ప్రైవేట్ సంస్థల్లో అయినా ప్రభుత్వ కార్యాలయాల్లో అయినా ఎక్కడైనా మనుషులే ఉద్యోగాలు చేస్తారన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఓలా సీఈఓ బెంగళూరు సమీపంలో ఉన్న కంపెనీ ఆఫీసులో కుక్కకి ఉద్యోగం ఇచ్చినట్లు, దానికి సంబంధించిన ఫోటోలను ట్విటర్ ద్వారా షేర్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, బిజ్లీ (Bijlee) అనే శునకాన్ని కంపెనీ ఉద్యోగిగా చేర్చుకున్నట్లు భవిష్ అగర్వాల్ అధికారికంగా వెల్లడించాడు. దీనికి 440V అనే ఎంప్లాయ్ ఐడీ, బ్లడ్ గ్రూప్, అడ్రస్ వంటి వాటిని కూడా దాని కార్డులో మెన్షన్ చేశారు. ఇతర ఉద్యోగులకు మాదిరిగానే దీనికి సకల సదుపాయాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: ధనవంతుడవ్వాలనే తపన సరిపోదు.. ఈ టిప్స్ తప్పనిసరి!
ఓలా సీఈఓ గతంలో కూడా కుక్కలకు సంబంధించిన పోస్టులను ట్విటర్ వేదికగా షేర్ చేశారు. అయితే ఈ సారి ఉద్యోగమిచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేసాడు. ఇది కోరమంగళ ఇండస్ట్రియల్ ఎస్టేట్, హోసూర్ రోడ్డు, బెంగళూరులో పనిచేయనుంది. ఈ పోస్ట్ చూసిన చాలామంది నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అతి తక్కువ సమయంలో ఈ కుక్క ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగిపోయింది.
New colleague now officially! pic.twitter.com/dFtGMsOFVX
— Bhavish Aggarwal (@bhash) July 30, 2023
Comments
Please login to add a commentAdd a comment