స్వాధీనం చేసుకున్న తుపాకీ, అరెస్టయిన కార్తీక్
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): పెంపుడు కుక్క విషయానికి ఇద్దరి మధ్య ఘర్షణ నెలకొనగా ఒక వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపిన సంఘటన కనకపుర తాలూకా కపనిగౌడదొడ్డి గ్రామంలో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి గ్రామానికి చెందిన కార్తీక్ (24) అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసారు. ప్రదీప్ అనే వ్యక్తికి చెందిన కుక్కను కార్తీక్ కారు ఢీకొంది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో ఆగ్రహించిన కార్తీక్ తన వద్ద ఉన్న సింగిల్ బ్యారెల్ తుపాకీతో కాల్పులు జరిపాడు. ప్రదీప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కార్తీక్‌ను అరెస్టు చేసి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.
మరో ఘటనలో...
అర్చకుడు దుర్మరణం
తుమకూరు: తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి తాలూకా హులియరులోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ అర్చకుడు సునీల్ (28) గురువారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఓ వివాహ వేడుకను ముగించుకుని తిరిగి వస్తుండగా బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కరెంట్ స్తంభాన్ని ఢీకొనడంతో తీవ్ర గాయాలతో సునీల్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
చదవండి: భూలోక స్వర్గం.. ఆ పర్వతం.. చూస్తుంటే మైమరచిపోవడం ఖాయం!
Comments
Please login to add a commentAdd a comment