న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ( ESIC ) కిందకు డిసెంబర్ నెలలో 18.86 లక్షల మంది కొత్త సభ్యులు చేరినట్టు కేంద్ర కార్మిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అదే నెలలో 23,347 సంస్థలు ఈఎస్‌ఐసీ కింద నమోదు చేసుకున్నాయి. ముఖ్యంగా యువతకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభింనట్లుగా తెలుస్తోంది.
కొత్త సభ్యుల్లో 8.83 లక్షల మంది (47 శాతం) వయసు 25 ఏళ్లలోపే ఉన్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇక నికరంగా నమోదైన మహిళా సభ్యుల సంఖ్య 3.59 లక్షలుగా ఉంది. అలాగే, డిసెంబర్‌లో 47 ట్రాన్స్‌జెండర్లకు సైతం ఉద్యోగ అవకాశాలు లభించాయి. సమాజంలోని ప్రతివర్గానికీ ప్రయోజనాలు అందించేందుకు ఈఎస్‌ఐసీ కట్టుబడి ఉన్నట్టు కేంద్ర కార్మిక శాఖ తెలిపింది.
కార్మిక శాఖ తాత్కాలిక పేరోల్ డేటా ప్రకారం.. ఈఎస్‌ఐసీ కింద అధికారిక ఉద్యోగ కల్పన నవంబర్‌లో 1.59 మిలియన్ల కొత్త ఉద్యోగులతో పోలిస్తే, డిసెంబర్‌లో నెలవారీగా 18.2 శాతం పెరిగింది. ఏప్రిల్‌లో 17.8 లక్షల మంది, మేలో 20.2 లక్షల మంది, జూన్‌లో 20.2 లక్షల మంది, జూలైలో 19.8 లక్షలు, ఆగస్టులో 19.4 లక్షలు, సెప్టెంబర్‌లో 18.8 లక్షలు, అక్టోబర్‌లో 17.8 లక్షల మంది ఈఎస్‌ఐసీలో కొత్తగా చేరుతూ వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment