపాధి కల్పన పెంపు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కొన్ని ప్రతిపాదనలు చేసింది. కొత్త ఉద్యోగులకు కంపెనీల బదులు ప్రభుత్వమే ఎంప్లాయీస్ పెన్షన్ ఫండ్ (ఈపీఎస్)కు 8.33 శాతం మొత్తాన్ని జమచేయనున్నది. ఉపాధి కల్పనకు ఊతమిచ్చేదిశగా ఆర్థిక మంత్రి జైట్లీ ఈ ప్రతిపాదన చేసారు. ఉద్యోగి నియామకం తర్వాత మూడేళ్ల వరకూ ప్రభుత్వం ఈ చెల్లింపు చేస్తుంది. దీని కోసం ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించింది. రూ. 15,000లోపు వేతనంతో నియమించుకునే కొత్త ఉద్యోగులకు 8.33 శాతం ఈపీఎఫ్‌ను కంపెనీల తరపున ఇక మీదట ప్రభుత్వమే చెల్లించడం కంపెనీలకు ఊరటనిచ్చే అంశం. కాగా ఉపాధి పెరుగుదల కోసం 2016-17 చివరి నాటికి 100 మోడల్ కెరీర్ సెంటర్స్‌ను ఏర్పాటు చేస్తామని జైట్లీ ప్రకటించారు. స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజెస్, నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్‌ను అనుసంధానం చేస్తామని తెలిపారు.