సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఎవరు తప్పు చేసినా క్షమించేది లేదని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్టు సందర్భంగా శుక్రవారం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. 70 ఏళ్ల వయస్సు.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు ఏసీబీ ఒక ఎమ్మెల్యేను అరెస్టు చేసేటప్పుడు ఎలా వెళ్తారో తెలియదా అని ప్రశ్నించారు. ఈఎస్‌ఐలో రూ.150 కోట్ల స్కాం జరిగిందని, కొనాల్సినవి, కొనకూడనివి అన్ని కొని జేబులు నింపుకున్నారని దుయ్యబట్టారు. (మరో రెండు గంటల్లో బెజవాడకు అచ్చెన్నాయుడు)
ఎవరెవర్ని అరెస్టు చేయకూడదో చంద్రబాబు ఒక లిస్ట్ ఇవ్వాలని, తప్పు చేసిన వారిని విచారించొద్దని చంద్రబాబు రాజ్యాంగంలో ఉందా అని కొడాలి నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పందికొక్కుల్లా చంద్రబాబు, లోకేష్ రాష్ట్రాన్ని దోచుకున్నారని ఎద్దేవా చేశారు. దీంట్లో అచ్చెన్నాయుడికి ఓ అయిదు కోట్లు ఇచ్చి ఉంటారని, మిగతాది పందికొక్కులా లోకేష్ తినేసి ఉంటాడని దుయ్యబట్టారు. అచ్చెన్నాయుడు అప్రువర్‌గా మారి ఈఎస్‌ఐ కుంభకోణం వెనుక ఉన్న వారి పేరు చెబితే తనను వదిలి పందికొక్కులను పట్టుకుంటామని హితవు పలికారు. తమ ప్రభుత్వంలో ఏ అవినీతి జరిగినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సహించరని పునరుద్ఘాటించారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పులను తాము విచారిస్తున్నామని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. (‘భయంతోనే బట్టలు చించుకుంటున్నారు’)
Comments
Please login to add a commentAdd a comment