ESI
-
ఈఎస్ఐ కిందకు కొత్తగా 16 లక్షల మంది
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) నిర్వహించే బీమా పథకం ‘ఈఎస్ఐ’ కిందకు 2024 నవంబర్ నెలలో కొత్తగా 16.07 లక్షల మంది సభ్యులుగా నమోదయ్యారు. అంతక్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే ఒక శాతం అధికంగా సభ్యులు చేరినట్టు తెలుస్తోంది. 2023 నవంబర్‌లో కొత్త సభ్యుల నమోదు 15.92 లక్షలుగా ఉంది. ఈ వివరాలను కేంద్ర కార్మిక శాఖ విడుదల చేసింది. గతేడాది నవంబర్‌లో 20,212 సంస్థలు ఈఎస్ఐసీలో చేరాయి. తద్వారా ఆయా సంస్థల్లో పనిచేసే కార్మికులకు ఈఎస్ఐ రక్షణ లభించినట్టయింది. 16.07 లక్షల మందిలో 7.57 లక్షల మంది (47.11 శాతం) 25 ఏళ్లలోపు వయసున్నవారు కావడం గమనార్హం. 3.28 లక్షల మంది మహిళలు కాగా, 44 మంది ట్రాన్స్జెండర్లు కూడా కొత్త సభ్యుల్లో భాగంగా ఉన్నారు. -
ఈఎస్ఐ పథకంలోకి భారీగా చేరిన ఉద్యోగులు
ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) పథకంలో ఈ ఏడాది మేలో 23 లక్షల మంది కొత్త ఉద్యోగులు చేరారు. గతేడాది ఇదే నెలతో పోలిస్తే వీరి సంఖ్య 13.9% పెరిగింది. నెలవారీగా ఈఎస్ఐసీలో చేరే సరాసరి ఉద్యోగులు 16.4 లక్షల మందితో పోలిస్తే 39.9% వృద్ధిని నమోదు చేసింది. ఈమేరకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ డేటా విడుదల చేసింది.ఈఎస్ఐసీ తాజాగా విడుదల చేసిన పేరోల్ డేటా ప్రకారం..2024 ఏప్రిల్‌లో ఈఎస్ఐసీ పరిధిలో 18,490 మంది చేరారు. అదే మేలో మాత్రం ఆ సంఖ్య 20,110 కు చేరింది. మే నెలలో నమోదైన మొత్తం 23 లక్షల ఉద్యోగుల్లో 25 ఏళ్లలోపు వయసు ఉన్నవారు 11 లక్షల మంది, మహిళలు 44 వేలు, 60 మంది ట్రాన్స్‌జెండర్ ఉద్యోగులు ఈఎస్ఐ పథకం కింద నమోదు చేసుకున్నారు. నెలవారీ వేతనం రూ.21,000 వరకు ఉంటే వారి జీతాల్లో 0.75% ఈఎస్ఐ కింద జమ చేస్తారు. సంస్థ యాజమాన్యం మరో 3.25% విరాళంగా అందిస్తుంది. మొత్తం 4% నగదు ఈఎస్ఐలో జమ అవుతుంది. ఇది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు వైద్య, నగదు ప్రయోజనాలను అందించేందుకు ఉపయోగిస్తారు.ఇదీ చదవండి: వీడియో స్ట్రీమింగ్ రంగంలో 2.8 లక్షల మందికి ఉపాధి -
ఈఎస్ఐసీ కిందకు 16.47 లక్షల మంది
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) కింద ఏప్రిల్ నెలలో 16.47 లక్షల మంది కొత్తగా వచ్చి చేరారు. ఇందుకు సంబంధించిన గణాంకాలను కేంద్ర కార్మిక శాఖ తాజాగా విడుదల చేసింది.ఇందులో 47.60 శాతం అంటే 7.84 లక్షల మంది వయసు 25 ఏళ్లలోపే ఉందని, కొత్త ఉద్యోగాల కల్పనను ఈ గణాంకాలు ప్రతిఫలిస్తున్నాయని కార్మిక శాఖ పేర్కొంది. మొత్తం కొత్త సభ్యుల్లో 3.38 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఈఎస్ఐసీ కింద 53 మంది ట్రాన్స్జెండర్లు కూడా నమోదు చేసుకున్నారు.సమాజంలో అన్ని వర్గాలకు ప్రయోజనాలు అందించడమే ఈ పథకం లక్ష్యంగా కార్మిక శాఖ తెలిపింది. ఇక ఏప్రిల్‌లో 18,490 కొత్త సంస్థలు ఈఎస్ఐసీ కింద రిజిస్టర్ చేసుకున్నాయి. దీంతో ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈఎస్ఐ కవరేజీ వచ్చినట్టయింది. -
ESI scam: అవినీతి మరక.. అచ్చెన్నకు ఎరుక
కార్మిక శాఖ మంత్రి అంటే కార్మికులకు న్యాయం చేయాలి. కానీ అచ్చెన్నాయుడు రూటే సెప‘రేటు’. శ్రామిక సోదరుల కోసం కొనాల్సిన మందుల్లోనూ దందా నడిపారు. వైద్యపరికరాలు ఎక్కువ ధరకు కోట్ చేసి, బినామీలను తెర మీదకు తెచ్చి, మందు బిల్లుల్లో మాయలు చేసి రూ.150 కోట్ల అక్రమానికి పాల్పడి అవినీతి మంత్రిగా ముద్ర పడ్డారు. ఈఎస్ఐ స్కామ్‌లో అరెస్టయ్యి జిల్లా పరువు తీసేశారు. మంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో దొరికిందే చాన్స్ అంటూ దోచుకున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఈఎస్ఐ స్కామ్.. అచ్చెన్నాయుడు ఎన్నటికీ చెరపలేని అవినీతి మరక. మన జిల్లాకు చెందిన నాయకుడు రాష్ట్ర స్థాయిలో భారీ అవినీతికి పాల్పడిన వ్యవహారం మాయని మచ్చగా మిగిలిపోయింది. అధికారులను బెదిరించడం, అవసరమైతే బదిలీ చేయడం, తనకు కావల్సిన వారిని తెప్పించుకుని అక్రమాలకు పాల్పడటం టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం సాగిపోయింది. అంతటితో ఆయన లీలలు ఆగలేదు. కార్మికుల కోసం కొనుగోలు చేసిన మందుల్లోనూ అవినీతికి పాల్పడ్డారు. దాదాపు రూ.150కోట్లకు పైగా జరిగిన స్కామ్‌లో సూత్రధారిగా నిలిచారు. కారి్మకుల సొమ్ము కాజేసిన అచ్చెన్న బండారం విజిలెన్స్ అధికారుల విచారణలో బయటపడింది. వైద్య పరికరాలు, మందుల కొనుగోళ్ల పనులు నామినేషన్‌పై అప్పగించాలని మంత్రి హోదాలో కింజరాపు అచ్చెన్నాయుడు ఇచ్చిన సిఫారుసు లేఖతో మొత్తం గుట్టు రట్టయ్యింది. వైద్య పరికరాలు, ఔషధాలను బేరమాడి తక్కువకు కొనాల్సింది పోయి సగటున 132శాతం అధికంగా చెల్లించి కోట్లు కొట్టేశారు. అచ్చెన్న అవినీతి మార్క్ కారి్మక శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో అచ్చెన్న తన మార్క్ అవినీతిని చూపించారు. ఈఎస్ఐ ఆస్పత్రులకు అవసరమైన మందులు, వైద్య పరికరాల కొనుగోలు కాంట్రాక్ట్‌ను తాను చెప్పిన సంస్థకు నామినేటేడ్ కట్టబెట్టాలని సంబంధిత అధికారులకు లిఖిత పూర్వగా ఆర్డర్ జారీ చేశారు. సిఫార్సుకు ముందు వారితో ఏ లాలూచీలు పడ్డారో తెలీదు గానీ తన లెటర్ హెడ్ ద్వారా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో తూచా తప్పకుండా అధికారులు పాటించారు. నామినేటేడ్‌లో కాంట్రాక్ట్ దక్కించుకున్న ఆ సంస్థ ప్రతినిధులు తర్వాత అనేక అక్రమాలకు పాల్పడ్డారు. నకిలీ ఇండెంట్లతో పెద్ద ఎత్తున నిధులు స్వాహా చేశారు. పక్కా ఆధారాలతో ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడును అరెస్టు కూడా చేశారు. అవినీతి జరిగిందిలా... 👉రూ. 293.51కోట్ల విలువైన మందులకు కొనుగోలు కేటాయింపులు చేయగా పరిమితికి మించి రేట్ కాంట్రాక్ట్ లేని సంస్థల నుంచి ఏకంగా రూ.698.36కోట్లు విలువైన ఔషధాలు కొనుగోలు చేశారు. 👉శస్త్ర చికిత్స పరికరాలకు టెండర్లు లేకుండా రూ.6.62కోట్లు మేర చెల్లించారు. వాస్తవ ధర కంటే ఇది 70శాతం అధికం. 👉ఫ్యాబ్రికేటేడ్ కొటేషన్స్ సృష్టించి రేటు కాంట్రాక్టులో లేని సంస్థలకు ఆర్డర్లు ఇచ్చారు. రాశి ఫార్మా, వీరేష్ ఫార్మా సంస్థలకు కొనుగోలు ఆర్డర్ల కంటే అదనంగా రూ. 15.93కోట్లు చెల్లించారు. ఇందులో రూ.5.70కోట్లు మేర అదనంగా చెల్లించినట్టు తేలింది. 👉 కోట్లు వెచ్చించి కొన్న వందల పరికరాలను వినియోగించకుండా మూలనపడేశారు. జెర్సన్ ఎంటర్ ప్రైజెస్ అనే బినామీ సంస్థకు ఈఎస్ఐ డైరెక్టర్ డాక్టర్ సీకే రమే‹Ùకుమార్ రూ. 9.50కోట్లు చెల్లించారు. 👉 ఒక్కో బయోమెట్రిక్ పరికరం ధర రూ.16,992 అయితే రూ.70,760చొప్పున నకిలీ ఇండెంట్లు సృష్టించి కొనుగోలు చేశారు. 👉 ఈ క్రమంలో రశీదులు ఫోర్జరీ చేసి కోట్లు కొల్లగొట్టారు. నకిలీ కొటేషన్లు సృష్టించి రేటు కాంట్రాక్ట్‌లో లేని సంస్థలకు ఆర్డర్లు ఇచ్చారు. ల్యాబ్ కిట్లు, ఫరీ్నచర్, ఈసీజీ సరీ్వసులు, బయోమెట్రిక్ పరికరాల కొనుగోలులో భారీగా అక్రమాలు జరిగాయి. 👉 లేని సంస్థల నుంచి మందులు కొనుగోలు చేసినట్టు నకిలీ ఇండెంట్లు సృష్టించారు. ప్రభుత్వం రూ.89కోట్లు చెల్లిస్తే అందులో రేట్ కాంట్రాక్ట్‌లో ఉన్న సంస్థలకు రూ. 38కోట్లు చెల్లించారు. మిగతా రూ.51కోట్లను దారి మళ్లించారు. 👉టెండర్లు లేకుండా నామినేషన్ కింద ఆర్డర్లు ఇవ్వడంతో కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్ము దురి్వనియోగమైంది. అవుట్ సోర్సింగ్ దందా సాధారణంగా ఔట్ సోర్సింగ్ పోస్టులకు అవసరమైన అభ్యర్థులను సమకూర్చే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీని కలెక్టర్ నియమించాలి. జిల్లా స్థాయిలో నోటిఫికేషన్ ఇచ్చి, అర్హత గల ఏజెన్సీలు దరఖాస్తు చేస్తే, వాటిలో సరైనదేదో నిర్ధారణ చేసుకుని ఎంపిక చేస్తారు. కానీ గత ప్రభుత్వంలో టీడీపీ నేతలను ఏజెన్సీలుగా నియమించి దందా చేశారు. కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి స్థాయిలోనే ఏ శాఖకు, ఏ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ఉండాలి, ఆ ఏజెన్సీ ఎవరి చేతిలో ఉండాలన్నది ఫిక్స్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతటితో ఆగలేదు. బినామీ ఏజెన్సీల ముసుగులో స్థానిక నేతలు చెలరేగి పోయి ఔట్ సోర్సింగ్ పోస్టులకు బేరసారాలు సాగించారు. ఒక్కో పోస్టును రూ. 2లక్షల నుంచి రూ. 3లక్షల వరకు అమ్ముకున్న దాఖలాలు ఉన్నాయి. అచ్చెన్నపై నమోదు చేసిన కేసులివే.. 👉అవినీతి నిరోధక శాఖలో పలు సెక్షన్ల కింద అచ్చెన్నాయుడిపై కేసులు నమోదు చేశారు. క్రైమ్ నంబర్ 04/ఆర్సీఓ– సీఐయూ– ఏసీబీ/2020 యు/ఎస్ 13(1), (సీ), (డీ), ఆర్/డబ్ల్యూ 13(2) ఏసీబీ పీసీ సవరణల చట్టం–2018, ఏసీబీలోని ఐపీసీ సెక్షన్ల ప్రకారం సెక్షన్ 408, సెక్షన్ 420, 120–బీ కింద అచ్చెన్నాయుడిపై అధికారులు కేసు నమోదు చేశారు. 👉రూ. 975.79కోట్ల విలువైన మందులతో పాటు వైద్య పరికరాల కొనుగోలులో సుమారుగా రూ.150కోట్ల పైన అవినీతి అక్రమాలు జరిగినట్టు ఏసీబీ తేలి్చంది. 👉ఆస్పత్రులకు అవసరమైన మందులు, ఔషధాలు, వైద్య ఉపకరణాలు, ఆపరేషన్లకు అవసరమైన పరికరాలు, ల్యాబ్ కిట్స్, ఫరీ్నచర్ పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. రూ. 975.79కోట్ల రూపాయల మేర కొనుగోలు జరిగాయి. అయితే ఈ ప్రక్రియలో యథేచ్ఛగా నియమాలు, మార్గదర్శకాలను ఉల్లంఘించారు. 👉నిబంధనల ప్రకారం ఉండాల్సిన డ్రగ్ ప్రొక్యూర్మెంట్ కమిటీని కూడా ఏర్పాటు చేయలేదు. కొనుగోళ్ల ప్రక్రియలో ఎక్కడా ఓపెన్ టెండర్లు కూడా పిలవలేదు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడింది. మొదటి నుంచీ అదే బాగోతం రాష్ట్ర స్థాయిలోనే కాదు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. గ్రానైట్, ఇసుక కుంభకోణాలు, బీసీ కార్పొరేషన్ రుణాల్లో అక్రమాలు, సింగిల్ టెండర్ విధానంతో సొంత అన్నకు టెండర్లు కట్టబెట్టడం, ధాన్యం రవాణాకు వచ్చిన కోట్లాది రూపాయలు సొంత ఖాతాలకు మళ్లించుకోవడం, మినుముల కుంభకోణంతో కోట్ల రూపాయలు సొంత ఖాతాలకు మళ్లించుకోవడం, టెక్కలిలో సింగిల్ టెండర్ విధానంతో తన బినామీ లాడి శ్రీనివాసరావుకు ఆర్టీసీ టెండర్లు కట్టబెట్టడం, దివాకర్ ట్రావెల్స్‌కు అడ్డగోలుగా రవాణా లైసెన్సులు జారీ చేయడం వంటి ఆరోపణలను అచ్చెన్న మూటగట్టుకున్నారు. -
జయప్రద జైలు శిక్షరద్దు చేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: తన సినిమా థియేటర్లో పనిచేసిన ఉద్యోగులకు ఈఎస్ఐ కంట్రిబ్యూషన్ చెల్లించని కేసులో సీనియర్ నటి జయప్రదకు పడిన ఆరు నెలల జైలు శిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. జస్టిస్ అభయ్ ఓకా, ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. థియేటర్ యాజమాన్యం రూ. 9లక్షల80వేలను ఈఎస్ఐ కంట్రిబ్యూషన్ కింద జమ చేసినందున కోర్టు శిక్షను రద్దు చేసింది. చెన్నైలోని జయప్రదకు చెందిన సినీ థియేటర్లో జయప్రద, ఆమె ఇద్దరు సోదరులు వాటాదారులుగా ఉన్నారు. ఈ థియేటర్ 10 ఏళ్ల క్రితమే మూతపడింది. అయితే ఈ థియేటర్లో పనిచేసిన ఉద్యోగుల జీతాల నుంచి ఈఎస్ఐ పేరుతో కోతలు విధించి తమ వద్ద జమ చేయలేదని ఈఎస్ఐకార్పొరేషన్(ఈఎస్ఐసీ) కేసు పెట్టింది. ఈ కేసును విచారించిన చెన్నైలోని మెట్రోపాలిటన్ కోర్టు గత ఏడాది ఆగస్టులో జయప్రదకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అనంతరం ఈ కేసులో ఆమె అప్పీల్‌కు వెళ్లగా సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఇదీ చదవండి..ఈడీ విచారణకు కేజ్రీవాల్ మరోసారి డుమ్మా -
కొత్తగా 18.86 లక్షల మందికి ఈఎస్ఐ.. ఆసక్తికర అంశం ఏంటంటే..
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ( ESIC ) కిందకు డిసెంబర్ నెలలో 18.86 లక్షల మంది కొత్త సభ్యులు చేరినట్టు కేంద్ర కార్మిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అదే నెలలో 23,347 సంస్థలు ఈఎస్ఐసీ కింద నమోదు చేసుకున్నాయి. ముఖ్యంగా యువతకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభింనట్లుగా తెలుస్తోంది. కొత్త సభ్యుల్లో 8.83 లక్షల మంది (47 శాతం) వయసు 25 ఏళ్లలోపే ఉన్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇక నికరంగా నమోదైన మహిళా సభ్యుల సంఖ్య 3.59 లక్షలుగా ఉంది. అలాగే, డిసెంబర్లో 47 ట్రాన్స్జెండర్లకు సైతం ఉద్యోగ అవకాశాలు లభించాయి. సమాజంలోని ప్రతివర్గానికీ ప్రయోజనాలు అందించేందుకు ఈఎస్ఐసీ కట్టుబడి ఉన్నట్టు కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. కార్మిక శాఖ తాత్కాలిక పేరోల్ డేటా ప్రకారం.. ఈఎస్ఐసీ కింద అధికారిక ఉద్యోగ కల్పన నవంబర్‌లో 1.59 మిలియన్ల కొత్త ఉద్యోగులతో పోలిస్తే, డిసెంబర్లో నెలవారీగా 18.2 శాతం పెరిగింది. ఏప్రిల్‌లో 17.8 లక్షల మంది, మేలో 20.2 లక్షల మంది, జూన్‌లో 20.2 లక్షల మంది, జూలైలో 19.8 లక్షలు, ఆగస్టులో 19.4 లక్షలు, సెప్టెంబర్‌లో 18.8 లక్షలు, అక్టోబర్‌లో 17.8 లక్షల మంది ఈఎస్ఐసీలో కొత్తగా చేరుతూ వచ్చారు. -
ఈఎస్ఐ కిందకు 18.88 లక్షల మంది కొత్త సభ్యులు
న్యూఢిల్లీ: ఉద్యోగుల కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) నిర్వహించే ఈఎస్ఐ పథకం కిందకు సెప్టెంబర్ నెలలో కొత్తగా 18.88 లక్షల మంది సభ్యులు భాగస్వాములు అయ్యారు. 22,544 సంస్థలు మొదటిసారి ఈఎస్ఐసీ కింద నమోదయ్యాయి. దీంతో ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఈఎస్ఐ కవరేజీ వర్తించనుంది. కేంద్ర కార్మిక శాఖ ఈ వివరాలను విడుదల చేసింది. సెప్టెంబర్‌లో కొత్త సభ్యుల్లో 9.06 లక్షల మంది 25 ఏళ్లలోపు వారే ఉన్నారు. మొత్తం కొత్త సభ్యుల్లో 47.98 శాతానికి ఇది సమానం. కొత్త సభ్యుల్లో మహిళలు 3.51 లక్షల మంది ఉన్నారు. అలాగే 61 మంది ట్రాన్స్‌జెండర్ విభాగానికి చెందిన వారు కూడా ఉన్నారు. -
టిడ్కో ఇళ్లకూ రూ.8,929 కోట్ల ‘టెండర్’
సాక్షి, అమరావతి : మాజీ సీఎం చంద్రబాబునాయుడు తన అక్రమాలకు, అవినీతికీ పట్టణాల్లోని టిడ్కో ఇళ్లనూ వదిలిపెట్టలేదు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు 2016–17లో ఎక్కడా లేనంతగా నిర్మాణ వ్యయాన్ని చూపించి దోచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ టిడ్కో) ద్వారా రాష్ట్రంలోని పట్టణాల్లో నివసిస్తున్న ఇళ్లులేని 5 లక్షల మంది పేదలకు ప్రభుత్వ స్థలాల్లో 300, 365, 415 చ.అ విస్తీర్ణంలో జీ+3 విధానంలో ఫ్లాట్లు కట్టిస్తామని నమ్మబలికారు. 300 చ.గ విస్తీర్ణం గల ఫ్లాట్‌కు రూ.2.60 లక్షల ధర నిర్ణయించి బ్యాంకు రుణాలు ఇప్పించి, నెలకు రూ.3 వేల చొప్పున 20 ఏళ్లు చెల్లించాలని (రూ.7.20 లక్షలు) షరతు పెట్టారు. ఇక్కడే చంద్రబాబు బృందం నిర్మాణ కంపెనీల నుంచి ముడుపులు తీసుకుని, ఎక్కువ ముడుపులు చెల్లించిన కంపెనీకి అధిక ధరకు.. తక్కువ ఇచ్చిన కంపెనీకి ఆ మేర తక్కువ ధరకు నిర్మాణ అనుమతులు కట్టబెట్టారు. ఎంతగా అంటే.. ఆనాడు మార్కెట్లో ఏ ప్రైవేటు బిల్డర్ కూడా వసూలుచేయనంత ధర నిర్ణయించారు. ఇచ్చుకున్నోడికి ఇచ్చుకున్నంత.. నిజానికి.. 2016–17లో మార్కెట్లో చ.అడుగు నిర్మాణ ధర రూ.వెయ్యి కంటే తక్కువే ఉండగా.. చంద్రబాబు మాత్రం కంపెనీలు ఇచ్చుకున్న ముడుపుల స్థాయిని బట్టి రూ.2,534.75 నుంచి రూ.2,034.59గా నిర్ణయించి, సగటున చ.అ నిర్మాణ ధర రూ.2,203.45గా చెల్లించారు. అంటే అప్పటి మార్కెట్ ధరతో పోలిస్తే రూ.1,203.45 అదనంగా నిరుపేదల నుంచి వసూలు చేశారు. వాస్తవానికి ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలకు మార్కెట్ ధర కంటే ఇంకా తగ్గాల్సింది పోయి భారీగా పెంచేశారు. ఇలా టీడీపీ ప్రభుత్వం తలపెట్టిన 5 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణానికి ప్లాన్ చేసిన చంద్రబాబు ప్రభుత్వం 3.15 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అందులో తొలి విడతగా 2,08,160 యూనిట్లను 7,42,01,820 చ.అ. విస్తీర్ణంలో నిర్మాణాలకు అనుమతులిచ్చి చంద్రబాబు సర్కారు రూ.8,929.81 కోట్ల అవినీతికి పాల్పడింది. వ్యాట్ నుంచి గడ్డి వరకు.. సాక్షి, అమరావతి: చంద్రబాబు జమానా అంతా అవినీతి, అక్రమాలే. రాష్ట్ర విభజన నాటికి రైసు మిల్లర్లకు బకాయి పడిన రూ.500 కోట్ల వ్యాట్ బకాయిలను మాఫీ చేస్తూ 2015లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం వెనుక లోకేశ్ హస్తం ఉందని బహిరంగంగానే ఆరోపణలు విన్పించాయి. మిల్లర్లతో లోకేశ్ రాయబేరాలు సాగించి బకాయిలు రద్దు చేయాలంటే రూ.200 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో బియ్యం ఎగుమతులపై కూడా వ్యాట్ రద్దు చేస్తే, అడిగింది ఇచ్చేందుకు సిద్ధమని మిల్లర్లు చెప్పారు. దీంతో మిల్లర్ల వ్యాట్ బకాయిల మాఫీ అతి వేగంగా జరిగిపోయింది. పత్తి రైతుల పేరిట రూ.200 కోట్లు స్వాహా నాసిరకం పత్తిని సీసీఐకు అమ్మేసి, చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ప్రత్తిపాటి పుల్లారావు రూ.200 కోట్లు తినేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందులో సగభాగం చంద్రబాబుకు ముట్టినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ కూడా జరుగుతోంది. పుల్లారావు ఓ వ్యాపారితో కలిసి రైతుల పేరిట నాసిరకం పత్తిని కొన్నారు. దీనిని బంధువులు, దళారుల పేర్లతో సీసీఐకు అమ్మేశారు. అంతేకాదు సీసీఐ సేకరించిన పత్తిలో 80 శాతం బోగస్ రైతుల నుంచి కొన్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం కూడా తేల్చింది. పచ్చిగడ్డిలోనూ పచ్చ నేతల మేత పశువుల గడ్డిలోనూ టీడీపీ నేతల మేత బాగానే ఉంది. సైలేజ్ (పాతర గడ్డి) పేరిట ‘కోట్లు’ స్వాహా చేశారు. ప్రభుత్వం ఏటా 75 శాతం సబ్సిడీపై రైతులకు పశుగ్రాసం సరఫరా చేస్తుంటుంది. అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమార్తె సాయికృపా పేరిట ఏర్పాటు చేసిన కంపెనీ పేరుతో రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు సబ్సిడీ సొమ్మును కాజేశారు. రైతులు చెల్లించాల్సిన వాటాను బినామీల పేరిట చెల్లించి 75 శాతం సబ్సిడీ సొమ్మును స్వాహా చేశారు. ఈ వ్యవహారంపై జరిగిన విజిలెన్స్ విచారణను సైతం చంద్రబాబు బుట్టదాఖలు చేశారు. చంద్రన్న కానుక పేరిట కోట్లు స్వాహా 2015 సంక్రాంతి పండుగ వేళ చంద్రన్న కానుక పేరిట నాణ్యత లేని రేషన్ సరుకులను కార్డుదారులకు పంచిపెట్టారు. ఈ పథకం కింద ఒక్కో కార్డుదారునికి కానుక కోసం రూ.270 చొప్పున కాంట్రాక్టర్లకు రూ.430 కోట్లు ఇచ్చారు. అయినా ఎందుకూ పనికిరాని రేషన్ సరుకులు సరఫరా చేశారు. పురుగులు పట్టిన కందిపప్పు, పనికిరాని బెల్లం, దుర్వాసన కొట్టే గోధమ పిండి పంచి పెట్టి రూ.100 కోట్లకు పైగా వెనకేసుకున్నారు. కార్మికుల సొమ్మూ తినేశారు సాక్షి, అమరావతి: నెలనెలా జీతం నుంచి ఈఎస్ఐ కోసం డబ్బులు చెల్లించే కార్మికుల సొమ్మునూ కాజేశారు టీడీపీ నేతలు. 2014 – 2019 మధ్య రూ.150 కోట్లకు పైగా కార్మికుల సొమ్మును తినేశారు. అప్పటి కార్మిక శాఖ మంత్రి హోదాలో అచ్చెన్నాయుడు ఇచ్చిన సిఫార్సు లేఖలతో నామినేషన్‌పై ఆర్డర్లు ఇచ్చి ఈఎస్ఐలో మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో భారీ దోపిడీకి పాల్పడినట్లు విజిలెన్స్ విచారణలో వెల్లడైంది. ఈ అవినీతి బాగోతంపై విచారణ జరిపిన ఏసీబీ అధికారులు 2020లో అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారు. ఈఎస్ఐ మాజీ డైరెక్టర్లు డాక్టర్ సీకే రమేష్‌కుమార్, డాక్టర్ జి.విజయ్‌కుమార్ సహా పలువురిని కూడా అప్పట్లో అరెస్టు చేశారు. ఈ కుంభకోణం దర్యాప్తు తుది దశకు చేరింది. త్వరలో ఏసీబీ చార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేయనుంది. కార్మికుల సొమ్ము తినేశారిలా.. నిబంధనల ప్రకారం ఏ కాంట్రాక్టు అయినా రూ.10 లక్షల విలువ దాటితే ఈ–టెండర్లు నిర్వహించాలి. ఇందుకు విరుద్ధంగా అప్పటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఎవరికి ఏ కాంట్రాక్టు ఇవ్వాలో అధికారులను ముందే ఆదేశించారు. ఈమేరకు లెటర్‌హెడ్‌పై సిఫార్సులు చేస్తూ అప్పటి ఈఎస్ఐ డైరెక్టర్‌కు లేఖ రాశారు. ఈ లేఖ ఆధారంగా ఆయన సూచించిన కంపెనీలకు మందులు, వైద్య పరికరాల సరఫరా, ఇతర కాంట్రాక్టులు అప్పజెప్పారు. అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు ఒత్తిడితో టెలీ హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు కాల్ సెంటర్, టోల్‌ఫ్రీ, ఈసీజీ కాంట్రాక్టు ఇచ్చారు. ఎక్కడైనా రూ.200 మాత్రమే ఉండే ఈసీజీకి రూ.480 చొప్పున చెల్లించారు. కాల్ సెంటర్లో కాల్స్‌కి కాకుండా సర్వీస్ ప్రొవైడర్ మొత్తం రిజిస్టర్ ఐపీ, ఫేక్ కాల్ లాగ్స్‌కి కూడా రూ.1.80 చొప్పున బిల్ క్లెయిమ్ చేశారు. ఎలాంటి టెండర్లు లేకుండా నామినేషన్ ప్రాతిపదికన రూ.89.58 కోట్ల విలువైన మందులు కొన్నారు. లెజెండ్ ఎంటర్‌ప్రై జెస్, ఎవెంటార్, ఓమ్ని మెడి తదితర సంస్థలకు భారీ లబ్ధి చేకూర్చారు. ఆయా సంస్థల నుంచి అచ్చెన్న, కొందరు అధికారులు భారీగా ప్రయోజనం పొందారు. లేబొరేటరీ కిట్ల కోసం రూ.237 కోట్లు ఖర్చు చేశారు. రూ.16 వేలు విలువ చేసే బయోమెట్రిక్ మెషీన్లను రూ.70 వేలకు కొన్నారు. ఫ్యాబ్రికేటెడ్ కొటేషన్ల ద్వారా మందులు, శస్త్రచికిత్సల పరికరాలు, ఫర్నీచర్, ఈసీజీ మెషీన్లు కొన్నారు. సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంటు పనులు ఎలాంటి టెండరు లేకుండా జలం ఎన్విరాన్మెంట్ సంస్థకు అప్పగించారు. కార్మికులకు షాంపూలు, క్రీముల పేరుతో రూ.10.50 కోట్లు ఖర్చు చేశారు. ఏటా బడ్జెట్టే రూ. 300 కోట్లు ఉండగా, రూ.500 కోట్లకు పైగా ఆర్డర్లు పెట్టి దోచేశారు. -
ఈఎస్ఐ స్కామ్‌లో చార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చార్జిషీట్ దాఖలుచేసింది. రూ.211 కోట్ల స్కాం జరిగిందని అధికారులు నిర్ధారించారు. ఈ కుంభకోణంలో ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణితోపాటు మరో 15 మందిని నిందితులుగా పేర్కొంటూ అభియోగపత్రాలనుసమర్పించారు. ఈఎస్ఐలో మందులు, మెడికల్ కిట్ల కొనుగోలులో గోల్మాల్ జరిగినట్లు దేవికారాణిపై ఆరోపణలు వచ్చాయి. నకిలీ ఇన్ వాయిస్ సృష్టించి పెద్ద మొత్తంలో లబ్ధి పొందినట్లు తేలింది. మెడికల్ క్యాంపు ల పేరుతో నిధులు గోల్మాల్ చేసి, అక్రమ సంపాదనతో 6 కోట్ల విలువ చేసే బంగారాన్ని దేవికరాణి ,ఫార్మసిస్ట్ నాగలక్ష్మి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. రియల్ ఎస్టేట్‌లోనూ నిందితులుపెట్టుబడులు పెట్టినట్లు తేలింది. ఈ వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ కేసు నమోదుచేసింది. ఈ కేసు ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. ఇప్పటికే నిందితులకు చెందిన రూ.144 కోట్ల ఆస్తులు. ఓపెన్ ప్లాట్స్ కమర్షియల్ షాప్‌లను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. ఏసీబీ నమోదు చేసిన ఎనిమిది ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ దర్యాప్తు జరుపుతోంది. కాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈస్‌ఐ కొనుగోళ్ల కుంభకోణం నిందితుల్లో దేవికారాణితోపాటు మాజీ జేడీ పద్మజ, షార్మాసిస్టు కే.నాగమణి, ఇద్దరు కాంట్రాక్టర్లు కే.శ్రీహరిబాబు, పీ.రాజేశ్వరరెడ్డి నిందుతులుగా ఉన్నారు. -
ఈఎస్ఐ కుంభకోణంపై ఈడీ దర్యాప్తు ముమ్మరం
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈఎస్ఐ మాజీ డైరెక్టర్‌తో పాటు ఉన్నతాధికారులను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈఎస్ఐలో వందల కోట్ల స్కాం జరిగినట్లు ఈడీ గుర్తించింది. రూ.వందల కోట్ల నిధుల దారి మళ్లింపుపై ఈడీ ఆరా తీస్తోంది. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది. కాగా, నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ కిట్లు, ఫార్మా కంపెనీలకు మందుల సరఫరా కాంట్రాక్టుల అప్పగింతలో జరిగిన అవకతవకల్లో రూ.కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందంటూ గతంలో ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ విచారణ జరిపిన సంగతి తెలిసిందే. చదవండి: కేసీఆర్ మెదక్ పర్యటన వాయిదా.. కారణం ఇదే.. -
ఈఎస్ఐలో కొలువుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్య కొలువుల భర్తీకి ఈఎస్ఐసీ ఉపక్రమించింది. వివిధ కేటగిరీల్లో ఉన్న పోస్టుల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన డాక్టర్ల నియామకానికి ప్రకటన విడుదల చేసింది. నాలుగు కేటగిరీల్లో 40 పోస్టులు భర్తీ కానున్నాయి. సీనియర్ రెసిడెంట్ కేటగిరీలో 29 ఖాళీలు, సూపర్ స్పెషలిస్ట్ (సీనియర్ లెవల్)/ సీనియర్ కన్సల్టెంట్ కేటగిరీలో 5 ఖాళీలు, సూపర్ స్పెషలిస్ట్ (ఎంట్రీలెవల్)/జూనియర్ కన్సల్టెంట్ కేటగిరీలో 3 ఖాళీలు, స్పెషలిస్ట్ కేటగిరీలో 3 ఖాళీలున్నాయి. రోస్టర్, రిజర్వేషన్ వారీగా పోస్టులను నోటిఫికేషన్లో ప్రకటించారు. ఈ కొలువుల భర్తీ పూర్తిగా మెరిట్, ఇంటర్వ్యూల పద్ధతిలో జరుగుతుంది. సూపర్ స్పెషలిస్ట్ (సీనియర్ లెవల్/ఎంట్రీలెవల్) గరిష్ట వయోపరిమితి 69 సంవత్సరాలుగా ఖరారు చేయగా.. స్పెషలిస్ట్‌కు 66 సంవత్సరాలు, సీనియర్ రెసిడెంట్‌కు 45 సంవత్సరాల గరిష్ట వయోపరిమితిని నిర్దేశించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వయోపరిమితి సడలింపు ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెబ్సైట్ నుంచి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని పూరించాలి. నిర్దేశించిన డాక్యుమెంట్లతో ఆయా తేదీల్లో ఇంటర్వ్యూకు నేరుగా హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగానే ప్రాధాన్యత ఇస్తారు. ఫలితాలను వెబ్సైట్లో పొందుపరుస్తారు. అర్హత సాధించిన వైద్యులు వెంటనే విధుల్లో చేరాల్సి ఉంటుంది. పోస్టుల వారీగా వేతనాలు సూపర్ స్పెషలిస్ట్ (సీనియర్ లెవల్) / సీనియర్ కన్సల్టెంట్ రూ.2,40,000/– (కన్సాలిడేట్ రెమ్యునరేషన్) సూపర్ స్పెషలిస్ట్ (ఎంట్రీలెవల్) / జూనియర్ కన్సల్టెంట్ రూ.2,00,000/– (కన్సాలిడేట్ రెమ్యునరేషన్) స్పెషలిస్ట్ రూ.1,27,141/– (కన్సాలిడేట్ రెమ్యునరేషన్) సీనియర్ రెసిడెంట్ రూ.67,000/– + డీఏ, ఎన్పీఏ, హెచ్ఆర్ఏ, ఇతరాలు -
గుడ్‌న్యూస్! శంషాబాద్‌లో ఈఎస్ఐ ఆస్పత్రికి కేంద్రం ఆమోదం
కార్మికులకు మెరుగైన వైద్య సేవలందించేందుకుగాను రాష్ట్రంలో వంద పడకల ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు ఎట్టకేలకు ఏడాదిన్నరకు మోక్షం లభించింది. ఈ ప్రతిపాదనను ఆమోదిస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్రయాదవ్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు 190వ ఈఎస్ఐ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 8 ఈఎస్ఐ వంద పడకల ఆస్పత్రులు ఏర్పాటు చేయనున్నామని, రాష్ట్రంలోని శంషాబాద్‌లో ఈఎస్ఐ ఆసుపత్రిని నిర్మించనున్నామని అధికారికంగా ప్రకటించారు. దీంతో కార్మికుల్లో హర్షం వ్యక్తమవుతోంది. హైదరాబాద్ శివారులో గగన్‌పహాడ్, కాటేదాన్, సాతంరాయి పారిశ్రామికవాడలతోపాటు కొత్తూరు, నందిగామ, బాలా నగర్, షాద్‌నగర్ పారిశ్రామిక వాడలకు శంషాబాద్ చేరువలో ఉంది. దీనికితోడు నగర శివారులోని అన్ని పారిశ్రామిక ప్రాంతాల నుంచి ఇక్కడికి రాకపోకలు సాగించేందుకు ఔటర్ రింగు రోడ్డు వంటి అనువైన అనుసంధాన రహదారులు, రైల్వే కనెక్టివిటీ ఉంది. (చదవండి: నో రూల్స్.. ఆర్టీఏ అధికారులని బురిడీ కొట్టిస్తున్న బీమా సంస్థలు) -
ఈఎస్ఐ ‘కార్పొరేట్’ సేవలు మరింత చేరువలో!
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ (ఉద్యోగ రాజ్య బీమా) చందాదారులకు వైద్య సేవలను మరింత చేరువలోకి తెచ్చే దిశగా డీఐఎంఎస్ (డైరెక్టర్ ఇన్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్) చర్యలు చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక సూపర్ స్పెషాలిటీ, మూడు జనరల్ ఆస్పత్రులతోపాటు 71 డిస్పెన్సరీల ద్వారా వైద్య సేవలందుతున్నాయి. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, రెండు జనరల్ ఆస్పత్రులు హైదరాబాద్ సమీపంలో ఉండగా.. మరో రెండు ఆస్పత్రులు వరంగల్, సిర్పూర్లో ఉన్నాయి. మిగతా డిస్పెన్సరీలు జిల్లాల్లో ఉన్నప్పటికీ అక్కడ కేవలం అవుట్ పేషెంట్ విభాగాల సేవలతోనే సరిపెడుతున్నాయి. ఈక్రమంలో శస్త్ర చికిత్సలు, మేజర్ చికిత్సల కోసం హైదరాబాద్‌లోని ఆస్పత్రులకు రావాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో చందాదారులకు మరింత మెరుగైన సేవలను వేగంగా అందించేందుకు కొత్తగా ప్రైవేటు కార్పొరేట్ ఆస్పత్రులను ఎంపిక చేయాలని డీఐఎంఎస్ భావిస్తోంది. ఈమేరకు ప్రతిపాదనలను రూపొందించింది. జిల్లాకో ఆస్పత్రి చొప్పున... రాష్ట్రంలో ఈఎస్ఐ కార్పొరేషన్ 21 కార్పొరేట్ ఆస్పత్రులను ఎంప్యానెల్ చేసింది. ఇందులో మెజార్టీ ఆస్పత్రులన్నీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. అలాకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ జిల్లాలో ఎంప్యానెల్ ఆస్పత్రులు ఉండేలా డీఐఎంఎస్ కార్యాచరణ రూపొందిస్తోంది. జిల్లాకొక కార్పొరేట్ ఆస్పత్రిని ఎంప్యానెల్ చేస్తే సంబంధిత జిల్లా పరిధిలోని చందాదారులకు అత్యవ సరంగా మెరుగైన సేవలు అందుతాయనే లక్ష్యంతో ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా రాష్ట్రవ్యాప్తంగా మరో 40 ఆస్పత్రులను ఎంప్యానెల్ చేయాలని భావిస్తోంది. కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతోనూ ఇటీవల సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అధ్యక్షతన ఇటీవల జరిగిన ఈఎస్ఐ ప్రాంతీయ బోర్డు సమావేశంలోనూ ఈ అంశంపై చర్చించారు. డీఐఎంఎస్ ప్రతిపాదనలను త్వరలో ఈఎస్ఐ కార్పొరేషన్‌కు పంపా లని నిర్ణయించారు. అక్కడ ఆమోదం వచ్చాక ఆస్పత్రుల తుది ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తారు. ఇదంతా వచ్చే ఏప్రిల్ నాటికి పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. -
ఈఎస్ఐ డిస్పెన్సరీలకు శాశ్వత భవనాలు
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ చందాదారులకు మరింత మెరుగైన వైద్య సేవలందించేందుకు రాష్ట్ర కార్మిక శాఖ కార్యాచరణ చేపట్టింది. క్షేత్రస్థాయిలో కీలకంగా పనిచేస్తున్న ఈఎస్ఐ డిస్పెన్సరీలకు అన్ని రకాల వసతులతో శాశ్వత భవనాలను నిర్మించాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 71 డిస్పెన్సరీలున్నాయి. ఇవిగాకుండా కొత్తగా 14 డిస్పెన్సరీలను ఈఎస్ఐ కార్పొరేషన్ మంజూరు చేసింది. ప్రస్తుతమున్న డిస్పెన్సరీల్లో 65 డిస్పెన్సరీలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అద్దె కాంట్రాక్టు గడువు ముగియడంతో కొన్నింటిని పలుమార్లు మార్పు చేసిన సందర్భాలున్నాయి. డిస్పెన్సరీల మార్పులతో అటు రోగులకు, ఇటు వైద్యులు, సిబ్బందికి ఇబ్బందులు వస్తున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు శాశ్వత భవనాల నిర్మాణానికి కార్మిక శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రతి డిస్పెన్సరీకి శాశ్వత భవనంకోసం అనువైన స్థలాన్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. మరోవైపు అనువైన స్థలాల గుర్తింపు బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని కోరింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. స్థలాలు గుర్తిస్తే వెంటనే భవన నిర్మాణం.. ప్రస్తుతం స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని కార్మిక శాఖ భావిస్తోంది. ఈ దిశగా చర్యలు వేగవంతం చేసింది. స్థలాలను గుర్తిస్తే వెంటనే భవన నిర్మాణాలను చేపట్టేందుకు కార్మిక శాఖ సిద్ధంగా ఉంది. గతవారం ఈఎస్ఐసీ ప్రాంతీయ బోర్డు సమావేశం జరిగింది. రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డిస్పెన్సరీలకు శాశ్వత నిర్మాణాలపైనా చర్చించారు. ఈ క్రమంలో ఈఐఎస్‌ఐసీ ఉన్నతాధికారులు స్పందిస్తూ శాశ్వత భవనాలను నిర్మించేందుకు అవసరమైన నిధులను ఇచ్చేందుకు కార్పొరేషన్ సిద్ధంగా ఉందన్నారు. ఈ మేరకు ఒక్కో భవనానికి రూ.50 లక్షలు వెచ్చించేందుకు ముందుకు వచ్చారు. ఈ నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిసహాయ సహకారాలను తీసుకుంటామని వివరించారు. చందాదారుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. -
కొత్తగా 14 ఈఎస్ఐ డిస్పెన్సరీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 14 ఈఎస్ ఐ డిస్పెన్సరీలను ఈఎస్ఐ కార్పొరేషన్ మంజూరు చేసింది. ఇందులో ఐదు డిస్పెన్సరీల్లో ఒక్కో డాక్టర్ పోస్టును, మరో ఎనిమిది డిస్పెన్స రీలకు ఇద్దరు డాక్టర్ల చొప్పున పోస్టులు మంజూ రు చేసింది. కొత్త డిస్పెన్సరీలను మంచిర్యాల, ఖమ్మం, అదిలాబాద్, హన్మకొండ, మెదక్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, సూర్యాపేట జిల్లాల్లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర కార్మిక శాఖ చర్యలు వేగవంతం చేసింది. బుధవారం ఆదర్శ్ నగర్‌లోని ఈఎస్ఐసీ ప్రాంతీయ కార్యాలయంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సీహెచ్. మల్లారెడ్డి ఆధ్వర్యంలో రీజనల్ బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రామగుండం, శంషాబాద్‌లో వంద పడకల ఆస్ప త్రులను కేంద్రం మంజూరు చేయగా... వీటి ఏర్పా టుకు సంబంధించిన అనుమతులను ఈఎస్ఐ కార్పొ రేషన్ జారీ చేసిందని చెప్పారు. శంషాబాద్ ఆస్పత్రి ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఎక రాల స్థలాన్ని కేటాయించినట్లు వివరించారు. నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కానింగ్ పరికరాల ఏర్పాటుకు కార్పొరే షన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. వీటిని అతి త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 71 డిస్పెన్సరీలు ఉన్నాయని, మరిన్ని కొత్త డిస్పెన్స రీల ఏర్పాటుకు ప్రతిపాద నలు రూపొందించా లని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో పాటు ఈఎస్ఐ సేవలు విస్తృతం చేసేందుకు కార్పొరేట్ ఆస్పత్రు లను ఎంప్యానల్ చేసి సర్వీసులు అందించేలా చర్యలు తీసుకుంటామని, ఇందుకు కార్పొరేషన్‌కు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. సమావేశంలో కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణికుముదిని, ఈఎస్ఐసీ ప్రాంతీయ సంచాలకులు రేణుక ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
భారీ మెడికల్ స్కాం.. కాలం చెల్లిన మందులతో..
మదురై డివిజన్లోని ఈఎస్ఐ ఆస్పత్రుల్లో మందుల అక్రమ కొనుగోలు వ్యవహారం వెలుగు చూసింది. నిబంధనలను అతిక్రమించి రూ. 27 కోట్లకు కాలం చెల్లిన మందులు, వైద్య సామగ్రిని కొనుగోలు చేసిన అధికారుల బండారం తాజాగా బయట పడింది. వైద్యవిభాగం మాజీ డైరెక్టర్ సహా నలుగురిపై శనివారం కేసు నమోదైంది. వీరిని ప్రశ్నించేందుకు ఏసీబీ పావులు కదుపుతోంది. సాక్షి, చెన్నై: గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో సాగిన అవినీతి వ్యవహారాలపై ప్రస్తుత డీఎంకే ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయా శాఖల మంత్రులను టార్గెట్ చేసి.. ఏసీబీ సోదాలు చేస్తోంది. అదే సమయంలో ఆరోగ్య శాఖలో భారీస్థాయిలో అవినీతి జరిగినట్లు ఫిర్యాదులు, ఆరోపణలు రావడంతో డివిజన్ల వారీగా ఏసీబీ వర్గాలు విచారణను వేగవంతం చేశాయి. ఇందులో మదురై డివిజన్ పరిధిలో కాలం చెల్లిన మందులను కొనుగోలు చేసి ఉండడం వెలుగులోకి వచ్చింది. మాయాజాలం.. ఏసీబీ విచారణలో వెలుగు చూసిన అంశాల మేరకు.. 2017లో మదురై డివిజన్ ఈఎస్‌ఐలకు మందుల కొనుగోలుకు రూ.13.12 కోట్లు కేటాయించారు. అయితే, కొన్ని నెలల వ్యవధిలో ఈ మొత్తం రూ. 40 కోట్ల 29 లక్షలకు చేరింది. అంచనా వ్యయం పెరగడమే కాకుండా, ఆగమేఘాలపై మందులను కొనుగోలు చేయడంలో అక్రమాలు వెలుగు చూసినట్లు తేలింది. 2018లో గణంకాల మేరకు రూ. 27 కోట్లు విలువైన మందులు కాలం చెల్లినవిగా తేలింది. ఉద్దేశపూర్వకంగానే వీటిని కొనుగోలు చేసినట్లు స్పష్టం కావడంతో ఏసీబీ కన్నెర్ర చేసింది. ప్రభుత్వాన్ని మోసం చేసి, అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికారులను గుర్తించే పనిలో పడ్డారు. ఈ మేరకు అప్పటి తమిళనాడు వైద సేవల విభాగం డైరెకర్ట్(ఈఎస్ఐ) ఇన్భశేఖర్, మదురై డివిజన్ ఈఎస్ఐ నిర్వాహక అధికారి జాన్ఆండ్రూ, పర్యవేక్షణాధికారి అశోక్‌కుమార్‌తో పాటు నలుగురిపై ప్రస్తుతం ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ ఐదుగురిని విచారించేందుకు కసరత్తులు చేపట్టారు. అదే సమయంలో పేద కార్మికులు, సిబ్బందికి ఈఎస్ఐ ద్వారా కాలం చెల్లిన మందులు పంపిణీ జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం రూ. 27 కోట్లు విలువైన కాలం చెల్లిన మందులు గోడౌన్లకే పరిమితమై ఉండటం గమనార్హం. ఇదిలా ఉండగా, శివగంగై జిల్లాలో 2020లో కరోనాకాలం వైద్య సామగ్రి కొనుగోలులో రూ. 60 లక్షలు అక్రమాలు జరిగినట్లుగా ఏసీబీకి ఫిర్యాదులందాయి. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. చదవండి: Viral Video: జస్ట్ మిస్....చిన్నారిపై మూకుమ్మడిగా కుక్కలు ఎటాక్! -
చాటింగ్ చేయొద్దన్నందుకు... మెట్రో స్టేషన్ పైనుంచి దూకి
సాక్షి అమీర్‌పేట్: నగరంలోని ఈఎస్ఐ మెట్రో స్టేషన్ నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సార్‌నగర్ ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ శ్రీరామ్‌నగర్ సమీపంలోని సంజయ్ నగర్‌కు చెందిన అన్వర్‌ఖాన్ ఆటో మొబైల్ దుకాణం నడుపుతున్నాడు. ఆయనకు ముగ్గురు కుమారులు, కూతురు షబ్నం బేగం (22) ఉన్నారు. షాదాన్ కాలేజీలో షబ్నం బేగం ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. కొంతకాలంగా షబ్నం బేగం ఫోన్లో ఎవరితోనో చాటింగ్ చేస్తోంది. ఈ విషయం కుటుంబ సభ్యుల దృష్టికి రావడంతో మందలించారు. మనస్తాపానికి గురైన ఆమె మంగళవారం సాయంత్రం ఈఎస్ఐ మెట్రో స్టేషన్‌కు చేరుకుంది. మొదటి అంతస్తు పైనుంచి కిందకు దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. (చదవండి: భర్తపై విషప్రయోగం చేసి హత్య) -
ఈఎస్ఐ మెట్రోస్టేషన్ పైనుంచి దూకిన యువతి..
సాక్షి, హైదరాబాద్: ప్రేమ విఫలమైందని ఓ యువతి ఈఎస్ఐ మెట్రోస్టేషన్ పైనుంచి కిందకు దూకింది. మెట్రోస్టేషన్ నుంచి దూకడంతో తీవ్రగాయాలైన ఆ యువతిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువతి ప్రాణాలను కోల్పోయింది. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ రామ్ నగర్‌కు చెందిన యువతిగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. చదవండి: కూతురి ఉసురు తీసిన తండ్రి.. అదృశ్యమైందంటూ.. -
ప్రతీ కార్మికుడికి హెల్త్ ప్రొఫైల్
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ చందాదారుల ఆరోగ్య భద్రత విషయంలో కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈఎస్ఐ పరిధిలో ఉన్న ప్రతీ కార్మికుడి హెల్త్ ప్రొఫైల్‌ను నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం అనారోగ్యం బారిన పడ్డ కార్మికులకు వైద్య చికిత్స, మందుల పంపిణీ వరకు పరిమితమైన ఈఎస్ఐసీ... ఇకపై కార్మికుడి ఆరోగ్య చిట్టా మొత్తాన్ని నిక్షిప్తం చేయనుంది. అంతేకాకుండా క్రమం తప్పకుండా ఏటా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి సదరు కార్మికుడికి హెచ్చరికలు సైతం ఇవ్వనుంది. దీంతో భవిష్యత్ ఆరోగ్య పరిస్థితిపై కొంత అంచనా వస్తుందని, సకాలంలో జాగ్రత్తలు తీసుకుంటే కార్మికుడికి ఆరోగ్యకర జీవితం అందుతుందని సంస్థ చెబుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 63వేల సంస్థలు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలున్నాయి. వీటి పరిధిలో 21 లక్షల మంది చందాదారులున్నారు. వీరి కుటుంబ సభ్యులను కలుపుకుంటే దాదాపు 80 లక్షలు అవుతారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ఈఎస్ఐ ఆస్పత్రుల్లో ఏటా సగటున 3.5 లక్షల మంది ఐపీ (ఇన్‌పేషెంట్) కేటగిరీలో వైద్య చికిత్సలు పొందుతున్నారు. వీటికి అదనంగా మరో 20 శాతం మంది ఓపీ సేవలు కూడా పొందేవారున్నట్లు ఈఎస్ఐసీ చెబుతోంది. ఆరోగ్య పరీక్షలు కీలకం కార్మికుల హెల్త్ ప్రొఫైల్ నిర్వహణలో ఆరోగ్య పరీక్షల ప్రాత కీలకం. దీంతో ఏడాదికోసారి కార్మికులకు పూర్తిస్థాయి ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ఈఎస్ఐసీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం అనారోగ్య సమస్యలు తలెత్తిన వారు మాత్రమే పరీక్షలు చేయించుకుని చికిత్స పొందుతున్నారు. ఇకపై హెల్త్ ప్రొఫైల్ నిర్వహణలో భాగంగా తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అనంతరం ఫలితాలను ఈఎస్ఐసీ వెబ్సైట్లో కార్మికుడి డేటాలో నిక్షిప్తం చేసి, ప్రతి సంవత్సరం ఈ వివరాలను అప్డేట్ చేస్తారు. పరీక్షల్లో ఏవైనా అనారోగ్య సంబంధిత లక్షణాలు, దీర్ఘకాల వ్యాధులు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత ఆస్పత్రికి రిఫర్ చేసి చికిత్సను అందిస్తారు. ప్రస్తుతం ఆరోగ్య పరీక్షలను అన్ని ఈఎస్ఐ ఆస్పత్రుల్లో చేపట్టేలా చర్యలు మొదలు పెట్టారు. గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాల పనితీరుతోపాటు రక్త, మూత్ర పరీక్షలు నిర్వహిస్తారు. మరోవైపు చందాదారులందరికీ స్మార్ట్ కార్డులు ఇవ్వాలని కూడా సంస్థ నిర్ణయించింది. ఏప్రిల్ నాటికి ఈ ప్రక్రియ పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. -
ఈఎస్ఐ కుంభకోణం: దూకుడు పెంచిన ఈడీ..
హైదరాబాద్: తెలంగాణలో సంచలనంగా మారిన ఈఎస్ఐ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్ (ఈడీ) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసుకు సంబంధించి.. ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి, మాజీ జేడీ పద్మజ ఆస్తులతోపాటు ఫార్మసిస్టు కె. నాగమణి, కాంట్రాక్టర్లు కె. శ్రీహరిబాబు, పి. రాజేశ్వర్ రెడ్డి ఆస్తులను అటాచ్ చేసింది. బీమా, వైద్య సేవలకు సంబంధించి రూ. 144 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఈడీ దర్యాప్తులో తెలింది. రాష్ట్ర ఏసీబీ అధికారుల కేసుల ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. -
ఈఎస్ఐ కుంభకోణం కేసులో నలుగురు అరెస్ట్
సాక్షి, విజయవాడ: ఈఎస్ఐ కుంభకోణం కేసులో సీబీఐ అధికారులు నలుగురిని బుధవారం అరెస్ట్ చేశారు. ఈఎస్ఐ ఆస్పత్రి సూపరింటెండెంట్ బాలరవికుమార్ సహా ఓమ్ని ఎంటర్ ప్రైజెస్ యజమాని కంచర్ల శ్రీహరి, ఓమ్ని హెల్త్ కేర్ యజమాని కంచర్ల సుజాత, మేనేజర్ వెంకటేశ్వర్లును అరెస్ట్ చేశారు. వైద్య పరికరాలు, మెడికల్ కిట్లను 50 నుంచి 400 శాతం అధిక రేట్లకు విక్రయించినట్లు సీబీఐ నిర్థారించింది. ప్రభుత్వ ఖజానాకు రూ.35 కోట్ల మేర నష్టం కలిగించినట్లు సీబీఐ అధికారులు నిర్థారించారు. అరెస్ట్ చేసిన నలుగురునీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. -
గప్ చుప్‌గా ఈఎస్ఐ నిధులను సర్దేశారు
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్లో కేటాయించిన నిధులు ఆయా శాఖలకు పూర్తిస్థాయిలో రాకపోవడం సాధారణంగా జరిగేదే. అత్యంత ప్రాధాన్యరంగాలుగా ప్రభుత్వం గుర్తించిన వాటికి లేదా ఏదైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే కేటాయింపుల కంటే ఎక్కువ నిధులివ్వడం జరుగుతుంది. అయితే ఈఎస్ఐకి అదనంగా నిధులు రావడం, అవి పక్కదారి పట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈఎస్ఐ విభాగానికి అదనపు నిధులు కావాలని కార్మికశాఖ ప్రభుత్వాన్ని కోరడం.. ప్రభుత్వం కూడా అడిగిందే తడవుగా నిధులు మంజూరు చేయడం వెనక ఎవరి హస్తం ఉందో తెలుసుకునే పనిలో పడ్డారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు. 2015 నుంచి 2019 వరకు ఈఎస్ఐకి రాష్ట్ర ప్రభుత్వం వాస్తవానికి రూ.1278.22 కోట్లు కేటాయించింది. కానీ ఈ నాలుగేళ్లలో మొత్తంగా రూ.1616.93 కోట్ల నిధులు మంజూరు చేసింది. అంటే బడ్జెట్ కేటాయింపుల కంటే అదనంగా రూ.338.71 కోట్లు విడుదల చేసిందని ఈఎస్ఐ సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తం అదనంగా ఎందుకు చెల్లించాల్సి వచ్చింది? ఎవరి ఒత్తిళ్లు పనిచేశాయనే సందేహాలు, మంత్రి కార్యాలయ సిబ్బంది పాత్రపై అనుమానాలు ఇదివరకే వ్యక్తమయ్యాయి. గతంలో కార్మికశాఖ మంత్రికి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ముకుందరెడ్డి, ఆ మాజీ మంత్రి అల్లుడు శ్రీనివాసరెడ్డి ఇళ్లలో ఈడీ సోదాలు చేయడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. బిల్లులు ఇవ్వకుండా సతాయించి... వాస్తవానికి ఈఎస్ఐకి చెంది ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) కార్మికుల కోసం ఏటా మందులు కొనుగోలు చేస్తుంది. నిబంధనల ప్రకారం.. ప్రొక్యూర్మెంట్ కమిటీ ముందు ఆసుపత్రికి ఎన్ని మందులు కావాలి? ఏయే మందులు, పరికరాలు కావాలి? అన్న విషయాలపై నివేదిక ఇస్తుంది. దాని ప్రకారం.. ఆర్సీ (రేటెడ్ కంపెనీలు) కంపెనీల నుంచి బహిరంగ టెండర్లు ఆహ్వనించాలి. వచ్చిన టెండర్లలో మార్కెట్ రేటు కంటే తక్కువకు ఎవరు కోట్ చేస్తే వారికి టెండర్ అప్పగించాలి. కానీ, ఐఎంఎస్ అధికారులు ఈ ప్రక్రియను పాటించలేదు. ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికారాణి, మాజీ డిప్యూటీ డైరెక్టర్ పద్మలు సరఫరా అయిన మందుల్లో 30 శాతం ఆర్సీ కంపెనీల నుంచి, మిగిలిన 70 శాతం ఎన్ఆర్సీ (నాన్ రేటెడ్ కంపెనీ)ల నుంచి తీసుకోవడం గమనార్హం. వాస్తవానికి ఆర్సీ కంపెనీల నుంచి సింహభాగం మందులు కొనుగోలు చేయాలి. కానీ, ఉద్దేశపూర్వకంగా ఆర్సీ కంపెనీలకు బిల్లులు చెల్లించేవారు కాదని, దీంతో సదరు కంపెనీలు మందుల సరఫరా నిలిపివేయగానే.. ఆ సాకుతో ఎన్ఆర్సీ కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చారని ఈఎస్ఐ సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఎన్ఆర్సీకి ఎప్పుడు వెళ్లాలి? జీవో నెం 51 ప్రకారం.. అత్యవసర పరిస్థితుల్లో, ఆర్సీ కంపెనీలు సరఫరా చేయలేని మందుల కోసం మాత్రమే ఎన్ఆర్సీ కంపెనీలకు మందుల సరఫరా కాంట్రాక్టు ఇవ్వాలి. దానికి సైతం ప్రొక్యూర్ కమిటీ నివేదిక, బహిరంగ టెండర్లు, కంపెనీల ఎంపిక నిబంధనలు తప్పకుండా పాటించాలి. కానీ, ఐఎంఎస్‌లో ఇవేమీ జరగలేదు. టెండర్లు లేకుండా కాంట్రాక్టులు అప్పగించిన తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. అసలు విషయం ఏంటంటే.. రేటెడ్ కంపెనీలు అధికారులకు ఎలాంటి ముడుపులు, కమీషన్లు ఇవ్వవు. అదే, ఎన్ఆర్సీ కంపెనీలైతే అడిగినంత ఇస్తాయి. అందుకు బదులుగా కాంట్రాక్టు దక్కించుకున్నవారు ధరలు పెంచుకునే వీలును గతంలో అధికారులు కల్పించారు. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు ఇష్టానుసారంగా అప్పగించిన టెండర్లకు ప్రొక్యూర్ కమిటీని ఏర్పాటు చేయనేలేదని ఈఎస్ఐ కార్మికులు ఆరోపిస్తున్నారు. వారే డొల్ల కంపెనీలను సృష్టించి, తమకు అనుకూలంగా ఉండే కాంట్రాక్టర్లను ఎంపిక చేసుకుని కథ నడిపారని, అందుకే అదనపు నిధులు విడుదల అయినా కార్మికులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని మండిపడుతున్నారు. అదృశ్య శక్తులపై ఈడీ ఆరా వాస్తవ బడ్జెట్ కంటే అధికంగా నిధులు ఎందుకు విడుదల చేయాల్సి వచ్చింది? ఏ పరిస్థితుల్లో ఆ ప్రతిపాదనలు చేయాల్సి వచ్చింది? అందుకు, ఐఎంఎస్ అధికారులు ఏం కారణం చూపారు? ఆ ప్రతిపాదనలను ఉన్నతాధికారులు ఏ పరిస్థితుల్లో ఆమోదించారు? దీని వెనక అదృశ్య రాజకీయశక్తులు ఏమైనా ఉన్నాయా? అని ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇందుకోసం ఐఎంఎస్ ఆడిట్ పుస్తకాలు, ప్రభుత్వానికి విజిలెన్స్ కమిటీ ఇచ్చిన నివేదిక తదితరాలపై ఈడీ అధ్యయనం చేస్తోంది. నాలుగేళ్లలో కేటాయింపుల కంటే రూ.338 కోట్లు అధికంగా తీసుకొని ఖర్చుపెట్టి ఏం సేవలు అదనంగా అందించారు? ఎక్కడ సేవలు మెరుగుపరిచారు? అన్న విషయాలపైనా ఈడీ తవ్వడం మొదలుపెడుతోంది. ( చదవండి: ఐఎంఎస్ స్కాంలో దర్యాప్తు ముమ్మరం ) -
ESI కుంభకోణంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం
-
ఈడీ సోదాలు: నాయిని అల్లుడి ఇంట్లో కళ్లు చెదిరే నగదు
-
ఈడీ సోదాలు: నాయిని అల్లుడి ఇంట్లో కళ్లు చెదిరే నగదు
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) కేసులో సుదీర్ఘకాలం తరువాత ముందడుగు పడింది. తాజాగా ఈ కేసు లో నిందితుల ఇళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. ప్రధాన నిందితులు మాజీ డైరెక్టర్ దేవికారాణి, ఆమె భర్త గురుమూర్తి, కాంట్రాక్టర్ కంచర్ల శ్రీహరిబాబు, మాజీ కార్మిక మంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి ముకుందరెడ్డి, నాయిని అల్లుడు శ్రీనివాసరెడ్డి ఇళ్లతో కలిపి దాదాపు ఏడు చోట్ల ఈడీ సోదాలు నిర్వహించారు. శనివారం ఉదయం 6 గంటల నుంచే నిందితుల ఇళ్లలో ఏకకాలంలో మొదలైన తనిఖీలు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ముగిశాయి. నాయిని అల్లుడు శ్రీనివాసరెడ్డి, మాజీ పీఎస్ ముకుందరెడ్డి, అతని బావమరిది వినయ్‌రెడ్డి, ఏడు డొల్ల ఫార్మా కంపెనీల అధినేత బుర్రా ప్రమోద్‌రెడ్డి ఇళ్లల్లో భారీగా నగలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో దాదాపు రూ.3 కోట్ల నగదు లభించిందని ఈడీ పేర్కొంది. ఇందులో శ్రీనివాసరెడ్డి ఇంట్లో రూ.1.50 కోట్లు, ప్రమోద్‌రెడ్డి ఇంటి నుంచి రూ.1.15 కోట్లు, ఎం.వినయ్‌రెడ్డి ఇంటి నుంచి రూ.45 లక్షలు, రూ.కోటి విలువైన నగలు, ఖాళీ చెక్కులు, ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కరోనా కారణంగా మందకొడిగా సాగిన విచారణ ఈ దాడులతో మళ్లీ వేగం పుంజుకున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ముగ్గురు కీలక నిందితులను ఈడీ అదుపులోకి తీసుకోవడంతో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. 2015–2019 మధ్యకాలంలో దాదాపు రూ.700 కోట్ల మందుల కొనుగోళ్లలో సుమారు రూ.100 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు అవినీతితోపాటు మనీలాండరింగ్ కూడా జరిగిందన్న ఏసీబీ నివేదిక(8 ఎఫ్ఐఆర్లు)తో ఈడీ రంగంలోకి దిగింది. అసలేమిటీ కేసు.. ఈఎస్ఐలోని ఐఎంఎస్‌లో మందుల కొనుగోళ్లలో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై విజిలెన్స్ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా 2019, సెప్టెంబర్‌లో ఏసీబీ రంగంలోకి దిగింది. అప్పటి డైరెక్టర్ దేవికారాణిని విచారణకు పిలిచి ఆమెతో పాటు మరో ఏడుగురిని అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. 2015 నుంచి 2019 దాకా.. దాదాపు రూ.700 కోట్ల విలువైన మందుల కొనుగోళ్లలో అప్పటి డైరెక్టర్ దేవికారాణి, మాజీ డైరెక్టర్ పద్మ ఎక్కడా నిబంధనలు పాటించలేదని, మందుల సరఫరాకు టెండర్లు పిలవకుండా, అర్హతలేని కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టారని ఏసీబీ ఆరోపించింది. మందుల కొనుగోలుకు స్పష్టమైన మార్గదర్శకాలతో 2012లోనే ప్రభుత్వం జీవో నంబర్ 51ని విడుదల చేసింది. దాని ప్రకారం రిజిస్టర్డ్ కంపెనీలను మాత్రమే టెండర్లకు పిలవాలి. అత్యవసర సమయాల్లో మాత్రమే నాన్ రిజిస్టర్డ్ కంపెనీలకు టెండర్లు ఇవ్వాలి. కానీ ఈ ఒక్క లొసుగును అడ్డంపెట్టుకుని దేవికారాణి, పద్మ, ఓమ్మీ ఫార్మా ఎండీ కంచర్ల శ్రీహరిబాబు అలియాస్ బాబ్జీలు కథ నడిపారని ఏసీబీ గుర్తించింది. అర్హతలేని కంపెనీలకు చెందిన మందులను అధిక ధరలకు శ్రీహరిబాబు కోట్ చేయగా, వాటిని వీరిద్దరూ అంగీకరించేవారు. బదులుగా వీరిద్దరి ఖాతాల్లో రూ.కోట్లు వచ్చి చేరాయి. శ్రీహరిబాబుతో పాటు నిందితులంతా దాదాపుగా 100కు పైగా డొల్ల కంపెనీలను సృష్టించి వాటికి సైతం కాంట్రాక్టులు దక్కించుకుని ప్రభుత్వ సొమ్మును తమ ఖాతాలోకి మళ్లించుకున్నారు. చాలాసార్లు ఖాళీ ఇండెంట్లపై దేవికారాణి, పద్మ సంతకాలు చేయించుకుని తమకు నచ్చిన ధర వేసుకునేవారని ఏసీబీ గుర్తించింది. ఫలితంగా నిందితులంతా అనతికాలంలో అనేక చోట్ల భూములు, ప్లాట్లు, నగలు, నగదు కూడబెట్టారు. ఏసీబీ వారందరి చిట్టాను బయటపెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితులతో పాటు వారికి సహకరించిన వారు, బినామీలు అంతా కలిసి దాదాపు 40 మంది నిందితుల జాబితాను ఏసీబీ రూపొందించింది. ఇందులో డైరెక్టర్ నుంచి మెడికల్ రిప్రజెంటేటివ్ వరకు ఉండటం గమనార్హం. ఈ మొత్తం వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందన్న అనుమానంతో విచారణ జరపాలని ఈడీకి ఏసీబీ లేఖ రాసింది. అవినీతి డబ్బుతో ఆస్తులు, జల్సాలు.. సాధారణంగా మార్కెట్ ధరకంటే ఏ సంస్థ తక్కువకు కోట్ చేస్తే వారికి టెండర్ ఇస్తారు. ఇక్కడ అసలు టెండర్లే లేవు. నచ్చిన వ్యక్తికి టెండర్లు లేకుండా అందులోనూ ఏకంగా మార్కెట్ రేటు కంటే 200 శాతం అదనపు ధరకు మందులు, మెడికల్ కిట్లను సరఫరా చేసే పనులను అప్పగించడం చూసి ఏసీబీ అధికారులే విస్మయం చెందారు. అలా ప్రభుత్వ సొమ్మును నచ్చిన కాంట్రాక్టరుకు దోచిపెట్టడం, వారిచ్చిన కమిషన్లతో వీరు ఆస్తులు కొన్నారు. విందులు–వినోదాలు, జల్సాలు, విదేశాలకు విహారయాత్రలకు వెళ్లడం చేశారు. వీరి జీతాలెంత, కొన్న ఆస్తుల విలువెంత, ఐటీ ఎంత కట్టారనే వివరాలన్నింటినీ ఏసీబీ గతంలోనే సేకరించింది. ప్రధాన సూత్రధారుల్లో ఒకడైన కంచర్ల శ్రీహరిబాబు అలియాస్ బాబ్జీ ఖాతాలో 2018లో ఏకంగా రూ.54 కోట్లు వచ్చి పడ్డాయి. అతనికి రూ.99 కోట్ల విలువైన షేర్లు, రూ.24 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. 2017–18లో అతను ఆదాయపు పన్నుశాఖకు రూ.19 కోట్లు పన్ను రూపంలో చెల్లించడం గమనార్హం. ఇతను లెజెండ్ అనే డొల్ల కంపెనీని సృష్టించి దానికి కృపాసాగర్ రెడ్డి అనే బినామీని కూడా పెట్టాడు. ఇక దేవికారాణి తనకు వచ్చిన డబ్బును ఏకంగా రియల్ ఎస్టేట్‌లో పెటుబడులు పెట్టింది. ఆమె అనుచరులు కూడా రూ.కోట్లాది విలువైన విల్లాలు, ఫ్లాట్లు కొనుగోలు చేశారు. 2020, సెప్టెంబర్‌లో దేవికారాణి దాదాపు రూ.4.47 కోట్ల రియల్ ఎస్టేట్ పెట్టుబడులను తిరిగి స్వాధీనం చేసుకుంది. నిందితుల్లో ఇద్దరు వ్యక్తులు మూడు ఫార్మా కంపెనీలు ప్రారంభించేందుకు గతంలో ప్రయత్నాలు ప్రారంభించారు. అందుకోసం భూమి కూడా కొనుగోలు చేశారు. ఇక మరో కీలక నిందితుని ఇంట జరిగిన పెళ్లికి నిందితుడైన మరో పెద్దమనిషి దాదాపు కిలో బంగారు ఆభరణాలను కానుకగా సమర్పించడం వీరి మధ్య అవినీతి బంధాన్ని చాటిచెబుతోంది. అంతేకాదు మరో నిందితుడు ఏకంగా కన్స్ట్రక్షన్స్ కంపెనీని కూడా మొదలుపెట్టినట్లు ఈడీ అనుమానిస్తోంది. మరి ఐఏఎస్ అధికారి సంగతేంటి? ఈ కేసులో అప్పట్లో ఓ ఐఏఎస్‌పై చర్యలు తీసుకోవాలని ఈఎస్ఐ సిబ్బంది గట్టిగా డిమాండ్ చేశారు. నాలుగేళ్లుగా అక్రమాలు జరుగుతున్నా సదరు అధికారి వీటిని తొక్కిపెట్టారని ఆరోపించారు. అంతేకాదు విజిలెన్స్ నివేదికలు బయటికి రాకుండా.. అవినీతి అధికారులకు సదరు అధికారి వత్తాసు పలికాడని, అసలు ఆయనే వీరిని చాలాకాలంగా కాపాడాడని ధ్వజమెత్తారు. నిందితులను సదరు అధికారి పరోక్షంగా సమర్థిస్తూ రాసిన లేఖలు లీకవడం కలకలం రేపింది. అదే సమయంలో ముకుందరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిలతోపాటు సదరు ఐఏఎస్ అధికారిని కూడా విచారించాలన్న డిమాండ్ వినిపించినా అది కార్యరూపం దాల్చలేదు. డిసెంబర్లో నిందితులను విచారించిన ఈడీ వారు చెప్పిన వివరాల ఆధారంగానే ముకుందరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి మధ్య ఏమైనా లావాదేవీలు జరిగాయా? అన్న కోణంలో విచారణ సాగిస్తోందని సమాచారం. ఇదే సమయంలో సదరు ఐఏఎస్ విషయంలో ఈడీ ఎలా ముందుకెళుతుందనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. చదవండి: ఈఎస్ఐ స్కాం: నాయిని అల్లుడి ఇంట్లో ఈడీ సోదాలు -
ఈఎస్ఐ స్కాం: నాయిని అల్లుడి ఇంట్లో ఈడీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ కుంభకోణం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు చేపట్టింది. ఉదయం నుంచి ఒకేసారి 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. దివంగత మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయిని వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ముకుంద రెడ్డి, దేవికా రాణి, ఇతర నిందితుల ఇళ్లల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణంలో వైద్య కిట్లు, మందుల కొనుగోళ్ల వ్యవహారంలో నకిలీ బిల్లులు సృష్టించి రూ.6.5 కోట్లు కుంభకోణం జరిగినట్టు ఏసీబీ గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ స్కామ్‌లో ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి సహా తొమ్మిది మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. చదవండి: ముగ్గురు మాయ లేడీలు.. భలే దోపిడీలు! కన్నీరు తుడవంగ.. సొంతింట్లోకి సగర్వంగా -
హైదరాబాద్: ఈఎస్ఐ కుంభకోణం కేసు
-
73 కోట్లతో విజయనగరంలో ఈఎస్ఐ ఆస్పత్రి
సాక్షి, న్యూఢిల్లీ: విజయనగరంలో 73.68 కోట్ల రూపాయల వ్యయంతో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి కార్మిక బీమా సంస్థ (ఈఎస్ఐ) ఆమోదించినట్లు కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ వెల్లడించారు. వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు బుధవారం రాతపూర్వక సమాధానమిచ్చారు. ఈ ఆస్పత్రిలో ప్రాథమిక వైద్య సేవలతోపాటు ఔట్ పేషెంట్, ఇన్ పేషంట్లకు ప్రత్యేక వైద్య సదుపాయాలను కల్పించబోతున్నట్లు వెల్లడించారు. ఎమర్జెన్సీ సర్వీసులు, ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, డయాగ్నోస్టిక్స్ సేవలు, మందుల పంపిణీతో వంటి సకల సదుపాయాలను అందుబాటులోకి తీసురానున్నట్లు తెలిపారు. అదే విధంగా.. ఈ ఆస్పత్రిలో ఆయుష్ కింద కూడా రోగులకు సేవలు అందిస్తారని చెప్పారు. ఆస్పత్రి నిర్మాణాన్ని 2023 నాటికల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.(చదవండి: బడ్జెట్ 2021: రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ) గృహ రుణాల వడ్డీపై సబ్సిడీ పథకం పొడిగింపు మధ్య తరగతి ప్రజలు తమ సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ప్రవేశపెట్టిన గృహ రుణాల వడ్డీపై సబ్సిడీ చెల్లింపు పథకం (సీఎల్ఎస్ఎస్)ను ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగించినట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. రాజ్యసభలో బుధవారం వఘెస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) కింద అర్హులైన మధ్య తరగతి ప్రజలు గృహ రుణాలపై వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో చెల్లిస్తుందని అన్నారు. అదే విధంగా అర్హులైన లబ్దిదారులు రుణం పొందిన వెంటనే వడ్డీ మొత్తాన్ని వారి అకౌంట్ ద్వారా రుణం తీసుకున్న సంస్థలకు ప్రభుత్వం బదలాయిస్తుందని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ కింద గృహ రుణాలపై వడ్డీ సబ్సిడీ పథకాన్ని గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగించినట్లు మంత్రి తెలిపారు. 2020-21 మధ్యకాలంలో ఈ పథకం కింద 1.67 లక్షల మంది లబ్ది పొందారు. పథకం ప్రారంభిన నాటి నుంచి ఇప్పటి వరకు 4.93 లక్షల మంది ప్రయోజనం పొందారని మంత్రి చెప్పారు. -
ఈఎస్ఐ కేసు: కోటి 99 లక్షలు సీజ్!
సాక్షి, హైదరాబాద్ : ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణికి చెందిన కోటి 99 లక్షలను బుధవారం ఏసీబీ సీజ్ చేసింది. తెలంగాణతో పాటు తమిళనాడు రాష్ట్రాల్లో దేవికారాణితో పాటు ఆమె కుటుంబ సభ్యులు చిట్ ఫండ్ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టారు. ప్రతి నెల చిట్ ఫండ్ కంపెనీకి లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. ఏసీబీ అధికారులు సదరు చిట్‌ఫండ్ కంపెనీనుంచి కోటి 99 లక్షల రూపాయల డీడీని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే దేవికారాణికి సంబంధించి రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టిన పెట్టుబడులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన నాలుగు కోట్ల నలభై ఏడు లక్షల నగదుతో పాటు రెండు కోట్ల 29 లక్షల రూపాయలను డీడీల రూపంలో స్వాధీనం చేసుకున్నారు. -
ఏబీవీకేవైతో నిరుద్యోగ భృతి
సాక్షి, అమరావతి: విజయవాడకు చెందిన ప్రవీణ్ కుమార్ స్టీల్ పాత్రలు తయారు చేసే సంస్థలో ఉద్యోగి. లాక్‌డౌన్‌తో ఉపాధిని కోల్పోయారు. కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐ) ఆధ్వర్యంలోని పథకం ద్వారా నిరుద్యోగ భృతిని పొంది కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. ఇలా రాష్ట్రంలో వేలాది మంది ‘అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన (ఏబీవీకేవై)’తో లబ్ధి పొందారు. విపత్కర పరిస్థితుల్లో ఉపాధిని కోల్పోయిన కార్మికవర్గం కోసం కేంద్రం ఈ పథకాన్ని ఈఎస్ఐ ద్వారా అమలు చేస్తోంది. ఎవరైనా లబ్ధి పొందాలనుకుంటే డిసెంబర్ 31లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈఎస్ఐ పరిధిలోని కార్మికులకే ఇది వర్తిస్తుంది. ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేయాలంటే.. esic. in/ employee పోర్టల్‌లోకి లాగిన్ కావాలి. ఏబీవీకేవై క్లెయిమ్ పొందేందుకు ఉద్దేశించిన విభాగంపై క్లిక్ చేయాలి. ఆ దరఖాస్తులో నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కావాలనుకుంటున్నారో నమోదు చేసి సబ్మిట్పై క్లిక్ చేయాలి. నిరుద్యోగ కాల వివరాలను నమోదు చేసిన ఏబీ–1 ఫారం ప్రింట్ తీసుకొని అందులో ఉన్న విషయాన్ని రూ.20 స్టాంప్ పేపర్‌పై టైపు చేయించి నోటరీ చేయించాలి. దానిపై దరఖాస్తుదారు సంతకం చేయాలి. ఏబీ–2 అనే ఫారంనూ ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలి. దానిపై సంబంధిత కంపెనీ యాజమాన్యం సంతకం తీసుకోవాలి. యాజమాన్యం ధ్రువీకరించకపోతే పీఎఫ్ నంబర్‌ను దరఖాస్తుపై వేసి ఈఎస్ఐ కార్యాలయంలో సమర్పించాలి. ఈఎస్ఐ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలు అఫిడవిట్‌కు జత చేయాలి. నిరుద్యోగ భృతి కావాలనుకున్న సమయంలో సంబంధిత దరఖాస్తుదారు ఉద్యోగం లేకుండా ఉండాలి. ఉద్యోగం పోగొట్టుకోవడానికి ముందు కనీసం రెండేళ్లపాటు ఆయా సంస్థల్లో పని చేసి ఉండాలి. ఏదో ఒక కారణంతో ఉద్యోగం పోగొట్టుకున్న వారు దీనికి అనర్హులు. ఉద్యోగులను తీసివేసినట్టు యాజమాన్యాలు ధ్రువీకరించకపోతే సమీపంలోని ఈఎస్ఐ కార్యాలయంలో అధికారిని సంప్రదించాలి. -
అవినీతి నేతకు అధ్యక్ష పదవా?
సాక్షి, అమరావతి: ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టయి బెయిల్‌పై బయట ఉన్న అచ్చెన్నాయుడికి పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టడంపై ఆ పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అవినీతిలో కూరుకుపోయిన నేతకు అధ్యక్ష పదవి ఇవ్వడం ఏమిటని పార్టీ సీనియర్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అవినీతి వ్యవహారంలో పక్కాగా దొరికిన వ్యక్తిని అందలం ఎక్కించడం దేనికి సంకేతమనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. లోకేష్ తనకు అనుకూలంగా ఉండే వ్యక్తికి అధ్యక్ష పదవి ఇవ్వాలని పట్టుబట్టడంతో అచ్చెన్నకు పదవిపై చంద్రబాబు చాలా రోజులు నాన్చుతూ వచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒకేసారి 56 బీసీ కార్పొరేషన్లకు అధ్యక్షులను ప్రకటించడం, బీసీల సంక్షేమానికి పెద్ద ఎత్తున కృషి చేస్తుండటంతో దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు హడావుడిగా అచ్చెన్న పేరు ప్రకటించినట్లు పేర్కొంటున్నారు. కాగా, పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీలో సీనియర్లను పక్కనపెట్టి జూనియర్లకు అవకాశం ఇవ్వడం, ఒక్కరికే రెండు పదవులు ఇవ్వడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. -
'నీకు కరోనా రాను'
సాక్షి, సిటీబ్యూరో : కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఈఎస్ఐ మెడికల్ కాలేజీ డీన్ శ్రీనివాస్‌ను టార్గెట్‌గా చేసుకున్నారు. నకిలీ ఈ–మెయిల్ ఐడీలు సృష్టించిన నేరగాళ్లు ఆయనకు బెదిరింపులు, శాపనార్థాలతో కూడిన మెయిల్స్ పంపుతున్నారు. కొన్నింటిలో ‘నీకు కరోన రాను’తో పాటు మరికొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో డీన్ తరఫున ఆ కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ బబ్డే గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు సాంకేతికంగా దర్యాప్తు ప్రారంభించారు. హైదరబాద్ : యూట్యూబ్ చానల్లో తాను చేసిన కామెంట్ల ఆధారంగా తనపై అభ్యంతరకరంగా వ్యాఖ్యలు పోస్టు చేస్తున్న వారిపై ఓ మహిళా న్యాయవాది సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించడంతో మరో కేసు నమోదైంది. నగరానికి చెందిన ఓ వ్యక్తికి రాయల్ సుందర్ ఫైనాన్స్ కంపెనీ పేరుతో సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. ఆయన వినియోగిస్తున్న ఓల్వో కారుకు రూ. 20 వేల రాయితీతో బీమా చేస్తామని చెప్పారు. ఇలా ఆ యజమానిని నమ్మించి ఆయన నుంచి రూ. 98 వేలు కాజేశారు. ఛత్రినాక ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు ఆయన స్థలంలో సెల్ టవర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ పేరుతో ఆరు నెలల కాలంలో రూ. 1.09 లక్షలు కాజేసి మోసం చేశారు. మరో ఉదంతంలో బేగంపేట ప్రాంతానికి చెందిన బాధితుడికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు షేర్ మార్కెట్లో పెట్టుబడులంటూ ఎర వేశారు. అతడి నుంచి రూ. 3 లక్షలు తీసుకుని మోసం చేశారు. ఈ ఉదంతాలపై వేర్వేరు కేసులు నమోదయ్యాయి. -
ఈఎస్ఐ స్కాంలో దేవికారాణికి బెయిల్
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ స్కాంలో ప్రధాన నిందితురాలిగా ఉన్న దేవికారాణికి ఏసీబీ కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఆమెతో పాటు జాయింట్ డైరెక్టర్ పద్మ, ఫార్మసీస్ట్ వసంత, మరో ఇద్దరు ఫార్మా ఉద్యోగులకు కోర్టు బెయిలు మంజూరు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ కిట్లు, ఫార్మా కంపెనీలకు మందుల సరఫరా కాంట్రాక్టుల అప్పగింతలో జరిగిన అవకతవకల్లో రూ.కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసును ఐటీతోపాటు ఈడీ కూడా దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అవతవకల ద్వారా వచ్చిన సొమ్ముతో మాజీ డైరెక్టర్ దేవికారాణి, మాజీ జేడీ పద్మ తదితరులు భారీగా ఆస్తులు కొనుగోలు చేసిన విషయాన్ని ఏసీబీ తన దర్యాప్తులో వెల్లడించింది. దేవికారాణిపై దాడుల సమయంలో ఇందుకు సంబంధించిన పలు రసీదులు దర్యాప్తు అధికారులకు లభించడంతో ఈ విషయం వెలుగుచూసింది. -
'పదవుల్లేక వారికి మతి భ్రమించినట్టయింది'
సాక్షి, అమరావతి : కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం శనివారం టీడీపీ నాయకులు అయ్యన్నపాత్రుడు, బుద్దా వెంకన్నలపై మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'అయ్యన్నపాత్రుడుకి మతిభ్రమించింది.. బుద్దా వెంకన్నకు బుద్ధిలేదు. అడ్డదారిలో రాజకీయాలు చేసే వ్యక్తి ట్విటర్ లోకేష్.. ప్రత్యక్ష రాజకీయాలకు మాత్రం పనికిరాడు. కార్మిక శాఖలో మందుల బిల్లు రావాలని ఏజెన్సీ అడిగితే నేను విచారణకు ఆదేశించా. విచారణలో గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడు 2014-18 మధ్య అవినీతికి పాల్పడ్డారని విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే అవినీతికి పాల్పడిన అచ్చెన్నాయుడును అరెస్టు చేసి విచారణ జరుపుతున్నాం.(చదవండి : ఆ బెంజ్ కారు నా కుమారుడిది కాదు: మంత్రి) అయితే తెలకపల్లి కార్తిక్ 2019 డిసెంబర్లోనే బెంజ్ కారును కొనుగోలు చేశాడు. అయితే కారుకు సంబంధించిన కంతులు కట్టకపోవడంతో ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ బెంజ్ కారును సీజ్ చేసింది. 2020 జూన్‌లో ఈఎస్ఐ కుంభకోణం కింద కార్తిక్‌పై కేసు నమోదయింది. కారు తీసుకొని ఉంటే.. ఈఎస్ఐ స్కాంలో A14 ముద్దాయిగా ఉన్న కార్తిక్‌ను కేసులో నేనేందుకు పేరు తొలగించలేదో చెప్పాలి. టీడీపీ నాయకులు పదవులు లేక మతిభ్రమిచ్చింది.నేను భూమి కొనుగోలులో అన్ని పేపర్లు కరెక్టుగా ఉన్నందుకే కొన్నా,, ఎక్కడా భూకజ్జాకి పాల్పడలేదు. 'అంటూ చురకలంటించారు. -
ఆ బెంజ్ కారు నా కుమారుడిది కాదు: మంత్రి
సాక్షి, కర్నూలు : ఈఎస్ఐ స్కాంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకు ప్రమేయం ఉందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలను మంత్రి తీవ్రంగా ఖండించారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్నపాత్రుడు చెబుతున్నట్లు తన కుమారుడి పక్కనున్న బెంజ్ కారు తమది కాదని, కారు పక్కన కేవలం ఫోటో మాత్రమే దిగాడని వివరించారు. హెలికాఫ్టర్, ట్రైన్ పక్కన ఫోటోలు తీసుకుంటే మనదే అవుతుందా అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. కారు మాదే అని రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాలు విసిరారు. శుక్రవారం ఆలూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి జయరాం మాట్లాడారు. టీడీపీ నాయకులకు మతి భ్రమించి మాట్లాడుతున్నారని, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ఎందుకు స్పందించడంలేదని నిలదీశారు. (మాకెలాంటి సంబంధం లేదు: మంత్రి జయరాం) చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఏమైనా పదవులు ఇచ్చారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేశారని గుర్తుచేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాయల ఫకీర్ లాంటివారని అన్నారు. ఎవరిని ఏఏ శాఖలో నియమించుకోవాలో అక్కడ తన వారిని నియమించుకొని వాటాలు వసూలు చేశారని మండిపడ్డారు. కాగా, ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రిఅచ్చెన్నాయుడు ఇదివరకే అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈఎస్ఐ స్కాంపై విచారణ కొనసాగుతోంది. -
దేవికారాణి నగలపై ఈడీ ఆరా!
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ కిట్లు, ఫార్మా కంపెనీలకు మందుల సరఫరా కాంట్రాక్టుల అప్పగింతలో జరిగిన అవకతవకల్లో రూ.కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందంటూ ఏసీబీ విచారణ మొదలుపెట్టింది. ఈ కేసును ఐటీతోపాటు ఈడీ కూడా దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. గురువారం ఈడీ తన దర్యాప్తులో భాగంగా దేవికారాణి భర్త గురుమూర్తి స్టేట్మెంట్ను రికార్డు చేసింది. దేవికారాణి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ జ్యువెలరీ షాపులో రూ.7 కోట్లకు పైగా విలువ చేసే బంగారం కొనుగోలు చేసినట్లు తేలింది. సదరు నగల షాపు యజమానుల వాంగ్మూలాన్ని ఈడీ నమోదు చేసింది. అయితే తమ బంధువుల డబ్బుతో ఈ బంగారం కొనుగోలు చేశామని గురుమూర్తి స్టేట్మెంట్లో పేర్కొన్నారు. (దేవికారాణి ‘రియల్’ దందా!) ముడుపుల మళ్లింపు..! ఈ అవతవకల ద్వారా వచ్చిన సొమ్ముతో మాజీ డైరెక్టర్ దేవికారాణి, మాజీ జేడీ పద్మ తదితరులు భారీగా ఆస్తులు కొనుగోలు చేసిన విషయాన్ని ఏసీబీ తన దర్యాప్తులో వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రధాన నిందితులంతా ఎక్కువగా భూములే కొన్నారు. వీరిలో దేవికారాణి మాత్రం భూములతో పాటు నగలపైనా దృష్టి సారించారు. అందుకే తనకు ముడుపులుగా అందిన నగదును నగరంలోని ప్రముఖæ నగల షాపులో అభరణాలు కొనేందుకు మళ్లించినట్లు గుర్తించారు. (ఈఎస్ఐ స్కాం: నిందితులకు 14 రోజుల రిమాండ్) చాలా సందర్భాల్లో ఆమెకు అందాల్సిన ముడుపులను తాను తీసుకోకుండా తన మనుషుల ద్వారా జ్యువెలరీస్‌కు మళ్లించి నగలకు ఆర్డర్ ఇచ్చేదని సమాచారం. ఈ క్రమంలోనే దాదాపు రూ.7 కోట్ల డబ్బును దేవికారాణి నగల కోసం చెల్లించింది. పూర్తి మొత్తం చెక్కులు, ఆన్లైన్ కంటే అధికంగా నగదు రూపంలో వచ్చినప్పటికీ.. నగల షాపు యాజమాన్యం కూడా ఎలాంటి అభ్యంతరం తెలపకపోవడం గమనార్హం. దేవికారాణిపై దాడుల సమయంలో ఇందుకు సంబంధించిన పలు రసీదులు దర్యాప్తు అధికారులకు లభించడంతో ఈ విషయం వెలుగుచూసింది. -
ఈఎస్ఐ స్కాం.. కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ స్కాంలో కీలక మలుపు చోటు చేసుకుంది. నిందితుల ఆస్తుల జప్తునకు అనుమతివ్వాలంటూ ఏసీబీ ప్రభుత్వానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఏసీబీ ఆస్తుల జప్తునకు తాత్కలిక అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ పద్మ, ఫార్మాసిస్ట్ నాగలక్ష్మి ఆస్తులు జప్తు చేశారు.పద్మ, ఆమె కుటుంబసభ్యుల పేరు మీదున్న 8.55 కోట్ల రూపాయల ఆస్తులు.. నాగలక్ష్మీకి చెందిన 2.72 కోట్ల రూపాయల ఆస్తుల జప్తు చేయనున్నారు. -
ఈఎస్ఐ స్కాం: మరోసారి దేవికారాణి అరెస్ట్
-
ఈఎస్ఐ స్కాం: మరోసారి దేవికారాణి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : ఈఎస్ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) మెడికల్ కిట్ల కొనుగోళ్లలో మాజీ డైరెక్టర్ దేవికారాణితో సహా 9 మందిని అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అరెస్టు చేసింది. మెడికల్ కిట్ల కొనుగోలులో వాస్తవ ధర కన్నా అనేక రెట్లు పెంచి ప్రభుత్వా నికి దాదాపుగా రూ.6.5 కోట్లు నష్టం కలిగించా రన్న అభియోగాలపై తాజాగా ఈ కేసు నమోదైంది. ఓమ్ని ఫార్మా ఎండీ కంచర్ల హరిబాబు, ఐఎంస్ మాజీ డైరెక్టర్ దేవికారాణి, మాజీ జాయింట్ డైరెక్టర్ కలకుంట్ల పద్మతో సహా 9 మందిని శుక్రవారం అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. వీరికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. -
ఈఎస్ఐ స్కాంలో మరో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్ : ఈఎస్ఐ స్కాంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఈఎస్ఐ స్కాంలో మరో 6.5 కోట్ల అక్రమాలను గుర్తించినట్లు గురువారం ఏసీబీ పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి మరికొంత మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపింది.వారిలో కంచర్ల శ్రీ హరి బాబూ అలియాస్ బాబ్జీ, కంచర్ల సుజాత, కుక్కల కృప సాగర్ రెడ్డి, బండి వెంకటేశ్వర్లు, చెరుకూరి నాగరాజు, తింకశల వెంకటేష్ తదితరులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. దీంతో పాటు నిందితుల ఇళ్లలో, కార్యాలయాల్లో 12 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఇప్పటికే ఈ కేసులో ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవిక రాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ, అసిస్టెంట్ డైరెక్టర్ కె.వసంత ఇందిరాలపై కేసు నమోదు చేశారు. కాగా కేసుకు సంబంధించి ఏసీబీ తన విచారణను కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. -
ఈఎస్ఐ స్కామ్: ఏసీబీ దర్యాప్తు వేగవంతం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కాం కేసులో ఏసీబీ దర్యాప్తు మళ్లీ ఊపందుకుంది. ఈ స్కామ్‌లో ప్రధాన నిందితురాలుగా ఉన్న మాజీ డైరెక్టర్ దేవికారాణి ఆస్తుల చిట్టా ఒక్కొక్కటిగా బయట పడుతోంది. సైబరాబాద్‌లో కమర్షియల్ రెసిడెన్షియల్ స్థలం కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఇచ్చిన రూ. 4 కోట్ల 47 లక్షల రూపాయలను ఏసీబీ సీజ్ చేసింది. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఇంట్లో దొరికిన డాక్యుమెంట్ల ప్రకారం బంగారపు ఆభరణాలు ఎక్కడికి తరలించారు అన్న అంశాలపై ఏసీబీ విచారణ చేస్తోంది.ఇంట్లో దొరికిన పత్రాల ఆధారంగా 10 కోట్ల బంగారు ఆభరణాలు రహస్య ప్రాంతంలో దాచిపెట్టినట్లు ఏసీబీ అనుమానిస్తుంది. స్కామ్ లో అరెస్ట్ చేసిన తర్వాత ఆమె కు సంబంధించిన 35 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించి ఏసీబీ సీజ్ చేసింది. అయితే బహిరంగ మార్కెట్ లో వీటి విలువ 200 కోట్ల ఉందంటున్న ఏసీబీ భావిస్తోంది. దేవికారాణిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కూడా ఏసీబీ నమోదు చేసింది. ఒక పక్క విచారణ కోనసాగుతుండగానే నిందితులు తమ ఆస్తులను, బంగారపు ఆభరణాలను పక్క ప్లాన్ తో దారి మళ్లించినట్లు ఏసీబీ భావిస్తోంది. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన 25 మంది నిందితులకు సంబంధించిన వందల కోట్ల ఆస్తులను ఏసీబీ సీజ్ చేసింది. ఇప్పుడు మళ్ళీ నిందితులకు సంబంధించి కోట్ల రూపాయలు బయట పడడంతో ఏసీబీ షాక్ గురైంది. దేవికారానికి నోటీసులు ఇచ్చి మరోసారి విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఏసీబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవిక రాణి, ఫార్మా సిస్ట్ నాగలక్ష్మి భారీ స్కామ్‌కు పాల్పడిన విషయం తెలిసిందే. గతేడాది ఈ కేసు మెడికల్ డిపార్ట్మెంట్లో పెను సంచలనాన్ని రేపింది. చదవండి: దేవికారాణి ‘రియల్’ దందా! -
దేవికారాణి ‘రియల్’ దందా!
సాక్షి, హైదరాబాద్ : ఈఎస్ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్)లో మందుల కొనుగోళ్లలో జరిగిన అవినీతి జాడలు తవ్వినకొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికారాణిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ).. ఆమె రియల్ ఎస్టేట్ లావాదేవీ లను సైతం మంగళవారం వెలుగులోకి తెచ్చింది. దేవికారాణి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఓ రెసిడెన్షియల్ వెంచర్లో చదరపు అడుగుకు రూ.15 వేల విలువ కలిగిన 6 ఫ్లాట్లను కుటుంబ సభ్యుల పేరిట కొనేందుకు ఫార్మాసిస్ట్ నాగలక్ష్మితో కలిసి రూ.4.47 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించింది. ఇందులో దేవికారాణి వాటా రూ.3.75 కోట్లు కాగా, ఫార్మాసిస్ట్ నాగలక్ష్మి వాటా రూ.72 లక్షలని ఏసీబీ తేల్చింది. ఈ మొత్తం.. లెక్కల్లోలేని నగదుగా గుర్తించింది. ఈ పెట్టుబడుల్లో రూ.22 లక్షలు బినామీదార్ల పేరిట దేవికారాణి ఇన్వెస్ట్ చేసినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ ఫ్లాట్ల కొనుగోలుకు రూ.2,29,30,000 మొత్తాన్ని చెక్కులు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా ఆమె చెల్లించినట్టు చెప్పారు. బయటపడిన నోట్ల కట్టలు ఈ వ్యవహారంపై ఏసీబీ అధికారులు సంబంధిత వెంచర్ డెవలపర్‌కు నోటీసులు అందజేశారు. ఆస్తులు అటాచ్ చేస్తామంటూ నోటీసుల్లో హెచ్చరించారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో తన ఖాతాకు దేవికారాణి, నాగలక్ష్మి పంపిన మొత్తం డబ్బును సదరు డెవలపర్ డ్రా చేసి ఏసీబీకి తిరిగి అప్పగించాడు. భారీ మొత్తం కావడంతో రూ.500, రూ.2,000 నోట్లకట్టలు నాలుగు టేబుళ్లను ఆక్రమించాయి. తాజా ఉదంతంలో రూ.4.47 కోట్లు దొరకడంతో కీసర తహసీల్దార్ వద్ద లభించిన రూ.కోటీ పది లక్షల రికార్డును తిరగరాసినట్లైంది. -
అచ్చెన్నాయుడికి బెయిల్ మంజూరు
సాక్షి, అమరావతి: ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టయిన టీడీపీ నేత అచ్చెన్నాయుడుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. రెండు లక్షల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు, అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. కాగా, అనారోగ్యం బారినపడ్డ అచ్చెన్నాయుడుకు రమేష్ ఆస్పత్రి, ఎన్ఆర్ఐ ఆస్పత్రుల్లో చేర్పించి ప్రభుత్వం చికిత్స అందించింది. ఇదిలాఉండగా.. ఈఎస్ఐ మందుల కొనుగోలులో 150 కోట్ల రూపాయలు అవకతవకలు జరిగాయని అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జూన్ 12వ తేదీన అచ్చెన్న స్వగ్రామం నిమ్మాడలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ హయాంలో అచ్చెన్నాయుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడుతో సహా 12 మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మొత్తం 19 మందిపై కేసు నమోదు చేశారు. (చదవండి: సిఫార్సు వేరు.. ఆర్డర్ వేరు) -
ఎన్నారై ఆసుపత్రికి అచ్చెన్నాయుడు
సాక్షి, గుంటూరు : ఈఎస్ఐ స్కాంలో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడును శనివారం రాత్రి మంగళగిరి ఎన్నారై ఆసుపత్రికి తరలించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్ రావడంతో మెరుగైన చికిత్స కోసం మంగళగిరి ఎన్నారై ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈఎస్ఐ మందుల కొనుగోలులో 150 కోట్ల రూపాయలు అవకతవకలు జరిగాయని అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జూన్ 12వ తేదీన అచ్చెన్న స్వగ్రామం నిమ్మాడలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ హయాంలో అచ్చెన్నాయుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు.(చదవండి : ‘ఈఎస్ఐ స్కామ్‌లో ఎవరి వాటా ఎంతో తేలుస్తాం’) ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడుతో సహా 12 మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మొత్తం 19 మందిపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న మాజీ మంత్రి పితాని తనయుడితో పాటు మిగిలిన వారి కోసం ఏపీ, తెలంగాణలో గాలిస్తున్నారు. ఈ క్రమంలో విచారణలో భాగంగా కాల్ సెంటర్లో చూపించిన కాల్స్ అన్నీ నకిలీవేనని అధికారులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి త్వరలోనే చార్జిషీట్ దాఖలు చేస్తామని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ పేర్కొన్నారు. -
ఎన్నారై ఆసుపత్రికి అచ్చెన్నాయుడు
-
‘ఈఎస్ఐ స్కామ్‌లో ఎవరి వాటా ఎంతో తేలుస్తాం’
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన 150 కోట్ల ఈఎస్ఐ స్కాంలో అవినీతి నిరోధక శాఖ విచారణ ఇంకా కొనసాగుతోందని ఏసీబీ జేడీ రవికుమార్ గురువారం తెలిపారు. రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఈఎస్ఐ స్కాంలో ఎవరి వాటా ఎంతో త్వరలోనే తేలుస్తామని, గుర్తించిన నిందితులంతా రింగ్‌గా ఏర్పడి అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. కాగా డబ్బుల పంపకాలకు సంబంధించిన వాటాలపై నిందితుల నుంచి వివరాలు రాబట్టనున్నామని పేర్కొన్నారు. ఈఎస్ఐ స్కామ్‌లో టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడుకు డబ్బులు చేరలేదని ఏసీబీ చెప్పినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఖజానాకు నష్టం చేసిన ఎవరినీ వదిలి పెట్టమని, నిందితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. తప్పుడు వార్తలతో కేసును తప్పుదారి పట్టించే యత్నం సరికాదని రవికుమార్ పేర్కొన్నారు. కాగా ఈ కేసులో ఇప్పటికే అచ్చెన్నాయుడుతో సహా 12 మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. చదవండి: అరకొర జవాబులు.. ఆపై దాటవేత -
సిఫార్సు వేరు.. ఆర్డర్ వేరు
సాక్షి, అమరావతి: ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలు ఇవ్వడం వేరు, కచ్చితంగా చేయాలని ఆర్డర్ లెటరు ఇవ్వడం వేరు.. అని అవినీతి నిరోధక శాఖ సంయుక్త సంచాలకులు రవికుమార్ వెల్లడించారు. ఈఎస్ఐ స్కాములో అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు ఫలానా కంపెనీకే ఇవ్వాలని ఆర్డర్ ఇచ్చారని, దీంతో మంత్రి, ఆయనతోపాటు ఆ సర్వీసు ప్రొవైడరూ ఇద్దరూ నిందితులేనన్నారు. టెలీహెల్త్ సర్వీసెస్‌కు సంబంధించి అచ్చెన్నాయుడు మొత్తం మూడు లేఖలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. బుధవారం విజయవాడలోని ఏసీబీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో ఏమన్నారంటే... ► మొత్తం రూ.975 కోట్ల కొనుగోళ్లలో రూ.150 కోట్లకు పైగా అవినీతి జరిగినట్టు నిర్ధారించాం. ► రూ.లక్ష విలువ దాటితే ఈ–ప్రొక్యూర్‌మెంట్‌కు వెళ్లాలి. కానీ, నామినేషన్ కింద ఇచ్చారు. ► కడప ప్రాంతీయ కార్యాలయం జాయింట్ డైరెక్టర్ జనార్దన్ ఇందులో కీలకపాత్ర పోషించారు. ► అధిక ధరలతో బడ్జెట్‌కు మించి కొనుగోళ్లు జరిపారు. కొన్ని మందులు 140% ఎక్కువ రేటుకు కొన్నారు. ► డ్రగ్స్‌కు రూ.293.51 కోట్లు కొనుగోలు అవకాశం ఉండగా, రూ.698.36 కోట్లకు కొన్నారు. ► డిస్పెన్సరీల నుంచి ఇండెంట్లు లేకుండానే కొన్నారు. ఆ మందులు కూడా ఆస్పత్రులకు చేరలేదు. ► అమరావతి, తిరుమల వంటి మెడికల్ ఏజెన్సీలు అప్పటికప్పుడు పుట్టుకొచ్చి ఆ తర్వాత మాయమయ్యాయి. ► ఈ కేసులో 12మందిని అరెస్టు చేశాం. మరో 8 మందిని అరెస్టు చేయాల్సి ఉంది. మరో 5 మంది నిందితులను గుర్తించాం. వారికోసం ఏసీబీ బృందాలు గాలింపు చేస్తున్నాయి. వీరిలో మాజీ మంత్రి పితాని కుమారుడు వెంకటసురేష్ కూడా ఉన్నారు. ► ఈ కేసుపై త్వరలోనే చార్జిషీట్ వెయ్యబోతున్నాం. -
ఈఎస్ఐ స్కాం: త్వరలోనే చార్జ్‌షీట్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన 150 కోట్ల ఈఎస్ఐ స్కాంలో అవినీతి నిరోధక శాఖ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడుతో సహా 12 మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మొత్తం 19 మందిపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న మాజీ మంత్రి పితాని తనయుడితో పాటు మిగిలిన వారి కోసం ఏపీ, తెలంగాణలో గాలిస్తున్నారు. ఈ క్రమంలో విచారణలో భాగంగా కాల్ సెంటర్లో చూపించిన కాల్స్ అన్నీ నకిలీవేనని అధికారులు గుర్తించారు. ఈ విషయం గురించి ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ కాల్స్‌ని లిస్ట్‌లో చూపించి బిల్లులు తీసుకున్నట్లు విచారణలో తేలిందని చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేశామన్నారు. మరో తొమ్మిది మందికి సంబంధించి ఈ కేసులో ఆధారాలు సేకరించామని తెలిపారు. త్వరలోనే చార్జిషీట్ దాఖలు చేస్తామని , నిందితుల సంఖ్య కూడా ఇరవై ఐదుకు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘‘గత ప్రభుత్వ హయాంలో మందులు, సర్జికల్, ల్యాబ్, మెడికల్, ఫర్నిచర్ కొనుగోలులో జరిగిన అవినీతిపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశాం. మందులు కొనుగోలులో ప్రభుత్వ నిబంధనలను పాటించలేదని తేలింది. నిర్ణీత ధర కంటే ఎక్కువ రేట్లకు మందులను కొన్నట్టు గుర్తించాం. రూ.103 కోట్లు విలువ చేసే మందులు నాన్ కాంట్రాక్టులో కొన్నారు. లక్ష పైన కొనే వాటిని ఈ ప్రోక్యూర్లో కొనాలి, అయితే డైరెక్టర్స్ అలా కాకుండా కొన్ని సంస్థలతో కుమ్మక్కై అవకతవకలకు పాల్పడ్డారు. ఈ టెండర్లు పక్కన పెట్టి 400 కోట్లకు కొనుగోళ్లు జరిపారు. ధనలక్ష్మి అనే ఉద్యోగిని కుమారుడు అమరావతి మెడికల్స్, తిరుమల మెడికల్స్ ఏర్పాటు చేసి అవకతవకలకు పాల్పడినట్లు తేలింది. వాటిని 2019 తర్వాత మూసేసిన్నట్లు గుర్తించాం’’ అని రవికుమార్ తెలిపారు. కింద ఆసుపత్రి నుంచి స్టాక్ ఆడిగితేనే మందుల సరఫరా జరగాలని.. అయితే డాక్టర్ జనార్దన్ అనే వ్యక్తి మాత్రం 4 కోట్లు విలువైన మందులు అవసరం లేకుండా కొన్నారని పేర్కొన్నారు. కొన్న మందులను ఏం చేశారో తెలీయదని, స్టాక్ బోర్డు లెక్కలు అందుకు భిన్నంగా ఉన్నాయన్నారు. ప్రమోద్ రెడ్డి, నీరజ్ రెడ్డి అనే వ్యక్తులకు మంత్రి అచ్చెన్నాయుడు టెలీ సర్వీసెస్ పేరుతో కాంట్రాక్టు ఇప్పించారని రవికుమార్ తెలిపారు. పరారీలో ఉన్న నిందితులు ముందస్తు బెయిల్ తీసుకొని విచారణ నుంచి తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ కేసులో నిందితులందరినీ పట్టుకొని త్వరలోనే న్యాయస్థానం ముందు నిలబెడతామన్నారు. -
ఈఎస్ఐ స్కామ్‌లో కొత్తగా ముగ్గురుపై కేసు నమోదు
-
అచ్చెన్నాయుడి బెయిల్ పిటిషన్ కొట్టివేత
-
అచ్చెన్నాయుడికి మరోసారి చుక్కెదురు
సాక్షి, గుంటూరు: ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టయిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకి మరోసారి చుక్కెదురైంది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. మంత్రిగా పనిచేసిన సమయంలో అచ్చెన్నాయుడు అవకతవకలకు పాల్పడినట్లు అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయనను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. ప్రస్తుతం ఆయన గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని అచ్చెన్నాయుడు గతంలో ఏసీబీ కోర్టులో పిటిషన్లు పెట్టుకోగా తిరస్కరణకు గురయ్యాయి. ఇక అచ్చెన్నాయుడుతోపాటు ఈఎస్ఐ స్కామ్‌లో అరెస్టయిన ఏ1 రమేష్ కుమార్, పితాని సత్యనారాయణ పీఏ మురళి, మరో నిందితుడు సుబ్బారావు బెయిల్ పిటిషన్లను కూడా రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. (ప్రభుత్వాస్పత్రిలో ప్రైవేటు దందా) -
కరోనా బూచి చూపి ఇతర రోగులపై నిర్లక్ష్యం
అమీర్‌పేట: కరోనా బూచి చూపి ఇతర రోగుల పట్ల ఆసుపత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వవ్యవహరిస్తున్నారని, అత్యవసరంగా చేయాల్సిన ఆపరేషన్లను సైతం వాయిదా వేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. సనత్‌నగర్ ఈఎస్ఐసీ మెడికల్ కళాశాల బోధనా ఆసుపత్రిలో ప్రత్యేకంగా కోవిడ్–19 వార్డులు ఏర్పాటు చేసి వైద్య సిబ్బందిని కూడా కేటాయించి సేవలందిస్తున్నారు. మిగతా విభాగాల ద్వారా ఈఎస్ఐ కార్డు లబ్ధిదారులకు చికిత్సలు అందించాల్సి ఉండగా.. వైద్యులు, అధికారులు ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అత్యవసరంగా ఆసుపత్రికి వస్తున్న రోగులకు నామమాత్రంగా సేవలందిస్తూ చేతులు దులుపుకుంటున్నారని రోగులు వాపోతున్నారు. రోడ్డు ప్రమాదాలు, దీర్ఘకాలిక రోగాలతో వచ్చే వారికి మందులతో సరిపెడుతూ కావాల్సిన వైద్య పరికరాలను సమకూర్చడంలో నిర్లక్ష్యం చేస్తున్నారంటున్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలకు గురైన ఆనంద్‌కిషోర్ అనే వ్యక్తి రెండు నెలల క్రితం ఆసుపత్రిలో చేరాడు. కాలుకు శస్త్ర చికిత్స చేయాల్సి ఉందని, కరోనా వైరస్ ఉధృతి కారణంగా ఇప్పట్లో శస్త్ర చికిత్స చేయలేమని, కొంత కాలం పాటు వాకర్ సాయంతో నడవాలని వైద్యులు తేల్చి చెప్పారు. అయితే వాకర్ కోసం ఆసుపత్రి చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా పట్టించుకోవటం లేదని కిషోర్ వాపోయాడు. దీంతో బెడ్డుకే పరిమితమయ్యానని ఆవేదన వ్యక్తం చేశాడు. పడుకుంటే ఆయాసం వస్తోందని, ఇటీవల ఆసుపత్రి వెళ్లగా బెల్టు పెట్టుకోవాలని సూచించారన్నారు. వాకర్ ఇవ్వాలని కోరితే సరైన సమాధానం ఇవ్వడంలేదని, ఇక బెల్టు కోసం ఎవరిని అడగాలో అర్థం కావడం లేదన్నాడు. 15 ఏళ్లుగా ఈఎస్ఐకి డబ్బులు కడుతున్నామని, ప్రమాదవశాత్తు ఆసుపత్రిలో చేరిన తమకు సకాంలో వైద్యం ఇవ్వకుంటే కార్డు ఉండి లాభం ఏమిటని కిషోర్ వాపోయాడు. ఆసుపత్రికి వచ్చే అనేక మంది రోగులు ఇదే విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్ బూచిని చూపి అత్యవసరంగా చేయాల్సిన ఆపరేషన్లను వేయిదా వేయడంపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
తవ్వినకొద్దీ..
-
పితానీ.. ఇదేం పని!
సాక్షి, అమరావతి : ఈఎస్ఐ (ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్)లో కార్మికుల కడుపు కొట్టి రూ.కోట్లు కొట్టేసిన అప్పటి నేతలు, అధికారుల అవినీతి ఒక్కొక్కటే బయటకు వస్తున్నాయి. నాణ్యతను గాలికొదిలేసి, ఏజెన్సీల నుంచి వచ్చే కమీషన్ల కోసం కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టిన తీరు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. గత ప్రభుత్వంలోని కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ హయాంలో జరిగిన అవినీతి తాజాగా బయటికొచ్చింది. ఒక ఏజెన్సీ కోసం ఏకంగా ఔషధ నియంత్రణ అధికారులు ఇచ్చిన నివేదికనే తొక్కిపెట్టి రోగుల ప్రాణాలతో చెలగాటమాడారు. మరోవైపు ఆయన కుమారుడు వెంకట సురేష్ స్లిప్పులు రాసిచ్చి నామినేషన్ కింద ఆర్డర్లు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. ఔషధ నియంత్రణ శాఖ ఇచ్చిన నివేదిక బుట్టదాఖలు ►2019 ఫిబ్రవరిలో ఈఎస్ఐ ఆస్పత్రులకు సరఫరా చేసిన పారాసెటిమాల్ మాత్రలు డొల్ల అని, సరఫరా చేసిన ఏజెన్సీని రద్దుచేయండని ఔషధ నియంత్రణ శాఖ నివేదిక ఇచ్చింది. ►ఆ నివేదికను మంత్రి పితాని ఒత్తిడి మేరకు చెత్తబుట్టలో వేశారు. ఏజెన్సీపై కనీస చర్యలూ తీసుకోలేదు. ఏజెన్సీతో ఉన్న లావాదేవీలే కారణం ►2016లో తయారైన ఈ మందులు 2019 ఆగస్ట్‌తో ఎక్స్‌పెయిరీ అవుతాయన్న ఉద్దేశంతో ఆదరాబాదరాగా సరఫరా చేశారు. ►ఈ మందులను తిరుమల మెడికల్ ఏజెన్సీస్ సరఫరా చేసింది. ప్రస్తుతం ఈ ఏజెన్సీ అధినేత కార్తీక్ జైల్లో ఉన్నారు. ►2019 ఫిబ్రవరిలో ఈఎస్ఐ ఆస్పత్రులకు సరఫరా చేసిన మందులు నాసిరకమైనవని తిరుపతి డ్రగ్ ఇన్స్పెక్టర్ నివేదిక ఇచ్చారు. ► ఈ నివేదికను జేడీ జగదీప్ గాంధీ.. అప్పటి ఈఎస్ఐ డైరెక్టర్‌కు పంపి చర్యలు తీసుకోమన్నారు. అప్పటి మంత్రి పితాని ఒత్తిళ్ల మేరకు డైరెక్టర్ చర్యలు తీసుకోలేదు. ►తిరుమల ఏజెన్సీస్ విజయవాడలోని భవానీపురంలో ఓ అపార్ట్మెంట్ చిరునామా ఇచ్చారు. ►పోలీసుల విచారణలో ఆ చిరునామాలో ఇలాంటి ఏజెన్సీనే లేదని తేలింది. ►మాత్రలు నాసిరకం అని తేలిన మరుసటి రోజునే ఆ చిరునామా ఇంటికి నోటీసు అతికించగా.. ఎవరూ స్పందించలేదు. ► సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టకపోవడంతో మంత్రి స్వయానా ఏజెన్సీని కాపాడేందుకు యత్నించినట్టు తెలుస్తోంది. స్లిప్పులు రాసి పంపించేవారు ►మంత్రి పితాని కుమారుడు వెంకట సురేష్ తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీగా నొక్కేశారు. ►రేటు కాంట్రాక్టులో లేని ఏజెన్సీల నుంచి కొనుగోళ్లు చేయడమే కాదు, ఎక్కువ రేటుకు తీసుకోవాలని సిఫార్సు చేసేవారు. మంత్రి కొడుకు చేసిన ఈ వ్యవహారాలను ఈఎస్ఐ అధికారులు కొంతమంది ఏకరువు పెట్టారు. వాళ్లు ఏమంటున్నారంటే.. ►మంత్రి కొడుకు స్లిప్పులు రాసి తమకు పంపించేవారు. వాటి ఆధారంగా ఇచ్చాం. స్లిప్పు రాసిచ్చాక మళ్లీ ఫోన్లు చేసేవారు. స్లిప్పులను తర్వాత చించేసేవాళ్లం. ► మంత్రి కొడుకు సిఫార్సు చేసిన వాటిలో రేటు కాంట్రాక్టులో లేని సంస్థలే ఉన్నాయి. ► బిల్లుల చెల్లింపుల్లోనూ స్లిప్పులు రాసి పంపించేవారు. -
ఈఎస్ఐ స్కాం : మాజీ మంత్రి పీఎస్ అరెస్ట్
-
అచ్చెన్నాయుడు లేఖతో సంబంధం లేదు
తెనాలి: ఈఎస్ఐ పరికరాల కొనుగోలు కుంభకోణంలో అవినీతి ఆరోపణల కేసులో జైలులో ఉన్న మాజీమంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు రాసిన లేఖతో బీసీలకు ఎలాంటి సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. హత్యానేరంలో జైలుకెళ్లిన మాజీమంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర విషయంలోనూ బీసీలకు సంబంధం లేదని తెలిపారు. బీసీ నేతలు ఏవైనా కేసుల్లో ఇరుక్కుంటే అవి స్వయంకృతాపరాధాలు మినహా బీసీ హక్కులు, ప్రయోజనాల రక్షణ కోసం చేసే త్యాగాలుగా బీసీలు భావించవద్దని పేర్కొన్నారు. -
కుక్కలకు ఆహారంగా కరోనా మృతదేహాలు
అమీర్‌పేట: కరోనా బారినపడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందక రోగులు విలవిల్లాడుతుండగా పాజిటివ్ మృతదేహాల దాహన సంస్కారంలోనూ జీహెచ్ఎంసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈఎస్ఐ హరిశ్చంద్ర శ్మశాన వాటికలో మృతదేహాలు పూర్తిగా కాలిపోకముందే వాటిని వదిలేసి వెళ్లిపోతున్నారు. దీంతో కుక్కలకు పాజిటివ్ మృతదేహాల విడిభాగాలు ఆహారంగా మారుతులన్నాయి. ఆదివారం వీధి కుక్కలు పాజిటివ్ మృతదేహాల విడిభాగాలను పీక్కుతుంటుండటాన్ని గుర్తించిన స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.దీని వల్ల కొత్త సమస్యలు తలెత్తే ప్రమాదముందని వారు వాపోతున్నారు. ప్రతి రోజు 10 నుంచి 18 కరోనా మృతదేహాలు శ్మశానవాటికకు వస్తున్నట్లు సమాచారం. శ్మశాన వాటిలో పనిచేసే కాటికాపరి కాకుండా జీహెచ్ఎంసీ సిబ్బంది చేత అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి తరువాత మృతదేహాలను తీసుకు వస్తుండటం, ఆ సమయంలో విద్యుత్ దహనవాటిక పనిచేయకపోవడంతో కట్టెలు పేర్చి చితి మంటలు వెలిగించి అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. ఉదయం అక్కడికి చేరుకుంటున్న కుక్కలు కాలకుండా ఉన్న శరీర భాగాలను లాక్కెళుతున్నాయి. ఇళ్ల మధ్య తిగిగే కుక్కలు వాటిని మనుషుల్ని కరిస్తే పరిస్థితి ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి విద్యుత్ దాహన వాటికలోనే పాజిటివ్ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించాలని కోరుతున్నారు. -
ఈఎస్ఐ స్కాంలో పదికి చేరిన అరెస్టుల సంఖ్య
-
ఈఎస్ఐ స్కాంలో మరో వ్యక్తి అరెస్ట్..
సాక్షి, విజయవాడ: ఈఎస్ఐ స్కాంలో అరెస్టుల సంఖ్య పదికి చేరింది. తాజాగా మరో వ్యక్తిని ఏసీబీ అరెస్ట్ చేసింది. విజయవాడ భవానీపురంలో తిరుమల మెడికల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న తెలకపల్లి కార్తీక్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఆయనను విజయవాడ సబ్‌జైలుకు తరలించారు. నకిలీ కొటేషన్లతో అధిక ధరలకు ఆర్డర్లు పొందినట్టు ఏసీబీ నిర్ధారించింది. ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టయి జైల్లో ఉన్న టీడీపీ మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే కె.అచ్చెన్నాయుడితో సహా నిందితులందరి బెయిలు పిటిషన్లను కొట్టివేస్తూ ఏసీబీ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.(అచ్చెన్నాయుడి బెయిల్ పిటిషన్ తిరస్కరణ) -
‘ఈసీజీల పేరుతో రూ.4 వేల కోట్లు దుర్వినియోగం’
-
‘ఈసీజీల పేరుతో రూ.4 వేల కోట్లు దుర్వినియోగం’
సాక్షి, విజయవాడ: టెలీ హెల్త్ సర్వీస్ ద్వారా భారీగా ప్రభుత్వ నిధులను దారి మళ్లించారని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి అన్నారు. టెలీ హెల్త్ సర్వీస్‌తో ఎంవోయూ చేసుకోవాలని, ఈఎస్ఐ డైరెక్టర్లను ఆదేశిస్తూ అచ్చెన్నాయుడు లేఖ రాశారని ఆయన తెలిపారు. తెలంగాణకు చెందినవారిని ఏపీ రికార్డుల్లో నమోదు చేయించారని చెప్పారు. శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘రూ.లక్షకు మించి కాంట్రాక్ట్ ఇవ్వాల్సి ఉంటే టెండర్లు పిలవాల్సి ఉంటుంది. ఆ నిబంధనలను కూడా పట్టించుకోలేదు. టెలీ హెల్త్ సర్వీసెస్‌కు రూ.3కోట్లు అక్రమంగా చెల్లించారు. ఈసీజీలకు చెల్లించే మొత్తాన్ని కూడా రూ.480కి పెంచారు. దీని వల్ల రూ.280 అదనంగా చెల్లించిన పరిస్థితి. ఈసీజీల పేరుతో మరో రూ.4వేల కోట్లు దుర్వినియోగం జరిగింది. మందుల కొనుగోళ్లలో కూడా ఈఎస్ఐ నిబంధనలను పాటించలేదు. ఈ- ప్రొక్యూర్మెంట్లో టెండర్లు పిలవకుండా.. తమకు నచ్చినవారికి కాంట్రాక్ట్‌లు ఇచ్చుకున్నారు. మార్కెట్లో ధర కంటే 50 శాతం అదనంగా చెల్లించి మందులు కొనుగోలు చేశారు. ఫేక్ కొటేషన్లను కూడా కొనుగోళ్ల ప్రక్రియలో ఉపయోగించారు. ఈ మొత్తం రూ.160 కోట్ల కుంభకోణం జరిగినట్లుగా ఆధారాలున్నాయి’అని ఆయన పేర్కొన్నారు. (చదవండి: అచ్చెన్నాయుడుకు చుక్కెదురు) -
అచ్చెన్నాయుడుకు చుక్కెదురు
-
అచ్చెన్నాయుడుకు చుక్కెదురు
సాక్షి, విజయవాడ: ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టైన మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడికి ఏసీబీ కోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు శుక్రవారం కొట్టేసింది. కాగా, ఈఎస్ఐ కుంభకోణం కేసులో ఏ-2గా ఉన్న అచ్చెన్నాయుడుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈఎస్ఐలో జరిగిన రూ.150 కోట్లకు పైగా స్కామ్‌తో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేసే దిశగా ఏసీబీ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. ఈ కుంభకోణంలో అచ్చెన్నాయుడితోపాటు మరో 18 మంది ప్రమేయం ఉన్నట్టు ఏసీబీ ప్రాథమికంగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఇప్పటికే రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన ఏసీబీ ఆయనతో సహా 9 మందిని అరెస్ట్ చేసింది. (‘మనసా, వాచా ఆయన వైఎస్సార్సీపీతో లేరు’) -
ఈఎస్ఐ స్కాంతో సంబంధం లేదని చెప్పగలరా ?
సాక్షి, శ్రీకాకుళం : మాజీమంత్రి అచ్చెన్నాయుడుకి ఈఎస్ఐ కుంభకోణంతో సంబంధం లేదని టీడీపీ నేతలు ఎందుకు చెప్పలేకపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన..బాబాయ్ అచ్చెన్నాయుడి అక్రమాలు టీడీపీ ఎంపి రామ్మోహన్కి కూడా తెలుసని అన్నారు. 35 లక్షలమంది కార్మిక కుటుంబాల డబ్బును అక్రమంగా తరలించారని మండిపడ్డారు. టీడీపీ నేతల అక్రమాలు, అవినీతి ఎవరూ అడగకూడదన్నట్లు నారా లోకేష్ మాట్లాడటం హస్యాస్పదం అన్నారు. అంతేకాకుండా అచ్చెన్నాయుడి ఆరోగ్యంపై మొట్టమొదటిసారి స్పందించింది సీఎం వైఎస్ జగన్ అని గుర్తుచేశారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపారు. ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడును గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారన్నారు. వైద్య బృందం నివేదిక ప్రకారమే ఆయనను జైలుకి తరలించారని అప్పలరాజు పేర్కొన్నారు. కాగా, ఈఎస్ఐ స్కామ్ కేసులో ఏ-2గా ఉన్న అచ్చెన్నాయుడుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. (టీడీపీ 108, 104లను నిద్రావస్థలో ఉంచింది: పిల్లి ) -
ఆస్పత్రి నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్
-
ఆస్పత్రి నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్
సాక్షి, గుంటూరు: ఈఎస్ఐ కుంభకోణం కేసుల అరెస్ట్ అయిన మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు బుధవారం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఏసీబీ అధికారులు ఆయనను విజయవాడ సబ్ జైలుకు తరలించారు. కాగా, ఈఎస్ఐ స్కామ్ కేసులో ఏ-2గా ఉన్న అచ్చెన్నాయుడుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితులు దృష్ట్యా గుంటూరు జీజీహెచ్‌కు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు జీజీహెచ్‌లోనే మూడు రోజుల పాటు అచ్చెన్నాయుడును విచారించారు. తాజాగా ఆయన ఆరోగ్యం మెరుగుపడటంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు.(చదవండి : ఈఎస్ఐ స్కామ్‌లో ఆచితూచి అడుగులు) -
ఈఎస్ఐ స్కామ్‌లో ఆచితూచి అడుగులు
సాక్షి, అమరావతి: ఈఎస్ఐలో జరిగిన రూ.150 కోట్లకు పైగా స్కామ్‌తో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేసే దిశగా ఏసీబీ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. ఈ కుంభకోణంతో ప్రమేయం ఉన్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడితోపాటు మరో 18 మంది ప్రమేయం ఉన్నట్టు ఏసీబీ ప్రాథమికంగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఇప్పటికే రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన ఏసీబీ అచ్చెన్నాయుడు సహా 9 మందిని అరెస్ట్ చేసింది. టెలీ హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కాల్ సెంటర్, ఈసీజీ సేవల్లో జరిగిన దోపిడీపై ఒక కేసు.. మందులు, పరికరాలు, వైద్య సామగ్రి కొనుగోలులో చోటుచేసుకున్న అక్రమాలపై మరో కేసు నమోదైంది. ఈ వ్యవహారాలతో ప్రమేయం ఉన్న మిగిలిన నిందితుల్ని అరెస్ట్ చేసేందుకు ఏసీబీ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ల నుంచి ఆశాజనక సమాచారం ► కుంభకోణం వెనుక చీకటి కోణాలను గుర్తించిన ఏసీబీ కీలక విషయాలను రాబట్టేందుకు అచ్చెన్నను 3 రోజులపాటు కస్టడీకి తీసుకుని విచారణ జరిపింది. ► విచారణకు అచ్చెన్నను సహకరించకుండా దాటవేత ధోరణి అవలంబించినట్టు సమాచారం. ఇదే సమయంలో ఈఎస్ఐ మాజీ డైరెక్టర్లతోపాటు పలువుర్ని 2 రోజులపాటు కస్టడీకి తీసుకుని విచారించిన ఏసీబీకి ఆశాజనకమైన సమాచారం వచ్చినట్టు తెలిసింది. ► ఈఎస్ఐ మాజీ డైరెక్టర్లు సీకే రమేష్‌కుమార్, జి.విజయకుమార్, రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ వి.జనార్దన్, సూపరింటెండెంట్ ఏంకేపీ చక్రవర్తి, సీనియర్ అసిస్టెంట్ ఇవన రమేష్‌లను ఏసీబీ లోతుగా ఆరా తీసినట్టు సమాచారం. ► కుంభకోణంలో తమ పాత్రను నర్మగర్భంగా అంగీకరించిన మాజీ డైరెక్టర్లు, కొందరు ఉద్యోగులు.. ఇదంతా అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు ఒత్తిడితో చేశామనే విషయాన్ని గట్టిగానే చెప్పినట్టు తెలిసింది. ► వారిచ్చిన కీలక సమాచారం అచ్చెన్నతోపాటు మిగిలిన వారికీ బలంగా చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది. ► స్కామ్‌లో ఎవరి పాత్ర ఉంది? ఎవరి వాటా ఎంత? అనే కోణాల్లో కొంత క్లారిటీకి వచ్చిన ఏసీబీ మరింత ముందుకు సాగేందుకు నిర్ణయించింది. ► ఇప్పటికే ఏసీబీ సేకరించిన సమాచారం, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇచ్చిన నివేదిక, కస్టడీలో నిందితులు ఇచ్చిన వివరాలను క్రోఢీకరించుకుని కార్యాచరణ చేపట్టనుంది. ► నిందితులందరినీ అరెస్ట్ చేసిన తర్వాత వారినుంచి మరింత కీలక సమాచారం రాబట్టి ఈ కుంభకోణంతో ప్రమేయం ఉన్న మిగిలిన వారి ఆట కట్టించేందుకు ఏసీబీ స్కెచ్ వేసింది. ఇందుకోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. ► టెలీ హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ ప్రమోద్‌రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఏసీబీ బృందాలు హైదరాబాద్, కోదాడ ప్రాంతాల్లో గాలిస్తున్నాయి. ► ఏపీ సచివాలయంలో టీడీపీ హయాంలో చేతివాటం ప్రదర్శించిన ఓ ఉద్యోగి గురించి ఏసీబీ ఆరా తీస్తోంది. ఆ ఉద్యోగిని అరెస్ట్ చేసి విచారిస్తే మరికొందరి కీలక వ్యక్తుల బాగోతం బయటకు వస్తుందంటున్నారు. -
అరకొర జవాబులు.. ఆపై దాటవేత
సాక్షి, అమరావతి/సాక్షి, గుంటూరు: ఈఎస్ఐ స్కామ్ కేసులో ఏ–2 నిందితునిగా ఉన్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఏసీబీ విచారణకు సహకరించలేదని, అరకొర సమాధానాలు.. ఆపై దాటవేత ధోరణిని అవలంబించినట్టు సమాచారం. ఏసీబీ కేంద్ర పరిశోధన బృందం(సీఐయూ) డీఎస్పీలు పీఎస్ఆర్కే ప్రసాద్, చిరంజీవితో కూడిన బృందం గుంటూరు జీజీహెచ్‌లో 25, 26, 27 తేదీల్లో విచారణ నిర్వహించింది. తొలిరోజు మూడు గంటలు, రెండోరోజు ఐదు గంటలు, మూడోరోజైన శనివారం నాలుగున్నర గంటలు చొప్పున మొత్తంగా మూడు రోజుల్లో 12.30 గంటలపాటు విచారించారు. విశ్వసనీయ సమాచారం మేరకు విచారణకు అచ్చెన్నాయుడు ఏమాత్రం సహకరించలేదు. లేఖ రాసినట్టు మినహా మిగిలిన విషయాల్లో స్పష్టత ఇవ్వలేదు. సరైన సమాధానాలు చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారని సమాచారం. ► లేఖ మాత్రమే రాశానని, మాటమాత్రంగా సిఫారసులు చేశానని అంగీకరించిన అచ్చెన్నాయుడు ఆ తర్వాత జరిగిన ఒప్పందాలు, సంతకాలు తదితర అంశాల్లో తన ప్రమేయం లేదని దాటవేత ధోరణితో మాట్లాడినట్టు తెలిసింది. పరికరాలు, కొనుగోళ్ల కాంట్రాక్టును తాను సూచించిన సంస్థకే కట్టబెట్టాలి అన్నట్టుగా సిఫార్సు లేఖలో ‘ఇన్ మై ఆర్డర్’ అని పేర్కొనడాన్ని ఏసీబీ అధికారులు ప్రస్తావిస్తూ.. సాధారణంగా సాధ్యాసాధ్యాలను బట్టి నిబంధనలకు లోబడే కాంట్రాక్టు ఇవ్వాలని సూచిస్తారని, మీరెందుకు ‘ఇన్ మై ఆర్డర్’ అని రాశారని అడిగిన ప్రశ్నకు అచ్చెన్నాయుడు నీళ్లు నమిలినట్టు సమాచారం. ► టెలీ హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన టోల్ ఫ్రీ, ఈసీజీ సేవలు, నిబంధనలకు విరుద్ధంగా మందులు, సర్జికల్ ఎక్విప్మెంట్, ఫర్నిచర్, పరికరాల కొనుగోళ్లపై ఎన్ని ప్రశ్నలు వేసినా సరైన సమాధానం ఇవ్వలేదని తెలిసింది. ముగిసిన కస్టడీ.. రిమాండ్ పొడిగింపు అచ్చెన్నాయుడుకు ఏసీబీ కస్టడీ శనివారం సాయంత్రంతో ముగిసింది. అయితే విచారణ సమయంలో సరైన సమాధానాలు రాకపోవడంతో లోతైన దర్యాప్తుకోసం మరోసారి ఆయన్ని ఏసీబీ కస్టడీకి కోర్టును కోరే అవకాశముంది. అచ్చెన్నాయుడి జ్యుడీషియల్ రిమాండ్ శనివారం సాయంత్రంతో ముగియగా.. వచ్చే నెల 10 వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలిచ్చింది. ఈఎస్ఐ మాజీ డైరెక్టర్లు సీకే రమేష్‌కుమార్, జి.విజయకుమార్, రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ వి.జనార్దన్, సూపరింటెండెంట్ ఏంకేపీ చక్రవర్తి, సీనియర్ అసిస్టెంట్ ఇవన రమేష్‌లను కస్టడీకి తీసుకున్న ఏసీబీ అధికారులు 2 రోజుల విచారణ అనంతరం శుక్రవారమే వారిని జైలుకు తరలించారు. -
‘మై ఆర్డర్’ వెనుక ఉన్న ఉద్దేశాలేమిటి?
సాక్షి, గుంటూరు: ఈఎస్ఐ స్కామ్‌లో మూడో రోజు ఏసీబీ విచారణ ముగిసింది. జీజీహెచ్‌లో ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడిపై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే, ఈ రోజు కూడా ఆయన విచారణకు సహకరించలేదని తెలిసింది. టెలీహెల్త్ సర్వీసెస్‌కు కాంట్రాక్ట్ ఇవ్వమని ఆదేశించిన లెటర్‌ను ఏసీబీ బయటపెట్టింది. ఆ లెటర్ లో ‘మై ఆర్డర్’ అనే పదాన్ని వాడటం వెనుక ఉద్దేశాన్ని ఏసీబీ ప్రశ్నించింది. టెలీ హెల్త్ సర్వీసెస్ కాంట్రాక్టర్ తో అచ్చెన్నాయుడికి ఉన్న సంబంధాలపై అధికారులు ఆరా తీశారు. కోట్ల రూపాయలు ఒకే సంస్థకు చెల్లించడంపై ప్రశ్నించారు. కాల్ సెంటర్ కు వచ్చిన కాల్స్ పై కూడా ఏసీబీ అధికారులు విచారించారు. ఆ ఫోన్ నెంబర్లన్నీ తెలంగాణవేనని నిర్ధారణ అయినట్టు సమాచారం. ఈసీజీ పేరుతో డబుల్ రేట్లు చెల్లించినట్లు అధికారులు గుర్తించారు. ఇవన్నీ ఉద్దేశపూర్వకంగానే చేసి నిధులు కొల్లగొట్టినట్లు తేలింది. కాగా, అచ్చెన్నాయుడు సహా 8 మంది పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. వారికి జులై 10 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. (‘ఎందుకలా చేశారు.. మీ ఇంట్రెస్ట్ ఏమిటి’) -
ఏసీబీ విచారణ.. సహకరించని అచ్చెన్న
సాక్షి, గుంటూరు: ఈఎస్ఐ కుంభకోణంలో మూడో రోజు ఏసీబీ అధికారులు విచారణ ముగిసింది. ఈఎస్ఐ స్కామ్‌లో ఏ–2 నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి, టీడీపీ టెక్కలి ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడును జీజీహెచ్‌లో ఏసీబీ అధికారులు ప్రశ్నించగా, నేడు కూడా ఆయన విచారణకు సహకరించలేదని తెలిసింది. నేటితో కస్టడీ ముగియడంతో కీలక అంశాలపై ఏసీబీ ఆరా తీసినట్లు సమాచారం. పదిన్నర గంటల పాటు కొనసాగిన విచారణలో కొన్ని ప్రశ్నలకు అసంపూర్తిగా, మరికొన్నిటికి అబద్దాలు చెప్పినట్లు సమాచారం. మూడో రోజు కూడా అచ్చెన్నాయుడు విచారణకు సహకరించకపోవడంతో ఏసీబీ బృందం జీజీహెచ్ నుంచి తిరిగి వెళ్లిపోయింది. (‘ఎందుకలా చేశారు.. మీ ఇంట్రెస్ట్ ఏమిటి’) నిన్న (శుక్రవారం) రెండోరోజు ఏసీబీ కేంద్ర పరిశోధన బృందం (సీఐయూ) డీఎస్పీలు పీఎస్ఆర్కే ప్రసాద్, చిరంజీవి నేతృత్వంలో 5 గంటల పాటు విచారణ జరిపారు. విచారణ సమయంలో అచ్చెన్నాయుడు తరఫు న్యాయవాది హరిబాబు, వైద్యుడిని అనుమతించారు. విచారణను ఆడియో, వీడియో ద్వారా రికార్డు చేసినట్టు సమాచారం. టెలీ హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన టోల్ ఫ్రీ, ఈసీజీ సేవలు, నిబంధనలకు విరుద్ధంగా మందులు, సర్జికల్ ఎక్విప్మెంట్, ఫర్నిచర్, ఇతర పరికరాల కొనుగోళ్లపై ఏసీబీ ప్రశ్నించినట్టు తెలిసింది. (ఈఎస్ఐ స్కాం మూలాలపై కన్ను) -
‘ఎందుకలా చేశారు.. మీ ఇంట్రెస్ట్ ఏమిటి’
సాక్షి, అమరావతి/గుంటూరు: ‘ఎందుకలా చేశారు.. లేఖలు, సిఫారసులతో ఈఏస్ఐ అధికారులపై ఒత్తిడి ఎందుకు తెచ్చారు.. ఈ వ్యవహారాల్లో మీ ఇంట్రెస్ట్ ఏమిటి’ అంటూ ఈఎస్ఐ స్కామ్‌లో ఏ–2 నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి, టీడీపీ టెక్కలి ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. కుంభకోణంలో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న ఆయన్ను కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ శుక్రవారం కూడా విచారణ చేసింది. ఐదు గంటలపాటు విచారణ ► రెండో రోజు విచారణకు ముందు అచ్చెన్నకు గుంటూరు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎండోస్కొపి అయిన తర్వాత ఆయనను ప్రత్యేక వార్డుకు తరలించిన ఏసీబీ అధికారులు అక్కడే విచారణ చేశారు. ► ఏసీబీ కేంద్ర పరిశోధన బృందం (సీఐయూ) డీఎస్పీలు పీఎస్ఆర్కే ప్రసాద్, చిరంజీవి నేతృత్వంలో 5 గంటల పాటు విచారణ జరిపారు. ► విచారణ సమయంలో అచ్చెన్నాయుడు తరఫు న్యాయవాది హరిబాబు, వైద్యుడిని అనుమతించారు. విచారణను ఆడియో, వీడియో ద్వారా రికార్డు చేసినట్టు సమాచారం. ► టెలీ హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన టోల్ ఫ్రీ, ఈసీజీ సేవలు, నిబంధనలకు విరుద్ధంగా మందులు, సర్జికల్ ఎక్విప్మెంట్, ఫర్నిచర్, ఇతర పరికరాల కొనుగోళ్లపై ఏసీబీ ప్రశ్నించినట్టు సమాచారం. కీలకాంశాలివీ..: ‘మీరు ఇచ్చిన లేఖలు, సిఫారసులతోనే ఈఎస్ఐ స్కామ్‌కు తెరలేచింది. ఇందులో రూ.150 కోట్లకుపైగా ప్రజాధనం దుర్వినియోగమైంది. మీరు లేఖలు, సిఫారసులు చేయడానికి గల కారణాలు ఏమిటి. కొన్ని కంపెనీలకు మీరు ఎందుకు సిఫారసులు చేశారు. ఆ కంపెనీల వాళ్లు మీకు ముందే తెలుసా? గుర్తింపు కలిగిన కంపెనీలు ఉన్నా ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు. నామినేషన్ పద్ధతులు, నకిలీ కొటేషన్లు, బిల్లులు వంటి వాటితో జరిగిన అవినీతి, అక్రమాలు గురించి మీకు తెలుసా. ఇందులో మీ పాత్ర ఎంత?’ అనే ప్రశ్నలతోపాటు వివిధ కోణాల్లోనూ ప్రశ్నించినట్లు సమాచారం. తాను లేఖలు ఇచ్చినట్టు, సిఫారసులు చేసినట్టు అంగీకరించిన అచ్చెన్న ఏసీబీ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలిసింది. అచ్చెన్న ఒత్తిడితోనే చేశాం: మాజీ డైరెక్టర్లు కోర్టు అనుమతితో ఈఎస్ఐ మాజీ డైరెక్టర్లు సీకే రమేష్‌కుమార్, జి.విజయకుమార్, రిటైర్డ్ జేడీ వి.జనార్దన్, సూపరింటెండెంట్ ఎంకేపీ చక్రవర్తి, సీనియర్ అసిస్టెంట్ ఇవన రమేష్‌లను కస్టడీకి తీసుకున్న ఏసీబీ.. శుక్రవారం విచారణ జరిపారు. అచ్చెన్న లేఖలు, సిఫారసుల వల్లే తాము నామినేషన్ పద్ధతిలో టెలీ హెల్త్ సర్వీసెస్ సేవలు, మందులు, పరికరాలకు కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నట్టు ఈఎస్ఐ మాజీ డైరెక్టర్లు అంగీకరించినట్టు తెలిసింది. వారిని వేర్వేరుగా ప్రశ్నించగా.. అచ్చెన్న లేఖలు, సిఫారసులు ఒత్తిళ్లపై వాస్తవాలను వారు ఏసీబీ అధికారుల వద్ద కుండబద్దలు కొట్టినట్టు చెప్పారని సమాచారం. -
ఈఎస్ఐ స్కామ్ : ముగిసిన రెండో రోజు విచారణ
సాక్షి, విజయవాడ/గుంటూరు: ఈఎస్ఐ కుంభకోణం కేసులో నిందితుల రెండో రోజు విచారణ ముగిసింది. ఈ కేసులో ఏ2గా ఉన్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో విచారించారు. ఉదయం నుంచి రెండు దఫాలుగా 5 గంటల పాటు అధికారులు అచ్చెన్నాయుడును ప్రశ్నించారు. డొల్ల కంపెనీలకు ఆర్డర్లు, పరికరాల కొనుగోలు గోల్‌మాల్‌పై అధికారులు ప్రశ్నలు సంధించారు. సిఫార్స్ లేఖపై కూడా ఆయనను ప్రశ్నించారు. ఈ స్కామ్ వెనక ఎవరి ఒత్తిడి ఉందనే అంశంపై కూడా అధికారులు విచారణ చేపట్టారు. 150 కోట్ల రూపాయల అవినీతిలో వాటాలపై కూడా సమాచారం సేకరించేందకు ప్రయత్నించారు. కాగా, శనివారం కూడా అధికారులు అచ్చెన్నాయుడును ప్రశ్నించనున్నారు. మరోవైపు ఈ కేసులో మిగిలిన నలుగురు నిందితులు రమేష్‌కుమార్, విజయ్‌కుమార్, చక్రవర్తి, జనార్దన్లను కూడా ఏసీబీ అధికారులు విజయవాడలో ప్రశ్నించారు. న్యాయవాదుల సమక్షంలో ఒక్కొక్కరిని ఏసీబీ బృందం విడివిడిగా ప్రశ్నించింది. రూ. 150 కోట్లలో ఎవరి వాటా ఎంత?, ఎవరి ఒత్తిడితో తప్పు చేశారు?, స్కామ్‌లో ఇంకా ఎవరి ప్రమేయం ఉంది?.. వంటి ప్రశ్నలను అధికారులు సంధించారు. ఈ కేసుకు సంబంధించి దాఖలైన రెండు ఎఫ్ఐఆర్లపై విచారణ కొనసాగించారు. విచారణ సందర్భంగా అధికారులు కీలక ఆధారాలు రాబట్టినట్టు సమాచారం. ఇక, నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి.. రాజమండ్రి సెంట్రల్ జైలు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ స్కామ్‌కు సంబంధించి పరారీలో ఉన్న మరో 10 మంది కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. -
ఈఎస్ఐ స్కాం: కూపీ లాగుతున్న ఏసీబీ
సాక్షి, విజయవాడ: ఈఎస్ఐ స్కాం నిందితుల విచారణ రెండో రోజు ప్రారంభమయ్యింది. రాజమండ్రి జైలు నుంచి కస్టడీకి తీసుకొన్న ఏసీబీ బృందం.. ప్రధాన నిందితుల నుంచి కీలక ఆధారాలు రాబట్టే ప్రయత్నం చేస్తోంది. డొల్ల కంపెనీలకు ఆర్డర్లు, పరికరాల కొనుగోలు మాల్ పై ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలిసింది. ఈ కుంభకోణం వెనుక ఎవరెవరి ఒత్తిడి ఉందన్న కోణంపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. రూ.150 కోట్ల అవినీతిలో ఎవరికి ఎంత ముట్టిందన్న దానిపై కూడా ఏసీబీ అధికారులు కూపీ లాగుతున్నారు. (ఎవరి వాటా ఎంత?) ఈఎస్ఐ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, మరో అయిదుగురిని ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను గురువారం ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఈ నెల 12న అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. (ఆంధ్రాలో కుంభకోణం.. కోదాడలో కలకలం!) -
ఎవరి వాటా ఎంత?
సాక్షి, అమరావతి/రాజమహేంద్రవరం క్రైం/సాక్షి, గుంటూరు: చంద్రబాబు జమానాలో చోటు చేసుకున్న కార్మిక రాజ్య బీమా సంస్థ(ఈఎస్ఐ) స్కామ్‌లో ఎవరి వాటా ఎంత అనే లెక్కలు తేల్చేందుకు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దూకుడు పెంచింది. ఈ స్కామ్‌లో 19 మంది ప్రమేయాన్ని గుర్తించిన ఏసీబీ ఇప్పటివరకు 9 మందిని అరెస్టు చేయడం, కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించడం తెలిసిందే. ఈ కేసులో కీలక ఆధారాలకోసం మరింత లోతుగా దర్యాప్తు చేపట్టాల్సి ఉందన్న ఏసీబీ వినతి మేరకు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును మూడు రోజులపాటు, మిగిలిన నిందితుల్ని రెండు రోజులపాటు కస్టడీకి తీసుకుని విచారించేందుకు కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారుల బృందం గురువారం సాయంత్రం అక్కడే విచారించింది. మరోవైపు రాజమహేం ద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న ఈఎస్ఐ మాజీ డైరెక్టర్లు జి.విజయకుమార్, సీకే రమేష్‌కుమార్, సూపరింటెండెంట్ ఎంకేపీ చక్రవర్తి, రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ వి.జనార్దన్, సీనియర్ అసిస్టెంట్ ఇవన రమేష్‌లను ఏసీబీ అధికారులు గురువారం తమ కస్టడీలోకి తీసుకుని విజయవాడ ఏసీబీ కార్యాలయానికి తరలించారు. నిందితులను సుదీర్ఘంగా విచారించిన ఏసీబీ అధికారులు వారిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఒక్కొక్కరికి 14 నుంచి 19 ప్రధాన ప్రశ్నలు సంధించి కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేశారు. నిబంధనలు ఎందుకు ఉల్లంఘించారు? ఈఎస్ఐలో మందులు, పరికరాల కొనుగోళ్లలో నిబంధనలను ఎందుకు ఉల్లంఘించారంటూ ఈ కేసులో మాజీ డైరెక్టర్ విజయ్‌కుమార్‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఆయన డైరెక్టర్‌గా వ్యవహరించిన 02–11–2017 నుంచి 07–05–2019 వరకు జరిగిన అనేక లావాదేవీలపై ప్రశ్నల వర్షం కురిపించినట్టు సమాచారం. ► మీ పదవీకాలంలో సర్జికల్, ల్యాబ్ కిట్స్, ఫర్నిచర్, వైద్య పరికరాలు, బయోమెట్రిక్ మిషన్లు, మందులు ఎంత పరిమాణంలో కొనుగోలు చేశారు? వాటి కొను గోళ్లకు అధికారిక బడ్జెట్ ఎంత కేటాయించారు? వాటి కొనుగోళ్లలో బిల్లు చెల్లింపులు ఎలా చేశారు? ఓపెన్ టెండర్, ఇ–ప్రొక్యూర్మెంట్, స్మాల్ టెండర్ కొటేషన్స్ వంటి విధానాలు ఎందుకు అనుసరించలేదు? ► కొనుగోళ్లకు ముందు ఈఎస్ఐ యూనిట్లలో ఎంత మేరకు మందులు అవసరమనేది నిర్ధారించారా? ► కడప, విజయవాడ జాయింట్ డైరెక్టర్ స్థాయిలో ఈఎస్ ఐలలో అవసరానికి మించి నిల్వ ఉంచిన మందుల విలువ రూ.6.9 కోట్లా, రూ.8.9 కోట్లా? అవసరం లేకుండా అంత విలువైన మందులెందుకు కొన్నారు.. వాటిని నిరుపయోగంగా ఎందుకు వదిలేశారు? ► రూ.లక్షకు మించి వైద్య పరికరాలు కొనుగోలు చేయాలంటే ఈ–టెండర్ పిలవాలనే నిబంధన ఎందుకు పాటించలేదు? నామినేషన్ పద్ధతిపై కొనుగోళ్లు ఎందుకు జరపాల్సి వచ్చింది? లెజెండ్, అవన్టర్, ఒమేని సంస్థల వద్ద ల్యాబ్ కిట్ల కొనుగోలులో విధానపరమైన నిబంధనలు ఎందుకు ఉల్లంఘించారు? అంటూ ప్రశ్నించారు. మూడు గంటలపాటు విచారణ.. ► ఏసీబీ డీఎస్పీలు ప్రసాద్, చిరంజీవి, ఎం.సూర్యనారాయణరెడ్డిల నేతృత్వంలోని అధికారుల బృందం గురువారం సాయంత్రం గుంటూరు జీజీహెచ్‌కు వచ్చింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుధాకర్‌ను కలిసి అచ్చెన్నాయుడును ఏసీబీ కోర్టు కస్టడీకి అనుమతించిన పత్రాలను సమర్పించారు. అనంతరం అచ్చెన్న ఉన్న పొదిల ప్రసాద్ మిలీనియం బ్లాక్‌లోని గదికి చేరుకున్న అధికారులు.. డాక్టర్ రాజ్యలక్ష్మి, న్యాయవాది హరిబాబు సమక్షంలో విచారణ ప్రక్రియను చిత్రీకరిస్తూ అచ్చెన్నను సాయంత్రం ఐదు నుంచి రాత్రి ఎనిమిది వరకు విచారించారు. ► అధికారులు వరుసగా ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. అయితే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన అచ్చెన్న, మరికొన్ని ప్రశ్నలకు సమాధానం దాటేసినట్టు సమాచారం. టెలీ హెల్త్ సర్వీసెస్ ఇచ్చిన సిఫార్సు లేఖపైనే విచారణంతా కొనసాగినట్టు తెలుస్తోంది. విచారణకు అచ్చెన్న సహకరించారని, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. అక్రమాలకు పాల్పడేలా మీపై ఎవరు ఒత్తిడి తెచ్చారు? ► నిబంధనలకు విరుద్ధంగా మందులు, పరికరాల కొనుగోళ్లలో అవినీతి, అక్రమాలకు ఆస్కార మిచ్చేలా మీపై ఎవరు ఒత్తిడి తెచ్చారు? మీ పాత్ర ఎంత? మీకు కలిగిన లబ్ధి ఎంత? అంటూ ఈ కేసులో ఎ–6 అయిన సూపరింటెండెంట్ ఎంకేపీ చక్రవర్తి, ఎ–8 అయిన రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ వి.జనార్దన్లను ప్రశ్నించారు. ► నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున మందుల సరఫరా డీల్‌ను ఎలా సాధించారు? ఇందుకు రాజకీయ నేతలను ఎలా ప్రసన్నం చేసుకున్నారు? మందుల కొనుగోళ్ల ఆర్డర్ మీకే దక్కేలా ఎవరె వరికి ఎంతిచ్చారు అంటూ ఎ–15 నిందితుడైన మందుల ఏజెన్సీ నిర్వాహకుడు వెంకట సుబ్బారావును ఏసీబీ ప్రశ్నించినట్టు సమాచారం. -
తొలిరోజు ముగిసిన అచ్చెన్నాయుడు విచారణ
సాక్షి, గుంటూరు : ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టైన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు తొలి రోజు విచారణ కొద్ది రోజుల కిందట ముగిసింది. కోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో అచ్చెన్నను విచారించారు. దాదాపు మూడు గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. అయితే అచ్చెన్నాయుడు విచారణకు సహకరించారని అధికారులు తెలిపారు. అచ్చెన్న ఆరోగ్యం బాగానే ఉందని ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ వెల్లడించారు. మరోవైపు ఈ కేసులో మిగిలిన నలుగురు నిందితులను ఏసీబీ అధికారులు రాజమండ్రి నుంచి విజయవాడ తరలించి విచారణ చేపట్టారు. ఈ స్కామ్‌కు సంబంధించి మరికొన్ని కీలక ఆధరాలు సేకరించనున్నారు. కాగా, మరో రెండు రోజుల పాటు ఏసీబీ అధికారులు ఈ కేసులో నిందితులను విచారించనున్న సంగతి తెలిసిందే. -
ఏసీబీ కస్టడీకి అచ్చెన్నాయుడు
సాక్షి, గుంటూరు : ఈఎస్ఐ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, మరో అయిదుగురిని ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను గురువారం ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఈ నెల 12న అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాలతో ఇవాళ నుంచి మూడు రోజుల పాటు ఆయనను ఏసీబీ విచారణ చేయనుంది. కాగా ఈ కుంభకోణంలో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడు, రమేష్ కుమార్‌ను మూడు రోజుల పాటు, విజయ్‌కుమార్, జసదన్, చక్రవర్తి, వెంకట సుబ్బారావులను రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇస్తూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఇన్ఛార్జ్ న్యాయమూర్తి వెంకటరమణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.(ఈఎస్ఐ స్కామ్ : ఏసీబీ కస్టడీకి అనుమతి) కాగా రాజమండ్రి జైలులో ఉన్న డైరెక్టర్లు రమేష్ కుమార్, విజయ్ కుమార్, వేణుగోపాల్, వెంకట సుబ్బారావు, మరో వ్యక్తిని పోలీస్ ఎస్కార్ట్ సహాయంతో విజయవాడకు తరలించారు. రెండు రోజుల విచారణ అనంతరం మళ్ళీ వీరిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తామని అధికారులు పేర్కొన్నారు. అంతకుముందు ఏసీబీ హెడ్ క్వార్టర్స్‌లో ఏసీబీ డీజీతో అధికారులు భేటీ అయ్యారు. ఈఎస్ఐ స్కాంలో అరెస్టైన నిందితుల నుంచి రాబట్టాల్సిన అంశంపై చర్చలు జరిపారు. -
ఈఎస్ఐ స్కామ్ : ఏసీబీ కస్టడీకి అనుమతి
సాక్షి, విజయవాడ : ఈఎస్ఐ కుంభకోణం కేసులో నిందితులను మూడు రోజుల ఏసీబీ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ కేసులో ఏ1గా ఉన్న ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ రమేశ్‌కుమార్, ఏ2గా ఉన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడుతోపాటుగా మరో ముగ్గురు నిందితులను కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసింది. అయితే అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో ఉన్న అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు అక్కడే విచారించనున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో మిగతా నలుగురిని కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. (చదవండి : అచ్చెన్నాయుడుకు 14 రోజుల రిమాండ్) కాగా, ఈ కేసులో ఏ2గా ఉన్న అచ్చెన్నాయుడిని అధికారులు ఈ నెల 12న అదుపులోకి తీసుకుని.. ఏసీబీ న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన సంగతి తెలిసిందే. దీంతో న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయనను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలని న్యాయమూర్తి తెలిపారు. -
ఆంధ్రాలో కుంభకోణం.. కోదాడలో కలకలం!
కోదాడ : ఆంధ్రాలో ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించిన వ్యవహారం కోదాడలో కలకలం రేపుతోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసిన కార్మికరాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐ) మందుల సరఫరా కుంభకోణానికి పాల్పడిన వారిలో కోదాడకు చెందిన ఓ యువకుడికి సంబంధాలు ఉన్నాయని తేలింది. దీంతో అక్కడి ఏసీబీ అధికారులు ఆదివారం కోదాడకు వచ్చి రహస్యంగా విచారణ చేయడం స్థానికంగా సంచలనం సృష్టించింది. కోదాడకు చెందిన ప్రమోద్‌రెడ్డి ఏ–3 నిందితుడిగా అక్కడి ఏసీబీ పోలీసులు కేసు నమోదు చేశారు. (అదే జరిగితే చినబాబు, పెదబాబు పరిస్థితి ఏమిటో? ) హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న టెలీహెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి డైరెక్టర్‌గా ప్రమోద్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ కుంభకో ణంలో ఏ–1 నిందితుడిగా ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ రమేష్‌కుమార్‌ను, ఏ–2గా ఉన్న మాజీమంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రమోద్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతను సెల్ స్విచ్ ఆఫ్ చేయడంతో ఏసీబీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. అతడి తల్లిదండ్రులు కోదాడలో ఉండడంతో ఆంధ్రా ఏసీబీ అధికారులు ఆదివారం కోదాడకు వచ్చి రహస్య విచారణ చేశారు. అతని బంధువులు, స్నేహితులు ఎవరో ఆరా తీశారు. అతడి స్వగ్రామమైన అనంతగిరి మండలంలో కూడా విచారణ చేసి అక్కడ నిఘా పెట్టినట్లు తెలి సింది.(‘అచ్చెన్నాయుడు అప్రూవర్‌గా మారితే..’) -
ఈఎస్ఐకి నవ‘గ్రహణం’
సాక్షి, అమరావతి: చంద్రబాబు జమానాలో జరిగిన ఈఎస్ఐ స్కామ్‌లో కీలక కోణాన్ని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) గుర్తించింది. ఈఎస్ఐలో నిబంధనలకు విరుద్ధంగా రూ. 988.77 కోట్లు ఖర్చు చేయగా, వాటిలో అప్పటి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు కలిసి రూ.150 కోట్లకు పైగా అవినీతి అక్రమాలకు పాల్పడినట్టు ఏసీబీ ప్రాథమికంగా అంచనా వేసిన సంగతి తెలిసిందే. ► 19 మంది ప్రమేయం ఉన్న ఈ కేసులో కార్మిక శాఖ మాజీ మంత్రి అచ్చెన్నాయుడుతోపాటు 8 మందిని ఏసీబీ అరెస్టు చేసింది. మరో 11 మంది అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ► ఈ భారీ స్కామ్‌లో తొమ్మిది అంశాలను గుర్తించారు. తప్పుడు కొటేషన్లు, బిల్లుల చెల్లింపులో అక్రమాలు, మందులు, ల్యాబ్ కిట్స్, సర్జికల్ ఐటెమ్స్, ఫర్నిచర్, బయో మెట్రిక్ పరికరాల కొనుగోళ్లలో, టోల్ ఫ్రీ–ఈసీజీ సర్వీసులు, సీవరేజ్ ట్రీట్మెంట్ వంటి 9 అంశాల్లో అవినీతిని గుర్తించారు. ► ఈ–టెండర్ల బదులు నామినేషన్ పద్ధతిలో కోట్ల రూపాయలను దారి మళ్లించారు. లేని కంపెనీలు ఉన్నట్టు నకిలీ లెటర్ ప్యాడ్లు, కొటేషన్లు, ఓచర్లు, బిల్లులు సృష్టించి సొమ్ము కాజేసినట్లు గుర్తించారు. ► ఈఎస్ఐ ఉద్యోగులు కొందరు తమ కుటుంబ సభ్యుల పేరుతో బినామీ మందుల కంపెనీలు పెట్టి అక్రమంగా మందుల కొనుగోళ్ల ఒప్పందాలు చేసుకున్నారు. ► మందులు, సర్జికల్ ఐటెమ్స్ విషయంలో మార్కెట్ ధర కంటే 50 నుంచి 136 శాతం అదనంగా అక్రమ చెల్లింపులకు పాల్పడ్డారు. ► మందుల కొనుగోళ్లలో రూ.51.2 కోట్లు, ల్యాబ్ కిట్ల కొనుగోళ్లలో రూ.85.32 కోట్లు, సర్జికల్ ఐటెమ్స్‌కు రూ.10.43 కోట్లు, ఫర్నిచర్లో రూ.4.63 కోట్లు ఇలా మొత్తం రూ.150 కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారు. ► రాశి ఫార్మా, వీరేశ్ ఫార్మా సంస్థల నుంచి కొనుగోళ్లు, ఇన్వాయిస్లను సోదాలు చేస్తే రూ.5.70కోట్లు వ్యత్యాసం కనిపించింది. ► ఈఎస్ఐ ఫార్మసిస్ట్‌గా ఉన్న కె.ధనలక్ష్మి కోడలు రావిళ్ల రవి తేజస్వి పేరుతో ఏర్పాటు చేసిన జెర్కాన్ ఎంటర్ ప్రైజెస్ సంస్థకు రూ.9.50కోట్ల మందుల ఆర్డర్లు ఇచ్చారు. ఇవన్నీ రమేశ్‌కుమార్, విజయకుమార్‌లు డైరెక్టర్లుగా ఉన్నప్పుడే జరిగాయి. ► జలం ఎన్విరాన్మెంట్ సంస్థకు ఇచ్చిన ఆర్డర్లలోనూ అవకతవకలున్నాయి. ప్రొడిజి సంస్థ నుంచి ఒక్కొక్కటి రూ.17వేల ఖరీదు చేసే బయో మెట్రిక్ మెషీన్లను రూ. 70 వేలు చొప్పున వంద మెషీన్లు కొన్నారు. -
అదే జరిగితే చినబాబు, పెదబాబు పరిస్థితి ఏమిటో?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. ప్రతి దానికి కులానికి లింకుపెట్టే చంద్రబాబూ.. ఈ అంకెలు చూడు అర్థమవుతుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి కట్టుబడింది వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రమే. కులాలను రెచ్చగొట్టి, అహింసాగ్నిలో చలికాచుకునే చరిత్ర చంద్రబాబుదే..! బడ్జెట్లో కేటాయింపులో బీసీలకు 68.18 శాతం, కాపులకు 42.35 శాతం మైనార్టీలకు 116శాతం పెంపు' అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. చదవండి: 'మీ అలీబాబా 40 దొంగల స్టోరీ అంతా వారికి తెలుసు' కాగా మరో ట్వీట్లో.. ఈఎస్ఐ మాజీ డైరెక్టర్లు అచ్చెన్న బెదిరింపుల వల్ల రూల్స్‌కు విరుద్ధంగా కొనుగోలు చేస్తామని చెప్పారంట. వార్నింగులిచ్చి తప్పు చేయించాడని ఇన్సైడ్ స్టోరీలు బయటపెట్టారంట. వాళ్లు అప్రూవర్లుగా మారితే అచ్చెన్నకు శిక్ష తప్పదు. అచ్చెన్నే అప్రూవర్ అయితే పెదబాబు, చినబాబుల పరిస్థితి ఏమిటో? అంటూ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. చదవండి: ‘లోకేశ్‌ను మాలోకం అనేది అందుకే’ -
‘అచ్చెన్నాయుడు అప్రూవర్‌గా మారితే..’
సాక్షి, తూర్పుగోదావరి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు పెద్ద అవినీతి తిమింగలమని వ్యాఖ్యానించారు. నిధులను స్వాహా చేయడంలో చంద్రబాబు దిట్ట అని అన్నారు. హౌసింగ్, నీరు-చెట్టు సహా అన్నింటిలోనూ అవినీతి జరిగిందని సోము వీర్రాజు ఆరోపించారు. అచ్చెన్నాయుడు అప్రూవర్‌గా మారితే టీడీపీలో చాలా మంది జైలుకు వెళ్తారని ఆయన జోస్యం చెప్పారు. కాగా, ఈఎస్ఐ కుంభకోణం కేసులో శుక్రవారం అరెస్టైన కార్మిక శాఖ మాజీ మంత్రి, టెక్కలి టీడీపీ ఎమ్మెల్యే కె.అచ్చెన్నాయుడుకు ఏసీబీ న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. (చదవండి: ఈఎస్ఐ స్కాం మూలాలపై కన్ను) -
‘రూ.150 కోట్ల స్కామ్‌లో ఆ ఇద్దరికీ వాటా’
సాక్షి, గుంటూరు: ఈఎస్ఐ అవినీతిలో ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌కు కూడా వాటా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. రూ.150 కోట్ల అవినీతిలో వారికి వాటా ఉన్నందునే అసలు విషయం పక్కనపెట్టి అచ్చెన్నాయుడు అరెస్టు అన్యాయం అని మాట్లాడుతున్నారని విమర్శించారు. అచ్చన్నాయుడును కలవాలంటే ఎవరైనా కోర్టు అనుమతి తీసుకోవాల్సిందే మంత్రి తెలిపారు. అచ్చెన్నాయుడును కలిసేందుకు అనుమతి ఇవ్వలేదని చంద్రబాబు ప్రభుత్వాన్ని నిందించటం సరికాదని హితవు పలికారు. (చదవండి: ఈఎస్ఐ స్కాం మూలాలపై కన్ను) సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈఎస్ఐలో అవినీతి జరగలేదని చంద్రబాబు చెప్పగలరా? అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడలేదని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అరెస్టు అన్యాయం అని మాట్లాడితే సరిపోతుందా?’ అని బొత్స సూటిగా ప్రశ్నించారు. కాగా, ఈఎస్ఐ కుంభకోణం కేసులో శుక్రవారం అరెస్టైన కార్మిక శాఖ మాజీ మంత్రి, టెక్కలి టీడీపీ ఎమ్మెల్యే కె.అచ్చెన్నాయుడుకు ఏసీబీ న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. (చదవండి: అచ్చెన్నాయుడుకు 14 రోజుల రిమాండ్) -
ఈఎస్ఐ స్కాం మూలాలపై కన్ను
సాక్షి, అమరావతి: కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐ)లో జరిగిన భారీ కుంభకోణంలో మూలాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దృష్టిపెట్టింది. చంద్రబాబు జమానాలో జరిగిన ఈ స్కామ్‌పై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇచ్చిన నివేదికతో ఏసీబీ దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈఎస్ఐలో 2014 నుంచి 2019 వరకు నిబంధనలకు విరుద్ధంగా రూ.988.77 కోట్ల విలువైన మందులు, వైద్య పరికరాల కొనుగోలు, టెలీ సర్వీసెస్ సేవల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని నిగ్గుతేల్చింది. ఇందుకు ప్రతిగా అప్పటి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రైవేటు వ్యక్తులు కలిసి రూ.150 కోట్లకు పైగా అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది. అలాగే, ఈ బాగోతంలో 19 మందికి ప్రమేయం ఉన్నట్లు గుర్తించి.. అప్పటి కార్మిక శాఖ మంత్రి, టెక్కలి టీడీపీ ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు, ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ సీకే రమేష్‌కుమార్‌తోపాటు మరో ఐదుగురిని అరెస్టుచేసింది. దీంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ స్కామ్‌లో మిగిలిన వారి అరెస్టుకు కూడా రంగం సిద్ధంచేసుకుంటున్న ఏసీబీ.. మరింత లోతైన దర్యాప్తు కోసం రెండు ప్రత్యేక బృందాలతోపాటు సెర్చ్ టీమ్‌లను రంగంలోకి దించింది. ► స్కామ్‌తో ప్రమేయమున్న 19 మంది కాల్‌లిస్ట్‌ను సేకరించి లోతైన దర్యాప్తు చేయడం ద్వారా వారితో ఇంకెవరికి సంబంధాలు ఉన్నాయో ఈ బృందాలు గుర్తించనున్నాయి. ► సచివాలయంలోని ముగ్గురు ఉద్యోగులకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో శాఖాపరమైన జీఓలను పరిశీలించలేదనే ప్రధాన అంశానికి సంబంధించి వారిని అదుపులోకి తీసుకుని విచారించనున్నట్లు సమాచారం. బ్యాంకు లావాదేవీలపైనా ఆరా.. ► స్కామ్‌లో ప్రమేయమున్న వ్యక్తులు, అక్రమాలకు పాల్పడిన సంస్థలు, కంపెనీలకు చెందిన బ్యాంకు లావాదేవీలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ► 2016లో అచ్చెన్నాయుడు లేఖ రాసిన అనంతరం.. ఈఎస్ఐ స్కామ్‌కు తెరలేపడంతో ఆయా వ్యక్తులు, సంస్థలు, కంపెనీల బ్యాంకు అకౌంట్లలో లావాదేవీలు ఎప్పుడు జరిగాయి.. ఎలా జరిగాయి.. ఎవరు చేశారు అనే కోణాలపైనా దృష్టిపెట్టారు. ► దీనిలో భాగంగానే ఆయా వ్యక్తులు, సంస్థలు, కంపెనీలకు చెందిన బ్యాంకు అకౌంట్లను తొలుత స్తంభింపజేయాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ► అంతేకాక.. మందులు, పరికరాల కొనుగోళ్లు, సేవలకు సంబంధించిన సంస్థలు, కంపెనీల పుట్టుపూర్వోత్తరాలపైనా ఏసీబీ అధికారులు గురిపెట్టారు. ► ఈఎస్ఐతో ఆర్థిక లావాదేవీలు నిర్వహించిన టెలీ హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్రుడ్జీ కంప్యూటర్స్ అండ్ ల్యాప్టాప్స్, జలమ్ ఎన్విరాన్మెంటల్ ప్రైవేట్ లిమిటెడ్, జర్కిస్ ఎంటర్ప్రైజెస్, ఎస్కేపీ ఎంటర్ప్రైజెస్ (విజయనగరం), శ్రీ సీతారామ ఫార్మాస్యూటికల్స్ (నరసరావుపేట) తదితర కంపెనీలు, సంస్థలు ఎప్పటి నుంచి ఉన్నాయి. వాటి గుర్తింపు, సామర్థ్యం, సేవల్లో విశ్వసనీయత తదితర అన్ని కోణాల్లోను ఏసీబీ దర్యాప్తు సాగుతోంది. -
‘కోడెలకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు’
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో అవినీతిపై యుద్ధం ప్రకటించి సీఎం వైఎస్ జగన్ అక్రమార్కుల భరతం పడుతుంటే చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు ధ్వజమెత్తారు. విశాఖలో ఆదివారం రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ గత ఐదేళ్లూ రాష్ట్రాన్ని దోచుకున్నారు. వారి హయంలో జరిగిన ప్రతి దోపిడీ వెనుక వీరిద్దరి హస్తం ఉంది. చంద్రబాబు అవినీతిని బయటపెడుతుంటే.. తప్పుడు ఆరోపణలతో విషయాన్ని పక్కదారి పట్టించాలని చూస్తున్నారు. అచ్చెన్నాయుడిని ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్ట్ చేస్తే బీసీ కార్డు వాడుతున్నారు. జేసీ ప్రభాకరరెడ్డి అరెస్టయితే కక్ష సాధింపు అని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. సీఎం జగన్ గేట్లు ఎత్తితే టీడీపీ ఎమ్మెల్యేలు మొత్తం వైఎస్సార్సీపీలో చేరేవారు. కానీ వైఎస్ జగన్ విలువలు కలిగిన వ్యక్తి కాబట్టే మీలాగా పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించలేదు. పార్టీలో చేరాలనుకున్నా వారు రాజీనామా చేసి రావాలని చెప్పారు. మీరు అధికారంలో ఉన్పప్పుడు 23 మంది మా పార్టీ ఎమ్మెల్యేలని కొనుగోలు చేసి కొందరికి మంత్రి పదవి ఇచ్చిన చరిత్ర మీది. చదవండి: 'మీ అలీబాబా 40 దొంగల స్టోరీ అంతా వారికి తెలుసు' సీఎం వైఎస్ జగన్ ఒక సంవత్సరం పాలనలో 4 కోట్ల మంది ప్రజలకి రూ. 44వేల కోట్ల లబ్ధి చేకూరింది. అవినీతికి ఆస్కారం లేకుండా దళారీ వ్యవస్థ లేకుండా నడుపుతున్న ప్రభుత్వం మాది. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎపుడైనా అవినీతి నిర్మూలనపై తగిన ఆదేశాలు ఇచ్చారా..? అవినీతిపరులకి మీరే అండగా ఉంటూ కార్యకర్తలపై ఒత్తిడి తెచ్చి ధర్నాలు చేయమంటున్నారు. ఎన్నికల ముందు పోలవరంలో అవినీతి జరిగిందని ప్రధానిమోదీ చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. పోలవరంపై ప్రధాని మోదీ విచారణ చేసి ఉంటే ఈ రోజు చంద్రబాబు ఎన్నికలలో పోటీచేసే అవకాశమే ఉండేది కాదు. ఈఎస్ఐలో మంత్రి అచ్చెన్నాయుడు 150 కోట్ల కుంభకోణం చేశారు. ఈఎస్ఐ కుంభకోణంలో లోకేష్ పాత్ర, మిగిలిన వారి పాత్ర ఎంత ఉందో వెలికి తీయాలి. ఈఎస్ఐ కుంభకోణంలో మంత్రి ప్రమేయం లేనప్పుడు ఆయన ఎందుకు సిఫార్సు లేఖలు ఇచ్చారు. ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ మంత్రి ప్రమేయం లేదంటే మీ హస్తముందా చంద్రబాబూ అంటూ ప్రశ్నించారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తిని పరామర్శించాలంటే కోర్టు అనుమతి ఉండాలని మీకు తెలియదా..? అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై చంద్రబాబు, లోకేష్ అతిగా బాధపడటం చూస్తుంటే వీరి పాత్రపై అనుమానాలు కలుగుతున్నాయి. చదవండి: టీడీపీ వ్యూహం.. అట్టర్ ఫ్లాప్ కోడెలపై అవినీతి ఆరోపణలు వచ్చినపుడు కనీసం చంద్రబాబు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆయన ఆత్మహత్యకి చంద్రబాబు కారణం కాదా..! అచ్చెన్నాయుడిపై చూపిన ప్రేమ మీరు కోడెలపై ఎందుకు చూపలేదు.. కోడెలపై కక్ష సాధింపు చేపట్టారా. అచ్చెన్నాయుడి కుటుంబం మొదటి నుంచి పార్టీకి సేవలు చేశారని చెబుతున్నారు. అయితే వాజ్‌పేయి హయాంలో ఎర్రన్నాయుడికి మీరు స్పీకర్ అవకాశం రాకుండా చేయలేదా..? అచ్చెంన్నాయుడు బీసీలకి నేత కాదు. అతను మీ పార్టీలో మాత్రమే నేత. మాకు ఎవరికీ నేత కాదు. చంద్రబాబు తన హయాంలో బీసీలకి చేసిందేమీ లేదు. ఎన్టీఆర్ బ్రతికున్నప్పుడు మాత్రమే టీడీపీ బీసీలపార్టీగా ఉంది. ఇప్పుడున్న టీడీపీ మనీ పార్టీ. దోచుకో.. దాచుకో..ఎన్నికల సమయంలో ఖర్చుపెట్టుకో ఇదే నినాదం. జేసీ ప్రభాకర్ రెడ్డి ట్రాన్స్ పోర్ట్ అక్రమాలపై గతంలోనే నేను కౌన్సిల్లో ప్రశ్నించాను. నిబంధనలకి విరుద్ధంగా 200 బస్సులు ఫిట్నెస్ లేకుండా జేసీ ఎలా తిప్పుతారు. గత ప్రభుత్వంలో మంత్రుల అవినీతికి చంద్రబాబే బాధ్యత వహించాలి. తను అధికారంలో ఉన్నప్పుడు చట్టం తనపని తాను చేసుకుపోతుంది అన్న బాబు ఇప్పుడు ఎందుకు ఆ మాట చెప్పలేకపోతున్నారు' అంటూ మండిపడ్డారు. -
'మీ అలీబాబా 40 దొంగల స్టోరీ అంతా వారికి తెలుసు'
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. 'ఒక చిన్న రాష్ట్రం సీఎంగా ఉండి కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్, 8 ప్రాంతీయ పార్టీలకు బాబు గారు వేల కోట్ల ఫండింగ్ చేసారు. అంత డబ్బు ఈయనకు ఎక్కడి నుంచి వచ్చిందని అప్పట్లో జాతీయ మీడియా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. బాబు గారి అలీబాబా 40 దొంగల స్టోరీ అంతా మోదీ, అమిత్ షా గార్లకు తెలుసంటూ' విమర్శనాస్త్రాలు సంధించారు. కాగా మరో ట్వీట్లో.. 'వాళ్లంతా 20 వేల లోపు జీతాలు పొందే కార్మికులు. ఈఎస్ఐ సభ్యత్వం కింద నెలకు రూ.50-70 చెల్లిస్తారు. అనారోగ్యానికి గురైతే హాస్పిటల్లో మంచి చికిత్స దొరుకుతుందని ఆశపడితే, మీ బినామీ, అప్పటి కార్మిక మంత్రి అచ్చెన్న చేసిందేమిటి. 900 కోట్ల కుంభకోణానికి పాల్పడి కార్మికుల ఉసురు తీశారు' అంటూ విజయసాయి రెడ్డి మండిపడ్డారు. చదవండి: టీడీపీ వ్యూహం.. అట్టర్ ఫ్లాప్ -
టీడీపీ వ్యూహం.. అట్టర్ ఫ్లాప్
సాక్షి, శ్రీకాకుళం: ‘నువ్వు మగాడివైతే... రాయలసీమ రక్తం నీలో ఉంటే... ఆరోపణలను నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకోవాలి. టెండర్లు పిలిచి అవినీతి చేసినట్టు సోదాల్లో తేలితే వెంటనే రాజకీయాల నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీకు మగతనం ఉంటే ఈ చాలెంజ్‌కు రమ్మంటున్నా’ అంటూ అసెంబ్లీ సమావేశాల్లో ఓ సందర్భంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. టెండర్లు పిలిచిన పనుల సంగతి ఏమిటో.. ప్రస్తుతం పలు అభివృద్ధి పనులకు నిర్వహిస్తున్న రివర్స్ టెండర్ల ద్వారా ప్రభుత్వానికి ఆదా అవుతున్న వేల కోట్ల రూపాయలే నిరూపిస్తున్నాయి. వాటిని పక్కన పెడితే టెండర్లు పిలవకుండానే ఈఎస్ఐ మందులు, పరికరాల కొనుగోలులో నామినేషన్ పద్ధతిలో కోట్లు కొల్లగొట్టారని అటు విజిలెన్స్, ఇటు ఏసీబీ నిగ్గు తేల్చాయి. పక్కా ఆధారాలతోనే అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఇప్పుడు చేయాల్సింది తాను అవినీతి చేయలేదని న్యాయస్థానంలో నిరూపించుకోవడమే. లేదంటే శాసనసభలో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండాలని విశ్లేషకులు ఒకవైపు అంటుండగా... అవినీతికి పాల్పడి దాన్ని కులానికి ఆపాదించడం ఎంతమేరకు సమంజసమని బీసీ వర్గాలు బాహాటంగా విమర్శిస్తున్నాయి. చదవండి: మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ రివర్స్ అయిన బీసీ కార్డు వ్యూహం బీసీ నినాదంతో ఈఎస్ఐ స్కామ్‌ను పక్కదారి పట్టిద్దామని టీడీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. వారికి కనీస మద్దతు లభించలేదు. పసలేని ప్రచారం అంటూ బీసీ వర్గాలు కొట్టి పారేశాయి. ఇలాంటి వాటికి మద్దతు ఎందుకిస్తామని ఎదురు ప్రశ్నిస్తున్నాయి. తప్పు చేస్తే ఏ కులమైనా ఒకటేనని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని, దాన్ని కులానికి అంటగట్టడమేంటని, బీసీలను అణగదొక్కుతున్నట్టు టీడీపీ నేతలు కామెంట్లు చేయడమేంటని బీసీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. అందుకనే రాష్ట్రంలో ఎక్కడా బీసీల నుంచి అచ్చెన్నాయుడికి మద్దతు లభించలేదు. అంతెందుకు సొంత జిల్లాలోనే బీసీలు అండగా నిలవలేదు. అచ్చెన్నాయుడి అరెస్టును ఖండించాలని అంతర్గతంగా సంకేతాలు వెళ్తున్నా ఏ ఒక్కరూ స్పందించడం లేదు. ఎంతసేపూ టీడీపీ నేతలు పచ్చ మీడియా ద్వారా పదేపదే బీసీ నేతపై కక్ష సాధింపు చర్యగా అభివర్ణించుకుంటూ సొంత డబ్బా కొట్టుకుంటున్నారు. టీడీపీ నేతలు చేసిన అవినీతికి తామెందుకు మద్దతిస్తామని, తప్పు చేసినవారు అరెస్టయితే తామెందుకు ఖండిస్తామని బాహాటంగానే బీసీ నేతలు చెబుతున్నారు. వీటి సంగతి తేల్చితే అచ్చెన్న గుట్టంతా రట్టే అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నంతకాలం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. తిత్లీ పరిహారంపై సమగ్ర విచారణ జరిపితే అచ్చెన్న బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. నీరు చెట్టు, చంద్రన్న బీమా, సాగునీటి ప్రాజెక్టుల అంచనాల రూపకల్పన, గ్రానైట్, ఇసుక కుంభకోణాలు, బీసీ కార్పొరేషన్ రుణాల్లో అక్రమాలు, సింగిల్ టెండర్ విధానంతో సొంత అన్నకు టెండర్లు కట్టబెట్టడం, ధాన్యం రవాణాకు వచ్చిన కోట్లాది రూపాయలు సొంత ఖాతాలకు మళ్లించుకోవడం, మినుముల కుంభకోణంతో కోట్ల రూపాయలు పక్కదారి పట్టించడం, సింగిల్ టెండర్ విధానంతో తన బినామీ లాడి శ్రీనివాసరావుకు ఆర్టీసీ టెండర్లు కట్టబెట్టడం, కేశినేని, దివాకర్ ట్రావెల్స్‌కు అడ్డగోలుగా రవాణా లైసెన్సులు జారీ చేయడం వంటి వాటిపై పూర్తిస్థాయిలో విచారణ జరిగితే ఈయనగారి బాగోతం మరింత బయటపడనుంది. ఇప్పటికే అచ్చెన్న అక్రమాలపై టెక్కలి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త పేరాడ తిలక్ పలు విచారణ సంస్థలకు ఫిర్యాదులు కూడా ఇచ్చారు. వాటి లెక్క తేలితే అచ్చెన్నకు ఉచ్చు మరింత బిగుస్తుంది. టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం ఏ స్థాయిలో అవినీతి జరిగిందో జిల్లా ప్రజలందరికీ తెలిసిందే. అందుకనే అచ్చెన్న అరెస్టును జిల్లా ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదు. తప్పు చేశాడు కాబట్టి అరెస్టయ్యాడని అంటున్నారు. చదవండి: కౌంట్‌డౌన్ స్టార్ట్.. అచ్చెన్న ఆటకట్టు ఈఎస్ఐ స్కామ్ నిందితుడికీ బీసీలకు ముడిపెట్టడం సరికాదు ఈఎస్ఐ స్కామ్‌లో రూ.150 కోట్లకు పైగా అవినీతి చేసి అడ్డంగా దొరికిపోయిన అచ్చెన్నాయుడి అరెస్ట్‌ను బీసీలతో ముడిపెట్టడం హేయమైన చర్య. గతంలో బీసీ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు సమక్షంలో కాపు రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టినప్పుడే వెనుకబడిన వర్గాలకు చెందినవాడిగా చెప్పుకునే నైతిక హక్కు కోల్పోయారు. అవినీతి చేసిన వారెవ్వరైనా శిక్ష అనుభవించాల్సిందే. –బొడ్డేపల్లి దామోదరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆల్ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ నిందితులు ఎంతటి వారైనా శిక్ష అనుభవించాల్సిందే అంబేడ్కర్ రాజ్యాంగంలో అవినీతి చేసే వారి కోసం ప్రత్యే క రిజర్వేషన్ ఏమీ ఇవ్వలేదు. చట్టం ముందు అందరూ సమానమే. కారి్మకుల కోసం ఏర్పాటు చేసిన ఈఎస్ఐ ఆసుపత్రుల్లో మందులు, సర్జికల్ వస్తువులు, కంప్యూటర్ల కొనుగోలులో నాన్‌రేట్ కాంట్రా క్ట్కి అప్పగించడం దారుణం. ప్రజాధనం దోచుకున్నవారికి శిక్ష వేయాలి. అవినీతి చేసి బీసీలనడం బీసీ జాతికే అవమానకరం. –డబ్బీరు శ్రీనివాసరావు (వాసు), ఏఐబీసీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మోపిదేవిని అరెస్ట్ చేయించినప్పుడు ఏమైంది బీసీ కార్డు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వెనుకబడిన వర్గాని కి చెందిన మోపిదేవి వెంకటరమణను అరెస్ట్ చేసినప్పుడు ఏమైంది బీసీల మీద ఈ ప్రేమ? ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేసినప్పుడు ఏమైంది అణగారిన వర్గాలపై ప్రేమ. 2014 ఎన్నికల ముందు నాయీబ్రాహ్మణులకు, మత్స్యకారులకు హామీలిచ్చి మోసగించినప్పుడు ఏమైంది ఈ ప్రేమ? ఈఎస్ఐ స్కామ్‌లో అడ్డంగా దొరికిన అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసినప్పుడే బీసీలు గుర్తొచ్చారా? – డి.పి.దేవ్, ఏఐబీసీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షుడు, శ్రీకాకుళం -
అచ్చెన్నాయుడుకు 14 రోజుల రిమాండ్
సాక్షి, అమరావతి/గుంటూరు: ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టైన కార్మిక శాఖ మాజీ మంత్రి, టెక్కలి టీడీపీ ఎమ్మెల్యే కె.అచ్చెన్నాయుడుకు ఏసీబీ న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. శుక్రవారం ఆయనను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు చట్టపరమైన లాంఛనాలు పూర్తి చేసి శనివారం తెల్లవారుజామున ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. అచ్చెన్నాయుడు శస్త్రచికిత్స చేయించుకున్న విషయాన్ని ఏసీబీ అధికారులు, ఆయన తరఫు న్యాయవాది ప్రస్తావించడంతో రిమాండ్ విధించిన న్యాయమూర్తి.. వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. దీంతో ఆయనను విజయవాడ సబ్ జైలుకు తరలించి రిమాండ్ ఖైదీగా నమోదు చేశారు. ఆయనకు ఖైదీ నంబర్ 1573 కేటాయించారు. గుంటూరు జీజీహెచ్‌కు తరలింపు – జైలులో రిమాండ్ నమోదు ప్రక్రియ పూర్తయిన అనంతరం శనివారం ఉదయం అచ్చెన్నాయుడిని గుంటూరులోని ప్రభుత్వ సాధారణ ఆస్పత్రి(జీజీహెచ్)కి వైద్య సేవల నిమిత్తం తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. – ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని జీజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ తెలిపారు. రెండు, మూడు రోజుల్లో గాయం నయమయ్యే అవకాశం ఉందని తెలిపారు. – ఇన్ఫెక్షన్ పెద్దదైతే మరోసారి ఆపరేషన్ చేయాల్సి రావొచ్చని చెప్పారు. 90 శాతం ఆయనకు మళ్లీ ఆపరేషన్ అవసరం ఉండదని స్పష్టం చేశారు. షుగర్ నార్మల్‌గానే ఉందని, బీపీకి మందులు కొనసాగిస్తున్నామని వివరించారు. – ఇదిలావుంటే.. అచ్చెన్నాయుడు సోమవారం నాటికి కోలుకుని సబ్‌జైలుకు తరలించే అవకాశం ఉంటే.. విచారణ నిమిత్తం తమ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోరే అవకాశం ఉందని చెబుతున్నారు. – అరెస్ట్ చేసిన వెంటనే అచ్చెన్నాయుడిని కోర్టుకు తరలించినందున ఈఎస్ఐ కుంభకోణంలో మరింత లోతైన విచారణ చేసే అవకాశం లేకపోయిందని, అందువల్ల మరికొన్ని రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని న్యాయమూర్తిని ఏసీబీని కోరనున్నట్టు సమాచారం. చంద్రబాబుకు అనుమతి నిరాకరణ అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు శనివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో గుంటూరు వచ్చారు. అచ్చెన్నాయుడిని కలిసేందుకు మేజిస్ట్రేట్ అనుమతి తప్పనిసరి అని పోలీసులు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధాకర్ తెలిపారు. జైళ్ల శాఖ సైతం అనుమతి నిరాకరించింది. దీంతో చంద్రబాబు బయటి నుంచే అచ్చెన్నాయుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆ కుటుంబంపై బురద చల్లేందుకే.. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ 35 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన కుటుంబం అచ్చెన్నదని, ఆ కుటుంబంపై బురద చల్లేందుకే ఆయనను అరెస్ట్ చేశారని విమర్శించారు. పైల్స్ ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తిని 24 గంటల్లో 500 కిలోమీటర్లు తిప్పడం వల్ల రక్తస్రావం అయ్యిందన్నారు. 300 మంది పోలీసులు అచ్చెన్నాయుడి ఇంటిని చుట్టుముట్టి ఉన్నపళంగా అరెస్ట్ చేసి తీసుకువచ్చారన్నారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలు, విజిలెన్స్ రిపోర్టులతో అచ్చెన్నాయుడుపై కేసులు పెట్టి బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రలోభాలకు గురిచేసి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను వశపర్చుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు వెంట మాజీ మంత్రులు దేవినేని ఉమా, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్ర, కొల్లు రవీంద్ర, ఇతర నాయకులు ఉన్నారు. భౌతిక దూరం మరిచి... అచ్చెన్నాయుడి పరామర్శ పేరుతో జీజీహెచ్‌కు వచ్చిన టీడీపీ నాయకులు భౌతిక దూరాన్ని మరిచారు. గుంపులు గుంపులుగా చంద్రబాబు చుట్టూ చేరారు. భౌతిక దూరం పాటించాలని పోలీసులు చెబుతున్నా పట్టించుకోకుండా గుమిగూడారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో రోగులు, వ్యాధిగ్రస్తులు ఉండే జీజీహెచ్‌లోకి టీడీపీ నాయకులు గుంపులుగా రావడం, భౌతిక దూరం పాటించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. -
అపరాధి అంతరంగం
సుప్రసిద్ధ జాతీయ రాజకీయ నాయకులు, ప్రధాని మోదీ కంటే సీనియర్, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు రెండు రోజుల క్రితం నాటి సుప్రభాత వేళ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి రాసిన ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. నాలుగు దశాబ్దాల పైచిలుకు అనుభవం కారణంగా లేఖ విడుదలలో ఆయన చక్కని టైమింగ్‌ను కనబరిచారు. ఎందుకంటే లేఖ విడుదలైన మూడు గంటల్లో జరిగిన కేబినెట్ సమావేశంలో ఫైబర్‌నెట్, చంద్రన్న కానుకల్లో జరిగిన కుంభకోణాలపై చర్చ జరిగి సీబీఐ విచారణకు ఆదేశించారు. ఆ మరుసటి రోజు ఈఎస్ఐ నిధుల దుర్వినియోగం కుంభకోణం లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని పక్కా ఆధారాలతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. చంద్రబాబు ఐదేళ్ల పదవీకాలంలో ‘న భూతో న భవిష్యతి’ అన్న చందంగా జరిగిన అవినీతి పురాణాలపై చట్టపరమైన కదలికలు ప్రారంభమయ్యాయి. అధికార యంత్రాంగం లోనూ, రాజకీయ శ్రేణుల్లోనూ, రాజ్యాంగబద్ధ వ్యవస్థల్లోనూ చంద్రబాబు కొన్ని స్లీపర్ సెల్స్‌ను ఏర్పాటుచేసి పెట్టుకున్నారు. చట్టపరమైన కదలికలు ప్రారంభమైన వెంటనే సంబంధిత స్లీపర్‌సెల్స్ యాక్టివేట్ అయ్యాయి. ఆయనకు ఉప్పందింది. లేఖ సిద్ధమైంది. విడుదల చేయడానికి ముందు రాత్రి బహుశా ఆయన నిద్రకు దూరమై ఉంటారు. ‘ఇంకా తెలవారదేమీ, ఈ చీకటి విడిపోదేమీ’ అని ఎదురుచూసి ఉంటారు. ఎందుకంటే సదరు లేఖ అలాంటిలాంటి లేఖ కాదు. చట్టపరమైన చర్యలకు రాజకీయ దురుద్దేశ ముసుగు వేసే తంత్రాంగం ఆ లేఖలో పొందుపరచబడి ఉన్నది. అంతేకాదు వైఎస్ జగన్ ప్రభుత్వం ఏడాది పాలనపై అది ఒక శాపనార్థ పత్రం. ఒక యుద్ధప్రకటన. ఆ లేఖలో వున్న సారాంశం ఏమిటంటే, ‘కరువు కాటకాల విలయనాట్యంతో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎక్కడా సాయం దొరక్క రైతులంతా వరసగా నిలబడి ఉరితాళ్లను బిగించుకుంటున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కారణంగా జనం పిట్టల్లా రాలి పోతున్నారు. రాజకీయ కక్షతో ప్రజావేదికను కూల్చివేసిన ఫలి తంగా ఐదుకోట్లమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. కనీసం మద్యం కూడా దొరకని దుర్భర పరిస్థితులతో జనం మరణయా తన అనుభవిస్తున్నారు. హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, మానభంగాలతో రాష్ట్రంలో పరిస్థితి అల్లకల్లోలంగా వున్నది. ప్రశ్నించిన వారి మీద తప్పుడు కేసులు పెడుతున్నారు, వేధిస్తున్నారు. కనుక ప్రజలందరూ ఏకమై ఈ పరిపాలన మీద తిరుగుబాటు చేయాలి. నాయకత్వం వహించడానికి తెలుగు దేశం పార్టీ సిద్ధంగా ఉన్నది.’’ ఇలా సాగిన అభియోగ పత్రం వెనుక చంద్రబాబు ఆలోచన ఏమైవుంటుంది. ఈ యుద్ధ ప్రక టన వెనుక వ్యూహం ఏమిటి? పార్టీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో ఈ నాలుగేళ్లు పోరాడి వచ్చే ఎన్నికల్లో గెలుపు తీరాలకు చేరుకుంటాయన్న నమ్మకమా? ముమ్మాటికీ కాదు. అనుభవం కారణంగా అంతటి రాజకీయ అపరిపక్వత ఆయనకు లేదు. మొన్నటి ఎన్నికల్లో గెలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకీ, తెలుగుదేశం పార్టీకి మధ్యన 10 శాతం ఓట్ల వ్యత్యాసం ఉంది. కొత్త ప్రభుత్వం ఏడాది పరిపాలన తర్వాత ఈ అంతరం బాగా పెరిగినట్టు క్షేత్రస్థాయి సమాచారం సూచిస్తున్నది. గతంలో తెలుగుదేశం పార్టీకి ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న బీసీ వర్గాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెనుక సమీకృతమౌతున్న పరిణామం ఈ ఏడాది కాలంలో స్పష్టంగా కనిపించింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేయించి టీడీపీ మరింత అభాసుపాలైంది. ఇంగ్లిష్ మీడియం విద్యాబోధనను వ్యతిరేకించి పేదవర్గాలన్నిటికీ దూరమైంది. వైఎస్ జగన్ ప్రభుత్వం మహిళలు, పేదవర్గాల ప్రజలను సాధి కార శక్తులుగా మలిచేందుకు తీసుకున్న చర్యలు, చేపట్టిన జన రంజక సంక్షేమ కార్యక్రమాలు, గ్రామస్థాయికి తీసుకొని వచ్చిన పరిపాలనా సంస్కరణల కారణంగా సమాజంలో విప్లవాత్మక మైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్పులు రాజ కీయ కూర్పులో కూడా ప్రతిఫలించే అవకాశం ఉంది. ఒక అంచనా ప్రకారం వచ్చే ఎన్నికల నాటికి, ఒకవేళ ఏవైనా ప్రతి కూల పరిస్థితులు ఎదుర్కొనవలసి వచ్చినా కూడా అధికార పార్టీ బలం 55 శాతానికి ఒక్క ఓటు కూడా తగ్గదు. మూడో ప్రత్యా మ్నాయం ఏదైనా ఏర్పడి తన ఓటు బ్యాంకుకు మరింత గండి కొట్టకపోతే, అధికార పార్టీకి తానే గట్టిపోటీదారునని నాలుగేళ్ల తర్వాత కూడా ఓటర్లకు నమ్మకం కలిగించగలిగితే, అధికార పార్టీని వ్యతిరేకించే శక్తులన్నింటినీ తన వెనుక సమీకరించు కోగలిగితే తెలుగుదేశం పార్టీ బలం గరిష్టంగా 30 శాతం దాకా వెళ్లొచ్చు. ఇప్పుడు రాష్ట్రంలో ఏర్పడి వున్న ఇంతటి భారీ వ్యత్యా సాన్ని అంచనా వేయడానికి జ్యోతిష్యం తెలిసినవాడో, రాజకీయ పండితుడో, సెఫాలజిస్టో కానవసరం లేదు. అనుభవం ఉంటే చాలు. ఆ అనుభవం చంద్రబాబుకు దండిగా వున్నది. అందు వల్ల నాలుగేళ్లు కార్యకర్తలను ఉత్సాహపరిచి పోరాటాలు చేయడం ద్వారా మళ్లీ అధికారంలోకి రాగలమన్న వెర్రి భ్రాంతి ఆయనకు వుండే అవకాశం లేదు. చంద్రబాబు ముందు ఇప్పుడు రెండు లక్ష్యాలున్నాయి. ఆ లక్ష్యాలకు అనుగుణంగానే ఆయన పావులు కదుపుతున్నారు. అందులో మొదటిది తన ప్రభుత్వ పదవీకాలంలో వచ్చిన అవినీతి ఆరోపణలపై చట్టపరమైన చర్యలు ప్రారంభమైతే, వాటిపై రాజకీయ దురుద్దేశం, కక్షసాధింపు అనే ముసుగులు వేయాలి. తద్వారా వీలయినంత సానుభూతిని సంపాదించు కోవాలి. సాధ్యమైనంత వరకు అటువంటి చట్టపరమైన చర్యలు ముందుకు కదలకుండా అడ్డుకోవాలి. ఈ రకమైన వ్యూహానికి మీడియా వాద్య సహకారం ఉండనే ఉంటుంది. చంద్రబాబు వ్యతిరేకులు ఆయనకొక మునిశాపం ఉందని చెబుతారు. అదేమిటంటే ఎప్పుడైనా ఆయన నిజం మాట్లాడితే ఆయన తల వేయి ముక్కలవుతుందట. అదేవిధంగా బాబు అభిమానులు, మద్దతుదారులు తమ నాయకునికి ఒక వరం ఉందని చెప్పు కుంటారు. ఆయన ఎప్పుడైనా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన వలసి వచ్చినప్పుడు రాజ్యాంగబద్ధ సంస్థల నుంచి ఏదో ఒక సహకారం అందుతుందట. జరుగుతున్న పరిణామాలన్నిటినీ గమనిస్తున్నప్పుడు ఆ శాపాన్ని నమ్మినట్టే, ఈ వరాన్ని కూడా నమ్మాలనిపిస్తున్నది. అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకరరెడ్డిల అరెస్ట్ సందర్భంగా తెలుగుదేశం పార్టీ, అనుబంధ మీడియా వ్యవహారమంతా మొదటి లక్ష్యంలో భాగంగా స్క్రిప్టు ప్రకారమే నడుస్తున్నదని స్పష్టమవుతున్నది. అచ్చెన్నాయుడు అరెస్ట్ వ్యవహారాన్ని తీసుకుందాము. ఆయన కార్మికశాఖ మంత్రిగా ఉన్న కాలంలో మందుల కొనుగోళ్ల పేరుతో 151 కోట్ల రూపాయలు దుర్వినియోగ మయ్యాయని విచారణ జరిపిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ శాఖ నిర్ధారించింది. దాదాపు ఇదేరకమైన స్కామ్ జరిగిన తెలంగాణలో ఇప్పటికే ఆ శాఖ అధికారులు జైలు ఊచలు లెక్కిస్తున్నారు. ఏపీలో ఈ స్కామ్‌కు సాక్షాత్తు మంత్రివర్యుడే లిఖితపూర్వక ఆదేశాల సాక్షిగా తెరతీయడం విషాదం. రాష్ట్రంలోని 14 లక్షలమంది చిరుద్యోగుల కష్టార్జితం ఈఎస్ఐ నిధులు. ఇరవైవేల రూపాయలలోపు నెలజీతం పొందే ప్రైవేట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాల్లోంచి వారి ఆరోగ్య అవసరాల నిమిత్తం కొంత మినహాయించి ఈఎస్ఐకి నిధులు సమకూర్చు తున్నారు. అటువంటి పేద కుటుంబాల సొమ్ముకు కూడా కక్కుర్తిపడతారా? ఇది పేదల రక్తాన్ని పీల్చుకోవడం కాదా? పూర్వం ధన్‌బాద్ బొగ్గు గనుల ప్రాంతంలో మాఫియా ముఠాల సమాంతరపాలన నడిచేది. కార్మికులు నెల జీతం తీసుకొని మాఫియా చెక్‌పోస్టుల దగ్గర రౌడీమామూళ్లు సమర్పించిన తర్వాతనే ఇంటికి వెళ్లనిచ్చేవారు. ఆ దందాకూ దీనికీ తేడా ఏముంది? పక్కా సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేస్తే అభినం దించాలా? ఆందోళన చేయాలా? బీసీ నేతను అరెస్ట్ చేస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. బీసీ న్యాయవాదులు జడ్జీలుగా పనికిరారంటూ కొలీజియంకు ఉత్తరం రాసిన పెద్దమనిషి ఈయన. మరి ఈఎస్ఐకి నిధులు సమకూర్చుతున్న చిరుద్యోగుల్లో అత్యధికులు బీసీలు కాదా? అన్న ప్రశ్నకు వీరి దగ్గర సమాధానం ఉండదు. అచ్చెన్న పాత్రధారి మాత్రమేనని మూలవిరాట్టు వేరే ఉన్నారనే ప్రచారం ఒకటుంది. విచారణ అచ్చెన్న పరిధిని దాటి ఎక్కడ ముందుకు వెళ్తుందోనన్న తత్తరపాటు ప్రతిపక్షనేతలో కనిపించింది. వార్త తెలియగానే కిడ్నాప్ చేశారని ఆరోపించారు. కుదరకపోవడంతో బీసీని అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. సాయంత్రానికల్లా అచ్చెన్న చేయించుకున్న పైల్స్ ఆపరేషన్‌ను ప్రచారంలో పెట్టారు. రిమాండ్ ఖైదీని కలవడానికి అనుమతించరని తెలి సినా హైదరాబాద్ నుంచి హుటాహుటిన గుంటూరు వచ్చి ఆస్పత్రి ముందు చాలాసేపు తచ్చాడారు. ఇక జేసీ బ్రదర్స్ ఘనకార్యం జగమెరిగిన సత్యం. వారి అరెస్ట్‌ను రాజకీయ కక్షసాధింపు అనే కోటాలో చేర్చారు. ఆ విధంగానే ప్రసార సాధనాల్లో ప్రచారంలో పెట్టారు. ఈ ప్రయాస మొదటి లక్ష్యం ముందుగానే చెప్పుకున్నట్టు తమ అవినీతి గతంపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా నిరోధించడమైతే–రెండో లక్ష్యం రాజకీయం. వచ్చే ఎన్నికల్లో అధికారం కల్ల. కానీ, కనీసం ఇప్పుడు తనకు లభించిన ప్రతిపక్షనేత పాత్రనైనా తన వారసునికి కట్టబెట్టాలంటే ఇరవై సీట్లయినా గెలవాలి. గెలవాలి అంటే మరో ప్రత్యామ్నాయ పార్టీ కానీ కూటమి కానీ తన పార్టీని మించి బలపడకూడదు. కూడదు అంటే ఇప్పటికే జారిపోతున్న శ్రేణులు మరింత జారిపోకూడదు. అందుకోసం ఓ సమర శంఖాన్ని పూరించాలి. ఆ పూరణే ఈ బహిరంగ లేఖ. ఆ లేఖను విడుదల చేయవలసిన సూర్యోదయం కోసం ఆ రాత్రంతా ఆయన చట్టపరమైన చర్యల టెన్షన్‌తో జాగరణం చేసి వుంటారు. ఈ పటాటోపమంతా గెలుపు కోసం కాదు, ప్రతిపక్ష పాత్రతో పరువు దక్కించుకోవడం కోసమే. ఎన్నికలకు నాలుగేళ్ల ముందే చంద్రబాబు రణభేరి లేఖను తయారు చేసుకున్న నిద్రలేని రాత్రిని చూస్తుంటే పురాణాల్లో రావణాసురుడు తన జీవితంలోని చివరి రాత్రి పడిన అంతర్మథనం సూర్యోదయం కోసం ఎదురుచూసిన వైనం గుర్తుకొస్తున్నది. శ్రీరామునితో యుద్ధం వద్దని సన్నిహితులు చాలామంది రావణాసురునికి హితువు చెబుతారు. సీతాదేవిని శ్రీరామునికి అప్పగించమని వేడుకుంటారు. శంకర ప్రసాదిత వరసంపన్నుడైన రావణుడు వినిపించుకోడు. వారధి దాటిన యుద్ధం వాకిట్లోకి వస్తుంది. రాజగురువు వంటి తాత మాల్యవం తుడు వారిస్తాడు. తమ్ముడు విభీషణుడు ప్రాధేయపడతాడు. సహధర్మచారిణి మండోదరి కంటతడిపెడుతుంది. రావణుని అహం కారం ఆవగింజంత కూడా కరగదు. యుద్ధంలో రామ బాణాల ధాటికి రాక్షససేన హాహాకారాలు చేస్తుంది. అరివీర భయంకరుడైన సోదరుడు కుంభకర్ణుడు హతుడవుతాడు. దేవత లనే ఓడించిన కుమారుడు మేఘనాథుడు కూడా కూలిపోతాడు. ఊహించని రావణుడు హతాశుడవుతాడు. తానే యుద్ధానికి బయలు దేరుతాడు, రావణుని చివరి రెండు రోజుల యుద్ధాన్ని, అంతర్మథ నాన్ని బాపు తీసిన ‘సంపూర్ణ రామాయణం’ సినిమా లో ఎస్వీ రంగారావు అద్భుతంగా అభినయించి చూపెట్టారు. రాముని శరపరంపర ధాటికి రావణుని రథసారథి విగతు డవుతాడు. విల్లు విరిగిపోతుంది. విరథిగా రావణుడు నిలబడి పోతాడు. నిరాయుధుడిని చంపడం ధర్మం కాదు ‘నేడు పొమ్ము, రేపు రమ్ము’ అని శ్రీరాముడు వదిలేస్తాడు. అవమానభారంతో ఒంటరిగా, రాజమందిరంలో రావణాసురుడు దహించుకుపో తుంటాడు. ‘ప్రతీకారంతో నా ఎద ప్రజ్వరిల్లుతున్నద’ని ఆర్తనా దాలు చేస్తాడు. అప్పుడు రావణుని అంతరాత్మ నిద్రలేచి హిత బోధ చేస్తుంది. ‘ఇప్పటికైనా మించిపోయింది లేదు, సీతాదేవిని సగౌరవంగా రామునికి అప్పగించు. లొంగిపో, ప్రాణాలు దక్కు తాయన’ని చెబుతుంది. రావణుడు ఆలోచిస్తాడు. యుద్ధం చేసి నా ఓటమి అనివార్యం. అర్థమవుతూనే ఉన్నది. కానీ, సంధి చేసుకుంటే పోయిన వాళ్లెవరూ తిరిగి రారు. పరువు మాత్రం పోతుంది. యుద్ధం చేసి ఓడిపోయినా కనీసం పరువైనా మిగులు తుంది. ఇక వెంటనే యుద్ధానికి బయల్దేరడానికి ఉద్యుక్తుడవు తాడు. ఇంకా తెల్లారలేదు. ‘ఆహా... ఇంకా ప్రభాతమవదేమీ’ అంటూ అసహనంతో తిరుగుతుంటాడు. ‘‘ఓరీ భాస్కరా! ఉద యించూ... ఉదయించూ...’’ అని పలవరిస్తాడు. ఆ సమరనాద మంతా విజయం కోసం కాదు. పరువుకోసం మాత్రమే! వర్ధెల్లి మురళి muralivardelli@yahoo.co.in -
మనీలాండరింగ్ డబ్బు ఎవరెవరి ఖాతాల్లో వేశారు?
-
అచ్చెన్న బీసీ అయితే నేరం వదిలేయాలా: స్పీకర్
సాక్షి, విజయవాడ : ఈఎస్ఐ కుంభకోణంలో ముందుల కొనుగోలులో అవకతవకలు జరిగాయని ఏసీబీ నిర్ధారించిందని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆధారాలు ఉన్నందునే అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారని ఆయన పేర్కొన్నారు. విజయవాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అచ్చెన్నాయుడు అరెస్టుపై శాసనసభాపతిగా తనకు సమాచారం అందించారని తెలిపారు. ఈఎస్ఐ స్కామ్‌లో లోతుగా దర్యాప్తు జరగాలని, ఈ వ్యవహారంలో ఉన్న వారందరి బండారం బయటపెట్టాలని స్పీకర్ కోరారు. (జేసీ దివాకర్‌రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి) ఈఎస్ఐ కుంభకోణంలో వందల కోట్లు పక్క దారి మళ్లించారని తమ్మినేని విమర్శించారు. అక్రమ సంపాదనను మనీలాండరింగ్ ద్వారా మళ్లించారని, అచ్చెన్నాయుడు బీసీ అయితే ఆయన చేసిన నేరాన్ని వదిలేయాలా అని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు తప్పు చేస్తే చంద్రబాబు బీసీలందరికీ ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. నేరాలకు, బీసీలకు లింకు పెడుతూ రాజకీయాలు చేస్తున్నారని, నేరాలకు, బీసీలకు సంబంధమేంటి అని చంద్రబాబును స్పీకర్ నిలదీశారు. (రమ్యకృష్ణ కారు డ్రైవర్ అరెస్ట్) -
ఈఎస్ఐ కుంభకోణంలో చట్టం తన పని తాను చేస్తుంది
-
స్కాం చేయలేదని చట్టప్రకారం నిరూపించుకోవాలి
-
అచ్చెన్న లేఖ ఆధారంగానే కాంట్రాక్టులు
సాక్షి, అమరావతి : మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి లేఖ ఆధారంగానే టెలీహెల్త్‌కు కాంట్రాక్టులు ఇచ్చారని ఏసీబీ జేడీ రవికుమార్ తెలిపారు. ఈఎస్ఐ స్కామ్‌లో దర్యాప్తు కొనసాగుతోందని, ఈ కేసులో ఇంకా చాలా మందిని విచారించాల్సి ఉందని వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈఎస్ఐ స్కామ్‌లో అచ్చెన్నాయుడుతో పాటు ఏడుగురిని అరెస్ట్ చేశామన్నారు. రూ.150 కోట్లు అవినీతి జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయ్యిందన్నారు. అచ్చెన్నాయుడు, రమేష్‌కుమార్‌ను న్యాయమూర్తి ముందు హాజరుపరిచామని, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారని తెలిపారు. అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆస్పత్రికి తరలించామని వెల్లడించారు. మిగతా ఐదుగురిని నేడు జడ్జి ముందు హాజరుపరుస్తామన్నారు. ( అచ్చెన్న.. ఖైదీ నెంబర్ 1573 ) నిలకడగా అచ్చెన్నాయుడి ఆరోగ్యం గుంటూరు : అచ్చెన్నాయుడి ఆరోగ్యం నిలకడగానే ఉందని జీజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ తెలిపారు. అచ్చెన్నాయుడి ఆపరేషన్ గాయానికి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. సుదీర్ఘ ప్రయాణం చేయడంతో గాయం పచ్చిగా మారిందని, గాయం తగ్గడానికి రెండు మూడు రోజులు పట్టొచ్చని అన్నారు. బీపీకి ఇదివరకు వాడుతున్న మందులే కొనసాగిస్తున్నామని, షుగర్ నార్మల్‌గానే ఉందని వెల్లడించారు. -
రూ 150 కోట్ల మేర అవినీతి జరిగింది
-
ఈఎస్ఐ కుంభకోణం
-
అవినీతి రోగానికి ఏసీబీ మందు
-
కౌంట్‌డౌన్ స్టార్ట్.. అచ్చెన్న ఆటకట్టు
మేతగాళ్లకు మేతగాడు.. మందుల పేరుతో కోట్లు మింగిన మాయలోడు.. ఏసీబీ అధికారులకు చిక్కాడు.. గత ప్రభుత్వంలో కారి్మక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడి పాత్రపై అవినీతి నిరోధక శాఖ సమస్త సమాచారం సేకరించింది. అధికారులు అన్ని ఆధారాలతో నిమ్మాడలోని ఆయన ఇంటికి వెళ్లి శుక్రవారం ఉదయం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడి దందాలను, గతంలో చేసిన అక్రమాలను జిల్లా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందేనంటున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కాలం ఎవర్నీ వదిలిపెట్టదు. ఎంతటి వారైనా తప్పు చేస్తే డైరీలో నమోదు చేసుకుంటుంది. టైం వచ్చినప్పుడు లెక్క తేలుస్తుంది. అక్రమార్కుల భరతం పడుతుంది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడి విషయంలో అదే జరిగింది. తప్పులు చేసేసి... పెద్ద నోరు ఉందని గట్టిగా కేకలేసేసి... తానేదో నిజాయితీపరుడన్నట్టు డ్రామాలాడితే ప్రజలు ఎన్నాళ్లు నమ్ముతారు? చేసిన తప్పులు ఆధారాలతో సహా బయటపడ్డాయి. ఎట్టకేలకు అచ్చెన్నాయుడి పాపం పండింది. (ఈఎస్ఐ కుంభకోణానికి ఆయనే ‘డైరెక్టర్’?) ఏసీబీ అధికారులు ఉదయం సరిగ్గా 6.50 గంటలకు ఆయన స్వగ్రామమైన కోటబొమ్మాళి మండలం నిమ్మాడలోని ఇంటికి వెళ్లి అరెస్టు సమాచారాన్ని తెలియజేశారు. 7.20 గంటల సమయంలో అచ్చెన్నాయుడిని అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలోని అవినీతి నిరోధక విభాగం కార్యాలయం సీఐయూ యూనిట్ డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ ఆయనను అరెస్టు చేశారు. అరెస్టు సమాచారాన్ని ఆయన భార్య, సోదరుడి కుమారుడు కుమారుడు కింజరాపు సురేష్‌కుమార్, లాయర్లకు తెలియజేశారు. అరెస్ట్ ఇంటిమేషన్ అందినట్టు సురేష్‌కుమార్ సంతకం తీసుకున్నారు. అచ్చెన్నాయుడిని విజయవాడ తరలించారు. (అచ్చెన్నాయుడుకి 14 రోజుల రిమాండ్) అచ్చెన్నపై నమోదు చేసిన కేసులివే.. అవినీతి నిరోధక శాఖలో పలు సెక్షన్ల కింద అచ్చెన్నాయుడిపై కేసులు నమోదు చేశారు. క్రైమ్ నెంబర్ 04/ఆర్సీఓ– సీఐయూ– ఏసీబీ/2020 యు/ఎస్ 13(1), (సీ), (డీ), ఆర్/డబ్ల్యూ 13(2) ఏసీబీ పీసీ సవరణల చట్టం–2018, ఏసీబీలోని ఐపీసీ సెక్షన్ల ప్రకారం సెక్షన్ 408, సెక్షన్ 420, 120–బీ కింద అచ్చెన్నాయుడిపై అధికారులు కేసు నమోదు చేశారు. పక్కా సమాచారంతో.. విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఏసీబీ అధికారులు చేసిన విచారణలో అచ్చెన్నాయుడి పాత్ర వెలుగు చూడటంతో పక్కా ఆధారాలతో అచ్చెన్నాయుడ్ని అరెస్టు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. స్వగ్రామమైన నిమ్మాడలో నివాసమున్నట్టు తెలుసుకున్న ఏసీబీ అధికారులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించి అచ్చెన్నాయుడిని అదుపులోకి తీసుకున్నారు. ముందస్తుగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 6.50 గంటలకు అచ్చెన్నాయుడి నివాసంలోని మూడో అంతస్తుకు ఏసీబీ అధికారులు వెళ్లారు. ఈఎస్ఐ మందుల కుంభకోణంలో మీ ప్రమేయం ఉందని, దాని కారణంగా అరెస్టు చేస్తున్నట్టుగా తెలిపారు. ‘అప్పుడే విచారణ పూర్తయిపోయిందా?’ అని ఏసీబీ అధికారులను అచ్చెన్నాయుడు ప్రశ్నించినట్టు తెలిసింది. విచారణ పూర్తయిందని, అక్రమాల్లో మీ పాత్ర ఉందని తేలడంతో అరెస్టు చేస్తున్నట్టు ఏసీబీ అధికారులు తెలియజేయడంతో ఎటువంటి ప్రతిఘటనకు పాల్పడకుండా 7.20 గంటల సమయంలో అరెస్టయ్యారు. టీడీపీ కార్యకర్తలు అక్కడికి పెద్ద ఎత్తున వచ్చి గలాట చేస్తారేమోనని పోలీసులు భావించినప్పటికీ ఆశించినంతంగా అక్కడికి రాలేదు. అచ్చెన్నాయుడికి సన్నిహితంగా ఉన్న నాయకులు మాత్రమే చేరుకున్నారు. ఈఎస్ఐ అక్రమాలివే.. రూ.975.79 కోట్ల విలువైన మందులతోపాటు వైద్య పరికరాల కొనుగోలులో సుమారు రూ.150 కోట్లపైన అవినీతి అక్రమాలు జరిగినట్టు ఏసీబీ తేలి్చంది. ఆస్పత్రులకు అవసరమైన మందులు, ఔషధాలు, వైద్య ఉపకరణాలు, ఆపరేషన్లకు అవసరమైన పరికరాలు, ల్యాబ్ కిట్స్, ఫరి్నచర్ రూ.975.79 కోట్ల మేర పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. ఈ ప్రక్రియలో యథేచ్ఛగా నియమాలు, మార్గదర్శకాలను ఉల్లంఘించారు. నిబంధనల ప్రకారం ఉండాల్సిన డ్రగ్ ప్రొక్యూర్మెంట్ కమిటీని కూడా ఏర్పాటు చేయలేదు. కొనుగోళ్ల ప్రక్రియలో ఎక్కడా ఓపెన్ టెండర్లు కూడా పిలవలేదు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడింది. ►సంస్థలకు రూ.293.51 కోట్ల విలువైన మందులకు కొనుగోలు కేటాయింపులు చేయగా పరిమితికి మించి రేట్ కాంట్రాక్ట్ లేని సంస్థల నుంచి ఏకంగా రూ.698.36 కోట్ల విలువైన ఔషధాలు కొనుగోలు చేశారు. ►టెండర్లు లేకుండా నామినేషన్ కింద ఆర్డర్లు ఇవ్వడంతో కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగమైంది. లేబోరేటరీ పరికరాలను ఎలాంటి టెండర్లు లేకుండా లెజెండ్ అనే సంస్థకు ఇచ్చారు. ►శస్త్ర చికిత్స పరికరాలకు టెండర్లు లేకుండా రూ.6.62 కోట్ల మేర చెల్లించారు. వాస్తవ ధర కంటే ఇది 70 శాతం అధికం. ►ఫ్యాబ్రికేటెడ్ కొటేషన్స్ సృష్టించి రేటు కాంట్రాక్టులో లేని సంస్థలకు ఆర్డర్లు ఇచ్చారు. ఇందులో ఇ.రమేష్‌బాబు, కె.ధనలక్ష్మి తదితరులు ఉన్నారు. ►రాశి ఫార్మా, వీరేష్ ఫార్మా సంస్థలకు కొనుగోలు ఆర్డర్ల కంటే అదనంగా రూ.15.93 కోట్లు చెల్లించారు. ఇందులో రూ.5.70 కోట్ల మేర అదనంగా చెల్లించినట్టు తేలింది. ►కోట్లు వెచ్చించి కొన్న వందల పరికరాలను వినియోగించకుండా మూలన పడేశారు. ►జెర్సన్ ఎంటర్ ప్రైజెస్ అనే బినామీ సంస్థకు ఈఎస్ఐ డైరెక్టర్ డాక్టర్ సీకే రమేష్‌కుమార్ రూ.9.50 కోట్లు చెల్లించారు. ►రూ.16,992 విలువైన బయోమెట్రిక్ యంత్రాలను రూ.70,760 చొప్పున కొనుగోలు చేశారు. అడుగడుగునా అవకతవకలే.. గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అండతో అచ్చెన్నాయుడు చెలరేగిపోయారు. అడ్డొచ్చిన అధికారులను బెదిరించడం, అవసరమైతే బదిలీ చేయడం, యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడటం టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం సాగిపోయింది. ఈఎస్ఐ కుంభకోణానికి పాల్పడి కోట్లాది రూపాయల కార్మికుల సొమ్మును కాజేశారు. వైద్య పరికరాలు, మందుల కొనుగోళ్లు పనులు టెండర్లు పిలవకుండా నామినేషన్‌పై అప్పగించాలని అచ్చెన్నాయుడు సిఫారుసు లేఖ ఇచ్చినట్టు పేర్కొన్న విజిలెన్స్ విచారణ నివేదిక మేరకు ఏసీబీ అధికారులు విచారణ చేపట్టగా అక్రమాలు బయటపడ్డాయి. ఇదే కాదు టీడీపీ హయాంలో నీరు చెట్టు, చంద్రన్న బీమా, సాగునీటి ప్రాజెక్టుల అంచనాల రూపకల్పన, వివిధ అభివృద్ధి పనుల్లో నిధులు పక్కదారి పట్టించారు. గ్రానైట్, ఇసుక కుంభకోణాలు, బీసీ కార్పొరేషన్ రుణాల్లో అక్రమాలు, సింగిల్ టెండర్ విధానంతో సొంత అన్నకు టెండర్లు కట్టబెట్టడం, ధాన్యం రవాణాకు వచ్చిన కోట్లాది రూపాయలు సొంత ఖాతాలకు మళ్లించుకోవడం, మినుముల కుంభకోణంతో కోట్ల రూపాయలు సొంత ఖాతాలకు మళ్లించుకోవడం, టెక్కలిలో సింగిల్ టెండర్ విధానంతో తన బినామీ లాడి శ్రీనివాసరావుకు ఆర్టీసీ టెండర్లు కట్టబెట్టడం, కేశినేని, దివాకర్ ట్రావెల్స్‌కు అడ్డగోలుగా రవాణా లైసెన్సులు జారీ చేయడం వంటి ఆరోపణలను మూటగట్టుకున్నారు. ఇన్ని అక్రమాలకు పాల్పడిన అచ్చెన్నాయుడు నీతివంతుడిలా మాట్లాడుతుంటారు. బీసీ కార్డు బయటకు తీసిన తెలుగు తమ్ముళ్లు.. పట్టించుకోని బీసీలు.. నిజాయితీపరులమని,న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పాల్సిందిపోయి.. ఇది బీసీ నేత ను అణగదొక్కే ప్రయత్నమని టీడీపీ నేతలు దు్రష్పచారానికి ఒడిగట్టారు. బీసీలను రెచ్చగొట్టే ప్ర యత్నం చేస్తున్నారు. కానీ బీసీలెవరూ ఈ పరిణామాలను పట్టించుకోలేదు. అధికారంలో ఉన్నప్పు డు ఒకరిద్దరు వ్యక్తిగత లబ్ధి పొందారే తప్ప తమ ను పట్టించుకోలేదని, మరింత తొక్కేశారని బీసీలంతా భావిస్తున్నారు. 2014 మేనిఫెస్టోలో చంద్రబాబునాయుడు బీసీలకు 110కి పైగా హామీలు ఇచ్చి.. వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. బీసీల్లో రజకులను, నాయీ బ్రాహ్మణులను, బోయీలను, మత్స్యకారులను ఇతర కులాలను ఎస్టీ, ఎస్సీల్లో చేర్చుతామని, గాండ్ల, సగర, పూసల, కురభ, బోయ, పద్మశాలీ తదితర కులాలను బీసీ డి నుంచి బీసీ ఎ కు మార్చుతామని దొంగ హామీ లు ఇచ్చి ఆ తర్వాత మోసం చేశారు. హామీలు అమలు చేయమని అడిగిన మత్స్యకారులు, నాయీ బ్రాహ్మణులతోపాటు ఇతర కుల సంఘాల నాయకులపై తోక కత్తిరిస్తానని, తాట తీస్తానని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఎన్నికల ప్రచారంలో బీసీ డిక్లరేషన్ ప్రకటించి రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అమలు పరుస్తానని ప్రకటించారు. 2014లో అధికారంలోకి వచ్చాక హామీ ప్రకారం రూ. 40 వేల కోట్ల సబ్‌ప్లాన్ నిధులు ఇవ్వాల్సి ఉండగా కేవలం ఏడు వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక బీసీలకు ఎటువంటి ప్రయోజనాలు కలి్పస్తున్నదీ అందరికీ తెలిసిందే. బీసీలకు పదవుల్లోనూ, నామినేటెడ్ పోస్టుల్లోనూ ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తు చేసుకుని.. టీడీపీ నేతల కపట నాటకాలపై బీసీలు చర్చించుకుంటున్నారు. -
అచ్చెన్న.. ఖైదీ నెంబర్ 1573
సాక్షి, విజయవాడ : ఈఎస్ఐ స్కామ్‌లో అరెస్ట్ అయిన కింజరాపు అచ్చెన్నాయుడుకి జైలు అధికారులు ఖైదీ నెంబర్ 1573 కేటాయించారు. ప్రస్తుతం విజయవాడ జైలులో ఉన్న ఆయన్ని న్యాయమూర్తి ఆదేశాల మేరకు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. గుంటూరు ఆస్పత్రిలో వైద్య చికిత్స చేయించనున్నారు. అలాగే ఇదే కేసులో అచ్చెన్నాయుతో పాటు సీబీఐ అనుమానిస్తున్న మరో నలుగురు మద్దాయిలను కూడా నేడు (శనివారం) విచారించనున్నారు. అనంతరం వీరందరినీ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాగా టెక్కలి టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం ఉదయం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు జమానాలో ఈఎస్ఐలో జరిగిన రూ.151 కోట్లకు పైగా కుంభకోణంలో అచ్చెన్నాయుడు ప్రధాన పాత్రధారిగా ఏసీబీ దర్యాప్తులో నిర్ధారణ కావడంతో అదుపులోకి తీసుకున్నారు. ఈ కుంభకోణంలో 19 మంది ప్రమేయం ఉన్నట్టు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. (రూ.150 కోట్లకు పైగా ప్రజాధనం లూటీ) -
మందుల కుంభకోణం
-
కార్మికుల పొట్టకొట్టిన అచ్చెన్నాయుడు
సాక్షి, హిందూపురం: రాష్ట్ర వ్యాప్తంగా ఈఎస్ఐ ఆస్పత్రులకు వైద్యపరికరాల కొనుగోళ్ల పేరుతో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కార్మికుల పొట్టకొట్టాడని ఎమ్మెల్సీ షేక్‌మహమ్మద్ ఇక్బాల్ విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈఎస్ఐ పరికరాల కొనుగోలు స్కాంలో అచ్చెన్నాయుడు దోషి అని, ఆధారాలతో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారన్నారు. అరెస్టయిన ఆరుగురు నిందితుల్లో అచ్చెన్నాయుడు ఒకడు కావడం యాధృచ్ఛికమేనన్నారు. ఇందులో ప్రభుత్వ కుట్ర ఉందని టీడీపీ శ్రేణులు ఆరోపించడం సిగ్గుచేటన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బోగస్ కంపెనీలకు కాంట్రాక్టులను అప్పగించి ఎక్కువ ధరలతో మెడికల్ కిట్లను కొనుగోలు చేసి దాదాపు రూ.300 కోట్ల స్కాం చేశారని ఆధారాలతో సహా ఎన్ఫోర్స్మెంట్ నిరూపించిందన్నారు. స్కాంలలో భాగస్వాములైన టీడీపీ నేతలు, మాజీ మంత్రులు స్టేలు తెచ్చుకోవడం మాని ధైర్యముంటే విచారణకు సిద్ధం కావాలన్నారు. టీడీపీ హయామంతా ప్రజల సొమ్మును దోచుకోవడం దాచుకోవడమే చేసిందన్నారు. రంజాన్ తోఫా, సంక్రాంతి కానుక, ఫైబర్ నెట్ వ్యవహారంలో భారీ అవినీతి జరిగిందన్నారు. వీటిన్నంటిపై సీబీఐ విచారణ చేయిస్తే అవినీతి బాగోతాలు బయటకొచ్చి అవినీతిపరులు శిక్ష అనుభవిస్తారని ఎమ్మెల్సీ చెప్పారు. చదవండి: ఈఎస్ఐ కుంభకోణానికి ఆయనే ‘డైరెక్టర్’? -
అవసరానికి మించి అక్కర లేని మందులు
-
కుంభకోణంలో అచ్చెన్నాయుడు
-
ఈఎస్ఐ స్కామ్‌కు ఆయనే ‘డైరెక్టర్’?
రాజమహేంద్రవరం క్రైం : ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ డాక్టర్ గాడి విజయకుమార్‌ను ఏసీబీ అధికారులు అవినీతి ఆరోపణలపై అరెస్ట్ చేశారు. విజయవాడకు చెందిన ఏసీబీ సెంట్రల్ ఇన్విస్టిగేషన్ యూనిట్ శుక్రవారం రాజమహేంద్రవరం చేరుకొని విజయకుమార్‌ను ఆయన స్వగృహంలో అరెస్ట్ చేశారు. ప్రత్యేక వాహనంలో విజయవాడకు తరలించారు. ఈఎస్ఐ ఆసుపత్రులకు సరఫరా చేసే మందులు, పరికరాల భారీ కుంభకోణం ఈయన డైరెక్టర్‌గా ఉన్నప్పుడే జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తగా.. ఏసీబీ అధికారుల దర్యాప్తులో నిర్ధారణ కావడంతో విజయకుమార్‌ను అరెస్ట్ చేశారు. కాకినాడకు చెందిన విజయకుమార్ రాజమహేంద్రవరం ఈఎస్ఐ హాస్పిటల్లో రేడియాలజిస్ట్‌గా విధులలో చేరారు. ఇక్కడే ఎక్కువ కాలం విధులు నిర్వహించి ఈఎస్ఐ హాస్పిటల్ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం విజయవాడలో ఈఎస్ఐ హాస్పిటల్స్ ఇన్చార్జ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో మందులు, పరికరాల కొనుగోళ్లలో కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విచారణలో పలు విషయాలు వెలుగు చూడడంతో విజయకుమార్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.(అచ్చెన్నాయుడుకి 14 రోజుల రిమాండ్) రోగులను ప్రైవేటు ఆసుపత్రులకు తరలించడంతో లబ్ధి విజయకుమార్ రాజమహేంద్రవరం ఈఎస్ఐ ఆసుపత్రిలో వివిధ హోదాలలో పనిచేశారు. రాజమహేంద్రవరంలోని కంబాలచెరువు వద్ద అపోలో స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తూ ఈఎస్ఐ ఆసుపత్రికి వచ్చే రోగులను తన స్వంత స్కానింగ్ సెంటర్‌కు తరలించి లబ్ధి పొందినట్టు ఆరోపణలు వచ్చాయి. ఎక్కువ సమయం ఈఎస్ఐ ఆసుపత్రిలో ఉండకుండా స్కానింగ్ సెంటర్లో ఉండడంతో అప్పట్లో సహోద్యోగులతో విభేదాలు వచ్చాయని వినికిడి. జిల్లాలో ఒక ఈఎస్ఐ ఆసుపత్రి, ఎనిమిది ఈఎస్ఐ డిస్పెన్సరీలు ఉండగా, చికిత్స కోసం వచ్చే రోగులను 14 ప్రైవేటు క్లీనిక్‌లకు, 11 ప్రైవేటు ప్యానల్ ఆసుపత్రులకు చికిత్స నిమిత్తం తరలించి భారీ కుంభకోణానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. రోగులకు ఇచ్చే మందులు, మెడకు వేసే నెక్ కాలర్, ఎముకలు విరిగిన సమయంలో కట్లు వేసేందుకు ఉపయోగించే పరికరాల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈయన ఈఎస్ఐ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా ఉన్న సమయంలో కుంభకోణాలు వ్యతిరేకించే వారు ఒక వర్గంగాను, సమర్ధించేవారు మరో వర్గంగా విభేదాలు వచ్చినట్టు ఆసుపత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. -
అవినీతిపరుడిని అరెస్ట్ చేస్తే.. బీసీ కార్డా?
రాష్ట్ర కార్మిక శాఖ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు టీడీపీ హయాంలో మందుల కొనుగోళ్లలో దాదాపు రూ.150 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని వైఎస్సార్సీపీ నేతలు స్పష్టం చేశారు. అవినీతి ఆరోపణలపై అచ్చెన్నాయుడును అరెస్ట్ చేస్తే బీసీలపై దాడిగా టీడీపీ ప్రచారం చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్సీపీ బీసీ నేతలు, ఎమ్మెల్యేలు అన్నారు. పైగా కుల రాజకీయాలు చేయటం ఏంటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిని ప్రభుత్వం బయటపెడితే టీడీపీ నేతలకు భయం పట్టుకుందన్నారు. అవినీతి చేసిన అచ్చెన్నాయుడు అరెస్ట్‌కు, బీసీలకు ఏం సంబంధమని వారు చంద్రబాబును, టీడీపీ నేతలను ప్రశ్నించారు. పదిమంది కార్మికులకు మెరుగైన వైద్య సేవలందాల్సిన ఈఎస్ఐలో తవ్వేకొద్ది గుట్టలు గుట్టలుగా అవినీతి పుట్టలు బయట పడుతున్నాయని అన్నారు. అచ్చెన్నాయుడు తీసుకున్న నిర్ణయాలు..అడ్డదారిలో ప్రయాణం చేసిన విధివిధానాలపై ఏసీబీ పలు కోణాల్లో అవినీతిపై దర్యాప్తు చేసిందని, ఆధారాలు లభించిన తర్వాతే అచ్చెన్నాయుడును అరెస్ట్ చేయటం జరిగిందని హోంమంత్రి సుచరిత తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ బీసీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంది టీడీపీ ప్రభుత్వంలో మంత్రులు అవినీతికి పాల్పడ్డారనే దానికి అచ్చెన్నాయుడు ఉదంతమే నిదర్శనం. త్వరలో టీడీపీ హయాంలో వివిధ శాఖల్లో అవినీతి చేసిన మంత్రులు కూడా బయటపడతారు. అవినీతి చేసినందుకే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తమ ప్రభుత్వ హయాంలో వివిధ రంగాల్లో పని చేసే కార్మికుల ఆరోగ్యాలను చంద్రబాబు, అచ్చెన్నాయుడు పట్టించుకోలేదు. టెలీసర్వీస్, ఆర్íసీ, నాన్ ఆర్íసీ ద్వారా అవినీతికి పాల్పడ్డారు. మందులు సరఫరా చేసిన కంపెనీల బకాయిలున్నాయి. ప్రభుత్వం దృష్టికి ఈ విషయం వచ్చినప్పుడు ఈఎస్ఐలో భారీ అవినీతి జరిగిందని తెలిసింది. – గుమ్మనూరు జయరామ్, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి ఆయన అక్రమాలు చేస్తే నేను రాజీనామా చేయాలా? అచ్చెన్నాయుడు అక్రమాలకు పాల్పడితే నన్ను రాజీనామా చేయమనటం ఏంటో చంద్రబాబుకే తెలియాలి. విశాఖలో డాక్టర్ సుధాకర్ కేసులో కూడా దళితులపై దాడి అన్నారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు అరెస్టు చేస్తే బీసీలపై దాడి అనడమేంటి? ఇలా కుల రాజకీయం చేయడం చంద్రబాబుకే చెల్లింది. రూ.లక్ష విలువ చేసే సోఫాని రూ.10 లక్షలకి కొనుగోలు చేసిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిది. ఈఎస్ఐ స్కాంలో రానున్న రోజుల్లో మరిన్ని అరెస్టులుంటాయి. – సుచరిత, హోంమంత్రి కుంభకోణంలో కుల ప్రస్తావన ఎందుకు? టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా ప్రత్యేకించి అక్రమ మార్గంలో ప్రజాధనాన్ని కొల్లగొట్టాలని చూస్తుంది. ప్రభుత్వ సంపాదన ఎలా కొల్లగొట్టాలన్న దాంట్లో టీడీపీ నేతలకు మించిన సిద్దహస్తులు ఇంకొకరు లేనేలేరు. ఈఎస్ఐలో తవ్వేకొద్ది గుట్టలు గుట్టలుగా అవినీతి బయటపడుతోంది. నువ్వు రూ.పది తిను.. దాంట్లో నా వాట నాకివ్వు అనే భాగస్వామ్య విధానం చంద్రబాబు జమానాలో నడిచింది. దానికి బీసీకార్డును వాడాల్సిన అవసరమేముంది. – మోపిదేవి వెంకటరమణారావు, రాష్ట్ర మంత్రి ఆయన అవినీతి చేస్తే బీసీలెందుకు రోడ్డెక్కాలి? అచ్చెన్నాయుడు అవినీతికి బీసీలకు ఏం సంబంధం? అవినీతి చేసిన వారిని అరెస్ట్ చేస్తే చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారు. బీసీలను 30 ఏళ్లు మోసం చేసిన వ్యక్తి చంద్రబాబే. బాబు పాలనలోని ప్రతి అవినీతిపైనా విచారణ జరిపిస్తాం. అచ్చెన్నాయుడు అవినీతి చేస్తే బీసీలెందుకు రోడ్డు మీదకు రావాలి. గతంలో బీసీ ఎమ్మెల్యే అయిన నన్ను టార్గెట్ చేయలేదా? – అనిల్‌కుమార్‌యాదవ్, మంత్రి సిగ్గు లేకుండా విమర్శలా? ఆధారాలతో దొరికాడు కాబట్టే అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యారు. చంద్రబాబు సిగ్గు లేకుండా మాపై విమర్శలు చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ కక్ష సాధించాలనుకుంటే చంద్రబాబును, లోకేశ్‌ని లోపలేయించేవారు. త్వరలో చంద్రబాబు, లోకేశ్ అవినీతిపై సీబీఐ విచారణజరుగుతుంది. – ఆర్కే రోజా, నగరి ఎమ్మెల్యే చట్టం తన పని తాను చేసుకుపోతుంది .. బడుగు, బలహీన, అణగారిన వర్గాలకు ప్రభుత్వం మంచి చేస్తుంటే, ఓర్వలేని ఓ ఆంబోతు, ఓ అవినీతిపరుడు ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడా అవినీతిపరుడు అరెస్ట్ అయితే కులం కార్డు అంటగట్టడం సిగ్గుచేటు. అచ్చెన్నాయుడు ఏమైనా మహాత్మాగాంధీనా, లేక పూలేనా? ఈఎస్ఐ సొమ్మును కాజేసిన వ్యక్తిని ఏమనాలి? స్కాంలో ఇప్పటివరకు దొరికింది చిన్నపాములే. ఇందులో చంద్రబాబు, లోకేశ్‌ల పాత్ర ఎంత అనేది ఏసీబీ సమగ్రంగా దర్యాప్తు చేయాల్సి ఉంది. అవినీతికి పాల్పడిన వాళ్ల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. సీఎం జగన్ సంక్షేమ కార్యక్రమాల ద్వారా బీసీలకు ఓ అంబేడ్కర్, ఓ పూలేలా అవతరించారు. – శంకరనారాయణ, రాష్ట్ర మంత్రి చట్ట ప్రకారమే.. అచ్చెన్నాయుడు అరెస్ట్ చట్ట ప్రకారం జరిగింది. ఈఎస్ఐలో భారీ కుంభకోణం, రూ.కోట్ల అవినీతిపై విజిలెన్స్ ఆధారాలు సేకరించింది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఏసీబీ అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసింది. చట్టం ముందు అందరూ సమానులే. కులాలతో సంబంధం లేదు. – మహమ్మద్ ఇక్బాల్, ఎమ్మెల్సీ ఐదేళ్లు రాష్ట్రాన్ని లూటీ చేశారు.. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే బీసీలను అణగదొక్కుతున్నారనడం సిగ్గుచేటు. అయిదేళ్లలో రాష్ట్రాన్ని లూటీ చేసిన చంద్రబాబు, లోకేశ్‌లను అరెస్ట్ చేసినప్పుడే జనం హర్షిస్తారు. – బుర్రా మధుసూదన్ యాదవ్, కనిగిరి ఎమ్మెల్యే కుంభకోణం సూత్రధారి అచ్చెం ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు ప్రధాన సూత్రధారుడని ఏసీబీ విచారణలో తేలింది. పేదల వైద్యానికి చెందాల్సిన సొమ్మును తిన్న వ్యక్తిని వెనకేసుకొస్తున్న బాబు పచ్చి దుర్మార్గుడు. –కారుమూరి వెంకటనాగేశ్వరరావు, తణుకు ఎమ్మెల్యే కులాన్ని ఆపాదించడం తగదు ప్రతి దానికి చంద్రబాబు కులం రంగు పులమటం తగదు. చేసిన తప్పు నుంచి తప్పించుకొనేందుకు బీసీ ప్రస్తావన చంద్రబాబు తెస్తున్నారు. బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకున్నారు. బీసీలకు చంద్రబాబు శనిలా దాపురించారు. – కె.పార్థసారథి, ఎమ్మెల్యే -
రూ.150 కోట్లకు పైగా ప్రజాధనం లూటీ
సాక్షి, విశాఖపట్నం: ఈఎస్ఐ (కార్మిక రాజ్య బీమా సంస్థ) ఆస్పత్రులకు మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో రూ.150 కోట్లకుపైగా అక్రమాలకు పాల్పడిన కేసులో టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సహా ఆరుగురిని శుక్రవారం అరెస్టు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) జాయింట్ డైరెక్టర్ రవికుమార్ ప్రకటించారు. విశాఖపట్నంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేసు పూర్వాపరాలను వెల్లడించారు. మందుల స్కాంలో 19 మంది ప్రమేయం... ♦ డైరెక్టరేట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ సర్వీసెస్ (డీఐఎంఎస్–డిమ్స్) విభాగంలో 2014–15 నుంచి 2018–19 వరకు జరిగిన కొనుగోళ్లపై విచారణ నిర్వహించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పలు అక్రమాలు చోటు చేసుకున్నట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీనిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన ఏసీబీ.. రూ.988.77 కోట్ల విలువైన మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో సుమారు రూ.150 కోట్లకుపైగా అవినీతి జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించింది. ♦ ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం కలిగించిన ఈ వ్యవహారంలో అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు కలిపి 19 మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించింది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని ఏసీబీ నిమ్మాడలో అదుపులోకి తీసుకుంది. ఈఎస్ఐ మాజీ డైరెక్టర్లు డాక్టరు సీకే రమేష్‌కుమార్‌ను తిరుపతిలో, డాక్టర్ జి.విజయ్‌కుమార్‌ను రాజమహేంద్రవరంలో అరెస్టు చేసింది. ఇప్పటికే సస్పెన్షన్‌లో ఉన్న డిమ్స్ ఉద్యోగులు డాక్టర్ జనార్దన్, ఇ.రమేష్‌బాబు, ఎంకేబీ చక్రవర్తిలను కూడా అరెస్టు చేసింది. మార్కెట్ ధరకన్నా అధికంగా చెల్లింపులు.. ♦ మందులు, ల్యాబ్ కిట్స్, శస్త్రచికిత్స పరికరాలు, ఫర్నిచర్, బయోమెట్రిక్ పరికరాల కొనుగోళ్లతో పాటు కాల్‌సెంటర్, ఈసీజీ సర్వీసుల ఒప్పందాల్లో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ♦ మార్కెట్ ధర కన్నా 50 నుంచి 129 శాతం అధికంగా చెల్లించి మందులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. కొన్ని సంస్థలతో కుమ్మక్కై ఇ–టెండర్లో కాకుండా నామినేషన్ విధానంలో కొనుగోళ్లు జరిపారు. ♦ కొందరు ‘డిమ్స్’ ఉద్యోగులే తమ కుటుంబ సభ్యుల ద్వారా బినామీ కంపెనీలను సృష్టించారు. తప్పుడు ఇన్వాయిస్లు, బిల్లులతో రూ.కోట్లలో ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారు. ఈసీజీకి డబుల్కిపైగా చెల్లింపులు... ♦ టీడీపీ హయాంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడి ఆదేశాలతో అప్పటి డిమ్స్ డైరెక్టర్ డాక్టర్ సీకే రమేష్‌కుమార్ టెలీహెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ♦ టెలిమెడిసిన్‌కు సంబంధించి కాల్‌సెంటర్, టోల్ ఫ్రీ, ఈసీజీ సేవల ఒప్పందం లోపభూయిష్టంగా జరిగింది. ఇతర ఆస్పత్రుల్లో సుమారు రూ.200 మాత్రమే ఖర్చు అయ్యే ఈసీజీకి రూ.480 చొప్పున చెల్లించారు. ♦ కాల్‌సెంటర్‌కు వచ్చిన కాల్స్‌కి కాకుండా సర్వీసు ప్రొవైడర్ మొత్తం రిజిస్టర్ ఐపీకి, ఫేక్ కాల్స్ లాగ్స్‌కి ఒక్కో కాల్కి రూ.1.80 చొప్పున బిల్లులు చెల్లించారు. ♦ బయోమెడికల్ వేస్ట్ డిస్పోజబుల్ ప్లాంట్ ఏర్పాటులోనూ అవకతవకలు, అవినీతి చోటుచేసుకుంది. -
కార్మికుల సొమ్ము.. కడుపారా!
సాక్షి, అమరావతి: కార్మికుల కన్నీళ్లు తుడిచి మెరుగైన వైద్యం అందేలా చూడాల్సిన వారే కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కడుపారా ఆరగించారు. నెలనెలా జీతం నుంచి ఈఎస్ఐ కోసం డబ్బులు చెల్లించే కార్మికుల సొమ్మును కాజేశారు. మాజీ సీఎం చంద్రబాబు హయాంలో కార్మిక శాఖ మంత్రి హోదాలో అచ్చెన్నాయుడు సిఫార్సు లేఖలతో నామినేషన్ ద్వారా ఆర్డర్లు ఇచ్చి ఈఎస్ఐ మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో భారీ దోపిడీకి తెరతీసినట్లు విజిలెన్స్ విచారణలో వెల్లడి కావడంతో ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. టెలీ హెల్త్ సర్వీసెస్ పేరుతో అచ్చెన్నాయుడు ఇచ్చిన లేఖలు ఆయన అవినీతికి అద్దంలా నిలిచాయి. నాన్ రేట్ కాంట్రాక్టు మందులు, ల్యాబ్ కిట్స్, సర్జికల్ ఐటమ్స్, ఫర్నిచర్, బయోమెట్రిక్ పరికరాల కొనుగోళ్లతోపాటు కాల్ సెంటర్, ఈసీజీ సర్వీసుల ఒప్పందాల్లోను అవినీతి, అక్రమాలు జరిగాయని ఈ వ్యవహారంలో రూ.150 కోట్లకుపైగా ప్రజాధనం లూటీ అయినట్లు ఏసీబీ దర్యాప్తులో గుర్తించారు. నామినేషన్ పద్ధతిలో లోపాయికారీగా... అచ్చెన్న మంత్రిగా ఉండగా ఈఎస్ఐ కోసం మందులు, సర్జికల్ పరికరాల కొనుగోళ్లకు మార్కెట్ ధర కంటే అత్యధికంగా చెల్లించారు. నామినేషన్ పద్ధతిలో లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకుని కొన్ని సంస్థల నుంచి మందులు కొనుగోలు చేశారు. కొందరు డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ సర్వీసెస్(డీఐఎంఎస్) సిబ్బంది కూడా వారి కుటుంబ సభ్యుల పేర్లతో బినామీ మందుల కంపెనీలు ఏర్పాటు చేసి అక్రమంగా మందులు కొనుగోలు ఒప్పందాలు చేసుకుని బిల్లులు తీసుకున్నారు. మరికొందరు సిబ్బంది నకిలీ, ఫోర్జరీ లెటర్ హెడ్స్ సృష్టించి కొటేషన్లు వేశారు. మందుల షాపుల నుంచి దొంగ బిల్లులు సృష్టించి అవినీతికి పాల్పడ్డారు. ఈ స్కామ్‌లో మరికొందరి పాత్రపైనా దర్యాప్తు జరుగుతోంది. ఈఎస్ఐ ఇలా.. ► రాష్ట్రంలో కార్మిక రాజ్య బీమా సంస్థ పరిధిలో 14 లక్షల మంది కార్మికులున్నారు. కార్మికుల కుటుంబ సభ్యులతో కలిపి సుమారు 50 లక్షల మంది ఈఎస్ఐ పరిధిలో ఉన్నారు. ► ఒక్కో కార్మికుడు మూల వేతనం నుంచి 0.75 శాతం ఈఎస్ఐ కోసం చెల్లిస్తుండగా కంపెనీ 3.25 శాతం జమ చేసి చెల్లిస్తుంది. ► ఒక్కో కార్మికుడికి కేంద్ర కార్మిక శాఖ సంవత్సరానికి రూ.2,150 చొప్పున ఖర్చు చేసేందుకు వీలు కల్పించింది. ఈమేరకు నిధులు మంజూరు చేస్తుంది. అంటే ఏడాదికి సుమారు రూ.330 కోట్లు నిధులు వస్తాయి. ► రాష్ట్రంలో ఈఎస్ఐ పరిధిలో 78 డిస్పెన్సరీలు, 4 ప్రాంతీయ ఆసుపత్రులు, 3 డయాగ్నస్టిక్స్ సెంటర్లున్నాయి. అచ్చెన్న ఒత్తిడితో ఒప్పందాలు.. కార్మిక శాఖ మంత్రిగా ఉండగా అచ్చెన్నాయుడు టెలీ సర్వీసెస్, ఈసీజీ సర్వీసుల కాంట్రాక్టు ఇప్పించారు. వాస్తవానికి ఏ కాంట్రాక్టు అయినా రూ.10 లక్షల విలువ దాటితే ఈ–టెండరు ప్రాతిపదికన నిర్ణయించాలి. అయితే నిబంధనలకు విరుద్ధంగా అచ్చెన్నాయుడు అప్పటి ఈఎస్ఐ డైరెక్టర్‌కు తన లెటర్‌హెడ్ మీద సిఫార్సు లేఖ పంపించారు. దీంతో అచ్చెన్న సూచించిన కంపెనీకి ఎలాంటి టెండరు లేకుండా కాంట్రాక్టు కట్టబెట్టారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలో ఈ విషయం బట్టబయలైంది. అచ్చెన్నఒత్తిడితోనే టెలీ హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు కాల్ సెంటర్, టోల్‌ఫ్రీ, ఈసీజీకి సంబంధించిన కాంట్రాక్టు ఇచ్చారు. అప్పటి ఈఎస్ఐ డైరెక్టర్ డాక్టర్ సీకే రమేష్‌కుమార్ కుదుర్చుకున్న ఈ ఒప్పందాలన్నీ లోపభూయిష్టమే. ఎక్కడైనా దాదాపు రూ.200 మాత్రమే ఉండే ఈసీజీకి రూ.480 చొప్పున రెట్టింపునకుపైగా చెల్లించారు. ఈసీజీ కోసం ఎండీకి బదులు డిప్లొమో హోల్డర్‌ను ఉపయోగించుకున్నారు. కాల్ సెంటర్లో కాల్స్‌కి కాకుండా సర్వీస్ ప్రొవైడర్ మొత్తం రిజిస్టర్ ఐపీ, ఫేక్ కాల్ లాగ్స్‌కి రూ.1.80 చొప్పున బిల్ క్లెయిమ్ చేశారు. బయో మెడికల్ వేస్ట్ డిస్పోజబుల్ ప్లాంట్లకు సంబంధించి విచారణ జరుగుతోంది. క్రీముల పేరిట కార్మికుల సొమ్ము స్వాహా పొద్దంతా పనిచేసే కార్మికులు అనారోగ్యం పాలైతే ఔషధాలు అందచేసి ఆదుకోవాల్సిన గత సర్కారు పెద్దలు ముఖం మెరిసిపోయేలా ఉండేందుకు క్రీములంటూ కోట్ల రూపాయలు కాజేశారు. గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులతో వచ్చే రోగులకు వైద్యం అందించకుండా ఫేసు క్రీములు, చర్మ సంబంధిత ఆయింట్మెంట్లు అంటూ రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసి నిరుపయోగంగా స్టోర్లలో పారేశారు. ఈఎస్ఐ ఆస్పత్రుల కోసమంటూ 2018 నుంచి కొనుగోలు చేసిన ఈ క్రీములు డ్రగ్ స్టోర్లలో గుట్టలు గుట్టలుగా పడిఉన్నాయి. అవి అవసరం లేదని వైద్యులు సూచించినా పట్టించుకోకుండా నాటి మంత్రుల ఒత్తిళ్ల మేరకు కొనుగోలు చేశారు. ఇవి కార్మికులకు ఏమాత్రం అవసరం లేనివని వైద్యులు చెబుతున్నారు. వీటిని ఓసారి పరిశీలిస్తే... టాక్రోజ్ ఆయింట్మెంట్, సిల్కిన్ స్కాల్ప్ సొల్యూషన్, డిసొనైడ్ లోషన్ అండ్ క్రీమ్, క్యాల్సిట్రోల్ ఆయింట్మెంట్, అడపాలెన్ సి జెల్, క్లోబెట్సాల్ మరియు సలిసైలిక్ యాసిడ్ ఆయింట్మెంట్, సెప్గార్డ్ జెల్, యూ–రిల్ క్రీమ్ లాంటివి ఉన్నాయి. సరఫరాదారులతో కలసి కమీషన్లు వసూలు చేసుకున్నట్లు దీనిద్వారా తేలుతోంది. అధిక రేట్లు.. ఆపై అవసరం లేని మందులు ► ఎలాంటి టెండర్లు లేకుండా నామినేషన్ల ప్రాతిపదికన రూ.కోట్ల విలువైన మందుల కొనుగోళ్లకు అచ్చెన్నాయుడు మంత్రిగా ఉండగా ఆర్డర్లు ఇచ్చారు. ► లెజెండ్ ఎంటర్ప్రైజెస్, ఎవెంటార్, ఓమ్ని మెడి తదితర సంస్థలకు భారీ లబ్ధి చేకూర్చారు. ► ఆయా సంస్థల నుంచి అచ్చెన్న, కొందరు అధికారులు భారీగా ప్రయోజనం పొందారు. ► ల్యాబొరేటరీ కిట్ల కోసమే రూ.237 కోట్లు వ్యయం చేశారు ► రూ.16 వేలు విలువ చేసే బయోమెట్రిక్ మిషన్లను రూ.70 వేలు చెల్లించి కొనుగోలు చేశారు. ► ఫ్యాబ్రికేటెడ్ కొటేషన్ల ద్వారా మందులు, శస్త్రచికిత్సల పరికరాలు, ఫర్నీచర్, ఈసీజీ మెషీన్లు కొనుగోలు చేశారు. ► సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంటు పనులు ఎలాంటి టెండరు లేకుండా జలం ఎన్విరాన్మెంట్ సంస్థకు అప్పగించారు. ► నామినేషన్ కింద రూ.89.58 కోట్ల విలువైన మందులు కొనుగోలు చేశారు. ► కార్మికులకు షాంపులు, క్రీముల పేరుతో రూ.10.50 కోట్లు వ్యయం చేశారు ► రాష్ట్రవ్యాప్తంగా 74 ఈఎస్ఐ డిస్పెన్సరీలు ఉండగా ఇండెంట్ (మందుల జాబితా) ఇవ్వకుండానే మంత్రి, అధికారులు కొనుగోలు చేశారు. ► ఏటా రూ.300 కోట్లు బడ్టెట్ ఉండగా రూ.500 కోట్లకు పైగా ఆర్డర్లు పెట్టి దోచేశారు. ► డా.రవికుమార్, డా.సి.కె.రమేష్‌కుమార్, డా.విజయకుమార్ ఈఎస్ఐ డైరెక్టర్లుగా ఉండగా అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ నివేదికలో వెల్లడైంది. ► ఈ వ్యవహారంలో సుమారు రూ.151 కోట్లకుపైగా కార్మికుల సొమ్ము నాటి మంత్రి, అధికారులు, కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్లింది. -
అచ్చెన్నకు 14 రోజుల రిమాండ్
సాక్షి, మంగళగిరి : ఈఎస్ఐ కుంభకోణం కేసులో ఏ2గా ఉన్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడికి ఏసీబీ న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయనను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో అచ్చెన్నాయుడును తొలుత విజయవాడ జైలుకు తరలించారు. అనంతరం జైలు అధికారులు అనుమతితో ఆయనను జీజీహెచ్‌కు తీసుకెళ్లనున్నారు. మరోవైపు ఇదే కేసులో ఏ1గా ఉన్న ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ రమేశ్‌కుమార్‌కు కూడా రెండు వారాల రిమాండ్ విధిస్తూ ఏసీబీ న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. దీంతో అధికారులు రమేష్‌కుమార్‌ను అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. (చదవండి : టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్) కాగా, ఈ కేసుకు సంబంధించి శుక్రవారం అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన అధికారులు.. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మంగళగిరి ఏసీబీ న్యాయమూర్తి నివాసానికి తరలించిన సంగతి తెలిసిందే. ఆయనతోపాటు రమేశ్‌కుమార్‌ను కూడా అధికారులు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఈ క్రమంలో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి అచ్చెన్నాయుడు, రమేశ్‌కుమార్‌లకు రెండు వారాల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీచేశారు. (చదవండి : కార్మికుల సొమ్ము.. కడుపారా!) -
మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/రాజమహేంద్రవరం క్రైమ్/సాక్షి, తిరుపతి: కార్మిక శాఖ మాజీ మంత్రి, టెక్కలి టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం ఉదయం అరెస్ట్ చేశారు. చంద్రబాబు జమానాలో ఈఎస్ఐలో జరిగిన రూ.151 కోట్లకు పైగా కుంభకోణంలో అచ్చెన్నాయుడు ప్రధాన పాత్రధారిగా ఏసీబీ దర్యాప్తులో నిర్ధారణ కావడంతో అదుపులోకి తీసుకున్నారు. ఈ కుంభకోణంలో 19 మంది ప్రమేయం ఉన్నట్టు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వారిలో అచ్చెన్నాయుడితోపాటు మరో ఆరుగురిని వేర్వేరు ప్రాంతాల్లో శుక్రవారం ఏసీబీ అధికారులు అరెస్టు చేసి విజయవాడకు తీసుకొచ్చారు. వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. అంతకు ముందు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలోని అచ్చెన్నాయుడి ఇంటికి వెళ్లి.. ఉదయం 6.50 గంటలకు ఏసీబీ అధికారులు ఆయనకు అరెస్ట్ సమాచారాన్ని తెలియజేశారు. 7.20 గంటలకు అవినీతి నిరోధక శాఖ సీఐయూ యూనిట్ (విజయవాడ) డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని అచ్చన్నాయుడు భార్య, ఆయన లాయర్, ఆయన సోదరుడు హరిప్రసాద్ కుమారుడు సురేష్‌కుమార్‌కు తెలియజేశారు. ఆ మేరకు సమాచారం తనకు అందినట్టుగా కింజరాపు సురేష్‌కుమార్ సంతకం చేశారు. అనంతరం అచ్చెన్నాయుడిని నిమ్మాడ నుంచి విజయవాడకు రోడ్డు మార్గంలో తీసుకొచ్చారు. విజయవాడలో ఏసీబీ ఆఫీసు వద్ద అచ్చెన్నాయుడు అచ్చెన్నపై నమోదు చేసిన కేసులివే.. ► క్రైమ్ నంబర్ 04/ఆర్సీఓ – సీఐయూ – ఏసీబీ/2020 యు/ఎస్ 13(1), (సీ), (డీ), ఆర్/డబ్ల్యూ 13(2) ఏసీబీ పీసీ సవరణల చట్టం – 2018 ► సెక్షన్ 408, సెక్షన్ 420, 120 – బీ కింద అచ్చెన్నాయుడిపై అధికారులు కేసులు నమోదు చేశారు. వాటిలో కొన్ని ఆర్థిక మోసాలకు సంబంధించినవి. పటిష్ట బందోబస్తు ► కింజరాపు అచ్చెన్నాయుడు తన స్వగ్రామమైన నిమ్మాడలోని నివాసమున్నట్టు తెలుసుకున్న ఏసీబీ అధికారులు.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ► ఉదయం 6.50 గంటలకు అచ్చెన్నాయుడు ఉన్న ఇల్లు మూడో అంతస్తుకు ఏసీబీ అధికారులు వెళ్లారు. ఈఎస్ఐ మందుల కుంభకోణంలో మీ ప్రమేయం ఉందని, దాని కారణంగా అరెస్టు చేస్తున్నట్టుగా ఏసీబీ అధికారులు తెలిపారు. ‘అప్పుడే విచారణ పూర్తయిపోయిందా?’ అని ఏసీబీ అధికారులను ఆయన ప్రశ్నించినట్టు తెలిసింది. విచారణ పూర్తయిందని, అక్రమాల్లో మీ పాత్ర ఉందని తేలడంతో అరెస్టు చేస్తున్నామని ఏసీబీ అధికారులు తెలియజేశారు. ► దీంతో ఎటువంటి ప్రతిఘటన లేకుండా 7.20 గంటల సమయంలో ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆ సమయంలో అచ్చెన్నాయుడికి సన్నిహితంగా ఉన్న నాయకులు మాత్రమే అక్కడికి చేరుకున్నారు. అరెస్టయిన వారు.. సీకే రమేశ్‌కుమార్,విజయ్‌కుమార్, జనార్దన్ డాక్టర్ ఈటగాడి విజయకుమార్ అరెస్ట్ ► ఈఎస్ఐ ఆస్పత్రుల ఇన్చార్జ్ మాజీ డైరెక్టర్ డాక్టర్ ఈటగాడి విజయకుమార్‌ను రాజమహేంద్రవరంలోని ఆయన నివాసంలో ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ శుక్రవారం తెల్లవారుజామున అరెస్ట్ చేసింది. ఈఎస్ఐ ఆసుపత్రులకు మందులు, పరికరాల కొనుగోలు కుంభకోణంలో ఆయన పాత్ర ఉందంటూ విజిలెన్స్ నివేదికల ఆధారంగా ఆయన్ను అరెస్ట్ చేశారు. ► రాజమహేంద్రవరం ఈఎస్ఐ ఆస్పత్రిలో రేడియాలజిస్ట్‌గా విధుల్లో చేరిన ఆయన సూపరింటెండెంట్‌గా, ఈఎస్ఐ ఆస్పత్రుల ఇన్చార్జ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. స్పెషల్ గ్రేడ్ సివిల్ సర్జన్‌గా రిటైరయ్యారు. ఎక్కువ కాలం రాజమహేంద్రవరంలోనే వివిధ హోదాల్లో పని చేశారు. ఆయన్ను ప్రత్యేక వాహనంలో విజయవాడ తరలించారు. తిరుపతిలో రమేష్‌కుమార్, వి.జనార్ధన్ అరెస్ట్ ► ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ చింతల కృష్ణప్ప రమేష్ కుమార్, తిరుపతి ఈఎస్ఐ ఆస్పత్రి సూపరింటెండెంట్ జనార్ధన్‌ను శుక్రవారం ఏసీబీ అధికారులు వారి నివాసాల వద్ద అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. రమేష్‌కుమార్ 2014–16లో తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా కూడా పని చేశారు. ఆ తర్వాత డైరెక్టర్‌గా పనిచేసి రిటైరయ్యారు. ► అప్పట్లో మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు ఆదేశాలతో వీరు వైద్య పరికరాలు, మందులు, ఫర్నిచర్ కొనుగోలు చేసినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. ఈఎస్ఐ ఆస్పత్రికి మంజూరైన నిధుల కోసం బినామీ పేర్లతో కంపెనీలు ఏర్పాటు చేయడంతో పాటు ఈఎస్ఐ కమిటీ రిజెక్ట్ చేసిన మందులను కూడా కొనుగోలు చేశారు. ► తిరుపతి, చిత్తూరు, శ్రీకాళహస్తి, నగరి, రేణిగుంట, బంగారుపాలెం, కుప్పంలో ఉన్న ఈఎస్ఐ ఆసుపత్రికి అవసరమైన మందులు, పరికరాలు, ఫర్నిచర్ అవసరానికి మించి కొనుగోలు చేయటంతో పాటు వాటికి అధిక ధరలు చెల్లించినట్లు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల విచారణలో వెలుగు చూసినట్లు ఏసీబీ డీఎస్పీ మల్లీశ్వర్‌రెడ్డి వెల్లడించారు. ► ఈ స్కామ్‌లో పాత్రధారులైన తాడేపల్లి సమీపంలోని కుంచనపల్లి ఈఎస్ఐ డిస్పెన్సరీ నిర్వాహకుడు గోనె వెంకటసుబ్బారావు, విజయవాడ డీఐఎంఎస్ సీనియర్ అసిస్టెంట్ ఇవన రమేష్‌బాబు, సూపరింటెండెంట్ ఎంకేపీ చక్రవర్తి (ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు)లను కూడా ఏసీబీ అరెస్ట్ చేసింది. ఏసీబీ కోర్టులో హాజరు అచ్చెన్నాయుడును శుక్రవారం రాత్రి ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. ఏసీబీ అధికారులు సమర్పించిన రికార్డులను కోర్టు అధికారులు పరిశీలించారు. అనంతరం విచారణ నిమిత్తం మంగళగిరి ఏసీబీ న్యాయమూర్తి నివాసానికి తరలించారు. ఏసీబీ కోర్డు వద్ద లోకేష్‌ను అడ్డుకున్న పోలీసులు కోర్టు వద్ద లోకేష్ హల్చల్ ఏసీబీ కోర్టుకు అచ్చెన్నాయుడిని హాజరుపర్చడంతో శుక్రవారం రాత్రి అక్కడికి చేరుకున్న టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కోర్టు సమీపంలో లోకేష్ హల్చల్ చేశారు. తమ నాయకుడిని విడిచి పెట్టాలని, ఆయన్ను పరామర్శించనివ్వరా? అంటూ పోలీసులపై మండిపడ్డారు. పోలీసులు వస్తున్నట్లు సమాచారం లేదు టెక్కలి: పోలీసులు ఇంట్లోకి వచ్చిన విషయం తమకు తెలియదని, హఠాత్తుగా మేడ పైకి వచ్చి తన భర్తను తీసుకెళ్లిపోయారని శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు భార్య విజయమాధవి అన్నారు. -
అచ్చెన్నాయుడికి సంబంధం లేదు : చంద్రబాబు
సాక్షి, అమరావతి: ఈఎస్ఐలో జరిగిన వ్యవహారంతో అచ్చెన్నాయుడుకి సంబంధం లేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. కేటాయింపుల్లో మంత్రి ఎక్కడా ఉండడని, అధికారులే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి చంద్రబాబు శుక్రవారం మీడియా ప్రతినిధులతో ఆన్లైన్లో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ► ఈఎస్ఐ కుంభకోణం కల్పితం. విజిలెన్స్ నివేదికలో ఎక్కడా అచ్చెన్నాయుడి పేరు లేదు. ఐఎంఎస్ డైరెక్టర్లు రవికుమార్, రమేశ్, విజయ్ పేర్లు మాత్రమే ఉన్నాయి. అచ్చెన్నాయుడు అరెస్టు దుర్మార్గం. ఇంట్లోకి వెళ్లి ఎత్తుకొస్తారా? భార్యకు చెప్పి వస్తానన్నా వినరా? ఆయన ఏమైనా టెర్రరిస్టా, డెకాయిటా? ఆయనకి రెండ్రోజుల కిందట పైల్స్ ఆపరేషన్ జరిగింది. ఓ ప్రజాప్రతినిధి పట్ల ప్రభుత్వం ప్రవర్తించిన తీరు గర్హనీయం. ► వర్చువల్ పోరాటాలు చేయండి. అచ్చెన్నాయుడికి మేమున్నాం అనే ఫ్లకార్డులను శనివారం అందరూ ప్రదర్శించి నిరసన తెలపాలి. ► ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలను లాక్కుంటారా? మా ఆర్థిక మూలాలను దెబ్బతీస్తారా? దీని గురించి అన్ని ప్రతిపక్షాలు ఆలోచించాలి. ప్రధాన ప్రతిపక్షంపైనే ఇలా చేస్తుంటే మీ దాకా వస్తే ఏంటో చూసుకోండి. ► మీరు (ప్రభుత్వం) ఏం చేయలేరు.. నేను టెర్రరిస్టులకే భయపడలేదు. అచ్చెన్నాయుడిని కిడ్నాప్ చేశారు తమ పార్టీ నేత అచ్చెన్నాయుడిని కిడ్నాప్ చేశారని చంద్రబాబు ఆరోపించారు. అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారనే వార్త తెలియగానే శుక్రవారం ఆయన హైదరాబాద్ నుంచి ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ► అచ్చెన్నాయుడిని మందులు వేసుకోవడానికి కూడా అనుమతించలేదు. వారి కుటుంబ సభ్యులు, నేను ఫోన్లో కాంటాక్ట్ చేసినా ఫోన్ అందుబాటులో లేకుండా చేశారు. ► ఇది జగన్ అరాచకం, ఉన్మాదం తప్ప మరేమీ కాదు. మోసాలు, అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో వస్తున్న అసంతృప్తి ఫ్రస్ట్రేషన్‌గా మారి ఇలా ఉన్మాద చర్యలకు ఒడిగడుతున్నారు. అవినీతి అంకానికి కులం ముసుగు.. బాబు తీరుపై సర్వత్రా విస్మయం సాక్షి, అమరావతి: ఈఎస్ఐ ఆస్పత్రులకు మందులు, వైద్య పరికరాల కొనుగోళ్ల కుంభకోణానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు పాత్రపై ఆ పార్టీ మౌనం పాటించడం, తన హయాంలో రూ.150 కోట్లకుపైగా ప్రజాధనం స్వాహాపై చంద్రబాబు స్పందించకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అవినీతి కేసులో అరెస్టు వ్యవహారాన్ని చంద్రబాబు కిడ్నాప్‌గా అభివర్ణించడంపై అంతా విస్తుపోతున్నారు. అచ్చెన్నాయుడిని అరెస్టు చేసిన విషయాన్ని ధృవీకరిస్తూ పోలీసులు ఆయన కుటుంబానికి లేఖ ఇచ్చినా కిడ్నాప్‌గా పేర్కొనటంపై పార్టీ నేతల్లోనే అసహనం వ్యక్తమవుతోంది. కుల రాజకీయాలతో గట్టెక్కే యత్నాలు.. ఈఎస్ఐ కుంభకోణం గురించి నోరెత్తకుండా అందులో మంత్రి పాత్ర లేదని, జరిగిన దానికి ఆయన జవాబుదారీ కాదని పేర్కొనడం ద్వారా అక్రమాలు చోటుచేసుకున్నట్లు తామే ఒప్పకున్నట్లైందని కొందరు పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. బీసీ నాయకుడిని అరెస్టు చేశారంటూ అవినీతి వ్యవహారానికి కులం రంగు పులమడానికి చంద్రబాబు, ఆ పార్టీ నేతలు విశ్వప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం చేశారు. బీసీలైతే అవినీతి చేయవచ్చా? అన్న ప్రశ్నకు ఆన్లైన్ మీడియా సమావేశంలో చంద్రబాబు జవాబు చెప్పలేదు. ఈ స్కాంలో అచ్చెన్నాయుడి పాత్ర గురించి నోరు మెదపకుండా అరెస్టుకు కులం రంగు పులిమి ఈ వ్యవహారం నుంచి గట్టెక్కేందుకు చంద్రబాబు, టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. -
దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టమని అడగాలి..
-
కిడ్నాప్ చేయాల్సిన అవసరం మాకు లేదు..
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ధైర్యం ఉంటే అసెంబ్లీలో అచ్చెన్నాయుడు అవినీతిపై చర్చ పెట్టమని అడగాలని పురపాలకశాఖా మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. అచ్చెన్నాయుడును అక్రమంగా అరెస్ట్ చేశారని అంటున్నారే తప్ప.. అవినీతి జరగలేదని చంద్రబాబు గానీ టీడీపీ నేతలు ఎక్కడా చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాటలు నమ్మడానికి ప్రజలు అమాయకులు కాదని.. పక్కా ఆధారాలతో ఏసీబీ అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిందని స్పష్టం చేశారు. తనపై చంద్రబాబు గతంలో లేనిపోని ఆరోపణలు చేశారని ఆ సమయంలో తాను సీబీఐ విచారణను స్వాగతించానని గుర్తు చేశారు. ‘‘నేను ఏ తప్పూ చేయలేదు కాబట్టి ధైర్యంగా ఉన్నా. అయినా.. నాపై మీ పత్రికల్లో ఇష్టానుసారంగా వార్తలు రాయించలేదా. నేను కూడా వెనుకబడిన కులానికి చెందిన వాడినే. నేను బీసీ అని అప్పుడు మీకు గుర్తురాలేదా’’అని చంద్రబాబును ప్రశ్నించారు. అవినీతికి కులాలు అపాదించడం తగదని హితవు పలికారు. (విజయవాడ: ఏసీబీ ఆఫీస్‌కు అచ్చెన్నాయుడు) ‘‘ఈఎస్ఐలో రూ. 150 కోట్లు అవినీతి జరిగిందని ఏసీబీ అధికారులు తేల్చారు. అచ్చెన్నాయుడు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. టెండర్లు పిలవకుండా ఆయన ఇష్టానుసారంగా తమకు నచ్చిన వారికి కట్టబెట్టారు. నామినేషన్ మీద పనులు ఇవ్వాలని లేఖ రాశారు. 134 శాతం అధిక ధరలకు మందులు ఇతర సామగ్రి కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడ్డారని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. కిడ్నాప్ అంటే ఎవరికి తెలియకుండా ఎత్తుకు పోవడం. కిడ్నాప్ చేయాల్సిన అవసరం మాకు లేదు. (‘చిట్టి నాయుడు దెబ్బ.. అచ్చెన్న అబ్బ’) టీడీపీ నేతలే మా అవినీతిపై విచారణ జరపాలని సవాల్ చేశారు. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర సమయంలో చంద్రబాబు అవినీతిపై విచారణ జరువుతామని ప్రజలకు హామీ ఇచ్చారు. మేము అవినీతి రహిత పాలన అందిస్తామని ప్రజలకు చెప్పాం. వాళ్లు మాకు అవకాశం ఇచ్చారు. టీడీపీ హయాంలో జరిగిన స్కాంలు రోజుకొకటి బయటకు వస్తాయి. చంద్రబాబు హయాంలో భోగాపురం ఎయిర్‌పోర్టు కేటాయింపు వ్యవహారంపై సమీక్ష చేసి 500 ఎకరాల భూమి వెనక్కి తీసుకున్నాము. తద్వారా ప్రభుత్వానికి రూ. 1500 కోట్ల ఆదా అయింది’’ అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. -
విజయవాడ: ఏసీబీ ఆఫీస్‌కు అచ్చెన్నాయుడు
-
విజయవాడ: ఏసీబీ ఆఫీస్‌కు అచ్చెన్నాయుడు
సాక్షి, విజయవాడ: ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టైన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని అవినీతి నిరోధక శాఖ అధికారులు విజయవాడకు తరలించారు. గొల్లపూడిలోని ఏసీబీ సెంట్రల్ ఆఫీసుకు ఏసీబీ అధికారులు ఆయనను తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం అచ్చెన్నాయుడిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. అచ్చెన్నాయుడుతోపాటు అరెస్టైన మరో ఐదుగురిని కూడా ఏసీబీ అధికారులు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టనున్నారు. కాగా, ఈఎస్ఐ కుంభకోణం కేసులో శుక్రవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. (చదవండి: ‘అరెస్ట్ చేస్తే కిడ్నాప్ ఎలా అవుతుంది?’) 155 కోట్ల రూపాయల అవినీతి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మందుల కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇటీవల నివేదికను విడుదల చేసింది. కేసు విచారణలో భాగంగానే ఆయనను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. టెండర్లు పిలవకుండా నామినేషన్ పద్దతిలో అచ్చెన్నాయుడు చెప్పిన కంపెనీకు కోట్ల రూపాయల ఆర్డర్లు ఇచ్చినట్లు నివేదికలో తేలింది. మొత్తం 155 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఏసీబీ తేల్చింది. (చదవండి: టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్) -
‘పందికొక్కుల్లా చంద్రబాబు, లోకేష్ దోచుకున్నారు’
-
అలా అని చంద్రబాబు రాజ్యాంగంలో ఉందా?
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఎవరు తప్పు చేసినా క్షమించేది లేదని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్టు సందర్భంగా శుక్రవారం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. 70 ఏళ్ల వయస్సు.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు ఏసీబీ ఒక ఎమ్మెల్యేను అరెస్టు చేసేటప్పుడు ఎలా వెళ్తారో తెలియదా అని ప్రశ్నించారు. ఈఎస్ఐలో రూ.150 కోట్ల స్కాం జరిగిందని, కొనాల్సినవి, కొనకూడనివి అన్ని కొని జేబులు నింపుకున్నారని దుయ్యబట్టారు. (మరో రెండు గంటల్లో బెజవాడకు అచ్చెన్నాయుడు) ఎవరెవర్ని అరెస్టు చేయకూడదో చంద్రబాబు ఒక లిస్ట్ ఇవ్వాలని, తప్పు చేసిన వారిని విచారించొద్దని చంద్రబాబు రాజ్యాంగంలో ఉందా అని కొడాలి నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పందికొక్కుల్లా చంద్రబాబు, లోకేష్ రాష్ట్రాన్ని దోచుకున్నారని ఎద్దేవా చేశారు. దీంట్లో అచ్చెన్నాయుడికి ఓ అయిదు కోట్లు ఇచ్చి ఉంటారని, మిగతాది పందికొక్కులా లోకేష్ తినేసి ఉంటాడని దుయ్యబట్టారు. అచ్చెన్నాయుడు అప్రువర్‌గా మారి ఈఎస్ఐ కుంభకోణం వెనుక ఉన్న వారి పేరు చెబితే తనను వదిలి పందికొక్కులను పట్టుకుంటామని హితవు పలికారు. తమ ప్రభుత్వంలో ఏ అవినీతి జరిగినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సహించరని పునరుద్ఘాటించారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పులను తాము విచారిస్తున్నామని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. (‘భయంతోనే బట్టలు చించుకుంటున్నారు’) -
మరో రెండు గంటల్లో విజయవాడకు అచ్చెన్నాయుడు
-
బెజవాడకు అచ్చెన్నాయుడు తరలింపు
సాక్షి, విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టైన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును అవినీతి నిరోధక శాఖ అధికారులు మరో రెండు గంటల్లో విజయవాడకు తీసుకురానున్నారు. ఇక్కడకు చేరుకోగానే ఈఎస్ఐ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం అక్కడి నుంచి ఏసీబీ సెంట్రల్ ఆఫీసుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. అక్కడ రికార్డు వర్క్ పూర్తైన తర్వాత ఇంకా సమయం మిగిలి ఉంటే ఏసీబీ కోర్టులో ఆయనను హాజరుపరుచనున్నారు. ఒకవేళ కోర్టు సమయం ముగిసినట్లయితే ఏసీబీ న్యాయమూర్తి ఇంటి వద్దకు తీసుకువెళ్లనున్నారు. ఇక అచ్చెన్నాయుడుతో పాటు ఈఎస్ఐ స్కాంలో పాత్రధారులుగా ఉన్న మరో ఐదుగురిని ఏసీబీ అధికారులు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో నాలుగు ప్రదేశాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా శుక్రవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.(కళ్లు బైర్లు కమ్మే అవినీతి, అక్రమాలు) ఇదిలా ఉండగా... అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై ఏసీబీ ప్రకటన చేయడంతో పాటు మీడియా సమావేశం కూడా నిర్వహించినప్పటికీ.. ఆయనను కిడ్నాప్ చేశారంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డ్రామాకు తెర తీశారు. అచ్చెన్నాయుడిని శుక్రవారం ఉదయం 7.30 గంటలకు ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుంటే.. అర్ధరాత్రి ఆయనను అరెస్ట్ చేశారంటూ చంద్రబాబు లేఖ విడుదల చేశారు. ఎక్కడకు తీసుకెళ్లారో, ఎందుకు తీసుకెళ్లారో తెలియదంటూ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఆయన ఈ విధంగా లేఖ విడుదల చేశారంటూ పలువురు మండిపడుతున్నారు. -
‘అచ్చెన్నాయుడిని బంట్రోతుగా మార్చారు’
సాక్షి, తాడేపల్లి: ముందస్తు సమాచారం ఇచ్చి అరెస్ట్ చేయడానికి అచ్చెన్నాయుడు ఏమైనా స్వాతంత్య్ర సమరయోధుడా అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రశ్నించారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అచ్చెన్నాయుడు రూ.150 కోట్ల అవినీతికి పాల్పడినట్లు అధికారులు చెబుతుంటే.. చంద్రబాబు మాత్రం ఆయనను కిడ్నాప్ చేశారంటూ తప్పుడు లేఖలు రాయడం విడ్డూరంగా ఉంది అన్నారు. అచ్చెన్నాయుడు పాల్పడిన స్కామ్‌కు ఎవరు బాధ్యత వహించాలని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో కార్మికుల సొమ్ము నిలువ దోపిడీ చేసి.. వారి పొట్ట కొట్టిన ఘనుడు అచ్చెన్నాయుడు అని మండిపడ్డారు. తప్పు చేసిన వారిని అరెస్ట్ చేస్తే తప్పా అని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు వెనుక ఉన్నవాళ్లనందరిని అరెస్ట్ చేస్తారని హెచ్చరించారు. ఈ పాపంలో చంద్రబాబుకు భాగస్వామ్యం ఉందని రమేష్ ఆరోపించారు. రమేష్ మాట్లాడుతూ.. అచ్చెన్నాయుడు తప్పు చేస్తే బీసీలు నిరసనలు తెలపాలా అని ప్రశ్నించారు. జ్యోతిరావు పూలే, అంబేద్కర్లు బతికి ఉంటే చంద్రబాబుకు చీవాట్లు పెట్టేవారని అన్నారు. బీసీ నేత అయిన అచ్చెన్నాయుడిని చంద్రబాబు బంట్రోతుగా మార్చారని ఆరోపించారు. దీని వెనుక చంద్రబాబు, లోకేష్‌లు కూడా ఉన్నారని.. వారి పాత్రపైన విచారణ జరపాలని కోరారు. అచ్చెన్నాయుడు రూ.150 కోట్ల ప్రజాధనాన్ని దోచేస్తే.. బీసీలు ధర్నా చేయాలా.. వారు మీకు అంత అమాయకుల్లాగా కనిపిస్తున్నారా చంద్రబాబు అని రమేష్ ప్రశ్నించారు. (అచ్చెన్నాయుడు అరెస్టు; చింతమనేని హైడ్రామా) బడుగుబలహీన వర్గాల వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు, మంత్రి వర్గంలో 60 శాతం పదవులు కేటాయించారని తెలిపారు. అచ్చెన్నాయుడు బీసీల్లో ఎందుకు పుట్టారని బీసీలు భాదపడుతున్నారన్నారు. అచ్చెన్నాయుడు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. పేదల పొట్ట కొట్టిన పాపం ఊరికే పోదన్నారు. హైదరాబాద్ నుంచి లోకేష్ వచ్చి ఏమి చేస్తాడని ప్రశ్నించారు. చంద్రబాబు బీసీలను బానిసలుగా చూస్తే.. సీఎం జగన్మోహన్ రెడ్డి వారికి పెద్దపీట వేశారని తెలిపారు. బలహీన వర్గాల్లో పుడితే ప్రజా ధనం దోచేస్తారా అని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడుతో పాటు చంద్రబాబు, లోకేష్‌లు కూడా ఊచలు లెక్కపెడతారని రమేష్ హెచ్చరించారు. (‘రానున్న రోజుల్లో మరిన్ని అరెస్టులు’) -
‘అవినీతిలో టీడీపీ నేతలు సిద్ధహస్తులు’
సాక్షి, కాకినాడ: గత ఐదేళ్ల టీడీపీ పాలనంతా అవినీతిమయంగా సాగిందని మంత్రి మోపిదేవి వెంకటరమణ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ధనాన్ని ఎలా కొల్లగొట్టాలన్న దాంట్లో టీడీపీ నేతలకు మించిన సిద్ధహస్తులు లేరన్నారు. కార్మికులకు మెరుగైన వైద్య సేవలందాల్సిన ఈఎస్ఐలో తవ్వేకొద్ది అవినీతి బయటపడుతున్నారు. అచ్చెంన్నాయుడు అవినీతిని ఆధారాలతో సహా సేకరించిన తర్వాతే ఏసీబీ అధికారులు తమ విధులు నిర్వహిస్తూ.. చట్ట ప్రకారం వెళ్తున్నారని మంత్రి మోపిదేవి తెలిపారు. (కళ్లు బైర్లు కమ్మే అవినీతి, అక్రమాలు) వాస్తవాలను కప్పిపుచ్చుకునేందుకు కులం కార్డును వాడుతున్నారని మోపిదేవి దుయ్యబట్టారు. ఇది టీడీపీ నైజమని.. కొత్త కాదన్నారు. అచ్చెన్నాయుడు తప్పు చేశారని నిర్ధారణ అయ్యింది కాబట్టే అరెస్ట్ చేశారని.. దానికి బీసీ కార్డును వాడాల్సిన అవసరమేముందని ఆయన ప్రశ్నించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని.. మధ్యలో కుల ప్రస్తావన తీసుకురావడం సరైనది కాదన్నారు. ఈ ఒక్క ఘటనతోనే అయిపోలేదని.. గత టీడీపీ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాల పుట్టను బయటకు తీసేందుకు సీబీఐ విచారణ జరిపించాలని నిన్నటి క్యాబినెట్లో నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిందన్నారు.(అచ్చెన్న అరెస్ట్‌కు, బీసీలకు ఏం సంబంధం?) తప్పుచేశారు కాబట్టే అరెస్ట్: అనిల్‌కుమార్ యాదవ్ అచ్చెన్నాయుడు అవినీతికి, బీసీలకు ఏం సంబంధం అని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు తప్పు చేశారనే ఆధారాలతో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారన్నారు. అవినీతి,అక్రమాలకు పాల్పడిన వారిని అరెస్ట్ చేస్తే టీడీపీ నేతలు ఎందుకు గగ్గోలు పెడుతున్నారని దుయ్యబట్టారు. బీసీలను 30 ఏళ్లుగా చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. టీడీపీ పాలనలో జరిగిన ప్రతి పనిలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు,లోకేష్ అవినీతిపై సీబీఐ విచారణ జరిగితే వారికి శిక్ష తప్పదన్నారు. తండ్రి,కొడుకులు జైలుకెళ్లక తప్పదు: ఆర్కే రోజా విజయవాడ: అచ్చెన్నాయుడు అవినీతి ఆధారాలతో దొరికాడు కాబట్టే అరెస్ట్ అయ్యారని ఎమ్మెల్యే రోజా అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు సిగ్గులేకుండా తమపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈఎస్ఐలో భారీ స్కాం జరిగిందని విజిలెన్స్, ఏసీబీ విచారణలో తేలిందన్నారు. త్వరలోనే చంద్రబాబు,లోకేష్ అవినీతిపై సీబీఐ విచారణ జరుగుతుందన్నారు. అడ్డగోలుగా దోచుకున్న తండ్రి,కొడుకులు జైలుకెళ్లక తప్పదన్నారు. తన అవినీతి బయటపడుతుందనే కారణంతో చంద్రబాబు గతంలో సీబీఐని రాష్ట్రానికి రానివ్వలేదన్నారు. అరెస్ట్‌లు చేస్తే ఎందుకు ఉలిక్కిపడుతున్నారని రోజా ప్రశ్నించారు. టీడీపీ నేతలకు భయం పట్టుకుంది.. కర్నూలు: గత టీడీపీ ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు భారీ అవినీతికి పాల్పడ్డారని.. అందుకే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. కార్మికుల ఆరోగ్యాలను చంద్రబాబు, అచ్చెన్నాయుడు పట్టించుకోలేదన్నారు. అచ్చెన్నాయుడు హయాంలో రూ.150 కోట్ల అక్రమాలు జరిగాయన్నారు. అవినీతిని బయటపెడితే టీడీపీ నేతలకు భయం పట్టుకుందన్నారు. అచ్చెన్నాయుడు టెలీ సర్వీస్, ఆర్సీ నాన్ ఆర్సీ ద్వారా అవినీతికి పాలడ్డారని తెలిపారు. అవినీతికి పాల్పడ్డారు కాబట్టే ఆయనను అరెస్ట్ చేశారని జయరాం పేర్కొన్నారు. చట్టం ముందు అంతా సమానమే: ఇక్బాల్ అనంతపురం: మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్‌ను సమర్థిస్తున్నానని ఎమ్మెల్సీ ఇక్బాల్ అన్నారు. ఈఎస్ఐలో భారీ కుంభకోణం జరిగిందని.. కోట్ల రూపాయల అవినీతి పై విజిలెన్స్ ఆధారాలు సేకరించిందని పేర్కొన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని, చట్టానికి కులాలు, మతాలతో సంబంధంలేదని చెప్పారు. ఏసీబీ విచారణకు టీడీపీ సహకరించాలని ఇక్బాల్ కోరారు. అచ్చెన్న అరెస్ట్‌పై చంద్రబాబు విష ప్రచారం గుంటూరు: అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై ప్రతిపక్ష నేత చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విడదల రజని మండిపడ్డారు. బీసీ కార్పొరేషన్‌కు ఏటా రూ.10 వేల కోట్లు చొప్పున కేటాయిస్తానని చెప్పి మోసం చేసింది చంద్రబాబేనని ధ్వజమెత్తారు. నాయీ బ్రాహ్మణుల తోక కత్తిరిస్తామని, మత్స్యకారులను తాట తీస్తామంటూ బీసీలను అవహేళన చేసిన చరిత్ర చంద్రబాబుది అని దుయ్యబట్టారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మొసలికన్నీరు కారిస్తే ప్రజలు నమ్మరని విడదల రజని అన్నారు. -
పక్కదోవ పట్టించడం చంద్రబాబుకు అలవాటే
-
అచ్చెన్న అరెస్ట్‌కు, బీసీలకు ఏం సంబంధం?
సాక్షి, అమరావతి: ఈఎస్ఐ స్కాంలో రూ.150 కోట్లు అవినీతి జరిగిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అప్పటి ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు కార్మిక మంత్రిగా పనిచేశారని, మంత్రి స్థానంలో ఉండి ఆయన అవినీతికి పాల్పడ్డారన్నారు. ‘‘స్కాంలో అచ్చెన్నాయుడు పాత్ర ఉందని విజిలెన్స్ విచారణలో రుజువైంది. అచ్చెన్నాయుడు అరెస్ట్‌కు, బీసీలకు ఏం సంబంధం’’ అని ఆయన ప్రశ్నించారు. (కళ్లు బైర్లు కమ్మే అవినీతి, అక్రమాలు) బీసీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంక్‌గానే చూశారు తప్ప.. చేసిందేమీలేదన్నారు. ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించాల్సిందే. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే చంద్రబాబు డ్రామా చేస్తున్నారు. అచ్చెన్న తప్పు చేసి బీసీ కార్డు వాడుకోవడం దారుణం’ అంటూ దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో జరిగిన స్కాంలన్నీ బయటపడుతున్నాయని జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. -
కళ్లు బైర్లు కమ్మే అవినీతి, అక్రమాలు
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పాలనలో చోటుచేసుకున్న అనేక అవినీతి అక్రమాలు ఒక్కొక్కటీ వెలుగుచూస్తున్నాయి. అమరావతి భూ కుంభకోణం నుంచి కార్మికుల సొమ్మును కాజేసిన పచ్చ నేతల అవినీతి బండారం బయటపడుతోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని.. ఇష్టారాజ్యంగా దోచుకున్న సొమ్ము నేడు బహిర్గతమవుతోంది. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈఎస్ఐ స్కాంలో మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును ఎట్టకేలకు ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. రూ. 988.77 కోట్ల విలువైన మందులతో పాటు వైద్య పరికరాల కొనుగోలులో సుమారుగా రూ.150 కోట్లపైన అవినీతి అక్రమాలు జరిగినట్లు ఏసీబీ తేల్చింది. దీంతో ఈఎస్ఐ స్కాం మరోసారి తెరపైకి వచ్చింది. సాక్షి, అమరావతి : చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇన్సూరెన్సు మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) డైరెక్టర్లుగా డాక్టర్ బీ.రవికుమార్, సీ.కే.రమేష్‌కుమార్, డాక్టర్ జీ.విజయ్‌కుమార్ వ్యవహరించారు. వారి ఆధ్వర్యంలో ఈఎస్ఐ ఆస్పత్రులకు అవసరమైన మందులు, ఔషథాలు, వైద్య ఉపకరణాలు, ఆపరేషన్లకు అవసరమైన పరికరాలు, ల్యాబ్ కిట్స్, ఫర్నీచర్ పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. రూ.975.79 కోట్ల రూపాయల మేర కొనుగోలు జరిగాయి. అయితే ఈ ప్రక్రియలో యథేచ్ఛగా నియమాలు, మార్గదర్శకాలను ఉల్లంఘించారు. నిబంధనల ప్రకారం ఉండాల్సిన డ్రగ్ ప్రొక్యూర్మెంట్ కమిటీని కూడా ఏర్పాటు చేయలేదు. మరోవైపు ఆ కొనుగోళ్ల ప్రక్రియలో ఎక్కడా ఓపెన్ టెండర్లు కూడా పిలవలేదు. దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడింది. (నకిలీ బిల్లులతో అచ్చెన్నాయుడు స్కాం) ఈఎస్ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, డయాగ్నస్టిక్ కేంద్రాలలో చోటు చేసుకున్న అవకతవకలు, అక్రమాలు – ముఖ్యమైన పాయింట్స్: విజిలెన్సు విచారణలో బయటపడ్డ అంశాలు నాన్ రేటు కాంట్రాక్ట్ సంస్థలకు సంబంధించి దాఖలైన కొటేషన్లన్నీ నకిలీవి అని విచారణలో గుర్తించారు. కొటేషన్లు, వాటి కవర్లపై చేతి రాతలన్నీ ఒకేలా ఉన్నాయి. అవి డెరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్సు మెడికల్ సర్వీసెస్ (డీఐఎంఎస్) సిబ్బందివిగా తేల్చారు. వాటిని తామే రాసినట్లు డీఐఎంఎస్‌కు చెందిన ఫార్మసిస్ట్ కె.ధనలక్ష్మి, సీనియర్ అసిస్టెంట్ ఇ.రమేష్‌బాబు అంగీకరించారు. ఆ కొటేషన్ల ఆధారంగా ఈఎస్ఐ ఆస్పత్రులకు అవసరమైన మందులు, ఔషధాలు సర్జికల్ ఐటెమ్స్, ల్యాబ్ కిట్లు, ల్యాబ్ ఎక్విప్మెంట్, ఫర్నీచర్ కొనుగోలుకు డైరెక్టర్లు కొనుగోళ్లు ఆర్డర్లు జారీ చేశారు. తమకు అనుకూలమైన కంపెనీకే ఆర్డర్ ఇచ్చేలా ఆ విధంగా నకిలీ కొటేషన్లు సృష్టించారు. పరిమితికి మించి ఔషధాల కొనుగోలు ఆ డైరెక్టర్ల హయాంలో మందులు, ఔషధాల కొనుగోలు కోసం రూ.293.51 కోట్లు కేటాయించగా, యథేచ్ఛగా ఆ పరిమితిని మించి రేట్ కాంట్రాక్ట్, నాన్ రేట్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి ఏకంగా రూ.698.36 కోట్ల విలువైన మందుల, ఔషధాలు కొనుగోలు చేశారు. నాన్ రేట్ కాంట్రాక్ట్ సంస్థలకు ప్రయోజనం కలిగించేందుకు నిబంధనలను తుంగలో తొక్కారు. నాన్ రేట్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి మందులు, ఔషధాలు కొనుగోలు చేసిన తీరులో జరిగిన అక్రమాలు చూస్తే, కళ్లు బైర్లు కమ్మే పరిస్థితి నెలకొంది. (టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్) అదనంగా చెల్లింపులు ర్యాన్‌డమ్‌గా చేసిన తనిఖీలో పర్చేజ్ ఇన్వాయిస్ ప్రైజ్, సేల్ ఇన్వాయిస్ ప్రైజ్ మధ్య చాలా తేడా ఉన్నట్లు గుర్తించారు. రాశి ఫార్మా, వీరేశ్ ఫార్మాల నుంచి రూ.15.93 కోట్ల విలువైన మందులు, ఔషధాలు కొనుగోలు చేశారు. ఆ మేరకు ఐఎంఎస్ డైరెక్టర్లు పర్చేజ్ ఆర్డర్లు జారీ చేశారు. అయితే ఆ రెండు నాన్ రేట్ కాంట్రాక్ట్ సంస్థల ఇన్వాయిస్ ప్రైజ్ ప్రకారం ఆ మందులు, ఔషథాల అసలు ధర రూ.8.52 కోట్లు మాత్రమే. దానికి 20శాతం మార్జిన్ (లాభం) వేసుకుంటే ఆ ధర రూ.10.22 కోట్లు అవుతుంది. కానీ ఐఎంఎస్ డైరెక్టర్లు మాత్రం ఏకంగా రూ.15.93 కోట్లు చెల్లించారు. ఆ విధంగా కేవలం ఆ రెండు సంస్థలకు మాత్రమే రూ.5.70 కోట్లు అదనంగా చెల్లించారు. ఆ విధంగా అనేక నాన్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి ఐఎంఎస్ డైరెక్టర్లు ఇష్టారాజ్యంగా అధిక ధరలు చెల్లించి మందులు, ఔషథాలు కొనుగోలు చేశారు. నిబంధనలు బేఖాతరు.. అధిక ధరలకు కొనుగోలు నిబంధనల ప్రకారం రేట్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి మాత్రమే అత్యధికంగా కొనుగోళ్లు జరపాల్సి ఉన్నప్పటికీ ఐఎంఎస్ డైరెక్టర్లు మాత్రం ఎక్కడా వాటిని పట్టించుకోలేదు. అన్నింటినీ తుంగలో తొక్కి అత్యధిక కొనుగోళ్లు నాన్ రేట్ కాంట్రాక్ట్ సంస్థల నుంచే జరిపారు. తద్వారా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారు. ప్రజాధనాన్ని పక్కదారి పట్టించారు. ఆ విధంగా 2014–15 నుంచి 2018–19 వరకు 5 ఏళ్లలో ఐఎంఎస్ డైరెక్టర్లు నాన్ రేట్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి రూ.89.58 కోట్ల విలువైన మందులు, ఔషథాలు కొనుగోలు చేశారు. అయితే అవే ఔషధాలు రేట్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి కొనుగోల చేసి ఉంటే కేవలం రూ.38.56 కోట్లకు వచ్చేవి. కానీ ఆ సంస్థలకు పర్చేజ్ ఆర్డర్ ఇవ్వకుండా నాన్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి మందులు, ఔషథాలు కొనుగోలు చేయడం ద్వారా రూ.51.02 కోట్లు అదనంగా చెల్లించారు. ఇది ఏకంగా 132 శాతం అధికం. ఆ విధంగా నాన్ రేట్ కాంట్రాక్ట్ సంస్థలకు 2014–15లో 131.80 శాతం, 2015–16లో 159.40 శాతం, 2016–17లో 136.27 శాతం, 2017–18లో 198.66 శాతం, 2018–19లో 80.04 శాతం అధికంగా చెల్లించారు. అలా గత 5 ఏళ్లలో సగటున 132.30 శాతం అధికంగా చెల్లించారు. అనవసర కొనుగోళ్లు.. తమ వారికే ఆర్డర్లు అవసరాలకు మించి కొనుగోలు చేయడం వల్ల వాటిలో చాలా వరకు నిరుపయోగంగాను ఉండిపోయాయి. ఈఎస్ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీలలో గత ఏడాది కాలంగా రూ.232.32 కోట్ల విలువైన ఔషధాలు, సర్జికల్ ఐటెమ్స్ నిరుపయోగంగా ఉన్నట్లు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలో గుర్తించారు. ఐఎంఎస్ డైరెక్టర్లు పర్చేజ్ ఆర్డర్ ఇచ్చిన నాన్ రేట్ కాంట్రాక్ట్ సంస్థల్లో జెర్కాన్ ఎంటర్ప్రైజెస్ రావిల రవితేజస్వికి చెందినది కాగా, ఆమె డిఐఎంఎస్ సెంట్రల్ డ్రగ్ స్టోర్స్‌కు చెందిన ఫార్మసిస్టు కె.ధనలక్ష్మి కోడలు. అందుకే ఆ సంస్థకు ఐఎంఎస్ డైరెక్టర్లు ఉదారంగా పర్చేజ్ ఆర్డర్లు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. డాక్టర్ సీ.కే.రమేష్‌కుమార్, డాక్టర్ జి.విజయకుమార్ ఇద్దరూ జెర్కాన్ ఎంటర్‌ప్రైజెస్‌కు ఏకంగా రూ.9.50 కోట్ల పర్చేజ్ ఆర్డర్లు ఇచ్చారు. ఆ విధంగా ఆ సంస్థకు ఆర్థిక ప్రయోజనం కల్పించారు. ఔషధాలు డాక్టర్ సీ.కే.రమేష్‌కుమార్ ఐఎంఎస్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు నాన్ రేట్ కాంట్రాక్ట్ సంస్థలు.. విజయనగరానికి చెందిన ఎస్కేపీ ఎంటర్ప్రైజెస్, నర్సారావుపేటకు చెందిన సీతారామ్ ఫార్మాస్యూటికల్స్ నుంచి రూ.5.71 కోట్ల విలువైన ఔషధాలు కొనుగోలు చేశారు. ల్యాబ్ కిట్స్ వాస్తవానికి ల్యాబ్ కిట్స్‌ను హెమోక్యూ, బయోరాడ్, సీమెన్స్ వంటి ప్రొప్రైటరీ సంస్థల నుంచి కొనుగోలు చేయాల్సి ఉన్నప్పటికీ, ఐఎంఎస్ డైరెక్టర్లు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఇక్కడ కూడా యథేచ్ఛగా నియమావళి ఉల్లంఘించి నాన్ రేట్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి ల్యాబ్ కిట్స్ కొనుగోలు చేశారు. లెజెండ్ ఎంటర్ప్రైజెస్, అవాంతర్ పర్ఫార్మెన్సెస్ ఇండియా లిమిటెడ్, ఓమ్ని మెడి వంటి నాన్ రేట్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి నామినేషన్ పద్ధతిలో రూ.237 కోట్ల విలువైన ల్యాబ్ కిట్స్ కొనుగోలు చేశారు. ఆ విధంగా ఆయా సంస్థలకు 36 శాతం అధిక ధరలు చెల్లించారు. సర్జికల్ ఐటెమ్స్.. ఫర్నీచర్ కొనుగోలు ఇక్కడ కూడా ఐఎంఎస్ డైరెక్టర్లు బహిరంగ టెండర్లు పిలవకుండా నాన్ రేట్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి రూ.47.77 కోట్ల విలువైన సర్జికల్ ఉపకరణాలు కొనుగోలు చేశారు. దీంతో పాటు ఏ ఇండెంట్ లేకుండా మరో రూ.8.06 కోట్ల విలువైన సర్జికల్ ఐటెమ్స్ కూడా సేకరించారు. ఫర్నీచర్ కొనుగోలులో కూడా ఐఎంఎస్ డైరెక్టర్లు నిబంధనలు పాటించలేదు. ఎక్కడా బహిరంగ టెండర్లు పిలవకుండా రూ.6.62 కోట్ల విలువైన ఫర్నీచర్ కొనుగోలు చేశారు. వారు చెల్లించిన ధరతో, మార్కెట్లో వాస్తవ ధరలను ఇదమిద్ధంగా పోల్చి చూసిన అధికారులు షాక్ అయ్యారు. ఫర్నీచర్ కొనుగోలులో ఐఎంఎస్ డైరెక్టర్లు 70 శాతం ఎక్కువ ధర చెల్లించినట్లు గుర్తించారు. అచ్చెన్నాయుడు – టెలి హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ టెలి హెల్త్ సంస్థకు మాత్రమే కాంట్రాక్ట్ పనులు అప్పగించాలని నాడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్న కె.అచ్చెన్నాయుడు స్వయంగా ఐఎంఎస్ డైరెక్టర్ డాక్టర్ సీ.కే.రమేష్‌కుమార్‌కు లేఖ రాశారు. దీంతో ఏ టెండర్ పిలవకుండానే నామినేషన్ పద్ధతిలో ఆయన, టెలి హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు కాంట్రాక్ట్ పనులు అప్పగించారు. టోల్‌ఫ్రీ సర్వీసులు, ఈసీజీ సర్వీసులకు సంబంధించి ఐఎంఎస్ డైరెక్టర్ డాక్టర్ సీ.కే.రమేష్‌కుమార్ ఆ సంస్థతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదర్చుకున్నారు. ఇదీ కాంట్రాక్ట్ రేటు వివిధ అవసరాలతో పాటు, సహాయం కోరుతూ టోల్ ఫ్రీ సర్వీసుకు రోగులు చేసే ప్రతి కాల్‌కు (ఆ కాల్ అటెండ్ చేయకపోయినా సరే) నెలకు రూ.1.80, రోగులకు చేసే ప్రతి ఈసీజీకి రూ.480 చొప్పున చెల్లించేలా డాక్టర్ రమేష్‌కుమార్ ఆ సంస్థతో ఎంఓయూ చేసుకున్నారు. ఆ విధంగా ఎలాంటి విచారణ లేకుండా దాఖలు చేసిన అన్ని బిల్లులను టెలి హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెల్లించినట్లు విజిలెన్సు దర్యాప్తులో గుర్తించారు. అర్హత లేని వారితో పరీక్షలు అయితే ఇక్కడ కూడా టెలి హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిబంధనలు ఉల్లంఘించింది. ఎంఓయూ ప్రకారం వైద్య పరీక్షల కోసం డీఎం కార్డియాలజిస్టులను నియమించుకోవాల్సి ఉన్నప్పటికీ, పీజీ డిప్లొమా క్లినికల్ కార్డియాలజిస్టులను ఏర్పాటు చేసుకుని పని కానిచ్చారు. ప్రతి వైద్య పరీక్షకు పక్కాగా బిల్లులు పొందారు. టెలి హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు బిల్లులు కుదుర్చుకున్న ఎంఓయూ ప్రకారం ఐఎంఎస్ డైరెక్టర్లు డాక్టర్ సీ.కే.విజయకుమార్, డాక్టర్ జి.విజయకుమార్ ఇద్దరూ టెలి హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు టోల్‌ఫ్రీ సర్వీస్‌కు గానూ రూ.4.15 కోట్లు, ఈసీజీ పరీక్షలకు సంబంధించి రూ.3.81 కోట్లు చెల్లించారు. ఎస్టీపీ–జలం ఎన్విరాన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి ఈఎస్ఐ ఆస్పత్రిలో మురుగునీటి పారిశుద్ధ్య కేంద్రం (ఎస్పీటీ) ఏర్పాటు కోసం ఎలాంటి టెండర్లు పిలవకుండానే అప్పుడు ఐఎంఎస్ డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్ సీ.కే.రమేష్‌కుమార్, జలం ఎన్విరాన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు రూ.1.94 కోట్ల మొత్తానికి వర్క్ ఆర్డర్ ఇచ్చారు. ఇందు కోసం కనీసం ప్రభుత్వం నుంచి అనుమతి కూడా తీసుకోలేదు. దీంతో పాటు, రాజమండ్రి, విజయవాడ, తిరుపతిలోని ఈఎస్ఐ ఆస్పత్రుల్లోని ఎస్పీటీలు, కర్నూలు జిల్లా అదోనిలోని డయాగ్నస్టిక్ కేంద్రంలో ఉన్న ఎస్పీటీ.. అలా మొత్తం నాలుగు ఎస్‌పీటీల వార్షిక నిర్వహణ కాంట్రాక్ట్ కూడా డాక్టర్ రమేష్‌కుమార్, జలం ఎన్విరాన్మెంట్ సంస్థకు రూ.3.49 కోట్లకు అప్పగించారు. వాస్తవానికి ఆ కేంద్రాలేవీ పని చేసే స్థితిలో లేవు. అదోనిలో తొలుత ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్ కేంద్రాన్ని 2 కిలోమీటర్ల దూరంలో మరో చోటకు తరలించారు. రెండేళ్ల క్రితం ఆ కేంద్రాన్ని తరలించినా, తొలుత డయాగ్నస్టిక్ కేంద్రం ఏర్పాటు చేసిన ప్రదేశం వద్ద ఉన్న ఎస్‌పీటీకి వార్షిక నిర్వహణ వ్యయం చెల్లిస్తూనే ఉన్నారు. ఇంఛార్జ్ సివిల్ సర్జెన్ ఇస్తున్న ఒక సర్టిఫికెట్‌ను ఆధారంగా చేసుకుని ఐఎంఎస్ డైరెక్టర్లు ఆ బిల్లు చెల్లిస్తున్నారు. బయోమెట్రిక్ ఉపకరణాలు హైదరాబాద్‌కు చెందిర ప్రొడిగీ కంప్యూటర్స్–ల్యాప్టాప్స్ సంస్థ డిఐఎంఎస్‌కు 100 బయోమెట్రిక్ ఉపకరణాలు సరఫరా చేసింది. అప్పుడు ఐఎంఎస్ డైరెక్టర్‌గా డాక్టర్ సీ.కే.రమేష్‌కుమార్ ఉన్నారు. యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తూ, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ మార్గదర్శకాలను బేఖాతరు చేస్తూ, డాక్టర్ రమేష్‌కుమార్ ఒక్కో బయోమెట్రిక్ ఉపకరణానికి ఏకంగా రూ.70,670 చెల్లించారు. వాస్తవానికి మార్కెట్లో ఒక్కో బయోమెట్రిక్ ఉపకరణం ధర కేవలం రూ.16,992 మాత్రమే. అయినా ఓపెన్ టెండర్లకు వెళ్లకుండా నామినేషన్ పద్ధతిలో ప్రొడిగీ కంప్యూటర్స్ నుంచి 100 బయోమెట్రిక్ ఉపకరణాలు కొనుగోలు చేసిన డాక్టర్ రమేష్‌కుమార్, అందుకోసం రూ.53.67 లక్షలు అదనంగా చెల్లించారు. వాటిలో చాలా వరకు యంత్రాలు పని చేయడం లేదని విజిలెన్సు అధికారులు దర్యాప్తు సమయంలో గుర్తించారు. -
అచ్చెన్న అరెస్ట్‌ను సమర్థించిన బీజేపీ..
సాక్షి, గుంటూరు: ఈఎస్ఐ స్కాంలో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్‌ను బీజేపీ సమర్థించింది. ఎవరు అవినీతికి పాల్పడినా చర్యలు తీసుకోవాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ పాలనలో భారీగా అవినీతి జరిగిందన్నారు. అవినీతిపరులపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల ముందే వైఎస్ జగన్ చెప్పారని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. (‘చంద్రబాబు, లోకేష్ జైలుకెళ్లక తప్పదు’) శిక్ష అనుభవించాల్సిందే.. విజయవాడ: ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు పాత్ర రుజువైందని బీజేపీ అధికార ప్రతినిధి లక్ష్మీపతి రాజా అన్నారు. తప్పు చేసిన వాళ్లు శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడిన సొమ్మును అచ్చెన్నాయుడు నుంచి రికవరీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈఎస్ఐ స్కాం విషయంలో ప్రధానిమంత్రి మీద కూడా అచ్చెన్నాయుడు గతంలో బురద చల్లారని గుర్తుచేశారు. ఈఎస్ఐ స్కాంలో ప్రధాని పేరు ప్రస్తావిస్తే సహించేది లేదన్నారు. అచ్చెన్నాయుడును కిడ్నాప్ చేశారని చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. అచ్చెన్నాయుడుని ఇంటికెళ్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. ఈఎస్ఐ స్కాంలో అవినీతి జరిగిందని ఏసీబీ అధికారులు కూడా ధ్రువీకరించారని లక్ష్మీపతి రాజా పేర్కొన్నారు. (అచ్చెన్న అరెస్ట్.. చంద్రబాబు కొత్త డ్రామా) అచ్చెన్నాయుడు అరెస్ట్ సబబే.. తూర్పుగోదావరి: టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ సబబేనని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు. ప్రతి పక్షనేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. బీసీలందరూ బయటకు వచ్చి నిరసన తెలపాలని ఆయన మాట్లాడటం దారుణమని సోము వీర్రాజు పేర్కొన్నారు. -
‘చంద్రబాబు, లోకేష్ జైలుకెళ్లక తప్పదు’
సాక్షి, శ్రీకాకుళం: ఈఎస్ఐ స్కాంలో టీడీపీ ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడును అరెస్ట్ చేస్తే కిడ్నాప్ అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు వక్రీకరిస్తున్నారని రాష్ట్ర రహదారులు,భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నేరం జరిగినప్పుడు అరెస్ట్ సర్వసాధారణం అన్నారు. చంద్రబాబు,లోకేష్ వ్యాఖ్యలు దురదృష్టకరమని, తప్పు చేసిన వ్యక్తిని వదిలేసి బీసీలకు ఆపాదిస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో బీసీ ఓట్లతో గెలిచిన చంద్రబాబు.. వారిని గాలికొదిలేశారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. తప్పు ఎవరు చేసినా శిక్ష తప్పదని మంత్రి కృష్ణదాస్ స్పష్టం చేశారు. (టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్) అక్రమాలకు పాల్పడ్డారు: మంత్రి కన్నబాబు కాకినాడ: ఈఎస్ఐలో అవినీతి జరిగినట్లు విజిలెన్స్ నివేదిక వచ్చిందని.. ఆ స్కాంలో అచ్చెన్నాయుడుకు ప్రమేయం ఉందని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఈఎస్ఐ స్కాంలో ఆయనను ఏసీబీ అరెస్ట్ చేసిందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అచ్చెన్నాయుడు నకిలీ బిల్లులు సృష్టించి పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఏ ఒక్కరినీ వదిలిపెట్టం: మంత్రి జయరాం గత ప్రభుత్వ హయాంలో ఈఎస్ఐలో భారీ అవినీతి జరిగిందని.. మెడిసిన్ కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారని మంత్రి జయరాం తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి పనిని అనినీతిమయం చేశారన్నారు. అవినీతి కేసులో చంద్రబాబు,లోకేష్ కూడా జైలుకెళ్లక తప్పదన్నారు. అవినీతిలో పాలు పంచుకున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని మంత్రి జయరాం పేర్కొన్నారు. (అచ్చెన్న అరెస్ట్.. చంద్రబాబు కొత్త డ్రామా) గత ప్రభుత్వంలో ప్రతి పనిలో అవినీతి జరిగింది.. విశాఖపట్నం: టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతికి అచ్చెన్నాయుడు అరెస్ట్ నిదర్శనమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి పనిలో అవినీతి జరిగిందని ఆయన ధ్వజమెత్తారు. అచ్చెన్నాయుడు చేసిన అవినీతి 150 కోట్ల రూపాయల పైనే ఉంటుందని, ఇందులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూడా వాటా ఉంటుందని ఆరోపించారు. తన నియోజకవర్గంలో పని చేస్తున్న ఒక ఎస్సీ మహిళను తన మాట వినలేదని అచ్చెన్నాయుడు సస్పెండ్ చేయించారని, ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించారని గుర్తు చేశారు. చట్టం ముందు అందరూ సమానులే గుంటూరు: ప్రజాస్వామ్యంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. అచ్చెన్నాయుడు, చంద్రబాబు, లోకేష్.. ఎవరైనా చట్టం ముందు సమానులే అంటూ అంబటి రాంబాబు ట్విటర్లో పేర్కొన్నారు. -
నకిలీ బిల్లులతో అచ్చెన్నాయుడు స్కాం
-
ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ అరెస్ట్
-
ఏసీబీ అదుపులోకి అచ్చెన్నాయుడు
-
కుంభకోణంలో అచ్చెన్నాయుడి పాత్ర
సాక్షి, అమరావతి : ఈఎస్ఐ స్కాంలో టీడీపీ ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు పాత్ర ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఏసీబీ అధికారులు తెలిపారు. విజిలెన్స్ దర్యాప్తులోనూ ఇది తేలిందని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు అచ్చెన్నాయుడు అరెస్ట్ అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన ఏసీబీ డైరెక్టర్ రవికుమార్ స్కాం వివరాలను వెల్లడించారు. ఈఎస్ఐ స్కాంలో విజిలెన్స్ నివేదిక వచ్చిందని, దాని ప్రకారమే తాము దర్యాప్తు చేశామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో కార్మికశాఖా మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు నకిలీ బిల్లులు సృష్టించిన పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఏసీబీ దర్యాప్తులో అక్రమాలు నిర్దారణ అయ్యాక నిందితులను అరెస్ట్ చేశామని చెప్పారు. (టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్) విజిలెన్స్ దర్యాప్తులో భాగంగా రూ. 988.77 కోట్ల విలువైన మందులతో పాటు వైద్య పరికరాల కొనుగోలులో సుమారుగా రూ.150 కోట్లపైనా అవినీతి అక్రమాలు జరిగినట్లు తేలిందని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు లేకుండా నామినేషన్ పద్దతిలో కట్టబెట్టారని వెల్లడించారు. విజిలెన్స్ దర్యాప్తులో అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పట్లు తేలిన తరువాతనే ఏసీబీ విచారణ జరిపినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామని, వారిలో అచ్చెన్నాయుడుతో పాటు తిరుపతికి చెందిన ఈఎస్ఐ డైరెక్టర్ సికే రమేష్ కుమార్, రాజమండ్రికి చెందిన విజయ్ కుమార్ ఉన్నారని తెలిపారు. -
టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్ట్
-
ఈఎస్ఐ కుంభకోణం : 155 కోట్ల రూపాయల అవినీతి
సాక్షి, శ్రీకాకుళం : మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆయన్ని ఆరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణంలో ఆయన ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది. ఈ కేసు విచారణలో భాగంగానే అచ్చెన్నాయుడిని ఏసీబీ అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో ఆయనతో పాటు కుటుంబ సభ్యులన్నీ కూడా అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ స్కాంలో అప్పటి ఈఎస్ఐ డైరెక్టర్ రమేష్ కుమార్ హస్తం కూడా ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. టెండర్లు పిలవకుండా నామినేషన్ల పద్దతిలో అచ్చెన్నాయుడు చెప్పిన కంపెనీకు కోట్ల రూపాయల ఆర్డర్లు ఇచ్చినట్లు నివేదికలో తేలింది. మొత్తం 155 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఏసీబీ తేల్చింది. ఏసీబీ తాజా దూకుడుతో స్కాములో పాలుపంచుకున్న వారి గుండెల్లో దడ మొదలైంది. (అచ్చెన్న లీలలు ఇన్నన్ని కావయా...) అసలు స్కాం.. టీడీపీ హయాంలో అప్పటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హయాంలోనే కుంభకోణం జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మంత్రి చొరవతోనే డైరెక్టర్లు రూ. 975 కోట్ల మందుల కొనుగోలు చేసి, అందులో 100 కోట్లకు పైగా నకిలీ బిల్లులను సృష్టించినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. అయితే మందుల కొనుగోలుకు ప్రభుత్వం రూ. 293 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే, 698 కోట్ల రూపాయలకు మందులను కొనుగోలు చేసినట్లు ప్రభుత్వానికి చూపి ఖజానాకు 404 కోట్ల రూపాయలు నష్టం కలిగించారు. అంతేకాకుండా ఈఎస్ఐ స్కాంకు పాల్పడిన లెజెండ్ ఎంటర్ప్రైజెస్, ఓమ్ని మెడీ, ఎన్వెంటర్ పర్ఫామెన్స్ సంస్థలకు సదరు డైరక్టర్లు లాబ్ కిట్ల కొనుగోలు పేరుతో 85 కోట్లు చెల్లించారు. (కార్మికుల సొమ్ము కట్టలపాము పాలు) 2018-19 సంవత్సరానికి 18 కోట్ల విలువైన మందులు కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో ఉంటే , అందులో కేవలం రూ. 8 కోట్లు మాత్రమే వాస్తవ ధరగా ప్రకటించి మిగతా నిధులు స్వాహా చేశారు. అంతేగాక మందుల కొనుగోలు, ల్యాబ్ కిట్లు ,ఫర్నిచర్, ఈసీజీ సర్వీసులు బయోమెట్రిక్ యంత్రాల కొనుగోలు లో భారీగా అక్రమాలు జరిగినట్టుగా కూడా గుర్తించారు. వాస్తవానికి ఒక్కో బయోమెట్రిక్ మిషన్ ధర రూ.16,000 అయితే ఏకంగా రూ. 70 వేల చొప్పున నకిలీ ఇండెంట్లు సృషించి అక్రమాలకు పాల్పడినట్లు నివేదికలో తేలింది. దీనిపై ఏసీబీ లోతైన విచారణ జరుపుతోంది. -
బెయిల్‌పై విడుదలైన ఈఎస్ఐ స్కామ్ నిందితులు
-
హైదరాబాద్‌లో మొబైల్ వైరాలజీ ల్యాబ్
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ కట్టడికి దేశంలోనే తొలి మొబైల్ వైరాలజీ ల్యాబ్ హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. అంతర్జాతీయ ప్రమాణాలతో, అధునాతన సాంకేతికతతో రూపొందించిన బయోసేఫ్టీ లెవల్ (బీఎస్ఎల్)- 3 వైరాలజీ ల్యాబ్‌ను కేంద్రమంత్రులు గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ... దేశంలోనే పీపీఈ కిట్లను తయారు చేస్తున్నామన్నారు. ఢిల్లీ మర్కజ్ ఘటన లేకుంటే కరోనా కేసుల సంఖ్య ఇంత తీవ్రంగా ఉండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా నివారణకు కలిసికట్టుగా కృషి చేద్దామని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. వైరాలజీ ల్యాబ్ రూపకల్పన చేసినవారిని ఆయన అభినందించారు. (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా కాటు) కరోనా కట్టడికి అన్ని చర్యలు: కేటీఆర్ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. గబ్చిబౌలిలో 20 రోజుల్లోనే 1500 పడకలతో టిమ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కోవిడ్-19 చికిత్స కోసం 8 ప్రత్యేక హాస్పిటళ్లను ఏర్పాటు చేశామన్నారు. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించి వారికి వైద్య సహాయం అందిస్తున్నామని, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులకు అన్ని వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని చెప్పారు. పేద కుటుంబాలకు నెలకు రూ.1500 ఆర్థిక సాయం అందిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈఎస్ఐ మెడికల్ కాలేజీలో ఏర్పాటైన ఈ మొబైల్ వైరాలజీ ల్యాబ్‌లో కరోనాతోపాటు అనేక ఇతర వైరస్ల నిర్ధారణ పరీక్షలకు, పరిశోధనలు నిర్వహించవచ్చు. ఐ క్లీన్, ఐ సేఫ్ సంస్థల సహకారంతో డీఆర్డీవో తయారైన ఈ ల్యాబ్‌లో ప్రతిరోజు సుమారు వెయ్యి నిర్థారణ పరీక్షలు చేయవచ్చు. (హెచ్‌సీక్యూ మందుల అమ్మకాలపై ఆంక్షలు) -
హాజరు పడితేగా...?
విజయనగరం ఫోర్ట్: బయోమెట్రిక్‌తో సిబ్బంది సమయపాలన పాటిస్తారని భావిస్తే ఆ పరికరాలు పనిచేయకపోవడం వారికి ఇప్పుడు అవకాశంగా మారింది. గత ప్రభుత్వం నాసిరకంగా పరికరాలు సమకూర్చడంతో అవి ఏడాది తిరగకుండానే మూలకు చేరి... దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా ఈఎస్ఐ డయోగ్నోస్టిక్ సెంటర్, డిస్పెన్సరీలో ఉద్యోగులు సమయపాలన పాటించేందుకు గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ పరికరం మూలకు చేరింది. నాసిరకం పరికరాలను అప్పటి ప్రభుత్వం సరఫరా చేయడంతో ఏర్పాటు చేసిన కొద్ది నెలలకే దిష్టి బొమ్మలా మారింది. పాడైన వెంటనే ఈఎస్ఐ అధికారులు పంపించినప్పటికీ నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ఒక్కో పరికరం రూ.16 వేలు విలువ చేస్తే రూ.72 వేలకు కొనుగోలు చేసినట్టు నివేదిక ఇచ్చారు. దీనిని బట్టి అప్పటి టీడీపీ పాలకులు ఎంత మేర అవినీతికి పాల్పడ్డారో అర్థమవుతోంది. ఏడాది తిరగకుండానే మూలకు.. ఈఎస్ఐ డయోగ్నోస్టిక్ సెంటర్లో బయోమెట్రిక్ పరికరం ఏర్పాటు చేసిన కొద్ది నెలలకే మూలకు చేరింది. 2018 జనవరి నెలలో ఇక్కడి వైద్య సిబ్బంది హాజరు నిమిత్తం వీటిని ఏర్పాటు చేశారు. 2018 నవంబర్ నెలలో అది మూలకు చేరింది. అప్పట్లోనే అధికారులు బాగు చేయించాల్సిందిగా ఈఎస్ఐ డైరెక్టర్‌కు పంపించారు. కాని అధికారులు ఇంతవరకు బాగు చేయించలేదు. వేలాది రుపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన వాటిని బాగు చేయించకుండా వదిలేశారు. సమయ పాలన గాలికి... బయోమెట్రిక్ లేకపోవడంతో వైద్య సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారు సమయపాలనకోసం ఏర్పాటు చేసిన పరికరాలు పనికిరాకుండా పోవడంతో వారిలో క్రమశిక్షణ లోపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వైద్యులు, సిబ్బంది ఉదయం 9గంటలనుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పనిచేయాల్సి ఉన్నా... 10 గంటలకు, 10:30 గంటలకు సిబ్బంది విధులకు హాజరు అవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై డయోగ్నోస్టిక్ సెంటర్ సూపరింటెండెంట్ అల్లం కృష్ణారావువద్ద సాక్షి ప్రస్తావించగా 2018 నవంబర్ నెలలో బయోమెట్రిక్ పాడైందనీ, దానిని బాగు చేయించాలని ఈఎస్ఐ డైరక్టర్ కార్యాలయానికి పంపించామనీ, కానీ ఇప్పటివరకూ రాలేదని తెలిపారు. -
బీసీ నాయకుడైతే అవినీతికి పాల్పడవచ్చా?
-
టీడీపీ నేతలు జైలుకెళ్లడం ఖాయం
-
టీడీపీ దుర్మార్గాలు బయటకు వస్తున్నాయి
-
అచ్చెన్న లీలలు ఇన్నన్ని కావయా...
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఈఎస్ఐలో మందులు, పరికరాల కొనుగోళ్ల స్కామ్ గురించి ఇప్పుడు రాష్ట్రమంతా గగ్గోలు పెడుతున్నారు.. దానిని మించిన ఎన్నో కుంభకోణాలు శ్రీకాకుళం జిల్లావాసులకు తెలుసు.. అచ్చెన్నాయుడు కన్నేస్తే కోట్లాది రూపాయలు హాంఫట్ కావలసిందే. ఆయన అవినీతికి రాగద్వేషాలు లేవు. అయ్యో పాపం కార్మికులని గానీ.. తిత్లీ తుపానులో తన జిల్లావాసులు సర్వం కోల్పోయారని గానీ ఆయనకు బాధ ఉండదు. ఎక్కడ దొరికితే అక్కడ స్వాహా చేయడమే ఆయన తత్వం. నీరు చెట్టు పథకం పేరుతో కోట్లు కొల్లగొట్టిన అనుభవాలు గానీ.. తిత్లీ తుఫాన్ పరిహారం పంపిణీలో అన్యాయమైపోయిన సామాన్యుల కన్నీటి గాథలు గానీ ఇవే చెబుతున్నాయి. ఈ రెండింటిలోనూ వందల కోట్ల అవినీతి జరిగింది. వీటిపై సమగ్ర విచారణ చేపడితే మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడితో పాటు ఎమ్మెల్యే బెందాళం అశోక్, నాటి టీడీపీ ఎమ్మెల్యేల బాగోతమంతా బయటపడుతుంది. ‘తిత్లీ‘ని మించిన ఉపద్రవం తిత్లీ తుఫాన్ సమయంలో గ్రామాల వారీగా కాగితాల్లో పంచేసుకుని పరిహారాన్ని కొట్టేశారు. గ్రామాల్లో ఉన్న భూములను తమకింత అని చూపించుకుని, ఫలానా చెట్లు పడిపోయాయని చెప్పి తిత్లీ పరిహారాన్ని నొక్కేశారు. ఏదో ఒక సర్వే నెంబర్‌తో భూమిని చూపించి, నచ్చినంత సంఖ్యలో చెట్లు పడిపోయినట్టు నమోదు చేయించుకుని కోట్లాది రూపాయల పరిహారాన్ని మింగేశారు. అచ్చెన్నాయుడు, అశోక్‌ల అడుగు జాడల్లో ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు కూడా పరిహారాన్ని పట్టేశారు. నేతల కుటుంబసభ్యుల పేరున ఎటువంటి భూములు లేనప్పటికీ వారి పేరున నష్టపరిహారాన్ని లక్షల రూపాయల్లో అందుకొన్నారు. ఇవన్నీ అప్పట్లోనే వెలుగు చూశాయి. కాకపోతే వారి పార్టీ అధికారంలో ఉండటంతో విచారణ జోలికి పోలేదు. ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం రావడం, అక్రమాలపై లిఖితపూర్వక ఫిర్యాదులు రావడం, వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిహారాన్ని పెంచడంతో అక్రమాల డొంక కదిలింది. కాకపోతే, తిత్లీ తుఫాను పరిహారాన్ని అప్పనంగా కాజేసిన తెలుగు తమ్ముళ్లు దర్యాప్తులో బయటపడకుండా ఉండేందుకు వ్యూహాత్మక ఎత్తుగడలు వేశారు. భూముల్లేకపోయినప్పటికీ పరిహారం పొందిన వారు మ్యూటేషన్ చేయించి, పట్టాదారు పాసు పస్తకాలను తయారు చేయించారు. కంచిలి, కవిటి మండలాల్లో ఎక్కువగా ఈ రకమైన అక్రమాలు జరిగాయి. ఉదాహరణలివి.. ►కవిటి రెవెన్యూ ప్రగడపుట్టుగకు చెందిన బి.సంహిత పేరిట రూ.1,03,500 తిత్లీ తుఫాన్ నష్టపరిహారాల మంజూరులో పరిహారం నమోదైంది. ఒక సర్వే నెంబరులో 3.93 ఎకరాల భూమి ఉన్నట్టు జాబితాలో నమోదు చేశారు. వాస్తవానికి రెవెన్యూ రికార్డులలో ఈ భూమి యజమాని పేరు ప్రసాదరావుగా ఉంది. ►కవిటి రెవెన్యూలో డొంకపుట్టుగకు చెందిన మరో ఆసామీ డి.వల్లభరావుకు తిత్లీ తుఫాన్‌కు సంబంధించి కొబ్బరి నష్టపరిహారం రూ.1,56,000 అందించేందుకు జాబితాలో పేర్కొన్నారు. ఆయన పేరున 4.35 ఎకరాల భూమి ఉన్నట్టుగా పరిహారాల జాబితాలో చూపించారు. వాస్తవానికి ఆయనకు 0.34 సెంట్లు భూమి మాత్రమే ఉంది. ►ఎర్రగోవిందపుట్టుగలో నివసిస్తున్న రమణమూర్తికి తిత్లీ తుఫాన్లో తనకున్న 4.86 ఎకరాల భూమి నష్టపోయిందని జాబితాలో ప్రకటించారు. అయితే ఈ సర్వే నెంబరులో ఇతనికి రెవెన్యూ రికార్డుల ప్రకారం 1.36 ఎకరాలు మాత్రమే ఉందని రికార్డులు చెబుతున్నాయి. వేలాది మంది ఇదే రకంగా పరిహారాన్ని కొట్టేశారు. జిల్లా లో 52,164మంది కొబ్బరి రైతులు, 78,108మంది జీడి రైతులు తిత్లీ భీభత్సానికి నష్టపోయినట్టుగా పరిహారం జాబితాల్లో చూపించారు. ఎన్నికలకు ముందు దాదాపు రూ.297 కోట్ల వరకు పరిహారం కింద అందించారు. ఈ లెక్కన అనర్హులకు ఎన్ని కోట్లు వెళ్లాయో వారికే తెలియాలి. భూముల్లేని టీడీపీ సానుభూతి పరులకు భూములున్నట్టుగా చూపించి, తక్కువ భూమి ఉన్న టీడీపీ శ్రేణులకు ఎక్కువ భూమి ఉన్నట్టుగా నమోదు చేసి, పల్లం భూమిని మెట్ట భూమిగా నమోదు చేసి, పంచాయతీకి చెందని వ్యక్తులను స్థానికంగా చూపించి అప్పట్లో పరిహారం జాబితాలు తయారు చేశారు. నీరు చెట్టు.. అవినీతికి మెట్టు నీరు చెట్టు పనులైతే అవినీతి ఊట బావిలా పనికొచ్చాయి. రూ.5 లక్షల విలువ కన్నా ఎక్కువగా ఉండే పనుల కాంట్రాక్ట్‌లను తమ అనుయాయులకు నామినేటెడ్ పద్ధతిలో కట్టబెట్టారు. జిల్లాలో రూ.427.24 కోట్ల విలువైన 5696 పనుల్లో అత్యధికం అలా దక్కించుకున్నవే. వీటిలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. పనులు సక్రమంగా సాగలేదు. మట్టి తవ్వకాల కింద క్యూబిక్ మీటర్‌కు రూ.29కు గాను రూ.82.80 చెల్లించారు. చెరువు గట్లపై మట్టిని గట్టి పరచకుండా, ఉన్న దాని కంటే అధికంగా నమోదు చేసి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు. నిబంధనల ప్రకారం 50 ఎకరాలు ఆయకట్టు పైబడిన చెరువుల్లో మాత్రమే నీరు చెట్టు పనులు చేపట్టాలి. కానీ అందుకు భిన్నంగా 50 ఎకరాలు కంటే తక్కువ ఉన్న చెరువుల్లో కూడా పనులు నిధులు దురి్వనియోగం చేశారు. గెడ్డ లేదా వాగు నీటి ప్రవాహాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, ఎటువంటి డిజైన్ లేకుండా చెక్‌డ్యామ్‌లను నిర్మించారు. నాసిరకంగా కాంక్రీటు పనులు చేపట్టారు. 10 హెచ్ నిబంధనలకు విరుద్ధంగా మట్టి పని చేపట్టి లబి్ధపొందారు. తక్కువ కొలతలు కలిగిన రాళ్లను ఉపయోగించి గ్రోయిన్లను నిర్మించారు. ఇలా నీరుచెట్టులో అనేక అక్రమాలకు పాల్పడ్డారు. అచ్చెన్నాయుడి అక్రమ సంపాదనపై సీఎంకు లేఖ టెక్కలి: మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన అక్రమాలు, అవినీతి కార్యకలాపాలపై ఆధారాలతో సహా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేఖ అందజేస్తున్నామని వైఎస్సార్ సీపీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్ అన్నారు. సోమవారం టెక్కలి వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. కార్మిక శాఖ మంత్రిగా వ్యవహరించిన అచ్చెన్నాయుడు బినామీ కంపెనీల పేర్లతో ఈఎస్ఐ మందులు, కాస్మొటిక్స్ కొనుగోలులో రూ.975 కోట్ల అవినీతికి పాల్పడినట్లు విజిలెన్స్ దర్యాప్తులో వెల్లడైందన్నారు. గత ఐదేళ్ల కాలంలో జిల్లాలో గ్రానైట్, ఇసుక కుంభకోణాలు, బీసీ కార్పొరేషన్ రుణాల్లో అక్రమాలు, సింగిల్ టెండర్ విధానంతో సొంత అన్నకు టెండర్లు కట్టబెట్టడం, ధాన్యం రవాణాకు వచ్చిన కోట్లాది రూపాయలు సొంత ఖాతాలకు మళ్లించుకోవడం, మినుముల కుంభకోణంతో కోట్ల రూపాయలు సొంత ఖాతాలకు మళ్లించుకోవడం, టెక్కలిలో సింగిల్ టెండర్ విధానంతో తన బినామీ లాడి శ్రీనివాసరావుకు ఆర్టీసీ టెండర్లు కట్టబెట్టడం, కేశినేని, దివాకర్ ట్రావెల్స్‌కు అడ్డగోలుగా రవాణా లైసెన్సులు జారీ చేయడంతోపాటు వేలాది కోట్ల రూపాయలు అక్రమాలకు పాల్పడిన అచ్చెన్నాయుడు ఈ రోజు నీతివంతుడిలా మాట్లాడాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేవలం 2 ఎకరాలు కలిగిన కింజరాపు కుటుంబ సభ్యులైన ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడు, హరిప్రసాద్, ప్రభాకర్‌కు ఈ రోజు వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని తిలక్ ప్రశ్నించారు. కింజరాపు కుటుంబ సభ్యుల అక్రమ ఆస్తులను ఆధారాలతో సహా బహిర్గతం చేయడానికి మార్చి 2న టెక్కలి అంబేడ్కర్ జంక్షన్ వద్ద బహిరంగ చర్చా వేదిక నిర్వహిస్తామని...అచ్చెన్నాయుడుకు దమ్ముంటే చర్చా వేదికకు వచ్చి తన నిజాయితీ నిరూపించుకోవాలని తిలక్ సవాల్ విసిరారు. -
ఈఎస్ఐ స్కామ్ సిగ్గు చేటు: ఎమ్మెల్యే చింతల
-
ఈఎస్ఐ కుంభకోణంపై వెల్లువెత్తున్న నిరసనలు
-
‘టీడీపీ నేతలు వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారు’
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ నేతలు శ్రీనివాసరెడ్డి, పత్తిపాటి పుల్లారావు, పితాని సత్యారాయణలకు చంద్రబాబు సహాయకుడు శ్రీనివాసరావు అక్రమాస్తులతో సంబంధాలు ఉన్నాయని ఏపీ టెక్నాలిజీ మాజీ చైర్మన్ కొయ్య ప్రసాద్‌రెడ్డి అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్టు వైఎస్సార్సీపీ అయిదేళ్ల నుంచి చెబుతోందని తెలిపారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకి ఈఎస్ఐ కుంభకోణంతో ప్రమేయం ఉందన్నారు. కానీ టీడీపీ నేతలు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. (ఏం బతుకులు మీవి..?: విజయసాయిరెడ్డి) అచ్చెన్నాయుడు బీసీ నేత అని టీడీపీ నాయకులు వెనుకేసుకు వస్తున్నారని ప్రసాద్‌రెడ్డి విమర్శించారు. బీసీ నేతలను దోచుకోమని ఎవరైనా చెప్పారా అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు దివాకర్ రెడ్డి, నారాయణ, పీలా గోవింద్ అక్రమాలు బయటకు వస్తే కక్ష సాధింపు అని టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. విశాఖలో రాజధానికి నేవి అనుమతి ఇవ్వడం లేదని అత్యంత దారుణంగా పచ్చ మీడియా ప్రచారం చేస్తోందని ఆయన దుయ్యబాట్టారు. (అక్రమాలపై విచారణకే ‘సిట్’) టీడీపీ నేతలు పనిగట్టుకొని వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారని ప్రసాద్‌రెడ్డి ఫైర్ అయ్యారు. పేదలకు ఇళ్లు ఇవ్వాలని భూసేకరణ జరుపుతుంటే.. బండారు సత్యనారాయణ లాంటి అక్రమార్కులు తప్పుడు ప్రచారంతో ప్రజలను రెచ్చగొడుతున్నారని తెలిపారు. నదుల అనుసంధానం ద్వారా రైతులకు మేలు చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారని ఆయన గుర్తు చేశారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశిస్తే రేషన్ కార్డులు తొలగిస్తున్నారని టీడీపీ దుష్ప్రచారం చేస్తుందన్నారు. ఈఎస్ఐ స్కాంలో కాంట్రాక్టర్ లోకేష్‌కు అత్యంత ఆప్తుడని ప్రసాద్‌రెడ్డి తెలిపారు. (రోగుల అందం.. అదిరిందయ్యా చంద్రం!) -
ఈఎస్ఐ అక్రమాలు
-
అక్రమాలపై విచారణకే ‘సిట్’
విజయనగరం గంటస్తంభం: రాజధాని అమరావతి నిర్మాణంలో అక్రమాలు జరిగాయని, దానిపై విచారణ జరిపేందుకే ‘సిట్’ను నియమించినట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఈ నెల 24వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన ఏర్పాట్లపై శనివారం కలెక్టరేట్లో అధికారులతో మంత్రి బొత్స సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అమరావతిలో అక్రమాలు, దోపిడీ జరగలేదని, దమ్ముంటే విచారణ చేయాలని గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులే అన్నారని గుర్తుచేశారు. విచారణ చేసేందుకు ‘సిట్’ వేస్తే ఇప్పుడు కక్షపూరితం అంటున్నారని మండిపడ్డారు. అమరావతి అభివృద్ధి కోసం రూ.17,800 కోట్లుతో టెండర్ వేసి, అంచనాలు పెంచి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆర్కీవ్స్ ఫీజ్ కింద రూ.842 కోట్ల చెల్లింపులు చేసేందుకు ఒప్పందం చేసుకుని, రూ.300 కోట్లకుపైగా చెల్లించారన్నారు. దీనిపై విచారణ జరిపిస్తున్నామన్నారు. వాస్తవాలను నిర్ధారించేందుకు ‘సిట్’ వేసినట్టు వెల్లడించారు. కులాలు, పార్టీల వారీగా చట్టాలు తెచ్చుకోవాలా? ఈఎస్ఐ కుంభకోణంలో బీసీ మంత్రిని కావున టార్గెట్ చేస్తున్నారన్న టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు వాఖ్యలను మంత్రి బొత్స తప్పుబట్టారు. గతంలో అసెంబ్లీలో టీడీపీ నాయకులు తనను ఉద్దేశించి ఎన్నో మాటలన్నారని, అప్పుడు నేను బీసీ మంత్రిని కాదా? అని ప్రశ్నించారు. టీడీపీలో ఉన్నవారే బీసీలా? అని నిలదీశారు. చట్టం ముందు ఎవరైనా ఒక్కటేనని, తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందేనని తేల్చిచెప్పారు. విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు. కులాలు, పార్టీల వారీగా చట్టాలు తెచ్చుకోవాలా? అని వ్యాఖ్యానించారు. అక్రమాలు గురించి మాట్లాడితే ప్రధానమంత్రి పేరు చెబుతున్నారని, అక్రమాలు చేయమని ఆయన చెప్పారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఒక విధానం చెబుతుందని, దోచేయాలని చెప్పదన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, బొత్స అప్పలనరసయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఈఎస్ఐ స్కామ్ :అవినీతి సొమ్మును రికవరీ చేయాలి
-
‘బాబు, అచ్చెన్నాయుడు విచారణ తప్పించుకోలేరు’
సాక్షి, విజయవాడ: ఈఎస్ఐ స్కామ్‌లో టీడీపీ నేతలు జైలుకి వెళ్లడం ఖాయమని మంత్రి గుమ్మనూరి జయరాం అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలు దోపిడీ చేసి తప్పించుకునేందుకు బీసీ కార్డు తెరపైకి తీసుకువస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు, రాజకీయాలు చేసినా చంద్రబాబు, అచ్చెన్నాయుడు అవినీతి విచారణ నుంచి తప్పించుకోలేరని ఆయన తెలిపారు. ఈఎస్ఐ స్కాంలో చంద్రబాబునాయుడికి కూడా వాటా ఉందని మంత్రి గుమ్మనూరి జయరాం ఆరోపించారు. కార్మికుల్లో అత్యధికులు బీసీలే ఉంటారని.. అలాంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్మికులను టీడీపీ నేతలు దోచుకున్నారని ఆయన మండిపడ్డారు. దొంగలకు బీసీ, ఓసీ అనే తేడా ఉంటుందా అని అన్నారు. చంద్రబాబు డబ్బున్న బీసీలను మంత్రులు చేస్తే.. జగన్ పేద బీసీలను మంత్రులను చేశారని గుర్తుచేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా 60 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జగన్ కేబీనెట్లో అవకాశం కల్పించారని గుమ్మనూరి జయరాం తెలిపారు. (‘దోపిడీ జరిగింది వాస్తవం కాదా?’) చదవండి: (అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు విడ్డూరం: విష్ణుకుమార్) (కార్మికుల సొమ్ము కట్టలపాము పాలు!) -
ఆ బురద మాకు కూడా అంటిస్తారా?
సాక్షి, విశాఖ : విజిలెన్స్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ఈఎస్ఐ మందుల కుంభకోణం ఆంధ్రప్రదేశ్‌లో దుమారం రేపుతోంది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ..‘టెలీ మెడిసిన్ విషయంలో ప్రధానమంత్రి చెబితేనే చేశానని అచ్చెన్నాయుడు చెప్పడం హాస్యాస్పదం. కేంద్రం అభివృద్ధి పనులపై రాష్ట్రాలకు సూచనలు చేస్తుంది కానీ అవినీతి చేయమని చెప్పదు. టీడీపీ నేతలు తినడానికి అలవాటు పడ్డారు. మరో రాష్ట్రంలో తప్పు జరిగిందని అదే తప్పులు చేస్తాం అనడం సరికాదు. తినడానికి అలవాటు పడ్డారు అది మందులు కావచ్చు...మరేదైనా సరే అది దోచుకోవడమే. (కార్మికుల సొమ్ము కట్టలపాము పాలు!) చంద్రబాబు నాయుడుకి దగ్గర అవడానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. ఒక వార్డులో బీజేపీ నుంచి 300మంది నాయకులు టీడీపీలో చేరిపోయారని గంటా ప్రచారం విడ్డూరంగా ఉంది. టీడీపీ దూరం పెట్టిందని గంటా ఇలాంటి తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. గంటా కారు నంబర్ 1..అలాగే తప్పుడు ప్రచారం చేయడంలో కూడా ఆయన నంబర్ వన్. ఇలాంటి నాయకులను నమ్మడం వల్లే చంద్రబాబు నాయుడుకి 23 సీట్లు దక్కాయి. టీడీపీ చేరినవారంతా రూ.250 బ్యాచ్’ అని వ్యాఖ్యానించారు. (ఏపీ ఈఎస్ఐలో భారీ కుంభకోణం) చంద్రబాబు పాత్రపైనా విచారణ చేయాలి ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు అవినీతిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని బీజేపీ అధికార ప్రతినిధి కోట సాయికృష్ణ డిమాండ్ చేశారు. ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ..‘అచ్చెన్నాయుడు అవినీతిలో కూరుకుపోయాడు కాబట్టే మోదీ పేరు ప్రస్తావిస్తున్నారు. టీడీపీ అవినీతి బురద బీజేపీకి అంటించాలని చూస్తున్నారు. ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రపైనా విచారణ జరపాలి. టీడీపీ ప్రభుత్వం పాల్పడిన అవినీతి కుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అచ్చెన్నాయుడు చెప్పిన మాటలకు...ఈఎస్ఐకి రాసిన లేఖకు పొంతన లేదు’ అని అన్నారు. ఈఎస్ఐ స్కాం: వారిని శిక్షించాలి.. విజయవాడ: మరోవైపు ఈఎస్ఐలో భారీ కుంభకోణం వెలుగుచూడటంతో ఏపీలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కార్మికులకు చెందిన కోట్లది రూపాయల నిధులు దిగమింగిన మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణలతో పాటు అధికారులను శిక్షించాలంటూ విజయవాడ ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ కార్యాలయం ముందు సీపీఎం శనివారం ఆందోళనకు దిగింది. స్వాహా చేసిన సొమ్మును రికవరీ చేసి ఈఎస్ఐ అభివృద్ధికి వెచ్చించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. చందాదారులైన ఉద్యోగ,కార్మికలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అవినీతి నుంచి తప్పించుకునేందుకు కులం కార్డు వాడటం ఏంటని ప్రశ్నించారు. -
‘దోపిడీ జరిగింది వాస్తవం కాదా?’
సాక్షి, నెల్లూరు: టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు చేసిన దోపిడీపై విచారణ చేస్తే బీసీ అంటారా.. ఇదేం న్యాయమని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో కోట్లాది రూపాయాల మేర దోపిడీ చేసి.. ఇప్పుడు కులాలను తెరపైకి తీసుకువస్తున్నారని ఆయన మండిపడ్డారు. పోలీసులు ఒక నోటీసు ఇస్తేనే తనపై ఎన్నో ఆరోపణలు చేశారని అన్నారు. అప్పుడు బీసీలు గుర్తుకు రాలేదా అని అనిల్‌కుమార్ ధ్వజమెత్తారు. (కార్మికుల సొమ్ము కట్టలపాము పాలు!) తాము కూడా బీసీ నేతలమేనని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీలకు మంత్రి పదవి కూడా ఇచ్చారని అనిల్ కుమార్ గుర్తుచేశారు. అసెంబ్లీలోనే తనపై విమర్శలు చేశారని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ తరహాలోనే విచారణ జరిపాలని మాత్రమే సిఫారసు చేశామని ఆయన తెలిపారు. ఇక్కడ దోపిడీ జరిగింది వాస్తవం కాదా అని అనిల్ ప్రశ్నించారు. కులాలను తీసుకువచ్చి బయట పడాలనుకోవడం సరికాదని అనిల్ కుమార్ అన్నారు. -
కుంభకోణం
-
ఈఎస్ఐ స్కామ్‌లో అచ్చెన్నాయుడు
-
కార్మికుల సొమ్ము కట్టలపాము పాలు!
సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కార్మికుల సొమ్మును కాజేసిన పచ్చ నేతల అవినీతి బండారం బట్టబయలైంది. వైద్య పరికరాలు, మందుల కొనుగోళ్లు పనులను నామినేషన్‌పై అప్పగించాలని మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సిఫారసు లేఖ ఇచ్చినట్లు ఇప్పటికే విజిలెన్స్ విచారణలో వెలుగులోకి రావడం తెలిసిందే. అనంతరం కార్మిక శాఖ బాధ్యతలు చేపట్టిన నాటి మంత్రి పితాని సత్యనారాయణకు కూడా ఇందులో ప్రమేయం ఉన్నట్లు తాజా లేఖలు వెల్లడిస్తున్నాయి. కార్మిక రాజ్య బీమా సంస్థ పరిధిలోని దాదాపు 12.5 లక్షల మంది కార్మికులు, 38 లక్షల మంది కుటుంబ సభ్యులు గత సర్కారు అవినీతి వ్యవహారాల వల్ల సరైన వైద్యం పొందలేకపోయారు. ఆ ఇద్దరూ.. ఇష్టారాజ్యం నాటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నామినేషన్‌పై పనులు కట్టబెట్టాలని లేఖలో సూచించగా అనంతరం ఆ శాఖ బాధ్యతలు చేపట్టిన పితాని ఇష్టారాజ్యంగా చెల్లింపులు జరిపారు. ఈఎస్ఐ నిబంధనల ప్రకారం ముందు సరఫరా చేసిన వారికి ముందస్తు చెల్లింపులు చేయాలి. ఈమేరకు ఓ ఉన్నతాధికారి మెమో కూడా జారీ చేశారు. అయితే పితాని సత్యనారాయణ కార్మికశాఖ బాధ్యతలు చేపట్టగానే మరో మెమో ఇచ్చారు. 2017 నవంబర్ 28న అధికారులు ఇచ్చిన మెమోను అభయెన్స్‌లో పెడుతూ 2018 ఫిబ్రవరిలో మరో మెమో జారీ అయింది. ఈఎస్ఐ ఉన్నతాధికారులకు అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు రాసిన లేఖ పితాని తనకు నచ్చిన కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరిపి కమీషన్లు అందుకున్నారని పేర్కొంటున్నారు. ఆయన కుమారుడు చిన్న కాగితం రాసిచ్చినా ఆర్డర్లు ఇచ్చారు. 2019లో ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు జరిగిన చివరి కేబినెట్ సమావేశంలో 500కిపైగా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకం కోసం ఫైలు పెట్టారు. దీనిపై ‘సాక్షి’లో కథనం వెలువడటంతో అప్పటి సీఎస్ అనిల్‌చంద్ర పునేఠా ఈ ప్రతిపాదనను రద్దు చేశారు. ఐదేళ్లలో ఇద్దరు మంత్రులూ కార్మికుల కడుపుకొట్టారని, ఏ ఒక్కరికీ మెరుగైన వైద్యం అందలేదని ఈఎస్ఐ డిస్పెన్సరీల్లో పనిచేస్తున్న వైద్యులు పేర్కొంటున్నారు. ఈఎస్ఐ స్కామ్‌లో పలువురు అధికారులు, సరఫరాదారులు, కాంట్రాక్టర్లను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే జైలుకు పంపిన విషయం తెలిసిందే. ఇక్కడ కూడా అదే తరహా చర్యలు తప్పవనే చర్చ అధికార వర్గాల్లో జరుగుతోంది. 2017లో ముందు సరఫరా చేసిన వారికి ముందస్తు చెల్లింపులు చేయాలని ఇచ్చిన మెమోను నిలుపుదల చేస్తూ ఇష్టారాజ్యంగా చెల్లింపులు చేసుకోవచ్చంటూ అప్పటి కార్మిక శాఖ మంత్రి పితాని ఇచ్చిన మరో మెమో. అచ్చెన్నకు కొత్త కాదు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లాలో నీరు– చెట్టు పనులనూ తన అనుయాయులకు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారు. నీటి ప్రవాహాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, డిజైన్ లేకుండా చెక్‌డ్యామ్‌లను నిర్మించారు. నీరు చెట్టు నిబంధనలకు విరుద్ధంగా ప్రధాన గట్టు కాలువ పొడవున రక్షణ గోడలు నిర్మించి నిధులు దుర్వినియోగం చేశారు. నాసిరకంగా కాంక్రీటు పనులు చేపట్టారు. కలెక్టర్‌తో నిమిత్తం లేకుండా నోటిఫికేషన్ ఇవ్వకుండానే అచ్చెన్నాయుడు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీని నియమించేవారు. ఈఎస్ఐలో ప్రధాని మోదీ చెప్పినట్టే చేశా: అచ్చెన్నాయుడు ఈఎస్ఐలో నామినేషన్ కింద వర్క్ ఆర్డర్లు ఇచ్చే విషయంలో ప్రధాని మోదీ చెప్పినట్లే చేశామని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. తన హయాంలో ఈఎస్ఐలో జరిగిన కుంభకోణంపై శుక్రవారం ఆయన వివరణ ఇచ్చారు. టెలి హెల్త్ సర్వీసెస్‌కి సంబంధించిన పనులను త్వరితగతిన చేపట్టాలన్న ప్రధాని సూచన మేరకు వ్యవహరించామని, ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు. తొలుత తెలంగాణలో దీన్ని ప్రారంభించారని, అక్కడ మాదిరిగానే ఏపీలోనూ చేయాలని నోట్ పంపానన్నారు. నామినేషన్‌పై ఇవ్వడంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు. కావాలంటే రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. అప్పటి రికార్డులన్నీ తన దగ్గర ఉన్నాయన్నారు. సగటున 132 శాతం అధిక ధరకు కొనుగోలు వైద్య పరికరాలు, ఔషధాలను బేరమాడి తక్కువకు కొనాల్సింది పోయి సగటున 132 శాతం అధికంగా చెల్లించి కొన్నారంటే నాటి మంత్రులు, అధికారులు, కాంట్రాక్టర్ల మధ్య ఎంత భారీ స్థాయిలో లావాదేవీలు నడిచాయో బోధపడుతోంది. 2017–18 మధ్య ఏకంగా 198.66 శాతం అధికంగా చెల్లించారు. ఆ ఏడాది కొన్ని మందుల వాస్తవ విలువ రూ.10.82 కోట్లు కాగా ఏకంగా రూ.32.31 కోట్లు వెచ్చించి కొన్నారు. విజిలెన్స్ నివేదికలో ముఖ్యాంశాలు - రేటు కాంట్రాక్టులో లేని సంస్థలకు రూ.293.51 కోట్ల విలువైన మందులకు రూ.698.36 కోట్లు చెల్లించారు. - టెండర్లు లేకుండా నామినేషన్ కింద ఆర్డర్లు ఇవ్వడంతో రూ.కోట్లలో ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం. - ల్యాబొరేటరీ పరికరాలను ఎలాంటి టెండరు లేకుండా లెజెండ్ అనే సంస్థకు ఇచ్చారు. - శస్త్ర చికిత్స పరికరాలకు టెండర్లు లేకుండా 129.32 శాతం అధిక రేట్లకు తమకు నచ్చిన కంపెనీకి ఇచ్చారు. - ఫర్నీచర్ కొనుగోళ్లకు టెండర్లు లేకుండా రూ.6.62 కోట్లు చెల్లించారు. వాస్తవ ధర కంటే ఇది 70 శాతం అధికం. - ఫ్యాబ్రికేటెడ్ కొటేషన్స్ సృష్టించి రేటు కాంట్రాక్టులో లేని సంస్థలకు ఆర్డర్లు ఇచ్చారు. ఇందులో ఇ.రమేష్‌బాబు, కె.ధనలక్ష్మి తదితరులున్నారు - రాశి ఫార్మా, వీరేష్ ఫార్మా సంస్థలకు కొనుగోలు ఆర్డర్ల కంటే అదనంగా రూ.15.93 కోట్లు చెల్లించారు. - రూ.కోట్లు వెచ్చించి కొన్న వందల పరికరాలను వినియోగించుకోకుండా మూలన పడేశారు. - జెర్సన్ ఎంటర్ప్రైజెస్ అనే బినామీ సంస్థకు ఈఎస్ఐ డైరెక్టర్ డా.సీకే రమేష్‌కుమార్ రూ.9.50 కోట్లు చెల్లించారు. - రూ.16,992 విలువైన బయోమెట్రిక్ యంత్రాలను రూ.70,760 చొప్పున కొనుగోలు చేశారు. అవి ఎక్కడా పనిచేయడం లేదు. -
‘అందుకే ఆ కుంభకోణం బయటపడింది’
సాక్షి, విజయవాడ: ఈఎస్ఐ స్కాంలో తెలంగాణలో దోషులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో.. ఏపీలో కూడా అలాంటి చర్యలే తీసుకోవాలని బీజేపీ జాతీయ మైనార్టీ నేత షేక్ బాజీ డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టే.. ఈఎస్ఐ స్కాం బయటపడిందన్నారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ స్కాం మరుగున పడిపోయేదన్నారు. అచ్చెన్నాయుడు ప్రమేయంతోనే అవినీతి జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయని ఆయన పేర్కొన్నారు.('అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లడం ఖాయం' ) అధిక ధరలకు మందులు,యంత్ర పరికరాలు ఎందుకు కొనుగోలు చేశారో సమాధానం చెప్పాలన్నారు. ఈఎస్ఐ కుంభకోణంలో కూడా చంద్రబాబు పాత్రపై విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబుకు ఈఎస్ఐ స్కాం లో వాటాలు వెళ్లే ఉంటాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈఎస్ఐ కుంభకోణంపై కేంద్ర ప్రభుత్వం కూడా విచారణ చేపట్టాలని బాజీ కోరారు. (ఏపీ ఈఎస్ఐలో భారీ కుంభకోణం)